Thursday, December 23, 2010

కింకర్తవ్యం ? * పగ్గాలివ్వండి.. జగన్‌ను అణిచేస్తా

fast-end
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ఎసరు తెచ్చేందుకు పరోక్ష ప్రయత్నాలకు తెరలేపిన జగన్‌ను అణచివేసేందుకు వ్యూహరచన చేస్తున్న సమయంలోనే.. తన పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు జగన్‌ విజయవాడలో నిర్వహించిన లక్ష్యదీక్షకు హాజర యిన వైనం అధిష్ఠానాన్ని ఆలోచనలో పడవేసింది.కేవలం ఏడుగురు ఎమ్మెల్యేల మెజారిటీ బలం ఉన్న కిరణ్‌కుమార్‌ ప్రభుత్వానికి ఈ 30 మంది ఎమ్మె ల్యేలు ఏ సందర్భంలోనయినా ఒకవేళ మద్దతు ఉపసంహరించుకున్నట్టయితే ప్రభుత్వం కుప్ప కూలిపోతుందన్న భయాందోళన కాంగ్రెస్‌ నాయక త్వాన్ని పట్టి పీడిస్తోంది. దీనితో జగన్‌కు మద్దతు నిస్తున్న ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసు కోవాలి? తీసుకుంటే తలెత్తనున్న పరిణామాలే మిటి? అన్న అంశాలపై అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.

ఈ నేపథ్యంలో మరికొద్దిరోజుల్లో ఢిల్లీ నుంచి పార్టీ ప్రతినిధులుగా ఆజాద్‌, మొయిలీ రాష్ట్రానికి రానున్నారు. వారు జగన్‌కు మద్దతు నిచ్చిన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. వారే కాకుండా, కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలను కూడా పిలిపించి మాట్లాడనున్నారు. రాష్ట్రంలో పార్టీని కాపాడేందుకు రానున్న వారిద్దరూ ఎమ్మెల్యేలను ఎంతవరకూ బుజ్జగిస్తారో చూడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ గందర గోళ పరిస్థి తుల నేపథ్యంలో 30 మంది ఎమ్మెల్యేలుపార్టీని ధిక్కరించడం సాధారణ విషయమేమీ కాదని కాంగ్రెస్‌ నాయకులు స్పష్టం చేస్తున్నారు.

మంది ఎమ్మెల్యేల సంఖ్య చాలా పెద్దదేనని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ సంఖ్య సరిపోయినా, సరిపోకపోయినా ప్రభుత్వం మాత్రం కచ్చితంగా సంక్షోభంలో పడేంత సంఖ్యేనని సీనియర్లు కూడా అంగీక రిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్‌ సమావేశాల వరకూ కిరణ్‌ కుమార్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేక పోయినా, 30 మంది ఎమ్మెల్యేల సంఖ్య పెరిగి పెద్దదయితే సర్కారు కష్టాల్లో పడినట్టే నంటున్నారు. ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినట్టయితే ఇబ్బందేనని చెబుతున్నారు. కిరణ్‌కుమార్‌ సర్కారు కూలిపోవాలని కోరుకోవడమే కాకుండా, ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న జగన్‌ వర్గీయులు అవిశ్వాస తీర్మాన అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలోనూ చేజార్చుకోరని విశ్లేషిస్తున్నారు. తాను సర్కారును కూల్చబోనని, తనంతట తాను కూలిపోతే ఏం చేయలేనని మొదటి నుంచీ చెబుతూవస్తోన్న జగన్‌ వ్యూహం కూడా ఇదేనంటున్నారు.

మరోవైపు.. పార్లమెంటు సభ్యులయిన సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి తాము జగన్‌ వైపే ఉంటామని విస్పష్టంగా ప్రక టించడం కూడా అధిష్ఠానాన్ని కలవరపరు స్తోంది. ఇద్దరు ఎంపీలు బాహాటంగా బయటకు వస్తే ఆ ప్రభా వం మిగిలిన ఎంపీలపైనా పడుతుందన్న ఆందోళన వ్యక్తమవు తోంది. వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా తెలియక నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. కేంద్రంలోని యూపీఏ సర్కారు కూడా అంతం తమాత్రపు మెజారిటీతోనే కొనసాగుతున్నందున రాష్ట్రానికి చెందిన 33 మంది ఎంపీల్లో కనీసం పదిమంది వెళ్లినా ప్రమాదకరమే నన్నది నాయకత్వం అసలు ఆందోళన. జాతీయ స్థాయిలో కాంగ్రె స్‌ను దెబ్బకొట్టా లన్న లక్ష్యంతో పనిచేస్తున్న జగన్‌, రాష్ట్రానికి చెందిన ఎంపీల పైనా కన్నేసినట్లు తెలియడంతో నాయకత్వం కలవరపడుతోంది.

అందులో భాగంగానే ఆజాద్‌, మొయిలీని రాష్ట్రానికి పంపు తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెరుగుతున్న చిక్కుముళ్లను ఏవిధంగా విప్పాలన్న అంశంపై నాయకత్వం తలపట్టుకుంది. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితిలో మిగిలిన రాష్ట్రాల్లో మాదిరిగా బెదిరింపు మంత్రాలు ఇక్కడ పనిచేయవన్న వాస్తవం స్పష్టమయింది. అందువల్ల సాధ్యమయినంత వరకూ బుజ్జగింపులు, తాయిలాల ఎరలతోనే సమస్యను తీవ్రతరం కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.
జగన్‌ శిబిరంలోని ప్రజాప్రతినిధులు

1 రామచంద్రారెడ్డి (రాయదుర్గం)
2  శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)
3  మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి)
4 బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)
5 ఆళ్ల నాని (ఏలూరు)
6 అమర్‌నాధ్‌రెడ్డి (రాజం పేట)
7 శేషారెడ్డి (అనపర్తి)
8 కొండా సురేఖ (పరకాల)
9 జయసుధ (సికింద్రాబాద్‌)
10 బాబూరావు (పాయకరావు పేట)
11 గుర్నాధరెడ్డి(అనంతపురం అర్భన్‌)
12 కె.వెంకట్రామిరెడ్డి (ధర్మవరం)
13 ఆదినారాయణరెడ్డి (జమ్ములమడుగు)
14 రాజేష్‌ (చింతలపూడి)
15 బాలరాజు (పోలవరం)
16 ప్రసాదరాజు(నర్సాపురం)
17 అంజిబాబు (భీమవరం)
18 ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి(కాకినాడ)
19 రేగా కాంతారావు (పినపాక)
20 పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (రామచంద్రాపురం)
21 కుంజా సత్యవతి (భద్రాచలం)
22 లబ్బి వెంకటస్వామి (నందికొట్కూర్‌)
23 బి.శివప్రసాదరెడ్డి (దర్శి)
24 జోగి రమేష్‌ (పెడన)
25 పేర్ని నాని (బందరు)
26 రమణమూర్తి రాజు (యలమంచిలి)
27 కమలమ్మ (బద్వేల్‌)
28 సబ్బం హరి-( ఎంపీ అనకాపల్లి)
29 మేకపాటి రాజమోహన్‌రెడ్డి
  ( నెల్లూరు - ఎంపి)
30 కొండా మురళి ( ఎమ్మెల్సీ)
31 జూపూడి ప్రభాకర్‌రావు (ఎమ్మెల్సీ)
32 పుల్ల పద్మావతి (ఎమ్మెల్సీ)
33 కృష్ణారెడ్డి (ఎమ్మెల్సీ) 
34 కాటసాని రామిరెడ్డి (బనగానపల్లె, పీఆర్పీ)
35 శోభా నాగిరెడ్డి (ఆళ్లగడ్డ, పీఆర్పీ)
36 నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (టీడీపీ, కొవ్వూరు) 
పగ్గాలివ్వండి.. జగన్‌ను అణిచేస్తా
KVP
రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇటీవలి కాలంగా జరుగుతున్న పరిణామా లు, కడప మాజీ ఎంపి జగన్‌ వ్యవహారంతో తలపట్టుకున్న నాయకత్వం ముందు ఎంపి, వైఎస్‌ ఆత్మబంధువయిన డాక్టర్‌ కేవీపీ రామచంద్రరావు ఒక ప్రతిపాదన పెట్టారు. తనకు పగ్గాలు అప్పగిస్తే, రాష్ట్ర పార్టీని గాడిలో పెడతానని, జగన్‌ పీచమణిచేస్తానని భరోసా ఇచ్చారు. అయితే, తనకు సీఎం పదవి ఇవ్వాలనిగానీ, పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని గానీ ఆయన కోరకపోయినప్పటికీ మొత్తంగా రాష్ట్ర పార్టీ పగ్గాలు తనకు అప్పగించాలని మాత్రం కోరినట్లు తెలిసింది.

పార్టీ అధి నేత్రి సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌తో కొద్దిరోజుల క్రితం జరిగిన భేటీలో కేవీపీ ఈ ప్రతిపాదన తెచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. గతంలో తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరిన కేవీపీ, ఆ విషయం బయటకు పొక్కడంతో తాను ఆ పదవిని కోరలేదంటూ ఖండించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తనకు పగ్గాలు ఇవ్వాలని అధిష్ఠానాన్ని అభ్యర్థించడం చర్చనీయాంశంగా మారింది.

పార్టీలో ఉన్నంత కాలం జగన్‌కు మద్దతుగా, పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తరువాత కూడా జగన్‌ నిర్వహించే కార్య్ర మాల్లో పాల్గొంటూ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నేతలే ఇష్టానుసారం మాట్లాడటం, విమర్శలు చేయడం, దాంతో పార్టీని కాపాడుకునేందుకు సొంత పార్టీ నేతలే వారిపై మాటల దాడులు కొనసాగించడం, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు వంటివి మితిమీరడంతో కాంగ్రెస్‌ ప్రతిష్ట మంటగలుస్తున్నదని పటేల్‌ ఎదుట కేవీపీతో పాటు మరో ఇద్దరు ఎంపీలు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతకుముందు.. కేవీపీతో పాటు మరి కొందరు ఎంపీలు, పార్టీ సీనియర్‌ నేతలు వేర్వే రుగా వివిధ సందర్భాల్లో పార్టీ అధినేత్రి సోనియాగాంధీని, ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌, కోర్‌ కమిటీ సభ్యులు కేంద్ర మంత్రులు ప్రణబ్‌ ముఖర్జీ, ఎ.కె.ఆంటోని, మరో సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌లను కలిసినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో పరిణామాలు, నేతల తీరుపై తమ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.

అదే సమయంలో వీరందరు పార్టీలో నేతల మధ్య జరుగుతున్న అంతర్గత ఘర్షణ, ప్రకటనలు, సొంత నిర్ణయా లను పార్టీ నాయకత్వం మౌనంగా చూస్తూ ఉంటే పార్టీ మరిం త నష్టపోతుందని స్పష్టం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఆ తరువాత నేతలు వారంతట వారే దారికి వస్తార ని, దీంతో పార్టీ నాయకులు క్రమశిక్షణ ఉల్లంఘించడానికి, జగన్‌ వైపు అడుగులు వేసేందుకు భయపడే పరిస్థితి వస్తుం దని వారు విజ్ఞప్తి చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

మీరు మౌనంగా వ్యవహరిస్తున్నందు వల్ల పార్టీ నేతలు ఎవరికి తోచి న విధంగా వారు మాట్లాడుతూ పార్టీ రోజుకో కొత్త సమ స్యలు తెచ్చిపెడతారని, వీరి చర్యల వల్ల పార్టీ బలహీన పడి వచ్చే ఎన్నికల నాటికి జనానికి దూరమయ్యే ప్రమాదం ఉందని వారు అధిష్టానం వద్ద పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో తొలుత అంతర్గత విమర్శలను ఆపండి, దాని కోసం కఠినంగా వ్యవ హరిస్తే నేతలు గీత దాటే పరిస్థితి ఉండదు, ఆ తరువాత వారంతట వారే మన దారికి వస్తారు అని కేవిపి, ఆయన సన్నిహిత నేతలు పటేల్‌కు విన్నవించినట్లు తెలిసింది.

మీరే ఆ బాధ్యతలు తీసుకోండి, లేదంటే మా పై నమ్మకం ఉంటే ఆ నాకు అప్పగించండి, పార్టీపై జగన్‌ ప్రభావం పడకుండా చూసుకుంటా, వైఎస్‌ తరహాలో పార్టీని పటిష్టం చేసి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలో వచ్చేలా అంతా సెట్‌రైట్‌ చేస్తానని కేవిపి ఆ సందర్భంగా పటేల్‌కు భరోసా ఇచ్చినట్లు సమాచారం.జగన్‌ ఆర్ధిక మూలాలన్నీ తనకు తెలుసునని, అతడిని ఏ విధంగా దారికి తీసుకురావాలో తనకు స్పష్టంగా తెలుసునన్న కేవీపీ ఆ వివరాలను పటేల్‌కు చెప్పిన ట్లు తెలిసింది. తనకు పూర్తి అధికారాలిచ్చి, పగ్గాలు ఇస్తే జగన్‌ను పూర్తి స్థాయిలో అణచివేస్తానని కూడా కేవీపీ భరోసా ఇచ్చారు. జగన్‌ వెంట ఉన్న ప్రధాన అనుచరులంతా ఇప్పటికీ తాను చెప్పినట్టు వింటారని, తనకు బాధ్యతలిస్తే వారందరినీ మళ్లీ పార్టీలోకి తెస్తానని హామీ కూడా ఇచ్చారు.

ఇప్పటికీ తన మనుషులు జగన్‌ వెంట ఉన్నారని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలుసనంటూ వారి పేర్లను కూడా పటేల్‌కు వివరించినట్లు సమాచారం. అదే సమయంలో కడపలో జగన్‌ ను జీరో చేస్తా నని, రానున్న ఉప ఎన్నికల్లో కడప ఎంపీ, పులి వెందుల అసెం బ్లీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తానని చెప్పారు. వైఎస్‌ ఉన్న ప్పుడు జరిగిన టికెట్ల పంపిణీలో తానే కీలకపాత్ర పోషించి నందున, రాష్ట్రంలో ఏ నాయకుడి బలమేమిటో తనకు అవగా హన ఉందని, అందువల్ల తనకు పగ్గాలు ఇస్తే పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తానని హామీ ఇచ్చారు.

సీఎం కిరణ్‌ కుమార్‌ వల్ల ఇవన్నీ సాధ్యం కాదని, ఆయనకు వాటిపై అంత అవగాహన లేనందున ఆ బాధ్యతలను తనకు అప్పగించాలని కేవీపీ కోరారు. అయితే, తనపై ఆరోపణలు చేసే వారికి ఢిల్లీలో ప్రాధాన్యం ఇవ్వకూడదని, గతంలో వైఎస్‌కు ఎలాంటి ప్రాధా న్యం ఇచ్చారో తనకూ అదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని కేవీపీ ఒక దశలో షరతు విధించినట్లు తెలిసింది.అందుకు స్పందించిన అహ్మద్‌పటేల్‌ తాను ఈ ప్రతిపా దనను సోనియాగాంధీ, ప్రణబ్‌, ఆజాద్‌లతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

అయితే, అప్పటివరకూ మీ స్థాయిలో మీరు పార్టీ పటిష్ఠపర్చా లని మీ సమర్ధతేమిటో తెలిసినందున మీ సే వలను సద్వినియోగం చేసుకుంటామని పటేల్‌ చెప్పా రు. కేవీపీ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తే.. ఆయన సీఎం పదవో, పీసీసీ అధ్యక్ష పదవినో ఆశిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కిరణ్‌కుమార్‌రెడ్డిని మార్చి నెల తర్వాత మారుస్తారని విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతున్న నేప థ్యంలో కేవీపీ ఇలాంటి ప్రతిపాదనలు చేయటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. కేవీపీ బహుశా తనకు సీఎం పదవి ఇస్తే రాష్ట్రంలో పార్టీని గాడిలోకి తెచ్చి, పూర్వవైభవం తెస్తానని అహ్మద్‌పటేల్‌ ముం దు ప్రతిపాదన పెట్టి ఉండవచ్చని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.
 

No comments:

Post a Comment