
వైఎస్ మరణించి రెండేళ్లవుతున్నా ప్రజలకు భరోసా ఇచ్చే నేతలే
కరువయ్యారు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను విస్మరించి పేదల నడ్డి విరుస్తోంది
నాడు చంద్రబాబు 46 మంది
ఎమ్మెల్యేలతో వైఎస్ సువర్ణయుగంపై అవిశ్వాసం పెట్టారు
ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలున్నా.. అవిశ్వాసం ెపెట్టనంటున్నారేం?
ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు కాబట్టి..
బాబూ... నిజంగా ప్రజలపై
ప్రేమే ఉంటే అవిశ్వాసం నోటీసివ్వు..
ఇచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చెయ్!

రైతులు, పేదల సమస్యలు కనీసం పట్టించుకోని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు.. ఆ రైతులు, పేదల కన్నీటి బొట్టే మరణ శాసనం రాస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ‘ఇవాళ రాష్ట్రాన్ని చూస్తే అధ్వాన్న పరిస్థితిలో ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించి పేదవాడి నడ్డి విరిచేస్తోంది. ప్రతిపక్షమైనా మనవైపు నిలబడి పోరాడుతుందేమోనని అటువైపు ఆశగా కన్నెత్తి చూస్తే.. ఇవాళ మన ఖర్మకొద్దీ ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పైకేమో ఇది చేతగాని ప్రభుత్వమనీ, అసమర్థ ప్రభుత్వమనీ తిడుతుం టారు. పేద వాళ్లకు మేలు చేయని ఈ అసమర్థ ప్రభుత్వం ఎందుకు ఉంచుతున్నావు..? అవిశ్వాసం పెట్టవయ్యా చంద్రబాబు నాయుడూ అంటే.. పెట్టను గాక పెట్టను అంటున్నారు.

ఒక్కటి చెప్తున్నా ఇవాళ... పేదవాడి కళ్లనుంచి వచ్చే ప్రతి కన్నీటి బొట్టు కాం గ్రెస్, టీడీపీలకు మరణ శాసనం రాస్తుంది’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లాలో మలివిడత 7 రోజుల ఓదార్పు యాత్ర సోమవారం విజయనగరం పట్టణంలో ముగి సింది. ఏడో రోజు యాత్ర ఉదయం కొమరాడ, పార్వతీపురం, బొబ్బిలి మండలాల్లోని గ్రామాల మీదుగా రాత్రి 9 గంటలకు జగన్ విజయనగరం చేరుకున్నారు. పట్టణంలోని కోట జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ముగింపు సభకు జనం అంచనాలకు మించితరలివచ్చారు. అటు సింహాచలం మేడ నుంచి శంకరమఠం వరకు ఇటు మూడు లాంతర్ల జంక్షన్ నుంచి సత్యా లాడ్జి వరకు రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ముగింపు సభకు భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్‌మాట్లాడారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
అప్పుడెందుకు అవిశ్వాసం పెట్టావ్..
అయ్యా చంద్రబాబూ.. దివంగత మహానేత సువర్ణ పాలన సాగుతున్న రోజుల్లో కేవలం 46 మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాసం పెట్టావు. ఆయన్ను గద్దె దింపాలని ప్రయత్నించావు. ఇవాళ మీకు 90 మంది శాసన సభ్యుల బలం ఉం ది... ఇవాళ ప్రతి రైతు సోదరుడు, ప్రతి పేదవాడు ఈ ప్రభుత్వం కూలిపోవాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఇది చేతగాని ప్రభుత్వం అని మొసలి కన్నీళ్లు కార్చే బదులు అవిశ్వాసం పెట్టమని అడిగితే పెట్టవేం చంద్రబాబూ?.. ఎందుకు పెట్టవంటే నువ్వు ఆ అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యావు కాబట్టి.
