రెండు రోజులుగా తెలంగాణ మొత్తం స్తంభించినా.. జగన్ దీక్షకు పోటెత్తిన జనం...
యువనేతకు మద్దతుగా వేలాదిగా వచ్చిన విద్యార్థులు
బస్సులు తిరగకపోవడంతో కాలినడకన ర్యాలీలు
కదిలి వచ్చిన కుటుంబాలు
పిల్లలను చంకనెత్తుకుని వచ్చిన తల్లులు
నేటితో ముగియనున్న జగన్ నిరాహార దీక్ష
జనాభిమానానికి అడ్డురాని తెలంగాణ బంద్
బస్సులు తిరగలేదు.. జనం రోడ్ల మీదికి రాలేదు.. దుకాణాలు తెరవలేదు.. ఫలితం రోడ్లన్నీ ఖాళీఖాళీ.. రెండు రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఇదే సీన్! కానీ రాజధానిలోని ఇందిరాపార్క్‌కు దారితీసే రోడ్లలో మాత్రం నిరంతరాయంగా జనప్రవాహం కొనసాగుతూనే ఉంది. వేలాదిగా తరలివస్తున్న అభిమాన ప్రవాహంతో యువనేత జగన్ దీక్ష చేస్తున్న ‘వరలక్ష్మి దీక్షా ప్రాంగణం’ జనసంద్రమవుతోంది. విద్యార్థుల అభిమానంతో, తల్లుల ఆశీర్వాదాలతో, అక్కచెల్లెళ్ల ప్రేమాభిమానాలతో ‘జై జగన్’ నినాదం హోరెత్తుతోంది. బుధవారం యువనేత నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. పేదల కోసం దీక్ష చేపట్టిన ప్రియమైన నేత ఇలా కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచీ జనప్రవాహం దీక్షా ప్రాంగణానికి చేరుకుంది. విద్యార్థులు ర్యాలీగా వచ్చి యువనేతకు మద్దతు తెలిపారు. తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా వచ్చి జగన్‌ను చూసి పలుకరించేందుకు ప్రయత్నించారు. తమకు కొండంత అండగా నిలిచిన వైఎస్‌ఆర్ కుమారుడికి ఆరోగ్యం క్షీణించిందనే విషయం తెలుసుకున్న వృద్ధులు, వికలాంగులు వేలాదిగా తరలివచ్చారు.
నిస్సత్తువతో పడుకునే ఉన్న జగన్
ఆరోగ్యం క్షీణించినందున జగన్ మొదటి రోజుల్లోలాగా మాట్లాడలేకపోయారు. కరచాలనం చేయలేకపోయారు. నిస్సత్తువతో రోజంతా పడుకునే ఉన్న ఆయన విద్యార్థుల కోరిక మేరకు మధ్యాహ్నం 2:30 సమయంలో లేచి నిల్చుని అభివాదం చేశారు. దీంతో విద్యార్థుల కేరింతలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. విభిన్న వర్గాలు దశలవారీగా వచ్చి దీక్షకు మద్దతు ప్రకటించారు.
కాలినడకన దీక్షా శిబిరానికి..
తెలంగాణ బంద్ కారణంగా విద్యా సంస్థలకు సెలవు కావడంతో నగర పరిసర ప్రాంతాల్లోని వివిధ కాలేజీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు బృందాలుగా ఏర్పడి కాలినడకన దీక్షా శిబిరానికి వచ్చారు. ఇలాగే వేల మంది తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. దీక్షా ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో మహిళలు.. ప్రత్యేకించి మైనార్టీ వర్గానికి చెందిన మహిళలు కనిపించారు. చంటి పిల్లలను చంకనెత్తుకొని కొందరు, పిల్లలను వెంటబెట్టుకుని మరికొందరు తల్లులు.. ఆరు రోజులుగా ముద్ద ముట్టకుండా కఠిన దీక్ష చేస్తున్న యువనేతను చూడటానికి తండోపతండాలుగా వచ్చారు. మధ్యాహ్నం సమయంలో వేల మంది ముస్లిం విద్యార్థులు ఒకేసారి ర్యాలీగా రావడం అందరినీ ఆకట్టుకుంది. బుధవారం వచ్చిన వారిలో రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు ఎక్కువగా కనిపించారు.
