Tuesday, May 31, 2011

రైతు కన్నీరే మరణశాసనం .... * టీడీపీ, కాంగ్రెస్‌లకు వైఎస్ జగన్ హెచ్చరిక

సువర్ణ యుగంలో ప్రతి ఒక్కరికీ వైఎస్ ఉన్నారన్న భరోసా ఉండేది
వైఎస్ మరణించి రెండేళ్లవుతున్నా ప్రజలకు భరోసా ఇచ్చే నేతలే
కరువయ్యారు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను విస్మరించి పేదల నడ్డి విరుస్తోంది
నాడు చంద్రబాబు 46 మంది
ఎమ్మెల్యేలతో వైఎస్ సువర్ణయుగంపై అవిశ్వాసం పెట్టారు
ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలున్నా.. అవిశ్వాసం ెపెట్టనంటున్నారేం?
ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు కాబట్టి..
బాబూ... నిజంగా ప్రజలపై
ప్రేమే ఉంటే అవిశ్వాసం నోటీసివ్వు..
ఇచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చెయ్!

  రైతులు, పేదల సమస్యలు కనీసం పట్టించుకోని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు.. ఆ రైతులు, పేదల కన్నీటి బొట్టే మరణ శాసనం రాస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ‘ఇవాళ రాష్ట్రాన్ని చూస్తే అధ్వాన్న పరిస్థితిలో ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదవాడి నడ్డి విరిచేస్తోంది. ప్రతిపక్షమైనా మనవైపు నిలబడి పోరాడుతుందేమోనని అటువైపు ఆశగా కన్నెత్తి చూస్తే.. ఇవాళ మన ఖర్మకొద్దీ ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పైకేమో ఇది చేతగాని ప్రభుత్వమనీ, అసమర్థ ప్రభుత్వమనీ తిడుతుం టారు. పేద వాళ్లకు మేలు చేయని ఈ అసమర్థ ప్రభుత్వం ఎందుకు ఉంచుతున్నావు..? అవిశ్వాసం పెట్టవయ్యా చంద్రబాబు నాయుడూ అంటే.. పెట్టను గాక పెట్టను అంటున్నారు.

ఒక్కటి చెప్తున్నా ఇవాళ... పేదవాడి కళ్లనుంచి వచ్చే ప్రతి కన్నీటి బొట్టు కాం గ్రెస్, టీడీపీలకు మరణ శాసనం రాస్తుంది’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లాలో మలివిడత 7 రోజుల ఓదార్పు యాత్ర సోమవారం విజయనగరం పట్టణంలో ముగి సింది. ఏడో రోజు యాత్ర ఉదయం కొమరాడ, పార్వతీపురం, బొబ్బిలి మండలాల్లోని గ్రామాల మీదుగా రాత్రి 9 గంటలకు జగన్ విజయనగరం చేరుకున్నారు. పట్టణంలోని కోట జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ముగింపు సభకు జనం అంచనాలకు మించితరలివచ్చారు. అటు సింహాచలం మేడ నుంచి శంకరమఠం వరకు ఇటు మూడు లాంతర్ల జంక్షన్ నుంచి సత్యా లాడ్జి వరకు రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ముగింపు సభకు భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్‌మాట్లాడారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

అప్పుడెందుకు అవిశ్వాసం పెట్టావ్..

అయ్యా చంద్రబాబూ.. దివంగత మహానేత సువర్ణ పాలన సాగుతున్న రోజుల్లో కేవలం 46 మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాసం పెట్టావు. ఆయన్ను గద్దె దింపాలని ప్రయత్నించావు. ఇవాళ మీకు 90 మంది శాసన సభ్యుల బలం ఉం ది... ఇవాళ ప్రతి రైతు సోదరుడు, ప్రతి పేదవాడు ఈ ప్రభుత్వం కూలిపోవాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఇది చేతగాని ప్రభుత్వం అని మొసలి కన్నీళ్లు కార్చే బదులు అవిశ్వాసం పెట్టమని అడిగితే పెట్టవేం చంద్రబాబూ?.. ఎందుకు పెట్టవంటే నువ్వు ఆ అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యావు కాబట్టి.

ఈ డిమాండ్లు నెరవేర్చమని అడగండి..: చంద్రబాబు నాయుడూ నిజంగా నీకు ప్రజలపై ప్రేమే ఉంటే.. అవిశ్వాసం పెడతానని ప్రభుత్వాన్ని బెదిరించి ప్రజా సమస్యలు పరిష్కరించు. రైతులకు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. మద్దతు ధర రావాలంటే కనీసం రూ.,2000 కోట్లు అవసరం. మీరు ప్రభుత్వానికి వారంరోజుల గడువిచ్చి రైతాంగానికి కావలసిన రూ.2,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయండి. లేదం టే అవిశ్వాసం పెడతానని హెచ్చరించండి. ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ప్రతి పేద కుటుం బంలో కనీసం ఒక్కరైనా ఉన్నత విద్య చదివి, డాక్టరో.. ఇంజనీరో.. అయితే ఆ కుటుంబంలో పేదరికం పోతుందని వైఎస్సార్ పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకంపెడితే.. ఈ చేతగాని ప్రభుత్వం మూలంగా పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే అధ్వాన్న పరిస్థితి వచ్చింది.. ఆ పథకానికి బకాయిలతో కలిపి రూ.6,800 కోట్లు అవసరం పడుతుండగా ఈ చేతగాని ప్రభుత్వం కేవలం రూ.3,000 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులెత్తేసింది.

మొత్తం 6,800 కోట్లు ఇవ్వకపోతే అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబూ? ప్రతి అక్కా, చెల్లెమ్మల మొఖాల్లో చిరునవ్వులు చూడ్డానికి వైఎస్ ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకానికి బకాయిలతో కలిసి రూ. రెండు వేల కోట్లు కావాల్సి ఉంటే ప్రభుత్వం కేవలం రూ.400 కోట్లు ఇచ్చింది. ఇవాళ నేనడుగుతున్నా.. ఇదే చంద్రబాబు నాయుడు ఇదే సీఎంకు వారం రోజుల గడువిచ్చి ఇంకో రూ.1,600 కోట్లు ఇవ్వకపోతే మీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానని ఎందుకు చెప్పలేకపోతున్నారు? పైకి ఇది చేతగాని ప్రభుత ్వం అం టూ రోడ్లమీదకు వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తారు, లోపల కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కై ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టనుగాక పెట్టను అంటారు.

అప్పుడు భరోసా ఉండేది: ‘వైఎస్సార్ సువర్ణ పాలనలో రైతుల ధ్యాసంతా కూడా వ్యవసాయం చేయడంపైనే ఉండేది. ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది ఇంకా మెరుగైన స్థాయిలో ధాన్యం ఎలా పండించాలని ఆలోచించేవారు. ఇవాళ ధాన్యం అమ్ముడుపోతుందా లేదా అని భయపడని రోజులు లేవు. వైఎస్ హయాంలో మద్దతు ధరకంటే రూ.200 ఎక్కువకే అమ్ముడుపోయిన రోజులు చూశాం. ఏ సమస్య వచ్చినా వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా.. అన్నీ ఆయనే చూసుకుంటాడన్న భరోసా ప్రతి రైతుకూ ఉండేది. ఇప్పుడు కనీస మద్దతు ధర కంటే రూ.200 తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వైఎస్సార్ సువర్ణ పాలనలో ప్రతి పేదవాడికీ కూడా.. ఇవాళ కాకపోతే రేపు నాకు ఓ పక్కా ఇల్లు కచ్చితంగా వస్తుందన్న భరోసా ఉండేది. ప్రతి అవ్వా ప్రతి తాతా కూడా వయసు పెరిగే కొద్దీ.. అయ్యో నేను ఎలా బతకాలీ అనే ఆలోచన నుంచి.. ఒక సంవత్సరం పెరిగితే ఏముందిలే.. అన్నీ చూసుకోడానికి మా ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్నాడన్న భరోసా ఉండేది.. ప్రతి తల్లీ అనుకునేదీ నా కొడుకు.. నా కూతురు మరో నాలుగేళ్ల తరువాత డాక్టరో.. ఇంజనీరో.. అవుతారు, ముసలి వయసులో మమ్ములను ఆదుకుంటారని. కారణం ఏమంటే వైఎస్ సీఎం స్థానంలో ఉన్నారనే భరోసా ఉండేది. విద్యార్థులకు తాను చదువు కచ్చితంగా పూర్తి చేయగలనన్న నమ్మకం ఉండేది. ఎవరికైనా ప్రమాదం జరిగితే 108 నంబర్‌కు ఫోన్ చేస్తే క్షణాల్లో అంబులెన్స్ వచ్చి మమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించి బతికిస్తుందన్న భరోసా ఉండేది.

ఇప్పుడేదీ ఆ భరోసా?: జనహృదయనేత వైఎస్ మరణించి రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు పేదలకు, రైతులకు మేమున్నామని భరోసా ఇచ్చే నేతలే కరువయ్యారు. పేదలు, రైతు సోదరుల సమస్యలను ఈ సర్కారు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా, ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు గారు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా, దేవుడు అనే వాడు ఉన్నాడు. పై నుంచి అన్నీ చూస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షం, పాలక పక్షం నాయకులకు డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు ఇంటికి సాగనంపుతారు. రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలుపుతారు.’

Monday, May 30, 2011

ఆత్మబంధువుల కోసం అడవి దారిలో....

 
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో సాగిన జగన్ ఓదార్పు యాత్ర
దట్టమైన అడవులు, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల గుండా కదిలిన కాన్వాయ్
డప్పులు, సంప్రదాయ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికిన గిరిపుత్రులు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఓదార్పు యాత్ర
దట్టమైన అడవులు, మావోయిస్టు ప్రాబల్య
ప్రాంతాల్లో వైఎస్ జగన్ కాన్వాయ్
సంప్రదాయ నృత్యాలతో గిరిపుత్రుల ఆత్మీయ స్వాగతం
ఏజెన్సీ ప్రాంతాల్లో యాత్ర వద్దని జగన్‌మోహన్‌రెడ్డికి
లేఖ రాసిన విజయనగరం ఎస్పీ
జ్వరంతో బాధపడుతున్నందున యాత్ర వాయిదా
వేసుకోవాలన్న డాక్టర్లు... అయినా తన వారిని
కలవాల్సిందేనంటూ ముందుకు సాగిన జననేత



‘‘సార్.. కాకితాడ, ఉదయపురం పల్లెలు ఒడిశా సరిహద్దులో ఉన్నాయి. అవి మావోయిస్టులకు బాగా పట్టున్న గ్రామాలు. నక్సల్స్ కదలికలు ఉన్నట్లు మాకు సమాచారం అందింది. మేం రక్షణ కల్పించలేం. దయచేసి వెళ్లొద్దు. ఓదార్పు యాత్ర షెడ్యూల్ మార్చుకోండి..!’’
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజయనగరం జిల్లా ఎస్పీ నవీన్ గులాటి లేఖ.
‘‘మీరు తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. కనీసం రెండు రోజులైనా విశ్రాంతి తీసుకోండి..’’
- ఆదివారం ఉదయం జగన్‌కు వైద్యుల సూచన.

..అటు ఎస్పీ హెచ్చరికలు.. ఇటు వైద్యుల సూచనలేవీ జననేతను ఆపలేకపోయాయి. ఎలాగైనా సరే ఆత్మబంధువులను అక్కున చేర్చుకోవాలన్న తలంపుతో అడుగు ముందుకేశారు. దట్టమైన అడవులు, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం గుండా సాగిపోయారు. విజయనగరంలో ఆరో రోజు ఓదార్పు యాత్ర ఆసాంతం ఏజెన్సీ గ్రామాల మీదుగా సాగింది. ఆదివారం పార్వతీపురం మండలం ఖడ్గవలస నుంచి యాత్ర ప్రారంభమైంది.. అక్కడ్నుంచి జగన్ పెదమేరంగి జంక్షన్, పెదమేరంగి మీదుగా కురుపాం చేరుకున్నారు. కురుపాం మండల కేంద్రంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కురుపాం ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ్నుంచి దట్టమైన అడవి ప్రారంభమైంది. కురుపాంలో ప్రసంగం ముగించగానే యాత్ర దట్టమైన అడవి వైపు కదిలింది. దీంతో పోలీసుల్లో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. బొబ్బిలి డీఎస్పీ త్రినాథ్, పార్వీతీపురం డీఎస్పీ ఎల్వీ శ్రీనివాసరావు.. జగన్‌మోహన్‌రెడ్డిని అనుసరించారు.

గిరిజన పల్లెల్లో ఆత్మీయ స్వాగతం..


దట్టమైన అడవిలో జగన్‌మోహన్‌రెడ్డికి మొదట తెమఖర గ్రామ గిరిజనులు స్వాగతం పలికారు. తమ సంప్రదాయం ప్రకారం.. నీలం రంగు కండువా కప్పి, కళ్లు కడిగి దిష్టి తీశారు. కుంకుమతో బొట్టు పెట్టి ఆశీర్వదించారు. అక్కడ్నుంచి మరింత దట్టమైన అడవి మొదలైంది. టిక్కబాయి గ్రామస్థులను పలకరించి జగన్ ముందుకు కదిలారు. కిలోమీటరు దూరం వెళ్లగానే.. జగన్ తన వాహనాన్ని ఆపారు. ఏం జరిగిందోనని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన మాత్రం ఇవేవీ గమనించకుండా.. రోడ్డు పక్కనే ఉన్న మర్రిచెట్టు నీడ కింద నిలబడి తన కోసం ఎదురు చూస్తున్న నూకలమ్మ(65), అడవి శివమ్మ(70) అనే వృద్ధురాళ్ల దగ్గరికి వెళ్లారు. వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. వెళ్లొస్తా తల్లీ అంటూ అక్కడ్నుంచి సెలవు తీసుకున్నారు. తర్వాత యాత్ర తోటగూడ మీదుగా రస్తాకుంటుబాయి గ్రామం చేరింది. గిరిజనమహిళలు రోడ్డుపై నిలబడి ఆయనకు ఘన ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా అడవి చంద్రమ్మ అనే మహిళ ‘‘నా మనువడు పది పాసయ్యాడు. ఇక ఖర్చు పెట్టలేమని మానేశాం’’ అని జగన్‌కు తన గోడు వెళ్లబోసుకుంది. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ‘‘మన ప్రభుత్వం వచ్చే వరకు కష్టపడి పిల్లలను చదివించండి. ఎట్టి పరిస్థితుల్లో చదువులు ఆపొద్దు. మన ప్రభుత్వం రాగానే పైసా ఖర్చు లేకుండా నేను చదివిచ్చుకుంటాను’’ అని వారికి భరోసానిచ్చారు. ‘‘ఆ పైడితల్లి దయవలన నువు బేగున (తొందరగా) ముఖ్యమంత్రివి కావాలయ్యా. మేం ఓటేసుకొని నిన్ను గెలిపించుకుంటాం..’’ అని గిరిజన మహిళలు ఆశీర్వదించారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో..


