పార్టీ ప్రకటించిన నేపథ్యంలో జగన్‌పై బురదచల్లేందుకు టీడీపీ తంటాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తమకు ముప్పు తప్పదని గుబులు
మంత్రి శంకర్రావు ఆరోపణలను తలకెత్తుకుని హైకోర్టులో పిల్
నాడు టీడీపీ ఆరోపణల ఆధారంగా కోర్టుకు మంత్రి లేఖ
ఇప్పుడు ఆయన బాటలోనే పయనిస్తున్న టీడీపీ నేతలు
సిద్ధాంతాలు, విభేదాలను మరచి ఒక్కటైన అధికార, విపక్షాలు
మ్యాచ్ ఫిక్సింగ్‌తో వైఎస్ కుటుంబ ప్రతిష్టను దిగజార్చే కుట్ర
యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ పేరు ప్రకటించగానే తెలుగుదేశం పార్టీలో వణుకు మొదలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తమకు ముప్పు తప్పదని భావించిన ఆ పార్టీ నేతలు జగన్‌పై బురద చల్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటివరకు జగన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించిన మంత్రి శంక ర్రావు దారిలోనే వీరూ నడుస్తున్నారు. ప్రజాభిమానంతో తిరుగులేని నేతగా ఎదుగుతున్నారనే అక్కసుతో జగన్‌పై ఇప్పటికే శంకర్రావు న్యాయస్థానానికి లేఖ రాయగా.. తాజాగా టీడీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ గతంలో చేసిన ఆరోపణలను మంత్రి తలకెత్తుకోవడం, ఇప్పుడు ఆయన బాటలోనే టీడీపీ నడవడం అధికార, ప్రతిపక్ష పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్‌కు నిదర్శనం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటనతో ఎల్లో సిండికేట్ వెన్నులో వణుకు మొదలైందని.. ఎలాగైనా యువనేతపై బురదచల్లాలన్న ఉద్దేశంతోనే టీడీపీ నేతలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారనేది బహిరంగ రహస్యమని సీనియర్ న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు.
‘సాక్షి’లో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు జగన్ స్పష్టమైన ప్రకటనలు చేసినప్పటికీ... అవే ఆరోపణలను మళ్లీ గుప్పిస్తూ టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు విలేకరుల సమావేశంలో... జగన్‌కు వచ్చిన ఐటీ నోటీసులపై విమర్శలు గుప్పించారు. వాటిని ఆధారం చేసుకుని టీడీపీ నేతలు ఓ అనామక ఈ-మెయిల్ ఐడీ సృష్టించి, జగన్‌పై దుష్ర్పచారానికి పూనుకున్నారు. దేశవ్యాప్తంగా మీడియా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు ఈ ఈ-మెయిల్ పంపారు. ఇప్పుడు జగన్ ఆస్తులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి వైఎస్‌జగన్ కోట్ల రూపాయలు ఆర్జించారని, ఆ మొత్తం వ్యవహారంపై విచారణ జరపడంతో పాటు.. జగన్‌పై అవినీతి నిరోధక , మనీ లాండరింగ్ చట్టాల కింద చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ టీడీపీ నేతలు కె.ఎరన్న్రాయుడు, పి.అశోక్‌గజపతి రాజు, బెరైడ్డి రాజశేఖరరెడ్డి సోమవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, సీబీఐ డెరైక్టర్, ఏసీబీ డెరైక్టర్, ఆదాయపు పన్ను అసిస్టెంట్ కమిషనర్, వైఎస్ జగన్, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, భారతి సిమెంట్స్, క్లాసిక్ రియాల్టీ, సండూర్ పవర్ లిమిటెడ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ సెలవులో ఉండటంతో, ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ వంగా ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఉదయం విచారించనున్నది.
సిద్ధాంతాలు, విభేదాలు మరచి..
దివంగత మహానేత వైఎస్ ఇప్పుడు లేరు. ఆయన వచ్చి సమాధానం చెప్పుకోలేరని తెలుసు. గడచిన ఎన్నికలకు ముందు ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం మంత్రివర్గ సమష్టి నిర్ణయం. అప్పటి మెజారిటీ మంత్రులే ఇప్పటి ప్రభుత్వంలో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి టీడీపీ చేసిన ఆరోపణల ఆధారంగా హైకోర్టుకు లేఖ రాయడం, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అవే ఆరోపణలతో మరో పిటిషన్ దాఖలు చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించడం, రాయితీలు ఇవ్వడమన్నది అభివృద్ధి ప్రక్రియలో భాగం. తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. వేలాది ఎకరాలు పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేశారు. పరిశ్రమలకు రాయితీలు ఇచ్చారు. వీటన్నింటినీ పక్కనబెట్టి అధికార, ప్రతిపక్షాలు రాజకీయ సిద్ధాంతాలను, విభేదాలను మరచిపోయి దివంగత మహానేత కుటుంబ ప్రతిష్టను మసకబార్చే కుట్రకు పాల్పడుతున్నాయి. ఆధారాలతో నిమిత్తం లేకుండా ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పూనుకుంటున్నాయి.
‘సాక్షి’లో పెట్టుబడులపై విచారణ 25కి వాయిదా
యువనేత వైఎస్ జగన్ ఆస్తులకు సంబంధించి మంత్రి శంకర్రావు రాసిన లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించిన హైకోర్టు.. దానిపై తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యానికి సంబంధించి గతంలో జారీ చేసిన నోటీసులను అందుకోని ప్రతివాదులకు మళ్లీ నోటీసులు జారీ చేసింది. అంతేకాక ఈ లేఖ విచారణార్హతపై అభ్యంతరాలు ఉంటే, వాటితో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వంగా ఈశ్వరయ్య, జస్టిస్ వేగి సూరి అప్పారావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాము కేవలం లేఖ విచారణార్హతపైనే వాదనలను వినిపిస్తామని జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ తదితర కంపెనీల తరఫున హాజరవుతున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అల్తాఫ్ అహ్మద్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యాజ్యంలోని ప్రతివాదుల్లో ఒకరైన భగవత్ సన్నిధి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. శంకర్రావు లేఖ విచారణార్హతపై కౌంటర్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల్లో పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా శంకర్రావు లేఖ లేదని ఆ సంస్థ కోర్టుకు నివేదించింది. మంత్రి రాసిన లేఖ, తరువాత దాఖలు చేసిన అఫిడవిట్ ప్రమాణపూర్వకంగా దాఖలు చేయలేదని, అలాంటప్పుడు దానిని అఫిడవిట్‌గా పరిగణించడం సరికాదని వివరించింది. అంతేకాక అఫిడవిట్‌తో జత చేసినవివరాలను ఎక్కడ్నుంచి సంపాదించారన్న విషయాన్ని శంకర్రావు ఎక్కడా పేర్కొనలేదని, కాబట్టి ఆ అఫిడవిట్‌ను తోసిపుచ్చాలని కోర్టును కోరింది.
అఫిడవిట్ తప్పనిసరని కోర్టు భావిస్తే, ప్రమాణపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేయాలని శంకర్రావును ఆదేశించాలని, అప్పుడే ఆయన పేర్కొన్న అంశాలకు విలువ ఉంటుందని తెలిపింది. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ దాఖలయ్యే వ్యాజ్యాలకు విచారణార్హత లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. తాను చేసిన ఆరోపణలకు చట్టబద్ధమైన రుజువులు చూపేంత వరకు ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ చేపట్టరాదని విజ్ఞప్తి చేసింది. శంకరరావు రాసిన లేఖలో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవని, కేవలం రాజకీయ దురుద్దేశాలతో జగన్ ప్రతిష్టను దెబ్బ తీసే చర్యల్లో భాగంగానే ఈ లేఖ రాశారని కోర్టుకు నివేదించింది. భారీ జరిమానాతో ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరింది.

జగన్ కంపెనీలపై ఐటీ, ఈడీలతో విచారణ
టీడీపీ నేతలకు ప్రధాని హామీ..
అక్రమాల చిట్టా విప్పిన ఎంపీలు
ముకుతాడు !
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని నైతికంగా, మానసికంగా, సాంకేతికంగా, చట్టపరంగా దెబ్బకొట్టేందుకు తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ జగన్‌పై ఏకకాలంలో ముప్పేట దాడికి దిగాయి. జగన్ అక్రమాస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచా రణ జరిపిస్తామని ప్రధాని మనోహ్మన్ సింగ్ సోమవారం తెలుగుదేశం పార్ల మెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వర రావు నేతృత్వంలో తనను కలిసిన టీడీపీ ఎంపీల బృందానికి హామీ ఇచ్చారు. దానితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో జగన్‌పై ఇక కేంద్ర స్థాయిలోనూ ఉక్కుపాదం మొదలయిం దని స్పష్టమవుతోంది.అదే సమ యంలో.. రాష్ట్ర హైకోర్టులో సైతం జగన్ అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని కోరుతూ టీడీపీ సీనియర్లు యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతి రాజు, బైరెడ్డి రాజశేఖరరెడ్డి వేసిన పిల్‌ను హైకోర్టు స్వీకరించింది. దీనితో జగన్‌పై ఇక ముప్పేట దాడి మొదల యినట్లుగా భావించక తప్పదు.