జగన్‌ను చూపించేందుకు ప్రయత్నాలు
తల్లిదండ్రులు తమ పిల్లలకు జగన్‌ను చూపించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే నిస్సత్తువతో ఉన్న జగన్ పడుకునే ఉండడంతో.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను భుజాల మీదికి ఎక్కించుకొని అదిగో జగన్ అంటూ చూపించడానికి ప్రయత్నించారు. కొంత మంది చిన్నారులు సమీపంలోని టేబుళ్ల మీదికి, రాళ్లమీదికి, గోడల మీదికి ఎక్కి చూశారు. చిన్నారులు అనుపమ, దీపలను ‘న్యూస్‌లైన్’ పలకరించగా విద్యార్థుల కోసం దీక్ష చేపట్టిన జగన్ ఆరోగ్యం నిలకడగా ఉండాలని, జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు.
రెండో రోజూ వచ్చిన పోలీసులు
జగన్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తరలించేందుకు బుధవారం ప్రయత్నించారు. రాత్రి 11.30 గంటల సమయంలో యువనేత వైద్య పరీక్షల రిపోర్టుతో వచ్చిన చిక్కడపల్లి ఏసీసీ చక్రపాణి జగన్‌తో మాట్లాడారు. వైద్య సేవలకు అంగీకరిస్తే ఆసుపత్రికి తరలిస్తామన్నారు. దానికి యువనేత తిరస్కరిస్తూ.. 6 రోజులుగా దీక్ష చేస్తున్న తనకు మరోరోజు దీక్షను కొనసాగించే మనోబలముందని, తనకు విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని తేల్చి చెప్పారు. దీంతో ఏసీపీతోపాటు ఆయనవెంట పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు వెనుదిరిగారు. అనంతరం టీడీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆరు రోజులుగా దీక్ష చేస్తున్నాఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం.. ఈ రోజు దీక్షను భగ్నంచేయడానికి యత్నిస్తోంది. జగన్ ఆరోగ్యం పట్ల శ్రద్ధలేకపోవడమే కాకుండా.. అర్ధరాత్రి వేళ పోలీసులను పంపి నిద్రా భంగం కలుగజేస్తోంది. దీక్షను భగ్నం చేయాలనుకుంటనే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు.

జగన్ ఆరోగ్య పరిస్థితి విషమం!
తగ్గిన సోడియం లెవెల్ యూరిన్‌లో ప్రమాదకరస్థాయిలో కీటోన్ బాడీస్
యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం విషమిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల కోసం ఆరురోజులుగా చేస్తున్న నిరాహార దీక్షతో ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతోంది. శరీరంలోని సోడియం లెవెల్ దారుణంగా పడిపోయింది. బుధవారం రాత్రి 6:30 గంటలకు గాంధీ ఆస్పత్రి వైద్యులు జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సోడియం లెవెల్ 121కి పడిపోయింది. అలాగే బీపీ 100/70, నాడీ స్పందన 64గా ఉన్నట్లు డాక్టర్లు తేల్చారు. కాగా, యూరిన్‌లో కీటోన్ బాడీస్ 4+ ఉన్నట్లు నిర్ధారించారు. కీటోన్ బాడీస్ ప్రమాదకర స్థాయికి చేరడం ఆందోళనకు గురిచేస్తోంది. సత్వరమే ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముందని వైద్యులు హెచ్చరించారు.

