Tuesday, January 25, 2011

జగన్‌కు హైకోర్టు నోటీసులు


జగన్ మీడియాకు హైకోర్టు ఝలక్
విచారణ ఎందుకు జరపొద్దు?
మూడు వారాల్లో బదులివ్వండి
పెట్టుబడుల మాయపై హైకోర్టు ఆరా

శంకర్‌రావు లేఖపై సుమోటోగా విచారణ
జగన్, ఇతర పెట్టుబడిదారులకు నోటీసులు
సీబీఐ డైరెక్టర్, ఆరుగురు అధికారులు సహా మొత్తం 52 మందికి శ్రీముఖాలు
హైకోర్టుకు శంకర్‌రావు రెండు లేఖలు
అనుబంధ పత్రాలతో 80 పేజీల రెండో లేఖ
జగన్ మీడియాలోకి వెల్లువెత్తిన పెట్టుబడుల మూలాలపై హైకోర్టు దృష్టి సారించింది. అక్రమాల ఆరోపణలపై ఎందుకు విచారణ నిర్వహించకూడదని ప్రశ్నించింది. మూడు వారాల్లో జవాబు చెప్పాలని ఆదేశించింది. 'సాక్షి' చైర్మన్ వైఎస్ జగన్‌తోపాటు ఇందులో పెట్టుబడులు పెట్టిన వారికి, ఏడుగురు అధికారులకు... మొత్తం 52 మందికి జస్టిస్ వి.ఈశ్వరయ్య, జస్టిస్ సూరి అప్పారావులతో కూడిన ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది. మంత్రి శంకర్‌రావు గతంలో రాసిన లేఖనే సుమోటోగా హైకోర్టు విచారణకు స్వీకరించింది.

"జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానల్‌లో పెట్టుబడుల వెనుక పలు అక్రమాలు ఉన్నాయి. అధికార దుర్వినియోగం జరిగింది. పలు సంస్థలకు భూములు, గనులు, కాంట్రాక్టులు అక్రమంగా కట్టబెట్టి... వారి చేత మీడియాలో పెట్టుబడులు పెట్టించారు. అసాధారణ ప్రీమియంతో షేర్లు కొనిపించారు. మనీ లాండరింగ్‌తో సలు అక్రమాలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన రికార్డులను కోర్టు పరిశీలించి, విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయి. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలి'' అని శంకర్ రావు కోరారు.

ఈ లేఖను సోమవారం హైకోర్టు డబ్ల్యుపీ 794/2011 కింద సుమోటోగా విచారణకు స్వీకరించింది. 'పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై ఎందుకు విచారణకు ఆదేశించరాదో మూడు వారాల్లోగా (వచ్చేనెల 14వ తేదీలోగా) చెప్పండి' అని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సీబీఐ, విజిలెన్స్ డైరెక్టర్‌లతోపాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి... ఇలా ఏడుగురు అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చింది.

ఇంకా, జగన్‌కు, ఆయన మీడియాలో పెట్టుబడులు పెట్టిన వారికీ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో ప్రధానంగా... ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ అధిపతులు ఉన్నారు. సందేశ్ ల్యాబ్స్, పీవీపీ బిజినెస్ వెంచర్స్, క్యూబాయిడ్ రియల్టర్స్, మ్యాంట్లే రియల్టర్స్, మెటాఫర్ రియల్ ఎస్టేట్స్, పీవీపీ బిజినెస్ టవర్స్, జీ2 కార్పొరెట్ సర్వీసెస్, సుగుణి కన్‌స్ట్రక్షన్స్, ఆల్ఫా విల్లాస్, ఆల్ఫా అవెన్యూస్, బీటా అవెన్యూస్, గిల్ క్రిస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కంపెనీలకూ నోటీసులు అందాయి.

