సీఎంకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సవాల్ | |
* విశ్వాస పరీక్షకు తక్షణం తేదీ నిర్ణయించాలి...* అవిశ్వాస తీర్మానం విషయంలో చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కయ్యారు* వైఎస్ ప్రతిష్టను దిగజార్చజూడటం విజ్ఞత కాదు... * సీఎంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఆయన బొమ్మతోనే గెలిచారు* వైఎస్ వల్లే గెలిచాం, అందుకే జగన్ వెంట... లేదంటే ప్రజలు క్షమించరు: పిల్లి* వైఎస్ చెమటోడ్చి తెచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టాలని యువనేతకు లేదు... మమ్మల్ని రెచ్చగొడితే ఏం జరుగుతుందో చెప్పలేం* వైఎస్ బొమ్మతో గెలిచినవారు రాజీనామాలు చేస్తే మేమూ రాజీనామాలకు సిద్ధం* జగన్‌పై ఆరోపణలతో పోయేది సీఎం ప్రతిష్టే
రాజీనామాలు చేయాలని తమను కోరుతున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే తక్షణం శాసనసభ విశ్వాసాన్ని కోరాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. విశ్వాస పరీక్షకు వెంటనే తేదీ నిర్ణయించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు జి.బాబూరావు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడుతున్న కిరణ్ వ్యవహారశైలిపై వారు నిప్పులు చెరిగారు. తన తండ్రి కష్టపడి అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టాలని గానీ, అస్థిర పర్చాలని గానీ యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏ కోశానా లేదన్నారు. కానీ తమను రెచ్చగొడితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మాత్రం చెప్పజాలమని హెచ్చరించారు.
‘‘మేం వైఎస్ విధేయులం. ఆయన వల్లే, ఆయన ప్రతిష్ట వల్లే, ఆయన సంక్షేమ కార్యక్రమాల వల్లే గెలిచాం. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. ఇంకా చెప్పాలంటే వైఎస్ బొమ్మతోనే గెలిచాం. అందుకే ప్రజా ఉద్యమాల్లో జగన్ వెంట ఉంటున్నాం. ఈ సమయంలో జగన్ వెంట ఉండకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు’’ అని సుభాష్‌చంద్రబోస్ అన్నారు. తామే గాక కిరణ్‌తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా వైఎస్ పేరు చెప్పే, ఆయన బొమ్మతోనే గెలిచారని స్పష్టం చేశారు. వారంతా రాజీనామాలు
చేస్తే తామూ అందుకు సిద్ధమేనన్నారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేద్దామని సవాలు విసిరారు. వైఎస్ పేరు చెప్పకుండా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారేమో చెప్పాలని ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో అథఃపాతాళంలో ఉన్న కాంగ్రెస్‌ను చెమటోడ్చి రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్‌దే. మేమంతా కాంగ్రెస్ హస్తం గుర్తుతో ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా దాని వెనక ఉన్న కృషి మాత్రం వైఎస్‌దే. అందుకే ఆయన అభిమానులుగా జగన్‌ను బలపరుస్తున్నాం’’ అని ఒక ప్రశ్నకు బోస్ బదులిచ్చారు. దేశమంతటా పేరు, ప్రాచుర్యం పొందిన వైఎస్‌కు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అపాయింట్‌మెంట్ తానే ఇప్పించానని కిరణ్ చెప్పుకోవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు.
‘‘ఎమ్మెల్యే, మంత్రిగా, ఎంపీగా పని చేసిన ఓటమి ఎరగని నేత వైఎస్. దేశంలో అందరికీ తెలిసిన ఆయనకు రాష్టప్రతి, ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం మరొకరితో సిఫార్సు చేయించుకునే అగత్యం ఎప్పుడూ ఏర్పడలేదు. ఇక వైఎస్ తననేదో అనైతికమైన పని చేయమంటే తాను చేయలేదన్నట్టు కిరణ్ దుష్ర్పచారం చేస్తున్నారు, ఇదెంతవరకు సబబు?’’ అని ప్రశ్నించారు. ఇలా మాట్లాడటం ఆయనకు విజ్ఞత అనిపించుకోదని హితవు చెప్పారు. ‘‘రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయిన వైఎస్‌కు స్పీకర్ చేసిపెట్టగలిగే అనైతికమైన పని ఏముంటుంది? జీవించి లేని వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం తగునా?’’ అని సూటిగా ప్రశ్నించారు.
జగన్‌ను తానేదో హత్య కేసు నుంచి కాపాడినట్టుగా కిరణ్ చెప్పుకోవడం తగదంటూ చురకలు వేశారు. ‘‘అవాస్తవాలని తెలిసి కూడా విపక్షాలు కొన్నిసార్లు అసెంబ్లీలో అధికార పక్షంపై ఆరోపణలు చేస్తుంటాయి. వాటికి బదులివ్వడం, సభా నాయకుని తరఫున మాట్లాడ్డం చీఫ్ విప్‌గా కిరణ్ ధర్మం. అంతమాత్రాన, ఏదో తానే వాదించి హత్య కేసు నుంచి జగన్‌ను రక్షించినట్టుగా మాట్లాడటం ఏమాత్రం సబబుగా లేదు’’ అన్నారు. ‘‘వైఎస్, ఆయన కుమారుడిపై కిరణ్ వ్యాఖ్యలకు వైఎస్ అభిమానులుగా మేం బాధపడుతున్నాం. రాష్ట్రంలోని లక్షలాది మంది వైఎస్ అభిమానులు కూడా కలత చెందుతున్నారు. జగన్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. కానీ ప్రజా సమస్యలపై పార్టీని వీడి మరీ పోరాడుతున్న ఆయన ప్రతిష్టకు కించిత్ కూడా భంగం కలగదు. అలాంటి ఆరోపణలు చేయడం వల్ల సీఎం ప్రతిష్టే తగ్గుతుందని హితవు చెప్పారు.