రస్తాకుంటుబాయి నుంచి ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి.. మండ, గుమ్మగదబవలస, లేవిడి, మొండెంఖల్లు మీదుగా ఉదయపురం, కాకితాడ గ్రామాలకు చేరుకున్నారు. ఈ రెండు గ్రామాలు ఒడిశా సరిహద్దున ఉన్నాయి. ఇక్కడ్నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం వె ళ్తే ఒడిశా జిల్లాలోని గుమ్మ గ్రామం వస్తుంది. ఈ రెండు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల హిట్ లిస్టులో ఉన్నాయి. వారం కింద టే మావోయిస్టు ఆంధ్ర ఒడిశా సరిహద్దు స్క్వాడ్, కోరాపుట్ దళాలు సంయుక్తంగా ఇక్కడ సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తిస్థాయి సాయుధ పోలీసు వలయం మధ్య జగన్‌మోహన్‌రెడ్డిని బాధిత కుటుంబం వద్దకు తీసుకుపోవాలని, మధ్యలో సాధారణ ప్రజలను, గిరిజనులను కలవకుండా కట్టడి చేయాలని పోలీసులు భావించారు. కానీ ఆయన మాత్రం రక్షణ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, నన్ను స్వేచ్ఛగా వారితో మాట్లాడనివ్వాలని పోలీసులను కోరారు. ఈ రెండు గ్రామాల ప్రజలు డప్పులు, ధింసా నృత్యాలతో జగన్‌మోహన్‌రెడ్డిని తమ గ్రామంలోకి ఆహ్వానించారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి ఉదయపురంలో పత్తిక స్వప్న, కాకితాడలో అరిక భాస్కర్‌రావు కుటుంబాలను ఓదార్చారు. అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు. గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అప్పటికే జ్వరం తీవ్రం కావడంతో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి నేరుగా చిలకాంలోని ద్వారపురెడ్డి సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఓదార్పు యాత్రలో పాల్గొన్న వారిలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి, మాజీ మంత్రులు పి.సాంబశివరాజు, పెద్దింటి జగన్మోహన్‌రావు, మాజీ ఎంపీ కణితివిశ్వనాథం, మాజీ ఎమ్మెల్యేలు శత్రుచర్ల చంద్రశేఖరరాజు, జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, డాక్టర్ బొత్సా కాశినాయుడు, పి.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Friday, May 20, 2011

మ్యాచ్ ఫిక్సింగ్ బాబూ... అవిశ్వాసం పెట్టరేం? * చంద్రబాబుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్న

నాడు వైఎస్ సువర్ణయుగం నడుస్తున్నప్పుడు ....
47 మంది ఎమ్మెల్యేలతోనే అవిశ్వాస తీర్మానం పెట్టారే..
ఈరోజు 90 మంది ఎమ్మెల్యేలు ఉండీ..
ఈ సర్కారు మాకొద్దని రైతులంటున్నా నోరు మెదపరేం..
{పజల పక్షాన పోరాడాల్సిన మీరు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు
అతి త్వరలో రెండు పార్టీలు బంగాళాఖాతంలో కలిసిపోతాయి
రాష్ట్రంలో ప్రతిపక్షమేదైనా ఉందంటే అది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే
ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో రాజకీయ మార్పునకు నాంది


ఈ చేతకాని సర్కారును సాగనంపాలి అని రోడ్డెక్కి మాట్లాడుతున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టట్లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. పేదల పక్షాన, రైతుల పక్షాన పోరాడాల్సిన ప్రతిపక్ష తెలుగుదేశం.. అధికార కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని, అందువల్లే రైతులు, పేదల సమస్యలను గాలికి వదిలేసిందని ఆయన దుయ్యబట్టారు. ఆయన ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి అని నోటిమాటగా అయితే అంటారుకానీ సాగనంపరని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని పెండ్లూరు, చాగలేరు గ్రామాల్లో శుక్రవారం ఆయన వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సువర్ణయుగం సాగుతున్నప్పుడు.. రైతులకు ఎంఎస్‌పీని మించి ధర 47మంది ఎమ్మెల్యేల బలం కూడా సరిగాలేని చంద్రబాబు ఈ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదంటూ అవిశ్వాస తీర్మానం పెట్టారు. మరి ఈ రోజు రోడ్డెక్కి మొసలి కన్నీరు కారుస్తూ.. ప్రజల పట్ల, పేదల పట్ల ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న మీకు గుర్తుకు రావట్లేదా చంద్రబాబూ.. ఇవాళ మీకు 90మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రతి రైతు సోదరుడు, పేదవాడు ప్రస్తుత ప్రభుత్వం దిగిపోవాలని వేయి కళ్లతో ఎదురుచుస్తున్నాడు.. అయినా మీరు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టట్లేదు?’ అని జగన్ నిలదీశారు. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న బాబు.. అవిశ్వాస తీర్మానం పెట్టనుగాక పెట్టనంటున్నారంటూ ఎద్దేవా చేశారు.


ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది


‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధాన్యం కనీస మద్దతు ధర వేయి రూపాయలుగా ఉంది. ఆ ఐదేళ్లలో రూ. 1200 ధరకు కూడా రైతులు ధాన్యాన్ని అమ్ముకున్నారు. ఆయన చనిపోయిన తరువాత, సువర్ణ యుగం పోయాక.. కనీస మద్దతు ధర కంటే రూ. 150 నుంచి రూ. 200 తక్కువకు అమ్ముకునే అధ్వాన్న స్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక ప్రతిపక్షం, పేదల వ్యతిరేక ప్రభుత్వం రెండూ కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికొదిలేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విసుగు చెందిన ప్రతి పేదవాడు, ప్రతి రైతు ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో ఎప్పుడు కలుస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారని జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో దేవుడు దయ తలిస్తే, వైఎస్ ఆశీస్సులు అందరికీ ఉంటే వైఎస్‌ను అభిమానించే గుండె చప్పుడులన్నీ ఏకమై.. ఇంతమంది పేదల ఉసురుపోసుకున్న ఈ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బంగాళాఖాతంలో కలిసి పోతాయని, ఆ రోజు అతి త్వరలో వస్తుందని జగన్ అన్నారు. వైఎస్ సువర్ణయుగం మళ్లీ వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ప్రతిపక్షం క నబడడం లేదు. ప్రతిపక్షం ఉందంటే అది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే. జనం సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తున్నది మేమే. ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలనుకునే పార్టీ మాది’ అని స్పష్టంచేశారు.


అలాంటి నాయకులు కరువయ్యారు

‘రాముని రాజ్యం చూడ లేదు కానీ, రాజశేఖరుని సువర్ణ యుగం చూశాను. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి రేండేళ్లు కావస్తోంది. ఆయన చనిపోయిన తరువాత పేదల మొహంలో చిరునవ్వు చూడాలని, వారి జీవితాలపై చెరగ ని ముద్రవేయాలని.. వారి గుండెల్లో బతికుండాలని, చనిపోయిన తరువాత ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఫొటో పెట్టుకునేలా వారికి మేలు చేయాలనే తపన రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికీ లేదు’ అంటూ జగన్ కాంగ్రెస్, టీడీపీ నాయకులనుద్దేశించి విమర్శించారు.

మెజార్టీయే సాక్ష్యం

‘వైఎస్ ఎక్కడికీ పోలేదు. ప్రతి గుండెలో బతికే ఉన్నారు. నన్నూ, నా తల్లినీ ఒంటరిని చేయకుండా ఇంత పెద్ద కుటుంబాన్నిచ్చారు’ అని ప్రజాస్పందనను చూసి జగన్ ఉద్వేగంగా అన్నారు. ఉప ఎన్నికల్లో వచ్చిన మెజార్టీయే ఇందుకు సాక్ష్యమన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలే రాష్ట్రంలో రాజకీయ మార్పునకు నాంది పలికాయన్నారు. 20 మంది మంత్రులు మకాం వేసినా, హైదరాబాద్ నుంచి కోట్లాది రూపాయలు తెచ్చి ఆత్మాభిమానానికి వేలం వేసి కొనాలని చూసినా.. వారికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఈ జిల్లాలో పుట్టినందుకు గర్వపడుతున్న కడప బిడ్డలు.. రాష్ట్రంలో, దేశంలో అందరూ చూసేటట్లు గర్వింప దగ్గ తీర్పు ఇచ్చారన్నారు. ఎన్నికల రోజున చూపిన ప్రేమాభిమానాలే ఇప్పుడు కూడా చూపుతున్నారని.. చిరునవ్వుతో ఆప్యాయత, అభిమానం పంచుతున్నారని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tuesday, May 17, 2011

రైతుల మేలు కోరని దగాకోరు సర్కారు * రైతన్నల సమస్యలపట్ల నిర్లక్ష్యంపై జగన్ ధ్వజం

* రూ. 2,400 ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని 5 నెలలు కావస్తున్నా ఒక్క పైసా ఇవ్వలేదు
* వైఎస్ హయాంలో రూ.1,200 దాకా మద్దతు ధర వచ్చింది...
* వ్యవసాయం దండగ.. తిన్నది అరగకే ఆత్మహత్యలన్న ఏకైక సీఎం చంద్రబాబు
* నా దీక్షతోనైనా రాష్ట్రానికి బుద్ధి, కేంద్రానికి మనసు రావాలని కోరుకుంటున్నా
* అశేష జన సందోహం మధ్య ముగిసిన జగన్ రైతు దీక్ష...

  ‘రైతు సమస్యలను పరిష్కరించడంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మనసు ఉండడంతో మార్గం కనిపించింది. స్వర్ణయుగం లాంటి ఆయన పాలనలో క్వింటాలు ధాన్యం కనీస మద్దతు ధర రూ. 530 నుంచి రూ. 1,000 వరకు పెరిగింది. ఒక దశలో ఈ ధర రూ. 1,200 వరకు పోయింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతు సమస్యలపై మనసు లేకపోవడంతో మార్గం కనిపించడం లేదు. నిత్యం జగన్‌మోహన్‌రెడ్డిని ఏ విధంగా తొక్కాలా.. కుర్చీని ఏ విధంగా కాపాడుకోవాలా.. అనే ఆలోచన లతో కాలం గడిపేస్తున్నారు. జగన్‌పై దృష్టి పెట్టే సమయంలో కేవలం 10 శాతం ప్రజా సమస్యలపై పెడితే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. రైతులకు మద్దతు ధరకోసం నేను చేపట్టిన 48 గంటల దీక్షతో రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి, కేంద్ర ప్రభుత్వానికి మనసు రావాలని కోరుకుంటున్నా’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

రైతు సమస్యల పరిష్కారం కోసం గుంటూరులో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష(రైతు దీక్ష) ముగింపు సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రైతు వెంకటసుబ్బయ్య గ్లూకోజ్ కలిపిన కొబ్బరినీళ్లు ఇచ్చి జగన్‌తో దీక్ష విరమింపజేశారు. దీనికి ముందు జగన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

వైఎస్‌ఆర్ పాలన సువర్ణయుగం
48 గంటలపాటు నిరాహార దీక్ష చేస్తూ మా గోడు వినండని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చేతులు జోడించి వేడుకున్నా. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరుస్తాయని భావిస్తున్నా. రాముడి రాజ్యం చూడలేదు కానీ వైఎస్సార్ సువర్ణయుగం మనమంతా చూశాం. వరికి మద్దతు ధర వైఎస్సార్ హయాంలో రూ. 1,200 వరకు పోయిందంటే అది సువర్ణయుగాన్నే గుర్తుచేస్తుంది. ఆ ఐదేళ్ళలో పెట్టుబడిపై ఖర్చు ఒక్క రూపాయి కూడా పెరగలేదు.

రైతు ప్రభుత్వం వస్తేనే రైతు గురించి ఆలోచన చేస్తుంది. రైతు గురించి ఆలోచన చేస్తే రైతు మొహాన చిరునవ్వు ఉంటుందని నమ్మితేనే.. రాష్ట్ర ప్రభుత్వం, రైతన్న బాగుంటారు. అలా రైతు గురించి తెలిసిన వ్యక్తి, రైతు గురించి ఆలోచించిన వ్యక్తి వైఎస్సారే.. రైతు ముఖాన చిరునవ్వులు చూసిన ప్రభుత్వం వైఎస్సార్‌దే. ఆ ఐదేళ్లలో దేశం మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.5 శాతం పెరిగితే... మన రాష్ట్రంలో 6.78 శాతం పెరుగుదల నమోదైందని చెప్పడానికి నేను గర్విస్తున్నా.
 
