* రూ. 2,400 ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని 5 నెలలు కావస్తున్నా ఒక్క పైసా ఇవ్వలేదు * వైఎస్ హయాంలో రూ.1,200 దాకా మద్దతు ధర వచ్చింది... * వ్యవసాయం దండగ.. తిన్నది అరగకే ఆత్మహత్యలన్న ఏకైక సీఎం చంద్రబాబు * నా దీక్షతోనైనా రాష్ట్రానికి బుద్ధి, కేంద్రానికి మనసు రావాలని కోరుకుంటున్నా * అశేష జన సందోహం మధ్య ముగిసిన జగన్ రైతు దీక్ష... ![]() రైతు సమస్యల పరిష్కారం కోసం గుంటూరులో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష(రైతు దీక్ష) ముగింపు సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రైతు వెంకటసుబ్బయ్య గ్లూకోజ్ కలిపిన కొబ్బరినీళ్లు ఇచ్చి జగన్‌తో దీక్ష విరమింపజేశారు. దీనికి ముందు జగన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. వైఎస్‌ఆర్ పాలన సువర్ణయుగం ![]() రైతు ప్రభుత్వం వస్తేనే రైతు గురించి ఆలోచన చేస్తుంది. రైతు గురించి ఆలోచన చేస్తే రైతు మొహాన చిరునవ్వు ఉంటుందని నమ్మితేనే.. రాష్ట్ర ప్రభుత్వం, రైతన్న బాగుంటారు. అలా రైతు గురించి తెలిసిన వ్యక్తి, రైతు గురించి ఆలోచించిన వ్యక్తి వైఎస్సారే.. రైతు ముఖాన చిరునవ్వులు చూసిన ప్రభుత్వం వైఎస్సార్‌దే. ఆ ఐదేళ్లలో దేశం మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.5 శాతం పెరిగితే... మన రాష్ట్రంలో 6.78 శాతం పెరుగుదల నమోదైందని చెప్పడానికి నేను గర్విస్తున్నా. ![]() ఆ ఏకైక సీఎం చంద్రబాబు వైఎస్ సువర్ణయుగానికి ముందు ఒకాయన రాష్ట్రాన్ని పాలించాడు. ఆయన పేరు చంద్రబాబు. తొమ్మిదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన ఆయన తన హయాంలో రైతులకేం చేయలేదుగానీ... ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తూ వారి వద్దకు వెళుతున్నారు. తన హయాంలో వ్యవసాయమే శుద్ధ దండగ అని అన్నారాయన. అలా అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటే.. తిన్నది అరగక చనిపోయారని అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ మాటెత్తితే.. ఆ కరెంటు ఇచ్చే తీగలలో కరెంటు ఉండదు కాబట్టి తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళన చేశారు. అదే చంద్రబాబు ఇవాళ రోడ్డెక్కి అధికార దాహంతో ఇష్టం వచ్చినట్లు మాటలిస్తున్నారు. మొసలి కన్నీరు కారుస్తూ.. రైతుల వద్దకెళ్ళి ఆరు గంటలేం ఖర్మ.. ఏకంగా తొమ్మిది గంటలపాటు ఉచితంగా విద్యుత్ ఇస్తామంటున్నారు. నేను కదిలే వరకూ.. బాబు కదలరు ఎన్నో ఏళ్లుగా రైతులు కష్టాలు పడుతుంటే.. స్పందించని చంద్రబాబుకు.. జగన్ అనే నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రోజున మెలకువ వచ్చింది. అప్పటి నుంచి ఆయనను గమనిస్తే ఏదైనా సమస్యపై ఉద్యమిస్తానని వైఎస్ జగన్ నోటి నుంచి మాట వచ్చిన వెంటనే.. నేనూ యాత్ర చేస్తా నీతోపాటు అంటాడు. నాకు నవ్వు వ స్తోంది. రైతులు పడుతున్న కష్టాల గురించి దీక్ష చేయాలనుకుంటున్నట్లు నేను ఒక పత్రికా ప్రకటన ఇచ్చిన మూడు నాలుగు గంటలకు ఆయన నిద్ర మేల్కొని రైతుల వద్దకు వచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇంతకాలం నాకైతే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసం 40 రోజులు రాత్రింబవళ్ళూ తిరుగుతున్నా. ఆయనకు ఏం పనుంది.. ఇంతకాలం ఏసీ గదుల్లో పడుకునే బదులు నేను దీక్ష చేపట్టకముందే రైతుల గురించి ఉద్యమించవచ్చు కదా! ఈ రోజు ఆ చంద్రబాబు తెలుగుదేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయ్యాయి. ప్రజలు జగన్‌వైపు పోతున్నారనుకున్న సమయంలో.. రైతులకోసం చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తూ ఉద్యమ బాట పడుతున్నారు. ![]() వైఎస్ స్వర్ణయుగం గురించి, చంద్రబాబు మొసలికన్నీరు గురించి చెప్పుకున్నాం.. ఇంకో ప్రభుత్వం ఉంది.. అది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం. మొన్న రైతు సమస్యలపై విజయవాడలో లక్షల మంది రైతులతో కలసి నేను దీక్ష చేస్తూ రూ. 4వేలు ఇన్‌పుట్ సబ్సిడీ అడిగితే రూ. 