ఇందిరా టెలివిజన్, జగతి పబ్లికేషన్స్, క్యారామెల్, ఆస్రా హోల్డింగ్స్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్స్, భగవత్ సన్నిధి ఎస్టేట్స్, క్లాసిక్ రియల్టీ, భారతి సిమెంట్స్, సిలికాన్ బిల్డర్స్, కేప్‌స్టోన్ ఇన్‌ఫ్రా, పులివెందుల పాలిమర్స్, హరీష్ ఇన్‌ఫ్రా, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్, కాంతి కండక్టర్స్, సందేశ్ ల్యాబ్స్, స్వగృహ హోటల్స్, జూబ్లీ మీడియా, ఈఆర్ఈఎస్ ప్రాజెక్ట్స్, సంస్థలతోపాటు, బి.పురుషోత్తమ నాయుడు, ఎం. శ్రీనివాసరెడ్డి, జి. శ్రీనివాసరాజు, ఎ.కె. దండమూడి, కె. శ్రీనివాస నాయుడు, అజయ్ గారపాటి, మాధవ్ రామచంద్రన్, జి. అనంతసేనా రెడ్డి, కె. ప్రసాద్ రెడ్డి, డి. సరోజినమ్మ, డి. శ్రీనివాసులు రెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. 'సాక్షి'లో పెట్టుబడులపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కేంద్రానికి నివేదికలు సమర్పించినట్లు సమాచారం. ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు కూడా దీనిపై దృష్టి సారించడం విశేషం.
Click Here!
జగన్‌కు హైకోర్టు నోటీసులు
Jagan-single 
ఎట్టకేలకు వై.ఎస్‌ జగన్‌ అక్రమాస్తులపై హైకోర్టు కదిలింది. అయి దు సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీలు, పలు ఆరోపణలు సంధించినా ప్రభుత్వం ఆ దిశలో ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో కాం గ్రెస్‌కు చెందిన సీనియర్‌ నాయకుడు శంకర్‌ రావు (ప్రస్తుతమంత్రి) లేఖకు హైకోర్టు స్పందిం చింది. లేఖలోని సారాంశాలను క్షుణ్ణ ంగా పరి శీలించి సుమోటోగా కేసు స్వీకరించి ప్రతివాదు లకు, ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడు మాజీ ఎంపీ వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, అతడికి సంబంధించిన అక్రమ ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి శంకర్‌రావు రాసిన లేఖను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. కొన్ని నెలలుగా జగన్‌ ఆస్తులపై పలువురు అమా త్యులు బహిరంగంగా వ్యాఖ్యానించిన నేప థ్యంలో హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గానే తీసుకుంది. సోమవారం హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, జస్టిస్‌ సూరి అప్పారావులతో కూడిన ధర్మాసనం ప్రతివాదు లకు నోటీసులు జారీచేసింది. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, విజిలెన్స్‌ అధికారులతో పాటు మాజీ ఎంపీ వై.ఎస్‌. జగన్‌మెహన్‌రెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌, ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌లతో పాటు 52 సంస్థలకు నోటీసులు జారీచేసింది.

మూడు వారాల్లోగా వీటిపై స్పందించాలని ధర్మాసనం ప్రతివాదులను ఆదేశిం చింది. జగన్‌ అక్రమ ఆస్తుల రికార్డులను తెప్పించుకుని సమగ్రంగా దర్యాప్తు చేయాలని శంకర్‌రావు తనలేఖలో కోరారు. అధికార దుర్వినియోగం, భూ కేటాయింపులు గనులు, లీజుల ద్వారా అక్రమంగా ఆస్తులు పొందడం వంటి వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని శంకర్‌రావు కోరారు. జగన్‌ కంపెనీలోని పెట్టుబడులను మనీ ల్యాండ్‌ రింగ్‌ విధానం ద్వారా మళ్ళించారు. 2004 నుంచి వై.ఎస్‌. జగన్‌ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించారు.