ఆ ఏకైక సీఎం చంద్రబాబు
 
వైఎస్ సువర్ణయుగానికి ముందు ఒకాయన రాష్ట్రాన్ని పాలించాడు. ఆయన పేరు చంద్రబాబు. తొమ్మిదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన ఆయన తన హయాంలో రైతులకేం చేయలేదుగానీ... ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తూ వారి వద్దకు వెళుతున్నారు. తన హయాంలో వ్యవసాయమే శుద్ధ దండగ అని అన్నారాయన. అలా అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటే.. తిన్నది అరగక చనిపోయారని అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ మాటెత్తితే.. ఆ కరెంటు ఇచ్చే తీగలలో కరెంటు ఉండదు కాబట్టి తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళన చేశారు. అదే చంద్రబాబు ఇవాళ రోడ్డెక్కి అధికార దాహంతో ఇష్టం వచ్చినట్లు మాటలిస్తున్నారు. మొసలి కన్నీరు కారుస్తూ.. రైతుల వద్దకెళ్ళి ఆరు గంటలేం ఖర్మ.. ఏకంగా తొమ్మిది గంటలపాటు ఉచితంగా విద్యుత్ ఇస్తామంటున్నారు.

నేను కదిలే వరకూ.. బాబు కదలరు

ఎన్నో ఏళ్లుగా రైతులు కష్టాలు పడుతుంటే.. స్పందించని చంద్రబాబుకు.. జగన్ అనే నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రోజున మెలకువ వచ్చింది. అప్పటి నుంచి ఆయనను గమనిస్తే ఏదైనా సమస్యపై ఉద్యమిస్తానని వైఎస్ జగన్ నోటి నుంచి మాట వచ్చిన వెంటనే.. నేనూ యాత్ర చేస్తా నీతోపాటు అంటాడు. నాకు నవ్వు వ స్తోంది. రైతులు పడుతున్న కష్టాల గురించి దీక్ష చేయాలనుకుంటున్నట్లు నేను ఒక పత్రికా ప్రకటన ఇచ్చిన మూడు నాలుగు గంటలకు ఆయన నిద్ర మేల్కొని రైతుల వద్దకు వచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇంతకాలం నాకైతే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసం 40 రోజులు రాత్రింబవళ్ళూ తిరుగుతున్నా. ఆయనకు ఏం పనుంది.. ఇంతకాలం ఏసీ గదుల్లో పడుకునే బదులు నేను దీక్ష చేపట్టకముందే రైతుల గురించి ఉద్యమించవచ్చు కదా! ఈ రోజు ఆ చంద్రబాబు తెలుగుదేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయ్యాయి. ప్రజలు జగన్‌వైపు పోతున్నారనుకున్న సమయంలో.. రైతులకోసం చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తూ ఉద్యమ బాట పడుతున్నారు.
ఈ సర్కారుకు సిగ్గులేదు
వైఎస్ స్వర్ణయుగం గురించి, చంద్రబాబు మొసలికన్నీరు గురించి చెప్పుకున్నాం.. ఇంకో ప్రభుత్వం ఉంది.. అది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం. మొన్న రైతు సమస్యలపై విజయవాడలో లక్షల మంది రైతులతో కలసి నేను దీక్ష చేస్తూ రూ. 4వేలు ఇన్‌పుట్ సబ్సిడీ అడిగితే రూ. 2,400 ఇవ్వడానికి అంగీకరించి దానికోసం రూ. 618కోట్లు ఇస్తామని చెప్పి ఐదు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. సిగ్గులేదీ ప్రభుత్వానికి. ఇంతేకాకుండా రైతులకు రుణ వడ్డీ మాఫీ చేస్తామన్నారు. వడ్డీ మాఫీ కావాలని అంటే రూ. 1,100 కోట్ల రుణానికి దాదాపుగా రూ. 525 కోట్లను బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించాలి. చెల్లించకపోతే అవి వడ్డీనెలా మాఫీ చేస్తాయి. ప్రభుత్వం నేటివరకు బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక రుణాల రీషెడ్యూల్ 10% కూడా చేయలేని పరిస్థితి కనపడుతోంది.

ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనొచ్చుకదా

ధాన్యం కొనుగోలు చేస్తే నిల్వ చేయడానికి స్థలం సరిపోవడంలేదని, స్థలం లేకపోతే తామిక ధాన్యం కొనలేని పరిస్థితి వస్తుందని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. తమ వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని ఎగుమతులకు అనుమతించాల్సిందిగా కేంద్రానికి సూచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 4 నెలలుగా వారు కోరుతున్నా సర్కారుకు పట్టడం లేదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా మనతో సమానంగా ధాన్యం పండిస్తున్నారు. వారికి లేని సమస్య మనకెందుకు వస్తుందని నేను అడుగుతున్నా. పంజాబ్‌లో పండించిన ధాన్యంలో 94.2 శాతాన్ని సివిల్ సప్లరుుస్, కోఆపరేటివ్ సంస్థ, స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి విక్రయిస్తుంది. ఈ ప్రయత్నం మనరాష్ట్రంలో ఎందుకు జరగడం లేదు? అసలు ఎగుమతులను రాష్ట్రప్రభుత్వమే ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తున్నా.

మద్దతు ధర 100 పెంచాలి

ఓ రకంగా చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు ఇస్తానన్న మద్దతు ధర రూ. 1000 కూడా సరిపోదు.. దాన్ని కచ్చితంగా 100 రూపాయలైనా పెంచి రూ.1100 చేయాలని నేను కోరుతున్నా. అంతేకాదు ఖరీఫ్‌లో ధాన్యానికి క్వింటాల్‌కు కేంద్ర ధరల నిర్ణాయక కమిటీ రూ.167 పెంచుతూ సిఫార్సు చేసింది. రబీలో పండిన పంటకు కూడా దీనిని వర్తింపజేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.

స్వర్ణయుగం మనమే తెచ్చుకుందాం
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి రెండు సంవత్సరాలు కావస్తోంది. ఆయనలా.. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని, తనపేరు వాళ్ళ గుండెల్లో, హృదయాల్లో కొలువుండాలని, చనిపోయిన తరువాత వారి గుండెల్లో నిలిచిపోవాలని, తన ఫొటో వారి ఇళ్లలో ఉండాలని.. అంతగా ప్రతి పేదవాడికి దగ్గరగా ఉండాలనే తపన ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికీ లేదు. రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు. ప్రతి రైతు, ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వును చూసిన.. వైఎస్ స్వర్ణయుగాన్ని మనమే తెచ్చుకుందాం.

పెట్రో ధరలతో దొంగ దెబ్బ తీశారు: ఐదు రాష్ట్రాలలో ఎన్నికల అనంతరం పెట్రోలుపై రూ.5 వాత వేసి ప్రభుత్వం ప్రజలను దొంగదెబ్బ తీసింది. సంవత్సరానికి ఎనిమిది సార్లు రేట్లు పెంచి రూ.15 మేర భారం వేసింది. ఇది సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నా? ఇది రైతుల గురించి చేపట్టిన దీక్ష కాబట్టి.. ఈ విషయంపై ఇంతకుమించి ఇక్కడ మాట్లాడను.
 
ఉప్పొంగిన గుంటూరు * ముగింపు రోజున జనసంద్రంగా మారిన రైతుదీక్ష ప్రాంగణం
 
జనప్రవాహంతో గుంటూరు ఉప్పొంగింది.. అన్నదాతల వేల గొంతుకలు ఒక్కటయ్యాయి.. సమస్యలపై దిక్కులు పిక్కటిల్లేలా నినదించాయి.. తమకోసం దీక్షకు దిగిన జననేత కు జేజేలు పలికాయి..! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష ముగింపు సందర్భంగా మంగళవారం రైతన్నలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే రైతులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రాంగణానికి చేరుకున్నారు. దీక్ష ముగించిన అనంతరం జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రసంగం ఆద్యంతం జగన్నినాదాలు, చప్పట్లతో దీక్షా ప్రాంగణం మార్మోగింది. అన్నదాతలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై జగన్ నిప్పులు చెరిగినప్పుడల్లా.. జనం హర్షధ్వానాలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ద్వంద్వ వైఖరి, కుయుక్తులను వివరిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమైంది.

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభించిన జగన్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష విరమించారు. తనను కలిసేందుకు, వినతిపత్రాలు ఇచ్చేందుకు, కరచాలనం చేసేందుకు వచ్చిన జనాన్ని జగన్ ఆప్యాయంగా పలకరించారు. మూడ్రోజులపాటు రైతులు క్యూలో నిల్చుని జగన్‌ను కలిసి, తమ గోడును వెల్లబోసుకున్నారు. వీటిలో కొన్నింటికి జగన్ తక్షణమే పరిష్కారం చూపారు. సోమవారం వెంగమాంబ కోల్డ్ స్టోరేజీ అగ్నిప్రమాద బాధిత రైతులు సమస్యను విన్నవించిన క్షణాల్లోనే జగన్.. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌కు ఫోన్ చేశారు. మిర్చి రైతులకు న్యాయం చేయాలని, ప్రతి ఒక్కరికీ పరిహారం అందించాలని కోరారు. ఈ సమస్య పరిష్కారమయ్యేవరకూ సంప్రదింపులు జరపాలని జిల్లా నేతలకు సూచించారు.

జనమే జనం:
రైతు దీక్షాప్రాంగణం చివరిరోజు జనసంద్రంగా మారింది. గుంటూరు జిల్లాతోపాటు, కృష్ణా, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వేలాది మంది రైతులు తరలి వచ్చారు. ఉదయం 7.30 గంటల నుంచే నేతల ప్రసంగాలు ప్రారంభమయ్యాయి.

దీక్ష విరమణ:
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రైతు వెంకటసుబ్బయ్య కొబ్బరి నీళ్లు అందించి జగన్‌తో దీక్ష విరమింపజేశారు. మద్దతు ధరలేక 960 బస్తాల ధాన్యాన్ని బస్తా ఒక్కింటికి రూ. 680కు అమ్ముకున్న సుబ్బయ్యకు సుమారు రూ. 5 లక్షల నష్టం వచ్చిం ది. జగన్‌తోపాటు ఆయనా నిరాహార దీక్ష చేశారు.

భారీగా తరలివచ్చిన నేతలు:
జగన్ చేపట్టిన రైతుదీక్షకు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. మూడ్రోజులపాటు సాగిన ఈ దీక్షకు మొత్తం ఇద్దరు పార్లమెంటు సభ్యులు, 19 మంది శాసనసభ్యులు, ఆరుగురు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తరలివచ్చారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు ఎమ్మెల్యే), కొండా సురేఖ (పరకాల ఎమ్మెల్యే), ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత (పత్తిపాడు), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), గొర్ల బాబురావు (పాయకరావుపేట), అమరనాథ్‌రెడ్డి (రాజంపేట), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), శేషారెడ్డి (అనపర్తి), కె.శ్రీనివాసులు (రైల్వే కోడూరు), ఎం.ప్రసాదరాజు (నర్సాపురం), బూచేపల్లి శివప్రసాదరెడ్డి (దర్శి), పి.ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కొవ్వూరు), కొర్ల భారతి (టెక్కలి), ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ), పిల్లి సుభాష్‌చంద్రబోస్ (రామచంద్రాపురం), తెల్లం బాలరాజు (పోలవరం), ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, జూపూడి ప్రభాకర్, పుల్లా పద్మావతి, కొండా మురళి, దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు హాజరయ్యారు.

జగన్‌కు జన వీడ్కోలు

దీక్ష విరమించిన జగన్‌కు జిల్లా ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. వేలాది మంది జగన్‌ను అనుసరిస్తూ పయనమయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ జగన్ గుంటూరు నుంచి మధ్యాహ్నం ఏలూరు బయల్దేరి వెళ్లారు.

జగన్ చెబితే అరగంటలో రాజీనామా
జగన్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన పిలుపిచ్చిన అరగంటలో నాతోపాటు అనేకమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని వ్యూహాలు, సాంకేతిక కారణాల వల్లే ఇప్పటివరకూ మేం రాజీనామాలు చేయలేదు. కడప ఉపఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పెనుతుపాను రేగనుందని నేను ముందే చెప్పాను. ఈ తుపానులో వైఎస్, జగన్‌లను విమర్శించినవారంతా కొట్టుకుపోతారు. జగన్‌తో నడుస్తున్నందువల్లే ఎప్పుడూ ఇంటిపట్టున ఉండే విజయమ్మ సైతం 40 రోజులు మండుటెండల్లో ప్రజల మధ్య తిరిగారు. ఎవరైనా ఎన్నికలు కాగానే విశ్రాంతి తీసుకుంటారు లేదా విజయోత్సవాలు జరుపుతారు. కానీ ఎన్నికల ఫలితాలకు ముందే జగన్ మళ్ళీ ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. అంతలోనే రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను గమనించి రైతుదీక్షకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే జగన్‌కు పోటీగా నిలబడగల నాయకుడెవ రైనా కనిపిస్తున్నారా?
- అనకాపల్లి ఎంపీ సబ్బం హరి

ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం
ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదన్న వాస్తవాన్ని సీఎం, మంత్రులు గ్రహించాలి. ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్ళ పదవీకాలం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు సహిస్తూ ఊరుకుంటున్నారు. లేదంటే అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారు. కడప గెలుపు ఒక చరిత్రాత్మక ఘట్టంగా మిగులుతుంది. వైఎస్ లేని లోటును జగన్ తీరుస్తారు. నిజాయితీగా పనిచేయడం తప్ప టక్కుటమారాలు జగన్ ముందు చెల్లవు. మహానేత వైఎస్ భోళాశంకరుడని, జగన్ శ్రీమహావిష్ణువని సాక్షాత్తు ఓ తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత నాతో అన్నారు. ఉప ఎన్నికల్లో జగన్‌కు 50 వేల మెజార్టీ కూడా రాదని కొందరు, లక్ష మెజార్టీ దాటదని మరికొందరు, గత మెజార్టీని మించిపోరని ఇంకొందరు కబుర్లు చెబుతూ ప్రజల్ని గందరగోళంలో పడవేశారు. ఈ నేతల దొంగమాటలు నమ్మి పందేలు కాసినవారు అన్యాయమైపోయారు. ఈ రైతు దీక్షతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరచి రైతులకు న్యాయం చేయాలి.
- నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి

రైతుల కన్నీటిలో కొట్టుకుపోతుంది
రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వమూ మనుగడ కొనసాగించలేదు. ఈ రైతుల కన్నీటిలో కిరణ్ ప్రభుత్వం కొట్టుకుపోతుంది. ఇటీవల వరుసగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే చిరంజీవి, రాహుల్‌గాంధీ ఐరన్ లెగ్‌గా ముద్రపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో రైతు సమస్యల పట్ల పోరాడుతున్న రాహుల్.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతాంగం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయాన్ని ముందు తెలుసుకోవాలి. తాము అధికారంలో ఉన్న చోట్ల సంస్కరణలు అమలు చేయడం మానేసి, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట్ల ఆందోళన చేయడం ఎంతవరకు సబబు? కడప అఖండ విజయాన్ని కొంతమంది కాంగ్రెస్ నేతలు పాలపొంగుగా అభివర్ణించారు. అందులో ఉన్నది గిన్నెడు పాలు కాదు. సప్తసముద్రాలంత అభిమానం జగన్‌పై ఉంది. కడపలో జనం ఓట్లతో ఈవీఎం కుయ్‌మంటుంటే అక్కడ ఢిల్లీలో అధిష్టానం గూబ గుయ్యిమంది.
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ

వైఎస్సార్ కాంగ్రెస్‌కు పట్టం ఖాయం
కడపలో జగన్ మెజార్టీ చూస్తుంటే.. ఆయనకు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో అర్థమవుతోంది. రాష్ట్రానికి సంబంధించి లోక్‌సభ ఎన్నికల మెజార్టీలో దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఆ విజయం లెక్కలోనిది కాదు. అప్పట్లో పీవీపై ఎన్టీఆర్ అభ్యర్థిని నిలబెట్టలేదు. జగన్‌కు రాష్ట్రానికి సీఎంగానే కాదు.. దేశానికి ప్రధాని కాగల లక్షణాలున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టు కలిగిన గుంటూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో 17 స్థానాల్లోనూ ప్రజలు పట్టం కడ తారు.
- ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి

కాంగ్రెస్‌కు చర మగీతం పాడండి

చావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్ర ద్వారా జవసత్వాలు తెచ్చిన నేత వైఎస్. అలాంటి మహానేత దేశంలో ఏ నాయకుడూ ప్రవేశపెట్టని విధంగా పేదల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కాంగ్రెస్‌ను కూకటివేళ్ళతో పెకలించాలి. ప్రజాసమస్యలపై, రైతు సమస్యలపై ఎలాంటి అవగాహన లేని సీఎం మనల్ని పాలించడం మన ఖర్మ. వైఎస్ తర్వాత రైతుల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నాగళ్ళనే తుపాకులను చేసి మీ ఓటుతో ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు చరమగీతం పాడి జగన్ సీఎం అయ్యేదాకా అండగా నిలవండి.
-ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి

జగనే వారసుడని నిరూపించారు..

వైఎస్ వారసుడు జగన్ మాత్రమేనని కడప ఓటర్లు నిరూపించారు. రైతు దీక్షకు ఢిల్లీపెద్దలు తమ వేగుల్ని పంపి ఉంటారు. ఈ వేగుల ద్వారా అయినా రైతు గుండెచప్పుడు ఢిల్లీకి తెలుస్తుంది. కడప జిల్లాలోని తిరుమలదిన్నెలో ఓ నాలుగేళ్ల పాప మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వస్తున్నారంటే ఎవడైతే నాకేంటి? జై జగనన్న అని నినాదం చేసిందంటే జగన్ ఎంతలా ప్రజల గుండెల్లో ఉన్నారో అర్థమవుతుంది. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు సోనియా బొమ్మ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలి.
-ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు

కిరణ్ కోసం పదవి వదులుకుంటారా?

జగన్ కోసం మంత్రి పదవులు వదులుకోవడానికి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. సీఎం కిరణ్‌కోసం మంత్రి పదవి వదులుకోవడానికి కేబినెట్‌లో ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రభుత్వం వెన్నెముక లేని సర్కారు. దీన్ని కూల్చడం జగన్‌కు ఒక లెక్కకాదు. వీహెచ్, శంకరరావులు కాంగ్రెస్‌ను అథఃపాతాళానికి నెట్టడానికి శాయశక్తులా కృషిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముత్యంలాంటి పార్టీ. అయితే జగన్ వెళ్లిపోయిన తర్వాత ముత్యం వెళ్లిపోయింది. ప్రస్తుతం చిప్పే మిగిలింది. ఏ జాదూ వచ్చినా కాంగ్రెస్‌ను మార్చలేరు.
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు

దేశానికే ఆదర్శం వైఎస్..

రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్‌ను చూసి దేశం ఎంతో నేర్చుకుంది. వైఎస్ పంచె కట్టుకుని వస్తుంటే రైతుకు నిజమైన ప్రతినిధిలా ఉండేవారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతును పట్టించుకునే నాథుడే లేడు. సినిమా రంగం నుంచి వచ్చిన ఓ నేత సామాజిక సేవ అంటూ ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి కేవలం పదవి కోసం పార్టీని నట్టేట ముంచి నీచమైన కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నారు. టీడీపీ ఒక్క ప్రాజెక్టు కట్టకుండా రాష్ట్ర వ్యవసాయ రంగాన్నే దివాళా తీయించింది. మళ్లీ అప్పటి వైఎస్ పాలనను తీసుకురాగ ల వ్యక్తి జగన్ ఒక్కడే.
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ

Monday, May 16, 2011

రైతు పోరు, జనహోరు * రెండో రోజూ ‘రైతు దీక్ష’కు పోటెత్తిన అన్నదాతలు

వినతిపత్రాలిచ్చి తమ కష్టాలు చెప్పుకున్న రైతులు
జగన్ వెంటే నడుస్తానన్న మంత్రి ధర్మాన సోదరుడు, నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్
నేడు 12 గంటలకు దీక్ష విరమణ

‘బాబూ.. కాస్త దారిస్తారా..? జగన్ బాబును కలవాలి. ఆ మా రాజుకు ఈ కాగితం ఇచ్చెల్తా..! ఇంతమంది జనంలో కూడా ఎలాగోలా ఇక్కడ్దాక వచ్చా.. ఇంక నడవలేను సామి. కాస్త, ఆ బాబు దగ్గర్కి తీసుకెళ్లండయ్యా..’
అంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పరిమి గ్రామానికి చెందిన వృద్ధ రైతు పేరం ముసలయ్య ఎట్టకేలకు జగన్ దగ్గరకు చేరుకున్నాడు. గతేడాది డిసెంబర్‌లో కురిసిన అకాల వర్షాలకు ముసలయ్య మూడెకరాల పంటను నష్టపోయాడు. సర్కారు నుంచి ఎలాంటి సాయం లేని నేపథ్యంలో జగన్‌కు తన ఆవేదనను తెలియచేసేందుకు అతడు దీక్షకు వచ్చాడు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రమిచ్చాడు.


ఇలాంటి వృద్ధ, యువ, మహిళా రైతులు గుంటూరులో సోమవారం రైతు దీక్షకు వేలాదిగా తరలివచ్చారు. జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన తమ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి కాకపోయినా.. జగన్‌కు తమ సమస్యలు చెప్పుకొంటే వాటి పరిష్కారానికి ఆయన తమ తరఫున పోరాడతారన్న నమ్మకమే 70 ఏళ్ల వయసున్న వారిని సైతం ‘రైతు దీక్ష’కు లాక్కొచ్చింది. 48 గంటల రైతు దీక్షలో రెండోరోజైన సోమవారమిలా రైతులు, అభిమానులు, మద్దతు తెలిపేవారితో దీక్షా ప్రాంగణం పోటెత్తింది. రైతులు వ్యవసాయ పరిస్థితుల్ని, నష్టపోయిన తీరును.. తమను పట్టించుకోని అధికారుల వైఖరిపై జగన్‌కు వినతిపత్రాలు అందించారు. మహిళలు సైతం పలు సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు. పావలావడ్డీ, అభయహస్తం, రేషన్‌కార్డులకు సంబంధించిన వివరాలను తమ అభిమాన నేత జగన్‌కు వివరించారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జగన్‌ను కలిసేందుకు ప్రజలు వస్తూనే ఉన్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీ కోసం నేనున్నాంటూ ప్రతి ఒక్కరికీ భరోసా ఇచ్చారు.

అదే ఓర్పు.. అదే చిరునవ్వు: ఆదివారం మధ్యాహ్నం నుంచీ తిండీ తిప్పలు లేకున్నా.. కరచాలనానికి జనం పోటెత్తుతున్నా.. జగన్ పెదాలపై చిరునవ్వు చెరగలేదు.. తనతో మాట్లాడ్డానికి వచ్చిన ప్రతిఒక్కరినీ ఎంతో ఆప్యాయతతో ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తూ, కరచాలనం చేస్తూ ఆయన ఉత్సాహంగా కనిపించారు. క్యూలో వచ్చిన ప్రతిఒక్కర్నీ ఆయన ఆత్మీయంగా పలకరిస్తూ.. వారు చెప్పుకునే సమస్యల్ని సావధానంగా విన్నారు. అందరు రాజకీయ నేతల్లా కాకుండా.. వినతిపత్రాల్ని ఆయన చదువుతూ ఉండటం అభిమానుల్ని సంతృప్తిపరిచిన అంశమని చెప్పాలి. రైతన్నల చేతుల్లో చేయి కలిపి నేనున్నానంటూ భరోసానివ్వడం వారిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
కదిలిన మహిళా లోకం: ఎర్రని సూరీడు అగ్నిగోళంలా మండుతూ ఉష్ణోగ్రత 39.8 డిగ్రీలకు చేరినా లెక్కచేయక మహిళలు వడివడిగా వైఎస్సార్ రైతు ప్రాంగణానికి చేరుకున్నారు. వారు వేల సంఖ్యలో క్యూ కట్టడంతో పోలీసులు, వాలంటీర్లు ప్రతి ఒక్కరూ సహకరించి మహిళల ఆకాంక్షను నెరవేర్చారు. ఓవైపు వేదికపై ప్రజా కళాకారులు పాటలు ఆలపిస్తుండగా, క్యూల్లో నిల్చొన్న రైతులు, అభిమానులు కూడా వారికి వంతపాడుతూ జేజేలు పలికారు.

రహదారులన్నీ గుంటూరు వైపే:
సోమవారం రాష్ట్ర రహదారులన్నీ గుంటూరువైపే మళ్లాయి. కృష్ణా, ప్రకాశం, నల్లగొండ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు ర్యాలీగా దీక్షా ప్రాంగణానికి తరలి వచ్చారు. వీరుకాక ఖమ్మం, ఆదిలాబాద్, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.


ప్రజాప్రతినిధుల హాజరు:
రెండో రోజు దీక్షకు హాజరైన ప్రజాప్రతినిధుల్లో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి, ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోష్(రామచంద్రపురం), కొండా సురేఖ (పరకాల), ఎమ్మెల్యేలు తె ల్లం బాలరాజు(పోలవరం), కొర్ల భారతి(టెక్కలి), ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), కె.శ్రీనివాసులు(రైల్వే కోడూరు), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి(కాకినాడ), అమర్‌నాథరెడ్డి(రాజంపేట), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(మాచర్ల), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), బాబూరావు (పాయకరావుపేట), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (నెల్లూరు), ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్, పుల్లా పద్మావతి, కొండా మురళి, మేకాశేషుబాబు తదితరులున్నారు.

మిర్చి రైతులను ఆదుకోండి..
ఇన్‌చార్జి కలెక్టర్‌కు జగన్ ఫోన్

గుంటూరు, న్యూస్‌లైన్: ‘మిర్చి రైతుల్ని ఆదుకోండి.. అప్పులు చేసి పండించిన పంటను ధర వస్తుందని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. ధర సంగతి ఎలా ఉన్నా ఒక్క కాయ కూడా మిగలకుండా మొత్తం బూడిదైంది. గుంటూరులో వరుసగా కోల్డ్ స్టోరేజీలు తగులబడటంతో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం సకాలంలో స్పందించి ప్రతీ రైతుకు పారదర్శకంగా పరిహారం అందించాలి’ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. గుంటూరు ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్‌ను కోరారు. ఆదివారం రాత్రి గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెంలో ఉన్న వెంగమాంబ కోల్డ్ స్టోరేజీ అగ్నికి ఆహుతై వందలాదిమంది రైతులు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. దీక్షా శిబిరంలో నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ను అగ్నిప్రమాద బాధిత మిర్చి రైతులు కలిసి న్యాయం చేయాలంటూ విన్నవించారు. తక్షణమే స్పందించిన జగన్.. అప్పటికప్పుడు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి రైతుల దయనీయ స్థితిని వివరించారు. నష్టపోయిన ప్రతి రైతును రికార్డుల ఆధారంగా గుర్తించి పరిహారం తక్షణమే అందించాలని, జాప్యం జరిగినా, రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమిస్తానని చెప్పారు. కాగా మిర్చి రైతులకు అండగా వైఎస్ జగన్ ఉంటారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. జేసీతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం సారాంశాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రైతులకు వివరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, అవసరమైతే మళ్ళీ మళ్ళీ జగన్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతారని చెప్పారు.

నేడు 12 గంటలకు దీక్ష విరమణ

వైఎస్ జగన్ చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది. దీక్ష విరమణకు ముందు జగన్ రైతులనుద్దేశించి ప్రసంగిస్తారు.

