Tuesday, December 28, 2010

యువనేత వెంటే...

భారీ సంఖ్యలో నాయకులు, సర్పంచుల మద్దతు
యువనేతను కలిసిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు.. కొత్త పార్టీపై చర్చ



యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీకి రోజురోజుకీ మద్దతు పెరిగిపోతోంది. జగన్‌కు మద్దతు తెలిపే నాయకులు, ప్రజలతో సాగర్ సొసైటీలోని ఆయన క్యాంపు కార్యాలయం కిటకిటలాడుతోంది. సోమవారం మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, సర్పంచ్‌లు వచ్చి యువనేతను కలిశారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్కటి వెంకటేష్‌యాదవ్ ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు జగన్‌కు మద్దతు తెలిపారు. వీరిలో సర్పంచులు ఎదిరే కళమ్మ, చంద్రకళ, రాములుగౌడ్, రాయిదేవ్ ఆశన్న, దేవి ప్రియానాయక్, మాజీ సర్పంచులు రాఘవేంద్రరావు, శేఖర్‌పంతులు, కాంగ్రెస్ నేతలు వై.శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ఉన్నారు. జిల్లాలో జగన్ నాయకత్వాన్ని కోరుతూ 130 మంది సర్పంచులు మద్దతు ప్రకటించారని వెంకటేష్ యాదవ్ విలేకరులకు తెలిపారు. మహానేత వైఎస్సార్ పథకాలు కొనసాగాలన్న ఉద్దేశంతోనే తామంతా యువనేతకు మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఇదెవ్వరూ కాదనలేని సత్యమన్నారు. ప్రజల నిర్ణయం మేరకు త్వరలోనే షాద్‌నగర్ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి కూడా యువనేత వెంటే నడుస్తారన్న ఆశాభావాన్ని నియోజకవర్గ సర్పంచ్‌లు వ్యక్తం చేశారు. వీరితోపాటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కె.అమృతా సాగర్, మిడకాన్‌పేట్ మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి, రంగారెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, ముచ్చెర్ల మాజీ సర్పంచ్ గోపాల్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు జగన్‌కు తమ సంఘీభావాన్ని తెలిపారు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన నందల్లి ప్రకాష్ (డీసీసీ ఉపాధ్యక్షుడు), జిల్లా దళిత దండు అధ్యక్షుడు కండె సమ్మయ్య, జడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి, ఎంపీపీ పాలెపు నీల, ఎంపీటీసీలు లక్ష్మీ రాజమల్లయ్య, గోపు రాజలింగం, సుంకేటి ఆనంద్, సర్పంచ్‌లు చిన్న రాజా గౌడ్ , పాలెం రాజన్న, గంగాధర్ గౌడ్, శంకర్‌నాయక్, కొమ్ముల రాజేశ్వర్‌రెడ్డి, మెట్‌పల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల హనుమాండ్లు యాదవ్, మాజీ వైస్ చైర్మన్ యామ రాజయ్య, మార్కెటింగ్ కమిటీ డెరైక్టర్లు నూతుల రాజిరెడ్డి, సుంకటి సంజీవరెడ్డి, సీడీసీ చైర్మన్ లింగారెడ్డి యువనేతను కలుసుకుని, కొత్తపార్టీలో చేరుతామని తెలిపారు. శాప్ మాజీ చైర్మన్ రాజ్‌సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో వీరంతా యువనేత వైఎస్ జగన్‌ను కలిశారు.

ప్రముఖులతో భేటీ: టీడీపీ ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదారామారావు, మాజీ మంత్రులు పెనుమత్స సాంబశివరాజు, ఐ.రామకృష్ణం రాజు, మాజీ ఎమ్మెల్యేలు జొన్నా సూర్యనారాయణ, ఎన్.వరదరాజులురెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావుతో జగన్ తన కార్యాలయంలో సమావేశమై కొత్త పార్టీపై చర్చించారు. పీసీసీ ఎస్టీసెల్ చైర్మన్ ఆంగోతు నాగూనాయక్, పీసీసీ కార్యదర్శి పోచిమిరెడ్డి మురళీధర్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు పుల్లారెడ్డి, కడప డీసీసీ మాజీ అధ్యక్షుడు సురేష్‌బాబు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ కార్యదర్శులు ఎన్.రవికుమార్, ఉడుముల కోటిరెడ్డి, కాంగ్రెస్ నేతలు శిల్పా చక్రపాణిరెడ్డి, కొండా రాఘవరెడ్డి, వర్దిరెడ్డి చలమారెడ్డి, సినీ నటుడు విజయచందర్‌లు యువనేతను కలుసుకున్నారు. వీరితో పాటు జగన్‌ను కలిసిన వారిలో హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బండారు మోహన్‌రెడ్డి, మల్కాజిగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి, కంటోన్మెంట్ వైస్ చైర్మన్ జంపన ప్రతాప్, సీనియర్ కాంగ్రెస్ నేత దేవుడు, నల్లగొండ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత గాదె నిరంజన్‌రెడ్డి, నార్కట్‌పల్లి జడ్పీటీసీ సభ్యుడు అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, సూర్యాపేట ప్యాక్స్ చైర్మన్ దామిడి రమేష్‌రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ నేత పిట్టా రామిరెడ్డి, డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు జిన్నా శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కందారం రాజుమోహన్, వైఎస్సార్ ఆశయ సాధన సమితి అధ్యక్షుడు చేవూరు శ్రీధర్‌రెడ్డి , విజయనగరం వ్యవసాయ మార్కెటింగ్ మాజీ చైర్మన్ కాకర్లపూడి శ్రీనివాసరాజు, దంతులూరి సూర్యనారాయణరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్‌లు ఎ.సూరిబాబు, మట్టా రమణారెడ్డి, సాలూరు మున్సిపల్ మాజీ చైర్మన్ గొర్లె మధుసూదనరావు, నెల్లిమర్ల జడ్పీటీసీ సభ్యుడు డి.ఎస్.ఆర్.ఆర్.రాజు, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ బట్టి జగపతి, కాంగ్రెస్ నేతలు మహ్మద్ షాకీర్, కడారి బాలకృష్ణారెడ్డి, సంగారెడ్డి సీడీసీ చైర్మన్ ప్రభుగౌడ్, న్యాయవాది పటోళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.


అవసరమైతే పదవులకు రాజీనామా:
ఎమ్మెల్సీ రామారావు


జగన్‌కు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని విజయనగరం ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరద రామారావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన జగన్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ జగన్ పార్టీ స్థాపించిన తర్వాత తాను రాజీనామా చేస్తానన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల ఉన్న అభిమానంతో తామంతా జగన్ వెంటే ఉంటామని చెప్పారు.


క్యాలెండర్ ఆవిష్కరణ: వైఎస్ చిత్రాలతో రూపొందిం చిన 2011 క్యాలెండర్లను జగన్ ఆవిష్కరించారు. బంజారాహిల్స్ సాగర్‌సొసైటీలోని క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. జగన్ సేవాదళ్, బీఎస్‌వీఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ తరపున బండి శ్రీనివాసరెడ్డి, బండి రాఘవేంద్రరెడ్డిలు వీటిని రూపొందించారు.

No comments:

Post a Comment