సీఎం హోదాలో తన తండ్రి అధికారాలను అడ్డం పెట్టుకుని కార్పోరేట్‌ సంస్థలు, వ్యక్తులు, బంధువులకు గనులు కేటాయించడం ద్వారా, లైసెన్సులు మంజూరు చేయడం ద్వారా భారీగా ముడుపులు స్వీకరించారు. 2004 మార్చి నాటికి 11 లక్షల ఆస్తులు కలిగిన వ్యక్తి ప్రస్తుతం 43వేల కోట్లకు అధిపతిగా ఉన్నాడని విశ్వసనీయ సమాచారం. అవినీతి కార్యకలాపాలతో కూడబెట్టిన నల్లధనాన్ని వివిధ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టించి వైట్‌మనీగా మార్చారు. సండ్రూస్‌పవర్‌, జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలివిజన్‌, దాల్మియా హాసియా హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నల్లధనాన్ని వైట్‌మనీగా మార్చారు. బంధువులు, స్నేహితుల బినామీ పేర్లతో 90 శాతం పెట్టుబడులు పెట్టారు.

వివిధ వ్యక్తులు, సంస్థలతో ముందే ఒప్పందం కుదుర్చుకుని తన తండ్రి వై.ఎస్‌.ఆర్‌ ద్వారా లబ్ది పొందిన కార్పోరేట్‌ సంస్థలు, వ్యక్తులు జగన్‌ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. హెటిరో గ్రూప్‌, ఇండియా సిమెంట్స్‌, దాల్మియా సిమెంట్స్‌, పొట్లూరి వరప్రసాద్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌, పెన్నా గ్రూప్‌, ల్యాంకో గ్రూప్‌, సజ్జల గ్రూప్‌, వి.పురుషోత్తమ్‌నాయుడు, రమణారెడ్డి, నాగిరెడ్డిలతో పాటు పలువురు 400 రూపాయల నుంచి 11 వందల రూపాయల అధిక ప్రీమియంతో షేర్లు కొని భారతీ సిమెంట్‌ కార్పోరేషన్‌, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారు. కొంతకాలం తర్వాత వారి వాటాలను జగన్‌ తన సంస్థల పేరుతో బదిలీచేశాడు.

హవాలా, మనీల్యాండ్‌ రింగ్‌ ద్వారా మారిషస్‌కు నిధులు తరలించి జగన్‌ కంపెనీలు అధిక ప్రీమియంతో పెట్టుబడులు పెట్టారు. 2ఐ క్యాపిటల్‌, ప్యూరీ ఎమర్జింగ్‌ కంపెనీ, జగన్‌, సండూర్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌, 61 రూపాయల ప్రీమియంతో 125 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఒక్క ప్రతినిధి బోర్డులో తమ ప్రతినిధులను నియమించలేదు. జగన్‌ వ్యక్తిగత ఆడిటర్‌ వి.ఎస్‌. రెడ్డి కంపెనీ బోర్డులో విదేశీ ప్రతినిధిగా వ్యవహరించారు. సండూర్‌ కంపెనీలో తమకు చెందిన 83.20 లక్షల వాటాలను స్నేహితుల కంపెనీలకు 15.60 కోట్ల రూపాయలకు బదిలీ చేశారు.

ఇలా వచ్చిన మొత్తాన్ని భారతీ సిమెంట్స్‌, ఇందిరా టీవీ, జగతి పబ్లికేషన్స్‌ లలో పెట్టుబడులు పెట్టేలా మనీ ల్యాండ్‌రింగ్‌ ద్వారా విదేశాల్లోని తన స్నేహితులకు నిధులు సమకూర్చి అవే నిధులను విదేశీ కంపెనీల రూపంలో ఆ మొత్తాన్ని కానుకగా స్వీకరించి పన్ను ఎగ్గొట్టారు. 2003-04లో 52 లక్షల విదేశీల కరెన్సీ స్వీకరించి వాటికి పన్ను చెల్లించలేదు. హవాలా ద్వారా ఎక్కువ ప్రీమియం కోసం పెట్టుబడులు పెట్టేలా చేశారు. దేశవ్యాప్తంగా చిన్న కంపెనీల ద్వారా 106 కోట్లు జగతి పబ్లికేషన్స్‌లో వాటాలు కొనేలా చేశారు.