పొట్టగొడితే.. పోగాలమే! ...... నినదించిన జగన్ ‘రైతు దీక్ష’

* భారీగా తరలివచ్చిన అన్నదాతలు, ప్రజలు
* మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభం..
* మెతుకు ముట్టకుండా 48 గంటలపాటు నిరసన
* జగన్ దీక్షకు మద్దతుగా వేలాదిమంది నిరాహారదీక్ష
* ప్రభం‘జనం’తో కిక్కిరిసిన ఐదో నంబర్ జాతీయ రహదారి
* నిప్పులు కక్కుతున్న ఎండను సైతం లెక్కచేయక కాలినడకన వచ్చిన ప్రజలు.. ఉదయం 9 గంటలకే‘వైఎస్సార్ రైతు ప్రాంగణం’లో జన హోరు
* సర్కారు తీరుపై నిప్పులు చెరిగిన నేతలు

‘‘నోటికాడికి ముద్దను తెచ్చే చేతుల్ని నరికే ప్రభుత్వమిది. రైతుల్ని ఇబ్బందిపెట్టినోళ్లంతా ఏమయ్యారు..? ఈ సర్కారూ గాల్లో కలిసేదే.’’
‘‘వైఎస్ ఉన్నప్పుడు మద్దతు ధర రూ.వెయ్యి వచ్చేది. ఇప్పుడు రూ.500 నుంచి రూ.600 మాత్రమే వస్తోంది.’’
‘‘మొన్నటి తుపానుల పరిహారాలకే దిక్కులేదు. బ్యాంకు రుణాల్లో ఇన్సూరెన్స్ కింద కొంత కోతకోసినా.. ఈ సర్కారు హయాంలో మాకు నష్టపరిహారం సొమ్ము వచ్చింది లేదు.’’

.... ఇదీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రైతు దీక్ష’లో అన్నదాతల ఆవేదన, ఆగ్రహ జ్వాల. వేసవి కాలం.. భానుడు చండ ప్రచండంగా మండిపోతున్నాడు.. అందులోనూ గుంటూరు.. 42 డిగ్రీలతో నిప్పులు చెరుగుతున్నాడు.. ఇటు ‘వైఎస్సార్ రైతు ప్రాంగణం’లో ఇలా రైతు సూరీడు కూడా అంతే స్థాయిలో ఆగ్రహ జ్వాలలు కక్కుతున్నాడు. తమ బాధలు పట్టని సర్కారుపై నిప్పులు చెరుగుతున్నాడు.. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటకు మద్దతు ధర రాకపోవడం, వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై అన్నదాతలు తమ ఆవేదన, ఆక్రందనల్ని ఆదివారం ‘రైతు దీక్ష’లో వెళ్లగక్కారు.

తమను పట్టించుకోకుండా మిల్లర్లకు ఊతమిస్తూ తమ పొట్టగొడుతున్న ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఎండ నిప్పుల కొలిమిని తలపిస్తున్నప్పటికీ.. జగన్ దీక్షకు జనం ప్రభంజనమై పోటెత్తారు. తమకు మద్దతుగా నిలుస్తున్న జగన్‌కు సంఘీభావం తెలపడానికి అన్నదాతలు తండోపతండాలుగా తరలివచ్చారు. జగన్ నినాదాలతో, పోటెత్తిన అశేష జనవాహిని సమక్షంలో మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారు. మెతుకు ముట్టకుండా 48 గంటలపాటు కొనసాగే ఈ దీక్ష 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది.

రైతు నేతకు నివాళితో దీక్ష ప్రారంభం..
శనివారం రాత్రి ఒంగోలులో బస చేసిన జగన్ ఆదివారం ఉదయం ఐదో నంబరు జాతీయ రహదారి మీదుగా గుంటూరు చేరుకున్నారు. మార్గంమధ్యలో దారిపొడవునా ప్రజలు అఖండస్వాగతం పలకడంతో నిర్ణీత సమయంకంటే గంటన్నర ఆలస్యంగా ఆయన గుంటూరు చేరుకున్నారు. అప్పటికే దీక్షా ప్రాంగణానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ భారీ జనసందోహం... జోహార్ వైఎస్‌ఆర్... జై జగన్ నినాదాల నడుమ ధ్యానముద్రలో ఉన్న మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జగన్ నిరాహారదీక్ష ప్రారంభించారు.

అనంతరం ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతునేత తికాయత్‌మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత సమస్యల గోడు వెళ్ళబోసుకోవటానికి వచ్చిన రైతులతో జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ‘మీ నాయన బతికుంటే మా బతుకులు బాగుండేవయ్యా’ అంటూ మాచర్లకు చెందిన సింహాద్రి రాములు తన పరిస్థితిని విన్నవించాడు. నాలుగు ఎకరాల్లో పంట వేస్తే అపారనష్టం వాటిల్లిందని, ఈ ప్రభుత్వం ఏ మాత్రం తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గ్రామాల్లో రూ.600కు కూడా ధాన్యం కొనే నాథుడే లేడని రైతులు తమ ఆవేదనను వివరించారు.
మద్దతుగా వేలాదిమంది దీక్ష
దీక్ష ప్రాంగణంలో జగన్‌కు మద్దతుగా వేలాదిమంది నిరాహారదీక్ష ప్రారంభించారు. దీక్షా ప్రాంగణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. అడుగడుగునా అన్నదాతను నిర్లక్ష్యం చేసిన ఈ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు. సమస్యలను, సిద్ధాంతాలను విస్మరించి నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నుంచి వంగపండు కుమార్తె ఉష ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. సాక్షి సిల్లీ బ్రాండ్ రమేష్ చేసిన మిమిక్రీ, గీతాలు ఆహూతులను అలరించాయి. యువత స్వచ్ఛందంగా వాలంటీర్ బాధ్యతలు స్వీకరించి దీక్షకు హాజరైన రైతులకు తాగునీరు, అల్పాహారం అందజేశారు.
9 గంటల నుంచే జనహోరు
రైతులు భారీస్థాయిలో దీక్షకు తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, వృద్ధులు ఉదయం 9 గంటల నుంచే దీక్షా శిబిరానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గుంటూరు, కర్నూలు, చిలకలూరిపేట రోడ్డు(ఎన్‌హెచ్ 5) వాహనాల రద్దీతో కిక్కిరిసింది. ఒకవైపు రోడ్లపై ట్రాఫిక్ అధికంగా ఉండగానే, మరోవైపు గుంటూరుకు సమీపాననున్న అంకిరెడ్డిపాలెం, పొత్తూరు, జూనంచుండూరు, వింజనంపాడు, నల్లపాడు తదితర గ్రామాల నుంచి ప్రజలు కాలినడకన దీక్షాశిబిరానికి వచ్చారు. యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు పసిపిల్లల్ని చంకన వేసుకుని కొందరు కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకోవడం విశేషం.

ప్రభుత్వోద్యోగులు, వ్యాపారులు, సాధారణ జనంతో పాటు శిబిరం వద్ద బందోబస్తుకు వచ్చిన పోలీసులు సైతం దీక్షకు వచ్చిన జనం, జగన్ ప్రభావం, నేతల ప్రసంగాల గురించి చర్చించుకోవడం కనిపించింది. ఎంతమంది జనం వచ్చారు. ఎక్కడెక్కడ్నుంచి వచ్చారు. ఎలా వచ్చారంటూ వివరాల్ని పోలీసులు పదేపదే అడిగి తెలుసుకున్నారు. నేతల ప్రసంగాలప్పుడు ప్రాంగణంలోని యువత జిందాబాద్‌లతో హోరెత్తించారు. తమ అభిమాన నేత జగన్ ప్రసంగం కోసం పదేపదే డిమాండ్ చేశారు. ఆయన్ను కలుసుకుని అభినందించేందుకు, కరచాలనం చేసేందుకు అందరూ ఉత్సాహం చూపడం కనిపించింది. జగన్ చేతిని పెకైత్తి అభివాదం చేసినప్పుడల్లా ప్రాంగణంలో జై జగన్ నినాదాల హోరు మార్మోగింది.
జగన్ మెజార్టీపై అభినందనలు....
రెండురోజుల కిందటే కడప పార్లమెంటు ఎన్నికల్లో ఐదు లక్షలకుపైగా రికార్డు మెజార్టీని సాధించిన జగన్ విజయోత్సాహాలను కూడా పక్కనపెట్టి రైతు దీక్ష చేయడంపై పలువురు నాయకులు ప్రశంసించారు. జగన్ నిత్య శ్రామికుడిగా రైతు పక్షాన పోరాటాలు చేయడం ఆయన చిత్తశుద్ధిని తెలుపుతోందని కొనియాడారు. జగన్ రికార్డు మెజార్టీతో దేశంలో తెలుగువారి ఆత్మగౌరవం మరొక్కసారి ప్రకటితమైందన్నారు. జగన్ మెజార్టీ గురించి ప్రస్తావించినప్పుడు సభకు హాజరైన వారు కరతాళధ్వనులు చేశారు.

ప్రాంగణంలో భారీ విద్యుత్ ప్రభ..
రైతు దీక్షా వేదిక ప్రాంగణంలో 98 అడుగుల భారీ విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. ప్రభ ప్రాంగణానికి నూతన శోభను తీసుకొచ్చింది. ఫిరంగిపురం మండలం నుదురుపాడుకు చెందిన కొల్లి సుబ్బారెడ్డి అనే రైతు వెయ్యి బల్బులతో ఈ ప్రభను ఏర్పాటు చేశారు. అలాగే దీక్షా వేదిక ప్రాంగణంలో 20 వరకు బెలూన్లను ఎగురవేశారు.

Friday, May 13, 2011

అతనొక సునామీ * జ‘గన్‌’! సోనియాకు షాక్‌! * మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం - జగన్, విజయమ్మ కృతజ్ఞతలు


Jagan-singleఉత్కంఠ వీడింది. ఉద్వేగం మిగిలింది. జనం జాగృతమైంది. నేతలు నివ్వెరపోయారు. నాయకులు తలచిందొకటి. నిర్ణేతలు చేసిందొకటి. ఊహల ఊయలల తాళ్లు తెగిపడ్డారుు. నిజాల నిష్ఠూరాలు ఎగిరిపడ్డారుు. మినీ సంగ్రామంలో మహా యుద్ధమే జరిగింది. రెండు మహా సామ్రాజ్యాలు కూలారుు. వామపక్ష వీరులు నిర్వీర్యులైపోయారు. యుద్ధానికి ముందే చేతులెత్తేశారు. అనుకున్నంతా అరుుంది. కమ్యూనిస్టుల కోటలు ఫెళ్లున నేల కూలారుు. పశ్చిమ బెంగాల్‌ లెఫ్ట్‌ చేజారింది. ేకరళలోనూ అదే పరిస్థితి. ఇక తమిళ సామ్రాజ్యంలో కరుణానిధికి దారుణమైన పరాభవం మిగిలింది. జయలలిత చేతిలో చావు దెబ్బ తగిలింది. ఇక రేపటి నుంచి ఆయనకు కష్టకాలమే. అసోంలో కాంగ్రెస్‌ పార్టీ పరువు దక్కించుకుంది. వరసగా మూడోసారి తరుణ్‌ గొగోయ్‌ ప్రజాభిమానాన్ని నిలబెట్టుకున్నారు. ేకరళలో కాంగ్రెస్‌ మళ్లీ కొత్త శకం ప్రారంభించబోతోంది. అది అదనపు బోనస్‌. పుదుచ్చేరిలోనూ జయలలిత హవాయే. ఇక కడప వ్యవహారం..జగన్‌ సునామీ ముందు అంతా కొట్టుకుపోయారు. డిపాజిట్లు గల్లంతు చేసుకుని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జగన్‌ మెజారిటీ సాధనలో జాతీయ రికార్డును తృటిలో కోల్పోయారు. పులివెందులలో ఆయన తల్లి విజయమ్మ కూడా అఖండ విజయం సాధించారు.

ఏతావాతా రాష్ట్రంలో మున్ముందు రాజకీయ సునామీకి ఈ ఉప ఎన్నిక బీజాలు వేసే అవకాశాలున్నారుు. అవతల మార్క్సిస్టులు..ఇటు కరుణానిధి..ఇక్కడ కిరణ్‌ ప్రభుత్వం..ఈ వేసవి ముగిసేలోగానే రాజకీయ వడగాలికి రెపరెపలాడే ప్రమాదం కనిపిస్తున్నది. విజేతలైన మమత..జయలలిత..జగన్‌..ముగ్గురూ ముగ్గురే. ప్రతీకారానికి.. మహోద్వేగానికి..వెన్ను చూపని తత్త్వం వీరిది. అందుేక ప్రత్యర్థులు వెన్ను చూపక తప్పని దైన్యం!!!

కడపలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇంత భారీ మెజారిటీతో ఎలా గెలిచారు?

జనాలకు తెలియని ఒక అనామక గుర్తుతో రాజకీయ పార్టీలను ఎలా గంగవెర్రులెత్తించారు?

రాజకీయ అనుభవం లేకపోయినా రికార్డు స్థాయి మెజారిటీ ఎలా సొంతం అయింది?

వైఎస్‌ను మించిన మెజారిటీ ఎలా వచ్చింది?


vijayamaగత నెలరోజుల నుంచి జాతీయ స్థాయి మీడియా నుంచి జిల్లా మీడియా వర కూ అందరి దృష్టీ కడప ఉప ఎన్నికలపైనే. శుక్రవారం నాటి ఫలితాలు అందరి మైండ్లను బ్లాంక్‌ చేశాయి. చివరకు జగన్‌ శిబిరం కూడా ఊహించనంత భారీ మెజారిటీతో జగన్‌ విజయుడయ్యారు. రెండు ప్రధాన పార్టీలకు ధరావతు కూ డా దక్కకుండా చేశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, జాతీయ మీడియా కడపపైనే ఎక్కువ దృష్టి సారించింది. ఎందుకంటే.. అది కడప-ఢిల్లీకి జరుగుతున్న యుద్ధమని జగన్‌ ప్రకటించడమే కారణం. కడప ఎన్నికల ప్రచార తీరును నిశితంగా పరిశీలించిన సందర్భంలో జగన్‌ కు లక్ష లోపు మెజారిటీ రావచ్చన్న అభిప్రాయం వ్యక్తమయింది. కడపకు ఎన్ని కల పరిశీలన కోసం వచ్చిన జాతీయ మీడియా ప్రతినిధులు సైతం అలాంటి అంచనాకే వచ్చారు. కానీ, రాను రాను వైఎస్‌ మృతి సెంటిమెంట్‌, కడప ఆత్మ గౌరవ నినాదం పోలింగ్‌ నాటికి క్షేత్రస్థాయికి చేర్చడంలో జగన్‌ శిబిరం పన్నిన వ్యూహం ఫలితం రూపంలో మహాద్భుతంగా వెల్లడయ్యేసరికి రాష్ట్ర ప్రజలు విభ్రాంతి చెందవలసి వచ్చింది. ఆ మేరకు తన ఎన్నికలను పకడ్బందీగా రూ పొందించుకున్న జగన్‌ సఫలీకృతులయ్యారని చెప్పక తప్పదు. అధికార కాంగ్రెస్‌-ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తనపై ద్విముఖ దాడి చేసినా వాటిని అవలీలగా ఎదుర్కొని విజయతీరాలకు చేరిన జగన్‌ ముందస్తు ప్రణాళిక ను ప్రత్యరులు సైతం మెచ్చుకోక తప్పదు.