ఇటీవలే జగన్ అక్రమ ఆస్తులపై న్యాయ విచారణ జరపాలంటూ మంత్రి శంకర్రావు రాసిన లేఖను విచారణకు స్వీకరించిన హైకోర్టు నిర్ణయంతో ఖంగుతిన్న జగన్‌కు ఒకేరోజు రెండు ప్రతికూల పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి.
జగన్ తన తండ్రి రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదిం చిన లక్ష కోట్ల ఆస్తులపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ సోమవారం టీడీపీపీ నేత నామా నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఎంపీలు డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డి, మోదుగుల వేణు గోపాల్‌రెడ్డి, శివప్రసాద్, నారాయణ, సత్యనారాయణచౌదరి ప్రధాని మన్మో హన్‌సింగ్‌ను కలసి మూడు పేజీల వినతిపతిపత్రం సమర్పించారు. అం దులో.. జగన్‌కు చెందిన సాక్షి పత్రికలో పెట్టుబడులు, దానికి బోగస్ కంపెనీల మద్దతు, భారతి సిమెంట్ పెట్టుబడులు, రాష్ట్రంలో సెజ్‌లు, భూములు, పరిశ్రమలు తీసుకున్న వారి నుంచి సాక్షి సంస్థలకుతీసుకున్న పెట్టుబడుల వివరాలను పొందుపరిచారు.
రాజశేఖరరెడ్డి సీఎం కాకముందు జగన్ ఆదాయపన్ను శాఖకు సమర్పించిన డాక్యుమెంట్లు, సీఎం అయిన తర్వాత చెల్లిస్తున్న పన్నుల వివరా లను కూడా జతపరిచారు. జగన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించారు. వాటి ఆధారంగా జగన్ అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. దానికి స్పందించిన ప్రధాని మన్మోహన్‌సింగ్.. జగన్ అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణను తమంతట తాము జరిపించలేమని, రాష్ట్ర ప్రభుత్వం కోరితే విచా రణ చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఇది ఇన్‌కంటాక్స్‌కు సంబంధిం చిన వ్యవహారమ యినందున ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో విచారణ జరిపిస్తా మని హామీ ఇచ్చారు.
జగన్ అక్రమాస్తులు ఏవిధంగా సంపా దించారో నామా నాగేశ్వరరావు, ఇతర ఎంపీలు చెబుతున్న ప్పుడు ప్రధాని విస్మయం వ్యక్తం చేశా రు. ఇంత తక్కువ సమయంలో అన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని ఆశ్చ ర్యం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఈ స్థాయిలో ఆర్థిక దోపిడీ చేయడం తాను కూడా మొదటిసారి వింటున్నానని వ్యాఖ్యా నించారు. దానితో.. తాము వైఎస్ జీవించి ఉన్న సమయంలో ‘రాజా ఆఫ్ కరప్షన్’ పేరుతో పుస్తకా లు ముద్రించి, మీకు సైతం ఇచ్చామని, అప్పుడే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చే ది కాదని నామా నాగేశ్వరరావు ప్రధానితో అన్నారు.
దానికి ప్రధాని మౌనం వహించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. జగన్ అక్రమ ఆస్తులపై న్యాయ విచారణ జరిపించాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృ ష్ణుడు, ఎర్రన్నాయుడు, అళోక్‌గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాష్ట్ర హైకో ర్టులో వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సోమవారం హైకోర్టు స్వీకరించింది. అందులో.. జగన్, ఆయన కంపెనీలతో పాటు, సీబీఐ, ఏసీ బీలను ప్రతివాదులు గా చేర్చారు. మంగళవారం ఈ కేసు విచారణకు రానున్నట్లు సమాచారం. అందులో జగన్‌కు చెందిన సాక్షి మీడియా సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వారికి కేటాయించిన భూములు, సెజ్‌లు, కంపెనీల వివరాలు తమ ఆరోపణలకు సాక్ష్యాలుగా చూపారు.
