ఉత్కంఠ వీడింది. ఉద్వేగం మిగిలింది. జనం జాగృతమైంది. నేతలు నివ్వెరపోయారు. నాయకులు తలచిందొకటి. నిర్ణేతలు చేసిందొకటి. ఊహల ఊయలల తాళ్లు తెగిపడ్డారుు. నిజాల నిష్ఠూరాలు ఎగిరిపడ్డారుు. మినీ సంగ్రామంలో మహా యుద్ధమే జరిగింది. రెండు మహా సామ్రాజ్యాలు కూలారుు. వామపక్ష వీరులు నిర్వీర్యులైపోయారు. యుద్ధానికి ముందే చేతులెత్తేశారు. అనుకున్నంతా అరుుంది. కమ్యూనిస్టుల కోటలు ఫెళ్లున నేల కూలారుు. పశ్చిమ బెంగాల్ లెఫ్ట్ చేజారింది. ేకరళలోనూ అదే పరిస్థితి. ఇక తమిళ సామ్రాజ్యంలో కరుణానిధికి దారుణమైన పరాభవం మిగిలింది. జయలలిత చేతిలో చావు దెబ్బ తగిలింది. ఇక రేపటి నుంచి ఆయనకు కష్టకాలమే. అసోంలో కాంగ్రెస్ పార్టీ పరువు దక్కించుకుంది. వరసగా మూడోసారి తరుణ్ గొగోయ్ ప్రజాభిమానాన్ని నిలబెట్టుకున్నారు. ేకరళలో కాంగ్రెస్ మళ్లీ కొత్త శకం ప్రారంభించబోతోంది. అది అదనపు బోనస్. పుదుచ్చేరిలోనూ జయలలిత హవాయే. ఇక కడప వ్యవహారం..జగన్ సునామీ ముందు అంతా కొట్టుకుపోయారు. డిపాజిట్లు గల్లంతు చేసుకుని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జగన్ మెజారిటీ సాధనలో జాతీయ రికార్డును తృటిలో కోల్పోయారు. పులివెందులలో ఆయన తల్లి విజయమ్మ కూడా అఖండ విజయం సాధించారు.
ఏతావాతా రాష్ట్రంలో మున్ముందు రాజకీయ సునామీకి ఈ ఉప ఎన్నిక బీజాలు వేసే అవకాశాలున్నారుు. అవతల మార్క్సిస్టులు..ఇటు కరుణానిధి..ఇక్కడ కిరణ్ ప్రభుత్వం..ఈ వేసవి ముగిసేలోగానే రాజకీయ వడగాలికి రెపరెపలాడే ప్రమాదం కనిపిస్తున్నది. విజేతలైన మమత..జయలలిత..జగన్..ముగ్గురూ ముగ్గురే. ప్రతీకారానికి.. మహోద్వేగానికి..వెన్ను చూపని తత్త్వం వీరిది. అందుేక ప్రత్యర్థులు వెన్ను చూపక తప్పని దైన్యం!!!

కడపలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇంత భారీ మెజారిటీతో ఎలా గెలిచారు?
జనాలకు తెలియని ఒక అనామక గుర్తుతో రాజకీయ పార్టీలను ఎలా గంగవెర్రులెత్తించారు?
రాజకీయ అనుభవం లేకపోయినా రికార్డు స్థాయి మెజారిటీ ఎలా సొంతం అయింది?
వైఎస్‌ను మించిన మెజారిటీ ఎలా వచ్చింది?