ప్రధానంగా.. మీడియాను ఏ విధంగా వినియోగించుకోవాలో జగన్‌ ఆచరణ లో చేసి చూపారు. తన విజయానికి మీడియాను ఓ నిచ్చెనగా వాడుకున్నారు. తన మీడియా సంస్థల ప్రతినిధులను ఒక నెలరోజుల ముందుగానే నియోజక వర్గాల్లో మోహరింపచేయడం కనిపించింది. వారి ని ప్రత్యర్ధులపై నిఘాకు వాడుకున్నారు. ప్రత్యర్ధి పార్టీలు, పోలీసు అధికారులను తన మీడియాతో హడలెత్తించారు. జగన్‌ పార్టీకి చెందిన వారిపై పోలీసు అధికారులు చేయి చేసు కోబోయినా దాన్ని తన మీడియా ద్వారా నానా యాగీ చేసి, మిగిలిన వారికి ఓ హెచ్చరిక సంకేతాలు పంపడంలో విజయం సాధించారు. సొంత మీడియా ప్రతి నిధుల ద్వారా స్థానికంగా ప్రజల పల్సు పట్టుకున్నారు. తన పార్టీ బలం, బలహీ నతలను రోజువారీ పద్ధతిలో సమీక్షించుకున్నారు. తనకు వ్యతిరేకమైనప్పటికీ, నిర్మొహమాటమైన నివేదికలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఆ మేరకు అందిన నివేదికల అంశాల్లోని లోపాలను సవరించుకున్నారు.

jagan2ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్‌-టీడీపీ నేతలను తన వైపు మళ్లించుకోగలిగారు. నియో జకవర్గ ఇన్చార్జులుగా తనకు నమ్మకమైన వారిని మాత్రమే నియమించు కున్నారు. డబ్బుల విషయం కచ్చితంగా వ్యవహరించారు. ఎక్కడ ఎక్కువ ఇవ్వా లో, ఎక్కడ సరిపడినంత ఇవ్వాలో ఆ మేరకు నిధుల పంపిణీలో జాగ్రత్తగా అడు గులు వేశారు. కాంగ్రెస్‌, టీడీపీ కంటే మూడు నెలల ముందు నుంచే జగన్‌ ప్రణాళిక రచించినట్లు ఎన్నికల వాతావరణం స్పష్టం చేసింది. ఆ రెండు పార్టీలు అభ్యర్ధుల ఎంపిక ప్రహసనం చివరివరకూ తేలని వైనాన్ని జగన్‌ చక్కగా విని యోగించుకున్నారు. అన్ని పార్టీల ప్రధాన నేతలు ప్రచారంలో కడపలో కాలు పెట్టేసరికే ఆయన రెండుసార్లు పర్యటించి వచ్చారు.ఇక ప్రచారంలోనూ జగన్‌ ప్రజల మనసులను తాకారు. ఆమేరకు ఆయన ఎన్నుకున్న నినాదం కడపలోని ప్రతి గడపనూ తట్టింది. ‘ఇది కడప ఆత్మ గౌర వానికీ-ఢిల్లీ అహంకారానికీ జరుగుతున్న యుద్ధం’ అని జగన్‌ తరచూ చేసిన వ్యాఖ్యలు సహజంగా పౌరుషానికి ప్రతీకలయిన కడప ఓటర్ల గుండెల్లో నాటు కుపోయాయి. అదే నినాదాన్ని ఆయన అనుచరులు గ్రామస్థాయికి తీసు కువెళ్ల డంలో విజయం సాధించారు. ఒక్కముక్కలో చెప్పాలంటే కడప గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ ఒక్కసారికి జగన్‌కు ఓటు వేయకపోతే వారిని పక్కని వారే శత్రువుగా చూడవలసిన మానసిక పరిస్థితిని కల్పించారు. కడప బిడ్డను ఢిల్లీ వాళ్లు అవమానించారన్న భావోద్వేగాన్ని బలంగా నాటుకుపోయేలా చేశా రు. ఈ భావన, ప్రభావం పొలింగ్‌ రోజు విస్పష్టంగా బయటపడింది. భావోద్వేగాన్ని ఓటుగా మలచుకోవడంలో జగన్‌ మహామహ పార్టీలనే నోరెళ్లబెట్టేలా చేశారు. మంత్రుల ప్రచారాన్ని సైతం తన భావోద్వేగాలకు అనుకూలంగా మలుచుకోవ డంలో విజయం సాధించారు.

తండ్రి లేని పిల్లవాడిని ఓడించడానికి డజన్ల సంఖ్యలో మంత్రులు వచ్చారన్న సానుభూతిని కసిగా మార్చి.. దానిని ఓటుగా మార్చుకోవడంలో జగన్‌ వ్యూహం సక్సెస్‌ అయినట్లు ఫలితాలలో వచ్చిన మెజా రిటీ రుజువు చేసింది. వైఎస్‌ అమలుచేసిన సంక్షేమ పథకా లకు కాంగ్రెస్‌ గ్రహ ణం పట్టించిందన్న ఆవేదనను సైతం ఓట్లుగా మలచుకున్నారు. నిజంగా అవన్నీ కాంగ్రెస్‌ పథకాలే అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాటిని ఎందుకు అమలుచేయలేదన్న ప్రశ్న సామాన్య జనంలోనూ వచ్చేలా ప్రచారం నడిపారు. తెలుగుదేశం-కాంగ్రెస్‌ మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకుందన్న ప్రచారాన్ని కింది స్థాయికి చేర్చగలిగారు. ప్రత్యర్థులు రాళ్లు వేసే కొద్దీ రాటు దేలారు. ఎవరు ఎన్ని చెప్పినా తను నమ్మిన వ్యూహాన్నే అమలు చేసి, రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించారు. అయితే, సానుభూతి పవనాలు రాజకీయ వాతావరణం లో ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కాలమనే ఉష్ణోగ్రతను అనుసరించి అది కరిగి పోతుంది. జగన్‌కు ఈ గెలుపు నైతికంగా గొప్ప ఊరట, ఉత్సాహమే కావచ్చు. కానీ ఈ విజయపరంపరను కొనసాగించి, రాష్ట్రాన్ని కడపగా మార్చాలంటే జగన్‌కు ఈ ఉత్సాహం ఒక్కటే సరిపోదన్నది నిష్ఠుర నిజం. ఎందుకంటే.. కడప- రాష్ట్రం లోని జిల్లాలు వేర్వేరు కాబట్టి!
 
కాంగ్రెస్, టీడీపీలను.. లాగి చెంపదెబ్బ కొట్టారు * ఉప ఎన్నికల్లో ప్రజా విజయంపై వైఎస్ జగన్ వ్యాఖ్య
 
ఈ ఫలితాలు రాష్ట్రంలో జరగబోయే మార్పునకు నాంది
వైఎస్ సువర్ణయుగం మళ్లీ తెస్తామనే మాకు పట్టం కట్టారు
ఈ ప్రభుత్వం పడిపోతే ప్రతి పేదోడి మొహంలో చిరునవ్వు ఉంటుంది
ఆ చిరునవ్వు కోసం ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రయత్నిస్తున్నా
మన ఖర్మకొద్దీ కాంగ్రెస్‌కు తెలుగుదేశం మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది
రైతుకు ‘మద్దతు’ కోసం 15న గుంటూరులో 48 గంటల దీక్ష చేపడుతున్నా
జూలై 8న ఇడుపులపాయలో పార్టీ ప్లీనరీ.. రెండు రోజుల మేధోమథనం


కడప, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ప్రజలు లాగి చెంప దెబ్బకొట్టారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో జరుగబోయే రాజకీయ మార్పునకు నాంది అని ఉద్ఘాటించారు. శుక్రవారం సాయంత్రం కడప ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందినట్లు ధ్రువపత్రం తీసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ వెంట ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డీసీ గోవిందరెడ్డి, రఘురామిరెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సురేష్‌బాబు తదితరులున్నారు. విలేకరుల సమావేశంలో జగన్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..

కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు


ఈ ఉప ఎన్నికల ఫలితాలు రాష్ర్టంలో రాబోయే మార్పునకు నాంది. కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని చెప్పి ప్రజలు దాన్ని లాగి చెంపదెబ్బ కొట్టారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మీద కపట ప్రేమ చూపిస్తూ, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఆ పార్టీకి ప్రజలు తమ ఓటుతో గుణపాఠం చెప్పా రు. టీడీపీ కూడా కాంగ్రెస్ లాగే డిపాజిట్లు కోల్పేయే పరిస్థితికి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ నైతిక విలువలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ప్రజల సమస్యలను గాలికి వదిలేసింది. మహానేత మరణించి రెండు సంవత్సరాలైనా ఆయనపైన బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేయడంతో ప్రజలు ఆ పార్టీని లాగి చెంపదెబ్బ కొట్టి బుద్ధిచెప్పారు.


సువర్ణయుగం మళ్లీ తెచ్చుకోవాలని..


వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగం మళ్లీ తీసుకురావడం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న విశ్వాసంతో.. ప్రజలు రాష్ట్రంలో జరగబోయే మార్పునకు నాంది పలుకుతూ... దేశ చరిత్రలోనే మర్చిపోలేని విధంగా తీర్పు ఇచ్చారు. ఇంతటి అపూర్వమైన తీర్పు ఇచ్చినందుకు, మనసునిండా ప్రేమాభిమానాలు చూపించినందుకు.. ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వా, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను. ఈ ఎన్నికల్లో మూడు అంశాలు నాకు అండగా ఉన్నాయి... దేవుడి దయ, నాన్న ఆశీస్సులు, నాన్నను ప్రేమించే ప్రతి గుండె నాకు తోడుగా ఉన్నాయి. వీరందరికీ చేతులు జోడించి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.


పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని..


మన ఖర్మకొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం అలయన్స్ పార్ట్‌నర్(మిత్ర పక్షం)గా వ్యవహరిస్తోంది. కాబట్టి ఈ ప్రభుత్వం పడిపోతుందని నేను అనుకోవడం లేదు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే అందరికంటే ఎక్కువగా హర్షించేది పేదవాడే. ఈ ప్రభుత్వం పోతే ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఆ చిరునవ్వు కోసం ఈ సర్కారును ఇంటికి పంపడానికి నా వంతు ప్రయత్నాలు నేను చేస్తున్నా. కానీ మన ఖర్మకొద్దీ కాంగ్రెస్‌కు తెలుగుదేశం మిత్రపక్షంగా ఉంది.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని మేల్కొలిపేందుకే దీక్ష


వరికి 1,030 మద్దతు ధర రావాల్సి ఉన్నా.. ఇప్పుడు *800కే అమ్ముకొనే అధ్వాన్న స్థితిలో రైతు సోదరులున్నారు. మద్దతు ధరతో వారికి భరోసా కల్పించాల్సిన ఈ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అవేమీ పట్టించుకోకుండా నిద్రపోతున్నాయి. వాటిని మేలుకొలుపే ప్రయత్నంలో భాగంగా ఈ నెల 15న గుంటూరులో 48 గంటలు దీక్ష ప్రారంభిస్తున్నాను.


జూలై 8న ప్లీనరీ

జూలై 8 నాన్న, దివంగత మహానేత పుట్టినరోజున ఇడుపులపాయలో ప్లీనరీ ఏర్పాటు చేస్తున్నాం. అందులో ప్రతి కార్యకర్త, ప్రతి నేత ఆలోచనలను తీసుకుంటాం. రెండు రోజులపాటు మేధోమథనం జరుపుతాం. ఆ తర్వాత మీడియాను పిలిచి.. పార్టీ తరఫున మేం ఏం చేయబోతున్నామనేదాన్ని విపులంగా చెబుతాం. వైఎస్‌ఆర్ పార్టీ జెండా చాలు.. పార్టీ ఎజెండా చెప్పకనే చెప్పినట్లు ఉంటుంది.

జగన్‌కు రికార్డు మెజారీటీ
పార్లమెంటు ఎన్నికల్లో గతంలో మూడు పర్యాయాలు రికార్డు మెజార్టీ నమోదయ్యాయి. అందు లో రెండుసార్లు నంధ్యాల పార్లమెంటు నియోజకవర్గంలో కాగా, ఒకసారి కడప పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇప్పుడు కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ కొత్త రికార్డు సృష్టించారు. 1991లో నంద్యాల పార్లమెంటు నియోజక వర్గం నుంచి సార్వత్రిక ఎన్నికల్లో గంగుల ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామక్రిష్ణారెడ్డిని 1,86,766 ఓట్ల మెజార్టీతో ఓడించారు. ఆ ఎన్నికల తర్వాత పివి నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యారు. ఆయన పార్లమెంటు కు ఎన్నిక కావాల్సివుండగా భద్రమైన సీటు కోసం అన్వేషిస్తుం డగా ఆయన కోసం గంగుల ప్రతాప్‌రెడ్డి పార్లమెంటు సభ్యత్వాన్ని త్యాగం చేశారు. ఆయన రాజీనామాతో అదే ఏడాది ఉప ఎన్ని కలు వచ్చాయి. పివి నరసింహారావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చే యగా తెలుగువాడు ప్రధాన మంత్రిగా ఉండి పోటీ చేస్తున్నారన్న గౌరవంతో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావు ఆయనపై తెలుగుదేశం అభ్యర్థి పోటీ పెట్టలేదు. ఆయన ఏ గ్రీవంగా ఎన్నికవుతారని భావిస్తున్న సమయంలో బిజెపి తమ పార్టీ అభ్యర్థిగా బంగారు లక్ష్మణ్‌ను పోటీకి దించింది. ఆయనపై పివి నరసింహారావు 5,80,038 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అదే ఇప్పటి దాకా కొనసాగుతున్న రికార్డు మెజార్టీ. 1996లో పివి నరసింహారావు తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయగా తెలుగుదేశం అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి పోటీ పడ్డారు. నాగిరెడ్డిపై ఆ ఎన్నికల్లో నరసింహారావుకు 98.530 ఓట్ల ఆధిక్యం లభించింది.

