Thursday, January 6, 2011

ప్రత్యేక రైలులో ఢిల్లీకి జగన్ * 9వ తేదీ మధ్యాహ్నం 1.30కు బయలుదేరనున్న రైలు

 ఈ నెల 11న ఢిల్లీలో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన దీక్ష కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఈ నెల 9 న మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరుతుందని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు చెప్పారు. ఈ రైలు ఆ రోజు సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుందని గతంలో ప్రకటించామని, అయితే రైల్వే అధికారుల సూచనల మేరకు దీని సమయాన్ని మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చినట్లు తెలిపారు. ఈ రైలు కాజీపేట నుంచి సాయంత్రం 3.45 గంటలకు బయలుదేరుతుందని అన్నారు. ఈ రైలులో జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఉంటారని అంబటి రాంబాబు చెప్పారు.
సంచలనాలు సృష్టిస్తాడు:అంబటి
 ఎన్నికలొస్తే కాంగ్రెస్‌కు బుద్ధి చెబుదామని ప్రజలు ఎదురుచూస్తున్నారు
యువనేత పార్టీలో చేరేందుకు
సిద్ధమన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలు


రాజకీయాల్లో సంచలనాలు సృష్టించగల నేత వైఎస్ జగన్ మాత్రమేనని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు అన్నారు. రాబోయే రోజుల్లో జగన్ దివంగత రాజశేఖరరెడ్డిని మించి గొప్ప నేతగా అవతరించబోతున్నారని పేర్కొన్నారు. వైఎస్ పాదయాత్ర చేసినప్పుడు 1500 కిలో మీటర్లు ఆయన అడుగులో అడుగు వేసి నడిచానని, ఆ రోజున ఉన్న ప్రజాదరణతో పోలిస్తే జగన్‌కు నేడు వంద రెట్లు అధికంగా జనాదరణ లభిస్తోందన్నారు.

ఎన్‌ఎస్‌యూఐ జాతీయ ప్రతినిధి మెరుగు కిరణ్ నాగ్ సహా పలువురు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర, జిల్లాల నేతలు, వందలాది మంది నాయకులు తమ పదవులకు రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ జగన్ పార్టీలో చేరబోయే నాయకులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చారు. వైఎస్ పథకాలు జగన్ పట్ల ప్రజల ప్రేమాభిమానాలను అమితంగా పెంచాయన్నారు. రాజకీయాలను పెద్దగా పట్టించుకోని విద్యార్థినీ, విద్యార్థులు, యువత, మహిళలు వైఎస్ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని చూసి చలించిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో ‘‘ఎన్నికలు రావాలి, వైఎస్ జగన్‌కు ఓటు వేసి కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలి’’ అని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని పేర్కొన్నారు.

జగన్ వెంట వెళతారనే ఈర్ష్యతో రాష్ట్రంలోని ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలను నియమించారని అన్నారు. చివరకు ఆ కమిటీలను కూడా రద్దు చేసిన విషయాన్ని గమనిస్తే కాంగ్రెస్ దుస్థితి ఏమిటో అర్థమవుతోందన్నారు. పీసీసీ కిసాన్ సెల్ మాజీనేత గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర ప్రతి గుండెనూ తాకిందన్నారు. వైఎస్ ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలవుతుందో లేదోననే ఆందోళనలో విద్యార్థులు ఉన్నారంటే ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ మాట్లాడుతూ వెయ్యి మంది చంద్రబాబులు, చంద్రశేఖర్‌రావులు కూడా జగన్‌కు సాటిరారని అన్నారు. శాప్ మాజీ చైర్మన్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనన్నారు. వైఎస్సార్ ట్రస్టు రాష్ట్ర ఇన్‌చార్జి సత్య, సుమతీ మోహన్, ఎన్‌ఎస్‌యూఐ జాతీయ ప్రతినిధి మెరుగు కిరణ్‌నాథ్, ఆ సంఘం విశాఖ పట్నం, వరంగల్, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శులు జీలకర్ర నాగేందర్, మల్లేష్‌రావు, నరేన్ రాజు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు చిరంజీవి, పీసీసీ ఎస్సీ సెల్ కో ఆర్డినేటర్ నీలం రాజు, గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కారెడ్డి ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాడేరు యూత్రపై ఇంటెలిజెన్స్ నివేదిక!
మంత్రి బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పాడేరు నియోజకవర్గంలో జగన్ యూత్రలో అత్యధిక సంఖ్యలో జనం పాల్గొనడం సంచలనం కల్గించింది. దీనిపై ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు తెలుస్తోంది. పులివెందుల తరువాత జగన్ యూత్రకు భారీస్థాయిలో ప్రజలు రావడం పాడేరులోనే జరిగిందని వారు నివేదించినట్లు సమాచారం. కార్యకర్తలెవరూ ఓదార్పు యూత్రలో పాల్గొనరాదని ప్రజాప్రతినిధులు పదేపదే చెప్పినప్పటికీ వారి మాటలు ఎవరూ ఖాతరు చేయులేదు. గూడెం, చింతపల్లి, జి.వూడుగుల, హుకుంపేట మండలాలతో పాటు అరకు నియోజకవర్గం నుంచి భారీస్థాయిలో ప్రజలు వచ్చారు.

ఢిల్లీ దీక్షలో పాల్గొంటా: ఎమ్మెల్యే బాబూరావు
జగన్ తలపెట్టిన ఢిల్లీ దీక్షలో తానూ పాల్గొంటానని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు స్పష్టం చేశారు. గురువారం రాత్రి అడ్డురోడ్డు జంక్షన్‌లో ఓదార్పు ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విశాఖ జిల్లా నుంచి ఎక్కువమంది ఈ దీక్షలో పాల్గొనేందుకు సిద్ధపడుతున్నారన్నారు.

No comments:

Post a Comment