Thursday, September 1, 2011

''మళ్లీ వస్తాను.. మీ అందరినీ కలుస్తాను.. జగన్ మీ వాడు.. మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు’'

కృష్ణా జిల్లా గ్రామాలకు జగన్ హామీ
తొలి విడత ఓదార్పు యాత్ర ముగించుకుని....

వెళుతుండగా అడ్డుపడిన అభిమానులు
తమ గ్రామాలకు రావాలంటూ పట్టు....

త్వరలోనే మలి విడత యాత్రకు వస్తానన్న జననేత

తొలి విడత 17 రోజుల్లో 809 కి.మీ. ప్రయాణం

‘త్వరలోనే మళ్లీ వస్తాను.. మీ అందరినీ కలుస్తాను.. జగన్ మీ వాడు.. మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు’ అని కృష్ణా జిల్లా వాసులను ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లాలో తొలి విడత ఓదార్పు యాత్రను బుధవారం ముగించుకొని గన్నవరం విమానాశ్రయానికి వెళుతుండగా మార్గం మధ్యలో పలు గ్రామాల ప్రజలు తమ ఊళ్లకు రావాలంటూ పట్టుబట్టడంతో ఆయన పై విధంగా నచ్చజెబుతూ ముందుకు కదిలారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లారు.

17 రోజులైనా షెడ్యూలు పూర్తికాలేదు..


తొలుత అనుకున్న షెడ్యూలు ప్రకారం జిల్లాలో యాత్ర 16 రోజుల్లో పూర్తవ్వాలి. అయితే వరుసగా 17 రోజులపాటు పర్యటించినా షెడ్యూలులో సగం కూడా పూర్తికాలేదు. అడుగడుగునా జన తాకిడి, షెడ్యూల్లో లేని గ్రామాలకూ రావాలంటూ ప్రజలు పట్టుబట్టడంతో రోజూ యాత్రలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. దీంతో ఎలాగైనా షెడ్యూలును సకాలంలో పూర్తిచేయడానికి జగన్ రోజూ అర్ధరాత్రి దాటాక 2 వరకు కూడా ప్రయాణించారు. వర్షాలు కురుస్తున్నా లెక్కచేయకుండా వాటిలో తుడుస్తూనే ఆత్మబంధువుల ఇళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయినప్పటికీ యాత్రను విరామం లేకుండా కొనసాగించారు. కాగా సెప్టెంబర్ 2న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేపథ్యంలో ఆయన యాత్రకు విరామమిచ్చారు.

17వ రోజు యాత్ర సాగిందిలా..


ఓదార్పు యాత్ర 17వ రోజు బుధవారం ఆయన బోర్వంచ గ్రామంలోని మసీదులో ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. తర్వాత రావిచర్ల, కొత్త రావిచర్ల గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి గన్నవరం బయలుదేరారు. మార్గం మధ్యలో ఆగిరిపల్లి, తోటపల్లి, గొల్లనపల్లి, బీబీగూడెం, గన్నవరం తదితర గ్రామాల ప్రజలు తమ ఊళ్లకు రావాలని పట్టుబట్టారు. మలి విడత ఓదార్పు యాత్రకు త్వరలోనే వస్తానని, అప్పుడు తప్పకుండా వారి గ్రామాలకు వస్తానని నచ్చజెప్పి జగన్ ముందుకు సాగారు.


ఎదురు చూస్తుంటాం.. వెళ్లిరా నాయినా


మంగళవారం ఓదార్పు యాత్ర షెడ్యూల్‌లో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి ముసునూరు మండలంలోని బాసవరప్పాడు, అక్కిరెడ్డిగూడెం, చక్కపల్లి, వలసపల్లి మీదుగా ముసునూరు మండల కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. జన తాకిడితో యాత్ర దాదాపు ఎనిమిది గంటలు ఆలస్యమయింది. తుమ్మగూడెంలో విగ్రహావిష్కరణ చేసే సమయానికి అర్ధ రాత్రి దాటిపోయింది. అప్పటికే జగన్ బాగా అలసిపోవడంతో నిర్వాహకులు పై గ్రామాల్లో యాత్రను వాయిదా వేశారు.


కాగా జననేతకోసం రాత్రి ఒంటి గంట వరకు ఎదురు చూసిన మర్లపాడు గ్రామస్తులు బుధవారం జగన్ కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. తమ గ్రామాలకు రావాలంటూ పట్టుబట్టారు. ‘అమ్మా జ్వరంగా ఉంది... మళ్లీ వస్తాను. దారి ఇవ్వండి’ అని జగన్ వారిని కోరడంతో గ్రామస్తులు ఆయనకు దారిచ్చారు. ‘నీ కోసం ఎదురు చూస్తుంటాం.. తప్పకుండా రావాలి.. నాన్న విగ్రహాన్ని ఆవిష్కరించాలి’ అని ఆ గ్రామస్తులు కోరారు. జగన్‌మోహన్‌రెడ్డికి వీడ్కోలు పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.


809 కిలోమీటర్లు.. 22 కుటుంబాలు


కృష్ణా జిల్లా తొలి విడత ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, నూజివీడు, తిరువూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. 17 రోజుల్లో మొత్తం 809 కిలోమీటర్లు ప్రయాణించి 223 గ్రామాలను పలకరించారు. 237 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి 22 బాధిత కుటుంబాలను ఓదార్చారు. బుధవారం యాత్రలో జగన్ వెంట కృష్ణా జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, పూడూరు గౌతంరెడ్డి తదితరులున్నారు.

Tuesday, August 30, 2011

త్వరలోనే మంచి రోజులు: జగన్‌ * రైతన్నలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

వైఎస్ సువర్ణయుగంలో మా సీఎం ఉన్నాడన్న భరోసా ఉండేది
మద్దతు ధరకంటే మూడొందలు ఎక్కువే వస్తాయన్న ధీమా ఉండేది
మహానేత పోయాక ఏ రైతును కదిల్చినా కన్నీరే..
రైతుల ముఖాల్లో చిక్కటి చిరునవ్వులు పూసే రోజులు త్వరలోనే
వైఎస్సార్ చనిపోయి రెండు సంవత్సరాలైనా ఇంకా
ప్రజల గుండెల్లో బతికున్నారనే కాంగ్రెస్, టీడీపీల అక్కసు


ఓదార్పు యాత్ర : ‘రాముడి రాజ్యమైతే మనం చూడలేదుగాని రాజశేఖరుడి సువర్ణయుగం చూశాం. ఆ సువర్ణ యుగంలో ఏ సమస్య వచ్చినా.. మా ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉన్నాడులే, ఆయన చూసుకుంటాడులే అని ప్రతి రైతన్నకూ ఓ ధీమా ఉండేది. ఇప్పుడు ఏ అన్నదాతను కదిలించినా కన్నీరే కనపడుతోంది. ఈ కష్టాలు పోయి.. మీ ముఖాల్లో చిక్కటి చిరునవ్వులు పూసే రోజు త్వరలోనే వస్తుందని నేను భరోసా ఇస్తున్నా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. కృష్ణా జిల్లా ఓదార్పు యాత్ర 15వ రోజు సోమవారం ఆయన చాట్రాయి, ముసునూరు, నూజివీడు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ప్రజల కోరిక మేరకు దాదాపు అన్ని గ్రామాల్లో ఆయన క్లుప్తంగా ప్రసంగించారు.

రాత్రి 11.30 గంటలకు జోరున కురుస్తున్న వర్షంలో చాట్రాయి మండల కేంద్రంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం రాత్రి ఏడు గంటలకు చేయాల్సి ఉండడంతో అప్పటికే అక్కడికి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. తొమ్మిది గంటల నుంచి భారీ వర్షం కురిస్తున్నా.. అక్కడి నుంచి కదల్లేదు. జగన్ కోసం అలాగే వేచి ఉన్నారు. వారినుద్దేశించి జననేత ప్రసంగిస్తూ ‘మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేన’ంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సోమవారం జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...

రైతులు వరి కంటే ఉరే మేలనుకుంటున్నారు

రాష్ట్రంలోనే కాదు కదా.. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రైతులు సమ్మెచేస్తున్నారు. కనీసం వారి గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇవాళ రైతు వరి వేసుకోవడం కంటే ఉరి వేసుకోవడమే మేలు అనుకుంటున్నాడు. అదే దివంగత మహానేత సువర్ణ యుగంలో అయితే అన్నదాతకు భరోసా ఉండేది. వేసిన పంట ఏ ధరకు అమ్ముడు పోతుందో అనే ఆలోచనే ఉండేది కాదు. కనీస మద్దతు ధర కంటే రూ.200, రూ.300 ఎక్కువే వస్తుందనే నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్లీ రైతన్న ముఖంలో చిరునవ్వులు చూసే రైతు ప్రభుత్వం త్వరలోనే రాబోతోంది.

చంద్రబాబూ ఆ కిటుకు చెప్పు..


అయ్యా.. చంద్రబాబు నాయుడూ ఈ వేళ మీరు రోడ్లెక్కి అవినీతి గురించి మాట్లాడుతున్నారు. వెయ్యి కోట్ల రూపాయలిస్తే మీ ఆస్తులు రాసిస్తానంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన రోజుల్లో నువ్వు రెండెకరాల ఆసామివి. ఈ వేళ నువ్వు వెయ్యి కోట్లు ఎలా సంపాదించావు చంద్రబాబూ? రెండెకరాల నుంచి వెయ్యి కోట్లు ఎలా సంపాదించవచ్చో ప్రతి పేదవాడికి కూడా చెప్పు.

వైఎస్‌పై కాంగ్రెస్, టీడీపీ కుట్ర


ఈ రోజు కేంద్రంలో, రాష్ట్రంలో సోనియా గాంధీ రాజ్యమేలుతున్నారంటే.. కారణం వైఎస్సార్ రెక్కల కష్టమే. అలాంటి నేత చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికిఉండడమే నేరమన్నట్లు కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై విలువలు కూడా మరిచిపోయి రాజకీయాలు చేస్తున్నారు. ఈ టీడీపీ, కాంగ్రెస్ పెద్దలకు ఒక్క మాట చెప్తున్నా.. మీరు చేస్తున్న రాజకీయాలు పై నుంచి దేవుడు గమనిస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీకు డిపాజిట్లు కూడా రాకుండా మీ రెండు పార్టీలను ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారు.

Thursday, July 21, 2011

ఇబ్బందులెదురైనా నాన్న బాటలోనే...........

నంద్యాల సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటన 
కేబినెట్ సమష్టి నిర్ణయాలైనా.. వైఎస్ ఒక్కడిపై బురదజల్లేందుకే కేసులు
కాంగ్రెస్, టీడీపీ నన్ను రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నాయి
రెండెకరాలతో రాజకీయాల్లోకొచ్చిన బాబుకు
ఇప్పుడు వీధివీధినా హెరిటేజ్ షాపులెలా వచ్చాయి?


కర్నూలు జిల్లా ఓదార్పు యాత్ర : ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చూపిన బాటలోనే నడుస్తానని, ఆయన ఆశయాలను కొనసాగించి తీరతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ‘‘ఇవాళ నన్ను, నా తల్లిని నాశనం చేయాలన్న దురుద్దేశంతో చంద్రబాబు, కాంగ్రెస్, ఈనాడు, మరో తోకపత్రిక, టీవీ-9 చానెల్ అందరూ ఒక్క తాటిపైకి వచ్చారు. అయినా బెదిరేది లేదు. మాట తప్పేది లేదు.. వారందరికీ లేనివి.. నాకు, నా తల్లికి మాత్రమే అండగా ఉన్నవి.. ఆ దేవుడి దయ, వైఎస్‌ను అభిమానించే గుండె చప్పుడు’’ అని ఆయన ఉద్వేగంగా అన్నారు. కర్నూలు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా ఆయన బుధవారం రాత్రి 11:30కు నంద్యాల బహిరంగ సభలో ప్రసంగించారు. దాదాపు ఆరుగంటలు ఆలస్యంగా జగన్ ఇక్కడికి చేరుకున్నారు. అంత ఆలస్యమైనప్పటికీ వేలాది మంది ప్రజలు నిరీక్షించారు. స్థానిక శ్రీనివాస సెంటర్‌లో వైఎస్ విగ్రహావిష్కరణ అనంతరం ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్, టీడీపీలపై నిప్పులు చెరిగారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

‘మాట ఇస్తే కష్టమైనా నష్టమైనా తప్పకూడదని, ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం.. బతికనంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యమని నమ్మి.. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన వ్యక్తి రాజశేఖరరెడ్డి. ఆ మహానేతకు పుట్టిన కొడుకుగా ఆయన బాటలోనే నడుస్తూ నేను ఇచ్చిన మాట కోసం నిలబడ్డా. బాధెక్కడ అనిపిస్తోందీ అంటే.. ఆ మహానేత రెక్కల కష్టంమీద ఏర్పడిన రాష్ట్ర, దేశ ప్రభుత్వాలు ఈ రోజు ఆ కృతజ్ఞత కూడా లేకుండా.. ఆయన చనిపోయారన్న ఆలోచన కూడా లేకుండా, ఆయన తిరిగివచ్చి సమాధానం చెప్పుకోలేరన్న సంగతి తెలిసి.. రాజశేఖరరెడ్డిపై బురదజల్లుతున్నాయి. ఆయన చేసిన పాపమల్లా ఒకటే ఒకటి.. చనిపోయిన తర్వాత ప్రతి గుండెలో బతికి ఉండడమే. నేను చేసిన తప్పల్లా ఒకటే ఒకటి.. ఇచ్చిన మాట మీద నిలబడడం, దాని కోసం ఎంతవరకైనా పోరాడ్డానికి సిద్ధపడడమే.


మీరంతా కలిసి తీసుకున్న నిర్ణయాలే కదా..: ఆ మహానేత మీద బురదజల్లడానికి కాంగ్రెస్ పెద్దలు ఎన్ని కుట్రలు పన్నుతున్నారంటే... అదే పార్టీకి చెందిన మంత్రితో కోర్టులో కేసు వేయిస్తారు. వైఎస్ చనిపోయి రెండేళ్లయిపోయాక ఇప్పుడు కేసు వేశారేంటయ్యా అని అడిగితే..సోనియా వెయ్యమంటేనే వేశాను అంటారా మంత్రి. ఆ రోజు కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు.. మంత్రివర్గ సభ్యులంతా కలిసి తీసుకున్నవి కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈ కాంగ్రెస్‌కు టీడీపీ కూడా తోడై.. రెండూ కలిసి నన్ను రాజకీయంగా అణగదొక్కడం కోసం చనిపోయిన నాన్నపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి.


బాబు రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చారు..: ఇదే చంద్రబాబు నాయుడుగారు.. తనపై అవినీతి ఆరోపణలు వస్తే.. వాటిపై స్టే తెచ్చుకుని ఆరేళ్లుగా కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈయన రెండెకరాలతో రాజకీయ జీవితం మొదలుపెట్టారు. ఈ రోజు ఆయనకు వీధి వీధినా హెరిటేజ్ ఫ్రెష్ షాపులు ఎలా వచ్చాయి? ఆ వేళ బాబు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలీ అంటే.. సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారాయన. ఈరోజు అదే కాంగ్రెస్‌తో కుమ్మక్కై.. జగన్‌ను రాజకీయంగా నాశనం చేయాలి అని, వైఎస్‌ను భ్రష్టుపట్టించాలన్న దురుద్దేశాలతో సీబీఐ విచారణ వేయించాలని సిగ్గులేకుండా అడుగుతున్నారు.


ప్రభుత్వంలో ఉంటూ కోర్టుకెందుకు వెళ్లారు?
*మంత్రి శంకర్రావుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత గట్టు ధ్వజం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని మంత్రి శంకర్రావు ప్రశ్నించడాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తప్పుబట్టారు. కోర్టులు ఏమైనా ఆయన జాగీరా అంటూ మండిపడ్డారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని శంకర్రావు అడగటానికి.. న్యాయస్థానాలేమైనా ఆయన జాగీరా? లేదా ఆయన జేబు సొత్తా?’’ అని ప్రశ్నించారు. రాజకీయ ప్రేరేపితమైన కేసులను స్వీకరించవద్దని గతంలో సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. ‘‘రాజకీయ కుట్రలో భాగంగా తన ఆస్తులపై సీబీఐ విచారణ చేపట్టడం సరికాదంటూ జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దాన్ని మంత్రి శంకర్రావు ప్రశ్నించడం ఆశ్చర్యకరంగా ఉంది. ప్రభుత్వంలో భాగస్వామి అయిన మీరు ముందు కోర్టును ఎందుకు ఆశ్రయించారో బదులివ్వాలి. నేరుగా విచారించే అర్హత పెట్టుకొని, కోర్టుకు ఎందుకు లేఖ రాశారు? మీ ప్రభుత్వంపై మీకే నమ్మకం లేదా? సీఎంపై నమ్మకం లేదా?’’ అని నిలదీశారు. భారతదేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పుకున్న రాహుల్‌కు ప్రధాని అయ్యే అర్హత ఉన్నప్పుడు... దేశ పౌరుడైన జగన్ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడంలో తప్పేముందన్నారు. సోనియా ఆదేశాల మేరకే లేఖ రాశానని శంకర్రావే స్వయంగా ఒప్పుకున్నారని, ఆ తర్వాతే ఆయనకు మంత్రి పదవి వచ్చిందన్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై జగన్‌ను టార్గెట్ చేశాయనడానికి శంకర్రావు రాసిన లేఖేఆధారమన్నారు. రెండు పార్టీలకు అవగాహన ఒప్పందం కుదర్చడంలో ‘ఈనాడు’ అధినేత రామోజీ మధ్యవర్తిత్వం నడిపారని ఆరోపించారు.
 

Wednesday, July 20, 2011

ప్రజల తోడుంటే ఎవరితోనైనా కొట్లాడతా!మాట తప్పనందుకే ఈ చిత్రహింసలు.....

ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్ ఉద్వేగభరిత ప్రసంగం
ప్రజల ప్రేమాభిమానాలు నాకు తోడుగా ఉన్నంతకాలం
సోనియా, సీఎం, చంద్రబాబు.. ఎవ్వరితోనైనా కొట్లాడతా
ప్రజల గుండెల్లో ఇంకా బతికున్నారన్న కక్షతో వైఎస్‌పై
బురదజల్లేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నాయి
మాట తప్పనందుకే ఈ రోజు నాపై సీబీఐ విచారణలు, ఐటీ నోటీసులు, చిత్రహింసలు...
అయినా ఇచ్చిన మాట కోసం ప్రాణాలు ఇవ్వడానికి
సైతం వెనుకాడను... నా కాళ్లు, వెన్నెముక విరగ్గొట్టినా కూడా.. మళ్లీ కెరటంలా పైకిలేస్తాను
ఎందుకంటే నాకు దేవుడి దయ, వైఎస్‌ను అభిమానించే గుండె చప్పుళ్లు అండగా ఉన్నాయి
నాన్న వైఎస్ సాక్షిగా చెప్తున్నా నాపై ప్రజలనమ్మకాన్ని వమ్ముకానీయను


కర్నూలు జిల్లా ఓదార్పు యాత్ర నుంచి-ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సైతం వెనుకాడనని, ప్రజల ప్రేమాభిమానాలు తనకు అండగా ఉన్నంతకాలం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతోసైతం కొట్లాడతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై బురదజల్లడానికి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు పన్నుతున్నాయని, ఆ కుట్రలో భాగంగానే తనకు కేసుల వేధింపులని దుయ్యబట్టారు.


‘నాపై సీబీఐ విచారణలు జరిపించవచ్చు.. ఇన్‌కంటాక్స్ నోటీసులు ఇప్పించవచ్చు.. తప్పుడు కేసులు బనాయించవచ్చు.. నా కాళ్లు, వెన్నెముకను కూడా విరగ్గొట్టవచ్చు.. ఎన్ని చేసినా మళ్లీ కెరటంలా పైకిలేస్తాను. ఎందుకంటే నాకు, అమ్మకు ఆ దేవుడి దయ, వైఎస్‌ను ప్రేమించే గుండె చప్పుళ్లు అండగా ఉన్నాయి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడను. చనిపోయిన నాన్న సాక్షిగా చెపుతున్నా.. నాపై ప్రజలు పెట్టుకున్న అచంచల విశ్వాసాన్నీ, నమ్మకాన్ని ఏ ఒక్కరోజు.. ఏ ఒక్క సందర్భంలోనూ వమ్ముచేయను.


వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రజల ప్రేమాభిమానాలు నాకు అండగా ఉన్నంతకాలం సోనియా గాంధీతోనైనా కొట్లాడతా.. ముఖ్యమంత్రితోనైనా కొట్లాడతా.. చంద్రబాబు, ఈనాడు, తోక పత్రిక, ఈ మధ్యే ఆ గ్రూపులో చేరిన టీవీ-9...తోనైనా కొట్లాడతా. ప్రజల ఆప్యాయత, అనురాగాలు నాకు తోడుగా ఉన్నంతకాలం దేశంలో ఎవ్వరితోనైనా కొట్లాడతా’ అని జగన్‌ఉద్వేగంగా మాట్లాడారు. కర్నూలు జిల్లాలో రెండోరోజు మంగళవారం ఓదార్పు యాత్రలో ఆయన కోయిలకుంట్లలో వైఎస్ విగ్రహావిష్కరణ అనంతరం అశేష జనవాహినిని ఉద్దేశించి ఉద్విగ్నంగా ప్రసంగించారు. దీనికి ముందు హరివరం, ఉయ్యాలవాడ, పూపనగుడి, మాయలూరు, అల్లూరు, గుళ్లదుర్తిలలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

నేను చేసిన తప్పల్లా మాట మీద నిలబడడమే


దివంగత మహానేత వైఎస్ చూపిన బాటలో.. ఇచ్చిన మాట తప్పకపోవడమే నేను చేసిన తప్పు.. అలా మాట తప్పనందుకే ఈ రోజు నాపై సీబీఐ ఎంక్వైరీలు, ఇన్‌కంటాక్స్ నోటీసు లు, చిత్రహింసలు.. కేవలం మాటే కదా అని అందరు రాజ కీయ నాయకుల్లాగా నేనూ గాలికి వదిలేసి ఉంటే.. సోనియా నా భుజం తట్టి వెరీగుడ్ అనేవారు..
కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇచ్చేవారు.. కానీ నేను అలా చేయలేదు.. నాన్న చెప్పినట్లు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాటపై నిలబడాలని నిర్ణయించుకున్నా.. అందుకే ఈ రోజు నాపై పాలక, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కైమరీ కుట్రలు చేస్తున్నాయి.

ఆ దేవుడే చేయిస్తున్నాడు:
నేను ఆ మహానేత బాటలో నడుస్తున్నప్పుడు.. అది పూలబాట కాదు.. కష్టాల బాట అని ఆ దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. ఆ దేవుడే ఆ రోజు ఎందుకు చేశాడోగానీ.. నల్లకాలువలో నాతో మాట ఇప్పించాడు.. ఆ దేవుడే ప్రతి గుడిసెలోకీ వెళ్లేలా చేశాడు.. పేదవాడి కష్టాలు నాకు చూపించాడు.. ఆ పేదరికం పోవాలంటే ఏం చేయాలో నాకు తెలిసేలా చేశాడు.. ఒక్క మాటైతే చెప్పగలుగుతున్నా.. నేను తిరిగినన్ని కిలోమీటర్లు ఏ నాయకుడూ తిరగలేదు.. నేను చూసినంత పేదరికం ఏ నాయకుడూ చూడలేదు. దాదాపు 300-350 కుటుంబాలను వారి గుడిసెల్లోకి వెళ్లి చూశాను.. వారి పేదరికం పోవాలంటే ఏం చేయాలో నాకు తప్ప ఏ ఒక్క నాయకుడికీ తెలియదని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. దేవుడు ఎందుకు చేయించాడో తెలియదుగాని.. ఇన్ని కష్టాలు వచ్చినా... ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా మనసుకు మాత్రం సంతోషంగా ఉంది. సీఎం స్థానంలో కూర్చుని ఉన్నప్పుడు వైఎస్‌ను మరో వందేళ్లు మర్చిపోని విధంగా ఆ సువర్ణయుగాన్ని ముప్పై ఏళ్లపాటు నేను అందివ్వగలనన్న నమ్మకం నాలో వెయ్యిరెట్లు పెరిగింది.

ప్రజల గుండెల్లో ఉన్నందుకే వైఎస్‌పై బురద


మహానేత మరణించాక కూడా ప్రజల మనసు లోతుల్లో పదిలంగా ఉన్నారు. అందుకే ఆయనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన తిరిగి రాలేడని తెలిసీ.. చనిపోయారన్న కనీస విచక్షణ కూడా పక్కనబెట్టి పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ రెండూ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘కాంగ్రెస్ హౌస్ కమిటీ వేస్తానంటేనే నేను అసెంబ్లీకి వచ్చాను’ అని చంద్రబాబు అంటారు.. ఆయన కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారనడానికి ఇంతకంటే ఏం చెప్పాలి? దివంగత నేత చనిపోయి రెండేళ్లయ్యాక ఇప్పుడెందుకు కేసు వేశారని అంటే.. సోనియా కేసు వేయమన్నారు కాబట్టే వేశానని మంత్రి శంకర్రావు నిస్సిగ్గుగా చెపుతుంటే.. ఇంతటి దిగజారుడుతనాన్ని చూస్తుంటే బాధేస్తోంది. మరణించిన మహానేతపై బురద చల్లేందుకు ఎంతకైనా దిగజారే ఈ వైఖరి చూస్తోంటే బాధనిపిస్తోంది. చంద్రబాబు తనపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణపై స్టే తెచ్చుకుని ఆరేళ్లుగా కాలం వెళ్లబుచ్చుతున్నారు. నిన్న మొన్నటి దాకా సీబీఐని ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అన్న చంద్రబాబు ఈ రోజు అదే కాంగ్రెస్‌తో కుమ్మక్కయి, సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.


కొత్తగా ఒక్క ఇల్లు లేదు, కార్డు లేదు..


మహానేత మరణించిన ఈ రెండేళ్ల కాలంలో ఒక కొత్త రేషన్ కార్డులేదు.. ఒక్క కొత్త ఇల్లు లేదు.. 108 కుయ్ కుయ్ చప్పుళ్లూ లేవు.. పెద్ద ఆపరేషన్ చేయించాల్సి వస్తే ఆ దేవుడే దిక్కు... 85వేల ఎకరాలకు సాగు నీరందించే హంద్రీ-నీవా పథకం ఎక్కడ వేసిన గొంగళి లాగే ఉంది...రెండేళ్ల క్రింత పేద వాడి ముఖంపై వెలిగిన చిరునవ్వు ఇప్పుడు కానరాదు.. మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే ఒక్క నేతా కనుచూపు మేరలో లేడు.. ఈ దయనీయ పరిస్థితి చూస్తే.. మహానేత రెక్కల కష్టంతో ఏర్పడ్డ ప్రభుత్వమేనా ఇది? అని అనిపిస్తుంది.

త్వరలో మళ్లీ సువర్ణయుగం..


మహానేత సువర్ణ యుగం మళ్లీ కచ్చితంగా వస్తుంది. ఈ రెండేళ్లుగా పేదల ముఖాలపై మాయమైన చిరునవ్వును త్వరలోనే మళ్లీ తెప్పిస్తాను. గతంలో కన్నా మరింత చిక్కటి చిరునవ్వును సుసాధ్యం చేస్తాను. రూ.200 నుంచి రూ.700 పింఛన్‌తో అవ్వలూ, తాతల ముఖాల్లో మరింత చిక్కటి చిరునవ్వు ప్రత్యక్షమవుతుంది. పిల్లలను స్కూలుకు పంపినందుకు తల్లిదండ్రులకు రూ.1,000 చెల్లించే సువర్ణ యుగం త్వరలోనే వస్తుంది. వడ్డీలేని రుణాలతో రైతును ఆదుకునే ప్రభుత్వం వస్తుంది.


రెండో రోజూ అదే ఆప్యాయత.. 5 గంటల ఆలస్యం


కర్నూలు జిల్లాలో రెండోరోజు మంగళవారం ఓదార్పు యాత్రకూ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇచ్చిన మాట కోసం ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ తమ ముందుకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూడ్డానికి ఊళ్లు ఊళ్లన్లీ రోడ్లపైకి వచ్చాయి. ఆయనతో కరచాలనానికి పిల్లా పెద్దా.. అందరూ ఉత్సాహం చూపించారు. అభిమాన సంద్రం వెల్లువెత్తడంతో యాత్ర షెడ్యూల్ కంటే సుమారు ఐదు గంటల ఆలస్యంగా ముందుకు సాగింది.


ఉదయం 9.30 ప్రాంతంలో ఆళ్లగడ్డలోని భూమా దంపతుల ఇంటి నుంచి జగన్ బయలు దేరారు. రాత్రి 11:50కు బనగానపల్లెలో బహిరంగ సభలో మాట్లాడారు. సుమారు ఐదు గంటల ఆలస్యంగా జగన్ ఇక్కడకు వచ్చినప్పటికీ ప్రజలు భారీగాహాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాత్రి 12.30 దాటాక కూడా యాత్ర సాగింది.


ఓదార్చిన కుటుంబాలు: హరివరంలో దళిత మస్తాన్, ఉయ్యాలవాడలో దళిత ఈశ్వరయ్య, బనగానపల్లెలో జడ్డువారి మాధవరెడ్డి కుటుంబాలు.

వైఎస్ విగ్రహావిష్కరణలు: 14; కోయిలకుంట్లలో మాజీ ఎమ్మెల్యే కర్రా సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ


యాత్ర సాగిన గ్రామాలు:
కొండాపురం, దొర్నిపాడు, కంపమల్ల, క్రిష్టిపాడు, హరివరం, ఉయ్యాలవాడ, రూపనగుడి, మాయలూరు, అల్లూరు, గుళ్లదుర్తి, కోయిలకుంట్ల, ముదివేడు, ముక్కమల్ల, ఆకుమల్ల, అవుకు, గుండ్లశింగవరం, రాళ్లకొత్తూరు, బనగానపల్లె.

జగన్‌ను పంచెకట్టులో చూడాలనుంది: శోభా నాగిరెడ్డి


దివంగత నేత వైఎస్‌లాగా పంచెకట్టులో జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చూడాలని ఉందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. కోయిలకుంట్ల బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. దివంగత నేత అందించిన స్వర్ణ యుగం త్వరలోనే మళ్లీ వస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.

Monday, July 18, 2011

మాటకు కట్టుబడి ఉన్నా.. అందుకే వేధిస్తున్నారు * కర్నూలు జిల్లా ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి


ఇచ్చిన మాటను గాలికి వదిలేసి ఉంటే సోనియా వెరీగుడ్ అనేవారు
కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇచ్చేవారు, అయినా మడమ తిప్పలేదు..
మహానేతపై బురద చల్లేందుకే కాంగ్రెస్ తప్పుడు కేసులు పెట్టిస్తోంది
మంత్రివర్గ నిర్ణయాలకు వైఎస్ ఒక్కడినే బాధ్యుడిని చేయాలని చూస్తోంది
నా కాళ్లు, వెన్నుపూస విరగ్గొట్టినా కెరటంలా పైకి లేస్తా...
యాత్రలో పాల్గొన్న చెన్నకేశవరెడ్డి, కాటసాని, బాలనాగిరెడ్డి, మోహన్‌రెడ్డి

‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కుటుంబాలను పరామర్శిస్తానని నల్లకాలువ సభలో మాటిచ్చాను. ఏ దేవుడు ఆ రోజు నానోట ఆ మాట పలికించాడోగానీ.. ఆ ఒక్క మాటకే కట్టుబడి ఉన్నాను. ఆ ఒక్క మాటకు కట్టుబడి ఉన్నందుకే కాంగ్రెస్ నుంచి నన్ను బయటకు పంపించారు. వెంటనే ఐటీ నోటీసులు ఇప్పించారు.. ఇప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ పెద్దలు కుమ్మక్కై వారి వయసులో సగం కూడా లేని నన్ను వేధిస్తున్నారు’’


ఆళ్లగడ్డ ఓదార్పు యాత్ర*


‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కుటుంబాలను పరామర్శిస్తానని నల్లకాలువ సభలో మాటిచ్చాను. ఏదేవుడు ఆ రోజు నానోట ఆ మాట పలికించాడోగానీ.. ఆ ఒక్క మాటకే కట్టుబడి ఉన్నాను. ఆ ఒక్క మాటకు కట్టుబడి ఉన్నందుకే కాంగ్రెస్ నుంచి నన్ను బయటకు పంపించారు. వెంటనే ఐటీ నోటీసులు ఇప్పించారు.. ఇప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ పెద్దలు కుమ్మక్కై వారి వయసులో సగం కూడా లేని నన్ను వేధిస్తున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఓదార్పు యాత్ర ప్రారంభమైన కర్నూలు జిల్లాలోని చాగలమర్రి, ఆళ్లగడ్డ సభలకు భారీగా హాజరైన జనప్రవాహాన్ని ఉద్దేశించి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..

ప్రజల గుండెల్లో ఉండడమే పాపమా?

ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని రాష్ట్రానికే కాదు దేశానికి సైతం చాటిచెప్పిన మహానేత వైఎస్. ఆయన మరణించి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ జనం గుండెలోతుల్లో పదిలంగా గూడుకట్టుకున్నారు. అదే పాపమన్నట్లు ఆయన్ను ప్రజల మనసుల్లో నుంచి చెరిపేయడానికి ఆయనపై బురదజల్లుతున్నారు. ఆయన రెక్కల కష్టం వల్లే 2004, 2009లలో అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో సోనియా ఈ రోజు అధికారం చలాయిస్తోందంటే అందుకు కారణం వైఎస్ కాదా?


వైఎస్ ఒక్కడినే బాధ్యుడిని చేయడానికి కుట్ర

వైఎస్ మంత్రివర్గంలో సమష్టిగా తీసుకున్న నిర్ణయాలన్నింటికీ మహానేత ఒక్కడినే బాధ్యుడిని చేయాలని కాంగ్రెస్ పెద్దలు కుట్ర పన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సొంత నిర్ణయాలపై సొంత మంత్రి శంకర్రావుతో కేసు వేయించారు. వైఎస్ ఎలాగూ తిరిగిరారు.. సమాధానం చెప్పుకోలేరు అన్న ఆలోచనతో ఆయనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు నేనేం తక్కువ తినలేదంటూ అధికారపార్టీతో కుమ్మక్కై మహానేతపై మరిన్ని నిందలు వేస్తున్నారు.


బాబు స్టే తెచ్చుకున్నారు


నిన్న మొన్నటి దాకా సీబీఐని ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’అన్న చంద్రబాబు.. ఇప్పుడు నాపై అదే సీబీఐ విచారణకోసం డిమాండు చేస్తున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణ కేసులో స్టే తెచ్చుకుని ఆరేళ్లుగా కాలంగడుపుతున్న చంద్రబాబు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. వైఎస్‌పై బురదజల్లేందుకు, జగన్‌ను అణగదొక్కేందుకు కోర్టుకెళ్లి మరీ సీబీఐ విచారణ కోరుతున్నారు.


ఒక్కడిపై ఇంత మంది కుట్ర చేస్తున్నారు..


ఒకే ఒక్కడిని భూస్థాపితం చేసేందుకు.. దేశంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, ఈనాడు పత్రిక, ఓ తోకపత్రిక, ఈ మధ్యే ఈ గ్రూపులో చేరిన టీవీ-9.. అందరూ కలిసి కుట్రలు పన్నుతున్నారు. ఇచ్చిన మాటకోసం నిలబడటమే నేను చేసిన నేరం. ఓదార్పు మానుకుని ఉంటే, సోనియావెరీగుడ్ అనేవారు. కేంద్రంలో నాకూ ఓ మంత్రిపదవి ఇచ్చి ఉండేవారు. కానీ మంత్రి పదవి వద్దనుకున్నాను.. మాట తప్పకపోవడం.. మడమ తిప్పకపోవడం.. విశ్వసనీయత అన్న నా తండ్రి బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నాను. అందుకే వేధిస్తున్నారు. ఇచ్చిన మాటకోసం, మహానేత ఆశయాలను కొనసాగించే దిశగా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా వెరవను.


నా కాళ్లు, వెన్ను విరగ్గొట్టినా.. కెరటంలా పైకిలేస్తా


బహుశా నా కాళ్లు, వెన్ను పూస కూడా విరగ్గొడతారేమో. అయినా సరే.. ఎవరేం చేసినా సరే కెరటంలా పైకిలేస్తా. కాంగ్రెస్, టీడీపీ పెద్దలకు లేనిది.. నాకు, నా తల్లికి మాత్రమే ఉన్నది ఆ దేవుడి దయ, నాన్నను ప్రేమించే ప్రతి గుండె చప్పుడు.. మమ్మల్ని కాపాడుతూనే ఉంటాయి. దివంగత మహానేత వైఎస్ చూపిన బాటలో నడవడం చేతకాని ఈ ప్రభుత్వం, చనిపోయాక కూడా జనం గుండెల్లో సజీవంగా ఉండటం ఎలాగో నేర్వలేని వారు, దివంగత నేత ఆశయాలను కొనసాగించలేని వారు ఈ రోజు ఆయనపై బురదజల్లుతున్నారు.


అడుగడుగునా జన జాతరే...!