తాము సంయమనంతో మౌనం పాటిస్తున్నా సీఎం రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని బాబూరావు తీవ్రంగా ఆగ్రహించారు. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. రెచ్చగొడితే ప్రభుత్వాన్ని కూలుస్తారా అని ప్రశ్నించగా, అనవసరంగా తమను ఎగదోస్తే మాత్రం ప్రభుత్వం ఉంటుందో, కూలుతుందో చెప్పలేమన్నారు. తమను రాజీనామాలు కోరుతున్నారు కనుకనే విశ్వాస పరీక్షకు డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
కిరణ్, బాబు కుమ్మక్కు: బాలినేని
నైతికత గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవిని పిలిపించి ఆయనను అక్కున చేర్చుకోవాలని చూడటం అనైతికం కాదా అని బాలినేని నిలదీశారు. కిరణ్ సీఎం కాగానే కాంగ్రెస్‌లోని 156 మంది ఎమ్మెల్యేలను కాదని చిరంజీవికి ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఇవ్వజూపడం సరైందేనా అని ప్రశ్నించారు. జగన్ సీఎం కావాలంటూ సంతకాలు చేయించడం సరైందేనా అని ప్రశ్నించగా, ఆ వ్యవహారంతో యువనేతకు ఏ మాత్రం సంబంధం లేదని బాలినేని బదులిచ్చారు. ఎవరో కొందరు వ్యక్తిగతంగా అలా సంతకాలు చేయించారని చెప్పారు. అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కయ్యారన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని జగన్ రైతుల కోసం లక్ష్య దీక్ష చేయడానికి ముందు చెప్పిన బాబు ఇప్పుడా ఊసే ఎందుకు ఎత్తడం లేదని సూటిగా ప్రశ్నించారు. బాబు అలా అనలేదని ఒక విలేకరి అనగా, తన వద్ద పత్రికా క్లిప్పింగులున్నాయని బాలినేని బదులిచ్చారు.
వైఎస్ వల్లే మీరు సీఎం, మంత్రులు: మేకపాటి
తాము సోనియా బొమ్మతో ఎన్నికల్లో గెలవలేదని, వైఎస్ శ్రమతోనే గెలిచామని మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. వైఎస్ కష్టపడి పాదయాత్ర చేసి కాంగ్రెస్‌కు వైభవం ప్రసాదించారని, ఇపుడు లేరు గనుక ఆయనపై నిందలు వేయడం తగదని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులంతా వైఎస్ కష్టం కారణంగానే అలా కొనసాగుతున్నారని గుర్తుంచుకుంటే మంచిదన్నారు.
దమ్ముంటే ‘విశ్వాసం’ పెట్టండి
కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శిబిరానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఎదురు దాడి ప్రారంభించారు. నాలుగు రోజులుగా జగన్‌పై, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విష యంలో కిరణ్ చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు (వీరిలో ఇద్దరు మాజీ మంత్రులు) పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసులు రెడ్డి, మేక పాటి చంద్రశేఖర్‌రెడ్డి, బాబురావు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు ధీటుగానే జవాబిచ్చారు. దమ్ముంటే అసెం బ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి మీ బలాన్ని నిరూ పిం చుకోవాలని బహిరంగ సవాలు విసిరారు. తొలుత సాగర్ సొసైటీలోని జగన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశాన్ని చివరి క్షణంలో వీరు అసెంబ్లీ మీడియా పాయింట్‌కు మార్చి సీఎంకు, కాంగ్రెస్ నాయకత్వానికి తమ గళం వినిపించారు.సీఎం హర్ట్ చేశారు: పిల్లి సుభాష్ చంద్రబోస్
నాలుగైదు రోజుల నుంచి చూస్తున్నాం. వైఎస్, జగన్ పై ిసీఎం నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. లక్షలాది మంది వైఎస్ అభిమానులు హర్ట్ అయ్యేలా మాట్లాడుతున్నారు. అందుకోసమే మేము మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. పీవీతో వైఎస్‌కు అపాయింట్ మెంట్ ఇప్పిం చారని, అనైతికమైన దేదో అడిగితే నిరాకరించినట్లు సీఎం చెప్పడం ఎంత వరకు సబబు?. వైఎస్ ఓటమి ఎరుగని నాయకుడు. ప్రజలతో మంచి సంబంధాలున్న నేత. రాజ కీయ అనుభవం ఉన్న వ్యక్తి. జాతీయ నాయకులు కూడా ఆయనకు తెలిసిన వాళ్ళే. అలాంటి నాయకుడు కిరణ్‌ను అనైతికమైంది ఏదో అడిగారనడం, పీవీతో అపాయిం ట్‌మెంట్ అడిగారనడం లో అర్ధం లేదు.