గత నెలరోజుల నుంచి జాతీయ స్థాయి మీడియా నుంచి జిల్లా మీడియా వర కూ అందరి దృష్టీ కడప ఉప ఎన్నికలపైనే. శుక్రవారం నాటి ఫలితాలు అందరి మైండ్లను బ్లాంక్ చేశాయి. చివరకు జగన్ శిబిరం కూడా ఊహించనంత భారీ మెజారిటీతో జగన్ విజయుడయ్యారు. రెండు ప్రధాన పార్టీలకు ధరావతు కూ డా దక్కకుండా చేశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, జాతీయ మీడియా కడపపైనే ఎక్కువ దృష్టి సారించింది. ఎందుకంటే.. అది కడప-ఢిల్లీకి జరుగుతున్న యుద్ధమని జగన్ ప్రకటించడమే కారణం. కడప ఎన్నికల ప్రచార తీరును నిశితంగా పరిశీలించిన సందర్భంలో జగన్ కు లక్ష లోపు మెజారిటీ రావచ్చన్న అభిప్రాయం వ్యక్తమయింది. కడపకు ఎన్ని కల పరిశీలన కోసం వచ్చిన జాతీయ మీడియా ప్రతినిధులు సైతం అలాంటి అంచనాకే వచ్చారు. కానీ, రాను రాను వైఎస్ మృతి సెంటిమెంట్, కడప ఆత్మ గౌరవ నినాదం పోలింగ్ నాటికి క్షేత్రస్థాయికి చేర్చడంలో జగన్ శిబిరం పన్నిన వ్యూహం ఫలితం రూపంలో మహాద్భుతంగా వెల్లడయ్యేసరికి రాష్ట్ర ప్రజలు విభ్రాంతి చెందవలసి వచ్చింది. ఆ మేరకు తన ఎన్నికలను పకడ్బందీగా రూ పొందించుకున్న జగన్ సఫలీకృతులయ్యారని చెప్పక తప్పదు. అధికార కాంగ్రెస్-ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తనపై ద్విముఖ దాడి చేసినా వాటిని అవలీలగా ఎదుర్కొని విజయతీరాలకు చేరిన జగన్ ముందస్తు ప్రణాళిక ను ప్రత్యరులు సైతం మెచ్చుకోక తప్పదు.
ప్రధానంగా.. మీడియాను ఏ విధంగా వినియోగించుకోవాలో జగన్ ఆచరణ లో చేసి చూపారు. తన విజయానికి మీడియాను ఓ నిచ్చెనగా వాడుకున్నారు. తన మీడియా సంస్థల ప్రతినిధులను ఒక నెలరోజుల ముందుగానే నియోజక వర్గాల్లో మోహరింపచేయడం కనిపించింది. వారి ని ప్రత్యర్ధులపై నిఘాకు వాడుకున్నారు. ప్రత్యర్ధి పార్టీలు, పోలీసు అధికారులను తన మీడియాతో హడలెత్తించారు. జగన్ పార్టీకి చెందిన వారిపై పోలీసు అధికారులు చేయి చేసు కోబోయినా దాన్ని తన మీడియా ద్వారా నానా యాగీ చేసి, మిగిలిన వారికి ఓ హెచ్చరిక సంకేతాలు పంపడంలో విజయం సాధించారు. సొంత మీడియా ప్రతి నిధుల ద్వారా స్థానికంగా ప్రజల పల్సు పట్టుకున్నారు. తన పార్టీ బలం, బలహీ నతలను రోజువారీ పద్ధతిలో సమీక్షించుకున్నారు. తనకు వ్యతిరేకమైనప్పటికీ, నిర్మొహమాటమైన నివేదికలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఆ మేరకు అందిన నివేదికల అంశాల్లోని లోపాలను సవరించుకున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్-టీడీపీ నేతలను తన వైపు మళ్లించుకోగలిగారు. నియో జకవర్గ ఇన్చార్జులుగా తనకు నమ్మకమైన వారిని మాత్రమే నియమించు కున్నారు. డబ్బుల విషయం కచ్చితంగా వ్యవహరించారు. ఎక్కడ ఎక్కువ ఇవ్వా లో, ఎక్కడ సరిపడినంత ఇవ్వాలో ఆ మేరకు నిధుల పంపిణీలో జాగ్రత్తగా అడు గులు వేశారు. కాంగ్రెస్, టీడీపీ కంటే మూడు నెలల ముందు నుంచే జగన్ ప్రణాళిక రచించినట్లు ఎన్నికల వాతావరణం స్పష్టం చేసింది. ఆ రెండు పార్టీలు అభ్యర్ధుల ఎంపిక ప్రహసనం చివరివరకూ తేలని వైనాన్ని జగన్ చక్కగా విని యోగించుకున్నారు. అన్ని పార్టీల ప్రధాన నేతలు ప్రచారంలో కడపలో కాలు పెట్టేసరికే ఆయన రెండుసార్లు పర్యటించి వచ్చారు.