అడుగడుగునా జన నీరాజనం. అడుగు కూడా ముందుకు వేయనీయని అభిమాన సందోహం. ఫలితంగా సోమవారం ఆళ్లగడ్డలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభ ఏకంగా 5 గంటలు ఆలస్యమైంది! సాయంత్రం 4.00కు జరగాల్సిన సభ రాత్రి 9.00కు ప్రారంభమైంది! అయినా ప్రజల్లో ఉత్సాహం అణు మాత్రమైనా తగ్గలేదు. తమ అభిమాన నాయకుని కోసం అంతసేపూ వారు భారీ సంఖ్యలో వేచి చూశారు. యాత్ర తొలిరోజు సోమవారం ఉదయం 10కి మొదలైంది. ఆళ్లగడ్డలో భూమా దంపతుల ఇంటి నుంచి బయల్దేరిన ఆయన, తొలుత చాగలమర్రిలో మహబూబ్ బాషా కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మసీదులో ప్రార్థనలు చేసి, సమీపంలోని దివంగత నేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. బాషా ఇంటి నుంచి వేదికను చేరేందుకే అరగంట పట్టింది! జగన్‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటెత్తిన జనంతో గ్రామ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. నమాజుకు వేళవడంతో జగన్ ప్రసంగాన్ని కాసేపు ఆపారు. శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రసంగించారు.

నాలుగు కుటుంబాలకు ఓదార్పు...: తొలి రోజు చాగలమర్రి, శెట్టివీడు, ముత్యాలపాడు, చక్రవర్తులపల్లె, కృష్ణాపురం, ఆలమూరు, నరసాపురం, ముత్తలూరు గ్రామాల్లో 8 విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. చాగలమర్రిలో మహబూబ్ బాషా, గొడిగనూరులో ఇండ్ల ఇసాక్, ఆళ్లగడ్డలో వన్నూరు బాషా కుటుంబాలను పరామర్శించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో చాకరాజువేముల చేరుకుని తోట బాలరాజు కుటుంబాన్ని ఓదార్చారు. షెడ్యూల్ మేరకు సోమవారం హరివరంలో దళిత మస్తాన్, ఉయ్యాలవాడలో దళిత ఈశ్వరమ్మ కుటుంబాలను కూడా ఓదార్చాల్సి ఉన్నా అర్దరాత్రి కావడంతో తొలి రోజును ముగించి రాత్రి బసకు ఆళ్లగడ్డ చేరుకున్నారు. మంగళవారం ఉదయం పదింటికి ఆ రెండు కుటుంబాల ఓదార్పుతో రెండో రోజు యాత్ర మొదలవుతుంది.


 వైఎస్ పథకాల అమలు జగన్‌తోనే సాధ్యం
- కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగాలంటే అది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు ఉద్ఘాటించారు. అందుకే తాము జగన్‌కు పూర్తి మద్దతునిస్తున్నామని తేల్చి చెప్పారు. కర్నూలు జిల్లా ఓదార్పు యాత్ర సోమవారం చాగలమర్రిలో ప్రారంభమైన సందర్భంగా వారు సభా వేదికపై ప్రసంగించారు.
ఎవరేమన్నారో.. వారి మాటల్లోనే..

వైఎస్ అండతోనే గెలిచా
నేను ఐదుసార్లు ఎమ్మెల్యే కావడానికి వైఎస్ రాజశేఖరరెడ్డే కారణం. మహానేత మరణాన్ని తట్టుకోలేక మరణించిన కుటుంబాలను ఓదార్చటానికి కర్నూలు జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉండాలని మేం నిర్ణయించుకున్నాం. ఆయన వెంట ఓదార్పుయాత్రలో పాల్గొంటాం. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగించటం జగన్‌వల్లే సాధ్యం.
- కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే

జగన్ నాయకత్వంలోనే పథకాలన్నీ కొనసాగుతాయి

రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు జగన్ నాయకత్వంలోనే కొనసాగుతాయి. మహానేత మృతిని తట్టుకోలేక ప్రాణాలొదిలిన కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన ఆయన వెంట ఓదార్పు యాత్రలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం.
- చెన్నకేశవరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే

జగన్‌కు అంతా సహకారం అందించాలి

రాష్ట్రం అభివృద్ధి చెందడం వైఎస్సార్‌తోనే ప్రారంభమైంది. వైఎస్సార్ మరణంతో పథకాలన్నీ నిలిచిపోయాయి. వాటన్నింటినీ అమలు చేయగల నాయకుడు జగనే. ఆయనకు అంతా సహకారం అందించాలి.
- బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే

జగన్ కోసం ప్రాణాలనూ లెక్కచేయం

సోనియా, కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ ఏకమై వైఎస్ జగన్‌ను అణచాలని చూస్తున్నారు. సూర్యుణ్ణి అరచేత్తో ఆపాలనుకుంటున్నారు. ప్రజలు వైఎస్సార్‌ను జగన్‌మోహన్‌రెడ్డిలో చూసుకుంటున్నారు. ఆయన లేని లోటును తీర్చటానికి నేనున్నానంటూ జగన్ ముందుకొచ్చారు. వైఎస్సార్ మరణించాక రెండేళ్లలో పేదవాణ్ణి పలుకరించే వారే కరువయ్యారు. ఒక్క రేషన్‌కార్డు, పక్కాగృహం ఇవ్వలేదు. రైతులను పట్టిం చుకోవటం లేదు. 128 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక్క కార్యకర్తను కూడా నిలబెట్టుకోలేకపోయింది. జగన్‌మోహన్‌రెడ్డిని ఆపడం ఆ పార్టీకి సాధ్యం కాదు. పదువులు లెక్క చేయక ప్రజల కోసం పోరాడిన జగన్ స్ఫూర్తితో మేం ముందుకు సాగుతాం. ఆయన కోసం ప్రాణాలను కూడా లెక్కచేయం.
- శోభానాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే

వైఎస్‌తో రాష్ట్రం అభివృద్ధి చెందింది

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రం అభివృద్ధి చెందింది. రైతులు పచ్చగా ఉండటానికి కారణం వైఎస్సారే. భవిష్యత్‌లో జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నాం.
- ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ

అణచేకొద్దీ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది

జగన్‌ను అణచివేయాలని చూస్తున్నారు. అలా చేసేకొద్దీ ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్, టీడీపీ నాయకులు జగన్‌ను అణచేసేందుకే సమయాన్ని కేటాయిస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఎవరికైనా చిన్న పదవి ఇవ్వాలన్నా, ఏపనైనా చేయాలన్నా సోనియాగాంధీ వద్ద అనుమతి తీసుకోవాలి. కాంగ్రెస్‌కు పరిపాలించే నైతిక హక్కు లేదు. రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉంది. ఆయన ఓ వ్యక్తి కాదు శక్తి. జగన్ కోసం సైనికుల్లా ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమే.
- భూమా నాగిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత

Saturday, July 9, 2011

‘' అమ్మ ఒడి '’లా పాలన

 
ప్లీనరీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆత్మను ఆవిష్కరించిన జగన్

ఓదార్పు యాత్రలో పేదల బాధలు చూశాను..
అప్పుడే నా మనసులో పేదరిక నిర్మూలనకుజవాబు మెదిలింది
ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం..
‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకం కింద పిల్లలను బడికి పంపినందుకు తల్లికి డబ్బులిస్తాం
ఎల్‌కేజీ నుంచి 10 వరకు రూ.500, ఇంటర్‌లో రూ.700, డిగ్రీలో రూ.1000 ఆమె ఖాతాలో వేస్తాం
108 తరహాలో పశు వైద్యానికి 102..
రైతులకు వ్యవసాయ సూచనల కోసం 103..
భూమి లేని కూలీలకు ఎకరా భూమి సాగుయోగ్యంగా మలిచి ఇస్తాం..
అక్కా చెల్లెళ్లకు, రైతన్నలకు వడ్డీ లేని రుణాలు..
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్..
వ్యవసాయ పరికరాల కొనుగోలుకు పావలా వడ్డీకే రూ.3 లక్షల వరకు రుణం
అవ్వా తాతలు, వితంతువుల పింఛను రూ.700కు పెంచుతాం
వికలాంగులకు రూ.1000 పెన్షన్..
మద్యపాన నియంత్రణకు కొత్త విధానం..
ఊళ్లలో బెల్టు షాపులనేవే లేకుండా చేస్తాం..
ప్రాజెక్టులను ప్రాధాన్యంగా తీసుకుని పూర్తిచేస్తాం

  ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెరతీశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగిన మహానేత వైఎస్ సువర్ణ యుగాన్ని మళ్లీ తెచ్చే దిశగా పలు చరిత్రాత్మక, సంక్షేమ పథకాలు చేపడతామంటూ బడుగు బతుక్కి భరోసా ప్రకటించారు. పిల్లలను బడికి పంపే తల్లికి డబ్బులు, వృద్ధులు, వితంతువుల పింఛను రూ.700కు పెంపు, వికలాంగులకు రూ.1000 పెన్షన్, మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు, కొత్తగా 102, 103 సేవలు.. ఇలా పలు సంచలనాత్మక పథకాల అమలే తమ పార్టీ ఎజెండా అంటూ వేలాది కరతాళ ధ్వనుల మధ్య సగర్వంగా వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలకు కొత్త అర్థం చెబుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలకు ఇలా మరింత పరిపూర్ణత చేకూర్చేందుకు ఆయన సంకల్పించారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో శుక్రవారం ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘ప్రజా ప్రస్థానం’(తొలి ప్లీనరీ) సమావేశాల్లో ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. వాటిని రూపొందించడానికి దారితీసిన పరిస్థితులను విస్పష్టంగా వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..


నాన్నే నాకు స్ఫూర్తి..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక మొట్టమొదటి ప్లీనరీ ఇది. వైఎస్సార్ పాదాల చెంతన, ఆయన ఆశయాల సాధన కోసం నిలబడి ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నా. నా కంటే ముందు చాలా మంది మాట్లాడారు. చాలా చాలా చేయాలని తమ తమ వ్యూహాలు చెప్పారు. చెప్పిన ప్రతి అంశాన్నీ జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుంటాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫలానా పార్టీ అని సగర్వంగా చెప్పుకొనే రీతిలో, ఫలానా నాయకుడు అని గొప్పగా చెప్పుకొనే రీతిలో వైఎస్సార్ ఆశయాల సాధనకు, వైఎస్సార్ కడుపున పుట్టిన ఆణిముత్యం అని చెప్పుకొనే రీతిలో మన విధానాలు ఉంటాయి. మరో వందేళ్ల వరకు ఏ ఒక్కరూ వైఎస్సార్‌ను మరిచిపోలేని రీతిలో, 30 ఏళ్ల పాటు వైఎస్సార్ సువర్ణయుగ పాలన మళ్లీ ఉండేలా పార్టీ ఉంటుందని సగర్వంగా చెబుతున్నా. దివంగత నేత వైఎస్సారే నాకు స్ఫూర్తి. ఆయన కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు పాలించారు. కేంద్రంలో సోనియాగాంధీ కూడా ఉన్నారు. ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వు చూడాలని ఏ ఒక్కరికీ తట్టలేదు. ఒక్క వైఎస్‌కు తప్ప. దాదాపు 1500 కిలోమీటర్లకు పైగా కాలినడకన పాదయాత్ర చే స్తూ ప్రతి పేదవాడిని కలుస్తూ వాళ్ల బాధలు చూశారు. వారి బతుకులను అర్థం చేసుకోగలిగారు. ఏం చేస్తే వారి ముఖాన చిరునవ్వు కనిపిస్తుందో అధ్యయనం చేశారు.

ఆ మాటే వేల కిలోమీటర్లు ప్రయాణం చేయించింది..
కాలమో, మరి దేవుడే అలా చేశాడో తెలియదు గానీ నాతో ఒక మాట అనేలా చేశాడు. నాన్న చనిపోయాక 20 రోజులు కూడా గడవకముందే దేవుడు నా నోటి నుంచి ఎందుకు అనిపించాడో తెలియదు గానీ.. వైఎస్ మరణ వార్తను దిగమింగుకోలేక చనిపోయిన వారందరి కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పాను. ఆ మాటే నన్ను కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయించింది. పేదరికాన్ని చాలా దగ్గరగా చూశా. నేను చూసినంత దగ్గరగా ఏ నాయకుడూ చూడలేదు. కులాలు, మతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబాన్నీ చూశా. ప్రతి కుటుంబంతో 20 నిముషాల పాటు మాట్లాడాను. ఒక్కో కుటుంబానిది ఒక్కో కథ. పేదరికంలో ఒక్కో కోణం. ఈ పేదరికాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలన్న ఆలోచనను ప్రేరేపించిన సమయమది. పేదరిక నిర్మూలనకు ఒక జవాబు నా మనసులో మెదిలింది. ఆ జవాబు నా దగ్గర ఉందని నేను గర్వపడుతున్నా.


పేదరిక నిర్మూలనకు రెండే మార్గాలు..

వైఎస్సార్ పాదయాత్రలో ప్రతి అంశాన్నీ తట్టారు. పేదవాడు ఎందుకు పేదవాడిగా మిగిలిపోతున్నాడో అర్థం చేసుకున్నారు. పేదరిక నిర్మూలనకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి. దానికి కులం లేదు. మతం లేదు. ఆకలి, మమకారం మాత్రమే ఉన్నాయి. ఆ రెండు మార్గాల్లో ఒకటేంటంటే.. ప్రతి పేద కుటుంబంలో ఒక్కరన్నా పెద్ద చదువులు చదవాలి. డాక్టరో, ఇంజినీరో, కలెక్టరో కావాలి. పెద్ద చదువు చదివిన వాడు ఉద్యోగం చేస్తూ ముసలి వయసులో ఉన్న తల్లిదండ్రులకు తోడుగా నిలబడితే ఆ కుటుంబ పేదరికం పోతుంది. ఇక రెండో మార్గం. నేను పేద కుటుంబాల వద్దకు వెళ్లినప్పుడు ఏం చేస్తున్నావమ్మా అని అడిగితే కూలికి వెళుతున్నాం బాబూ అని సమాధానం ఎదురైంది. ఎలా బతుకుతున్నావమ్మా అని అడిగితే కూలి దొరక్కపోతే బతకలేమన్నదే వారి జవాబు. కనీసం ఒక ఎకరా అయినా భూమి ఇస్తే వారి పేదరికం పోతుంది. కేవలం భూమి ఇస్తే సరిపోదు. దాన్ని సాగుకు యోగ్యంగా చేయాలి. అప్పుడే పేదరికాన్ని పోగొట్టగలుగుతాం. వైఎస్సార్ కలలుగన్న ఈ స్వప్నాలే మా పార్టీ జెండా.. అదే మా ఎజెండా.
వైఎస్ హామీలు నెరవేరుస్తాం: 2009లో ఎన్నికలకు ముందు వైఎస్సార్ రెండే రెండు కొత్త హామీలిచ్చారు. రూ.2కి 20 కిలోల బియ్యాన్ని 30 కిలోలకు పెంచుతామని మాట ఇచ్చారు. ఆయన పోయి రెండేళ్లవుతోంది. ఆయన్ను మర్చిపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఎన్నికలేమీ లేవు కదా అని ప్రజలను కూడా పూర్తిగా మరిచిపోయింది. మేనిఫెస్టో అనే దానికి విలువ లేకుండా పోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దివంగత నేత ఇచ్చిన హామీలను అమలుచేసి చూపిస్తుంది. ఏడు గంటల విద్యుత్తును తొమ్మిది గంటలకు పెంచే హామీని మేం అమలు చేస్తాం. అధికారంలోకి వచ్చాక సాధ్యమైనంత త్వరలో అమలుచేస్తాం.

ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు చదివిస్తాం

ప్రతి కుటుంబంలో ఒక్కరన్నా పెద్ద చదువులు చదువుకోగలిగితే పేదరికం పోతుందని తెలిసినా ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇప్పటికే 3400 కోట్లు బకాయిలు ఉంటే, పథకాన్ని కొనసాగించడానికి మరో 3400 కోట్లు కావాల్సి ఉంటే మూడు వేల కోట్లే ఇచ్చి చేతులు దులుపుకొంది. పేద కుటుంబాలను కలిసినప్పుడు వారు చదువుకోవాలంటే ఈ 3400 కోట్లు కూడా సరిపోవని నాకు తెలిసింది. వారి పేదరికం పోవాలంటే ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు చదివించాలి. ఆ బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తుంది.

‘వైఎస్సార్ అమ్మ ఒడి’

ఆ పేద ఇళ్లకు వెళ్లినప్పుడు అమ్మలతో అక్కలతో మాట్లాడినప్పుడు, చిన్నచిన్న పిల్లలతో మాట్లాడినప్పుడు ఏడో తరగతి కూడా పూర్తికాకుండానే చదువు మానేశానని చెబుతున్నప్పుడు చాలా బాధనిపించేది. కాస్తోకూస్తో పనిచేస్తే తప్ప బతకలేని పరిస్థితి అని చెబితే బాధేసింది. వీరంతా గొప్ప చదువులు ఎప్పుడు చదువుతారన్న ఆలోచన నాలో రేగింది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ‘వైఎస్సార్ అమ్మ ఒడి’. తమ బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలోకి ప్రోత్సాహకంగా డబ్బులు జమ చేస్తాం. ఇద్దరు పిల్లలను చదివించేందుకు వీలుగా జమ చేస్తాం. ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు రూ.500 చొప్పున, ఇంటర్‌లో అయితే రూ.700 చొప్పున, డిగ్రీ అయితే వెయ్యి రూపాయల చొప్పున జమ చేస్తాం. ఏ తల్లీ తమ బిడ్డలను చదువుకు పంపకుండా కూలికి పంపే పరిస్థితి రాకుండా ఉండేందుకే ఈ ప్రయత్నం. బడికి పంపించినందుకే ఈ ప్రోత్సాహకం. చదువులు మేమే ఉచితంగా చదివిస్తాం. రూ. 3,400 కోట్లయితే ఇప్పటివరకు ఉన్న పథకానికి సరిపోతుంది. ఇప్పటికంటే నాలుగైదింతల బడ్జెట్ పెరిగినా పరవాలేదు. ఇది మా కనీస బాధ్యత. దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటాం.

ప్రతి స్కూలునూ ఇంగ్లిష్ మీడియం చేస్తాం

అలాగే ఊళ్లకు పోయినప్పుడు అక్కడ స్కూళ్లను చూశాను. అక్కడ ప్రైమరీ స్కూళ్ల దాకానే ఉన్నాయి. ఆ ప్రైమరీ స్కూళ్లను అప్పర్ ప్రైమరీ దాకా ప్రతి ఊళ్లోనూ అప్ గ్రేడ్ చేయాలి. ఆ ప్రతి స్కూలులో మౌలిక వసతులు కల్పించాలి. ఆ ప్రతి స్కూలును ఇంగ్లీష్ మీడియం చేయాల్సిన అవసరం చాలా ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మా భుజస్కంధాలపై వేసుకొని అది చేపడుతుంది.

