క్యాంపు కార్యాలయానికి పోటెత్తిన నేతలు, అభిమానులు
యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేయబోయే కొత్తపార్టీకి అన్ని వర్గాల నుంచీ రోజురోజుకూ మద్దతు వెల్లువలా పెరుగుతోంది. జగన్‌కు మద్దతు తెలిపేందుకు మంగళవారం ఎమ్మెల్యేలు, పలు పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు విద్యార్థులు, టీచర్లు, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు కూడా భారీగా తరలివచ్చారు. ‘జై జగన్..!’ ‘జై జై జగన్...!’ ‘జగన్ నాయకత్వం వర్ధిలాలి’ అనే నినాదాలతో సాగర్ సొసైటీలోని యువనేత క్యాంపు కార్యాలయం మారుమోగిపోయింది! కొత్త ఏడాది సందర్భంగా పలువురు అభిమానులు రూపొందించిన క్యాలెండర్లు, సీడీల విడుదలతో జగన్ బిజీగా గడిపారు.
ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు మంగళవారం యువనేత జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, కొల్లాపూర్ సింగిల్ విండో చైర్మన్ రాంభూపాల్ రెడ్డి, ఉండి నియోజకవర్గం బీజేపీ నేత కట్రెడ్డి సత్యనారాయణ మంగళవారం సాయంత్రం భారీ సంఖ్యలో తమ అనుచరులతో వచ్చి జగన్‌కు మద్దతు ప్రకటించారు.
మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, అనంతపురం డీసీసీ ఉపాధ్యక్షుడు జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మల్లేపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కె.అనంతరెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ రవీందర్ రెడ్డి, టెక్కలి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రధాన్ రాజేంద్రప్రసాద్, టీడీపీ నేత, టెక్కలి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అన్నవరపు సూరిబాబు, మహబూబ్‌నగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వంగూరు బాలమణెమ్మ, భీమవరం ఎస్‌టీఎఫ్ అధ్యక్షుడు ఎం.వి.రామకృష్ణంరాజు, మన్ననూరు సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి, వంగూరు సింగిల్ విండో అధ్యక్షుడు ఎ.నరేందర్ రెడ్డి, ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు పెరికె వరప్రసాద్, యునెటైడ్ ఫ్రంట్ ఫర్ దళిత క్రిస్టియన్ అధ్యక్షుడు ఎం.సాల్మన్ రాజు తదితరులు జగన్‌ను కలిసి మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.
స్టార్ సర్టిఫికెట్ ప్రదానం: అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల మరణానంతరం వారి పేరిట షికాగోలోని ఇంటర్నేషనల్ స్టార్ రిజిస్టర్ ఆర్గనైజేషన్ స్టార్‌ను నమోదు చేస్తోందని ఎన్నారై వైఎస్‌ఆర్ యువసేన అధ్యక్షుడు ఎన్.మారుతి శర్మ (న్యూయార్క్) తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కూడా ఆయన స్టార్‌ను రిజిస్టర్ చేశామన్నారు. ఈ మేరకు సంస్థ విడుదల చేసిన స్టార్ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను జగన్‌కు అందజేసినట్టు తెలిపారు. వేంపల్లి నిరంజన్‌రెడ్డి రూపొందించిన 2011 డైరీని జగన్ ఆవిష్కరించారు. ‘రాజన్నె జగనన్నై ఇస్తున్న ఓదార్పు’ పేరిట కాంగ్రెస్ నేత పుత్తా ప్రతాప్‌రెడ్డి రూపొందించిన పాటల సీడీని జగన్ విడుదల చేశారు. కామెర్ల వ్యాధికి మెడిసిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పులివెందుల నియోజకవర్గం లింగాల వాసి ఎ.వెంకటరామిరెడ్డిని జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
No comments:
Post a Comment