తాజా పరిణామాలతో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ జగన్‌కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. శాసనమండలి ఎన్నికల్లో తన అనుచర వర్గంతో కాంగ్రెస్ సర్కారుకు షాక్ ఇద్దామని ప్రయత్నిస్తున్న జగన్‌కు ఇది ఎదురుదెబ్బగానే భావించక తప్పదు. కేంద్రం ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణను ప్రారంభిస్తే ఆర్ధిక మూలాలు, అవకతవకలన్నీ బయటపడక తప్పదు. ఫలితంగా.. జగన్ ప్రజల్లో అవినీతి పరుడిగా ముద్రవేయించుకునే ప్రమాదం లేకపో లేదు. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ అస్తశ్రస్త్రాలను ఇప్పటినుంచే సిద్ధం చేసుకుంటోంది. జగన్‌ను అవినీతిపుట్టగా ఇప్పటికే ఆరోపణాస్త్రాలు సంధి స్తున్న టీడీపీ.. ఇక ఆయన ఆస్తులపై ఎన్‌ఫోర్స్ మెంట్ విచారణ మొదలుపెడితే దానిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడం ఖాయం. జగన్‌ను ఓ అవినీతికేంద్రంగా చూపించడం ద్వారా ఆయనను నైతికంగా దెబ్బకొట్టి, ప్రజల్లో ఏహ్యభావం కలిగించాలన్న టీడీపీ వ్యూహానికి, ప్రధాని నిర్ణయం తోడయింది.
కాంగ్రెస్‌ను, ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని సవాలు చేసి బయటకు రావటంతో పాటు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను కుప్పకూల్చేందుకు పావులు కదుపుతున్న జగన్‌ను కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో దెబ్బకొట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు తన చేతికి మట్టి అట్టకుండా, తాను జగన్‌ను కావాలని వేధిస్తున్నానన్న భావన ప్రజల్లో కలిగించకుండా... టీడీపీ ఇచ్చిన ఫిర్యాదును అడ్డుపెట్టుకుని, తెలుగు దేశం పార్టీ భుజంపై తుపాకీ పెట్టి జగన్ వైపు గురి పెట్టినట్లు స్పష్టమవుతోంది.
వైఎస్ జగన్ కంపెనీల్లో అక్రమ నిధుల ప్రవాహం, వాటి మూలాలపై ఆదాయపు పన్ను విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లతో సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా ముందుకు వచ్చారు. ప్రజల ఆస్తులు, సహజ వనరులను లూటీ చేసిన కొద్దిమంది బడాబాబుల ద్వారా జగన్ కంపెనీల్లో అక్రమంగా ప్రవేశించిన పెట్టుబడులు, పలు చట్టాల ఉల్లంఘనపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా టీడీపీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యు డు మైసూరా రెడ్డి తదితరులు సోమవారం ప్రధానికి విన్నవించారు.
దీనిపై ఆయన అనూహ్యమైన రీతిలో స్పందించారు. "సీబీఐ విచారణ అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మొదలైన తతంగం ఉంటుంది. ఐటీ, ఈడీలతో విచారణ జరిపిస్తాను'' అని ప్రధాని చెప్పడంతో టీడీపీ ఎంపీలు ఆశ్చర్యచకితులయ్యా రు. 'రాజా ఆఫ్ కరప్షన్' పేరిట రాష్ట్రానికి చెందిన అన్ని ప్రతిపక్ష పార్టీలు 2009 ఫిబ్రవరిలోనే కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. "జగన్ కంపెనీల్లో అక్రమ పెట్టుబడులపై మరిన్ని సాక్ష్యాలతో ఈ ఏడాది జనవరిలో రాజ్యాంగ సంస్థలకు, నియంత్రణ ఏజెన్సీలకు మళ్లీ ఫిర్యాదు చేశాం.
జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లావాదేవీలపై ఐటీ అధికారులు చేసిన దర్యాప్తులో పలు కీలకాంశాలు బయటపడ్డాయని తెలిపారు. జగతిలో రూ. 15కోట్లు పెట్టుబడి పెట్టిన 8 కంపెనీలు బోగస్‌వని... ముంబై, రాజ్‌కోట్, బెంగళూరు, కోల్‌కతాలకు చెందిన ఆ కంపెనీల చిరునామాలు కూడా బోగస్‌వేనని తేలింది. జగతి పబ్లికేషన్స్‌లో రూ.743.57 కోట్ల పెట్టుబడికి 90 శాతం వాటా ఉంచుకోగా... మిగిలిన 10 శాతం వాటా కోసం వివిధ కంపెనీలు రూ.300.49 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి. సాక్షి పత్రికను ప్రారంభించకముం దే 35 రెట్లు అధిక ధరకు వాటా ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఐటీ కూడా ప్రశ్నించింది.