అక్కాచెల్లెళ్లకు వడ్డీలేని రుణాలు..

పేదరికంలో మగ్గుతున్న అక్కాచెల్లెళ్లతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధనిపించింది. వారికోసం అమలుచేస్తున్న పావలా వడ్డీ పథకానికి వెయ్యి కోట్ల బకాయిలు చెల్లించాలి. దాన్ని నడిపించాలంటే మరో వెయ్యి కోట్లు కావాలి. కానీ ఈ ప్రభుత్వం రూ. 400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడంతో అక్కాచెల్లెళ్ల ముఖాల్లో తేడా కనిపిస్తోంది. ప్రభుత్వం వడ్డీ సొమ్ము ఇచ్చేవరకు బ్యాంకులు ఆ మహిళల వద్ద రూపాయి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఒక గ్రూపులో ఒక సభ్యురాలు మూడేళ్లలో చెల్లించేందుకు రూ. 30 వేలు తీసుకుంటే.. రూపాయి వడ్డీతో కలిపి ఏటా 45 శాతం సొమ్ము తిరిగి చెల్లించాల్సివస్తోంది. కానీ ఆ 45 శాతం వాళ్లు ఎలా కట్టగలుగుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి అక్కాచెల్లెళ్లకు వడ్డీ లేని రుణం ఇస్తాం. ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడే బ్యాంకులు వడ్డీ రాయితీ ఇస్తాయని ఎదురుచూడాల్సిన పనిలేదు. ప్రభుత్వమే ఆ సొమ్మును ముందే కట్టేస్తుంది.

మూడు పూటలా భోజనం ఉండాలి..

నేను ఊళ్లకు వెళ్లినప్పుడు ప్రతి అవ్వా, తాతా పనులు విడిచిపెట్టుకుని నా దగ్గరికి పరుగెట్టుకుంటూ వచ్చారు. ఏమ్మా ఈ వయసులో కూడా పనిచేస్తున్నావా? అని అడిగితే.. బతకాలి కదా బిడ్డా.. మీ నాన్న రూ. 200 ఇస్తున్నాడు.. అయితే బతకడానికి ఆ డబ్బులు సరిపోవు కదా నాయనా అని బదులిస్తే బాధనిపించింది. అవ్వలూ, తాతలు, వితంతువులకు ఇప్పుడిస్తున్న పింఛను సరిపోదు. వారికి మూడు పూటలా భోజనం దొరికేలా కనీసం రూ. 700కు తక్కువ కాకుండా ఉండాలి. మూడు పూటలా భోజనం పెట్టే పరిస్థితి లేనప్పుడు ఈ ప్రభుత్వం ఉంటేనేం.. పోతేనేం? మా పార్టీ అధికారంలోకి వస్తే వీరందరికీ రూ.700తో పాటు, వికలాంగులకు ఇస్తున్న పింఛనును రూ.500 నుంచి రూ. 1000కి పెంచుతాం.

ప్రాధాన్య పరంగా జలయజ్ఞం ప్రాజెక్టులు

దివంగత నేత, ప్రియతమ రాజశేఖరరెడ్డి గారు జలయజ్ఞం పేరిట కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలని కలలు గన్నారు. ఈ వేళ రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వంశధార స్టేజీ-1 ఫేజ్-1 ప్రాజెక్టు పూర్తవుతుంది. ఐదు కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులున్నాయి. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 13 ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి. ఇటువంటి చిన్నచిన్న మొత్తాలు ఖర్చు పెట్టినా చాలా ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నా.. పూర్తిగా జలయజ్ఞాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రతి రైతు సోదరుడి ముఖాన శాశ్వతమైన చిరునవ్వు చూడాలి అంటే.. ఒక ప్రాతిపదికన, ఏ ప్రాజెక్టు చేస్తే వెంటనే రైతు సోదరుడికి ఉపయోగపడుతుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ.. ప్రాధాన్యత అంశాల పరంగా ప్రతి ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం కూడా పూర్తిగా ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నీళ్లు వచ్చేస్థాయికి ఏఏ ప్రాజెక్టులు వచ్చాయన్న అంశాన్ని మనస్సులో పెట్టుకొని, ఆ మేరకు డబ్బులు కేటాయింపు చేస్తూ.. ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఇది కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా చేపడుతుంది.

మద్యపాన నియంత్రణ..

మద్యపానాన్ని నియంత్రిస్తాం. ప్రతి గ్రామంలో మద్యపానం వల్ల చదువుకోలేని పరిస్థితి. చదువుకోలేని పరిస్థితి వల్ల మద్యపానం. ఈ పరిస్థితి చూస్తే బాధనిపిస్తోంది. గ్రామాల్లో తాగుడు లేకుండా బెల్టు షాపులు మూసేయిస్తాం. మద్యం షాపులు తగ్గిస్తాం. తాగాలంటే నిరుత్సాహపరిచేలా మద్యపాన విధానం రూపొందిస్తాం.

ఆరోగ్యం మా అభయం..

పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి తెచ్చేది అనారోగ్యం. ఏ గుండె పోటో వస్తే భార్యాపిల్లలు ఐదు రూపాయల వడ్డీకో, పది రూపాయల వడ్డీకో అప్పు తెచ్చి బతికించుకున్నా.. తరువాత దాన్ని తీర్చేందుకు జీవితాంతం ఊడిగం చేయాల్సివచ్చే దుస్థితి. ఇది ఏ పేదవాడికీ రాకూడదు. మా సీఎం ఉన్నాడన్న భరోసా ఉండాలి. నేను ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానో, ఏ పడక మీద చికిత్స పొందుతున్నానో, అదే ఆస్పత్రిలో, అదే పడకపైన పేదోడు కూడా చికిత్స పొందాలి. వైఎస్సార్‌లాంటివాడే మా సీఎం అని చెప్పుకొనేలా ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం కనీసం 108 వాహనానికి డీజిల్ పోసే పరిస్థితి లేదు. రిపేరు చేయించే స్థితిలో లేదు. ఆస్పత్రికి వెళితే మందులు కూడా దొరకని దుస్థితి. మా ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న 800 ఆంబులెన్సులను 1,500కు పెంచుతాం. 104లో పనిచేసే వాళ్లకు నాలుగైదు నెలలుగా జీతాలు దొరకని పరిస్థితి. ప్రతి మండలానికి ఒక 104 వాహనం ఉండేలా 1,100 వాహనాలు ఏర్పాటు చేస్తాం. ఒక్కో దాంట్లో ఇద్దరు వైద్యులు ఉండేలా చూస్తాం. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు ఆపరేషన్లన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయించాలన్న ఆలోచన చేస్తోంది. అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలున్నాయా అన్న ఆలోచన చేయట్లేదు. మేం ప్రతి జబ్బుకూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందిస్తూనే, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తాం.

ఏటా పది లక్షల ఇళ్లు..

1947 నుంచి 2004 వరకు రాష్ట్రంలో 47 లక్షల ఇళ్లు కట్టిస్తే.. వైఎస్సార్ ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించారని గర్వంగా చెబుతున్నా. అంతేకాదు. ఆ ఐదేళ్లలో ఆయన ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు. దేశం మొత్మమ్మీద మిగతా రాష్ట్రాల్లో కట్టిన ఇళ్లు 48 లక్షలే. అంటే దేశమంతా ఒకెత్తు. వైఎస్సార్ కట్టించిన ఇళ్లు ఒకెత్తు. మేం ప్రతి ఏటా కనీసం 10 లక్షల ఇళ్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. ఏ గ్రామానికి వెళ్లి అడిగినా.. ఇల్లు లేదని ఎవరూ చేతులెత్తే పరిస్థితి ఉండకూడదు.

ఇంకా ఆలోచనల్లో చాలా పథకాలు

ఇంకా ప్రతి దళిత సోదరుడి నుంచి బీసీ, మైనారిటీ సోదరుడి వరకు మేలు చేసేందుకు నా ఆలోచనల్లో చాలా పథకాలు ఉన్నాయి. ఇంకా అధ్యయనం చేస్తాం. ప్రతి ఒక్కరి ముఖంలో ఎలా చిరునవ్వు చూడగలమో అధ్యయనం చేస్తాం. ఇదీ మా బడ్జెట్, ఇదీ మా పార్టీ, ఇతనే మా నాయకుడు అంటూ మా మేనిఫెస్టోతో ఎన్నికల్లో సగర్వంగా చెప్పుకొనేలా చేస్తాం.

‘మద్దతు’కు 3 వేల కోట్లు

కార్మికులు రోడ్డెక్కే పరిస్థితి చూశాం. కానీ ఎన్నడూ లేనివిధంగా రైతులు సమ్మెకు దిగారు. వరి పండించలేని పరిస్థితిని సిగ్గులేని ప్రభుత్వం తెలుసుకోవాలని సమ్మె చేస్తున్నామని వారంటున్నారు. మద్దతు ధర దక్కని పరిస్థితి ఇక ఉండదు. మద్దతు ధర కోసం రూ.3 వేల కోట్లు పక్కనపెడతాం. మద్దతు ధర దొరకనప్పుడు ఆ సొమ్ముతో ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రాష్ట్రంలో 40 లక్షల చదరపు అడుగుల గిడ్డంగులు ఉంటే.. సగం మాత్రమే మన నిల్వలు వాడుకునేందుకు వినియోగిస్తున్నాం. మిగతా సగం ఇతర రాష్ట్రాల కోసం వినియోగిస్తున్నాం. గిడ్డంగులు ఇవ్వరు. మద్దతు ధర ఇవ్వరు. ఎగుమతి చేసుకోనివ్వరు. ప్రాథమిక పాఠశాలను గిడ్డంగులుగా వాడుకునే దుస్థితి చూసి బాధనిపిస్తోంది. మా హయాంలో మరో 40 లక్షల చదరపు అడుగుల గిడ్డంగులు ప్రభుత్వమే కడుతుంది. రైతులు మోటార్లు కొనుగోలు చేసుకునేందుకు, చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు 14 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నారు. వీటి కోసం 3 లక్షల వరకు పావలా వడ్డీకే రుణం ఇస్తాం.

వడ్డీలేని పంట రుణాలు..

నేను వెళ్లినప్పుడు ప్రతి రైతు ముఖాన కన్నీరు కనిపించింది. కనీస మద్దతు ధరకు అమ్ముకోలేని దుస్థితి. మొన్న అనంతపురం వెళ్లాను. కరువొచ్చి పంట బీమాకోసం ఎదురుచూస్తున్న రైతుకు ఏడాది గడిచినా బీమా డబ్బు రాలేదు. వరదలు వచ్చి పంట నష్టపోయినప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లాలకు వెళ్లి పరిస్థితి చూసి లక్షలాది మందితో విజయవాడలో దీక్ష చేస్తే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం గాలి మాటలు చెప్పింది. ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని ఉత్తమాటలు చెప్పింది. వైఎస్సార్ ఉన్నప్పుడు పసుపు రైతు 15 వేలకు అమ్ముకుంటే ఇప్పుడు 4 వేలు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. వరి వేసుకునే బదులు ఉరేసుకుంటే మేలని రైతు సోదరులు అన్న మాట విన్నా. ఆ రైతు ముఖాన చిరునవ్వు ఉండాలంటే రైతు పక్షపాతి సీఎంగా ఉండాలి. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ రైతు బడ్జెట్ ప్రవేశపెడుతుందని చెబుతున్నా. రైతన్నకు వడ్డీ లేని రుణాలు అందిస్తుందని చెబుతున్నా.

ఆ శాఖ మనకే తెస్తా..


ఉపాధి హామీ పథకాన్ని రైతులకు, చేనేత కార్మికులకు అనుసంధానం చేయాలి. ఇది ప్రధానమంత్రి చేతుల్లో ఉన్న అంశం. కనీసం 35 ఎంపీ స్థానాలు నాకివ్వండి. అప్పుడు కేంద్రం మన మాట ఎందుకు కాదంటుందో చూద్దాం. ఎవరో వ్యవసాయ మంత్రి కావాల్సిన దుస్థితి మనకేంటి. వాళ్ల దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి మనకెందుకు? 35 స్థానాలు ఇస్తే ఆ శాఖ మనకే తెస్తా. ఈరోజు రైతులు తాము అధికోత్పత్తి సాధించడానికి ఎంత మోతాదులో ఎరువులు వాడాలో తెలియని పరిస్థితి. వారి భూముల్లో సారమెంత? ఉత్పత్తి ఎలా పెంచాలని ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు? మేం ఆలోచించాం. 104, 108 మాదిరిగా రైతులకు మొబైల్ అగ్రిక్లినిక్‌లు అందుబాటులో ఉండేలా 103ని తెస్తాం. వాటిలో ఉండే డాక్టర్లు రైతులకు సలహాలిస్తారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే అనుబంధ వ్యవసాయం కూడా ఉండాలి. పాడిపశువులు పెంచుకోవాలి. వాటి సంరక్షణకు 102ని తీసుకొస్తాం. దాంట్లో వెటర్నరీ వైద్యులు ఉంటారు. ఇంటికొచ్చి మీ పశువులకు వైద్యం చేస్తారు.


అందరికీ లబ్ధి - ప్రజా ప్రస్థానం సంక్షేమ సూత్రం 


తొలి ప్లీనరీలో భారీ లక్ష్యాలు  నిర్దేశించుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తొలి ప్లీనరీలో ప్రకటించిన సంక్షేమ లక్ష్యాల విసృ్తతి ఒకసారి పరిశీలిస్తే... వీటి ద్వారా రాష్ట్రంలోని ప్రతి వర్గమూ, ప్రతి ప్రాంతమూ, ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో లబ్ధిపొందుతారని స్పష్టమవుతోంది. పార్టీ ప్లీనరీ నిర్దేశించుకున్న ఈ లక్ష్యాల అమలుతో రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ ప్రభుత్వం, పాలన పట్ల విశ్వాసం, కనీసావసరాల లభ్యతపై భరోసా కలుగుతుంది. ఒక సగటు కుటుంబానికి ఆ ధీమాను కల్గించాలనే సంక్షేమసూత్రం ఆధారంగానే పార్టీ ఈ కొత్త భారీ లక్ష్యాలను నిర్దేశించుకుందని ఆ పార్టీ ముఖ్యనేతలూ వివరిస్తున్నారు. విభిన్న ఆర్థికస్థాయిల్లోని ప్రజలపై ఈ కార్యక్రమాల ప్రభావం ఎలా ఉంటుంది, స్థూలంగా సమాజంలో ఎందరికి లబ్ధి చేకూరుతుందో ఒకసారి విశ్లేషిస్తే...

‘అమ్మ ఒడి’లో 2 కోట్ల మంది: ఎల్‌కేజీ నుంచి డిగ్రీ, వృత్తి విద్య, పీజీ వరకు ప్రస్తుతం ఒకటిన్నర కోట్ల మంది విద్యార్థులున్నారు. ఈ సంఖ్యను బట్టి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రకటించిన అమ్మ ఒడి పథకానికి ఏటా రూ.9 వేల కోట్లు అవసరమవుతాయి. డ్రాపవుట్లు తగ్గి, స్కూళ్లలో నమోదు శాతం పెరిగి వచ్చే రెండేళ్లలో విద్యార్థుల సంఖ్య 2 కోట్లకు పెరగవచ్చు. ఈ పథకం కోసం రాష్ట్ర ఖజానా నుంచి వెచ్చించాల్సిన సొమ్ము రూ.12 వేల కోట్లు దాటుతుందని అంచనా. కాగా 2 కోట్ల మంది విద్యార్థులకు, వారి కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది.

కోటి మందికి సామాజిక పింఛన్లు: సామాజిక పింఛన్ల పథకం కింద ప్రస్తుతం 70 లక్షల మంది లబ్ధిదారులున్నారు. ప్రభుత్వం వద్ద రకరకాల పింఛన్ల దరఖాస్తులు ఇంకా లక్షల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని మంజూరు చేయకుండా సర్కారు మొరాయిస్తోంది. కాగా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పింఛన్లు ఇస్తే లబ్ధిదారుల సంఖ్య కోటికి చేరుకోగలదని ఒక అంచనా. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల మొత్తాన్ని గణనీయంగా పెంచితే దీనికి ప్రభుత్వ ఖజానా నుంచి ఏటా దాదాపు రూ.9 వేల కోట్ల మేరకు అవసరం.
ఏటా 40 లక్షల మందికి గూడు: ఏటా కనీసం 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న నేపథ్యంలో... బడ్జెట్‌లో సుమారు రూ.5,500 కోట్లు కేటాయించాలి. 10 లక్షల కుటుంబాలంటే.. కుటుంబానికి నలుగురు లెక్కన చూసినా ఏటా 40 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. పక్కా గూడు సమకూరుతుంది. గుడిసె లేని ఆంధ్రప్రదేశ్ దిశలో ప్రభుత్వం అడుగులు వేసినట్లవుతుంది.

మహిళలకు మరింత బలం: డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. వడ్డీ రాయితీలను ప్రభుత్వం బ్యాంకులకు సకాలంలో చెల్లిస్తే, రుణాల పరిమాణాన్ని మరింత పెంచితే... వారి ఆర్థిక వ్యవహారాలు మరింత పెరగడమే గాక కొన్నేళ్లలో వీరి సంఖ్య కోటిన్నరకు చేరుకోవచ్చు.

ప్రతి రైతూ లబ్ధిదారుడే: రైతులు ఏటా రూ.40 వేల కోట్లు పంట రుణాలుగా తీసుకుంటున్నారు. వారి నుంచి ఏటా బ్యాంకులు 6- 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రకటించినట్లుగా వీరికి వడ్డీ లేకుండా రుణాలివ్వాలంటే ఏటా రూ.2,400 నుంచి రూ.2,800 కోట్లు కావాలి. ఐతే దీనిద్వారా సుమారు 70 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతారు. ఇక మద్దతు ధర కల్పనకు కచ్చితమైన హామీకి వీలుగా రూ.3,000 కోట్లతో ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేస్తే.. ప్రతి రైతూ లబ్ధిదారుడే. 1.2 కోట్ల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరినట్లే.

భుక్తికి భరోసా పెంపు: రాష్ట్రంలో ప్రస్తుతం 2 కోట్ల తెల్లకార్డులున్నాయి. ఒక్కో కార్డుకు ప్రస్తుతం కిలో రూ.2 చొప్పున 20 కిలోల బియ్యం ఇస్తున్నారు. దీన్ని 30 కిలోలకు పెంచుతామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. ఫలితంగా 2 కోట్ల కుటుంబాలు ఈ మేరకు లబ్ధిపొందుతాయి.
104, 108 ... 102, 103: కుయ్... కుయ్... శబ్దాలు ప్రజలందరికీ తరచూ వినిపిస్తాయి. 104, 108 సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి నిధులు సమకూర్చడం ద్వారా అంబులెన్స్‌ల సంఖ్య పెంచితే.. కాల్ చేసినప్పుడు అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరడానికి పట్టే గరిష్ట వ్యవధి 20 నిమిషాల నుంచి ఇంకొంచెం తగ్గుతుంది. వ్యవసాయ సేవలకు, పశువైద్య సేవలకూ 103, 102 సేవలు ప్రారంభిస్తే... సమాజంలోని ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరినట్లే.