ఈ డిమాండ్లు నెరవేర్చమని అడగండి..: చంద్రబాబు నాయుడూ నిజంగా నీకు ప్రజలపై ప్రేమే ఉంటే.. అవిశ్వాసం పెడతానని ప్రభుత్వాన్ని బెదిరించి ప్రజా సమస్యలు పరిష్కరించు. రైతులకు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. మద్దతు ధర రావాలంటే కనీసం రూ.,2000 కోట్లు అవసరం. మీరు ప్రభుత్వానికి వారంరోజుల గడువిచ్చి రైతాంగానికి కావలసిన రూ.2,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయండి. లేదం టే అవిశ్వాసం పెడతానని హెచ్చరించండి. ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ప్రతి పేద కుటుం బంలో కనీసం ఒక్కరైనా ఉన్నత విద్య చదివి, డాక్టరో.. ఇంజనీరో.. అయితే ఆ కుటుంబంలో పేదరికం పోతుందని వైఎస్సార్ పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకంపెడితే.. ఈ చేతగాని ప్రభుత్వం మూలంగా పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే అధ్వాన్న పరిస్థితి వచ్చింది.. ఆ పథకానికి బకాయిలతో కలిపి రూ.6,800 కోట్లు అవసరం పడుతుండగా ఈ చేతగాని ప్రభుత్వం కేవలం రూ.3,000 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులెత్తేసింది.
మొత్తం 6,800 కోట్లు ఇవ్వకపోతే అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబూ? ప్రతి అక్కా, చెల్లెమ్మల మొఖాల్లో చిరునవ్వులు చూడ్డానికి వైఎస్ ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకానికి బకాయిలతో కలిసి రూ. రెండు వేల కోట్లు కావాల్సి ఉంటే ప్రభుత్వం కేవలం రూ.400 కోట్లు ఇచ్చింది. ఇవాళ నేనడుగుతున్నా.. ఇదే చంద్రబాబు నాయుడు ఇదే సీఎంకు వారం రోజుల గడువిచ్చి ఇంకో రూ.1,600 కోట్లు ఇవ్వకపోతే మీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతానని ఎందుకు చెప్పలేకపోతున్నారు? పైకి ఇది చేతగాని ప్రభుత ్వం అం టూ రోడ్లమీదకు వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తారు, లోపల కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కై ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టనుగాక పెట్టను అంటారు.
అప్పుడు భరోసా ఉండేది: ‘వైఎస్సార్ సువర్ణ పాలనలో రైతుల ధ్యాసంతా కూడా వ్యవసాయం చేయడంపైనే ఉండేది. ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది ఇంకా మెరుగైన స్థాయిలో ధాన్యం ఎలా పండించాలని ఆలోచించేవారు. ఇవాళ ధాన్యం అమ్ముడుపోతుందా లేదా అని భయపడని రోజులు లేవు. వైఎస్ హయాంలో మద్దతు ధరకంటే రూ.200 ఎక్కువకే అమ్ముడుపోయిన రోజులు చూశాం. ఏ సమస్య వచ్చినా వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా.. అన్నీ ఆయనే చూసుకుంటాడన్న భరోసా ప్రతి రైతుకూ ఉండేది. ఇప్పుడు కనీస మద్దతు ధర కంటే రూ.200 తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వైఎస్సార్ సువర్ణ పాలనలో ప్రతి పేదవాడికీ కూడా.. ఇవాళ కాకపోతే రేపు నాకు ఓ పక్కా ఇల్లు కచ్చితంగా వస్తుందన్న భరోసా ఉండేది. ప్రతి అవ్వా ప్రతి తాతా కూడా వయసు పెరిగే కొద్దీ.. అయ్యో నేను ఎలా బతకాలీ అనే ఆలోచన నుంచి.. ఒక సంవత్సరం పెరిగితే ఏముందిలే.. అన్నీ చూసుకోడానికి మా ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్నాడన్న భరోసా ఉండేది.. ప్రతి తల్లీ అనుకునేదీ నా కొడుకు.. నా కూతురు మరో నాలుగేళ్ల తరువాత డాక్టరో.. ఇంజనీరో.. అవుతారు, ముసలి వయసులో మమ్ములను ఆదుకుంటారని. కారణం ఏమంటే వైఎస్ సీఎం స్థానంలో ఉన్నారనే భరోసా ఉండేది. విద్యార్థులకు తాను చదువు కచ్చితంగా పూర్తి చేయగలనన్న నమ్మకం ఉండేది. ఎవరికైనా ప్రమాదం జరిగితే 108 నంబర్‌కు ఫోన్ చేస్తే క్షణాల్లో అంబులెన్స్ వచ్చి మమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించి బతికిస్తుందన్న భరోసా ఉండేది.