2,400 ఇవ్వడానికి అంగీకరించి దానికోసం రూ. 618కోట్లు ఇస్తామని చెప్పి ఐదు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. సిగ్గులేదీ ప్రభుత్వానికి. ఇంతేకాకుండా రైతులకు రుణ వడ్డీ మాఫీ చేస్తామన్నారు. వడ్డీ మాఫీ కావాలని అంటే రూ. 1,100 కోట్ల రుణానికి దాదాపుగా రూ. 525 కోట్లను బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించాలి. చెల్లించకపోతే అవి వడ్డీనెలా మాఫీ చేస్తాయి. ప్రభుత్వం నేటివరకు బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక రుణాల రీషెడ్యూల్ 10% కూడా చేయలేని పరిస్థితి కనపడుతోంది. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనొచ్చుకదా ధాన్యం కొనుగోలు చేస్తే నిల్వ చేయడానికి స్థలం సరిపోవడంలేదని, స్థలం లేకపోతే తామిక ధాన్యం కొనలేని పరిస్థితి వస్తుందని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. తమ వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని ఎగుమతులకు అనుమతించాల్సిందిగా కేంద్రానికి సూచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 4 నెలలుగా వారు కోరుతున్నా సర్కారుకు పట్టడం లేదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా మనతో సమానంగా ధాన్యం పండిస్తున్నారు. వారికి లేని సమస్య మనకెందుకు వస్తుందని నేను అడుగుతున్నా. పంజాబ్‌లో పండించిన ధాన్యంలో 94.2 శాతాన్ని సివిల్ సప్లరుుస్, కోఆపరేటివ్ సంస్థ, స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి విక్రయిస్తుంది. ఈ ప్రయత్నం మనరాష్ట్రంలో ఎందుకు జరగడం లేదు? అసలు ఎగుమతులను రాష్ట్రప్రభుత్వమే ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తున్నా. మద్దతు ధర 100 పెంచాలి ఓ రకంగా చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు ఇస్తానన్న మద్దతు ధర రూ. 1000 కూడా సరిపోదు.. దాన్ని కచ్చితంగా 100 రూపాయలైనా పెంచి రూ.1100 చేయాలని నేను కోరుతున్నా. అంతేకాదు ఖరీఫ్‌లో ధాన్యానికి క్వింటాల్‌కు కేంద్ర ధరల నిర్ణాయక కమిటీ రూ.167 పెంచుతూ సిఫార్సు చేసింది. రబీలో పండిన పంటకు కూడా దీనిని వర్తింపజేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. స్వర్ణయుగం మనమే తెచ్చుకుందాం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి రెండు సంవత్సరాలు కావస్తోంది. ఆయనలా.. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని, తనపేరు వాళ్ళ గుండెల్లో, హృదయాల్లో కొలువుండాలని, చనిపోయిన తరువాత వారి గుండెల్లో నిలిచిపోవాలని, తన ఫొటో వారి ఇళ్లలో ఉండాలని.. అంతగా ప్రతి పేదవాడికి దగ్గరగా ఉండాలనే తపన ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికీ లేదు. రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు. ప్రతి రైతు, ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వును చూసిన.. వైఎస్ స్వర్ణయుగాన్ని మనమే తెచ్చుకుందాం. పెట్రో ధరలతో దొంగ దెబ్బ తీశారు: ఐదు రాష్ట్రాలలో ఎన్నికల అనంతరం పెట్రోలుపై రూ.5 వాత వేసి ప్రభుత్వం ప్రజలను దొంగదెబ్బ తీసింది. సంవత్సరానికి ఎనిమిది సార్లు రేట్లు పెంచి రూ.15 మేర భారం వేసింది. ఇది సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నా? ఇది రైతుల గురించి చేపట్టిన దీక్ష కాబట్టి.. ఈ విషయంపై ఇంతకుమించి ఇక్కడ మాట్లాడను. ఉప్పొంగిన గుంటూరు * ముగింపు రోజున జనసంద్రంగా మారిన రైతుదీక్ష ప్రాంగణం |