ఇక ప్రచారంలోనూ జగన్ ప్రజల మనసులను తాకారు. ఆమేరకు ఆయన ఎన్నుకున్న నినాదం కడపలోని ప్రతి గడపనూ తట్టింది. ‘ఇది కడప ఆత్మ గౌర వానికీ-ఢిల్లీ అహంకారానికీ జరుగుతున్న యుద్ధం’ అని జగన్ తరచూ చేసిన వ్యాఖ్యలు సహజంగా పౌరుషానికి ప్రతీకలయిన కడప ఓటర్ల గుండెల్లో నాటు కుపోయాయి. అదే నినాదాన్ని ఆయన అనుచరులు గ్రామస్థాయికి తీసు కువెళ్ల డంలో విజయం సాధించారు. ఒక్కముక్కలో చెప్పాలంటే కడప గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ ఒక్కసారికి జగన్‌కు ఓటు వేయకపోతే వారిని పక్కని వారే శత్రువుగా చూడవలసిన మానసిక పరిస్థితిని కల్పించారు. కడప బిడ్డను ఢిల్లీ వాళ్లు అవమానించారన్న భావోద్వేగాన్ని బలంగా నాటుకుపోయేలా చేశా రు. ఈ భావన, ప్రభావం పొలింగ్ రోజు విస్పష్టంగా బయటపడింది. భావోద్వేగాన్ని ఓటుగా మలచుకోవడంలో జగన్ మహామహ పార్టీలనే నోరెళ్లబెట్టేలా చేశారు. మంత్రుల ప్రచారాన్ని సైతం తన భావోద్వేగాలకు అనుకూలంగా మలుచుకోవ డంలో విజయం సాధించారు.
తండ్రి లేని పిల్లవాడిని ఓడించడానికి డజన్ల సంఖ్యలో మంత్రులు వచ్చారన్న సానుభూతిని కసిగా మార్చి.. దానిని ఓటుగా మార్చుకోవడంలో జగన్ వ్యూహం సక్సెస్ అయినట్లు ఫలితాలలో వచ్చిన మెజా రిటీ రుజువు చేసింది. వైఎస్ అమలుచేసిన సంక్షేమ పథకా లకు కాంగ్రెస్ గ్రహ ణం పట్టించిందన్న ఆవేదనను సైతం ఓట్లుగా మలచుకున్నారు. నిజంగా అవన్నీ కాంగ్రెస్ పథకాలే అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాటిని ఎందుకు అమలుచేయలేదన్న ప్రశ్న సామాన్య జనంలోనూ వచ్చేలా ప్రచారం నడిపారు. తెలుగుదేశం-కాంగ్రెస్ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుందన్న ప్రచారాన్ని కింది స్థాయికి చేర్చగలిగారు. ప్రత్యర్థులు రాళ్లు వేసే కొద్దీ రాటు దేలారు. ఎవరు ఎన్ని చెప్పినా తను నమ్మిన వ్యూహాన్నే అమలు చేసి, రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించారు. అయితే, సానుభూతి పవనాలు రాజకీయ వాతావరణం లో ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కాలమనే ఉష్ణోగ్రతను అనుసరించి అది కరిగి పోతుంది. జగన్‌కు ఈ గెలుపు నైతికంగా గొప్ప ఊరట, ఉత్సాహమే కావచ్చు. కానీ ఈ విజయపరంపరను కొనసాగించి, రాష్ట్రాన్ని కడపగా మార్చాలంటే జగన్‌కు ఈ ఉత్సాహం ఒక్కటే సరిపోదన్నది నిష్ఠుర నిజం. ఎందుకంటే.. కడప- రాష్ట్రం లోని జిల్లాలు వేర్వేరు కాబట్టి!