ఇప్పుడేదీ ఆ భరోసా?: జనహృదయనేత వైఎస్ మరణించి రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు పేదలకు, రైతులకు మేమున్నామని భరోసా ఇచ్చే నేతలే కరువయ్యారు. పేదలు, రైతు సోదరుల సమస్యలను ఈ సర్కారు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా, ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు గారు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా, దేవుడు అనే వాడు ఉన్నాడు. పై నుంచి అన్నీ చూస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతిపక్షం, పాలక పక్షం నాయకులకు డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు ఇంటికి సాగనంపుతారు. రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలుపుతారు.’






48 గంటలపాటు నిరాహార దీక్ష చేస్తూ మా గోడు వినండని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చేతులు జోడించి వేడుకున్నా. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరుస్తాయని భావిస్తున్నా. రాముడి రాజ్యం చూడలేదు కానీ వైఎస్సార్ సువర్ణయుగం మనమంతా చూశాం. వరికి మద్దతు ధర వైఎస్సార్ హయాంలో రూ. 1,200 వరకు పోయిందంటే అది సువర్ణయుగాన్నే గుర్తుచేస్తుంది. ఆ ఐదేళ్ళలో పెట్టుబడిపై ఖర్చు ఒక్క రూపాయి కూడా పెరగలేదు. 


జగన్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన పిలుపిచ్చిన అరగంటలో నాతోపాటు అనేకమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని వ్యూహాలు, సాంకేతిక కారణాల వల్లే ఇప్పటివరకూ మేం రాజీనామాలు చేయలేదు. కడప ఉపఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పెనుతుపాను రేగనుందని నేను ముందే చెప్పాను. ఈ తుపానులో వైఎస్, జగన్‌లను విమర్శించినవారంతా కొట్టుకుపోతారు. జగన్‌తో నడుస్తున్నందువల్లే ఎప్పుడూ ఇంటిపట్టున ఉండే విజయమ్మ సైతం 40 రోజులు మండుటెండల్లో ప్రజల మధ్య తిరిగారు. ఎవరైనా ఎన్నికలు కాగానే విశ్రాంతి తీసుకుంటారు లేదా విజయోత్సవాలు జరుపుతారు. కానీ ఎన్నికల ఫలితాలకు ముందే జగన్ మళ్ళీ ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. అంతలోనే రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను గమనించి రైతుదీక్షకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే జగన్‌కు పోటీగా నిలబడగల నాయకుడెవ రైనా కనిపిస్తున్నారా?
ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదన్న వాస్తవాన్ని సీఎం, మంత్రులు గ్రహించాలి. ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్ళ పదవీకాలం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు సహిస్తూ ఊరుకుంటున్నారు. లేదంటే అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారు. కడప గెలుపు ఒక చరిత్రాత్మక ఘట్టంగా మిగులుతుంది. వైఎస్ లేని లోటును జగన్ తీరుస్తారు. నిజాయితీగా పనిచేయడం తప్ప టక్కుటమారాలు జగన్ ముందు చెల్లవు. మహానేత వైఎస్ భోళాశంకరుడని, జగన్ శ్రీమహావిష్ణువని సాక్షాత్తు ఓ తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత నాతో అన్నారు. ఉప ఎన్నికల్లో జగన్‌కు 50 వేల మెజార్టీ కూడా రాదని కొందరు, లక్ష మెజార్టీ దాటదని మరికొందరు, గత మెజార్టీని మించిపోరని ఇంకొందరు కబుర్లు చెబుతూ ప్రజల్ని గందరగోళంలో పడవేశారు. ఈ నేతల దొంగమాటలు నమ్మి పందేలు కాసినవారు అన్యాయమైపోయారు. ఈ రైతు దీక్షతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరచి రైతులకు న్యాయం చేయాలి.
రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వమూ మనుగడ కొనసాగించలేదు. ఈ రైతుల కన్నీటిలో కిరణ్ ప్రభుత్వం కొట్టుకుపోతుంది. ఇటీవల వరుసగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే చిరంజీవి, రాహుల్‌గాంధీ ఐరన్ లెగ్‌గా ముద్రపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో రైతు సమస్యల పట్ల పోరాడుతున్న రాహుల్.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతాంగం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయాన్ని ముందు తెలుసుకోవాలి. తాము అధికారంలో ఉన్న చోట్ల సంస్కరణలు అమలు చేయడం మానేసి, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట్ల ఆందోళన చేయడం ఎంతవరకు సబబు? కడప అఖండ విజయాన్ని కొంతమంది కాంగ్రెస్ నేతలు పాలపొంగుగా అభివర్ణించారు. అందులో ఉన్నది గిన్నెడు పాలు కాదు. సప్తసముద్రాలంత అభిమానం జగన్‌పై ఉంది. కడపలో జనం ఓట్లతో ఈవీఎం కుయ్‌మంటుంటే అక్కడ ఢిల్లీలో అధిష్టానం గూబ గుయ్యిమంది.
కడపలో జగన్ మెజార్టీ చూస్తుంటే.. ఆయనకు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందో అర్థమవుతోంది. రాష్ట్రానికి సంబంధించి లోక్‌సభ ఎన్నికల మెజార్టీలో దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఆ విజయం లెక్కలోనిది కాదు. అప్పట్లో పీవీపై ఎన్టీఆర్ అభ్యర్థిని నిలబెట్టలేదు. జగన్‌కు రాష్ట్రానికి సీఎంగానే కాదు.. దేశానికి ప్రధాని కాగల లక్షణాలున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టు కలిగిన గుంటూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో 17 స్థానాల్లోనూ ప్రజలు పట్టం కడ తారు.
చావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్ర ద్వారా జవసత్వాలు తెచ్చిన నేత వైఎస్. అలాంటి మహానేత దేశంలో ఏ నాయకుడూ ప్రవేశపెట్టని విధంగా పేదల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కాంగ్రెస్‌ను కూకటివేళ్ళతో పెకలించాలి. ప్రజాసమస్యలపై, రైతు సమస్యలపై ఎలాంటి అవగాహన లేని సీఎం మనల్ని పాలించడం మన ఖర్మ. వైఎస్ తర్వాత రైతుల్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నాగళ్ళనే తుపాకులను చేసి మీ ఓటుతో ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు చరమగీతం పాడి జగన్ సీఎం అయ్యేదాకా అండగా నిలవండి.
వైఎస్ వారసుడు జగన్ మాత్రమేనని కడప ఓటర్లు నిరూపించారు. రైతు దీక్షకు ఢిల్లీపెద్దలు తమ వేగుల్ని పంపి ఉంటారు. ఈ వేగుల ద్వారా అయినా రైతు గుండెచప్పుడు ఢిల్లీకి తెలుస్తుంది. కడప జిల్లాలోని తిరుమలదిన్నెలో ఓ నాలుగేళ్ల పాప మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వస్తున్నారంటే ఎవడైతే నాకేంటి? జై జగనన్న అని నినాదం చేసిందంటే జగన్ ఎంతలా ప్రజల గుండెల్లో ఉన్నారో అర్థమవుతుంది. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు సోనియా బొమ్మ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలి.