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే చీఫ్ విప్‌గా ఉన్న కిరణ్‌ను స్పీకర్‌గా చేశారు. వైఎస్ లాంటి నేతకు అనైతికమైన పనేముంటుంది?. వైఎస్ లేని సమయంలో ఇలా మాట్లాడటం విజ్ఞత అని పించుకోదా. అసెంబ్లీలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, మేము వైఎస్ పేరు లేకుండా గెలిచామని చెప్పుకోగలుగు తారా? జగన్ కూడా ప్రజా సమస్యలపైనే పోరాడు తున్నారు. ఇలాంటి సమయంలో మేము ఆయన వెంట ఉండకుంటే ప్రజలు మనల్ని క్షమించరు. సీఎం మా రాజీ నామాలు అడుగుతున్నారు. వైఎస్ ఫోటోల వల్ల గెలిచిన వారు తొలుత రాజీనామాలు చేసి ముందుకు రావాలని మేము అడుగుతున్నాం. వైఎస్ ఫోటో, అతని కార్యక్రమాల వల్లే కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా మేమందరం గెలిచా మనడంలో సందేహం లేదు.
రాజీనామా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే మేము కూడా సిద్ధమే. ఒక హత్య కేసులో జగన్‌ను రక్షించానని సిఎం చెప్పడం ఎంత వరకు సబబు. దానిపై సిబిఐ విచారణ కూడా జరిగింది. సాధా రణంగా అసెంబ్లీలో ప్రతిపక్షాలు వివిధ రకాల ఆరోపణలు చేస్తుంటారు. దాన్ని చీఫ్‌విప్‌గా డిఫైన్ చేయాల్సిన బాధ్యత ఆ రోజు కిరణ్‌పై ఉంది. ఇప్పుడు జగన్ పార్టీని వదిలేసి ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ఆయన ప్రతిష్టను దెబ్బ తీయడం సరికాదు. జగన్ రాజీనామా చేసిన రోజే చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం లేదని. మేము కూడా ఆయన్ని ఫాలో అవుతున్నాం. ప్రభుత్వం పడి పోతుందా? లేదా అనేది కాలమే చెబుతుంది. సీఎంను తొలుత విశ్వాస తీర్మానం పెట్టమనండి. అప్పుడు ఏం చేయాలో మేము చూస్తాం.
రెచ్చగొడుతున్నారు: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
మేము సైలెంట్‌గా ఉంటే మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ప్రజలకు తెలుసు. వైఎస్ వల్లే మేము రెండు మార్లు అధికారంలో వచ్చాం. చేతకాని వారు ఏదేదో మాట్లాడుతున్నారు.
సమాధానం అవిశ్వాస తీర్మానమే: బాబురావు
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే ఏం జరుగు తుందో తెలుస్తుంది. అప్పుడు వైఎస్ ప్రాముఖ్యత ఏమిటో తెలిసొస్తుంది. మాకు ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన లేదు. కాని సీఎం రాజీనామాలు అడిగారు. కాబట్టి అన్నిం టికి సమాధానం అవిశ్వాసతీర్మానమే.
సోనియా పిలిచినా వెళ్ళం: బాలినేని శ్రీనివాసులురెడ్డి
ఈ రోజు కొందరు నైతికత గురించి మాట్లాడుతున్నారు. జగన్ రాజీనామా చేయక ముందే పార్టీ అధిష్ఠానం చిరం జీవిని పిలిపించి మాట్లాడటం నైతికతనా? వైఎస్ కూడా ఆ రోజు పార్టీలో కలువాలని పిఆర్పీని అడిగారు తప్ప మంత్రి వర్గంలో చేరాలని ఏనాడు కోరలేదు. వైఎస్ మర ణానంతరం జగన్‌ను సీఎం చేయడానికి పీఆర్పీ మద్దతు కోరిన విషయం గాని, సంతకాలు సేకరించిన విషయం గాని జగన్‌కు తెలియదు. కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రసక్తే లేదు. జగన్ ఆదేశాల ప్రకారమే నడుస్తాం. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు ఎందుకు చేయాలి? మా నాయకుడే వద్దన్నాడు.
మెజారిటీ నిరూపించుకోండి: ఎమ్మెల్సీ, జూపూడి
ఈ లేఖతో సీఎంను ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ముంటే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలి. సీఎం డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు. జగన్‌ను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారు.
సీఎంపై విమర్శిస్తూ 14 పాయింట్లతో జగన్ వర్గం ఎమ్మెల్యేలు తయారు చేసిన లేఖ
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గారు గత మూడు, నాలుగు రోజులుగా ఉద్దేశ్యపూర్వకంగా, కుట్రపూరిత మైన దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తూ, బద్ధ శత్రు వు టీడీపీతో కుమ్మకై్క వైఎస్‌ఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడానికి దురాలోచనలు చేస్తున్నారు.
వైఎస్‌ఆర్ కుటుంబం కాంగ్రెస్‌కి రుణపడి ఉందని.వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి పీవీ నరసింహరావుతో తానే అపాయింట్‌మెంట్ ఇప్పించినట్లుగా... ప్రకటించుకు న్నారు.వైఎస్ మిమ్మల్ని అనైతికమైన పని అడిగినట్లు గా, మీరు దానిని నిరాకరించినట్లుగా మీరు చేసిన విష పూరితమైన ప్రకటన వెనుక మీ ద్రోహచింతన, దుర్భు ద్ది బయటపడింది.2009 ఎన్నికల తరువాత కాంగ్రెస్ లెచిస్లేటర్ పార్టీ ఏకగ్రీవంగా వైఎస్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవ టం రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. జగన్ మోహన్‌రెడ్డిపై ప్రతిపక్షంతో కుమ్మకై్క ఒక హత్య కేసులో ముద్దాయిలుగా చిత్రీకరించి, ఆ హత్య కేసు నుండి బయటపడేయడానికి 60 రోజులు శ్రమిం చి శాసన సభలో ధీటుగా సమాధానం చెప్పినట్లుగా నీచాతినీచమైన ప్రకటన చేసి మీరు అసంబద్ధమైన నాట కీయతను ప్రదర్శించారు.