కాంగ్రెస్, టీడీపీలను.. లాగి చెంపదెబ్బ కొట్టారు * ఉప ఎన్నికల్లో ప్రజా విజయంపై వైఎస్ జగన్ వ్యాఖ్య
ఈ ఫలితాలు రాష్ట్రంలో జరగబోయే మార్పునకు నాంది
వైఎస్ సువర్ణయుగం మళ్లీ తెస్తామనే మాకు పట్టం కట్టారు
ఈ ప్రభుత్వం పడిపోతే ప్రతి పేదోడి మొహంలో చిరునవ్వు ఉంటుంది
ఆ చిరునవ్వు కోసం ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రయత్నిస్తున్నా
మన ఖర్మకొద్దీ కాంగ్రెస్‌కు తెలుగుదేశం మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది
రైతుకు ‘మద్దతు’ కోసం 15న గుంటూరులో 48 గంటల దీక్ష చేపడుతున్నా
జూలై 8న ఇడుపులపాయలో పార్టీ ప్లీనరీ.. రెండు రోజుల మేధోమథనం
కడప, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ప్రజలు లాగి చెంప దెబ్బకొట్టారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో జరుగబోయే రాజకీయ మార్పునకు నాంది అని ఉద్ఘాటించారు. శుక్రవారం సాయంత్రం కడప ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందినట్లు ధ్రువపత్రం తీసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ వెంట ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డీసీ గోవిందరెడ్డి, రఘురామిరెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సురేష్‌బాబు తదితరులున్నారు. విలేకరుల సమావేశంలో జగన్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..
కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు
ఈ ఉప ఎన్నికల ఫలితాలు రాష్ర్టంలో రాబోయే మార్పునకు నాంది. కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని చెప్పి ప్రజలు దాన్ని లాగి చెంపదెబ్బ కొట్టారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మీద కపట ప్రేమ చూపిస్తూ, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఆ పార్టీకి ప్రజలు తమ ఓటుతో గుణపాఠం చెప్పా రు. టీడీపీ కూడా కాంగ్రెస్ లాగే డిపాజిట్లు కోల్పేయే పరిస్థితికి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ నైతిక విలువలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ప్రజల సమస్యలను గాలికి వదిలేసింది. మహానేత మరణించి రెండు సంవత్సరాలైనా ఆయనపైన బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేయడంతో ప్రజలు ఆ పార్టీని లాగి చెంపదెబ్బ కొట్టి బుద్ధిచెప్పారు.
సువర్ణయుగం మళ్లీ తెచ్చుకోవాలని..
వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగం మళ్లీ తీసుకురావడం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న విశ్వాసంతో.. ప్రజలు రాష్ట్రంలో జరగబోయే మార్పునకు నాంది పలుకుతూ... దేశ చరిత్రలోనే మర్చిపోలేని విధంగా తీర్పు ఇచ్చారు. ఇంతటి అపూర్వమైన తీర్పు ఇచ్చినందుకు, మనసునిండా ప్రేమాభిమానాలు చూపించినందుకు.. ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వా, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను. ఈ ఎన్నికల్లో మూడు అంశాలు నాకు అండగా ఉన్నాయి... దేవుడి దయ, నాన్న ఆశీస్సులు, నాన్నను ప్రేమించే ప్రతి గుండె నాకు తోడుగా ఉన్నాయి. వీరందరికీ చేతులు జోడించి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని..