జగన్‌ను తల్లి విజయమ్మ, సతీమణి భారతి పరామర్శ
యువనేత జగన్‌ను తల్లి విజయమ్మ, సతీమణి భారతి పరామర్శించారు. ఆరురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ను చూసి వారి కళ్లు చెమర్చాయి. బుధవారం రాత్రి వరలక్ష్మి దీక్షా ప్రాంగణానికి చేరుకున్న ఇరువురూ దాదాపు అర గంటపాటు యువనేతతో గడిపారు. నిరాహార దీక్షతో రోజురోజుకూ క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అప్పటికే వైద్యులు కూడా పరీక్షలు నిర్వహించడంతో వారిని వాకబు చేశారు. అదే సమయంలో జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి దంపతులు కూడా యువనేతను కలిసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అంతకుముందు విజయమ్మ దీక్షా ప్రాంగణానికి చేరుకోగానే అభిమానులు వైఎస్సార్ అమర్‌హై.. జై జగన్..జైజై జగన్ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.
ఎమ్మెల్యేల పాదయాత్ర * దీక్షా శిబిరం నుంచి అసెంబ్లీ వరకు ప్లకార్డులతో నడిచిన ఎమ్మెల్యేలు
పెద్ద చదువులు - పేదవారి హక్కంటూ నినాదాలు * దీక్షపై స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్
ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం యువనేత వైఎస్ జగన్ ఆరు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షకు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశారు. ఉదయం 7 గంటలకు ఇందిరాపార్క్ వద్ద ‘వరలక్ష్మి దీక్షా ప్రాంగణా’నికి చేరుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. ఆ తరువాత అక్కడినుంచి వారంతా నల్ల బ్యాడ్జీలు ధరించి ‘పెద్ద చదువులు - పేదవారి హక్కు’, ‘మహానేత డాక్టర్ వైఎస్‌ఆర్ ఆశయానికి తూట్లు పొడవొద్దు’, ‘జగన్ దీక్షకు ప్రభుత్వం స్పందించాలి’ అని రాసిన ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేస్తూ అసెంబ్లీ వరకూ నడిచారు. రామకృష్ణమఠం, సచివాలయం ఫ్లైఓవర్, రవీంద్రభారతి మీదుగా సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఎమ్మెల్యేలు నడుచుకుంటూ వెళ్లి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించారు. మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కొండా సురేఖ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కమలమ్మ, కె.సత్యవతి, జయసుధ, టి.బాలరాజు, మేకతోటి సుచరిత, ప్రసాదరాజు, భూమా శోభానాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, బి.గురునాథ్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కె.రామచంద్రారెడ్డి, వై.బాలనాగిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కాటసాని రాంరెడ్డి, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి పెంచల్‌రెడ్డి, కుర్రి పున్నారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి ఇందులో పాల్గొన్నారు.
ప్రభుత్వ వైఖరి విచారకరం: బోస్
పాదయాత్ర ప్రారంభానికి ముందు పిల్లి సుభాష్ చంద్రబోస్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ తన ఒక్కడి కోసం దీక్ష చేయడం లేదనీ, పాతిక లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం చేస్తున్నారని అన్నారు. ఆరు రోజులుగా ఆయన కఠోర దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్ ఆశయాలకు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ తూట్లు పొడుస్తోందని, అందుకే తాము ఆందోళనకు సిద్ధపడ్డామని ఆయన అన్నారు. ఇప్పటికైనా సర్కార్ దిగివచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జగన్‌పై ప్రభుత్వానికి కక్ష: కొండా సురేఖ
కాలినడకన అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన కొండా సురేఖ సహచర ఎమ్మెల్యేలతో కలిసి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్ దీక్ష చేస్తున్నాడా? ఎక్కడ? అని ఓ మంత్రి ప్రశ్నిస్తూ ఉంటే ఆయన పక్కన ఉన్న మంత్రులు ఎగతాళిగా నవ్వారని తప్పు పట్టారు. జగన్‌లాంటి నేత దీక్ష చేస్తుంటే నిజంగా ప్రభుత్వానికి సమాచారం ఉండదా? ఇంటెలిజెన్స్ వారు చెప్పి ఉండరా? అని ఆమె ప్రశ్నించారు. ఒక పెద్ద నాయకుడు చేస్తున్న దీక్ష గురించే తెలుసుకోలేని ప్రభుత్వం ఇక సామాన్యుల గురించి ఏం తెలుసుకుంటుందని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్సీ జూపూడి మాట్లాడుతూ.. ఎవరైనా దీక్ష చేస్తే ప్రభుత్వం మూడోరోజే స్పందిస్తుందని, అలాంటిది జగన్ గురించి పట్టించుకోకుండా ఆయనపట్ల, ఆయన అనుయాయుల పట్ల కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఆళ్ల నాని మద్దతు: ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) మధ్యాహ్నం దీక్షా శిబిరం వద్దకు వచ్చి జగన్‌ను కలిసి తన మద్దతును ప్రకటించారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి దీక్షలో పాల్గొన్నారు.

వారసులమంటూనే వైఎస్ పథకాలకు కత్తెర
రాష్ట్ర బడ్జెట్ వైఎస్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచే విధంగా ఉందని మాజీమంత్రి కొణతాల రామకృష్ణ విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు.. వైఎస్‌కు వారసులమంటూనే ఆయన పథకాలకు కేటాయింపులు తగ్గిస్తున్నారని ధ్వజమెత్తారు. యువనేత జగన్ క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆయన శాప్ మాజీ చైర్మన్ పి.ఎన్.వి.ప్రసాద్, టీటీడీ మాజీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద రూ.3,400 కోట్ల మేరకు బకాయిలు చెల్లించాల్సి ఉంటే బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లే కేటాయించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ పథకానికి ఏటా సుమారు రూ.4 వేల కోట్లు అవసరం అవుతాయనే విషయాన్ని గుర్తుచేస్తూ కనీసం ఆరేడు వేల కోట్ల రూపాయలు కేటాయించి ఉంటే ఈ పథకం కొనసాగిస్తారనే నమ్మకం ఏర్పడేదన్నారు.
కానీ ప్రస్తుత కేటాయింపులు చూస్తే ఈ పథకాన్ని క్రమంగా రద్దు చేయడమో లేదా లబ్ధిదారులైన విద్యార్థులను త గ్గించేందుకు వడపోతను ఆరంభించడమో చేస్తారనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ కోరుతున్నది కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు ఒక్కటే కాదనీ, ఈ పథకంపై ఒక స్పష్టమైన వైఖరితో నిర్దిష్ట ప్రణాళికను ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. వైఎస్ అధిక ప్రాధాన్యత ఇచ్చిన పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు ఇన్ని నిధులను కేటాయిస్తామని కూడా బడ్జెట్‌లో పేర్కొనలేదని కొణతాల అన్నారు. సీఎం కిరణ్ చిత్తూరు జిల్లా వాడైనందుకు తాను సిగ్గుపడుతున్నానని చెవిరెడ్డి అన్నారు.
‘ఫీజు’ కోసం పోరుబాట
జగన్ నిరాహార దీక్షకు మద్దతుగా రాష్టవ్య్రాప్తంగా విద్యార్థి లోకం కదిలివస్తోంది. యువనేతకు మద్దతుగా బుధవారం రాష్టవ్య్రాప్తంగా వైఎస్, జగన్ అభిమానులు, విద్యార్థులు బంద్‌లు, ఆందోళనలు, నిరశనలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. జగన్ ఆరోగ్యం కోసం రాష్టవ్య్రాప్తంగా పలు దేవాలయాలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు చేశారు. జగన్ దీక్షకు మద్దతుగా గురువారం విశాఖ ఏజెన్సీలో బంద్ పాటించనున్నారు. విశాఖ జీవీఎంసీ ముందు ఆమరణ దీక్ష చేస్తున్న 12 మందిలో నలుగురిని ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి, ఏజెన్సీ ప్రాంతాల్లో బుధవారం బంద్ విజయవంతమైంది. దీక్షకు మద్దతుగా గురువారం వరంగల్ కాకతీయ వర్సిటీ నుంచి ర్యాలీ నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలు జరిగాయి. నాగార్జున వర్సిటీ విద్యార్థులు రాస్తారోకో చేశారు.
మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పొన్నూరు, నరసరావుపేటల్లో గురువారం బంద్‌కు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో గుత్తి గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. అనంతపురంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. కడప వైఎస్ సర్కిల్‌లో నేతలు, విద్యార్థులు మానవహారంగా నిలిచారు. అమీన్‌పీర్ (పెద్ద) దర్గాలో మైనార్టీ నేతలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పులివెందులలో తరగతులు బహిష్కరించి ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌కు వినతిపత్రమిచ్చారు.
స్కాలర్‌షిప్ అందక విద్యార్థి ఆత్మహత్యాయత్నం: రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం మరో విద్యార్థి నిండు ప్రాణాన్ని బలిగొనేలా ఉంది. స్కాలర్‌షిప్ రాకపోవడం, వసతి గృహంలో ఉండొద్దని యాజమాన్యం చెప్పడంతో విజయనగరం మహారాజా కాలేజీలో ఇంటర్ చదువుతున్న దుంప జనార్దన్ (18), బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది.
దీక్షా వేదికపై ఎవరేమన్నారంటే..
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ‘మూడు రోజుల్లోనే ఎందుకు విరమించారు?’
వయసులో ఉన్న వారు 10 రోజులు తినకున్నా ఏమీ కాదని జగన్ నిరాహార దీక్షపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించడం సమంజసం కాదు. జగన్ దీక్ష విషయంలో ఇలా మాట్లాడే రాజగోపాల్ మూడు రోజుల్లోనే ఎందుకు దీక్ష విరమించారో చెప్పాలి. జగన్ దీక్షపై స్పందించాలని సర్కారుకు చెప్పాల్సిందిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం. జగన్ మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారని రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.
- లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు
‘దీక్షకు గౌరవప్రదమైన ముగింపునివ్వండి’
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం యువనేత జగన్ చేస్తున్న దీక్షకు ఇప్పటికైనా స్పందించి గౌరవప్రదమైన ముగింపునివ్వాలి. అలాకాని పక్షంలో అపవాదులను ఎదుర్కోక తప్పదు. జగన్‌ని దూరం చేసుకోవడంలో కాంగ్రెస్ ఇప్పటికే కొన్ని తప్పులు చేసి నష్టపోయింది. మరిన్ని తప్పులు చేసి పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితిని కాంగ్రెస్‌లోని నాయకులే తీసుకొస్తున్నారు. ఆరోగ్యం పాడుచేసుకోకుండా జగన్ దీక్షను విరమించాలి.
- హరిరామ జోగయ్య, మాజీ ఎంపీ
- హరిరామ జోగయ్య, మాజీ ఎంపీ
ప్రభుత్వం.. రెండు తలల విషసర్పం
ముఖ్యమంత్రి కిరణ్ తాము వైఎస్ వారసులమని, ఆయన పెట్టిన పథకాలు కొనసాగిస్తామని అంటారు. డీఎల్ రవీంద్రారెడ్డి అవే పథకాలు సర్కారుకు గుదిబండలని వ్యాఖ్యానిస్తారు. శంకర్‌రావు అక్రమాలని ఏదో అంటారు. ఇలా రెండు నాల్కల ధోరణితో రెండు తలల విషసర్పాలను వీరు గుర్తుకు తెస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు అనేవి 26 లక్షల మందికి సంబంధించిన అంశాలు. ఇది అన్నిపార్టీలకు, ప్రాంతాలకు సంబంధించిన సమస్య. జగన్ దీక్షను అడ్డుకోవాలని చంద్రబాబు తెలంగాణ నేతలకు చెప్పడం దారుణం. 6 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం క్షీణించడంతో ఎంతో మంది ఆందోళన చెందుతున్నారు. వారి ఆశీస్సులే జగన్‌కు శ్రీరామ రక్ష.