తొమ్మిది కోట్ల తెలుగు ప్రజల ఆరాధ్యదైవమైన వైఎస్ ఆర్ గారి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి నిబద్ధతతో, విశ్వసనీయతతో, ఆత్మగౌరవంతో రాజకీయాల్లోకి వచ్చారు గనుక మేము ఆయనతో ఉన్నామే గాని, పదవీ వ్యామోహంగానీ, మోసపూరిత రాజకీయాలు గానీ మాకు లేవు.
ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి కనుక ఆయన పట్ల గౌరవంతో ఆయన వెంటవున్నాం.ఈ ప్రభుత్వాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గెలిపించి ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తనకు లేదని జగన్‌గారు పదే పదే చెబుతున్నారు. గను క మేము రాజీనామాలు చేయకుండా మా నాయకుని వెంట అండగా ఉన్నాం. ఆయన దీక్ష, దక్షలతో ప్రజా సమస్యల పట్ల పోరాడుతున్న విదానం మన రాష్ట్ర ప్రజ లందరూ హర్షిస్తున్న విషయం అందరికి తెలుసు. ‘నైతికత’ గురించి మీరు పదే పదే మాట్లాడటం.. దయ్యం వేదం వల్లించినట్లుగా ఉంది.వైఎస్‌ఆర్ మరణం తరువాత 153 మంది శాసన సభ్యులు జగన్ మోహన్‌రెడ్డిని సిఎం కావాలని పదే పదే వారి మనోగతాన్ని వ్యక్తీకరించారు.
మీరు జగన్ గురించి, ఆయన వెనుక ఉన్న శాసన సభ్యుల గురించి గత నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుకుని మమ్మల్ని దమ్ముంటే రాజీనామాలు చేయాలని మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.నీతి, నీజాయితీ, నైతికత అనేవి మీలో ఏ మాత్రం ఉన్నా మీరు శాసన సభలో మీపై విశ్వాస తీర్మానంపెట్టి మీ బలాన్ని నిరూపించుకోవాలని మీకు మేము సవాలు చేస్తున్నాం.
మీకు దమ్ముంటే ఈ ప్రతిపాదనకు మీరు నిలబడండి.
పరారే.. పరారే *
సర్కారుపై రోజూ తీవ్ర విమర్శలు చేసే ‘దేశం’ స్వరం ఎందుకు మారింది?
* అవిశ్వాస తీర్మానం అంటే మాట మార్చి ఎందుకు పారిపోతోంది?
* కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ కుదిరినందుకే!
నిన్న..
రైతు, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న సర్కారు దిగిపోవాలి
నేడు..
కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడే అవిశ్వాస తీర్మానం
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడితే అవిశ్వాసం పెడతాం.. సంఖ్యాబలం లేనందున ప్రభుత్వాన్ని దిగిపొమ్మని కోరబోం’’ అన్నది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు బుధవారం అన్న మాట. అంటే.. ప్రభుత్వ విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సహా నేతలందరూ నిన్నమొన్నటి దాకా చేపట్టిన దీక్షలు, ధర్నాలు అన్నీ నాటకాలేనా? ఒకవేళ ఆ దీక్షలు, ధర్నాలు నిజమైనవే అయితే.. అవిశ్వాసం పెట్టటానికి అభ్యంతరం ఏమిటి? నిన్నటిదాకా ప్రజా వ్యతిరేకంగా నడుస్తున్నట్లు ఆ పార్టీయే ఎండగట్టిన ఇదే సర్కారు.. ఇప్పుడు అకస్మాత్తుగా సజావుగానే పనిచేస్తున్నట్లు కనిపించటానికి కారణం.. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగేనని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటూ ధర్నాలు, దీక్షలు చేపట్టి.. ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ల మీద డిమాండ్లు చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు మైనారిటీలో పడిన రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయానికి వచ్చేసరికి.. మాట దాట వేసి పారిపోతున్నారు. కారణం.. యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనానికి భయపడి అధికార పార్టీ - ప్రతిపక్ష పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవటమేనని తేటతెల్లమవుతోంది.
మరోవైపు.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ధైర్యం టీడీపీకి లేదని తాజాగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సైతం పేర్కొన్నారు. గాలి, బొత్స వ్యాఖ్యలపై బీజేపీ నేత ఒకరు స్పందిస్తూ.. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి తాము గత వారం రోజులుగా చెప్తున్న విషయం నిజమని తేలిందని పేర్కొన్నారు. ‘మైనారిటీలో పడిన ప్రభుత్వాన్ని దిగిపోవాల్సిందిగా కోరలేమని ప్రతిపక్షం అంటే.. టీడీపీ, కాంగ్రెస్‌లు అవగాహనకు వచ్చాయన్న అర్థమే వస్తుంది కదా’ అని ఆయన వ్యాఖ్యానించారు. లేదంటే.. ప్రభుత్వం మైనారిటీలో పడినపుడు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న కనీస బాధ్యతను ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. నిత్యం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేస్తున్నారు? వారి పార్టీ పరిస్థితి ఏమిటి? అని పార్టీ నేతలతో వాకబు చేసే చంద్రబాబు.. తాను ప్రతిపక్ష నేతనన్న విషయం మరచిపోయినట్లున్నారని ఆ నాయకుడు ఎద్దేవా చేశారు.