మన ఖర్మకొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం అలయన్స్ పార్ట్‌నర్(మిత్ర పక్షం)గా వ్యవహరిస్తోంది. కాబట్టి ఈ ప్రభుత్వం పడిపోతుందని నేను అనుకోవడం లేదు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే అందరికంటే ఎక్కువగా హర్షించేది పేదవాడే. ఈ ప్రభుత్వం పోతే ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఆ చిరునవ్వు కోసం ఈ సర్కారును ఇంటికి పంపడానికి నా వంతు ప్రయత్నాలు నేను చేస్తున్నా. కానీ మన ఖర్మకొద్దీ కాంగ్రెస్‌కు తెలుగుదేశం మిత్రపక్షంగా ఉంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని మేల్కొలిపేందుకే దీక్ష
వరికి 1,030 మద్దతు ధర రావాల్సి ఉన్నా.. ఇప్పుడు *800కే అమ్ముకొనే అధ్వాన్న స్థితిలో రైతు సోదరులున్నారు. మద్దతు ధరతో వారికి భరోసా కల్పించాల్సిన ఈ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అవేమీ పట్టించుకోకుండా నిద్రపోతున్నాయి. వాటిని మేలుకొలుపే ప్రయత్నంలో భాగంగా ఈ నెల 15న గుంటూరులో 48 గంటలు దీక్ష ప్రారంభిస్తున్నాను.
జూలై 8న ప్లీనరీ

జూలై 8 నాన్న, దివంగత మహానేత పుట్టినరోజున ఇడుపులపాయలో ప్లీనరీ ఏర్పాటు చేస్తున్నాం. అందులో ప్రతి కార్యకర్త, ప్రతి నేత ఆలోచనలను తీసుకుంటాం. రెండు రోజులపాటు మేధోమథనం జరుపుతాం. ఆ తర్వాత మీడియాను పిలిచి.. పార్టీ తరఫున మేం ఏం చేయబోతున్నామనేదాన్ని విపులంగా చెబుతాం. వైఎస్‌ఆర్ పార్టీ జెండా చాలు.. పార్టీ ఎజెండా చెప్పకనే చెప్పినట్లు ఉంటుంది.
జగన్‌కు రికార్డు మెజారీటీ
పార్లమెంటు ఎన్నికల్లో గతంలో మూడు పర్యాయాలు రికార్డు మెజార్టీ నమోదయ్యాయి. అందు లో రెండుసార్లు నంధ్యాల పార్లమెంటు నియోజకవర్గంలో కాగా, ఒకసారి కడప పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇప్పుడు కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్ కొత్త రికార్డు సృష్టించారు. 1991లో నంద్యాల పార్లమెంటు నియోజక వర్గం నుంచి సార్వత్రిక ఎన్నికల్లో గంగుల ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామక్రిష్ణారెడ్డిని 1,86,766 ఓట్ల మెజార్టీతో ఓడించారు. ఆ ఎన్నికల తర్వాత పివి నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యారు. ఆయన పార్లమెంటు కు ఎన్నిక కావాల్సివుండగా భద్రమైన సీటు కోసం అన్వేషిస్తుం డగా ఆయన కోసం గంగుల ప్రతాప్‌రెడ్డి పార్లమెంటు సభ్యత్వాన్ని త్యాగం చేశారు. ఆయన రాజీనామాతో అదే ఏడాది ఉప ఎన్ని కలు వచ్చాయి. పివి నరసింహారావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చే యగా తెలుగువాడు ప్రధాన మంత్రిగా ఉండి పోటీ చేస్తున్నారన్న గౌరవంతో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావు ఆయనపై తెలుగుదేశం అభ్యర్థి పోటీ పెట్టలేదు. ఆయన ఏ గ్రీవంగా ఎన్నికవుతారని భావిస్తున్న సమయంలో బిజెపి తమ పార్టీ అభ్యర్థిగా బంగారు లక్ష్మణ్‌ను పోటీకి దించింది. ఆయనపై పివి నరసింహారావు 5,80,038 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అదే ఇప్పటి దాకా కొనసాగుతున్న రికార్డు మెజార్టీ. 1996లో పివి నరసింహారావు తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయగా తెలుగుదేశం అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి పోటీ పడ్డారు. నాగిరెడ్డిపై ఆ ఎన్నికల్లో నరసింహారావుకు 98.530 ఓట్ల ఆధిక్యం లభించింది.