జగతి పబ్లికేషన్స్‌కు చెందిన భూమి, భవనాలు కూడా జగన్‌కు చెందిన మరో కంపెనీ జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు చెందినవని తెలిపింది. మాట్రిక్స్ లాబ్స్, పీవీ బిజినెస్ వెంచర్స్, హెటెరో గ్రూప్, అరబిందో ఫార్మా, రాంకీ గ్రూప్ మొదలైన కంపెనీలకు సెజ్‌లు, రేవులు, రియల్ ఎస్టేట్ నిబంధనల్లో సడలింపులు వంటి ప్రయోజనాలు సమకూర్చిన విషయం కూడా ఐటీ ఎత్తిచూపింది. వారు పెట్టిన 277.56 కోట్ల పెట్టుబడిని ఐటీ విభాగం అదనపు ఆదాయంగా భావించి రూ.122.78 కోట్ల పన్ను కట్టాలని ఆదేశించింది.
జగతి నష్టాలు రూ.349 కోట్లు దాటినప్పటికీ, గత రెండేళ్లలో ఇదే కంపెనీకి అంతే ప్రీమియంతో ఇవే కంపెనీల నుంచి రూ.1200 కోట్ల పెట్టుబడి రావడం, రూ.277.56 కోట్ల మేరకు అధికార దుర్వినియోగం జరగడాన్ని కూడా ఐటీ ఎత్తిచూపింది. జగన్‌కు చెందిన 35 కంపెనీల్లో ఆరేళ్లుగా ఇలా అక్రమ పెట్టుబడులు వచ్చాయి. లక్ష కోట్ల మేరకు మోసాలు జరిగాయి'' అని టీడీపీ ఎంపీలు ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
2003-04లో జగన్ ఆదాయం కేవలం రూ.9.19లక్షలుకాగా... 2010-11లో తన ఆదాయం రూ.500 కోట్లు ఉంటుందంటూ రూ.84 కోట్ల అడ్వాన్స్ పన్ను చెల్లించారని తెలిపారు. అంటే, జగన్ ఆదాయం ఏటా 5 వేల శాతం పెరిగిందని తెలిపారు. "ఇంత ప్రగతి భారత కార్పొరేట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగం. ఉదాహరణకు భారతీ సిమెంట్స్‌లో జగన్ తొలి పెట్టుబడి రూ.45.18 కోట్లు. అది కేవలం రెండేళ్లలోనే రూ.3,053 కోట్లకు పెరిగింది.
దాల్మియా సిమెంట్స్ వంటి బడా కంపెనీలు జగన్ కంపెనీలో రూ.10విలువైన వాటాను రూ.1450 ప్రీమియంతో కొనుగోలు చేశాయి. ఈ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం గనులు, ఇతర కేటాయింపులద్వారా ప్రయోజనం చేకూర్చింది'' అని తెలిపారు. జగన్ కు చెందిన సండూర్, కార్మెల్ ఆసియా, జనని, సరస్వతి, క్లాసిక్ రియాల్టీ ఇలా ఒక్కో కంపెనీ కథనాల్ని టీడీపీ నేతలు ప్రధానికి వివరంగా తెలిపారు. ప్రధానిని కలిసిన ఎంపీల్లో సుజనా చౌదరి, హరికృష్ణ, వేణుగోపాల్ రెడ్డి, కొనకళ్ల నారాయణ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వంపై అవినీతి మచ్చ
ధానిని కలిసిన తర్వాత నామా, మైసూరా విలేకరులతో మాట్లాడారు. 2జి స్పెక్ట్రమ్ నుంచి హసన్ అలీ వరకు జరిగిన కుంభకోణాలతో దేశ పరిపాలన వ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతిన్నదన్నారు. "వైఎస్ తన కుమారుడిని అత్యంత ధనికుడిగా చేసేందుకు పాల్పడిన అక్రమాలు అన్నీఇన్నీ కావు. మాకు వ్యక్తులు లక్ష్యం కాదు. అవినీతిపై పోరాటం ప్రతిపక్షాల విధి. జగన్ కొత్తగా పార్టీ పెట్టాడు కాబట్టి ఈ పోరాటం చేయడం లేదు. వైఎస్ ఉన్నప్పటి నుంచే చేస్తున్నాం'' అని మైసూరా తెలిపారు.
పదిహేను రోజుల కిందటే ప్రధాని అపాయింట్‌మెంట్ అడిగామన్నారు. కొందరు విలేకరులు నిష్పాక్షికంగా విధి నిర్వహణ చేయకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, పెట్టుబడిదారుల్లాగా ప్రశ్నలు అడుగుతున్నారని మైసూరా చురకలు అంటించారు.

No comments:
Post a Comment