జగన్ కోసం మంత్రి పదవులు వదులుకోవడానికి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. సీఎం కిరణ్‌కోసం మంత్రి పదవి వదులుకోవడానికి కేబినెట్‌లో ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రభుత్వం వెన్నెముక లేని సర్కారు. దీన్ని కూల్చడం జగన్‌కు ఒక లెక్కకాదు. వీహెచ్, శంకరరావులు కాంగ్రెస్‌ను అథఃపాతాళానికి నెట్టడానికి శాయశక్తులా కృషిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముత్యంలాంటి పార్టీ. అయితే జగన్ వెళ్లిపోయిన తర్వాత ముత్యం వెళ్లిపోయింది. ప్రస్తుతం చిప్పే మిగిలింది. ఏ జాదూ వచ్చినా కాంగ్రెస్‌ను మార్చలేరు.
రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్‌ను చూసి దేశం ఎంతో నేర్చుకుంది. వైఎస్ పంచె కట్టుకుని వస్తుంటే రైతుకు నిజమైన ప్రతినిధిలా ఉండేవారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతును పట్టించుకునే నాథుడే లేడు. సినిమా రంగం నుంచి వచ్చిన ఓ నేత సామాజిక సేవ అంటూ ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి కేవలం పదవి కోసం పార్టీని నట్టేట ముంచి నీచమైన కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నారు. టీడీపీ ఒక్క ప్రాజెక్టు కట్టకుండా రాష్ట్ర వ్యవసాయ రంగాన్నే దివాళా తీయించింది. మళ్లీ అప్పటి వైఎస్ పాలనను తీసుకురాగ ల వ్యక్తి జగన్ ఒక్కడే. 



శనివారం రాత్రి ఒంగోలులో బస చేసిన జగన్ ఆదివారం ఉదయం ఐదో నంబరు జాతీయ రహదారి మీదుగా గుంటూరు చేరుకున్నారు. మార్గంమధ్యలో దారిపొడవునా ప్రజలు అఖండస్వాగతం పలకడంతో నిర్ణీత సమయంకంటే గంటన్నర ఆలస్యంగా ఆయన గుంటూరు చేరుకున్నారు. అప్పటికే దీక్షా ప్రాంగణానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ భారీ జనసందోహం... జోహార్ వైఎస్‌ఆర్... జై జగన్ నినాదాల నడుమ ధ్యానముద్రలో ఉన్న మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జగన్ నిరాహారదీక్ష ప్రారంభించారు. 


ఉత్కంఠ వీడింది. ఉద్వేగం మిగిలింది. జనం జాగృతమైంది. నేతలు నివ్వెరపోయారు. నాయకులు తలచిందొకటి. నిర్ణేతలు చేసిందొకటి. ఊహల ఊయలల తాళ్లు తెగిపడ్డారుు. నిజాల నిష్ఠూరాలు ఎగిరిపడ్డారుు. మినీ సంగ్రామంలో మహా యుద్ధమే జరిగింది. రెండు మహా సామ్రాజ్యాలు కూలారుు. వామపక్ష వీరులు నిర్వీర్యులైపోయారు. యుద్ధానికి ముందే చేతులెత్తేశారు. అనుకున్నంతా అరుుంది. కమ్యూనిస్టుల కోటలు ఫెళ్లున నేల కూలారుు. పశ్చిమ బెంగాల్ లెఫ్ట్ చేజారింది. ేకరళలోనూ అదే పరిస్థితి. ఇక తమిళ సామ్రాజ్యంలో కరుణానిధికి దారుణమైన పరాభవం మిగిలింది. జయలలిత చేతిలో చావు దెబ్బ తగిలింది. ఇక రేపటి నుంచి ఆయనకు కష్టకాలమే. అసోంలో కాంగ్రెస్ పార్టీ పరువు దక్కించుకుంది. వరసగా మూడోసారి తరుణ్ గొగోయ్ ప్రజాభిమానాన్ని నిలబెట్టుకున్నారు. ేకరళలో కాంగ్రెస్ మళ్లీ కొత్త శకం ప్రారంభించబోతోంది. అది అదనపు బోనస్. పుదుచ్చేరిలోనూ జయలలిత హవాయే. ఇక కడప వ్యవహారం..జగన్ సునామీ ముందు అంతా కొట్టుకుపోయారు. డిపాజిట్లు గల్లంతు చేసుకుని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జగన్ మెజారిటీ సాధనలో జాతీయ రికార్డును తృటిలో కోల్పోయారు. పులివెందులలో ఆయన తల్లి విజయమ్మ కూడా అఖండ విజయం సాధించారు.
