
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జాతీయ అధ్యక్షు డిగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్‌ఆర్ కాంగ్రెస్) ఏర్పాటయింది. మొత్తం ఏడుగురు కమిటీ సభ్యులుగా ఈ పార్టీని ఏర్పాటుచేశారు. ఉపాధ్యక్షుడిగా కొలిశెట్టి శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ పార్టీని తొలుత ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసింది శివకుమారే కావడం గమనా ర్హం. ప్రధాన కార్యదర్శిగా బాజిరెడ్డి గోవర్దన్, కోశాధికారిగా ఆర్.కిరణ్‌కుమార్‌రెడ్డి, సహా య కార్యదర్శిగా రహ్మాన్, కార్యనిర్వ హక కార్యదర్శిగా పుల్లా భాస్కర్, ప్రచార కార్యదర్శిగా జంగా కృష్ణమూర్తి, మహిళా విభాగం కార్యదర్శిగా కొల్లి నిర్మలాకుమారి ఎంపి కయ్యారు.
వీరిలో కిరణ్‌కుమార్‌రెడ్డి గతం లోవైఎస్ ఉండగా పీఎస్ హోదాలో ఆరోగ్య శ్రీ విభాగాన్ని పర్యవేక్షించేవారు. ఈ జాబితా ను ఎన్నికల సంఘానికి సమర్పించిన నేప థ్యంలో దానికి సంబంధించిన అనుమతి వ్యవహారాలు రెండువారాల్లో వస్తాయని ఆశిస్తున్నారు. ఇదిలాఉండగా.. ఉగాది రోజున వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇడుపుల పాయలో ప్రకటించనున్నట్లు సమాచారం. నిజానికి మూడు, నాలుగు తేదీలు అనుకు న్నప్పటికీ ఏప్రిల్ 4న ఉగాది పర్వదినం ఉన్నందున అదేరోజు పార్టీ ప్రకటన అధికా రికంగా చేయవచ్చంటున్నారు.ఈలోగా.. జిల్లా పర్యటనలు నిర్వహించి, జిల్లా కమి టీలు ఎంపిక చేసుకునే పనిలో జగన్ వర్గీ యులు బిజీగా ఉన్నారు. జగన్ పార్టీకి చెం దిన సీనియర్ నేత గట్టు రామచంద్రరావు ఇప్పటికే జిల్లా పర్యటనలు చేస్తూ ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి తీసుకువచ్చే పనిలో ఉన్నారు. జిల్లా కమిటీ నాయకుల పేర్లను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. పార్టీ ప్రకటించిన తర్వాత ఆ జాబితాను విడుదల చేయనున్నట్లు సమా చారం.
కాబోయే సీఎం జగన్

No comments:
Post a Comment