- అంబటి రాంబాబు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్
బడ్జెట్‌ను సవరించాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 25 మంది ఎమ్మెల్యేలం పాదయాత్ర చేశాం. ప్రభుత్వం స్పందించాలని కోరాం. సర్కారులో స్పందనే లేదు. తాజా బడ్జెట్‌లోనూ రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను పక్కనబెట్టారు. ఇదేనా సర్కారు చిత్తశుద్ధి. రీయింబర్స్‌మెంట్ సంక్షేమ పథకం కాదు. భావితరాల అభ్యున్నతి కోసం సమాజంపై చేసే పెట్టుబడి. బడ్జెట్ సవరణకు మరో 30 రోజుల సమయం ఉంది. ఇప్పటికైనా సవరించుకోవాలి. లేకుంటే జగన్ మళ్లీ ఒత్తిడి తెస్తారు. - శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే
వెంటనే నిధులివ్వాలి
పేద విద్యార్థులకు పెద్ద చదువులు అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు కోసం ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి. - ఎం.సుచరిత, ఎమ్మెల్యే
వైఎస్ పేరు తలిచే అర్హత లేదు
ప్రభుత్వ పెద్దలు వైఎస్ పేరు తలిచే అర్హత కోల్పోయారు. వైఎస్ పేరును కొట్టేయడానికి ఆయన పథకాలను కాంగ్రెస్ పథకాలుగా నేతలు చెప్పుకుంటున్నారు. పావలా వడ్డీ పథకం తన సూచనే అని సీఎం అబద్ధాలు చెబుతున్నారు.
- పుల్లా పద్మావతి, ఎమ్మెల్సీ
పదవిలో ఉండే అర్హత లేదు..
వైఎస్ వారసులమని చెప్పుకొంటూ ఆయన పదవిలో కూర్చున్న వారు పేదల సంక్షేమం పేరుతో సంక్షోభం సృష్టిస్తున్నారు. ఉపకారం పేరుతో అపకారం చేస్తున్నారు. సుప్రీంకోర్టుతో చివాట్లు తిన్న వారికి పదవిలో ఉండే అర్హత లేదు.
- రోజా, మహిళా నాయకురాలు
జగన్ దీక్ష చేస్తుంటే స్పందించని ప్రభుత్వానికి సిగ్గులేదా అని చాలా మంది అంటున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదు. ఇది కేవలం విద్యార్థుల సమస్యే కాదు. 1.50 కోట్ల జనాభా సమస్య. కురుక్షేత్రంలో అభిమన్యుడిలాగే ఇప్పడు జగన్ పోరాడుతున్నారు.
- తోట గోపాలకృష్ణ, మాజీ ఎంపీ
జగన్ ముఖ్యమంత్రి అయితేనే వైఎస్ పథకాలు సమర్థవంతంగా అమలవుతాయి. యువనేత ఒక్క పిలుపునిస్తే ఎంతటి పోరాటానికైనా విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు.
- బుచ్చి మహేశ్వరరావు, మాజీ ఎంపీ
రాష్ట్రంలో మానవత్వం లేని ప్రభుత్వం ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం జగన్ అభిమన్యుడిలా పోరాటం చేస్తుంటే ప్రభుత్వంలోని వారు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు.
- బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే
జిల్లాకో యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత వైఎస్‌దే. అందరికీ ఉన్నత విద్య అందించాలని ఆయన పెట్టిన పథకానికి ఇప్పుడు తూట్లు పొడుతున్నారు.
- కె.రవి కుమార్, మాజీ ఎమ్మెల్యే
రాష్ట్రానికి దశ, దిశ కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి.
- జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే
వైఎస్ పథకాలను పక్కనబెట్టిన ప్రస్తుత ప్రభుత్వం జగన్ ప్రవాహంలో కొట్టుకుపోవడం ఖాయం. - చల్లా వెంకటకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీనుంచి ఎంతో మంది సీఎంలయ్యారు. అయితే వైఎస్ సీఎం అయ్యాకే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం పట్టని సర్కారిది. శంకర్‌రావు మాటలు చూస్తుంటే ఎస్సీలు సిగ్గుపడుతున్నారు.
-ఎం.నాగార్జున, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్
ఫీజు రీయింబర్స్‌మెంట్ రాష్ట్రం మొత్తానికి సంబంధించిన సమస్య. ప్రజాస్వామ్యయుతంగా దీక్ష చేస్తున్న జగన్‌తో చర్చలు జరపాల్సిన నైతిక బాధ్యత సర్కారుపై ఉంది. జగన్ దీక్ష చేస్తుంటే కొందరు మంత్రులు హేళనగా మాట్లాడడం సరికాదు.
- కె.శ్రీనివాసరెడ్డి, ఐజేయూ ప్రధాన కార్యదర్శి
ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఒక ప్రాంతానికో, రాజకీయ పార్టీకో సంబంధించిన సమస్య కాదు. లక్షలాది పేద కుటుంబాల సమస్య. సుప్రీంకోర్టు జోక్యం, జగన్ ఉద్యమంతో ఈ పథకాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
- దేవులపల్లి అమర్, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్
జగన్ దీక్ష చేస్తుంటే సర్కారుకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. దానికి పోయేకాలం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవుతారు.
- ఎం.వి.హర్షవర్ధన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మైసూరారెడ్డి కుమారుడు
ఎవరి గొడవ వాళ్లు చూసుకునే ఈ రోజుల్లో జనం కోసం దీక్ష చేస్తున్న నేత జగన్. జగన్ ఈజ్ జగన్, జగన్ ఈజ్ వైఎస్‌ఆర్. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పని వంశం నుంచి వచ్చిన జగన్ ఆరోగ్యం బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
- ఎస్.వి.కృష్ణారెడ్డి, సినీ దర్శకుడు
ఈ తరం, రేపటి తరం నేత జగన్. సర్కారు ఇప్పటికైనా స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్యలు తీసుకోవాలి.

- అచ్చిరెడ్డి, సినీ నిర్మాత
పేదలకు పెద్ద చదువుల కోసం వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెడితే ప్రస్తుత సర్కారు కాలేజీలు మూసివేసే పరిస్థితిని తెచ్చింది. జగన్ ఆరురోజులుగా దీక్ష చేస్తున్నా సర్కారు స్పందించకపోవడమే ఈ పథకంపై వారి నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తోంది.
- తాడి శకుంతల, విజయవాడ మాజీ మేయర్
కులం, మతం అని తేడా లేకుండా పేదలందరికీ ఉన్నత చదువులు అందుబాటు ఉండేందుకు వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారు. ఇప్పటి ప్రభుత్వం దీన్ని పక్కనబెట్టి వారికి కష్టాలు సృష్టిస్తోంది.
- నేదురుమల్లి పద్మనాభరెడ్డి, జగన్ వర్గం నేత
జగన్ దీక్ష సంగతే తెలియదంటున్నాడు మంత్రి బొత్స. తోలు మందమైంది బిడ్డా నీకు. నీ చరిత్ర, నీ కుటుంబ చరిత్ర అంతా తెలుసు. నీది దొంగ డిగ్రీ. వేరే వ్యక్తితో పరీక్షలు రాయించావు. సారా సీసాలు కడిగి పైకి వచ్చావు. విజయనగరం మునిసిపాలిటీ ఎన్నికల్లో తేలుస్తాం నీ సత్తా ఎంటో.
- గోనె ప్రకాష్‌రావు, ఆర్టీసీ మాజీ చైర్మన్

No comments:
Post a Comment