![]() ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభించిన జగన్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష విరమించారు. తనను కలిసేందుకు, వినతిపత్రాలు ఇచ్చేందుకు, కరచాలనం చేసేందుకు వచ్చిన జనాన్ని జగన్ ఆప్యాయంగా పలకరించారు. మూడ్రోజులపాటు రైతులు క్యూలో నిల్చుని జగన్‌ను కలిసి, తమ గోడును వెల్లబోసుకున్నారు. వీటిలో కొన్నింటికి జగన్ తక్షణమే పరిష్కారం చూపారు. సోమవారం వెంగమాంబ కోల్డ్ స్టోరేజీ అగ్నిప్రమాద బాధిత రైతులు సమస్యను విన్నవించిన క్షణాల్లోనే జగన్.. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌కు ఫోన్ చేశారు. మిర్చి రైతులకు న్యాయం చేయాలని, ప్రతి ఒక్కరికీ పరిహారం అందించాలని కోరారు. ఈ సమస్య పరిష్కారమయ్యేవరకూ సంప్రదింపులు జరపాలని జిల్లా నేతలకు సూచించారు. జనమే జనం: రైతు దీక్షాప్రాంగణం చివరిరోజు జనసంద్రంగా మారింది. గుంటూరు జిల్లాతోపాటు, కృష్ణా, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వేలాది మంది రైతులు తరలి వచ్చారు. ఉదయం 7.30 గంటల నుంచే నేతల ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. దీక్ష విరమణ: గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రైతు వెంకటసుబ్బయ్య కొబ్బరి నీళ్లు అందించి జగన్‌తో దీక్ష విరమింపజేశారు. మద్దతు ధరలేక 960 బస్తాల ధాన్యాన్ని బస్తా ఒక్కింటికి రూ. 680కు అమ్ముకున్న సుబ్బయ్యకు సుమారు రూ. 5 లక్షల నష్టం వచ్చిం ది. జగన్‌తోపాటు ఆయనా నిరాహార దీక్ష చేశారు. భారీగా తరలివచ్చిన నేతలు: జగన్ చేపట్టిన రైతుదీక్షకు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. మూడ్రోజులపాటు సాగిన ఈ దీక్షకు మొత్తం ఇద్దరు పార్లమెంటు సభ్యులు, 19 మంది శాసనసభ్యులు, ఆరుగురు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తరలివచ్చారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు ఎమ్మెల్యే), కొండా సురేఖ (పరకాల ఎమ్మెల్యే), ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత (పత్తిపాడు), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), గొర్ల బాబురావు (పాయకరావుపేట), అమరనాథ్‌రెడ్డి (రాజంపేట), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), శేషారెడ్డి (అనపర్తి), కె.శ్రీనివాసులు (రైల్వే కోడూరు), ఎం.ప్రసాదరాజు (నర్సాపురం), బూచేపల్లి శివప్రసాదరెడ్డి (దర్శి), పి.ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కొవ్వూరు), కొర్ల భారతి (టెక్కలి), ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ), పిల్లి సుభాష్‌చంద్రబోస్ (రామచంద్రాపురం), తెల్లం బాలరాజు (పోలవరం), ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, జూపూడి ప్రభాకర్, పుల్లా పద్మావతి, కొండా మురళి, దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు హాజరయ్యారు. జగన్‌కు జన వీడ్కోలు దీక్ష విరమించిన జగన్‌కు జిల్లా ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. వేలాది మంది జగన్‌ను అనుసరిస్తూ పయనమయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ జగన్ గుంటూరు నుంచి మధ్యాహ్నం ఏలూరు బయల్దేరి వెళ్లారు. |
|
జగన్ చెబితే అరగంటలో రాజీనామా ![]() - అనకాపల్లి ఎంపీ సబ్బం హరి ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం ![]() - నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి రైతుల కన్నీటిలో కొట్టుకుపోతుంది ![]() -మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ వైఎస్సార్ కాంగ్రెస్‌కు పట్టం ఖాయం ![]() - ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి కాంగ్రెస్‌కు చర మగీతం పాడండి ![]() -ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి జగనే వారసుడని నిరూపించారు.. ![]() -ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు కిరణ్ కోసం పదవి వదులుకుంటారా? ![]() - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు దేశానికే ఆదర్శం వైఎస్.. ![]() -వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ |
మహానేత మనసా వాచా ఆచరించి చూపించిన సంక్షేమ పథాన్నే జెండాగా మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Tuesday, May 17, 2011
రైతుల మేలు కోరని దగాకోరు సర్కారు * రైతన్నల సమస్యలపట్ల నిర్లక్ష్యంపై జగన్ ధ్వజం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment