వైఎస్ ఆత్మబంధువు, రాజ్య సభ సభ్యుడయిన డాక్టర్ కేవీపీ రామచంద్రరావు - వైఎస్ తన యుడు జగన్ మధ్య ఇక యుద్ధం జరగనుందా? తాజాగా జగన్ వీర విధేయురాలయిన ఎమ్మెల్యే కొండా సురేఖ ఎంపీ కేవీపీ అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణకు డిమాండ్ చేయటం పరిశీలిస్తే ఈ అనుమానం నిజమనిపించక మానదు. మొన్నటి వరకూ కేవీపీ మార్గదర్శకత్వం లోనే నడిచిన కొండా.. హటాత్తుగా ఆయనపైనే పేల్చిన ఈ ‘అవినీతి బాంబు’ కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తోంది. కేవీపీ తనకు నష్టం జరిగే పరిస్థితి వస్తే చివరకు అటు అధిష్ఠానాన్ని, ఇటు జగన్‌నూ ఇరికిస్తారన్న ప్రచారం మొదలయింది. ఒకవేళ నిజంగానే సీబీఐ కేవీపీ ఆస్తులపై విచారణ జరిపిస్తే ఆయన పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఇప్పటివరకూ కేవీపీ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఒక్క టీడీపీ మాత్రమే డిమాండ్ చేయగా, ఇప్పుడు కొండా సురేఖ కూడా అదే దారి పట్టడం చూస్తే, కేవీపీ క్రమంగా కష్టాల్లో పడుతున్నారన్న వాదనకు బలం చేకూరుతోంది. రాష్ట్రంలో వైఎస్ హయాంలో జరిగిన ఎమ్మార్, రహేజా వంటి భారీ అక్రమాలతో పాటు, అస్మదీయులకు ఇరిగేషన్, విద్యుత్ ప్రాజెక్టులు, భారీ రోడ్డు కాంట్రాక్టులు, సెజ్‌ల కేటాయింపు వ్యవహారాల్లో కేవీపీ మూలవిరాట్టన్న చర్చలు రాజకీయ పార్టీల నుంచి- సామాన్య జనంలోనూ చాలాకాలం నుంచి చర్చనీయాం శంగా మారిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వైఎస్ జగన్ వర్గమే కేవీపీ ఆస్తులన్నీ అక్రమంగా సంపాదించినవేనని, వాటిపై స్వయంగా కేవీపీయే సీబీఐ విచారణ కోరాలంటూ డిమాండ్ చేయడం బట్టి ఇక జగన్ - కేవీపీ మధ్య యుద్ధానికి తెరలేచినట్టేనన్నది తేలిపోయింది. ఇద్దరి అక్రమ సంపా దన, ఆర్ధిక మూలాల వివరాలు ఒకరికొకరికి తెలియ డంతో ఇక వారిద్దరి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. దీనితో ఇప్పటివరకూ వారిద్దరి మధ్య జరుగుతున్న ముసుగులో గుద్దులాటకు శాశ్వతంగా తెరపడి నట్టయింది. కేవీపీపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఆయన దాదాపు ఒంటరి అవుతారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా తాను చెబితే వినే ఆప్త మిత్రుడు లేకపోవడం, మిగిలిన ఎంపీల మాదిరిగా జనంలో బలం లేని ఎంపీ కావడం, ఇప్పటి వరకూ తెరవెనుక చక్రం తిప్పి, మంత్రాంగం నడపడమే తప్ప, నేరుగా సమస్యను ఎదుర్కొనే ధైర్యం ప్రదర్శించక పోవడం వంటి సమస్యలు ఆయనకు ప్రతిబంధకంగా పరిణమించాయి. పైగా.. వైఎస్ అధికారంలో ఉండగా, వైఎస్ ప్రత్యర్థులను ఆర్థికంగా, రాజకీయంగాఅణచివేయడంలో కేవీపీ చూపిన అత్యుత్సాహమే ఇప్పుడు ఆయన్ని ఒంటరిని చేసింది.
అధికారాన్ని వినియోగించుకుని ప్రత్యర్థులను, చివరకు మీడియాను కూడా భయపెట్టి, సమాచారశాఖ ద్వారా వారందరినీ తన చుట్టూ తిప్పుకుని, విభజన తెచ్చి పెత్తనం చెలాయించిన కేవీపీ ఇప్పుడు ‘ఎవరూ రక్షించలేనంత’ సమస్యలో కూరుకుపోయారు. కేవీపీ అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణ జరిగితే ఆయన వ్యవహారశైలి, స్పందన ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోన్న అభిప్రాయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అక్రమ సంపాదన రుజవయి, తాను పీకల్లోతు కష్టాల్లో ఉంటే అప్పుడు ఆయన ఈ వ్యవహారంలో అధిష్ఠానాన్ని కూడా ఇరికించడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.
వైఎస్ జీవించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలలో ఢిల్లీ నాయకత్వానికీ వాటాలున్నాయని, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఇక్కడ నుంచే నిధులు వెళ్లాయని పెదవి విప్పితే పార్టీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంలో ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పేరు చెబుతారా? ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పేరు చెబుతారా? లేక కోశాధికారి మోతీలాల్ వోరా పేరు తెరపైకి తెస్తారా? అన్న ప్రశ్నలు సొంత పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్‌కు సంబంధించిన అక్రమ ఆస్తుల చిట్టాను కూడా విప్పడానికి కేవీపీ జంకరని చెబుతున్నారు. జగన్‌కు చెందిన మీడియా సంస్థల్లో వచ్చిన పెట్టుబడులు, వారికి ఏవిధంగా లబ్ధి జరిగింది? మారిషస్, దుబాయ్ నుంచి వచ్చిన పెట్టుబడులెంత? ఇరిగేషన్ కంపెనీల్లో జగన్ వాటాలెంత? ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, బ్రహ్మణీ స్టీల్స్‌లో జగన్ బినామీ వాటాలెంత వంటి లెక్కలను కేవీపీ వెలుగులోకి తీసుకురావడం ఖాయమంటున్నారు.
నిజానికి, జగన్ వద్ద కూడా కేవీపీ అక్రమ ఆస్తుల చిట్టా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే కాకుండా దుబాయ్‌తో పాటు.. వివిధ రాష్ట్రాల్లో బినామీ పేర్లు, ఆయన కొడుకు, వియ్యంకుడు, మిత్రుల పేర్లతో ఉన్న వ్యాపారాలు, ఇక్కడ బినామీ పేర్లతో ఉన్న ఇరిగేషన్-పవర్ ప్రాజెక్టుల వివరాలన్నీ జగన్ వద్ద ఉన్నాయని ఆయన సన్నిహితులు బాహాటంగానే చెబుతున్నారు. అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా జరిగే వ్యాపారాల వివరాలు కూడా జగన్ వద్ద ఉన్నాయంటున్నారు. వాటిని సీబీఐ విచారణ సమయంలో అందచేస్తారని, అదీ సాధ్యం కాకపోతే ప్రతిపక్షాలకు లీక్ చేస్తారంటున్నారు.
కేవీపీ ఓ బ్రోకర్ - కొండా సురేఖ లేఖాస్త్రం
జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారు
పొన్నాలతో కలిసి కోట్లు దండుకున్నారు
ఆయన సలహాలన్నీ దోపిడీకే
పనికిరాని వాడిని వైయస్ పైకి తెచ్చారు
ఆయన నిర్లక్ష్యం వల్లే వైయస్‌మరణం
సంతకాలు సేకరించింది ఆయనే
ఆస్తులపై సీబిఐ విచారణకు సిద్ధం కావాలి
వైఎస్ ఆత్మ బంధువు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై జగన్ వర్గం నాయకురాలు కొండా సురేఖ మండిపడ్డారు. ఆయనను ఒక బ్రోకర్‌గా అభివర్ణించారు. 'జలయజ్ఞంలో దోపిడీ నుంచి వైఎస్ మరణం దాకా..' అన్ని పాపాలకూ ఆయనే బాధ్యుడని నిందించారు. వైఎస్ అవినీతిపరుడంటూ నిందలు వేస్తున్నా కేవీపీ మౌనం వహించడానికి అసలు కారణం... పదవీ కాంక్షేనని తేల్చి చెప్పారు. "వైఎస్ మరణించాక జగనే సంతకాలు సేకరించారని దుష్ప్రచారం జరుగుతోంటే ఎందుకు ఖండించడంలేదు? జగన్‌ను సీఎం చేయాలని సంతకాల సేకరణ చేపట్టి, తద్వారా జగన్‌ను అప్రతిష్ఠ పాలు చేశారు. ఆ విషయాన్ని ఎందుకు ధైర్యంగాఒప్పుకోలేదు?'' అని కేవీపీని ప్రశ్నించారు. "శ్రీ కేవీపీ రామచంద్ర రావు గారికి...' అని సంభోదిస్తూ ఆయనకు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాశారు. అందులో... అనేక సూటి ప్రశ్నలు సంధించారు. సురేఖ లేఖ సారాంశమిది...
"వైఎస్ మరణానంతరం మీ ప్రవర్తనను చూసి వైఎస్ ఆత్మ 'ఇలాంటి బ్రోకర్ నా స్నేహితుడా?' అని క్షోభిస్తుంది. ఎందుకూ పనికి రాని వాడివైన మీ చదువుకు ఆర్థిక సహాయం చేసి అందలం ఎక్కిస్తే, కనీస నైతిక విలువలు లేకుండా ప్రవర్తించడం ఏ విధంగా సబబు? కనీసం చదివిన డాక్టర్ వృత్తికి పనికిరాని మీకు, ఏనాడైనా వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని మీకు కేబినెట్ స్థాయి ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడం వైఎస్ చేసిన ఏకైక పొరపాటు. వైఎస్ మృతి అనంతరం ఈ 15 నెలల కాలంలో వారి కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలకు ఒక్క దానికైనా ఎందుకు స్పందించడం లేదు. ఈ మౌనం అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికేనా?
వైఎస్ చేపట్టిన జలయజ్ఞాన్ని మీరు ధనయజ్ఞంగా మార్చారు. పొన్నాల లక్ష్మయ్యతో కుమ్మక్కై ఎన్నో కంపెనీలకు ఎక్సెస్ టెండర్లు ఇప్పించి ప్రజల సొమ్మును దోచుకున్నారు. అసలు ప్రభుత్వ సలహాదారుడిగా మీ నిర్వాకం ఏమిటో అందరికీ తెలిసిందే! మీ సలహాలతో కాంట్రాక్టులు ఇప్పించి, తద్వారా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారో ప్రజలు అర్థం చేసుకున్నారు. మీ సలహాలన్నీ ప్రజాధనాన్ని దోచుకునేందుకు ఉపయోగపడ్డాయి. నమ్మిన వారికి ప్రాణాన్ని సైతం ఇచ్చేసే వైఎస్ బలహీనతను సొమ్ము చేసుకొని జలయజ్ఞానికి తూట్లు పొడిచారు.
దివంగత నేత కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలవాల్సిన మీరు పదవులను కాపాడుకునేందుకే కక్కుర్తి పడ్డారు. అధిష్ఠానానికి దగ్గర కావాలని కుటిల నీతితో ప్రాణస్నేహితుని కుటుంబాన్ని చీల్చడానికి ఎత్తువేసింది నిజం కాదా? వైఎస్ వివేకానంద రెడ్డి ఢిల్లీకి వెళ్లేముందు మీ ఇంట్లో చర్చలు జరపడం వాస్తవం కాదా? వైఎస్ సతీమణి విజయలక్ష్మి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఇంటికి వెళ్లి పరామర్శించాల్సింది పోయి, ఢిల్లీలో ఉండి మీ పదవి కాపాడుకునే ప్రయత్నం చేసుకున్నారు. అధిష్ఠానం వద్ద వైఎస్ కుటుంబాన్ని బూచిగా చూపించి పదవులు, డబ్బు సంపాదించేందుకు కొత్త ముఖ్యమంత్రి దగ్గర సైతం గిరికీలు కొడుతున్నారు. ముఖ్యమంత్రులు మారినా, మీ పదవులకు ఢోకా లేకపోవడం చూస్తేనే మీ వ్యక్తిత్వం ఏమిటో తేలిపోతోంది. ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్న కాలంలోనూ తప్పుడు సలహాలు ఇస్తూ మరోసారి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.
మీ స్వార్థం కోసం తప్ప కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏమాత్రం లేదు. కనీసం వార్డు మెంబర్‌గానైనా గెలిచారా? ప్రజలతో కనీస సంబంధాలు ఉన్నాయా? బడా కాంట్రాక్టర్లు, రాజకీయ దళారులు, పైరవీకారులు తప్ప సామాన్య ప్రజలు, కార్యకర్తలు మీ దగ్గరకు రాగలరా? వైఎస్ కోసం ప్రాణమిచ్చే కార్యకర్తలను, నాయకులను ఏనాడైనా రక్షించే ప్రయత్నం చేశారా? కొండా మురళీధర్‌రావు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలాంటి వారికి గన్‌మెన్లను తగ్గించడమే భద్రతా సలహాదారునిగా మీరు చేసే పనా? అసలు ప్రజా భద్రతా కమిటీ అధ్యక్షుడిగా భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం చేయడం వల్లనే వైఎస్ మృతి చెందారన్నది నిజం కాదా? వైఎస్‌ది ప్రమాదం కాదు, హత్య అని తెలుస్తోంది. ఈ విషయంలో ప్రజలకు స్పష్టమైన వివరణ అవసరం మీకు లేదా?
మీకు నిజాయితీ ఉంటే నైతిక విలువలకు కట్టుబడి ఉంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు మీ ఆస్తి ఎంత? ప్రస్తుతం ఆస్తి ఎంత? జలయజ్ఞంలో నువ్వు దోచుకున్నదెంత? మంత్రి పొన్నాల వాటా ఎంత? ఈ వివరాలు అన్నీ తెలియాలంటే మీరే స్వయంగా సీబీఐ విచారణను కోరుకోవాలి.'' కేవీపీ పనులు వైఎస్‌కు తెలియదు
"వైఎస్ చేసే పనులు కేవీపీకి తెలుసు. కానీ, కేవీపీ చేసే పనులు వైఎస్‌కు తెలియదు'' అని కొండా సురేఖ పేర్కొన్నారు. తన లేఖపై 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' చానల్ నిర్వహించిన చర్చలో ఆమె పాల్గొన్నారు. "వైఎస్ అవినీతిపరుడుకారని, వాటికి కేవీపీయే బాధ్యత వహించి ఆయనే సమాధానం చెప్పాలనే ఈ లేఖ రాశాను'' అని కొండా సురేఖ పేర్కొన్నారు. వైఎస్ ఉన్నప్పటికీ, ఇప్పటికీ కేవీపీ ప్రవర్తనలో చాలా తేడా ఉందన్నారు. ఆయన నిజ స్వరూపాన్ని బయటపెట్టడానికే లేఖ రాశాని తెలిపారు. "30 ఏళ్ల రాజకీయ జీవితంలో వైఎస్‌కు అండదండగా ఉన్న కేవీపీ.. ఈ 15 నెలల్లో ఆయన కుటుంబానికి చేసిందేమిటో ఆత్మ విమర్శ చేసుకోవాలి'' అని సూచించారు. "సలహదారులందరి రాజీనామాలను ఆమోదించి కేవీపీ రాజీనామా మాత్రం పెండింగ్‌లో పెట్టారు. అప్పటి నుంచి కేవీపీ ఢిల్లీలోనే మకాం వేసి పనులు చక్కబెడుతున్నారు. కిరణ్ హయాంలోనూ ఆయన హవా నడుస్తోంది'' అని సురేఖ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. వైఎస్ వివేకానంద రెడ్డికి పదవి ఇవ్వడం వెనుక కేవీపీ హస్తం ఉందని నూటికి నూరుపాళ్లు నమ్ముతున్నామన్నారు.
కేవీపీని ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖలోని అభిప్రాయాలన్నీ తన వ్యక్తిగతమేనని కొండా సురేఖ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. "ఈ లేఖతో వైఎస్ జగన్‌కు సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని ఖండిస్తున్నాను'' అని తెలిపారు.

పాపాల భైరవుడు కేవీపీనే
బ్రోకర్, అవినీతి పరుడు..
కొండా సురేఖ లేఖాస్త్రం
తీవ్ర విమర్శలు గుప్పించిన యువనేత వర్గం
విపక్షాల చేతికి అస్త్రాలు
ఇన్నాళ్ల ఆరోపణలకు బలం
వైయస్‌కు తెలియకుండా కేవీపీ అవినీతి సాధ్యమా?
ఆత్మకు తెలియకుండా శరీరం ఏ పనైనా చేయగలదా?
అంతరాత్మ కళ్లకు గంతలు కట్టడం ఆత్మకు సాధ్యమవుతుందా?
'శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే' అయినప్పుడు... ఒకే ఆత్మలోని సగ భాగం మరో సగాన్ని మోసం చేయగలదా? ఒక సగానికి సోకిన అవినీతి మరో సగానికి తాకకుండా ఉంటుందా?
కేవీపీ రామచంద్రరావుపై మాజీ ఎంపీ జగన్ వర్గంలోని ముఖ్య నాయకురాలు కొండా సురేఖ సంధించిన లేఖాస్త్రాన్ని చూస్తే ఈ ప్రశ్నలు తలెత్తక మానవు! అటు విపక్షాలు, ఇటు కాంగ్రెస్‌లోని వైఎస్ వ్యతిరేకులు ఇప్పటికే ఈ ప్రశ్నలను సంధిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే... వీరికి జగన్ వర్గమే 'కొండా సురేఖ లేఖ' రూపంలో కొత్త అస్త్రాలను అందించింది. అటు కాంగ్రెస్, ఇటు జగన్ వర్గం దీంతో ఒకరి గోత్రాలను ఒకరు బయటపెట్టుకునే ప్రక్రియ మొదలైంది. వైఎస్ అవినీతిపైనా, కేవీపీ పాత్రపైనా విపక్షాలు ఇన్నాళ్లుగా అనేక ఆరోపణలు చేశాయి.
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లోని సీనియర్లు సైతం వైఎస్ అవినీతిపై విమర్శలు గుప్పించసాగారు. ఈ విమర్శలపై కేవీపీ స్పందించడం లేదంటూ కొండా సురేఖ ఆక్రోశం వ్యక్తం చేస్తూ... ఆయనపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 'కేవీపీ ఒక బ్రోకర్. ప్రాజెక్టుల అంచనాలు పెంచాడు. జలయజ్ఞంలో కోట్లు దోచుకున్నాడు' అంటూ పాపాలన్నీ కేవీపీవే అని పేర్కొన్నారు. ఇవే ఆరోపణలను గతంలో విపక్షాలు చేశాయి. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలే చేశారు. ఇప్పుడు జగన్ వర్గీయులూ చేస్తున్నారు. అంటే.... ఆ ఆరోపణలన్నీ అక్షర సత్యాలే అని అంగీకరించినట్లేనా?
వైఎస్, కేవీపీలది అవినాభావ సంబంధం. గుల్బర్గాలో మెడిసిన్ చదువుకున్న రోజుల్లో ఏర్పడిన బంధం వైఎస్ మరణించేదాకా కొనసాగింది! వైఎస్ తెల్లవారగానే చేసే మొదటి ఫోన్ కాల్ కేవీపీకే! ప్రతి రోజూ మధ్యాహ్నం కలిసి భోజనం చేసేది కేవీపీతోనే! ఇలా కొన్ని దశాబ్దాలపాటు జరిగినట్లు చెబుతారు. 'మా శరీరాలు వేరైనా, ఆత్మ ఒక్కటే' అని వైఎస్ స్వయంగా పేర్కొనే వారు. ఎవరైనా, ఏదైనా పనిమీద వచ్చినప్పుడు, వారు చెప్పిందంతా విన్న తర్వాత 'కేవీపీని కలవండి!' అని వైఎస్ చెప్పేవారని అందరికీ తెలుసు. వైఎస్ తెర ముందు కనిపిస్తే... తెర వెనుక చక్రం తిప్పింది కేవీపీ అని చాలామంది చెబుతారు. ఇప్పుడు... అదే కేవీపీని అని కొండా సురేఖ బ్రోకర్ అని తిట్టిపోశారు. అదే నిజమైతే... కేవీపీ ఎవరి తరఫున బ్రోకర్‌గిరీ చేశారు? అని ప్రశ్నించేందుకు అటు కాంగ్రెస్, ఇటు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. అందలం ఎక్కించిందెవరు?:
ఎమ్మార్ కుంభకోణం, రహేజా గోల్‌మాల్, జలయజ్ఞం, భూ కేటాయింపులు, ఔటర్ రింగ్ రోడ్డు, సెజ్‌లు... ఇలా వైఎస్ హయాంలో వచ్చిన అవినీతి ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి వ్యవహారంలో వైఎస్‌తోపాటు కేవీపీపైనా విపక్షాలు వేలెత్తి చూపాయి. ఇప్పుడు జగన్ వర్గం కేవీపీని మాత్రమే వేలెత్తి చూపిస్తోంది. వెరసి... విపక్షాల ఆరోపణల్లో సగభాగాన్ని జగన్ వర్గమే బలపరిచినట్లయింది. కేవీపీ, వైఎస్‌ల మధ్య సాన్నిహిత్యాన్ని బట్టి చూస్తే... మిగిలిన సగం ఆరోపణలూ నిజమని అంగీకరించినట్లే! హైదరాబాద్‌కు మకాం మార్చిన తొలినాళ్లలో... వైఎస్, కేవీపీ కుటుంబాలు ఒకే ఇంట్లో ఉండేవి. వైఎస్ పీసీసీ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వహించినప్పుడు కేవీపీ అంతా తానై నడిపించారు.
పాదయాత్ర సమయంలో నడిచింది వైఎస్ అయినా, ఇది విజయవంతం కావడానికి పక్కా వ్యూహం రచించి నడిపించింది మాత్రం కేవీపీ అని చెబుతారు. వ్యక్తిగత మిత్రడైన కేవీపీని అధికారిక కార్యకలాపాల్లో భాగస్వామిని చేసింది వైఎస్సే. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా, ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. రాజ్యసభ సభ్యత్వం ఇప్పించారు. ఆ తర్వాత 'ప్రజా భద్రతా కమిటీ' చైర్మన్‌గా క్యాబినెట్ హోదా కల్పించారు. వ్యక్తిగతంగా, అధికారికంగా వైఎస్, కేవీపీలు అంతగా కలిసిపోయారు. అలాంటిది... వైఎస్‌కు తెలియకుండా, కేవీపీ మాత్రమే అవినీతికి పాల్పడ్డారని సురేఖ ఆరోపించడం హాస్యాస్పదమవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, నమ్మితే ప్రాణాలిచ్చే వైఎస్ బలహీనతనే కేవీపీ సొమ్ము చేసుకున్నారన్నది జగన్ వర్గం వాదన!
సురేఖ లేవనెత్తిన ప్రశ్నలెన్నో: 'బడా కాంట్రాక్టర్లు, రాజకీయ దళారీలు, పైరవీకారులు తప్ప సామాన్య ప్రజలు మీ దగ్గరకు రాగలరా?' అని కొండా సురేఖ ప్రశ్నించారు. అదే నిజమైతే... కేవీపీకి అంత చనువు ఇచ్చి, ఆయన మాట చెల్లుబాటయ్యేలా చేసింది వైఎస్సే కదా అనే ప్రశ్న తలెత్తుతుంది. 'వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు కేవీపీకి ఉన్న ఆస్తి ఎంత? ప్రస్తుతం ఆయనకున్న ఆస్తులు ఎన్ని?' అని కూడా సురేఖ తన లేఖలో ప్రశ్నించారు. దాదాపు ఇదే ప్రశ్నను విపక్షాలు, కాంగ్రెస్ నేతలు కూడా జగన్‌ను చాలాకాలంగా అడుగుతున్నాయి. 'వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు జగన్ ఆస్తులెన్ని? ఇప్పుడు ఎన్ని?' అని నిలదీస్తున్నాయి. ఇక... జలయజ్ఞంలో కేవీపీ దోచుకున్నదెంత? మంత్రి పొన్నాల వాటా ఎంత? అని కొండా సురేఖ నిలదీశారు.
ఈపీసీలో అక్రమాలు జరిగాయని, అంచనాలు అడ్డగోలుగా పెంచారని, జలయజ్ఞంలో దోపిడీ జరుగుతోందని విపక్షాలు ఏళ్ల తరబడి నెత్తీ నోరు బాదుకున్నాయి. ఈ ఆరోణలను వైఎస్ పూచిక పుల్లతో సమానంగా తీసేస్తూ వచ్చారు. చివరగా... ఈ వివరాలన్నీ బయటపడాలంటే కేవీపీ స్వయంగా సీబీఐ విచారణను కోరుకోవాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు. ఆయన నిజంగానే సీబీఐ విచారణ కోరితే, ప్రభుత్వం అందుకు సరేనంటే... 'వైఎస్ పాత్రను మాత్రం విస్మరించి, కేవలం కేవీపీ అవినీతిపై విచారణ జరపడం సాధ్యమేనా?
ఎందుకింత ఆక్రోశం: వైఎస్ మరణం తర్వాత కేవీపీ వ్యవహార శైలిపై జగన్ వర్గం నేతలు ఏమాత్రం సంతృప్తిగా లేరు. అధిష్ఠానానికీ, జగన్‌కూ మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించాల్సింది పోయి... కేవీపీ అప్పటి సీఎం రోశయ్యకు సన్నిహితంగా మెలిగారన్నది వీరి ఆక్షేపణ. ఇప్పుడు కొత్త సీఎం కిరణ్ కుమార్ రెడ్డితోనూ కేవీసీ సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారని భావిస్తున్నారు. జగన్ వైపు మొగ్గు చూపుతున్న ఎమ్మెల్యేలను కేవీపీ కట్టడి చేస్తున్నారని, మంత్రివర్గ కూర్పులోనూ కీలక పాత్ర పోషించారని పేర్కొంటున్నారు.
జగన్‌కు కేవీపీ పూర్తి మద్దతు ప్రకటించినట్లయితే... ఎమ్మెల్యేలు కిరణ్ నియామకాన్ని వ్యతిరేకించేవారని, ప్రభుత్వం కూలిపోయేదని వాదిస్తున్నారు. "వైఎస్ వల్ల ఇంత పైకి వచ్చిన కేవీపీ... వైఎస్ మరణానంతరం కష్టమైనా, నష్టమైనా జగన్‌తోనే ఉండాలి. ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు'' అని జగన్ వర్గం ఆగ్రహిస్తోంది. ఈ ఆగ్రహమే సురేఖ లేఖ రూపంలో బయటపడినట్లు తెలుస్తోంది.

జగన్‌కు క్లీన్‌చిట్ ఇమేజ్ కోసమే
రాష్ట్రంలో ఆరేళ్లపాటు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కుడిభజంగా, ఆత్మబంధువుగా వ్యవహరించి, తీరా తాను కష్టాల్లో చిక్కుకుంటే పట్టించుకోకుండా సొంత రాజకీయ భవితవ్యం కోసం కాంగ్రెస్ చూరు పట్టుకుని వేళ్లాడుతున్న కేవీపీ రామచంద్రరావుపై జగన్ శిబిరం ఊహించని విధంగా దాడి ప్రారంభించింది. జగన్‌కు వీర విధేయు రాలయిన ఎమ్మెల్యే కొండా సురేఖ తాజాగా కేవీపీపై సం ధించిన లేఖాస్త్రంలోని ఆరోపణలు, విమర్శలు, దూషణలు పరిశీలిస్తే.. కేవీపీ భుజంపై తుపాకీ పెట్టి, కాంగ్రెస్‌ను పేల్చే ఎత్తుగడ స్పష్టమవుతోంది. వైఎస్ హయాంలో జరిగిన అవినీతి మొత్తానికి కేవీపీనే బాధ్యుడు కాబట్టి, దానికి వైఎస్ వారసుడయిన జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పి, ‘జగన్ పరిశుద్ధుడ’న్న ఇమేజ్ ఇచ్చే బ్రహ్మాండమైన వ్యూహానికి జగన్ వర్గం తెరలేపినట్లు కనిపిస్తోంది.
వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే, జగన్ విధేయురాల యిన కొండా సురేఖ తాజాగా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై సంధించిన ఆరోపణాస్త్రాలు జగన్‌పై భవిష్యత్తులో ఎదురయ్యే అవినీతి ఆరోపణల నుంచి రక్షిం చి, ఆయనపై ఇప్పటికే ఉన్న ‘అవినీతి సంపాదన’ మకిలిని తొలగించేందుకు వేసిన ఎత్తుగడగా స్పష్టమవుతోంది. వైఎస్ సీఎం కాకముందు పెద్దగా ఆస్తులు లేని జగన్.. తండ్రి సీఎం అయిన తర్వాత లక్షకోట్లకు పడగలెత్తి, మీడి యా, పరిశ్రమలు స్థాపించారంటూ టీడీపీ ఇప్పటివరకూ ఆరోపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.
జగన్ పార్టీ స్థాపనకు సిద్ధమవుతున్నందున, భవిష్యత్తులో టీడీపీ ఇదే అవినీతి సంపాదనను మరింత విస్తృతంగా ప్రచారం చేస్తే జగన్ ప్రతిష్ఠ దెబ్బతిని ప్రజల్లో దోషిగా నిలబడవలసి వ స్తుందన్న ముందు చూపుతోనే జగన్ వర్గం కేవీపీని తెరపైకి తెచ్చింది. ఆయనపై అవినీతి ఆరోపణాస్త్రాలు చేయడం ద్వారా, నాటి మకిలిని ఆయనకే అంటించి, తాను మాత్రం పునీతుడిగా బయటకురావాలన్న వ్యూహం స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి... జగన్-కేవీపీ మధ్య చాలాకా లం నుంచి మనస్పర్థలు ఉన్నాయి. పార్టీకి విధేయుడిగా ఉండి లక్ష్యాన్ని సాధించుకోవాలన్నది కేవీపీ సలహా.
తనను అణచివేస్తున్న పార్టీలో కొనసాగడం అవివేకమన్నది జగన్ వాదన. ఇలా వారిద్దరూ చాలాకాలం నుంచీ విబేధాలతోనే గడిపారు. ఇటీవల కేవీపీ బెంగుళూరుకు వెళ్లి జగన్‌తో భేటీ అయిన సందర్భంగా.. కేవీపీని తన పార్టీలోకి రావ లసిందిగా అభ్యర్థించారు. దానిని కేవీపీ తిరస్కరించి, నీవే పద్ధతి మార్చుకుని పార్టీలో కొనసాగాలని కేవీపీ సూచిం చగా, జగన్ ఆగ్రహం వ్యక్తం చేసి నీ ఇష్టం వచ్చినట్లు చేసు కోమంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. అదీకాకుండా.. వారిద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు కూడా వివాదానికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
వైఎస్ మృతి చెందిన తర్వాత.. అంతకుముందు వరకూ వివిధ కాంట్రాక్టులు, కేటాయింపులు, ఒప్పందాలకు సంబంధించిన పంపకాల ‘లెక్కల్లో’ తేడా రావడం కూడా వారిద్దరి మధ్య గొడవలకు ప్రధాన కారణమన్న ప్రచారం జరుగుతోంది. తన తండ్రి వల్ల వచ్చిన వాటిని కొడుకునైన తనకు ఇవ్వాలని జగన్ పట్టుపడుతుండటం, ఆ లెక్కలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, వాటిని ఎప్పుడో క్లియర్ చేశానని కేవీపీ జవాబు ఇచ్చిన క్రమంలో వారిద్దరి మధ్య దూరం పెరిగినట్లు పార్టీ వర్గాల్లో బాహాటంగానే ప్రచారం జరుగుతోంది.
ఇక ఎట్టి పరిస్థితిలో కేవీపీ తన పార్టీలోకి రారని నిర్ధా రించుకున్న జగన్ వర్గం ఆయన భుజంపై తుపాకి పెట్టి కాంగ్రెస్ పార్టీని పేల్చడంద్వారా జగన్‌ను సచ్ఛీలుడిని చేసేం దుకే జగన్ సురేఖ ద్వారా లేఖ రాయించినట్లు కనిపిస్తోంది. జగన్ అనుమతి లేకుండా సురేఖ ఇంత సాహసం చేస్తా రనుకోవడం అవివేకమవుతుంది. కేవీపీ ఒకవేళ జగన్‌కు దన్నుగా నిలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలేదని, అలా కాకుండా ఆయన అక్కడే ఉండటంతో పాటు.. జగన్ వైపు వచ్చే ఎమ్మెల్యేలను అధిష్ఠానం ఆదేశాలతో కట్టడి చేసి, సోనియాకు విధేయత చాటుకోవడం జగన్ శిబిరాన్ని ఆగ్రహానికి గురిచేసింది.
వైఎస్ సోదరుడు వివేకానంద రెడ్డిని అధిష్ఠానం వద్దకు తీసుకువెళ్లి, ఆయనను ప్రోత్సహించడం ద్వారా కుటుం బాన్ని చీల్చి, కుటుంబ ప్రతిష్ఠను మంటగలిపి, జగన్ బలాన్ని మానసికంగా దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిన కేవీపీపై అవినీతి ఆరోపణాస్త్రాలు సంధించడం ద్వారా.. ఆయనను అటు పార్టీకి ఇటు తనను నమ్ముకున్న వారికి కాకుండా చేయాలన్న వ్యూహం కూడా సురేఖ లేఖలో స్పష్టమవుతోంది. ఇదే అంశంపై వివేకా ఢిల్లీకి వెళ్లిన రోజే ‘చక్రం తిప్పిన కేవీపీ’ అన్న శీర్షికతో సూర్యలో వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే.
కేవీపీపై ఇప్పటికే వేల కోట్ల రూపాయల అవినీతి ఆరో పణలు ఉన్నందున, అవన్నీ వైఎస్‌తో కలిసే సంపాదిం చారని, అందులో ఇద్దరికీ వాటాలున్నయని పార్టీలు, ప్రజలు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఆ మరక జగన్‌కు అంటకుండా ముందుగానే దానిని చెరిపేసి, వాటితో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని, కేవీపీనే వైఎస్‌ను మాయచేసి డబ్బు సంపాదించారంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చేందుకు జగన్ వర్గం ప్రయత్నాలు ప్రారంభిం చినట్లు ఆ లేఖ చెప్పకనే చెబుతోంది.
ఆ అవినీతి సంపాద నంతా ఒక్క కేవీపీకే అంటగట్టడం ద్వారా, అలాంటి అవినీతి-అక్రమ సంపాదనకు వైఎస్ గానీ, ఆయన వారసుడయిన జగన్‌కు గానీ ఎలాంటి సంబంధం లేదంటూ కేవీపీని దోషిగా నిలబెట్టడమే జగన్ వర్గం అసలు లక్ష్యంగా స్పష్టమవుతోంది. దానితోపాటు, జిల్లాలో తన ప్రత్యర్థి అయిన టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వెలమ అయినందున, అదే కులానికి చెందిన కేవీపీ ఆయనను రక్షించి, ఎర్రబెల్లి ఆర్థిక-రాజకీయ ప్రయోజనాలను కాపాడటంలో కేవీపీ సహకరించారని, రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి హవా సాగడానికి కారణం కేవీపీయే కారణమన్న ఆగ్రహంతో ఉను సురేఖ ఆ కోపాన్ని ఈవిధంగా ప్రదర్శించారంటున్నారు.
No comments:
Post a Comment