ఆ ఎన్నికల్లో ఇంకో చోట నుంచి కూడా పోటీచేసిన నరసింహారావు రెండు చోట్లా గెలవడంతో నంద్యాల పార్లమెంటుసభ్యత్వానికి రాజీనామా చేశారు. దాంతో ఉప ఎన్ని కలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి పోటీచేయగా కాంగ్రెస్ అభ్యర్థిగా రంగయ్య నాయుడు పోటీపడ్డారు. భూమానాగిరెడ్డికి 4,41,142 ఓట్ల మెజార్టీ లభించి రికార్డు సృష్టించారు. కడప పార్లమెంటు నియోజకవర్గంలో 1991 పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్‌కు 4,22,790 ఓట్ల మెజార్టీ లభించింది. తెలుగుదేశం అభ్యర్థి సి. రామచంద్రయ్యను కాం గ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన వైఎస్ ఓడించారు.
కడప ఉప ఎన్నికల్లో జగన్ మెజారిటీ
హైదరాబాద్, మేజర్‌న్యూస్: ప్రతిష్టాత్మకంగా జరిగిన కడప లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్‌లో వై ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వైఎస్ జగన్ 5,45,672 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు మొత్తం ఓట్లు 6,92,251రాగా కాంగ్రె ెస్ పార్టీ అభ్యర్థికి డీఎల్ రవీంద్రారెడ్డికి 1, 46, 57 9 ఓట్లు వచ్చాయి,టీడీపీ అభ్యర్థి మైసూరరెడ్డికి 1,29,565 ఓట్లు వచ్చాయి. పులివెందుల అసెంబ్లీ అభ్యర్ధిగా వైఎస్ సతీమణి విజయలక్ష్మికి 85, 191 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. విజయమ్మకు మొత్తం 1,09,665 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వైఎస్ వివేకానందరెడ్డికి 28,368, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి బీటెక్ రవికి 11,230 ఓట్లు లభించాయి. అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా జగన్మోహన్‌రెడ్డితోపాటు తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులకు దక్కిన ఓట్లు, జగన్‌కు లభించిన మెజారిటీలు నియోజకవర్గాల వారీగా ఇలా ఉన్నాయి.
జ‘గన్’! సోనియాకు షాక్!
అవును.. నిజం.. జగన్ చెప్పినట్లు కడప గెలిచింది. ఢిల్లీ ఓడింది. కడప ఆత్మగౌరవం నిలిచింది. ఢిల్లీ అహంకారం ఓడింది. శుక్రవారం వెలువడిన కడప లోక్‌సభ, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలు చాటిన సంకేతాలు ఇవే. కాంగ్రెస్-తెలుగుదేశం ఎంత పెనుగులాడినా జగన్-విజయలక్ష్మిని ఓడించలేకపోగా.. ఆ రెండు పార్టీలూ డిపాజిట్లు కూడా దక్కించుకోలేక చతికిలపడ్డాయి. కడప-పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి షాక్‌నిచ్చాయి. జగన్ విజయం ఖాయమన్న విషయం, సమాచారం అధినేత్రికి ఉన్నప్పటికీ, 5 లక్షల 40 వేల భారీ మెజారిటీతో విజయఢంకా మోగించి తన ముందే మీసం మెలేస్తారని సోనియా ఏ మాత్రం ఊహించలేకపోయారు. అధినేత్రికి వచ్చిన సమాచారం ప్రకారం జగన్ 2 లక్షల లోపు మెజారిటీతో గెలుస్తారని, కాంగ్రెస్ అభ్యర్ధి డీఎల్‌కు ద్వితీయ స్థానం వస్తుందని తెలిసింది.
ఈ స్ధాయిలో జగన్ విజయం సాధించడాన్ని సోనియా జీర్ణించుకోలేకపో తున్నారు. అసోం, కేరళ రాష్ట్రాల్లో సాధించిన విజయం కన్నా ఆంధ్రరాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ఎదురయిన భారీ ఓటమే సోనియాను కలవరపెడుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతల వైఫల్యాన్ని సోనియా తన ఖాతాలో జమ వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డీఎస్ అసమర్థత వల్లే జగన్‌కు అంత మెజారిటీ వచ్చిందని, వారిద్దరికీ సమన్వయం లేకనే జగన్ మెజారిటీ తగ్గించలేకపోయారన్న నిర్థరణకు రావలసి వచ్చింది.
దీన్ని బట్టి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా సీనియర్లు గత కొంతకాలం నుంచి తనకు జగన్‌పై చేస్తున్న ఫిర్యాదులు, జగన్‌కు తండ్రి ఇమేజ్ తప్ప జనంలో బలం లేదంటూ పంపిన నివేదికలన్నీ అవాస్తవాలని సోనియా గ్రహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. వీరంతా కేవలం జగన్‌పై వ్యక్తిగత కక్షతో, రాజశేఖరరెడ్డిపై ఉన్న పాత కక్షలతోనే తనకు ఇలాంటి నివేదికలు పంపారని ఫలితాలు చాటిన విషయాన్ని ఆమె పరిగణనలోకి తీసుకోక తప్పని పరిస్థితిని ఉప ఎన్నికలు కల్పించాయి.
కడప-ఢిల్లీకి, ఆత్మగౌరవానికి-అహంకారానికీ మధ్య జరుగుతున్న ఎన్నికలంటూ జగన్ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మడంతో రాష్ట్రంలో సోనియాగాంధీకి ఇమేజ్ లేదని స్పష్టమయిపోయింది. కాంగ్రెస్ అభ్యర్ధి డీఎల్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఫొటోతో ప్రచారం చేసుకుంటే, జగన్ కేవలం వైఎస్ ఫొటోతోనే ప్రచారం చేసుకున్నారు. ప్రజలు మాత్రం వైఎస్‌ను ఆదరించి, సోనియాను తిరస్కరించడం కూడా రాష్ట్రంలో ఇకపై సోనియా బొమ్మకు ఆదరణ ఉండదని తేలిపోయింది.వివేకానందరెడ్డి తన ప్రచారంలో వైఎస్ ఫొటో తప్ప సోనియా ఫొటో ఫొటో వాడుకోలేదంటే సోనియా ఇమేజ్ ఏమిటన్నది స్పష్టమయిపోయింది.
తనను సవాల్ చేసిన జగన్‌ను ఎన్ని రకాలుగా వేధించి, వెన్నాడి ఆయనను ఓడించేందుకు ఎన్ని ప్రణాళికలు రూపొందించినా రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచి, తన ముందే పార్లమెంటులో మళ్లీ విజయదరహాసంతో అడుగుపెట్టబోవడాన్ని సోనియా అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. తనను సవాల్ చేసి, పార్టీ నుంచి వెళ్లడమే కాకుండా భారీ మెజారటీతో మరోసారి పార్లమెంటులో తనకు ఎదురుపడనున్న జగన్ ధీమాను సోనియా స్వయంగా చూడవలసి వస్తుంది. ఇది సోనియాను మరింత కలవరపరిచే అంశమే.
మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం - జగన్, విజయమ్మ కృతజ్ఞతలు
మనమంతా పెద్ద కుటుంబమని నిరూపించారు మహానేత ఆశయాల కోసం తపించే మాకు అండగా నిలిచారు దేశంలోనే ఇది ఒక చారిత్రక సంఘటన ఇచ్చిన మాట తప్పే రాజకీయాలకు చరమగీతం ఈ విజయం తెలుగుజాతి ఆత్మగౌరవానిది ఈ విజయం హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ జిల్లాలో కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ తమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. దాని పూర్తి పాఠం... కడపలో గడప గడపకూ నమస్తే... మహానేత వైఎస్ దూరమయ్యారని మేమంతా దుఃఖంలో కూరుకుపోయాం. కానీ ఆయన మాతోనే, మీలోనే ఉన్నారన్న నమ్మకం పదే పదే కలిగించారు. మమ్మల్ని పద్మవ్యూహంలో బంధించాలని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎదురొడ్డి పోరాడే ధైర్యాన్నిచ్చారు. మహానేత ఆశయాల కోసం అనుక్షణం తపించే మాకు కొండంత అండగా నిలబడ్డారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఉంచిన అచంచలమైన విశ్వాసానికి మేము సదా రుణపడి ఉంటాం. ఈ దేశ రాజకీయాలను మార్చే సత్తా ప్రజాస్వామ్యానికి మాత్రమే ఉందని మీరు మరొక్కసారి రుజువు చేశారు. మనమంతా నిజంగానే ఒక పెద్ద కుటుంబమని నిరూపించారు. దేశంలోనే ఇది ఒక చారిత్రక సంఘటన. ఇదొక చారిత్రక విజయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎవరి సానుభూతి అక్కర్లేదని ఈ రాష్ర్ట ప్రజలు ఎవరి అవమానాలను భరించరని, ఎవరి నమ్మక ద్రోహాన్ని సహించలేరని రాష్ర్ట ప్రజలందరి తరఫున కడపలో ప్రతి గడపా చాటి చెప్పింది. ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వాలు ఎప్పుడు నిర్లక్ష్యం చేసినా ప్రజలు చూస్తూ ఊరుకోరని ఈ విజయంతో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ఇచ్చిన మాట తప్పే రాజకీయాలకు చరమగీతం ఈ విజయం. విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం ఈ విజయం. మహానేత వైఎస్‌ఆర్‌కు నిజమైన నివాళి ఈ విజయం. తెలుగుజాతి ఆత్మగౌరవానిది ఈ విజయం. ఇప్పుడు కడప చూపించిన దారి చరిత్రాత్మకమైనది. రాష్ట్ర రాజకీయాలకు ఇదొక మేలిమలుపు. తెలుగువారందరి దీవెనలతోనే ఈ చిరస్మరణీయమైన విజయం సాధ్యమైంది. ఈ రాష్ట్రంలో ప్రతి గడపా వైఎస్‌ను తమ వాడు అనుకోబట్టే వాళ్ల ఆశీస్సులు, ప్రేమ, ఆప్యాయత ఇంత గొప్ప విజయాన్ని అందించాయి. ప్రతిపక్షంలో ఉన్నామన్న మాట కూడా మరిచి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మొసలి కన్నీరు కారుస్తున్నారు కొందరు నేతలు. దివంగత నేత మనకు దూరమై రెండు సంవత్సరాలు అవుతున్నా, ఆ మహానేత తిరిగి రాలేడని, సమాధానం చెప్పలేడని తెలిసీ బురద చల్లటానికి మాత్రమే ప్రజా సమయాన్ని కేటాయిస్తున్న తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పేలా పిలుపునిచ్చారు కడప ప్రజలు. విలువలను, విశ్వసనీయతను మరచిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పారు. మహానేత వైఎస్‌ఆర్ ఆశయాలను, సువర్ణయుగాన్ని సాధించుకోగలమనే నమ్మకాన్ని ఓటు వేసి మరీ కలిగించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పెను మార్పుకు నాంది పలికారు. ఏ పార్టీకైనా, నాయకుడికైనా మాట తప్పని, మడమ తిప్పని నైజమే నిజమైన నిర్వచనమని మీ తీర్పుతో నిరూపించారు. ఈ విజయం మనందరికీ గొప్ప ఆనందాన్ని తీసుకొచ్చింది. ఈ విజయమే వైఎస్‌ఆర్‌ను మళ్లీ జనంలో ఉదయించేలా చేసింది. ఈ విజయమే వైఎస్‌ఆర్ ఆశయాలను కొనసాగించాల్సిన గొప్ప బాధ్యతను కూడా గుర్తు చేసింది. ఈ విజయమే ఆ మహానేత కోరుకున్న హరితాంధ్రప్రదేశ్ సాధనకు బంగారు బాట వేసింది. మన జెండా... వైఎస్‌ఆర్ ఎజెండా. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జెండా మోసిన ఉద్యమకారులైన ఓటరు దేవుళ్లకు వందనం. తొలి అడుగులోనే పార్టీని ఇంత ఘన విజయంతో స్వాగతించిన అక్కకు, చెల్లికి, అవ్వకు, తాతకు, సోదరుడికి, స్నేహితులకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా శిరస్సు వంచి చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం. ఇట్లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్ విజయమ్మ |
No comments:
Post a Comment