పరోక్షంగా కాంగ్రెస్‌కే లాభం...
ఇదిలావుంటే.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అంశం గురించి పార్టీలో మాట్లాడటానికి కూడా టీడీపీ నేతలు జంకుతున్నారు. ఏం మాట్లాడితే అధినేత నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలియక నోరు విప్పటానికి భయపడుతున్నారు. అవిశ్వాస తీర్మానం విషయంలో తమ పార్టీలో సందిగ్ధ పరిస్థితి ఉన్న మాట వాస్తవమేనని ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ నాయకుడొకరు అంగీరించారు. అవతలి పక్షం సవాళ్లు విసురుతున్నా స్పందించకపోవటం వల్ల కాంగ్రెస్, టీడీపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయన్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లు అవుతోందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.
పార్టీకి కేవలం 46 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్నప్పటికీ 2008లో గొప్పలకు పోయి వైఎస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భాన్ని గుర్తుచేస్తూ.. ప్రభుత్వం మైనారిటీలో పడిందని స్పష్టంగా తెలిసినా నిర్ణయం తీసుకోలేకపోతున్నామని ఆ నేత నిర్వేదం వ్యక్తం చేశారు. ఇలాంటి వైఖరుల వల్ల కింది స్థాయిలో పార్టీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీసిన వారమవుతున్నామన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయన్న అభిప్రాయం కనుక జనంలోకి వెళితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట టీడీపీ బలహీనపడుతుందని.. కాంగ్రెస్‌కు పరోక్షంగా లాభం చేకూర్చిన వారం అవుతామని కూడా పార్టీలో చర్చ సాగుతోంది. జనమంతా అటుకాదా ?
రాష్ట్రంలో జగన్ ప్రభంజనం చివరకు చప్పున చల్లారు తుందా? ఆయన చిరంజీవికి ఎక్కువ, చంద్రబాబుకు తక్కువగా మారతారా? ‘సూర్య’ సర్వేలో పాఠకుల స్పం దన పరిశీలిస్తే ఈ అనుమానాలకు నిజమనే సమాధానమే వచ్చింది. జగన్ ప్రభంజనం అంతా కేవలం కాంగ్రెస్‌ను చావుదెబ్బ తీయడానికి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను సర్వనా శనం చేయడానికే పరిమితం అవుతారన్న వాస్తవం వెల్లడయింది. అయినప్పటికీ.. జగన్ బలాన్ని తక్కువగా అంచనా వేయలేమని, ఆయన పార్టీ సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీతో పోటీపడుతుందని, ఇమేజ్ విష యంలో జగన్, బాబుతో పోటీ పడుతున్నారన్న విష యం కూడా స్పష్టమయింది.‘సూర్య’ నిర్వహించిన సర్వేలో జగన్ పార్టీ వల్ల కాంగ్రెస్ దెబ్బతింటుందని 71 వేల మంది పాఠ కులు అభిప్రాయపడగా, టీడీపీ నష్టపోతుందని 18 వేల మంది, టీఆర్‌ఎస్ నష్టపోతుందని 16వేల మంది పాఠకులు అభిప్రాయపడటం గమనార్హం. దీనితో కాంగ్రెస్ పతనాన్ని జగన్ శాసించబోతున్నారని తేలిపోయింది.
అదేవిధంగా ఇమేజ్ విషయంలో కూడా జగన్ కాంగ్రెస్ నేతలను వెనక్కినెట్టి, బాబుతో పోటీ పడుతున్నట్లు స్పష్టమ యింది. జనాకర్షణ, ఇమేజ్ విషయంలో జగన్ రెండవ వరసలో ఉన్నారు. ఈ విషయంలో చంద్రబాబునాయుడు వైపు 47 వేల మంది పాఠకులు మొగ్గు చూపగా, జగన్‌ను 24 వేల మంది పాఠకులు సమర్థించారు. అంటే.. సీమాంధ్రలో జగన్ రెండ వ శక్తిగా ఆవిర్భవించబోతు న్నట్లు స్పష్టమవుతోంది. ‘సూర్య’ సర్వేను విశ్లేషిస్తే.. జగన్ కేవలం కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం నుంచి గెంటివేసేందుకు మాత్రమే పనికివస్తారు తప్ప, సొంతంగా అధికారపీఠం ఎక్కేంత స్థాయి లేదని తేలిపో యింది.
జగన్ ఓదార్పు యాత్రల హడావిడి వల్ల కాంగ్రెస్ లో మాత్రమే చీలికలు వచ్చి, ఆ పార్టీ క్యాడర్‌లో గందర గోళం పెరిగి అది జగన్‌కు లాభిస్తుందని అర్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కిందిస్థాయి క్యాడర్ కూడా కొంతమంది జగన్ వైపే అవకాశం ఉందని సర్వే చెబు తోంది. ఈ విషయంలో టీడీపీ నాయకత్వం ఎంత ధీమాతో ఉన్నప్పటికీ, కిందిస్థాయి నాయకులు, పార్టీలో అవకాశాలు ఉండవని నిర్థారించుకునే ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం కచ్చితంగా జగన్ గడప తొక్కుతారని కనిపిస్తూనే ఉంది.