నా బిడ్డను ఆశీర్వదించండి ... మీకు అప్పగిస్తున్నా...
ప్రజాప్రస్థానంలో విజయమ్మ ప్రారంభోపన్యాసం


  ‘దేవుడి ఆశీస్సులు, మీ ప్రేమ, ఆదరణ ఉంటాయని నమ్ముతూ.. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా.. ఆశీర్వదించండి..’ అని మహానేత వైఎస్ సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పార్టీ శ్రేణులను కోరారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి ఆశయాలకు ప్రతిరూపమని.. వైఎస్‌లో ఉన్న చిత్తశుద్ధి, ధైర్యం, దృఢ విశ్వాసం ఆయనలో ఉన్నాయని.. దివంగత నేత ఆశయసాధనలో జగన్‌ను ఆశీర్వదించాలని అన్నారు. ైవె .ఎస్.రాజశేఖరరెడ్డి సమాధి చెంతన శుక్రవారం ఇడుపులపాయలో ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రస్థానం(ప్లీనరీ) సదస్సులో తొలిరోజు ఆమె ప్రారంభోపన్యాసం చేశారు.

19 నిమిషాల పాటు ఉద్వేగభరితంగా సాగిన ఈ ప్రసంగంలో నాటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ.. ఆమె పలుమార్లు కంటతడిపెట్టుకున్నారు. విజయమ్మ మాట్లాడుతున్నప్పుడు పలువురు ప్రతినిధులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె ప్రసంగం ప్రతినిధులను కదిలించివేసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో ఉదాహరణలతో తెలియజేస్తూ.. గత రెండేళ్ల ప్రస్థానాన్ని కళ్లకు కట్టినట్టు విజయమ్మ వివరించారు. వైఎస్సార్ స్వర్ణయుగాన్ని మళ్లీ తేవాలని ఆకాంక్షించారు.


ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈ పార్టీ ఎందుకు ఆవిర్భవించాల్సి వచ్చిందో ప్రజలకు మీరు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నా. ఈ పార్టీ అన్నింటికన్నా భిన్నమైన పార్టీ. మాటలు కాదు చేతలు ముఖ్యమని చూపిన మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపిన బాటలో.. ఆయన ఆశయాలకు వారసత్వంగా పుట్టిన పార్టీ. ఆయనకు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ అంటే చాలా అభిమానం. అందుకే తన పథకాలన్నింటికీ ఇందిర, రాజీవ్ పేర్లు పెట్టి.. వాళ్ల పేర్లు జనంలో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేశారు. 1978 నుంచి 2004 వరకు 25 ఏళ్ల పాటు ప్రజల పక్షాన ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఇంట్లో వాళ్లతో మాట్లాడుతున్నప్పుడూ అనేక సందర్భాల్లో ఆయన తల చూపించి తనకు ఎన్ని దెబ్బలు తగిలాయో చూడమని చెప్పేవారు. రెండ్రోజులు హైదరాబాద్‌లో ఉంటే మిగిలిన ఐదు రోజులు ప్రజల మధ్య ఉండేవారు.

మంచి సీఎం ఎలా ఉండాలో చూపించారు..

2003లో 68 రోజుల పాటు పాదయాత్ర చేశారు. రాజమండ్రిలో 51 డిగ్రీల ఎండలు ఉన్నప్పుడూ పాదయాత్ర చేశారు. వారం రోజులపాటు అస్వస్థతకు గురయ్యారు. అయినా తిరిగి పాదయాత్ర కొనసాగించారు. ప్రజలకు ఎక్కడ ఏం కావాలి? ఎక్కడ పరిశ్రమ రావాలి? ఎక్కడ ప్రాజెక్టులు కావాలి? ఎవరికి ఏ అవసరం ఉంది? ఇలా అన్నీ తెలుసుకున్నారు. ప్రజలందరికీ ఏం చేయాలన్నదానిపై బ్లూప్రింట్ ఆయన మైండ్‌లో ఉండేది. తాను అధికారంలోకి రాగానే విద్యుత్తు బకాయిలు మాఫీ చేశారు. రైతులకు ఉచితంగా విద్యుత్తు అందించారు. రైతుల పక్షపాతిగా జలయజ్ఞం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ, 108, పావలావడ్డీ, ఇందిరమ్మ ఇళ్లు, నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఒక మంచి ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చేసి చూపించారు.

2009 ఎన్నికల్లో అన్ని పార్టీలు జట్టు కట్టి పోటీచేస్తే.. ఒక్కడే మళ్లీ అధికారంలోకి తేగలిగాడు. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, 33 నుంచి 36 ఎంపీ సీట్లు వస్తాయని.. 180 నుంచి 200 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని సోనియాగాంధీకి చెబితే ఆమె నమ్మలేదు. అనుకున్నట్టుగానే ఎంపీ సీట్లు వచ్చినా అసెంబ్లీ సీట్లు తగ్గాయి. ప్రజలు మనకు పాస్ మార్కులే ఇచ్చారని, ఇంకా కష్టపడి పనిచేయాల్సి ఉందని అప్పుడే ఆయన కొన్ని కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులకు, ప్రభుత్వంలోని సహచరులకు చెప్పారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని ఉద్బోధించారు.


మధ్యాహ్నానికి వస్తానని చెప్పారు..

2009లో అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో ఒక్క రోజు కూడా వృథా కానివ్వలేదు. కార్యక్రమాల సక్రమ అమలుకు రచ్చబండ నిర్వహించాలని తలంచారు. సత్వరం జలయజ్ఞం పూర్తిచేయాలని భావించారు. ప్రాణ హిత-చేవెళ్ల మినహా మిగిలిన అన్ని ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తిచేస్తామని విశ్వాసం వ్యక్తం చేసేవారు. ధైర్యంగా ఉండేవారు. కానీ దేవుడి ప్రణాళిక ఏమిటో తెలియదు. సెప్టెంబరు 2న కూడా జగన్ ఏదో ప్రాజెక్టుల పూర్తి గురించి మాట్లాడుతుండగా.. ఆయన పూర్తిగా వివరించి చెప్పారు. నిన్నటి వరకు అసెంబ్లీ నడిచింది కదా.. వర్షం కూడా పడుతోంది.. మళ్లీ అప్పుడే వెళ్లడం దేనికంటే.. రచ్చబండకు వెళ్లాల్సిందే అన్నారు. పైలట్ తీసుకుని వెళ్తేనే వెళ్తాను... లేదంటే.. మధ్యాహ్నానికి ఇంటికి వస్తానని చెప్పారు. ఏమైందో ఏమో.. తిరిగి రాలేదు. ఆయనతో కలిసి జీవించే అదృష్టం నాకు లేకపోయింది. ఆయన కోసం 700 మంది ప్రాణాలిచ్చారు. అంతమంది హృదయాల్లో ముద్ర వేసుకున్నారు.

వైఎస్‌పై సోనియా మాటలు బాధ కలిగించాయి..

ఇంటి పెద్దను కోల్పోయిన బాధను అనుభవించిన వాళ్లం. అందుకే జగన్ నల్లమలకు వెళ్లినప్పుడు అక్కడ సభలో వాగ్దానం చేశాడు. చనిపోయిన కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పాడు. అప్పటికి ఏ రాజకీయాలు లేవు. అన్నమాట ప్రకారం రెండు జిల్లాల్లో అభిమానుల కుటుంబాలను ఓదార్చాడు. తండ్రిలాగే కొడుకునూ ఆదరించారు. అర్ధరాత్రులు, తెల్లవార్లూ అక్కున చేర్చుకున్నారు. రెండు జిల్లాలు అయ్యాక ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పుడే నేను సోనియాగాంధీకి లేఖ రాశాను. ఓదార్పు పూర్తిచేయాలని ఉందని, మీరు అనుమతి ఇస్తే అన్ని విషయాలు మీ దగ్గరికి వచ్చి వివరిస్తామని కోరాను. నెల రోజుల తర్వాత ఆమె అపాయింట్‌మెంట్ ఇచ్చారు.

నేను, జగన్, షర్మిల కలిసి వెళ్లి ఆమెకు వివరించాం. దానికి బదులుగా ఆమె ఇంతలా ఎందుకు? జిల్లాలో ఒక చోటికి పిలిచి సహాయం చేస్తే సరిపోతుందని, జిల్లాకు ఒక్క విగ్రహం సరిపోతుందని చెప్పారు. ఇంకోమాట కూడా అన్నారు. మేం ముఖ్యమంత్రిని చేయడం వల్లే ఆయన ఈ కార్యక్రమాలు చేయగలిగారని చెప్పారు. మా మనసుకు చాలా బాధ కలిగింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఎందరో సీఎంలు వచ్చారు. కానీ ఆయనలా ప్రజల కోసం ప్రణాళికలు ఎవరూ చేయలేదు. వైఎస్ చనిపోయాక మీరే వచ్చి పరామర్శించారు గానీ మమ్మల్ని పిలిపించుకోలేదు కదా.. అలాగే జగన్ కూడా వారి వద్దకే వెళ్లి పరామర్శిస్తేనే బాగుంటుంది అని కూడా చెప్పాం. కానీ ఆమె వినిపించుకోలేదు. చేసేది లేక కన్నీటితో తిరిగొచ్చాం.


ఇచ్చిన మాట తప్పలేదు...

ఢిల్లీ నుంచి వచ్చాక.. ఏం చేద్దామనుకుంటున్నావని జగన్‌ను అడిగాను. అమ్మా.. నేనైతే మాట ఇచ్చాను. ఏడు వందల కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పాను. వైఎస్సార్ కొడుకుగా, నేను మాట నిలబెట్టుకోలేదన్న మాట అనిపించుకోవడానికి సిద్ధంగా లేను. నాయన పేరు నిలబెట్టడానికే నేను నిర్ణయించుకున్నా అని చెప్పాడు. ఆ నిర్ణయం మంచిదే అని పించింది. రెండోసారి యాత్రకు బయలుదేరాలనుకున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను కట్టడి చేశారు. ‘సాక్షి’ పైన దాడులు జరిపించారు. మంత్రులతో లేఖలు రాయించి కోర్టుల్లో కేసులు నడిపిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పార్టీలోనే కొనసాగాలనుకున్నాం. కానీ మా మరిదిని పిలిపించి మంత్రి పదవి ఇస్తామని ఆశపెట్టారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే బాధలేదు. కానీ జగన్‌ను బలహీనుడిగా చేయాలని తలచారు.

ఇది మాకు బాధ కలిగించింది. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చాం. ఆ రకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టాల్సి వచ్చింది. పార్టీ పెట్టి మళ్లీ పోటీ చేయాల్సి వచ్చింది. వైఎస్‌కు 4.20 లక్షల మెజారిటీని కట్టబెడితే.. జగన్‌కు 5.40 లక్షల మెజారిటీ కట్టబెట్టి ఆదరణ చూపారు. వైఎస్ ఎమ్మెల్యేగా సాధించిన మెజారిటీ కంటే అధికంగా నాకు మెజారిటీ కట్టబెట్టి మీ ప్రేమ చూపారు. ఎప్పటికీ రుణపడి ఉంటాం.



తండ్రి ఆశయాలకు ప్రతిరూపం జగన్..

ఈ రోజు ఆయన జయంతి. జగన్ మీ ముందున్నాడు. తండ్రి ఆశయాలకు ప్రతిరూపం. తండ్రిలో ఉన్న కమిట్‌మెంట్, విల్‌పవర్, ధైర్యం.. ప్రతీది జగన్‌లో ఉన్నాయి. రాజకీయంలో ఉండాలంటే నిబ్బరం, ధైర్యం ఉండాలని వైఎస్ చెప్పేవారు. ఆ ధైర్యం జగన్‌లో ఉంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం స్పందించే గుణం, పోరాడే తత్వం జగన్‌లో ఉంది. నా బిడ్డను మీరు ఆశీర్వదించండని కోరుతున్నా. దేవుడి దయ, ఆశీస్సులు.. వైఎస్ ఆశీస్సులు, మీ అందరి ప్రేమ, ఆదరణ ఉన్నాయని నమ్ముతున్నా. నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు జగన్ పూర్తిచేస్తాడని నమ్ముతున్నా. జగన్, వాళ్ల నాన్న స్నేహితుల్లా మాట్లాడుకునేవారు.

ప్రాణహిత, పోలవరం వంటి ప్రాజెక్టుల గురించి విశ్లేషించుకునేవారు. ప్రతిదాంట్లో కొడుకును అలా తీర్చిదిద్దాడు. ఓదార్పు యాత్రలో, ఇప్పటి వరకు చేసిన దీక్షల్లో నా కొడుకు కష్టపడుతున్నప్పుడు.. దేవా.. నా కొడుకును ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని బాధపడేదాన్ని. కానీ నాయకుడిగా తీర్చిదిద్దేందుకే ఇలా కష్టపెడుతున్నాడేమోనని నాకు నేను సమర్థించుకునేదాన్ని. నా బిడ్డను మీరంతా ఆశీర్వదించాలి. ఇక్కడికి వచ్చిన వారంతా వైఎస్‌లా స్పందించాలి. వైఎస్‌లా పోరాడాలి. ప్రజల వెంట నడవాలి. పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. వైఎస్ సువర్ణయుగం మళ్లీ తెచ్చేందుకు మనమంతా కృషిచేద్దామని కోరుతున్నా.


అక్షరాలా ‘ ప్రజా ప్రస్థానమే’!

ప్రజాకాంక్షలకు అద్దం పట్టిన ప్లీనరీ  * అన్ని వర్గాలకూ భరోసా ఇచ్చేలా జగన్ ప్రసంగం


వైఎస్ రాజశేఖరుని ‘ప్రజాప్రస్థానం’... ఓ సువర్ణ యుగానికి నాందీ ప్రస్తావన చేసిన చరిత్రాత్మక ఘట్టం. ఆ బంగరు పాలనను తిరిగి తెచ్చే లక్ష్యంతో ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రారంభించిన ‘ప్రజాప్రస్థానం’... ‘వైఎస్ యుగ’ స్థాపనకు విస్పష్ట ప్రణాళికను ప్రకటించిన ఓ చారిత్రక అవసరం! వైఎస్ మనసా వాచా నమ్మిన ప్రజా సంక్షేమమే తమ ఎజెండా అని, ఆ పాలనను కచ్చితంగా తిరిగి తెస్తామని పార్టీ తొలి ప్లీనరీ ఉద్ఘాటించింది. పురుడు పోసుకుంటూనే కనీవినీ ఎరగని రీతిలో చరిత్రాత్మక విజయాలతో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... మహా నేత జయంతి అయిన శుక్రవారం నాడు కోలాహలంగా ‘ప్రజాప్రస్థానాన్ని’ ప్రారంభించింది.

ప్రజా సంక్షేమ పథకాల చరిత్రలో మేలిమలుపుగా నిలవగల చరిత్రాత్మక పరిణామాలకు ప్లీనరీ బీజం వేసింది! కార్యక్రమ వేదికైన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి పరిసరాల్లో ఈ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది.
ఉద్వేగపూరితం.. విజయమ్మ ప్రసంగం: పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయలక్ష్మి ప్రసంగం రాష్ట్ర నలుమూలల నుంచీ భారీ సంఖ్యలో తరలి వ చ్చిన ప్రతినిధులను విశేషంగా ఆకర్షించింది. పార్టీ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూనే, భావి కర్తవ్యాన్ని నిర్దేశించారామె. వైఎస్ మృతి నుంచి చోటు చేసుకున్న పరిణామాలను వివరించిన తీరుఅందరి హృదయాలనూ కదిలించింది. ‘నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా...ఆదరించండి...’ అంటూ చేసిన విజ్ఞప్తి కంటతడి పెట్టించింది.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఉదయాన్నే కుటుంబసమేతంగా వైఎస్ సమాధిని దర్శిం చి నివాళులర్పించారు. తర్వాత ఆయన రాజకీయ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఉదయం 10.40కి ప్రజాప్రస్థానం ప్రారంభమైంది. మహానేతను స్మరిస్తూ, ముందుగా ఆయనకు ప్రజాప్రస్థానం వేదిక నివాళులర్పించింది. ఆయన మృతిని తట్టుకోలేక మరణించిన అభిమానులందరి కుటుంబాలకూ ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతూ మరో తీర్మానం చేశారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో మృతి చెందిన, బలిదానం చేసిన వందలాది మందికి కూడా సంతాపాన్ని ప్రకటిస్తూ తీర్మానం చేశారు.

విజయమ్మ ప్రసంగం తర్వాత ఆర్థిక, వ్యవసాయ, సాగునీటి రంగాలు, పారిశ్రామిక విధానం, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ చేతివృత్తులు తదితర తీర్మానాలను విసృ్తతంగా చర్చించి ఆమోదించారు. తొలిరోజు సమావేశం ముగింపు సందర్భంగా మాట్లాడిన జగన్... ప్రజల కోసం తానేం చేయదలచిందీ, సమాజం పట్ల తన వైఖరినీ విస్పష్టంగా ఆవిష్కరించారు. ఆయన ప్రసంగం ప్రతినిధులను ఉత్తేజితుల్ని చేసింది. వైఎస్సార్ అమర్ హై, జై జగన్ నినాదాలతో ప్లీనరీ ప్రాంగణం మారుమోగింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఇతర పార్టీలకు వెరుపు, విస్మయం, ఆర్థికవేత్తలకు ఆశ్చర్యం కలిగిస్తే... ప్రతినిధులను మాత్రం ఉర్రూతలూగించింది. ఏ పార్టీ కూడా దరిదాపులకు రాలేని స్థాయి వాగ్దానాలతో సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్తను తలపించారు.

రాజకీయవాదుల ఊహలకు కూడా అందని మానవతావాదిగా, రైతుల, పేదల పక్షపాతిగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. తన ప్రసంగంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకే గాక పార్టీ అధిష్టానానికి కూడా ముచ్చెమటలు పోయించారు. ఏ ఎన్నికలూ లేని సమయంలో చేసిన నికార్సయిన వాగ్దానాలతో సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. తన తండ్రి ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తుతించిన జగన్, వాటినే సానబట్టి సామాన్యులకు మరింత చేరువ చేశారు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానానికీ సభ హర్షధ్వానాలతో ఆమోదం తెలిపింది. రోజు పొడవునా ‘సీఎం జగన్’ అంటూ నినాదాలు వినిపిస్తూనే వచ్చాయి.
 