గత నెలరోజుల నుంచి జాతీయ స్థాయి మీడియా నుంచి జిల్లా మీడియా వర కూ అందరి దృష్టీ కడప ఉప ఎన్నికలపైనే. శుక్రవారం నాటి ఫలితాలు అందరి మైండ్లను బ్లాంక్ చేశాయి. చివరకు జగన్ శిబిరం కూడా ఊహించనంత భారీ మెజారిటీతో జగన్ విజయుడయ్యారు. రెండు ప్రధాన పార్టీలకు ధరావతు కూ డా దక్కకుండా చేశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, జాతీయ మీడియా కడపపైనే ఎక్కువ దృష్టి సారించింది. ఎందుకంటే.. అది కడప-ఢిల్లీకి జరుగుతున్న యుద్ధమని జగన్ ప్రకటించడమే కారణం. కడప ఎన్నికల ప్రచార తీరును నిశితంగా పరిశీలించిన సందర్భంలో జగన్ కు లక్ష లోపు మెజారిటీ రావచ్చన్న అభిప్రాయం వ్యక్తమయింది. కడపకు ఎన్ని కల పరిశీలన కోసం వచ్చిన జాతీయ మీడియా ప్రతినిధులు సైతం అలాంటి అంచనాకే వచ్చారు. కానీ, రాను రాను వైఎస్ మృతి సెంటిమెంట్, కడప ఆత్మ గౌరవ నినాదం పోలింగ్ నాటికి క్షేత్రస్థాయికి చేర్చడంలో జగన్ శిబిరం పన్నిన వ్యూహం ఫలితం రూపంలో మహాద్భుతంగా వెల్లడయ్యేసరికి రాష్ట్ర ప్రజలు విభ్రాంతి చెందవలసి వచ్చింది. ఆ మేరకు తన ఎన్నికలను పకడ్బందీగా రూ పొందించుకున్న జగన్ సఫలీకృతులయ్యారని చెప్పక తప్పదు. అధికార కాంగ్రెస్-ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తనపై ద్విముఖ దాడి చేసినా వాటిని అవలీలగా ఎదుర్కొని విజయతీరాలకు చేరిన జగన్ ముందస్తు ప్రణాళిక ను ప్రత్యరులు సైతం మెచ్చుకోక తప్పదు.
ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్-టీడీపీ నేతలను తన వైపు మళ్లించుకోగలిగారు. నియో జకవర్గ ఇన్చార్జులుగా తనకు నమ్మకమైన వారిని మాత్రమే నియమించు కున్నారు. డబ్బుల విషయం కచ్చితంగా వ్యవహరించారు. ఎక్కడ ఎక్కువ ఇవ్వా లో, ఎక్కడ సరిపడినంత ఇవ్వాలో ఆ మేరకు నిధుల పంపిణీలో జాగ్రత్తగా అడు గులు వేశారు. కాంగ్రెస్, టీడీపీ కంటే మూడు నెలల ముందు నుంచే జగన్ ప్రణాళిక రచించినట్లు ఎన్నికల వాతావరణం స్పష్టం చేసింది. ఆ రెండు పార్టీలు అభ్యర్ధుల ఎంపిక ప్రహసనం చివరివరకూ తేలని వైనాన్ని జగన్ చక్కగా విని యోగించుకున్నారు. అన్ని పార్టీల ప్రధాన నేతలు ప్రచారంలో కడపలో కాలు పెట్టేసరికే ఆయన రెండుసార్లు పర్యటించి వచ్చారు.ఇక ప్రచారంలోనూ జగన్ ప్రజల మనసులను తాకారు. ఆమేరకు ఆయన ఎన్నుకున్న నినాదం కడపలోని ప్రతి గడపనూ తట్టింది. ‘ఇది కడప ఆత్మ గౌర వానికీ-ఢిల్లీ అహంకారానికీ జరుగుతున్న యుద్ధం’ అని జగన్ తరచూ చేసిన వ్యాఖ్యలు సహజంగా పౌరుషానికి ప్రతీకలయిన కడప ఓటర్ల గుండెల్లో నాటు కుపోయాయి. అదే నినాదాన్ని ఆయన అనుచరులు గ్రామస్థాయికి తీసు కువెళ్ల డంలో విజయం సాధించారు. ఒక్కముక్కలో చెప్పాలంటే కడప గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ ఒక్కసారికి జగన్‌కు ఓటు వేయకపోతే వారిని పక్కని వారే శత్రువుగా చూడవలసిన మానసిక పరిస్థితిని కల్పించారు. కడప బిడ్డను ఢిల్లీ వాళ్లు అవమానించారన్న భావోద్వేగాన్ని బలంగా నాటుకుపోయేలా చేశా రు. ఈ భావన, ప్రభావం పొలింగ్ రోజు విస్పష్టంగా బయటపడింది. భావోద్వేగాన్ని ఓటుగా మలచుకోవడంలో జగన్ మహామహ పార్టీలనే నోరెళ్లబెట్టేలా చేశారు. మంత్రుల ప్రచారాన్ని సైతం తన భావోద్వేగాలకు అనుకూలంగా మలుచుకోవ డంలో విజయం సాధించారు.
ఈ స్ధాయిలో జగన్ విజయం సాధించడాన్ని సోనియా జీర్ణించుకోలేకపో తున్నారు. అసోం, కేరళ రాష్ట్రాల్లో సాధించిన విజయం కన్నా ఆంధ్రరాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ఎదురయిన భారీ ఓటమే సోనియాను కలవరపెడుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతల వైఫల్యాన్ని సోనియా తన ఖాతాలో జమ వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డీఎస్ అసమర్థత వల్లే జగన్‌కు అంత మెజారిటీ వచ్చిందని, వారిద్దరికీ సమన్వయం లేకనే జగన్ మెజారిటీ తగ్గించలేకపోయారన్న నిర్థరణకు రావలసి వచ్చింది.
కడప-ఢిల్లీకి, ఆత్మగౌరవానికి-అహంకారానికీ మధ్య జరుగుతున్న ఎన్నికలంటూ జగన్ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మడంతో రాష్ట్రంలో సోనియాగాంధీకి ఇమేజ్ లేదని స్పష్టమయిపోయింది. కాంగ్రెస్ అభ్యర్ధి డీఎల్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఫొటోతో ప్రచారం చేసుకుంటే, జగన్ కేవలం వైఎస్ ఫొటోతోనే ప్రచారం చేసుకున్నారు. ప్రజలు మాత్రం వైఎస్‌ను ఆదరించి, సోనియాను తిరస్కరించడం కూడా రాష్ట్రంలో ఇకపై సోనియా బొమ్మకు ఆదరణ ఉండదని తేలిపోయింది.వివేకానందరెడ్డి తన ప్రచారంలో వైఎస్ ఫొటో తప్ప సోనియా ఫొటో ఫొటో వాడుకోలేదంటే సోనియా ఇమేజ్ ఏమిటన్నది స్పష్టమయిపోయింది.