కానీ.. జగన్ హడావిడి మీడియా హైప్ తప్ప మరొకటి కాదన్న అభిప్రాయం జనంలో ఉన్నట్లు సర్వే ద్వారా స్పష్ట మవుతోంది. చానళ్లలో స్లాట్లు కొనుగోలు ద్వారా మీడి యాలో జగన్‌కు జనాదరణ ఉందని చూపించడం, కాంగ్రెస్- టీడీపీకి చెందిన ద్వితీయశ్రేణి నేతలను కొనుగోలు చేస్తున్నారన్న భావన సామాన్య జనంలో నెల కొంది. పైగా, జగన్ వెంట దాదాపు అన్ని గ్రామాల్లోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కనిపిస్తుండటంతో, ఆయన వెంట కేవలం రెడ్లు తప్ప, మిగిలిన కులాలకు చెందిన వారు ఉండరన్న భావన బలపడుతోంది. అదీకా కుండా, జగన్ పార్టీలో చే రాలంటూ గ్రామాల్లో ఆయన వర్గీయులు ఇతరులను భయభ్రాంతులను చేయటం, పనిలేకుండా తిరిగే యువకులే ఎక్కువగా ఉండటం కూడా ఆయనపై ఇప్పటినుంచే వ్యతిరేకత పెరుగుతోంది.
దానికితోడు, జగన్ అక్రమ సంపాదనపై యువకులు, విద్యాధికులు, మహిళలు వ్యతిరేకతతో ఉన్నట్లు కనిపి స్తోంది. టాటా, బిర్లా, అంబానీల వంటి పారిశ్రామికవేత్త లు ఈ స్థాయికి చేరేందుకు కొన్ని దశాబ్దాలుకష్టపడితే.. జగన్‌కు మాత్రం కేవలం ఐదేళ్లే పట్టడం వెనుక అవినీతి, అక్రమ సంపాదనే కారణమన్న అభిప్రాయం వారిలో నెల కొంది. సీఎం కాకపోతేనే జగన్ లక్ష కోట్లు సంపాదిస్తే, ఇక సీఎం అయితే రాష్ట్రాన్ని ఇంకా ఏ స్ధాయిలో దోచు కుంటారోనన్న భావన వారిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదేవిధంగా జగన్‌కు అర్బన్ ప్రాంతంలో పెద్దగా పట్టు లేదని, విద్యావంతులు, ఉద్యోగులు ఆయనను అంగీక రించడం లేదని సర్వేలో స్పందించిన వారి వివరాలు తెలియచేస్తున్నాయి.
ఇక జగన్.. చిరంజీవి కంటే అతి పెద్ద శక్తిగా అవతరిం చనున్నారని సర్వేలో తేలింది. గతంలో చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత జగన్ సభల కంటే జనం ఎక్కువగా వచ్చా రు. కానీ ప్రణాళిక, వ్యూహరచన, ఎత్తుగడ లేకపోవడం తో పీఆర్పీ బొక్కబోర్లా పడి.. అధికారంలోకి వస్తుందన్న ప్రజారాజ్యం కేవలం 18 సీట్లకే పరిమితమయింది. ఇప్పుడు జగన్ అంతకంటే పెద్ద శక్తిగా మారనున్నారు. జగన్‌కు అంగ-అర్ధబలం ఉన్న నేతలు, కాంగ్రెస్‌కు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, డబ్బు విరజిమ్మే స్తొమత ఉండటంతో ప్రజారాజ్యం కంటే జగన్ పార్టీ పెద్ద శక్తిగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సబ్బంపై జగన్ సీరియస్కాంగ్రెస్-జగన్ మధ్య సయోధ్య ప్రయత్నాలు జరుగు తుంటే ఆ విషయం తెలిసిన మఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సయోధ్య వాతావరణాన్ని చెడగొడుతున్నారని జగన్ వర్గీ యుడిగా ముద్ర పడిన అనకాపల్లి కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి చేసిన వ్యాఖ్యలపై జగన్ వర్గం మండిపడుతోంది. సబ్బం హరి తన అపరిపక్వత రాజకీయ చర్యతో చివరకు జగన్ పరువు తీశారంటున్నారు. స్వయంగా జగన్ కూడా సబ్బం చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను మంటకలిపేలా ఉన్నాయని తన సహచరుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలను దెబ్బతీసిన కాంగ్రెస్‌ను భ్రష్ఠు పట్టించాలన్న కసితో సొంత పార్టీ పెట్టేందుకు పరుగులు పెడుతున్న జగన్‌ను నైతికంగా దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరిపై జగన్ వర్గీయులు విరుచుకుపడుతున్నారు. మాట మార్చడం, మడమ తిప్పడం తన తండ్రి తనకు నేర్పలేదని ఒకవైపు జగన్ ఖండితంగా చెబుతున్నారు. ఆయన అను చరుడిగా ముద్రపడిన సబ్బం మాత్రం కాంగ్రెస్ - జగన్ మధ్య సయోధ్య ప్రయత్నాలు ప్రారంభమవుతే, సీఎం కిరణ్ దానిని చెడగొడుతున్నారంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలు జగన్ పరువును మంటగలిపేలా ఉన్నాయని జగన్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సబ్బంవ్యాఖ్యల వల్ల.. జగన్ పైకి కాంగ్రెస్‌తో పోరాడుతూనే, దొడ్డిదారిలో తిరిగి అదే పార్టీతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారన్న భావన కల్పించారని జగన్ వ ర్గీయులు మండిపడుతున్నారు. దీనివల్ల ఇప్పటివరకూ ప్రజల్లో జగన్‌పై ఉన్న హీరోవర్షిప్ పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువతలో ఒకరకమైన వ్యతిరేకభావన కల్పించారంటున్నారు. మడమ తిప్పని