ప్రజాప్రస్థానం * ప్లీనరీ హైలైట్స్

ప్లీనరీలో ఫ్లెక్సీలు, తోరణాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.
నూరు అడుగుల వైఎస్సార్ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కొండా సురేఖ వెంట వచ్చిన పసుపులేటి వెంకన్న కళాబృందం నృత్యాలు అందరినీ అలరించాయి.
పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం 10.30కు వేదిక పైకి జగన్, విజయమ్మలు వచ్చారు.
10.55కు దివంగత సీఎం వైఎస్‌కు సభా సభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు.
11 గంటలకు వైఎస్సార్ మరణం అనంతరం ఆత్మహత్యలు చేసుకున్న వారికి నివాళులు అర్పించారు.
11.05కు తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆత్మహత్యలు చేసుకున్న వారికి శ్రద్ధాంజలి ఘటించారు.
11.07కు ప్లీనరీలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్యే విజయమ్మ తొలి ప్రసంగాన్ని ప్రారంభించారు.
11.30కు జగన్ పార్టీ నాయకులతో ప్రమాణం చేయించారు.
విరామం తర్వాత 3.20 గంటలకు జగన్ సభా ప్రాంగణానికి వచ్చారు.
{పాంగణంలో వైఎస్సార్ ఫోటో ప్రదర్శనను చూసేందుకు కార్యకర్తలు బారులుతీరారు.
వైఎస్సార్ సాక్షి సేవా సమితి సంపత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చే శారు.
వైఎస్సార్ 62వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
వైఎస్సార్ సమాధి వద్ద ప్రార్థన సమయంలో విజయమ్మ బాధతో కన్నీరు కారుస్తూ మౌనంగా ఉండిపోయారు.
జగన్ సోదరి షర్మిలమ్మ ప్రార్థనలు చేసే వరకూ కళ్లు చెమరుస్తూనే ఉన్నారు.
ప్రార్థనల్లో వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ భారతి, బ్రదర్ అనిల్‌కుమార్, ఈసీ గంగిరెడ్డి, అవినాష్, భారతమ్మ పాల్గొన్నారు.
వైఎస్సార్ జయంతి రోజునే ప్లీనరీ ప్రారంభం కావడంతో ప్రతినిధులే కాకుండా వైఎస్ అభిమానులు తండోప తండాలుగా ఇడుపులపాయకు తరలివచ్చారు. మహానేత సమాధిని సందర్శించు కున్నారు. దాదాపు లక్ష మంది వచ్చి ఉంటారని అంచనా.
జనం ఇడుపులపాయకు పోటెత్తడంతో పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది.
వైఎస్ జయంతి సందర్భంగా శుక్రవారం సమాధి వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ప్లీనరీకి 14 వేల మంది ప్రతినిధులు వస్తారని అంచనా వేయగా.. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో ఆ సంఖ్య 30 వేలకు చేరుకుంది. ముందుగా 14 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఎక్కువ మంది రావడంతో అప్పటికప్పుడు 30 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ సందర్భంగా ప్రతినిధులు, అభిమానులు ఏ సమయంలోనూ అసహనం ప్రదర్శించకుండా ఓపికతో సహకరించడం విశేషం.

Thursday, July 7, 2011

ఎజెండా.. సంక్షేమమే * నేటి నుంచి రెండు రోజులపాటు వైఎస్సార్ కాంగ్రెస్ తొలి ప్లీనరీ

* నాటి వైఎస్ పాదయాత్ర ‘ప్రజా ప్రస్థానం’ పేరే ప్లీనరీకి కూడా..
* వైఎస్ ఆచరించిన ‘సంక్షేమం’ పై చర్చ.. దానికోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కసరత్తు
* ప్రారంభోపన్యాసం చేయనున్న పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ
* తొలిరోజు తొమ్మిది అంశాలపై ప్రసంగించనున్న నాయకులు, నిపుణులు
* రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై లోతైన సమీక్ష
* తెలంగాణ అంశం కూడా ప్రస్తావనకు..


మహానేత మనసా వాచా ఆచరించి చూపించిన సంక్షేమ పథాన్నే జెండాగా మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... అదే ఎజెండాతో తొలి ప్లీనరీ సమావేశాలకు సిద్ధమయింది. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు ఇక్కడి ఇడుపులపాయలో జరిగే ఈ సమావేశాలు... పార్టీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్సార్ సతీమణి విజయమ్మ ప్రారంభోపన్యాసంతో మొదలుకానున్నాయి. మహానేత మరణానంతరం సామాన్యుడికి ఒక్కొక్కటిగా దూరమయిపోతున్న సంక్షేమ పథకాల కోసం ఏ వ్యూహం అనుసరించాలి? వైఎస్సార్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండటంతో పాటు... వాటిని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ పరంగా ఏం చేయాలి? అనే అంశాలు తొలిరోజైన శుక్రవారం ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాలపై తొలిరోజు జరిగే చర్చలో... భూమిని నమ్ముకున్న రైతుకు వ్యవసాయాన్ని లాభసాటి చేయటంతో పాటు రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికీ వైద్యం, విద్య అందించేందుకు పార్టీ ఎలాంటి డిమాండ్లు చేయాలి? వాటి సాధనకు ఎలా ఉద్యమించాలనే అంశాలపై చర్చ సాగుతుందని పార్టీ వర్గాలు తెలియజేశాయి.
సంక్షేమం విషయంలో దివంగత నేత వైఎస్సార్ మార్గమే అనుసరణీయమని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ఆయన తన పాదయాత్రకు పెట్టిన ‘ప్రజాప్రస్థానం’ పేరునే ఈ సమావేశాలకూ ఖరారు చేసింది. అంతేకాదు. ఆయన పుట్టిన రోజైన జూలై 8నే... అది కూడా ఆయన సమాధి చెంతనే ఈ సమావేశాలనూ ఆరంభిస్తోంది. ఇటీవలి ‘కడప’ ఉప ఎన్నికల్లో ప్రత్యర్థుల ఊహలక్కూడా అందని చరిత్రాత్మక విజయంతో రాష్ట్ర రాజకీయాలపై నిర్ణయాత్మక ముద్ర వేసిన యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్ రాజకీయాలపై స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. దీంతో తొలి ప్లీనరీపై జాతీయ స్థాయి పార్టీలూ నిశితంగానే దృష్టి పెట్టాయి. అందుకనే రాజకీయ ప్లీనరీల్లో ఆనవాయితీగా వినిపించే రాజకీయ ప్రసంగాలు కాకుండా, రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసే సమీక్షలతో ఈ ప్లీనరీ సాగనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.

‘‘ఇదో సువర్ణాధ్యాయం. రాష్ట్రం నలుమూలల నుంచి కొత్త ఆశలతో వచ్చే వేల మంది ప్రతినిధులు... రాష్ట్ర ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై సీరియస్‌గా దృష్టి పెట్టబోతున్నారు. సమాజం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల పార్టీ వైఖరిని ఆవిష్కరించడానికి ఇదో వేదిక కాబోతోంది’’ అని పార్టీలోని సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. తొలిరోజు తొమ్మిది అంశాలపై నేతలు, నిపుణులు ప్రసంగిస్తారని, రెండవరోజు మరో ఐదు అంశాలపై ప్రసంగాలు ఉంటాయని కూడా ఆయన తెలియజేశారు.
వెనుకబడిన ప్రాంతాలపై చర్చ...
వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన మరణించాక ఒక్కొక్కటిగా రాలిపోతుండటంపై జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు పోరాటాలు చేసింది. ఇలాంటి వైఖరిని సహించేది లేదంటూ ధర్నాలు, నిరాహార దీక్షలతో ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు పంపించింది. ఈ నేపథ్యంలో ప్లీనరీలో సమగ్రమైన చర్చకు సిద్ధమైన వైఎస్సార్ తనయుడు... రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ చెందిన పలువురు మేధావులు, సీనియర్ రాజకీయ నాయకులతో సమాలోచనలు జరిపాకే ‘ప్రజాప్రస్థానం’ పేరు ఖరారు చేశారు.

అంతేకాదు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రాంతీయ వాదంపైనా ఈ ప్లీనరీలో లోతుగానే చర్చించనున్నట్లు సమాచారం. ‘‘తెలంగాణ అంశంతోపాటు ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలను కూడా చర్చించే అవకాశముంది. తెలంగాణ అంశంపై ఆ ప్రాంతానికి చెందిన నిపుణులే మాట్లాడతారు’’ అని తెలంగాణకు చెందిన నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఇప్పటికే తెలంగాణ అంశంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంత నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలియవచ్చింది.

ఇడుపులపాయలో వైఎస్ జగన్ సమాలోచనలు

ఇడుపులపాయలోని తన స్వగృహంలో గురువారం సాయంత్రం పార్టీకి చెందిన నేతలు, మేధావులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమాలోచనలు జరిపారు. శుక్రవారం ప్రారంభమయ్యే ప్లీనరీలో చర్చించనున్న అంశాలు, ప్రవేశపెట్టనున్న తీర్మానాలపై మరోసారి లోతుగా చర్చించారు. ఈ సమావేశాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, వైవీ సుబ్బారెడ్డి, సోమయాజులు, ఎస్.రఘురామిరెడ్డిలతోపాటు మేధావులు పాల్గొన్నారు.

Tuesday, May 31, 2011

రైతు కన్నీరే మరణశాసనం .... * టీడీపీ, కాంగ్రెస్‌లకు వైఎస్ జగన్ హెచ్చరిక

సువర్ణ యుగంలో ప్రతి ఒక్కరికీ వైఎస్ ఉన్నారన్న భరోసా ఉండేది
వైఎస్ మరణించి రెండేళ్లవుతున్నా ప్రజలకు భరోసా ఇచ్చే నేతలే
కరువయ్యారు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను విస్మరించి పేదల నడ్డి విరుస్తోంది
నాడు చంద్రబాబు 46 మంది
ఎమ్మెల్యేలతో వైఎస్ సువర్ణయుగంపై అవిశ్వాసం పెట్టారు
ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలున్నా.. అవిశ్వాసం ెపెట్టనంటున్నారేం?
ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు కాబట్టి..
బాబూ... నిజంగా ప్రజలపై
ప్రేమే ఉంటే అవిశ్వాసం నోటీసివ్వు..
ఇచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చెయ్!

  రైతులు, పేదల సమస్యలు కనీసం పట్టించుకోని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు.. ఆ రైతులు, పేదల కన్నీటి బొట్టే మరణ శాసనం రాస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ‘ఇవాళ రాష్ట్రాన్ని చూస్తే అధ్వాన్న పరిస్థితిలో ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదవాడి నడ్డి విరిచేస్తోంది. ప్రతిపక్షమైనా మనవైపు నిలబడి పోరాడుతుందేమోనని అటువైపు ఆశగా కన్నెత్తి చూస్తే.. ఇవాళ మన ఖర్మకొద్దీ ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పైకేమో ఇది చేతగాని ప్రభుత్వమనీ, అసమర్థ ప్రభుత్వమనీ తిడుతుం టారు. పేద వాళ్లకు మేలు చేయని ఈ అసమర్థ ప్రభుత్వం ఎందుకు ఉంచుతున్నావు..? అవిశ్వాసం పెట్టవయ్యా చంద్రబాబు నాయుడూ అంటే.. పెట్టను గాక పెట్టను అంటున్నారు.

ఒక్కటి చెప్తున్నా ఇవాళ... పేదవాడి కళ్లనుంచి వచ్చే ప్రతి కన్నీటి బొట్టు కాం గ్రెస్, టీడీపీలకు మరణ శాసనం రాస్తుంది’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లాలో మలివిడత 7 రోజుల ఓదార్పు యాత్ర సోమవారం విజయనగరం పట్టణంలో ముగి సింది. ఏడో రోజు యాత్ర ఉదయం కొమరాడ, పార్వతీపురం, బొబ్బిలి మండలాల్లోని గ్రామాల మీదుగా రాత్రి 9 గంటలకు జగన్ విజయనగరం చేరుకున్నారు. పట్టణంలోని కోట జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ముగింపు సభకు జనం అంచనాలకు మించితరలివచ్చారు. అటు సింహాచలం మేడ నుంచి శంకరమఠం వరకు ఇటు మూడు లాంతర్ల జంక్షన్ నుంచి సత్యా లాడ్జి వరకు రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ముగింపు సభకు భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్‌మాట్లాడారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

అప్పుడెందుకు అవిశ్వాసం పెట్టావ్..

అయ్యా చంద్రబాబూ.. దివంగత మహానేత సువర్ణ పాలన సాగుతున్న రోజుల్లో కేవలం 46 మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాసం పెట్టావు. ఆయన్ను గద్దె దింపాలని ప్రయత్నించావు. ఇవాళ మీకు 90 మంది శాసన సభ్యుల బలం ఉం ది... ఇవాళ ప్రతి రైతు సోదరుడు, ప్రతి పేదవాడు ఈ ప్రభుత్వం కూలిపోవాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఇది చేతగాని ప్రభుత్వం అని మొసలి కన్నీళ్లు కార్చే బదులు అవిశ్వాసం పెట్టమని అడిగితే పెట్టవేం చంద్రబాబూ?.. ఎందుకు పెట్టవంటే నువ్వు ఆ అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యావు కాబట్టి.

ఈ డిమాండ్లు నెరవేర్చమని అడగండి..: చంద్రబాబు నాయుడూ నిజంగా నీకు ప్రజలపై ప్రేమే ఉంటే.. అవిశ్వాసం పెడతానని ప్రభుత్వాన్ని బెదిరించి ప్రజా సమస్యలు పరిష్కరించు. రైతులకు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. మద్దతు ధర రావాలంటే కనీసం రూ.,2000 కోట్లు అవసరం. మీరు ప్రభుత్వానికి వారంరోజుల గడువిచ్చి రైతాంగానికి కావలసిన రూ.2,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయండి. లేదం టే అవిశ్వాసం పెడతానని హెచ్చరించండి. ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ప్రతి పేద కుటుం బంలో కనీసం ఒక్కరైనా ఉన్నత విద్య చదివి, డాక్టరో.. ఇంజనీరో.. అయితే ఆ కుటుంబంలో పేదరికం పోతుందని వైఎస్సార్ పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకంపెడితే.. ఈ చేతగాని ప్రభుత్వం మూలంగా పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే అధ్వాన్న పరిస్థితి వచ్చింది.. ఆ పథకానికి బకాయిలతో కలిపి రూ.6,800 కోట్లు అవసరం పడుతుండగా ఈ చేతగాని ప్రభుత్వం కేవలం రూ.3,000 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులెత్తేసింది.

మొత్తం 6,800 కోట్లు ఇవ్వకపోతే అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబూ? ప్రతి అక్కా, చెల్లెమ్మల మొఖాల్లో చిరునవ్వులు చూడ్డానికి వైఎస్ ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకానికి బకాయిలతో కలిసి రూ. రెండు వేల కోట్లు కావాల్సి ఉంటే ప్రభుత్వం కేవలం రూ.400 కోట్లు ఇచ్చింది. ఇవాళ నేనడుగుతున్నా.. ఇదే చంద్రబాబు నాయుడు ఇదే సీఎంకు వారం రోజుల గడువిచ్చి ఇంకో రూ.1,600 కోట్లు ఇవ్వకపోతే మీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానని ఎందుకు చెప్పలేకపోతున్నారు? పైకి ఇది చేతగాని ప్రభుత ్వం అం టూ రోడ్లమీదకు వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తారు, లోపల కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కై ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టనుగాక పెట్టను అంటారు.

అప్పుడు భరోసా ఉండేది: ‘వైఎస్సార్ సువర్ణ పాలనలో రైతుల ధ్యాసంతా కూడా వ్యవసాయం చేయడంపైనే ఉండేది. ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది ఇంకా మెరుగైన స్థాయిలో ధాన్యం ఎలా పండించాలని ఆలోచించేవారు. ఇవాళ ధాన్యం అమ్ముడుపోతుందా లేదా అని భయపడని రోజులు లేవు. వైఎస్ హయాంలో మద్దతు ధరకంటే రూ.200 ఎక్కువకే అమ్ముడుపోయిన రోజులు చూశాం. ఏ సమస్య వచ్చినా వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా.. అన్నీ ఆయనే చూసుకుంటాడన్న భరోసా ప్రతి రైతుకూ ఉండేది. ఇప్పుడు కనీస మద్దతు ధర కంటే రూ.200 తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వైఎస్సార్ సువర్ణ పాలనలో ప్రతి పేదవాడికీ కూడా.. ఇవాళ కాకపోతే రేపు నాకు ఓ పక్కా ఇల్లు కచ్చితంగా వస్తుందన్న భరోసా ఉండేది. ప్రతి అవ్వా ప్రతి తాతా కూడా వయసు పెరిగే కొద్దీ.. అయ్యో నేను ఎలా బతకాలీ అనే ఆలోచన నుంచి.. ఒక సంవత్సరం పెరిగితే ఏముందిలే.. అన్నీ చూసుకోడానికి మా ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్నాడన్న భరోసా ఉండేది.. ప్రతి తల్లీ అనుకునేదీ నా కొడుకు.. నా కూతురు మరో నాలుగేళ్ల తరువాత డాక్టరో.. ఇంజనీరో.. అవుతారు, ముసలి వయసులో మమ్ములను ఆదుకుంటారని. కారణం ఏమంటే వైఎస్ సీఎం స్థానంలో ఉన్నారనే భరోసా ఉండేది. విద్యార్థులకు తాను చదువు కచ్చితంగా పూర్తి చేయగలనన్న నమ్మకం ఉండేది. ఎవరికైనా ప్రమాదం జరిగితే 108 నంబర్‌కు ఫోన్ చేస్తే క్షణాల్లో అంబులెన్స్ వచ్చి మమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించి బతికిస్తుందన్న భరోసా ఉండేది.

ఇప్పుడేదీ ఆ భరోసా?: జనహృదయనేత వైఎస్ మరణించి రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు పేదలకు, రైతులకు మేమున్నామని భరోసా ఇచ్చే నేతలే కరువయ్యారు. పేదలు, రైతు సోదరుల సమస్యలను ఈ సర్కారు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా, ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు గారు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా, దేవుడు అనే వాడు ఉన్నాడు. పై నుంచి అన్నీ చూస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షం, పాలక పక్షం నాయకులకు డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు ఇంటికి సాగనంపుతారు. రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలుపుతారు.’

Monday, May 30, 2011

ఆత్మబంధువుల కోసం అడవి దారిలో....

 
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో సాగిన జగన్ ఓదార్పు యాత్ర
దట్టమైన అడవులు, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల గుండా కదిలిన కాన్వాయ్
డప్పులు, సంప్రదాయ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికిన గిరిపుత్రులు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఓదార్పు యాత్ర
దట్టమైన అడవులు, మావోయిస్టు ప్రాబల్య
ప్రాంతాల్లో వైఎస్ జగన్ కాన్వాయ్
సంప్రదాయ నృత్యాలతో గిరిపుత్రుల ఆత్మీయ స్వాగతం
ఏజెన్సీ ప్రాంతాల్లో యాత్ర వద్దని జగన్‌మోహన్‌రెడ్డికి
లేఖ రాసిన విజయనగరం ఎస్పీ
జ్వరంతో బాధపడుతున్నందున యాత్ర వాయిదా
వేసుకోవాలన్న డాక్టర్లు... అయినా తన వారిని
కలవాల్సిందేనంటూ ముందుకు సాగిన జననేత



‘‘సార్.. కాకితాడ, ఉదయపురం పల్లెలు ఒడిశా సరిహద్దులో ఉన్నాయి. అవి మావోయిస్టులకు బాగా పట్టున్న గ్రామాలు. నక్సల్స్ కదలికలు ఉన్నట్లు మాకు సమాచారం అందింది. మేం రక్షణ కల్పించలేం. దయచేసి వెళ్లొద్దు. ఓదార్పు యాత్ర షెడ్యూల్ మార్చుకోండి..!’’
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజయనగరం జిల్లా ఎస్పీ నవీన్ గులాటి లేఖ.
‘‘మీరు తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. కనీసం రెండు రోజులైనా విశ్రాంతి తీసుకోండి..’’
- ఆదివారం ఉదయం జగన్‌కు వైద్యుల సూచన.

..అటు ఎస్పీ హెచ్చరికలు.. ఇటు వైద్యుల సూచనలేవీ జననేతను ఆపలేకపోయాయి. ఎలాగైనా సరే ఆత్మబంధువులను అక్కున చేర్చుకోవాలన్న తలంపుతో అడుగు ముందుకేశారు. దట్టమైన అడవులు, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం గుండా సాగిపోయారు. విజయనగరంలో ఆరో రోజు ఓదార్పు యాత్ర ఆసాంతం ఏజెన్సీ గ్రామాల మీదుగా సాగింది. ఆదివారం పార్వతీపురం మండలం ఖడ్గవలస నుంచి యాత్ర ప్రారంభమైంది.. అక్కడ్నుంచి జగన్ పెదమేరంగి జంక్షన్, పెదమేరంగి మీదుగా కురుపాం చేరుకున్నారు. కురుపాం మండల కేంద్రంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కురుపాం ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ్నుంచి దట్టమైన అడవి ప్రారంభమైంది. కురుపాంలో ప్రసంగం ముగించగానే యాత్ర దట్టమైన అడవి వైపు కదిలింది. దీంతో పోలీసుల్లో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. బొబ్బిలి డీఎస్పీ త్రినాథ్, పార్వీతీపురం డీఎస్పీ ఎల్వీ శ్రీనివాసరావు.. జగన్‌మోహన్‌రెడ్డిని అనుసరించారు.

గిరిజన పల్లెల్లో ఆత్మీయ స్వాగతం..


దట్టమైన అడవిలో జగన్‌మోహన్‌రెడ్డికి మొదట తెమఖర గ్రామ గిరిజనులు స్వాగతం పలికారు. తమ సంప్రదాయం ప్రకారం.. నీలం రంగు కండువా కప్పి, కళ్లు కడిగి దిష్టి తీశారు. కుంకుమతో బొట్టు పెట్టి ఆశీర్వదించారు. అక్కడ్నుంచి మరింత దట్టమైన అడవి మొదలైంది. టిక్కబాయి గ్రామస్థులను పలకరించి జగన్ ముందుకు కదిలారు. కిలోమీటరు దూరం వెళ్లగానే.. జగన్ తన వాహనాన్ని ఆపారు. ఏం జరిగిందోనని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన మాత్రం ఇవేవీ గమనించకుండా.. రోడ్డు పక్కనే ఉన్న మర్రిచెట్టు నీడ కింద నిలబడి తన కోసం ఎదురు చూస్తున్న నూకలమ్మ(65), అడవి శివమ్మ(70) అనే వృద్ధురాళ్ల దగ్గరికి వెళ్లారు. వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. వెళ్లొస్తా తల్లీ అంటూ అక్కడ్నుంచి సెలవు తీసుకున్నారు. తర్వాత యాత్ర తోటగూడ మీదుగా రస్తాకుంటుబాయి గ్రామం చేరింది. గిరిజనమహిళలు రోడ్డుపై నిలబడి ఆయనకు ఘన ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా అడవి చంద్రమ్మ అనే మహిళ ‘‘నా మనువడు పది పాసయ్యాడు. ఇక ఖర్చు పెట్టలేమని మానేశాం’’ అని జగన్‌కు తన గోడు వెళ్లబోసుకుంది. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ‘‘మన ప్రభుత్వం వచ్చే వరకు కష్టపడి పిల్లలను చదివించండి. ఎట్టి పరిస్థితుల్లో చదువులు ఆపొద్దు. మన ప్రభుత్వం రాగానే పైసా ఖర్చు లేకుండా నేను చదివిచ్చుకుంటాను’’ అని వారికి భరోసానిచ్చారు. ‘‘ఆ పైడితల్లి దయవలన నువు బేగున (తొందరగా) ముఖ్యమంత్రివి కావాలయ్యా. మేం ఓటేసుకొని నిన్ను గెలిపించుకుంటాం..’’ అని గిరిజన మహిళలు ఆశీర్వదించారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో..


రస్తాకుంటుబాయి నుంచి ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి.. మండ, గుమ్మగదబవలస, లేవిడి, మొండెంఖల్లు మీదుగా ఉదయపురం, కాకితాడ గ్రామాలకు చేరుకున్నారు. ఈ రెండు గ్రామాలు ఒడిశా సరిహద్దున ఉన్నాయి. ఇక్కడ్నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం వె ళ్తే ఒడిశా జిల్లాలోని గుమ్మ గ్రామం వస్తుంది. ఈ రెండు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల హిట్ లిస్టులో ఉన్నాయి. వారం కింద టే మావోయిస్టు ఆంధ్ర ఒడిశా సరిహద్దు స్క్వాడ్, కోరాపుట్ దళాలు సంయుక్తంగా ఇక్కడ సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తిస్థాయి సాయుధ పోలీసు వలయం మధ్య జగన్‌మోహన్‌రెడ్డిని బాధిత కుటుంబం వద్దకు తీసుకుపోవాలని, మధ్యలో సాధారణ ప్రజలను, గిరిజనులను కలవకుండా కట్టడి చేయాలని పోలీసులు భావించారు. కానీ ఆయన మాత్రం రక్షణ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, నన్ను స్వేచ్ఛగా వారితో మాట్లాడనివ్వాలని పోలీసులను కోరారు. ఈ రెండు గ్రామాల ప్రజలు డప్పులు, ధింసా నృత్యాలతో జగన్‌మోహన్‌రెడ్డిని తమ గ్రామంలోకి ఆహ్వానించారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి ఉదయపురంలో పత్తిక స్వప్న, కాకితాడలో అరిక భాస్కర్‌రావు కుటుంబాలను ఓదార్చారు. అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు. గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అప్పటికే జ్వరం తీవ్రం కావడంతో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి నేరుగా చిలకాంలోని ద్వారపురెడ్డి సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఓదార్పు యాత్రలో పాల్గొన్న వారిలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి, మాజీ మంత్రులు పి.సాంబశివరాజు, పెద్దింటి జగన్మోహన్‌రావు, మాజీ ఎంపీ కణితివిశ్వనాథం, మాజీ ఎమ్మెల్యేలు శత్రుచర్ల చంద్రశేఖరరాజు, జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరు వెంకటరెడ్డి, డాక్టర్ బొత్సా కాశినాయుడు, పి.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

Friday, May 20, 2011

మ్యాచ్ ఫిక్సింగ్ బాబూ... అవిశ్వాసం పెట్టరేం? * చంద్రబాబుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్న

నాడు వైఎస్ సువర్ణయుగం నడుస్తున్నప్పుడు ....
47 మంది ఎమ్మెల్యేలతోనే అవిశ్వాస తీర్మానం పెట్టారే..
ఈరోజు 90 మంది ఎమ్మెల్యేలు ఉండీ..
ఈ సర్కారు మాకొద్దని రైతులంటున్నా నోరు మెదపరేం..
{పజల పక్షాన పోరాడాల్సిన మీరు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు
అతి త్వరలో రెండు పార్టీలు బంగాళాఖాతంలో కలిసిపోతాయి
రాష్ట్రంలో ప్రతిపక్షమేదైనా ఉందంటే అది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే
ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో రాజకీయ మార్పునకు నాంది


ఈ చేతకాని సర్కారును సాగనంపాలి అని రోడ్డెక్కి మాట్లాడుతున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఈ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టట్లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. పేదల పక్షాన, రైతుల పక్షాన పోరాడాల్సిన ప్రతిపక్ష తెలుగుదేశం.. అధికార కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని, అందువల్లే రైతులు, పేదల సమస్యలను గాలికి వదిలేసిందని ఆయన దుయ్యబట్టారు. ఆయన ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి అని నోటిమాటగా అయితే అంటారుకానీ సాగనంపరని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని పెండ్లూరు, చాగలేరు గ్రామాల్లో శుక్రవారం ఆయన వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సువర్ణయుగం సాగుతున్నప్పుడు.. రైతులకు ఎంఎస్‌పీని మించి ధర 47మంది ఎమ్మెల్యేల బలం కూడా సరిగాలేని చంద్రబాబు ఈ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదంటూ అవిశ్వాస తీర్మానం పెట్టారు. మరి ఈ రోజు రోడ్డెక్కి మొసలి కన్నీరు కారుస్తూ.. ప్రజల పట్ల, పేదల పట్ల ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న మీకు గుర్తుకు రావట్లేదా చంద్రబాబూ.. ఇవాళ మీకు 90మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రతి రైతు సోదరుడు, పేదవాడు ప్రస్తుత ప్రభుత్వం దిగిపోవాలని వేయి కళ్లతో ఎదురుచుస్తున్నాడు.. అయినా మీరు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టట్లేదు?’ అని జగన్ నిలదీశారు. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న బాబు.. అవిశ్వాస తీర్మానం పెట్టనుగాక పెట్టనంటున్నారంటూ ఎద్దేవా చేశారు.


ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుంది


‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధాన్యం కనీస మద్దతు ధర వేయి రూపాయలుగా ఉంది. ఆ ఐదేళ్లలో రూ. 1200 ధరకు కూడా రైతులు ధాన్యాన్ని అమ్ముకున్నారు. ఆయన చనిపోయిన తరువాత, సువర్ణ యుగం పోయాక.. కనీస మద్దతు ధర కంటే రూ. 150 నుంచి రూ. 200 తక్కువకు అమ్ముకునే అధ్వాన్న స్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక ప్రతిపక్షం, పేదల వ్యతిరేక ప్రభుత్వం రెండూ కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికొదిలేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విసుగు చెందిన ప్రతి పేదవాడు, ప్రతి రైతు ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో ఎప్పుడు కలుస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారని జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో దేవుడు దయ తలిస్తే, వైఎస్ ఆశీస్సులు అందరికీ ఉంటే వైఎస్‌ను అభిమానించే గుండె చప్పుడులన్నీ ఏకమై.. ఇంతమంది పేదల ఉసురుపోసుకున్న ఈ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బంగాళాఖాతంలో కలిసి పోతాయని, ఆ రోజు అతి త్వరలో వస్తుందని జగన్ అన్నారు. వైఎస్ సువర్ణయుగం మళ్లీ వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో ప్రతిపక్షం క నబడడం లేదు. ప్రతిపక్షం ఉందంటే అది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే. జనం సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తున్నది మేమే. ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలనుకునే పార్టీ మాది’ అని స్పష్టంచేశారు.


అలాంటి నాయకులు కరువయ్యారు

‘రాముని రాజ్యం చూడ లేదు కానీ, రాజశేఖరుని సువర్ణ యుగం చూశాను. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి రేండేళ్లు కావస్తోంది. ఆయన చనిపోయిన తరువాత పేదల మొహంలో చిరునవ్వు చూడాలని, వారి జీవితాలపై చెరగ ని ముద్రవేయాలని.. వారి గుండెల్లో బతికుండాలని, చనిపోయిన తరువాత ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఫొటో పెట్టుకునేలా వారికి మేలు చేయాలనే తపన రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికీ లేదు’ అంటూ జగన్ కాంగ్రెస్, టీడీపీ నాయకులనుద్దేశించి విమర్శించారు.

మెజార్టీయే సాక్ష్యం

‘వైఎస్ ఎక్కడికీ పోలేదు. ప్రతి గుండెలో బతికే ఉన్నారు. నన్నూ, నా తల్లినీ ఒంటరిని చేయకుండా ఇంత పెద్ద కుటుంబాన్నిచ్చారు’ అని ప్రజాస్పందనను చూసి జగన్ ఉద్వేగంగా అన్నారు. ఉప ఎన్నికల్లో వచ్చిన మెజార్టీయే ఇందుకు సాక్ష్యమన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలే రాష్ట్రంలో రాజకీయ మార్పునకు నాంది పలికాయన్నారు. 20 మంది మంత్రులు మకాం వేసినా, హైదరాబాద్ నుంచి కోట్లాది రూపాయలు తెచ్చి ఆత్మాభిమానానికి వేలం వేసి కొనాలని చూసినా.. వారికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఈ జిల్లాలో పుట్టినందుకు గర్వపడుతున్న కడప బిడ్డలు.. రాష్ట్రంలో, దేశంలో అందరూ చూసేటట్లు గర్వింప దగ్గ తీర్పు ఇచ్చారన్నారు. ఎన్నికల రోజున చూపిన ప్రేమాభిమానాలే ఇప్పుడు కూడా చూపుతున్నారని.. చిరునవ్వుతో ఆప్యాయత, అభిమానం పంచుతున్నారని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tuesday, May 17, 2011

రైతుల మేలు కోరని దగాకోరు సర్కారు * రైతన్నల సమస్యలపట్ల నిర్లక్ష్యంపై జగన్ ధ్వజం

* రూ. 2,400 ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని 5 నెలలు కావస్తున్నా ఒక్క పైసా ఇవ్వలేదు
* వైఎస్ హయాంలో రూ.1,200 దాకా మద్దతు ధర వచ్చింది...
* వ్యవసాయం దండగ.. తిన్నది అరగకే ఆత్మహత్యలన్న ఏకైక సీఎం చంద్రబాబు
* నా దీక్షతోనైనా రాష్ట్రానికి బుద్ధి, కేంద్రానికి మనసు రావాలని కోరుకుంటున్నా
* అశేష జన సందోహం మధ్య ముగిసిన జగన్ రైతు దీక్ష...

  ‘రైతు సమస్యలను పరిష్కరించడంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మనసు ఉండడంతో మార్గం కనిపించింది. స్వర్ణయుగం లాంటి ఆయన పాలనలో క్వింటాలు ధాన్యం కనీస మద్దతు ధర రూ. 530 నుంచి రూ. 1,000 వరకు పెరిగింది. ఒక దశలో ఈ ధర రూ. 1,200 వరకు పోయింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతు సమస్యలపై మనసు లేకపోవడంతో మార్గం కనిపించడం లేదు. నిత్యం జగన్‌మోహన్‌రెడ్డిని ఏ విధంగా తొక్కాలా.. కుర్చీని ఏ విధంగా కాపాడుకోవాలా.. అనే ఆలోచన లతో కాలం గడిపేస్తున్నారు. జగన్‌పై దృష్టి పెట్టే సమయంలో కేవలం 10 శాతం ప్రజా సమస్యలపై పెడితే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. రైతులకు మద్దతు ధరకోసం నేను చేపట్టిన 48 గంటల దీక్షతో రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి, కేంద్ర ప్రభుత్వానికి మనసు రావాలని కోరుకుంటున్నా’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

రైతు సమస్యల పరిష్కారం కోసం గుంటూరులో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్ష(రైతు దీక్ష) ముగింపు సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రైతు వెంకటసుబ్బయ్య గ్లూకోజ్ కలిపిన కొబ్బరినీళ్లు ఇచ్చి జగన్‌తో దీక్ష విరమింపజేశారు. దీనికి ముందు జగన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

వైఎస్‌ఆర్ పాలన సువర్ణయుగం
48 గంటలపాటు నిరాహార దీక్ష చేస్తూ మా గోడు వినండని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చేతులు జోడించి వేడుకున్నా. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరుస్తాయని భావిస్తున్నా. రాముడి రాజ్యం చూడలేదు కానీ వైఎస్సార్ సువర్ణయుగం మనమంతా చూశాం. వరికి మద్దతు ధర వైఎస్సార్ హయాంలో రూ. 1,200 వరకు పోయిందంటే అది సువర్ణయుగాన్నే గుర్తుచేస్తుంది. ఆ ఐదేళ్ళలో పెట్టుబడిపై ఖర్చు ఒక్క రూపాయి కూడా పెరగలేదు.

రైతు ప్రభుత్వం వస్తేనే రైతు గురించి ఆలోచన చేస్తుంది. రైతు గురించి ఆలోచన చేస్తే రైతు మొహాన చిరునవ్వు ఉంటుందని నమ్మితేనే.. రాష్ట్ర ప్రభుత్వం, రైతన్న బాగుంటారు. అలా రైతు గురించి తెలిసిన వ్యక్తి, రైతు గురించి ఆలోచించిన వ్యక్తి వైఎస్సారే.. రైతు ముఖాన చిరునవ్వులు చూసిన ప్రభుత్వం వైఎస్సార్‌దే. ఆ ఐదేళ్లలో దేశం మొత్తం మీద ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.5 శాతం పెరిగితే... మన రాష్ట్రంలో 6.78 శాతం పెరుగుదల నమోదైందని చెప్పడానికి నేను గర్విస్తున్నా.
 
ఆ ఏకైక సీఎం చంద్రబాబు
 
వైఎస్ సువర్ణయుగానికి ముందు ఒకాయన రాష్ట్రాన్ని పాలించాడు. ఆయన పేరు చంద్రబాబు. తొమ్మిదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన ఆయన తన హయాంలో రైతులకేం చేయలేదుగానీ... ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తూ వారి వద్దకు వెళుతున్నారు. తన హయాంలో వ్యవసాయమే శుద్ధ దండగ అని అన్నారాయన. అలా అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటే.. తిన్నది అరగక చనిపోయారని అన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ మాటెత్తితే.. ఆ కరెంటు ఇచ్చే తీగలలో కరెంటు ఉండదు కాబట్టి తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళన చేశారు. అదే చంద్రబాబు ఇవాళ రోడ్డెక్కి అధికార దాహంతో ఇష్టం వచ్చినట్లు మాటలిస్తున్నారు. మొసలి కన్నీరు కారుస్తూ.. రైతుల వద్దకెళ్ళి ఆరు గంటలేం ఖర్మ.. ఏకంగా తొమ్మిది గంటలపాటు ఉచితంగా విద్యుత్ ఇస్తామంటున్నారు.

నేను కదిలే వరకూ.. బాబు కదలరు

ఎన్నో ఏళ్లుగా రైతులు కష్టాలు పడుతుంటే.. స్పందించని చంద్రబాబుకు.. జగన్ అనే నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రోజున మెలకువ వచ్చింది. అప్పటి నుంచి ఆయనను గమనిస్తే ఏదైనా సమస్యపై ఉద్యమిస్తానని వైఎస్ జగన్ నోటి నుంచి మాట వచ్చిన వెంటనే.. నేనూ యాత్ర చేస్తా నీతోపాటు అంటాడు. నాకు నవ్వు వ స్తోంది. రైతులు పడుతున్న కష్టాల గురించి దీక్ష చేయాలనుకుంటున్నట్లు నేను ఒక పత్రికా ప్రకటన ఇచ్చిన మూడు నాలుగు గంటలకు ఆయన నిద్ర మేల్కొని రైతుల వద్దకు వచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇంతకాలం నాకైతే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసం 40 రోజులు రాత్రింబవళ్ళూ తిరుగుతున్నా. ఆయనకు ఏం పనుంది.. ఇంతకాలం ఏసీ గదుల్లో పడుకునే బదులు నేను దీక్ష చేపట్టకముందే రైతుల గురించి ఉద్యమించవచ్చు కదా! ఈ రోజు ఆ చంద్రబాబు తెలుగుదేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయ్యాయి. ప్రజలు జగన్‌వైపు పోతున్నారనుకున్న సమయంలో.. రైతులకోసం చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తూ ఉద్యమ బాట పడుతున్నారు.
ఈ సర్కారుకు సిగ్గులేదు
వైఎస్ స్వర్ణయుగం గురించి, చంద్రబాబు మొసలికన్నీరు గురించి చెప్పుకున్నాం.. ఇంకో ప్రభుత్వం ఉంది.. అది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం. మొన్న రైతు సమస్యలపై విజయవాడలో లక్షల మంది రైతులతో కలసి నేను దీక్ష చేస్తూ రూ. 4వేలు ఇన్‌పుట్ సబ్సిడీ అడిగితే రూ. 2,400 ఇవ్వడానికి అంగీకరించి దానికోసం రూ. 618కోట్లు ఇస్తామని చెప్పి ఐదు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. సిగ్గులేదీ ప్రభుత్వానికి. ఇంతేకాకుండా రైతులకు రుణ వడ్డీ మాఫీ చేస్తామన్నారు. వడ్డీ మాఫీ కావాలని అంటే రూ. 1,100 కోట్ల రుణానికి దాదాపుగా రూ. 525 కోట్లను బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించాలి. చెల్లించకపోతే అవి వడ్డీనెలా మాఫీ చేస్తాయి. ప్రభుత్వం నేటివరకు బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక రుణాల రీషెడ్యూల్ 10% కూడా చేయలేని పరిస్థితి కనపడుతోంది.

ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనొచ్చుకదా

ధాన్యం కొనుగోలు చేస్తే నిల్వ చేయడానికి స్థలం సరిపోవడంలేదని, స్థలం లేకపోతే తామిక ధాన్యం కొనలేని పరిస్థితి వస్తుందని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. తమ వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని ఎగుమతులకు అనుమతించాల్సిందిగా కేంద్రానికి సూచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 4 నెలలుగా వారు కోరుతున్నా సర్కారుకు పట్టడం లేదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా మనతో సమానంగా ధాన్యం పండిస్తున్నారు. వారికి లేని సమస్య మనకెందుకు వస్తుందని నేను అడుగుతున్నా. పంజాబ్‌లో పండించిన ధాన్యంలో 94.2 శాతాన్ని సివిల్ సప్లరుుస్, కోఆపరేటివ్ సంస్థ, స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి విక్రయిస్తుంది. ఈ ప్రయత్నం మనరాష్ట్రంలో ఎందుకు జరగడం లేదు? అసలు ఎగుమతులను రాష్ట్రప్రభుత్వమే ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తున్నా.

మద్దతు ధర 100 పెంచాలి

ఓ రకంగా చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రైతుకు ఇస్తానన్న మద్దతు ధర రూ. 1000 కూడా సరిపోదు.. దాన్ని కచ్చితంగా 100 రూపాయలైనా పెంచి రూ.1100 చేయాలని నేను కోరుతున్నా. అంతేకాదు ఖరీఫ్‌లో ధాన్యానికి క్వింటాల్‌కు కేంద్ర ధరల నిర్ణాయక కమిటీ రూ.167 పెంచుతూ సిఫార్సు చేసింది. రబీలో పండిన పంటకు కూడా దీనిని వర్తింపజేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.

స్వర్ణయుగం మనమే తెచ్చుకుందాం
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి రెండు సంవత్సరాలు కావస్తోంది. ఆయనలా.. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని, తనపేరు వాళ్ళ గుండెల్లో, హృదయాల్లో కొలువుండాలని, చనిపోయిన తరువాత వారి గుండెల్లో నిలిచిపోవాలని, తన ఫొటో వారి ఇళ్లలో ఉండాలని.. అంతగా ప్రతి పేదవాడికి దగ్గరగా ఉండాలనే తపన ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికీ లేదు. రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు. ప్రతి రైతు, ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వును చూసిన.. వైఎస్ స్వర్ణయుగాన్ని మనమే తెచ్చుకుందాం.

పెట్రో ధరలతో దొంగ దెబ్బ తీశారు: ఐదు రాష్ట్రాలలో ఎన్నికల అనంతరం పెట్రోలుపై రూ.5 వాత వేసి ప్రభుత్వం ప్రజలను దొంగదెబ్బ తీసింది. సంవత్సరానికి ఎనిమిది సార్లు రేట్లు పెంచి రూ.15 మేర భారం వేసింది. ఇది సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నా? ఇది రైతుల గురించి చేపట్టిన దీక్ష కాబట్టి.. ఈ విషయంపై ఇంతకుమించి ఇక్కడ మాట్లాడను.
 
ఉప్పొంగిన గుంటూరు * ముగింపు రోజున జనసంద్రంగా మారిన రైతుదీక్ష ప్రాంగణం
 
జనప్రవాహంతో గుంటూరు ఉప్పొంగింది.. అన్నదాతల వేల గొంతుకలు ఒక్కటయ్యాయి.. సమస్యలపై దిక్కులు పిక్కటిల్లేలా నినదించాయి.. తమకోసం దీక్షకు దిగిన జననేత కు జేజేలు పలికాయి..! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష ముగింపు సందర్భంగా మంగళవారం రైతన్నలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే రైతులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రాంగణానికి చేరుకున్నారు. దీక్ష ముగించిన అనంతరం జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రసంగం ఆద్యంతం జగన్నినాదాలు, చప్పట్లతో దీక్షా ప్రాంగణం మార్మోగింది. అన్నదాతలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై జగన్ నిప్పులు చెరిగినప్పుడల్లా.. జనం హర్షధ్వానాలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ద్వంద్వ వైఖరి, కుయుక్తులను వివరిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమైంది.

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభించిన జగన్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష విరమించారు. తనను కలిసేందుకు, వినతిపత్రాలు ఇచ్చేందుకు, కరచాలనం చేసేందుకు వచ్చిన జనాన్ని జగన్ ఆప్యాయంగా పలకరించారు. మూడ్రోజులపాటు రైతులు క్యూలో నిల్చుని జగన్‌ను కలిసి, తమ గోడును వెల్లబోసుకున్నారు. వీటిలో కొన్నింటికి జగన్ తక్షణమే పరిష్కారం చూపారు. సోమవారం వెంగమాంబ కోల్డ్ స్టోరేజీ అగ్నిప్రమాద బాధిత రైతులు సమస్యను విన్నవించిన క్షణాల్లోనే జగన్.. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌కు ఫోన్ చేశారు. మిర్చి రైతులకు న్యాయం చేయాలని, ప్రతి ఒక్కరికీ పరిహారం అందించాలని కోరారు. ఈ సమస్య పరిష్కారమయ్యేవరకూ సంప్రదింపులు జరపాలని జిల్లా నేతలకు సూచించారు.

జనమే జనం:
రైతు దీక్షాప్రాంగణం చివరిరోజు జనసంద్రంగా మారింది. గుంటూరు జిల్లాతోపాటు, కృష్ణా, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వేలాది మంది రైతులు తరలి వచ్చారు. ఉదయం 7.30 గంటల నుంచే నేతల ప్రసంగాలు ప్రారంభమయ్యాయి.

దీక్ష విరమణ:
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన రైతు వెంకటసుబ్బయ్య కొబ్బరి నీళ్లు అందించి జగన్‌తో దీక్ష విరమింపజేశారు. మద్దతు ధరలేక 960 బస్తాల ధాన్యాన్ని బస్తా ఒక్కింటికి రూ. 680కు అమ్ముకున్న సుబ్బయ్యకు సుమారు రూ. 5 లక్షల నష్టం వచ్చిం ది. జగన్‌తోపాటు ఆయనా నిరాహార దీక్ష చేశారు.

భారీగా తరలివచ్చిన నేతలు:
జగన్ చేపట్టిన రైతుదీక్షకు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు. మూడ్రోజులపాటు సాగిన ఈ దీక్షకు మొత్తం ఇద్దరు పార్లమెంటు సభ్యులు, 19 మంది శాసనసభ్యులు, ఆరుగురు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తరలివచ్చారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు ఎమ్మెల్యే), కొండా సురేఖ (పరకాల ఎమ్మెల్యే), ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత (పత్తిపాడు), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), గొర్ల బాబురావు (పాయకరావుపేట), అమరనాథ్‌రెడ్డి (రాజంపేట), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), శేషారెడ్డి (అనపర్తి), కె.శ్రీనివాసులు (రైల్వే కోడూరు), ఎం.ప్రసాదరాజు (నర్సాపురం), బూచేపల్లి శివప్రసాదరెడ్డి (దర్శి), పి.ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కొవ్వూరు), కొర్ల భారతి (టెక్కలి), ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ), పిల్లి సుభాష్‌చంద్రబోస్ (రామచంద్రాపురం), తెల్లం బాలరాజు (పోలవరం), ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, జూపూడి ప్రభాకర్, పుల్లా పద్మావతి, కొండా మురళి, దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు హాజరయ్యారు.

జగన్‌కు జన వీడ్కోలు

దీక్ష విరమించిన జగన్‌కు జిల్లా ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. వేలాది మంది జగన్‌ను అనుసరిస్తూ పయనమయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ జగన్ గుంటూరు నుంచి మధ్యాహ్నం ఏలూరు బయల్దేరి వెళ్లారు.

జగన్ చెబితే అరగంటలో రాజీనామా
జగన్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన పిలుపిచ్చిన అరగంటలో నాతోపాటు అనేకమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని వ్యూహాలు, సాంకేతిక కారణాల వల్లే ఇప్పటివరకూ మేం రాజీనామాలు చేయలేదు. కడప ఉపఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పెనుతుపాను రేగనుందని నేను ముందే చెప్పాను. ఈ తుపానులో వైఎస్, జగన్‌లను విమర్శించినవారంతా కొట్టుకుపోతారు. జగన్‌తో నడుస్తున్నందువల్లే ఎప్పుడూ ఇంటిపట్టున ఉండే విజయమ్మ సైతం 40 రోజులు మండుటెండల్లో ప్రజల మధ్య తిరిగారు. ఎవరైనా ఎన్నికలు కాగానే విశ్రాంతి తీసుకుంటారు లేదా విజయోత్సవాలు జరుపుతారు. కానీ ఎన్నికల ఫలితాలకు ముందే జగన్ మళ్ళీ ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. అంతలోనే రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను గమనించి రైతుదీక్షకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే జగన్‌కు పోటీగా నిలబడగల నాయకుడెవ రైనా కనిపిస్తున్నారా?
- అనకాపల్లి ఎంపీ సబ్బం హరి

ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం
ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదన్న వాస్తవాన్ని సీఎం, మంత్రులు గ్రహించాలి. ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్ళ పదవీకాలం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు సహిస్తూ ఊరుకుంటున్నారు. లేదంటే అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారు. కడప గెలుపు ఒక చరిత్రాత్మక ఘట్టంగా మిగులుతుంది. వైఎస్ లేని లోటును జగన్ తీరుస్తారు. నిజాయితీగా పనిచేయడం తప్ప టక్కుటమారాలు జగన్ ముందు చెల్లవు. మహానేత వైఎస్ భోళాశంకరుడని, జగన్ శ్రీమహావిష్ణువని సాక్షాత్తు ఓ తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత నాతో అన్నారు. ఉప ఎన్నికల్లో జగన్‌కు 50 వేల మెజార్టీ కూడా రాదని కొందరు, లక్ష మెజార్టీ దాటదని మరికొందరు, గత మెజార్టీని మించిపోరని ఇంకొందరు కబుర్లు చెబుతూ ప్రజల్ని గందరగోళంలో పడవేశారు. ఈ నేతల దొంగమాటలు నమ్మి పందేలు కాసినవారు అన్యాయమైపోయారు. ఈ రైతు దీక్షతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరచి రైతులకు న్యాయం చేయాలి.
- నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి

రైతుల కన్నీటిలో కొట్టుకుపోతుంది
రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వమూ మనుగడ కొనసాగించలేదు. ఈ రైతుల కన్నీటిలో కిరణ్ ప్రభుత్వం కొట్టుకుపోతుంది. ఇటీవల వరుసగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే చిరంజీవి, రాహుల్‌గాంధీ ఐరన్ లెగ్‌గా ముద్రపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో రైతు సమస్యల పట్ల పోరాడుతున్న రాహుల్.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతాంగం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయాన్ని ముందు తెలుసుకోవాలి. తాము అధికారంలో ఉన్న చోట్ల సంస్కరణలు అమలు చేయడం మానేసి, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట్ల ఆందోళన చేయడం ఎంతవరకు సబబు? కడప అఖండ విజయాన్ని కొంతమంది కాంగ్రెస్ నేతలు పాలపొంగుగా అభివర్ణించారు. అందులో ఉన్నది గిన్నెడు పాలు కాదు. సప్తసముద్రాలంత అభిమానం జగన్‌పై ఉంది. కడపలో జనం ఓట్లతో ఈవీఎం కుయ్‌మంటుంటే అక్కడ ఢిల్లీలో అధిష్టానం గూబ గుయ్యిమంది.
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ

వైఎస్సార్ కాంగ్రెస్‌కు పట్టం ఖాయం
కడపలో జగన్ మెజార్టీ చూస్తుంటే.. ఆయనకు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో అర్థమవుతోంది. రాష్ట్రానికి సంబంధించి లోక్‌సభ ఎన్నికల మెజార్టీలో దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఆ విజయం లెక్కలోనిది కాదు. అప్పట్లో పీవీపై ఎన్టీఆర్ అభ్యర్థిని నిలబెట్టలేదు. జగన్‌కు రాష్ట్రానికి సీఎంగానే కాదు.. దేశానికి ప్రధాని కాగల లక్షణాలున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టు కలిగిన గుంటూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో 17 స్థానాల్లోనూ ప్రజలు పట్టం కడ తారు.
- ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి

కాంగ్రెస్‌కు చర మగీతం పాడండి

చావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్ర ద్వారా జవసత్వాలు తెచ్చిన నేత వైఎస్. అలాంటి మహానేత దేశంలో ఏ నాయకుడూ ప్రవేశపెట్టని విధంగా పేదల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కాంగ్రెస్‌ను కూకటివేళ్ళతో పెకలించాలి. ప్రజాసమస్యలపై, రైతు సమస్యలపై ఎలాంటి అవగాహన లేని సీఎం మనల్ని పాలించడం మన ఖర్మ. వైఎస్ తర్వాత రైతుల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నాగళ్ళనే తుపాకులను చేసి మీ ఓటుతో ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు చరమగీతం పాడి జగన్ సీఎం అయ్యేదాకా అండగా నిలవండి.
-ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి

జగనే వారసుడని నిరూపించారు..

వైఎస్ వారసుడు జగన్ మాత్రమేనని కడప ఓటర్లు నిరూపించారు. రైతు దీక్షకు ఢిల్లీపెద్దలు తమ వేగుల్ని పంపి ఉంటారు. ఈ వేగుల ద్వారా అయినా రైతు గుండెచప్పుడు ఢిల్లీకి తెలుస్తుంది. కడప జిల్లాలోని తిరుమలదిన్నెలో ఓ నాలుగేళ్ల పాప మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వస్తున్నారంటే ఎవడైతే నాకేంటి? జై జగనన్న అని నినాదం చేసిందంటే జగన్ ఎంతలా ప్రజల గుండెల్లో ఉన్నారో అర్థమవుతుంది. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు సోనియా బొమ్మ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలి.
-ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు

కిరణ్ కోసం పదవి వదులుకుంటారా?

జగన్ కోసం మంత్రి పదవులు వదులుకోవడానికి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. సీఎం కిరణ్‌కోసం మంత్రి పదవి వదులుకోవడానికి కేబినెట్‌లో ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రభుత్వం వెన్నెముక లేని సర్కారు. దీన్ని కూల్చడం జగన్‌కు ఒక లెక్కకాదు. వీహెచ్, శంకరరావులు కాంగ్రెస్‌ను అథఃపాతాళానికి నెట్టడానికి శాయశక్తులా కృషిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముత్యంలాంటి పార్టీ. అయితే జగన్ వెళ్లిపోయిన తర్వాత ముత్యం వెళ్లిపోయింది. ప్రస్తుతం చిప్పే మిగిలింది. ఏ జాదూ వచ్చినా కాంగ్రెస్‌ను మార్చలేరు.
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు

దేశానికే ఆదర్శం వైఎస్..

రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్‌ను చూసి దేశం ఎంతో నేర్చుకుంది. వైఎస్ పంచె కట్టుకుని వస్తుంటే రైతుకు నిజమైన ప్రతినిధిలా ఉండేవారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతును పట్టించుకునే నాథుడే లేడు. సినిమా రంగం నుంచి వచ్చిన ఓ నేత సామాజిక సేవ అంటూ ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి కేవలం పదవి కోసం పార్టీని నట్టేట ముంచి నీచమైన కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నారు. టీడీపీ ఒక్క ప్రాజెక్టు కట్టకుండా రాష్ట్ర వ్యవసాయ రంగాన్నే దివాళా తీయించింది. మళ్లీ అప్పటి వైఎస్ పాలనను తీసుకురాగ ల వ్యక్తి జగన్ ఒక్కడే.
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