ఆ ఎన్నికల్లో ఇంకో చోట నుంచి కూడా పోటీచేసిన నరసింహారావు రెండు చోట్లా గెలవడంతో నంద్యాల పార్లమెంటుసభ్యత్వానికి రాజీనామా చేశారు. దాంతో ఉప ఎన్ని కలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి పోటీచేయగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగయ్య నాయుడు పోటీపడ్డారు. భూమానాగిరెడ్డికి 4,41,142 ఓట్ల మెజార్టీ లభించి రికార్డు సృష్టించారు. కడప పార్లమెంటు నియోజకవర్గంలో 1991 పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్‌కు 4,22,790 ఓట్ల మెజార్టీ లభించింది. తెలుగుదేశం అభ్యర్థి సి. రామచంద్రయ్యను కాం గ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన వైఎస్‌ ఓడించారు.

కడప ఉప ఎన్నికల్లో జగన్‌ మెజారిటీ
హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: ప్రతిష్టాత్మకంగా జరిగిన కడప లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్‌లో వై ఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి వైఎస్‌ జగన్‌ 5,45,672 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు మొత్తం ఓట్లు 6,92,251రాగా కాంగ్రె ెస్‌ పార్టీ అభ్యర్థికి డీఎల్‌ రవీంద్రారెడ్డికి 1, 46, 57 9 ఓట్లు వచ్చాయి,టీడీపీ అభ్యర్థి మైసూరరెడ్డికి 1,29,565 ఓట్లు వచ్చాయి. పులివెందుల అసెంబ్లీ అభ్యర్ధిగా వైఎస్‌ సతీమణి విజయలక్ష్మికి 85, 191 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. విజయమ్మకు మొత్తం 1,09,665 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి వైఎస్‌ వివేకానందరెడ్డికి 28,368, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి బీటెక్‌ రవికి 11,230 ఓట్లు లభించాయి. అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా జగన్మోహన్‌రెడ్డితోపాటు తెలుగు దేశం, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులకు దక్కిన ఓట్లు, జగన్‌కు లభించిన మెజా
రిటీలు నియోజకవర్గాల వారీగా ఇలా ఉన్నాయి.
జ‘గన్‌’! సోనియాకు షాక్‌!
అవును.. నిజం.. జగన్‌ చెప్పినట్లు కడప గెలిచింది. ఢిల్లీ ఓడింది. కడప ఆత్మగౌరవం నిలిచింది. ఢిల్లీ అహంకారం ఓడింది. శుక్రవారం వెలువడిన కడప లోక్‌సభ, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలు చాటిన సంకేతాలు ఇవే. కాంగ్రెస్‌-తెలుగుదేశం ఎంత పెనుగులాడినా జగన్‌-విజయలక్ష్మిని ఓడించలేకపోగా.. ఆ రెండు పార్టీలూ డిపాజిట్లు కూడా దక్కించుకోలేక చతికిలపడ్డాయి. కడప-పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి షాక్‌నిచ్చాయి. జగన్‌ విజయం ఖాయమన్న విషయం, సమాచారం అధినేత్రికి ఉన్నప్పటికీ, 5 లక్షల 40 వేల భారీ మెజారిటీతో విజయఢంకా మోగించి తన ముందే మీసం మెలేస్తారని సోనియా ఏ మాత్రం ఊహించలేకపోయారు. అధినేత్రికి వచ్చిన సమాచారం ప్రకారం జగన్‌ 2 లక్షల లోపు మెజారిటీతో గెలుస్తారని, కాంగ్రెస్‌ అభ్యర్ధి డీఎల్‌కు ద్వితీయ స్థానం వస్తుందని తెలిసింది.

jaganఈ స్ధాయిలో జగన్‌ విజయం సాధించడాన్ని సోనియా జీర్ణించుకోలేకపో తున్నారు. అసోం, కేరళ రాష్ట్రాల్లో సాధించిన విజయం కన్నా ఆంధ్రరాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ఎదురయిన భారీ ఓటమే సోనియాను కలవరపెడుతోంది. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల వైఫల్యాన్ని సోనియా తన ఖాతాలో జమ వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ అసమర్థత వల్లే జగన్‌కు అంత మెజారిటీ వచ్చిందని, వారిద్దరికీ సమన్వయం లేకనే జగన్‌ మెజారిటీ తగ్గించలేకపోయారన్న నిర్థరణకు రావలసి వచ్చింది.

దీన్ని బట్టి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు, ముఖ్యంగా సీనియర్లు గత కొంతకాలం నుంచి తనకు జగన్‌పై చేస్తున్న ఫిర్యాదులు, జగన్‌కు తండ్రి ఇమేజ్‌ తప్ప జనంలో బలం లేదంటూ పంపిన నివేదికలన్నీ అవాస్తవాలని సోనియా గ్రహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. వీరంతా కేవలం జగన్‌పై వ్యక్తిగత కక్షతో, రాజశేఖరరెడ్డిపై ఉన్న పాత కక్షలతోనే తనకు ఇలాంటి నివేదికలు పంపారని ఫలితాలు చాటిన విషయాన్ని ఆమె పరిగణనలోకి తీసుకోక తప్పని పరిస్థితిని ఉప ఎన్నికలు కల్పించాయి.

soniyaకడప-ఢిల్లీకి, ఆత్మగౌరవానికి-అహంకారానికీ మధ్య జరుగుతున్న ఎన్నికలంటూ జగన్‌ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మడంతో రాష్ట్రంలో సోనియాగాంధీకి ఇమేజ్‌ లేదని స్పష్టమయిపోయింది. కాంగ్రెస్‌ అభ్యర్ధి డీఎల్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఫొటోతో ప్రచారం చేసుకుంటే, జగన్‌ కేవలం వైఎస్‌ ఫొటోతోనే ప్రచారం చేసుకున్నారు. ప్రజలు మాత్రం వైఎస్‌ను ఆదరించి, సోనియాను తిరస్కరించడం కూడా రాష్ట్రంలో ఇకపై సోనియా బొమ్మకు ఆదరణ ఉండదని తేలిపోయింది.వివేకానందరెడ్డి తన ప్రచారంలో వైఎస్‌ ఫొటో తప్ప సోనియా ఫొటో ఫొటో వాడుకోలేదంటే సోనియా ఇమేజ్‌ ఏమిటన్నది స్పష్టమయిపోయింది.

తనను సవాల్‌ చేసిన జగన్‌ను ఎన్ని రకాలుగా వేధించి, వెన్నాడి ఆయనను ఓడించేందుకు ఎన్ని ప్రణాళికలు రూపొందించినా రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచి, తన ముందే పార్లమెంటులో మళ్లీ విజయదరహాసంతో అడుగుపెట్టబోవడాన్ని సోనియా అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. తనను సవాల్‌ చేసి, పార్టీ నుంచి వెళ్లడమే కాకుండా భారీ మెజారటీతో మరోసారి పార్లమెంటులో తనకు ఎదురుపడనున్న జగన్‌ ధీమాను సోనియా స్వయంగా చూడవలసి వస్తుంది. ఇది సోనియాను మరింత కలవరపరిచే అంశమే. 
 
 మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం  - జగన్, విజయమ్మ కృతజ్ఞతలు 
మనమంతా పెద్ద కుటుంబమని నిరూపించారు
మహానేత ఆశయాల కోసం తపించే మాకు అండగా నిలిచారు
దేశంలోనే ఇది ఒక చారిత్రక సంఘటన
ఇచ్చిన మాట తప్పే రాజకీయాలకు చరమగీతం ఈ విజయం
తెలుగుజాతి ఆత్మగౌరవానిది ఈ విజయం

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ జిల్లాలో కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ తమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. దాని పూర్తి పాఠం...


కడపలో గడప గడపకూ నమస్తే...

మహానేత వైఎస్ దూరమయ్యారని మేమంతా దుఃఖంలో కూరుకుపోయాం. కానీ ఆయన మాతోనే, మీలోనే ఉన్నారన్న నమ్మకం పదే పదే కలిగించారు. మమ్మల్ని పద్మవ్యూహంలో బంధించాలని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎదురొడ్డి పోరాడే ధైర్యాన్నిచ్చారు. మహానేత ఆశయాల కోసం అనుక్షణం తపించే మాకు కొండంత అండగా నిలబడ్డారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఉంచిన అచంచలమైన విశ్వాసానికి మేము సదా రుణపడి ఉంటాం. ఈ దేశ రాజకీయాలను మార్చే సత్తా ప్రజాస్వామ్యానికి మాత్రమే ఉందని మీరు మరొక్కసారి రుజువు చేశారు. మనమంతా నిజంగానే ఒక పెద్ద కుటుంబమని నిరూపించారు. దేశంలోనే ఇది ఒక చారిత్రక సంఘటన. ఇదొక చారిత్రక విజయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎవరి సానుభూతి అక్కర్లేదని ఈ రాష్ర్ట ప్రజలు ఎవరి అవమానాలను భరించరని, ఎవరి నమ్మక ద్రోహాన్ని సహించలేరని రాష్ర్ట ప్రజలందరి తరఫున కడపలో ప్రతి గడపా చాటి చెప్పింది. ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వాలు ఎప్పుడు నిర్లక్ష్యం చేసినా ప్రజలు చూస్తూ ఊరుకోరని ఈ విజయంతో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ఇచ్చిన మాట తప్పే రాజకీయాలకు చరమగీతం ఈ విజయం. విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం ఈ విజయం. మహానేత వైఎస్‌ఆర్‌కు నిజమైన నివాళి ఈ విజయం. తెలుగుజాతి ఆత్మగౌరవానిది ఈ విజయం.

ఇప్పుడు కడప చూపించిన దారి చరిత్రాత్మకమైనది. రాష్ట్ర రాజకీయాలకు ఇదొక మేలిమలుపు. తెలుగువారందరి దీవెనలతోనే ఈ చిరస్మరణీయమైన విజయం సాధ్యమైంది. ఈ రాష్ట్రంలో ప్రతి గడపా వైఎస్‌ను తమ వాడు అనుకోబట్టే వాళ్ల ఆశీస్సులు, ప్రేమ, ఆప్యాయత ఇంత గొప్ప విజయాన్ని అందించాయి. ప్రతిపక్షంలో ఉన్నామన్న మాట కూడా మరిచి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మొసలి కన్నీరు కారుస్తున్నారు కొందరు నేతలు. దివంగత నేత మనకు దూరమై రెండు సంవత్సరాలు అవుతున్నా, ఆ మహానేత తిరిగి రాలేడని, సమాధానం చెప్పలేడని తెలిసీ బురద చల్లటానికి మాత్రమే ప్రజా సమయాన్ని కేటాయిస్తున్న తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పేలా పిలుపునిచ్చారు కడప ప్రజలు. విలువలను, విశ్వసనీయతను మరచిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పారు. మహానేత వైఎస్‌ఆర్ ఆశయాలను, సువర్ణయుగాన్ని సాధించుకోగలమనే నమ్మకాన్ని ఓటు వేసి మరీ కలిగించారు.


రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పెను మార్పుకు నాంది పలికారు. ఏ పార్టీకైనా, నాయకుడికైనా మాట తప్పని, మడమ తిప్పని నైజమే నిజమైన నిర్వచనమని మీ తీర్పుతో నిరూపించారు. ఈ విజయం మనందరికీ గొప్ప ఆనందాన్ని తీసుకొచ్చింది. ఈ విజయమే వైఎస్‌ఆర్‌ను మళ్లీ జనంలో ఉదయించేలా చేసింది. ఈ విజయమే వైఎస్‌ఆర్ ఆశయాలను కొనసాగించాల్సిన గొప్ప బాధ్యతను కూడా గుర్తు చేసింది. ఈ విజయమే ఆ మహానేత కోరుకున్న హరితాంధ్రప్రదేశ్ సాధనకు బంగారు బాట వేసింది. మన జెండా... వైఎస్‌ఆర్ ఎజెండా. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జెండా మోసిన ఉద్యమకారులైన ఓటరు దేవుళ్లకు వందనం. తొలి అడుగులోనే పార్టీని ఇంత ఘన విజయంతో స్వాగతించిన అక్కకు, చెల్లికి, అవ్వకు, తాతకు, సోదరుడికి, స్నేహితులకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా శిరస్సు వంచి చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం.


ఇట్లు

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 
వైఎస్ విజయమ్మ

కడపలో జగన్, పులివెందులలో విజయమ్మ భారీ మెజార్టీ



కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ప్రజలు
లాగి చెంపదె బ్బ కొట్టారన్న జగన్
జూలై 8న వై.ఎస్.ఆర్. పార్టీ ప్లీనరీ

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ప్రజలు లాగి చెంపదెబ్బ కొట్టారని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు నేటి కడప ఎన్నికల ఫలితాలు నాంది అని ఆయన అన్నారు.


కడప, పులివెందుల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వై.ఎస్.వంటి మహానేతపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బురద చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ప్రభుత్వం ఉంటుందా, పడిపోతుందా అనే అంశంపై మీ వ్యూహం ఏమిటన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రభుత్వం పోతే సంతోషించేది ప్రజలేనని ఆయన వ్యాఖ్యానించారు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది కాబట్టి ఈ ప్రభుత్వం పడిపోతుందని ఎవరూ అనుకోనక్కరలేదని ఆయన భరోసా ఇచ్చారు.