వీరుడిగా, సోనియాగాంధీనే ఎదిరించి పార్టీ నుంచి బయటకు వచ్చిన ధీరుడిగా సంపాదించుకున్న ఇమేజ్ అంతా సబ్బం హరి వ్యాఖ్యలతో కొట్టుకుపోయి, చివరకు జగన్ కూడా పదవులు-ఉనికి చాటుకునేందుకేందుకు ప్రయత్నించే ఒక సాధారణ రాజకీయ నాయకుడి మాదిరిగానే ముద్రపడటాన్ని ఆయన అనుచరులు సహించలేకపోతున్నారు. అసలు జగన్-కాంగ్రెస్ మధ్య సయోధ్య జరుగుతోందని సబ్బం హరికి ఎవరు చెప్పారని జగన్ అనుచరులు ప్రశ్నిస్తున్నారు. చివరకు.. జగన్ కూడా సబ్బం చేసిన వ్యాఖ్యలపై తన అనుచరుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్‌ను అంతం చేసేందుకు తాను అన్నింటికీ తెగించి పార్టీ స్థాపించే యత్నాల్లో ఉంటే, తన మద్దతుదారుడయిన సబ్బం హరి మాత్రం అందుకు విరుద్ధంగా తనకు-కాంగ్రెస్‌కు మధ్య సయోధ్య ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం వల్ల తన ఇమేజ్ దెబ్బతిందని జగన్ కూడా అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. హరి వ్యవహారశైలి ఇప్పటివరకూ తాను సంపాదించుకున్న కీర్తి-ప్రతిష్ఠను మంటగలిపాయని మండిపడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు భయపడుతున్నందువల్లే తాను ఆ పార్టీ నాయకత్వంతో సయోధ్య కుదుర్చునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం, భావన క్షేత్రస్థాయిలో విస్తృతమవుతే ఇక తాను పార్టీ పెట్టినా ఫలితం ఉండదని జగన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనివల్ల ప్రజలు తనను వీరుడిగా కాకుండా పిరికివాడుగా భావించే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా ఆయనలో లేకపోలేదు. ఈ కారణాల వల్లే సబ్బం తీరుపై జగన్ కలత చెందుతున్నారు. జగన్ అనుచ రులయితే సబ్బం తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రణబ్-ఆంటోనీ వంటి సీనియర్లతో చర్చలు జరిపేంత స్థాయి సబ్బం హరికి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మీడియాను ఆకర్షించి, కాంగ్రెస్‌లో తన ప్రాధాన్యం పెంచుకునే ఎత్తుగడ తప్ప సబ్బం హరికి ఢిల్లీలో అంత సీన్ లేదంటున్నారు. అసలు సబ్బం.. జగన్ పెట్టే పార్టీలో చేరతారా లేదా అన్నది కూడా సందేహమేనంటున్నారు. జగన్ విశాఖ ఓదార్పు యాత్రకు ముందు జగన్ పార్టీ పెట్టిన తర్వాత తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు జగన్ పార్టీ పెట్టిన తర్వాత, ఆ విధానాలు తనకు నచ్చితేనే పార్టీలో చేరతానని మాట మార్చడాన్ని జగన్ వర్గీయులు గుర్తు చేస్తున్నారు. చివరకు అసలు సబ్బం హరి జగన్ పార్టీలో చేరకుండా కాంగ్రెస్‌లోనే ఉండిపోయినా ఆశ్చర్యపడవలసిన పనిలేదని విశాఖ జిల్లా నేతలు జోస్యం చెబుతున్నారు. కాగా, జగన్-కాంగ్రెస్ మధ్య సయోధ్య యత్నాలపై వ్యాఖ్యానించిన సబ్బం హరిపై మంత్రి బాలరాజు విశాఖ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్, తైనాల విజయకుమార్, విజయప్రసాద్ విరుచుకుపడ్డారు. సబ్బం హరి స్థాయి ఏమిటని ప్రశ్నించారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే స్థాయి హరికి లేదన్నారు. ‘వారి వద్దకు వెళ్లడానికి ఈయన స్థాయేమిటి? జాతీయ స్థాయి నేతగా ఊహించుకుని, ప్రచారం చేసుకుంటున్నాడు. ఒక వేళ వెళ్లినా వారి గుమ్మం కూడా ఎక్కే పరిస్థితి కూడా ఉండదు. నీతి నియమాలు వదిలి అవకాశ రాజకీయాలు చేస్తున్నాడు. రాజీనామా చేసి ఏ ఇతర పార్టీ నుంచయినా పోటీ చేసి గెలవాల’ని సవాల్ చేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ సోనియా, కిరణ్, కాంగ్రెస్‌ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే విజయకుమార్ మరో అడుగు ముందుకేసి ‘సబ్బం హరి కాంగ్రెస్‌లో కాకుండా మరే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ గుర్తు లేకుండా పోటీ చేసి గెలిస్తే గుండు చేసుకుని ఏడాదిపాటు తిరుగుతా’నని సవాల్ చేశారు. రాజీ వార్తలు అవాస్తవం |
అనకాపల్లి ఎంపీ సబ్బం హరి స్పష్టీకరణ |
* కాంగ్రెస్‌తో జగన్ రాజీ ప్రసక్తేలేదు
* ఓదార్పును చులకన చేసినప్పుడే
* ఆ పార్టీని మర్చిపోయారు
* త్వరలోనే కొత్తపార్టీ ఆవిర్భావం
* వైఎస్ సంక్షేమ పథకాల అమలే లక్ష్యం
యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం రాయబారం నడుపుతోందని తాను అన్నట్టుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి స్పష్టంచేశారు. కాంగ్రెస్ అధిష్టానం జగన్‌తో రాజీకి ప్రయత్నిస్తుందన్న చర్చను గాని, ఆ ఊహను గాని జగన్‌తోపాటు ఆయన అనుచరులెవ్వరూ భరించే స్థితిలో లేరనే తాను చెప్పినట్లు బుధవారం వివరించారు. తన వ్యాఖ్యలను గోరంతలు కొండంతలు చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలను జగన్‌కు ఇబ్బంది కలిగించేలా ఆపాదించడం, లేనిపోనివి ప్రచారం చేయడం మంచిది కాదని హితవు పలికారు. తన తండ్రి కోసం చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలన్న మంచి ఉద్దేశంతో చేపట్టిన ఓదార్పుయాత్రను చులకన చేసినప్పుడే జగన్ కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోయారని ఆయన చెప్పారు.
త్వరలోనే పార్టీ
కాంగ్రెస్ పార్టీ నడవడిక నచ్చక, ఆ పార్టీలో ఉండలేక తెగతెంపులు చేసుకుని జగన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారని సబ్బం చెప్పారు. అనంతరం అకుంఠిత దీక్షతో రాష్ట్రంలో గ్రామగ్రామాన రాత్రింబవళ్లు తిరుగుతున్నారని తెలిపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మళ్లీ అమలు చేయడం కోసం త్వరలోనే పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించారని చెప్పారు. పార్టీ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లలో ఉన్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం జగన్‌తో రాయబారం నడుపుతోందని, ఆయన పదవి కోసం రాజీ పడుతున్నారని ఊహాగానాలు రావడం శోచనీయమన్నారు.
జగన్‌ను ఎదుర్కొనే సత్తాలేని సీఎంకు టీడీపీ, ఓ పత్రికాధిపతి మిత్రపక్షంగా కనిపిస్తున్నారని, అందరూ ఏకమై ఓ స్టోరీ కింద ప్లాన్ చేశారని విమర్శించారు. అసెంబ్లీలో అవిశ్వాసం పెట్టలేక, ఎన్నికలకు వెళ్లలేక ఇలాంటి దుష్ర్పచారాలకు దిగడం శోచనీయమని దుయ్యబట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని దివంగతనేత వైఎస్ స్పీకరుగా నియమించినప్పుడు ప్రతిపక్షనాయకుడిగా ఉన్న చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందేనన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సీఎంతో పాటు ప్రతిపక్షనేత కూడా వెళ్లి స్పీకర్‌ను ఆయన సీట్లో కూర్చోబెట్టడం సాంప్రదాయంగా వస్తోంద ని, కానీ చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించారని గుర్తుచేశారు.
మార్చిలో జగన్ పార్టీ!
ఎన్నికల సంఘం ఆమోదంలో జాప్యమే కారణం
వైఎస్ జగన్ రాజకీయ పార్టీ స్థాపన మరికొంత కాలం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి వచ్చే నెల రెండో వారం తర్వాత జగన్ తన కొత్త పార్టీని ప్రకటిస్తారని భావించారు. ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ, రాజన్న రాజ్యం అనే పేర్లతో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్ తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి దరఖాస్తులు అందించారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జగన్ పేరిట నమోదైన దరఖాస్తులపై ఈసీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నదని జగన్ వర్గం ఎమ్మెల్యేలు చెబుతున్నారు.
అందువల్ల.. మార్చి మొదటి వారంలో సీఈసీ ఆమోదం తెలిపే అవకాశం ఉందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వివరించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మార్చిలో జగన్ పార్టీని స్థాపిస్తారన్నారు. కాగా, వైఎస్ఆర్ పార్టీ, రాజన్న రాజ్యం పేర్లలో వైఎస్ఆర్ పార్టీ పేరుకే ప్రాధాన్యం ఇస్తున్నామని, ఎన్నికల సంఘం దేనిని ఆమోదిస్తుందో చూడాలని మరో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
అందువల్ల.. మార్చి మొదటి వారంలో సీఈసీ ఆమోదం తెలిపే అవకాశం ఉందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వివరించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మార్చిలో జగన్ పార్టీని స్థాపిస్తారన్నారు. కాగా, వైఎస్ఆర్ పార్టీ, రాజన్న రాజ్యం పేర్లలో వైఎస్ఆర్ పార్టీ పేరుకే ప్రాధాన్యం ఇస్తున్నామని, ఎన్నికల సంఘం దేనిని ఆమోదిస్తుందో చూడాలని మరో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
No comments:
Post a Comment