ఇవన్నీ కాగితాల్లోని కంపెనీలే అదే విధంగా చెనై్న, హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న కంపెనీలు జగన్‌ కంపెనీలో 105 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. వీటిల్లో సండూర్‌ పవర్‌, కార్మిల్‌ ఏసియా హోల్డింగ్‌ ఉన్నాయి. అయితే ఆ కంపెనీలకు ఆ పాటి సామర్థ్యం ఏమాత్రం లేదు. సున్నపురాయి నిక్షేపాలకు చెందిన సి.రామచంద్రయ్య నుంచి రఘురామ్‌ సిమెంట్స్‌ (భారతీ సిమెంట్స్‌) స్వాధీనం చేసుకున్నారు. అలాగే 30 కోట్ల ఆదాయం ఉన్న బెంగళూరుకు చెందిన మంత్రి డెవలపర్స్‌ నుంచి క్లాసిక్‌ రియాల్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను పొందారు.

నోటీసులు జారీచేసిన సంస్థలు, ప్రతినిధులు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ అధికారులు, సీబీఐ డైరెక్టర్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఎపీఐఐసీ ఎండీ, రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉన్నారు. నోటీసులు అందుకున్న సంస్థల్లో ఇందిరా సిమెంట్స్‌, దాల్మియా సిమెంట్స్‌, భారతీ సిమెంట్స్‌, లాంకో, సజ్జల, ఓఎంసీ సంస్థల ఛైర్మన్లు, పెన్నా సిమెంట్స్‌, ఇండియా సిమెంట్స్‌, సందేశ్‌ల్యాబ్స్‌, టీవీపీ బిజినెస్‌ వెంచర్స్‌, మోటాఫోర్‌ రియల్టర్స్‌, జీటూ కార్పోరేట్‌ సర్వీసెస్‌, సుగమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌, ఇందిరా టెలివిజన్‌, జగతి పబ్లికేషన్స్‌, కార్మియల్‌ ఆస్రా హోల్డింగ్స్‌ తదితరులు ఉన్నాయి.

 Click Here!
‘బాబు అండ్ కో’తో చేతులు కలిపి యువనేతపై విషం
కాంగ్రెస్ కోరస్
* జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక బురదజల్లే కుట్ర
* వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసే కుతంత్రంలో కాంగ్రెస్ అధిష్టానం తలమునకలు
* టీడీపీ, ఈనాడు, దాని తోకపత్రిక ఆరోపణలను నెత్తికెత్తుకుంటున్న కాంగ్రెస్ నేతలు
* ఒక్క ఆధారం కూడా లేని ఆరోపణలతో హైకోర్టుకు లేఖ రాసిన మంత్రి శంకర్‌రావు
* ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణను కోరవచ్చు కదా?.. అందుకు  

* సోనియా నేతృత్వంలోని యూపీఏ సర్కారు ఆదేశించవచ్చు కదా?
* అవేమీ చేయకుండా.. హైకోర్టుకు లేఖ రాయటం కుట్రలో భాగం కాదా?


కాంగ్రెస్ మార్కు కుటిల నీతి మరోమారు రాష్ట్రంలో తెరపైకి వచ్చింది. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబంపై విషం చిమ్మి అభాసుపాలు చేసే కుట్రకు అధికార కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. లేనిపోని ఆరోపణలతో వైఎస్ కుటుంబంపై బురద చల్లటమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపింది. సాక్షి ఆవిర్భావంతో మీడియాలో తమ గుత్తాధిపత్యానికి గండి పడిందన్న ఆక్రోశంతో ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ఆరోపణలను నెత్తికెత్తుకుంది. వైఎస్ మరణించాక.. ఆయన కుమారుడు, యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఒంటరిని చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ అధిష్టానం.. వైఎస్ కుటుంబాన్ని కూడా చీల్చేందుకు ప్రయత్నించింది. వైఎస్ సోదరుడు, జగన్ చిన్నాన్న వై.ఎస్.వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఆశచూపి తమవైపు లాక్కుంది. కానీ.. ఇవేవీ యువనేత జగన్‌ను ఒంటరిని చేయలేకపోగా ఆయన పట్ల కోట్లాది మంది ప్రజాభిమానం వెల్లువలా పెల్లుబుకుతుండటంతో.. బెంబేలెత్తిన కాంగ్రెస్ కుతంత్రాలకు తెరతీసింది. ప్రజా నాయకుడిగా ఆవిర్భవించిన జగన్‌ను రాజకీయంగా ప్రత్యక్షంగా ఎదుర్కోవటం చేతకాక.. పరోక్షంగా ఆయనను అప్రతిష్టపాలు చేసేందుకు కుయుక్తులు పన్నుతోంది.

మహానేత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏనాడూ సచివాలయంలో అడుగుపెట్టని జగన్‌పై.. ‘ఎల్లో సిండికేట్’ ఆరోపణలనే కాంగ్రెస్ ఎక్కుపెట్టింది. యువనేతను లక్ష్యంగా చేసుకుని పుంఖానుపంఖాలుగా అసత్య కథనాలను వండి వార్చిన ఈనాడు దినపత్రిక.. జగన్ అధికారిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు కానీ, సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నట్లు కానీ ఒక్క ఆధారాన్నీ ప్రజల ముందు ఉంచలేకపోయింది. అలాంటి ఆరోపణలే ఆలంబనగా.. రాష్ట్ర చేనేత శాఖ మంత్రి పి.శంకరరావు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను యువనేత జగన్‌కు ముడిపెడుతూ.. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానల్, భారతీ సిమెంట్ సంస్థలకు సంబంధించిన పెట్టుబడులు అక్రమమంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. గత మూడేళ్లుగా ఈనాడు, దాని తోకపత్రిక రాస్తున్న అసత్య కథనాలను ఆసరా చేసుకుని ఏ ఆధారాలూ లేకుండా ఆ లేఖలో ఆరోపణలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ, ఈనాడు, దాని తోకపత్రిక రాసిన అనేకానేక ఆరోపణలకు సాక్షి మూడు సార్లు బదులిచ్చింది. ఆయా కంపెనీల్లో పెట్టుబడులను విశదీకరించింది. ఎటొచ్చీ అధికార పక్షానికి చెందిన మంత్రి శంకరరావు ఎల్లో సిండికేట్ ఆరోపణల ఆధారంగా హైకోర్టుకు లేఖ రాయటమే ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

పరిశ్రమలు స్థాపించటమే తప్పా?
సాక్షి తెలుగు దినపత్రిక, సాక్షి టీవీ, భారతీ సిమెంట్ సంస్థలను ఏర్పాటు చేసే నాటికి జగన్ కనీసం ఎంపీ కూడా కాదు కదా! వైఎస్సార్ ముఖ్యమంత్రి కాకమునుపే 2002 లోనే యువనేత జగన్ కర్ణాటకలో సాండూరు పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి కుమారుడు అయినంత మాత్రాన పరిశ్రమలు ఏర్పాటు చేసుకోకూడదా? తనకు తెలిసిన కొద్ది మంది పారిశ్రామికవేత్తలతో కలిసి ఆయన సాక్షి దినపత్రిక, టెలివిజన్, భారతీ సిమెంట్ సంస్థలను స్థాపించటం తప్పెలా అవుతుంది? రాష్ట్రానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అది అక్రమమవుతుందా? ఈ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధం ఏమిటి? ఓ పరిశ్రమ ఏర్పాటుకు భూమి కేటాయించటమన్నది, ఆ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇవ్వటమన్నది రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయంపైన ఆధారపడి ఉంటుంది.

పైగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వటం, వందలాది మందికి ఉపాధి కల్పించే సంస్థలకు భూములు కేటాయించడమన్నది రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగిందా? గతంలో ఎల్లో సిండికేట్, ఇప్పుడు అధికార పార్టీలో కొందరు ఆరోపణలు చేస్తున్నదే నిజమైతే.. రాష్ట్రానికి, రాష్ట్ర విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగం లేని ఇండియన్ బిజినెస్ స్కూల్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా భూమి కేటాయించటం తప్పే కదా! హైటెక్ సిటీ పేరుతో ఎల్ అండ్ టీ, రహేజా వంటి కంపెనీలకు చంద్రబాబు వందలాది ఎకరాల భూమిని కేటాయించటం అంతకంటే పెద్ద తప్పు కదా! దిక్కూమొక్కు లేని ఐఎంజీ అనే సంస్థకు రెండు వేల ఎకరాల భూమిని కట్టబెట్టటం ఏ కోవలోకి వస్తుంది? ఇప్పుడు నానా యాగీ చేస్తున్న రామోజీరావు అప్పట్లో తన పత్రిక ద్వారా వీటిపై ఎందుకు ఒక్క కథనం కూడా రాయలేదు?

ఎల్లో సిండికేట్ ఆరోపణలే ఆలంబనగా...
వైఎస్సార్ మరణంతో ఆయన కుటుంబాన్ని ఏకాకి చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పడరాని పాట్లు పడింది. చివరకు ఆయన కుటుంబంలో చిచ్చుపెట్టింది. వైఎస్ కుమారుడు జగన్‌ను పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం.. జగన్ చిన్నాన్న వై.ఎస్.వివేకానందరెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించింది. వివేకాను ఢిల్లీకి పిలిపించుకుని పావులు కదిపి జగన్‌ను ఒంటరి చేసి పార్టీ నుంచి గెంటేయాలని చూసింది. కాంగ్రెస్ అధిష్టానం అంతరంగాన్ని గుర్తించిన యువనేత జగన్, ఆయన తల్లి విజయలక్ష్మి తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

ఇక జగన్ పని అయిపోయినట్లేనని భావించిన కాంగ్రెస్ అధిష్టానం జగన్‌ను ఒంటరి చేయటానికి తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుసుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు. కాంగ్రెస్‌ను వదిలిన జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. ఆయన ఒంటరి కాదని, ఆయనతో తామున్నామని కోట్లాది మంది సంఘీభావం ప్రకటించారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట నడుస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ, యువనేతకు ఇబ్బందులు సృష్టించటానికి కుట్రలు ప్రారంభించింది. రాజకీయంగా ఆయనను ఎదుర్కొనే ధైర్యం లేక ఎల్లో సిండికేట్‌తో చేతులు కలిపింది. ఇంతకాలం ఎల్లో సిండికేట్ చేసిన ఆరోపణలనే ఆధారం చేసుకుని ఆయన్ను అప్రతిష్టపాలు చేసేందుకు పావులు కదుపుతోంది. దానిలో భాగంగానే వైఎస్సార్ హయాంలో మంత్రి పదవులు రాక అల్లాడుతున్న డి.ఎల్.రవీంద్రారెడ్డి, శంకరరావు వంటి ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది.

ఢిల్లీ అండదండలతో వారు వైఎస్ కుటుంబంపై చెలరేగిపోయారు. అక్రమాస్తులు అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎల్లో సిండికేట్‌తో విస్తృతంగా కథనాలు రాయించారు. ప్రతిఫలంగానే కాంగ్రెస్ అధిష్టానం ఈ ఇద్దరికీ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది. వైఎస్ కుటుంబాన్ని అభాసుపాలు చేయటానికి కాంగ్రెస్ అధిష్టానం కుట్ర చేస్తోందనటానికి ఇది నిదర్శనం కాదా? ఇప్పుడు శంకరరావు అవే ఆరోపణలతో హైకోర్టుకు లేఖ రాయటం కూడా ఈ కుట్రలో భాగమేనన్న విషయం ప్రజలకు తెలియనిదా?!

No comments:

Post a Comment