రైతులకు ఈ ప్రభుత్వం కనీస మద్దతు ధర అందించలేకపోతున్నదని ఆయన నిప్పులు చెరిగారు. మద్దతు ధర అంటే ఏమిటని ప్రశ్నిస్తూ రైతుకు కనీస మద్దతు ధర రూ 1030 ఉంటే కనీసం రూ 890 కూడా రైతుకు దక్కడంలేదని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడుకోని ఉన్నాయి, రెండు ప్రభత్వాలు ఇప్పటికైనా మేలుకోవాలి అని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను ఈ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని ఆయన అన్నారు.

జూలై 8న వై.ఎస్. పుట్టిన రోజు కాబట్టి ఆ రోజున ఇడుపులపాయలో వై.ఎస్.ఆర్. ప్లీనరీ జరుగుతుందని, అందుకు మంచి పేరు పెట్టి మీడియా ప్రతినిధులు అందరినీ పిలిచి చెబుతామని ఆయన నవ్వుతూ చెప్పారు. వై.ఎస్.ఆర్. పార్టీ జండా చూస్తే చాలు పార్టీ అజెండా తెలిసిపోతుందని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం భవితవ్యం ఏమిటని మీడియా ప్రతినిధి ఒకరు మరీ మరీ ప్రశ్నించగా నేనూ ఆ పని మీదే ఉన్నానని ఆయన అన్నారు. నన్ను ఏమి చేయమంటావో చెప్పు, నేను ప్రతిపక్ష హోదాలోనే ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినందువల్ల ఏమీ చేయలేకపోతున్నా, ఈ ప్రభుత్వం పడిపోతే ప్రతి పేదవాడికి సంతోషం క లుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా ఇంటికి పంపుదామా అని నేనూ చూస్తున్నా, కాని కుదరడంలేదని ఆయన నవ్వుతూ మీడియా సమావేశం నుంచి నిష్క్రమించారు.

తమ పార్టీ విజయానికి ముఖ్యంగా ఆ దేవునికి, ఆశీస్సులు ఇచ్చిన నాన్నకు, వై.ఎస్.ను హృదయంలో ఉంచుకున్న ప్రతి మనిషికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన ప్రకటించారు.

  కడప లోక్‌సభలో 5,45,672 ఓట్ల మెజార్టీతో జగన్ విజయభేరి
పులివెందుల అసెంబ్లీలో విజయమ్మకు 81,373 ఓట్ల భారీ మెజార్టీ
పార్లమెంట్ పరిధిలో డిపాజిట్లు కోల్పోయిన డీఎల్, మైసూరా
మంత్రి డీఎల్‌కు దక్కింది లక్షా 46 వేల ఓట్లు మాత్రమే
మూడోస్థానంలో మైసూరాకు దక్కింది లక్షా 29వేల ఓట్లే
{పతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ జగన్‌కు భారీ మెజార్టీ
పులివెందులలో డిపాజిట్‌తో బయటపడ్డ వైఎస్ వివేకా...
డిపాజిట్ పోగొట్టుకున్న టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి

ఆత్మగౌరవానికి అందలం. దేశ చరిత్రలోనే అద్భుతంగా అభివర్ణించదగ్గ విజయం. హస్తిన అహంకారాన్ని తెలుగు ఆత్మగౌరవం అణగదొక్కిన చరిత్రాత్మక సంఘటన!! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కడప ప్రజలు దేశంలోనే మూడో అతి పెద్ద మెజారిటీ కట్టబెట్టారు. 2004లో పశ్చిమబెంగాల్‌లో సీపీఎం నేత అనిల్ బసు సాధించిన 5.92 లక్షల మెజారిటీ ఇప్పటిదాకా దేశంలోకెల్లా అత్యధికం. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు 1991లో నంద్యాల లోక్‌సభ స్థానంలో లభించిన 5.8 లక్షల మెజారిటీ రెండో స్థానంలో ఉంది. కానీ ఇవి రెండూ నల్లేరుపై నడక మాదిరిగా వచ్చిన అనాయాస విజయాలే. 2004లో బెంగాల్‌లో సీపీఎం ఉచ్ఛ దశలో ఉండగా, కాంగ్రెస్ కనీసం సోదిలో కూడా లేదు. బసు ఏకైక ప్రత్యర్థల్లా బలహీన బీజేపీ మాత్రమే. పీవీ విషయమూ అంతే. పైగా, ప్రధాని అనే ఉద్దేశంతో ఆయనపై టీడీపీ పోటీ కూడా పెట్టలేదు. బీజేపీయే నామమాత్రంగా బరిలో దిగింది. అదీగాక అప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కానీ కడప ఉప ఎన్నిక మాత్రం అక్షరాలా కురుక్షేత్రాన్ని తలపించింది.
అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ యువనేతతో హోరాహోరీ తలపడ్డాయి. విజయమే లక్ష్యంగా వందలాది కోట్లను మంచినీళ్లప్రాయంగా గుమ్మరించాయి. ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, ఏకంగా 20 మంది మంత్రులు, 70కి పైగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను మోహరించింది. కనీవినీ ఎరుగని స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడింది. చివరికి టీడీపీతో కూడా అంటకాగింది! పసుపు పార్టీ తరఫున కూడా 50 మంది దాకా ఎమ్మెల్యేలు కడప ప్రచార బరిలో దిగారు. ఇక, నైచ్యానికే నయా అర్థం చెబుతూ, పాలక-విపక్ష కూటమికి దన్నుగా ఎల్లో మీడియా ఎగజిమ్మిన విషం అంతా ఇంతా కాదు! మరోవైపు సీఎం, మాజీ సీఎం, విపక్ష నేత, ‘మెగా’స్టార్ వంటి అతిరథులు ప్రచారం పేరుతో తొడగొట్టారు. మీసం మెలేశారు. ఏకంగా మంత్రివర్యులే ఓటర్లను బెదిరింపులకు, భయాందోళనలకు గురిచేశారు. వీటన్నింటినీ మించి... ఉద్యమ నెలబాలుని వంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేందుకు జరిగిన కుయత్నాలు అన్నీ ఇన్నీ కావు! పార్టీ నేతలపై కనీవినీ ఎరగనన్ని బైండోవర్ కేసులు మోపారు. ఇన్నింటిని ఒంటరిగానే ఎదుర్కొని... పార్టీ గుర్తును కేవలం 17 రోజుల వ్యవధిలో ప్రజల్లోకి తీసుకెళ్లి... అధికార, విపక్షాలను నేరుగా ఢీకొట్టి... మూకుమ్మడిగా మట్టి కరిపించి... మేరు పర్వతానికి సరితూగే స్థాయిలో జగన్‌మోహన్‌రెడ్డి సాధించిన మెజారిటీ... అద్భుతం, అనితరసాధ్యం!

ఢిల్లీ దిమ్మ తిరిగింది.. కడప గడప తన సత్తా చాటింది.. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు నాంది పలికింది.. అహంకారానికీ, ఆత్మగౌరవానికీ.. ఢిల్లీకి, కడపకు.. సోనియాకు, వైఎస్‌కు జరిగిన ఈ ‘ఉప’ సమరంలో.. 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ, 28 ఏళ్ల తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కోల్పోయాయి. నెలల వయసున్న ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’.. చరిత్రాత్మక మెజార్టీతో విజయ దుందుభీ మోగించింది. కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ స్థానాలకు ఈ నెల 8న జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మలకు కడప ప్రజలు ఘన విజయాన్ని చేకూర్చారు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కడపలో జగన్ 5,45,672 ఓట్ల భారీ మెజారిటీతో చరిత్ర సృష్టించారు. పులివెందుల చరిత్రలో ముందెన్నడూ లేని 81,373 ఓట్ల అఖండ మెజారిటీతో వైఎస్ విజయలక్ష్మి రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా.. వైఎస్ వివేకానందరెడ్డి పులివెందుల శాసనసభ బరిలో డిపాజిట్ దక్కించుకున్నారు. పార్లమెంటు స్థానానికి జగన్‌తో పోటీ పడిన కాంగ్రెస్ అభ్యర్థి, మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, తెలుగుదేశం అభ్యర్థి ఎం.వి. మైసూరారెడ్డి డిపాజిట్లు సైతం కోల్పోయారు.
ఎన్ని ఆటంకాలు సృష్టించినా బెదరని కడప ప్రజలు

ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైన నాటి నుంచీ అధికార కాంగ్రెస్ పార్టీ పాల్పడని అక్రమాలు లేవు. చేయని అధికార దుర్వినియోగం లేదు. వైఎస్ జగన్‌కు స్వాగతం పలికినా, జై కొట్టినా వారి అంతుచూశారు. పోలీసులను ఉసిగొల్పి వైఎస్ అభిమానులను స్టేషన్లకు ఈడ్చుకెళ్లి చావబాదారు. ఎన్నడూ పోలీస్‌స్టేషన్ మొహం చూడని వారిపై కూడా బైండోవర్ కేసులు నమోదు చేశారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేనంతగా 10 వేల పైచిలుకు బైండోవర్ కేసులు నమోదు చేసి.. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ ప్రజల్లో భయాందోళనలు కలుగజేశారు. పోలింగ్ రోజున మరింత బీభత్సం జరుగుతుందనే వాతావరణం సృష్టించారు. మంత్రులు యావత్తూ జిల్లాలో తిష్ట వేసి మంత్రాంగం నడిపారు. జగన్, విజయలక్ష్మి పేర్లున్న వ్యక్తులతో నామినేషన్‌వేయించారు. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు నుండే డబ్బులు మంచినీళ్లలా ప్రవహింపజేశారు. ఓటర్లను కొనే ప్రయత్నం చేశారు. అయినా కడప ప్రజలు దేనికీ బెదరలేదు. డబ్బుకు ప్రలోభపడలేదు. ఎవరెన్ని చేసినా, ఎవరేమి చెప్పినా వినలేదు. ఉప్పెనలా పొంగి జగన్‌ను తమ ‘అభిమాన ఓటు’తో ముంచెత్తారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను చావుదెబ్బ కొట్టారు.


వైఎస్‌ను అధిగమించిన జగన్, విజయమ్మ


42 మంది అభ్యర్థులు పోటీచేసిన కడపలో జగన్‌కు 5,45,672 ఓట్ల భారీ ఆధిక్యత లభించింది. 1991 ఎన్నికల్లో, ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి లభించిన 4,22,790 ఓట్ల ఆధిక్యతను జగన్ అధిగమించారు. పులివెందుల శాసనసభ బరిలోనూ వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల ఆధిక్యతతో, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మెజార్టీని అధిగమించారు. కాగా కాంగ్రెస్ రంగంలోకి దించిన నకిలీ జగన్‌మోహన్‌రెడ్డిలందరికీ కలిపి సుమారు 15 వేల ఓట్లు వచ్చాయి. జగన్‌కు పడాల్సిన ఓట్లు పొరపాటున వారికి పడి ఉంటాయని, లేదంటే అంత మొత్తంలో వారికి ఓట్లు రావని విశ్లేషకులు చెబుతున్నారు. కడప లోక్‌సభకు మొత్తం 10,30,973 ఓట్లు పోలవగా.. జగన్‌కు 6,92,251 ఓట్లు వచ్చాయి. డీఎల్‌కు 1,46,579 ఓట్లు దక్కాయి. మైసూరారెడ్డికి 1,29,565 ఓట్లు వచ్చాయి. డిపాజిట్ దక్కాలంటే.. పోలైన ఓట్లలో కనీసం ఆరోవంతు (1,71,829) ఓట్లు రావాలి.


ప్రతి నియోజకవర్గంలోనూ భారీ ఆధిక్యత

కడప పార్లమెంటు పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో జగన్‌కు రికార్డు స్థాయి భారీ ఆధిక్యత లభించింది. 82.64 శాతం పోలింగ్ జరిగిన పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఆయనకు రికార్డు స్థాయిలో 1,08,177 ఓట్ల మెజార్టీ వచ్చింది. 76.49 శాతం పోలైన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు 74,771 ఓట్ల ఆధిక్యతనిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి సొంత నియోజకవర్గం మైదుకూరులో సైతం జగన్‌కు 70,147 ఓట్ల మెజార్టీ లభించింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో 83.18 శాతం పోలింగ్ జరగగా, అక్కడ వైఎస్ జగన్‌కు తెలుగుదేశం పార్టీపై 67,483 ఓట్ల ఆధిక్యత లభించింది.
84.58 శాతం పోలింగ్ జరిగిన కమలాపురం నియోజకవర్గంలో 65,882 ఓట్ల ఆధిక్యత లభించింది. 75.25 శాతం పోలింగ్ జరిగిన బద్వేలు నియోజకవర్గంలో 61,463 ఓట్ల మెజార్టీ లభించింది. ముస్లిం మైనార్టీలు నిర్ణాయక శక్తిగా ఉన్న కడప అసెంబ్లీ సెగ్మెంట్‌లో అతి తక్కువగా 61.57 శాతం పోలింగ్ జరిగినప్పటికీ.. జగన్‌కు 67, 785 ఓట్ల ఆధిక్యత రావడం విశేషం. ఓటింగ్‌లో అధికంగా పాల్గొన్న ముస్లిం మైనార్టీలంతా వైఎస్‌ఆర్ తనయుడివైపే నిలిచారనేందుకు ఇదో నిదర్శనం.

విజయమ్మకు భారీ ఆధిక్యత
విజయమ్మకు పులివెందుల ప్రజలు అఖండ మెజార్టీని అందించారు. ఇక్కడ 25 మంది అభ్యర్థులు పోటీ చయగా.. ఆమెకు 81,373 ఓట్ల ఆధిక్యత లభించింది. ఇక్కడ పోలైన 1,57,092 ఓట్లలో విజయమ్మకు 1,10,098 ఓట్లు లభించగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డికి 28,725 ఓట్లు లభించాయి. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) 11,239 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయారు.