Monday, March 14, 2011

జగన్ కంపెనీలపై ఐటీ, ఈడీలతో విచారణ * ‘సాక్షి’లో పెట్టుబడులపై విచారణ 25కి వాయిదా * పక్కా మ్యాచ్ ఫిక్సింగ్


పార్టీ ప్రకటించిన నేపథ్యంలో జగన్‌పై బురదచల్లేందుకు టీడీపీ తంటాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తమకు ముప్పు తప్పదని గుబులు
మంత్రి శంకర్రావు ఆరోపణలను తలకెత్తుకుని హైకోర్టులో పిల్
నాడు టీడీపీ ఆరోపణల ఆధారంగా కోర్టుకు మంత్రి లేఖ
ఇప్పుడు ఆయన బాటలోనే పయనిస్తున్న టీడీపీ నేతలు
సిద్ధాంతాలు, విభేదాలను మరచి ఒక్కటైన అధికార, విపక్షాలు
మ్యాచ్ ఫిక్సింగ్‌తో వైఎస్ కుటుంబ ప్రతిష్టను దిగజార్చే కుట్ర


యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ పేరు ప్రకటించగానే తెలుగుదేశం పార్టీలో వణుకు మొదలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తమకు ముప్పు తప్పదని భావించిన ఆ పార్టీ నేతలు జగన్‌పై బురద చల్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటివరకు జగన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించిన మంత్రి శంక ర్రావు దారిలోనే వీరూ నడుస్తున్నారు. ప్రజాభిమానంతో తిరుగులేని నేతగా ఎదుగుతున్నారనే అక్కసుతో జగన్‌పై ఇప్పటికే శంకర్రావు న్యాయస్థానానికి లేఖ రాయగా.. తాజాగా టీడీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ గతంలో చేసిన ఆరోపణలను మంత్రి తలకెత్తుకోవడం, ఇప్పుడు ఆయన బాటలోనే టీడీపీ నడవడం అధికార, ప్రతిపక్ష పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్‌కు నిదర్శనం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటనతో ఎల్లో సిండికేట్ వెన్నులో వణుకు మొదలైందని.. ఎలాగైనా యువనేతపై బురదచల్లాలన్న ఉద్దేశంతోనే టీడీపీ నేతలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారనేది బహిరంగ రహస్యమని సీనియర్ న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు.


‘సాక్షి’లో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు జగన్ స్పష్టమైన ప్రకటనలు చేసినప్పటికీ... అవే ఆరోపణలను మళ్లీ గుప్పిస్తూ టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు విలేకరుల సమావేశంలో... జగన్‌కు వచ్చిన ఐటీ నోటీసులపై విమర్శలు గుప్పించారు. వాటిని ఆధారం చేసుకుని టీడీపీ నేతలు ఓ అనామక ఈ-మెయిల్ ఐడీ సృష్టించి, జగన్‌పై దుష్ర్పచారానికి పూనుకున్నారు. దేశవ్యాప్తంగా మీడియా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు ఈ ఈ-మెయిల్ పంపారు. ఇప్పుడు జగన్ ఆస్తులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి వైఎస్‌జగన్ కోట్ల రూపాయలు ఆర్జించారని, ఆ మొత్తం వ్యవహారంపై విచారణ జరపడంతో పాటు.. జగన్‌పై అవినీతి నిరోధక , మనీ లాండరింగ్ చట్టాల కింద చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ టీడీపీ నేతలు కె.ఎరన్న్రాయుడు, పి.అశోక్‌గజపతి రాజు, బెరైడ్డి రాజశేఖరరెడ్డి సోమవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, సీబీఐ డెరైక్టర్, ఏసీబీ డెరైక్టర్, ఆదాయపు పన్ను అసిస్టెంట్ కమిషనర్, వైఎస్ జగన్, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, భారతి సిమెంట్స్, క్లాసిక్ రియాల్టీ, సండూర్ పవర్ లిమిటెడ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ సెలవులో ఉండటంతో, ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ వంగా ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఉదయం విచారించనున్నది.


సిద్ధాంతాలు, విభేదాలు మరచి..


దివంగత మహానేత వైఎస్ ఇప్పుడు లేరు. ఆయన వచ్చి సమాధానం చెప్పుకోలేరని తెలుసు. గడచిన ఎన్నికలకు ముందు ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం మంత్రివర్గ సమష్టి నిర్ణయం. అప్పటి మెజారిటీ మంత్రులే ఇప్పటి ప్రభుత్వంలో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి టీడీపీ చేసిన ఆరోపణల ఆధారంగా హైకోర్టుకు లేఖ రాయడం, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అవే ఆరోపణలతో మరో పిటిషన్ దాఖలు చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించడం, రాయితీలు ఇవ్వడమన్నది అభివృద్ధి ప్రక్రియలో భాగం. తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. వేలాది ఎకరాలు పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేశారు. పరిశ్రమలకు రాయితీలు ఇచ్చారు. వీటన్నింటినీ పక్కనబెట్టి అధికార, ప్రతిపక్షాలు రాజకీయ సిద్ధాంతాలను, విభేదాలను మరచిపోయి దివంగత మహానేత కుటుంబ ప్రతిష్టను మసకబార్చే కుట్రకు పాల్పడుతున్నాయి. ఆధారాలతో నిమిత్తం లేకుండా ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పూనుకుంటున్నాయి.


‘సాక్షి’లో పెట్టుబడులపై విచారణ 25కి వాయిదా


యువనేత వైఎస్ జగన్ ఆస్తులకు సంబంధించి మంత్రి శంకర్రావు రాసిన లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించిన హైకోర్టు.. దానిపై తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యానికి సంబంధించి గతంలో జారీ చేసిన నోటీసులను అందుకోని ప్రతివాదులకు మళ్లీ నోటీసులు జారీ చేసింది. అంతేకాక ఈ లేఖ విచారణార్హతపై అభ్యంతరాలు ఉంటే, వాటితో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వంగా ఈశ్వరయ్య, జస్టిస్ వేగి సూరి అప్పారావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.


తాము కేవలం లేఖ విచారణార్హతపైనే వాదనలను వినిపిస్తామని జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ తదితర కంపెనీల తరఫున హాజరవుతున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అల్తాఫ్ అహ్మద్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యాజ్యంలోని ప్రతివాదుల్లో ఒకరైన భగవత్ సన్నిధి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. శంకర్రావు లేఖ విచారణార్హతపై కౌంటర్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల్లో పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా శంకర్రావు లేఖ లేదని ఆ సంస్థ కోర్టుకు నివేదించింది. మంత్రి రాసిన లేఖ, తరువాత దాఖలు చేసిన అఫిడవిట్ ప్రమాణపూర్వకంగా దాఖలు చేయలేదని, అలాంటప్పుడు దానిని అఫిడవిట్‌గా పరిగణించడం సరికాదని వివరించింది. అంతేకాక అఫిడవిట్‌తో జత చేసినవివరాలను ఎక్కడ్నుంచి సంపాదించారన్న విషయాన్ని శంకర్రావు ఎక్కడా పేర్కొనలేదని, కాబట్టి ఆ అఫిడవిట్‌ను తోసిపుచ్చాలని కోర్టును కోరింది.


అఫిడవిట్ తప్పనిసరని కోర్టు భావిస్తే, ప్రమాణపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేయాలని శంకర్రావును ఆదేశించాలని, అప్పుడే ఆయన పేర్కొన్న అంశాలకు విలువ ఉంటుందని తెలిపింది. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ దాఖలయ్యే వ్యాజ్యాలకు విచారణార్హత లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. తాను చేసిన ఆరోపణలకు చట్టబద్ధమైన రుజువులు చూపేంత వరకు ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ చేపట్టరాదని విజ్ఞప్తి చేసింది. శంకరరావు రాసిన లేఖలో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవని, కేవలం రాజకీయ దురుద్దేశాలతో జగన్ ప్రతిష్టను దెబ్బ తీసే చర్యల్లో భాగంగానే ఈ లేఖ రాశారని కోర్టుకు నివేదించింది. భారీ జరిమానాతో ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరింది.

జగన్ కంపెనీలపై ఐటీ, ఈడీలతో విచారణ
టీడీపీ నేతలకు ప్రధాని హామీ..
అక్రమాల చిట్టా విప్పిన ఎంపీలు 

ముకుతాడు !
Jagan-askవైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని నైతికంగా, మానసికంగా, సాంకేతికంగా, చట్టపరంగా దెబ్బకొట్టేందుకు తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. అటు అధికార కాంగ్రెస్‌ పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ జగన్‌పై ఏకకాలంలో ముప్పేట దాడికి దిగాయి. జగన్‌ అక్రమాస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచా రణ జరిపిస్తామని ప్రధాని మనోహ్మన్‌ సింగ్‌ సోమవారం తెలుగుదేశం పార్ల మెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వర రావు నేతృత్వంలో తనను కలిసిన టీడీపీ ఎంపీల బృందానికి హామీ ఇచ్చారు. దానితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో జగన్‌పై ఇక కేంద్ర స్థాయిలోనూ ఉక్కుపాదం మొదలయిం దని స్పష్టమవుతోంది.

అదే సమ యంలో.. రాష్ట్ర హైకోర్టులో సైతం జగన్‌ అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని కోరుతూ టీడీపీ సీనియర్లు యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతి రాజు, బైరెడ్డి రాజశేఖరరెడ్డి వేసిన పిల్‌ను హైకోర్టు స్వీకరించింది. దీనితో జగన్‌పై ఇక ముప్పేట దాడి మొదల యినట్లుగా భావించక తప్పదు.
ఇటీవలే జగన్‌ అక్రమ ఆస్తులపై న్యాయ విచారణ జరపాలంటూ మంత్రి శంకర్‌రావు రాసిన లేఖను విచారణకు స్వీకరించిన హైకోర్టు నిర్ణయంతో ఖంగుతిన్న జగన్‌కు ఒకేరోజు రెండు ప్రతికూల పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి.

PMజగన్‌ తన తండ్రి రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదిం చిన లక్ష కోట్ల ఆస్తులపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ సోమవారం టీడీపీపీ నేత నామా నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఎంపీలు డాక్టర్‌ ఎం.వి.మైసూరారెడ్డి, మోదుగుల వేణు గోపాల్‌రెడ్డి, శివప్రసాద్‌, నారాయణ, సత్యనారాయణచౌదరి ప్రధాని మన్మో హన్‌సింగ్‌ను కలసి మూడు పేజీల వినతిపతిపత్రం సమర్పించారు. అం దులో.. జగన్‌కు చెందిన సాక్షి పత్రికలో పెట్టుబడులు, దానికి బోగస్‌ కంపెనీల మద్దతు, భారతి సిమెంట్‌ పెట్టుబడులు, రాష్ట్రంలో సెజ్‌లు, భూములు, పరిశ్రమలు తీసుకున్న వారి నుంచి సాక్షి సంస్థలకుతీసుకున్న పెట్టుబడుల వివరాలను పొందుపరిచారు.

రాజశేఖరరెడ్డి సీఎం కాకముందు జగన్‌ ఆదాయపన్ను శాఖకు సమర్పించిన డాక్యుమెంట్లు, సీఎం అయిన తర్వాత చెల్లిస్తున్న పన్నుల వివరా లను కూడా జతపరిచారు. జగన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించారు. వాటి ఆధారంగా జగన్‌ అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్‌ చేశారు. దానికి స్పందించిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌.. జగన్‌ అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణను తమంతట తాము జరిపించలేమని, రాష్ట్ర ప్రభుత్వం కోరితే విచా రణ చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఇది ఇన్‌కంటాక్స్‌కు సంబంధిం చిన వ్యవహారమ యినందున ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో విచారణ జరిపిస్తా మని హామీ ఇచ్చారు.

highcourtజగన్‌ అక్రమాస్తులు ఏవిధంగా సంపా దించారో నామా నాగేశ్వరరావు, ఇతర ఎంపీలు చెబుతున్న ప్పుడు ప్రధాని విస్మయం వ్యక్తం చేశా రు. ఇంత తక్కువ సమయంలో అన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని ఆశ్చ ర్యం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఈ స్థాయిలో ఆర్థిక దోపిడీ చేయడం తాను కూడా మొదటిసారి వింటున్నానని వ్యాఖ్యా నించారు. దానితో.. తాము వైఎస్‌ జీవించి ఉన్న సమయంలో ‘రాజా ఆఫ్‌ కరప్షన్‌’ పేరుతో పుస్తకా లు ముద్రించి, మీకు సైతం ఇచ్చామని, అప్పుడే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చే ది కాదని నామా నాగేశ్వరరావు ప్రధానితో అన్నారు.

దానికి ప్రధాని మౌనం వహించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. జగన్‌ అక్రమ ఆస్తులపై న్యాయ విచారణ జరిపించాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృ ష్ణుడు, ఎర్రన్నాయుడు, అళోక్‌గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాష్ట్ర హైకో ర్టులో వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సోమవారం హైకోర్టు స్వీకరించింది. అందులో.. జగన్‌, ఆయన కంపెనీలతో పాటు, సీబీఐ, ఏసీ బీలను ప్రతివాదులు గా చేర్చారు. మంగళవారం ఈ కేసు విచారణకు రానున్నట్లు సమాచారం. అందులో జగన్‌కు చెందిన సాక్షి మీడియా సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వారికి కేటాయించిన భూములు, సెజ్‌లు, కంపెనీల వివరాలు తమ ఆరోపణలకు సాక్ష్యాలుగా చూపారు.

తాజా పరిణామాలతో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్‌ జగన్‌కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. శాసనమండలి ఎన్నికల్లో తన అనుచర వర్గంతో కాంగ్రెస్‌ సర్కారుకు షాక్‌ ఇద్దామని ప్రయత్నిస్తున్న జగన్‌కు ఇది ఎదురుదెబ్బగానే భావించక తప్పదు. కేంద్రం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణను ప్రారంభిస్తే ఆర్ధిక మూలాలు, అవకతవకలన్నీ బయటపడక తప్పదు. ఫలితంగా.. జగన్‌ ప్రజల్లో అవినీతి పరుడిగా ముద్రవేయించుకునే ప్రమాదం లేకపో లేదు. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ అస్తశ్రస్త్రాలను ఇప్పటినుంచే సిద్ధం చేసుకుంటోంది. జగన్‌ను అవినీతిపుట్టగా ఇప్పటికే ఆరోపణాస్త్రాలు సంధి స్తున్న టీడీపీ.. ఇక ఆయన ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ విచారణ మొదలుపెడితే దానిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడం ఖాయం. జగన్‌ను ఓ అవినీతికేంద్రంగా చూపించడం ద్వారా ఆయనను నైతికంగా దెబ్బకొట్టి, ప్రజల్లో ఏహ్యభావం కలిగించాలన్న టీడీపీ వ్యూహానికి, ప్రధాని నిర్ణయం తోడయింది.

కాంగ్రెస్‌ను, ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని సవాలు చేసి బయటకు రావటంతో పాటు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను కుప్పకూల్చేందుకు పావులు కదుపుతున్న జగన్‌ను కాంగ్రెస్‌ పార్టీ సరైన సమయంలో దెబ్బకొట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. కాంగ్రెస్‌ నాయకత్వం ఇప్పుడు తన చేతికి మట్టి అట్టకుండా, తాను జగన్‌ను కావాలని వేధిస్తున్నానన్న భావన ప్రజల్లో కలిగించకుండా... టీడీపీ ఇచ్చిన ఫిర్యాదును అడ్డుపెట్టుకుని, తెలుగు దేశం పార్టీ భుజంపై తుపాకీ పెట్టి జగన్‌ వైపు గురి పెట్టినట్లు స్పష్టమవుతోంది.

వైఎస్ జగన్ కంపెనీల్లో అక్రమ నిధుల ప్రవాహం, వాటి మూలాలపై ఆదాయపు పన్ను విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లతో సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా ముందుకు వచ్చారు. ప్రజల ఆస్తులు, సహజ వనరులను లూటీ చేసిన కొద్దిమంది బడాబాబుల ద్వారా జగన్ కంపెనీల్లో అక్రమంగా ప్రవేశించిన పెట్టుబడులు, పలు చట్టాల ఉల్లంఘనపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా టీడీపీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యు డు మైసూరా రెడ్డి తదితరులు సోమవారం ప్రధానికి విన్నవించారు.

దీనిపై ఆయన అనూహ్యమైన రీతిలో స్పందించారు. "సీబీఐ విచారణ అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మొదలైన తతంగం ఉంటుంది. ఐటీ, ఈడీలతో విచారణ జరిపిస్తాను'' అని ప్రధాని చెప్పడంతో టీడీపీ ఎంపీలు ఆశ్చర్యచకితులయ్యా రు. 'రాజా ఆఫ్ కరప్షన్' పేరిట రాష్ట్రానికి చెందిన అన్ని ప్రతిపక్ష పార్టీలు 2009 ఫిబ్రవరిలోనే కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. "జగన్ కంపెనీల్లో అక్రమ పెట్టుబడులపై మరిన్ని సాక్ష్యాలతో ఈ ఏడాది జనవరిలో రాజ్యాంగ సంస్థలకు, నియంత్రణ ఏజెన్సీలకు మళ్లీ ఫిర్యాదు చేశాం.

జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లావాదేవీలపై ఐటీ అధికారులు చేసిన దర్యాప్తులో పలు కీలకాంశాలు బయటపడ్డాయని తెలిపారు. జగతిలో రూ. 15కోట్లు పెట్టుబడి పెట్టిన 8 కంపెనీలు బోగస్‌వని... ముంబై, రాజ్‌కోట్, బెంగళూరు, కోల్‌కతాలకు చెందిన ఆ కంపెనీల చిరునామాలు కూడా బోగస్‌వేనని తేలింది. జగతి పబ్లికేషన్స్‌లో రూ.743.57 కోట్ల పెట్టుబడికి 90 శాతం వాటా ఉంచుకోగా... మిగిలిన 10 శాతం వాటా కోసం వివిధ కంపెనీలు రూ.300.49 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి. సాక్షి పత్రికను ప్రారంభించకముం దే 35 రెట్లు అధిక ధరకు వాటా ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఐటీ కూడా ప్రశ్నించింది.

జగతి పబ్లికేషన్స్‌కు చెందిన భూమి, భవనాలు కూడా జగన్‌కు చెందిన మరో కంపెనీ జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు చెందినవని తెలిపింది. మాట్రిక్స్ లాబ్స్, పీవీ బిజినెస్ వెంచర్స్, హెటెరో గ్రూప్, అరబిందో ఫార్మా, రాంకీ గ్రూప్ మొదలైన కంపెనీలకు సెజ్‌లు, రేవులు, రియల్ ఎస్టేట్ నిబంధనల్లో సడలింపులు వంటి ప్రయోజనాలు సమకూర్చిన విషయం కూడా ఐటీ ఎత్తిచూపింది. వారు పెట్టిన 277.56 కోట్ల పెట్టుబడిని ఐటీ విభాగం అదనపు ఆదాయంగా భావించి రూ.122.78 కోట్ల పన్ను కట్టాలని ఆదేశించింది.

జగతి నష్టాలు రూ.349 కోట్లు దాటినప్పటికీ, గత రెండేళ్లలో ఇదే కంపెనీకి అంతే ప్రీమియంతో ఇవే కంపెనీల నుంచి రూ.1200 కోట్ల పెట్టుబడి రావడం, రూ.277.56 కోట్ల మేరకు అధికార దుర్వినియోగం జరగడాన్ని కూడా ఐటీ ఎత్తిచూపింది. జగన్‌కు చెందిన 35 కంపెనీల్లో ఆరేళ్లుగా ఇలా అక్రమ పెట్టుబడులు వచ్చాయి. లక్ష కోట్ల మేరకు మోసాలు జరిగాయి'' అని టీడీపీ ఎంపీలు ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.

2003-04లో జగన్ ఆదాయం కేవలం రూ.9.19లక్షలుకాగా... 2010-11లో తన ఆదాయం రూ.500 కోట్లు ఉంటుందంటూ రూ.84 కోట్ల అడ్వాన్స్ పన్ను చెల్లించారని తెలిపారు. అంటే, జగన్ ఆదాయం ఏటా 5 వేల శాతం పెరిగిందని తెలిపారు. "ఇంత ప్రగతి భారత కార్పొరేట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగం. ఉదాహరణకు భారతీ సిమెంట్స్‌లో జగన్ తొలి పెట్టుబడి రూ.45.18 కోట్లు. అది కేవలం రెండేళ్లలోనే రూ.3,053 కోట్లకు పెరిగింది.

దాల్మియా సిమెంట్స్ వంటి బడా కంపెనీలు జగన్ కంపెనీలో రూ.10విలువైన వాటాను రూ.1450 ప్రీమియంతో కొనుగోలు చేశాయి. ఈ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం గనులు, ఇతర కేటాయింపులద్వారా ప్రయోజనం చేకూర్చింది'' అని తెలిపారు. జగన్ కు చెందిన సండూర్, కార్మెల్ ఆసియా, జనని, సరస్వతి, క్లాసిక్ రియాల్టీ ఇలా ఒక్కో కంపెనీ కథనాల్ని టీడీపీ నేతలు ప్రధానికి వివరంగా తెలిపారు. ప్రధానిని కలిసిన ఎంపీల్లో సుజనా చౌదరి, హరికృష్ణ, వేణుగోపాల్ రెడ్డి, కొనకళ్ల నారాయణ తదితరులు ఉన్నారు.

ప్రభుత్వంపై అవినీతి మచ్చ

ధానిని కలిసిన తర్వాత నామా, మైసూరా విలేకరులతో మాట్లాడారు. 2జి స్పెక్ట్రమ్ నుంచి హసన్ అలీ వరకు జరిగిన కుంభకోణాలతో దేశ పరిపాలన వ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతిన్నదన్నారు. "వైఎస్ తన కుమారుడిని అత్యంత ధనికుడిగా చేసేందుకు పాల్పడిన అక్రమాలు అన్నీఇన్నీ కావు. మాకు వ్యక్తులు లక్ష్యం కాదు. అవినీతిపై పోరాటం ప్రతిపక్షాల విధి. జగన్ కొత్తగా పార్టీ పెట్టాడు కాబట్టి ఈ పోరాటం చేయడం లేదు. వైఎస్ ఉన్నప్పటి నుంచే చేస్తున్నాం'' అని మైసూరా తెలిపారు.

పదిహేను రోజుల కిందటే ప్రధాని అపాయింట్‌మెంట్ అడిగామన్నారు. కొందరు విలేకరులు నిష్పాక్షికంగా విధి నిర్వహణ చేయకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, పెట్టుబడిదారుల్లాగా ప్రశ్నలు అడుగుతున్నారని మైసూరా చురకలు అంటించారు.

Sunday, March 13, 2011

జెండానే ఎజెండా * ఇడుపులపాయలో ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ పతాకావిష్కరణ

మహానేత పాదాల చెంత ఆవిష్కరించిన వైఎస్ జగన్, విజయమ్మ
ప్రజా ఎజెండాను ప్రతిఫలించిన పార్టీ జెండా
రాజశేఖరుడి స్వర్ణయుగ పునరాగమన సూచికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతాకం
యువజన.. దళిత, శాంతి, రైతు రాజ్యానికి ప్రతీకగా 3 రంగులు
వైఎస్ ప్రవేశపెట్టిన 9 పథకాలను ప్రతిబింబించేలా చిహ్నాలు
జెండా మధ్యలో నవ్వుతూ కనిపించే రాజశేఖరుడి చిత్రం
పతాకావిష్కరణకు పోటెత్తిన అభిమానులు..
భారీగా తరలివచ్చిన నేతలు
అడుగుతీసి అడుగు వేయలేనంతలా అభిమాన తాకిడి


ప్రజా సౌభాగ్యాన్ని కాంక్షించే త్రివర్ణాలు.. బడుగు బతుకుల్లో వెలుగులు నింపిన నవ రత్నాల్లాంటి తొమ్మిది సంక్షేమ పథకాలు... పేదల మోముల్లో చిరునవ్వులు నింపిన ‘స్వర్ణయుగకర్త’ చిరు దరహాసం.. మొత్తంగా పేదోడి సంక్షేమమే ఎజెండాగా ‘వైఎస్సార్ కాంగ్రెస్’ పార్టీ జెండా రూపుదిద్దుకుంది. రాజకీయ పార్టీలు ప్రజలకు తామేంచేసేదీ ఎన్నికలనాడు మ్యానిఫెస్టోల్లోనే చెబుతుండగా.. యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం జెండాలోనే ‘ప్రజా అజెండా’ను స్పష్టంగా చెప్పారు. రామరాజ్యాన్ని తలపించిన రాజశేఖరుడి పాలనను మళ్లీ తెస్తానని విస్పష్టంచేశారు. శనివారం ఇడుపులపాయలో మహానేత పాదాల చెంత, ఉవ్వెత్తున తరలివచ్చిన అభిమాన సందోహం మధ్య యువనేత జగన్, తల్లి విజయమ్మ కలిసి భవిష్యత్ స్వర్ణయుగ పతాకాన్ని ఆవిష్కరించారు.



అభిమాన సునామీ..

జెండాలో యువజన, దళిత, శాంతి, రైతు రాజ్యానికి చిహ్నంగా నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉండగా.. ఆ మధ్యలో.. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదో ఒక లబ్ధి కలిగేలా వైఎస్సార్ ప్రవేశపెట్టిన తొమ్మిది పథకాలను (ఇందిరమ్మ ఇళ్లు, *2కే కిలో బియ్యం, జలయజ్ఞం, ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్స్‌మెంట్, భూ పంపిణీ, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, పింఛన్లు) తొమ్మిది గుర్తులతో ప్రతిబింబించారు. ఆ పథకాల మధ్యలో చిరునవ్వులు చిందిస్తోన్న మహానేత వైఎస్సార్ చిత్రాన్ని ఉంచారు. ఈ జెండా ఆవిష్కరణ విషయాన్ని, పార్టీ పేరును శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సభలో ప్రకటించడంతో రాష్టవ్య్రాప్తంగా అభిమానుల్లో వెల్లువెత్తిన భావోద్వేగం శనివారం ఇడుపులపాయలో ప్రతిబింబించింది. రాష్ట్రం నలుమూలల నుంచీ పోటెత్తిన అభిమానుల తాకిడి జన సునామీని తలపించింది. జెండాను ఆవిష్కరించిన యువనేత వైఎస్ జగన్, ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు, ఇతర నేతలు ఒక్కక్షణం కూడా స్థిమితంగా నిలబడలేనంతగా అభిమానుల తాకిడి వారిని కుదిపివేసింది.

అడుగు తీసి అడుగు వేయడమే అతికష్టం..

యువనేత జగన్ శనివారం ఉదయం తొలుత పులివెందులకు చేరుకున్నారు. అక్కడ ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం హెలికాప్టరులో ఇడుపులపాయ చేరుకున్నారు. యువనేత వెంట హెలికాప్టర్‌లో ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మమ్మ, సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్‌కుమార్ వచ్చారు. హెలికాప్టర్ దిగిన వెంటనే జగన్ ఇడుపులపాయలోని తమ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అప్పటికే వివిధ జిల్లాల నుంచిగెస్ట్‌హౌస్‌కు చేరుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులను యువనేత పలుకరించారు. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచివైఎస్ జగన్, వైఎస్ విజయలక్ష్మమ్మలతో పాటు నేతలంతా వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడికి వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలు, అభిమానులు యువనేతను దగ్గరి నుంచి చూసేందుకు, కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపడంతో ఆయన అడుగు ముందుకు వేయడం అతికష్టమైంది. వాహనం దిగిన యువనేత కొద్ది అడుగులు వేసి సమాధి వద్దకు చేరడానికి, అభిమానుల తాకిడి వల్ల విపరీతమైన ఆలస్యం జరిగింది. సమాధి వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించిన తరువాత, తోపులాట, హర్షధ్వానాల మధ్య ‘వైఎస్సార్ కాంగ్రెస్’ పార్టీ జెండాను యువనేత ఆవిష్కరించారు.

అభిమానుల తాకిడితో పతాకాన్ని కొద్దిసెకన్లు మాత్రమే ప్రదర్శించడంతో ఈ దృశ్యం మీడియా కెమెరాలకు దొరకడమే కష్టమైపోయింది.

అనుకున్న ముహూర్తానికే ఆవిష్కరణ

ముందుగా నిర్ణయించిన ముహూర్తం మధ్యాహ్నం 2.29గంటలకే పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన జన సందోహం తాకిడితో, ముహూర్త సమయానికి పతాకావిష్కరణ జరుగుతుందో, లేదోననే సంశయం పటాపంచలైంది. యువనేత వైఎస్ జగన్ తదితరులంతా ముహూర్త సమయానికి అరగంట ముందే వైఎస్సార్ సమాధి వద్దకు చేరుకోవడంతో, అభిమానుల తాకిడి, తోపులాటలు ఉన్నా, అనుకున్న సమయానికి పతాకాన్ని ఆవిష్కరించగలిగారు.

తరలివచ్చిన నేతలు

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల్లో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కాట సాని రామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, శోభానాగిరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, కె.శ్రీనివాసులు, కమలమ్మ, కాపు రామచంద్రారెడ్డి, గురునాథరెడ్డి, అనంతపురం జడ్పీ చైర్‌పర్సన్ తోపుదుర్తి కవిత, చిత్తూరు జడ్పీ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కొండా మురళి, పుల్లా పద్మావతి, మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, మారెప్ప, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, గడికోట మోహన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, భూమన కరుణాకర్‌రెడ్డి, గోనె ప్రకాశరావు, గట్టురామచంద్రరావు, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, నెల్లూరు మాజీ డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, కడప మాజీ డీసీసీ అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, పీసీసీ ఎస్టీ సెల్ మాజీ కన్వీనర్ రాజమల్ల సిద్ధేశ్వర్ తదితరులున్నారు.


స్వర్ణయుగ సంకేతం
పొడుస్తున్న పొద్దును, కొత్త నమ్మకాన్ని తలపించేలా వైఎస్‌ఆర్ చుట్టూ నారింజ రంగు వలయాకారంలో... దివంగత నేత ప్రవేశపెట్టిన 9 సంక్షేమ పథకాల అమలు బాధ్యతను గుర్తుచేసే చిహ్నాలు

నీలం..
మహానేతకు ఇష్టమైన నీటి రంగు
యువ చైతన్యం, దళితుల
ఆత్మగౌరవానికి చిహ్నం

తెలుపు
శాంతికి, స్వచ్ఛతకు చిహ్నం

ఆకుపచ్చ
వైఎస్ కలగన్న హరితాంధ్రప్రదేశ్
మైనార్టీ మహాశక్తి, మానవీయ స్ఫూర్తి

పేదవాడి సంక్షేమమే ఎజెండాగా, బాధ్యతకు ప్రతిరూపంగా కనిపించేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రూపుదిద్దుకుంది. శనివారం మధ్యాహ్నం 2.29 గంటలకు ఆవిష్కృతమైన ఈ జెండా స్వర్ణయుగానికి సంకేతమని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా జెండా విశిష్టతలను వివరించాయి. నీలం, ఆకుపచ్చ మధ్యలో తెలుపు రంగులతో జెండాను రూపొందించారు. మధ్యలో ఉన్న తెలుపు రంగులో కేంద్ర బిందువుగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కనిపిస్తారు. పొడుస్తున్న పొద్దును, ఒక కొత్త నమ్మకాన్ని, స్వర్ణయుగాన్ని తలపించేలా వైఎస్సార్ చుట్టూ నారింజ రంగు కనిపిస్తుంది. నారింజ రంగు చుట్టూ వలయాకారంలో దివంగత నేత ప్రవేశపెట్టిన తొమ్మిది సంక్షేమ పథకాలకు సంకేతంగా చిహ్నాలున్నాయి.


జెండాలో సంక్షేమ రూపాలివీ..

నిరుపేదలందరికీ నిలువ నీడ కోసం ఇళ్లు, రెండు రూపాయలకే కిలో బియ్యం, రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ప్రాజెక్టుల నిర్మాణం, రైతన్నకు వెన్నంటి ఉండాలన్న లక్ష్యంతో ఉచిత విద్యుత్తు, ప్రతి నిరుపేద విద్యార్థి ఉన్నతవిద్య కలను నిజం చేసే ఫీజు రీయింబర్స్‌మెంట్, భూమిలేని ప్రతిపేద రైతుకు భూపంపిణీ, ఆరోగ్యశ్రీ కింద మరింత మెరుగైన ఉచిత వైద్యం, మహిళలకు పావలా వడ్డీ, వృద్ధులకు పింఛన్లతో సహా అన్ని రకాల ఆసరా కల్పించడం... వంటి అత్యంత కీలకమైన సంక్షేమ పథకాలను అమలు చేయడానికి పార్టీ బాధ్యతను నిరంతరం గుర్తుచేసేలా జెండాలో వాటి చిహ్నాలను పొందుపరిచారు.

జెండా పొడవు-వెడల్పుల నిష్పత్తి-2:3

జెండాలో నీలం, ఆకుపచ్చలు ఇరువైపులా చెరొక భాగం ఉంటే.. మధ్యలో తెలుపురంగు రెండింతలు ఉంటుంది. ఈ తెలుపు రంగులోనే తొమ్మిది పథకాల చిహ్నాలు, వాటి మధ్య చిరునవ్వుతో నమ్మకానికి ప్రతిరూపంగా వైఎస్సార్ చిత్రం కనిపిస్తుంది.



 అంబరాన్ని తాకిన సంబరం * 
 జన పార్టీకి ఘన స్వాగతం

రాష్టవ్య్రాప్తంగా వెల్లువెత్తిన హర్షాతిరేకాలు
ర్యాలీలు, సభలు, ప్రదర్శనలు
మహానేత విగ్రహాలకు క్షీరాభిషేకాలు


వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రాష్ట్ర ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపింది. రాష్టవ్య్రాప్తంగా బడుగు బలహీన వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నగరాలు, జిల్లా, మండల కేంద్రాల్లో కొత్త పార్టీకి స్వాగతం పలుకుతూ బాణసంచాలు కాల్చారు. ర్యాలీలు, సభలు నిర్వహించారు. కేకులు కట్ చేసి ఆనందం పంచుకున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధ న జగన్ వల్లే సాధ్యమని నినదించారు. పలుచోట్ల వైఎస్ అభిమానులు స్వచ్ఛందంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించుకున్నారు. విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఆదివారం పెద్దఎత్తున ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

జిల్లాల్లో పండగ వాతావరణం..

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వైఎస్సార్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పతాకాన్ని ఆవిష్కరించారు. కాకినాడలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరులు నృత్యాలు చేస్తూ, డప్పులు వాయిస్తూ బాణసంచా కాల్చారు. పిఠాపురంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి సెంటర్‌లో వైఎస్‌ఆర్ విగ్రహం సాక్షిగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాలతో పాటు వివిధ ప్రాంతాల్లో యువకులు ర్యాలీ నిర్వహించారు. విశాఖలోని సంపత్ వినాయక దేవస్థానంలో జగన్ యువసేన, విద్యార్థి సేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరి కాయలు కొట్టారు. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల మండలం మొయిదలో మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లాలో గ్రామగ్రామాన వేడుకలు జరుపుకున్నారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్ సర్కిల్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించి బాణసంచా కాల్చారు.

ఇచ్చాపురం, సోంపేట, పలాసల్లో ప్రదర్శనలు చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో బైక్ ర్యాలీ, చిలకలూరిపేట, రావులపాలెం, పురుషోత్తమ పట్టణాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు చేశారు. రేపల్లెలో అంబటి రాంబాబు నివాసం వద్ద నాయకులు సంబరాలు జరిపారు. ప్రకాశం జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ అభిమానులు సందడి చేశారు. బాణాసంచా పేలుళ్లు, స్కూటర్ ర్యాలీలతో కృష్ణా జిల్లా మార్మోగింది. విజయవాడలో అభిమానులు బస్సులో ప్రయాణికులకు స్వీట్లు పంచారు. పాతబస్టాండ్ వద్ద పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జోగి సురేష్ తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.

అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున అభిమానులు సంబరాల్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో నేతలంతా ఇడుపులపాయలో పతాకావిష్కరణకు వెళ్లడంతో అభిమానులు, కార్యకర్తలే సొంతంగా సంబరాలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఇలాకా అయిన కల్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సందడి చేశారు. బాణసంచా పేల్చి.. పార్టీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో వికలాంగులు బాణసంచా కాల్చారు. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పీలేరు నియోజవర్గ కేంద్రం జగన్నినాదాలతో దద్దరిల్లింది. తిరుపతిలో అలిపిరి వద్ద మహిళలు టెంకాయలు కొట్టి పూజలు చేశారు. తిరుమలలో అఖిలాండం వద్ద అభిమానులు 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. కర్నూలు జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు చెందిన నేతలంతా స్మృతివనం వద్దకు చేరుకుని మహానేతకు నివాళులు అర్పించారు. కర్నూలు, నంద్యాల, మంత్రాలయం నియోజకవర్గాల్లో మహిళలు, ముస్లిం సోదరులు బాణసంచా కాల్చారు. మహబూబ్‌నగర్‌లో కార్యకర్తలు రోడ్లపైకి వ చ్చి సంబరాలు చేసుకున్నారు. వరంగల్‌లో కలెక్టరేట్ ఎదుట ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి జగన్ యువసేన ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. కురవిలో కార్యకర్తలు మోకాళ్లపై నడిచి వీరభద్రస్వామికి మొక్కులు సమర్పించుకున్నారు.

నల్లగొండ జిల్లా కోదాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పతాకాలు చేతపట్టి, డప్పు వాయిద్యాలతో ప్రదర్శన చేశారు. ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించిన అభిమానులు అనంతరం తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. హౌజింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర వృద్ధుల అనాథాశ్రమంలో అన్నదానం చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, నిర్మల్, లక్సెట్టిపేట్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాల్లో మేళాలతో ఊరేగింపు నిర్వహించారు. ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్’ పార్టీకి అంతా మంచే జరుగుతుందని చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు ఆశీర్వదించారు. శనివారం యువనేత జెండాను ఆవిష్కరించే సమయంలో అభిమానులు చిలుకూరు బాలాజీ దేవాలయంలో పూజలు నిర్వహించారు.

సాగర్ సొసైటీలో కోలాహలం..

హైదరాబాద్ సాగర్ సొసైటీలోని యువనేత క్యాంపు కార్యాలయం వద్ద అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఉదయం నుంచే అక్కడికి చేరిన వందలాది మంది పార్టీ పతాకం ఆవిష్కరణ సమయానికి కార్యాలయంలో కేక్ కోసి పంచారు. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద పోతుల ప్రసాద్ ఆధ్వర్యంలో అభిమానులు బాణసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారు.


వైఎస్సార్ కాంగ్రెస్’ జెండా ఆవిష్కరణ
YSR CONGRESS
989 20381
YSR CONGRESS
989 20380
YSR CONGRESS
989 20379
YSR CONGRESS
989 20378
YSR CONGRESS
989 20377
YSR CONGRESS
989 20376
YSR CONGRESS
989 20375
YSR CONGRESS
989 20374
YSR CONGRESS
989 20373
YSR CONGRESS
989 20372
YSR CONGRESS
989 20371
YSR CONGRESS
First                                                         Last               

Friday, March 11, 2011

‘ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ’ * జగ్గంపేట సభ వేదికగా పార్టీ పేరు ప్రకటించిన వైఎస్ జగన్


నేడు మధ్యాహ్నం 2:29 గంటలకు జెండా ఆవిష్కరణ
పార్టీకి మూడు రంగుల జెండా ఉంటుంది
ఇడుపులపాయలో నాన్న పాదాల చెంత నేను, అమ్మ కలిసి ఆవిష్కరిస్తాం


ఈ పార్టీ ఎలా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు
ప్రతి పేదోడి మొహాన చిరునవ్వు చూసే పార్టీ అవుతుంది
పార్టీ ప్రకటన కార్యక్రమం ఘనంగా నిర్వహించాలనుకున్నాం
జిల్లాలో ఎన్నికల కోడ్ వల్ల అది వీలుకాలేదు
కడప ఉప ఎన్నికలయ్యాక ఘనంగా సభ పెట్టుకుందాం
ఎన్నికలయ్యాక ఇడుపులపాయలో రెండు రోజుల ప్లీనరీ
మేధో మథనం చేసి పార్టీ విధివిధానాల రూపకల్పన
మూడో రోజు అందరి సమక్షంలో వాటిని ప్రకటిస్తాం



కోట్లాది మందిలో ఎన్నాళ్ల నుంచో నెలకొన్న ఉత్కంఠకు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెరదించారు. పేదల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా తాను ఏర్పాటు చేయబోయే పార్టీ పేరును ప్రకటించారు. తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరిట ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని సాక్షిగా, అభిమానుల హర్షధ్వానాల మధ్య యువనేత పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్లూ ఇడుపులపాయలోనే పార్టీ పేరు ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్న తరుణంలో.. ఇలా అనూహ్యంగా జగ్గంపేటలో ప్రకటించే సరికి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. పార్టీకి మూడు రంగుల జెండా ఉంటుందని, దాన్ని శనివారం ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ పాదాల చెంత ఆవిష్కరిస్తామని జగన్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పీఆర్‌పీ అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, జిల్లా మహిళా రాజ్యం అధ్యక్షురాలు రొంగలి లక్ష్మి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితర ముఖ్యనాయకులు.. జగన్ పార్టీలో చేరుతున్నట్లు ఈ సభలో ప్రకటించారు.

‘ప్రజా పుష్కరం’గా నామకరణం చేసిన ఈ సభకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 06:33 నిమిషాలకు జగన్ ప్రసంగించడానికి లేవగానే అభిమానులు చేతులు పెకైత్తి జేజేలు కొట్టారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ప్రజా సంక్షేమ ప్రభుత్వ స్థాపన కోసం మరో సంవత్సరమో, రెండు సంవత్సరాలో జరుగబోయే పోరుబాటలో నాతోపాటు అడుగులో అడుగువేసి పోరాటం చేయడానికి ఇక్కడ ఒక్కటైన జ్యోతుల నెహ్రూ, దొరబాబు, పద్మమ్మలకు, ముఖ్యంగా జగ్గంటపే సోదరులందరికీ, అక్కా చెల్లెళ్లకు, అవ్వలకు, తాతలకు, మీ ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరునా కృతజ్ఞతలు చెప్తున్నాను.

పార్టీ తొలి కండువా నెహ్రూకే..

ఇవాళ నెహ్రూ అన్న చేరికలో ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ స్థాపించిన తర్వాత.. మొట్టమొదటి కండువా వేస్తున్నది జ్యోతుల నెహ్రూకే. తర్వాత పెండెం దొరబాబు, వాసిరెడ్డి పద్మలకే. ఈ రోజు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది.. ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పాలనిపిస్తోంది.. రేపు(శనివారం) మధ్యాహ్నం 2:29 నిమిషాలకు ఇడుపులపాయలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదాల చెంతన పార్టీకి సంబంధించి మూడు రంగుల జెండాను నేను, నా తల్లి విజయలక్ష్మిగారు కలిసి ఆవిష్కరిస్తాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనుకున్నా వైఎస్సార్ జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉంది.. ఎన్నికల నియమావళిని గౌరవించాలి.. కడప ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఏర్పాటు కార్యక్రమాన్ని గొప్పగా వైఎస్సార్ పాదాల చెంతన జరుపుకొందాం.

నేడే జగన్ పార్టీ
విజయమ్మ సమక్షంలో ఇడుపులపాయలో ప్రకటన

జగ్గంపేట బహిరంగసభలో తెలిపిన జగన్
నీలం తెలుపు ఆకుపచ్చ రంగుల్లో జెండా ,,మధ్య వైఎస్ బొమ్మ

తన తండ్రికి అత్యంత ప్రీతిపాత్రమైన ఇడుపులపాయ ఎస్టేట్‌లో... తల్లి విజయమ్మ సమక్షంలో.. శనివారం మధ్యాహ్నం సరిగ్గా 2.29 గంటలకు పార్టీ వ్యవస్థాపక ప్రకటన చేయనున్నట్లు మాజీ ఎంపీ వైఎస్ జగన్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ విషయం చెప్పారు. "ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ పాదాల చెంతన మూడు రంగుల జెండాను నేను, నా తల్లి విజయలక్ష్మి ఆవిష్కరిస్తాం. కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల తర్వాత ఇడుపులపాయలోనే ప్లీనరీ నిర్వహిస్తాం.

విధి విధానాలు ప్రకటిస్తాం'' అని జగన్ పేర్కొన్నారు. జగ్గంపేట సభలో జ్యోతుల నెహ్రూ చేరికకు ఒక ప్రత్యేకత ఉందని, వైఎస్సార్ కాంగ్రెస్ అని చెప్పిన తర్వాత మొదటి కండువా నెహ్రూ అన్నకు, తర్వాత దొరబాబన్నకు, పద్మమ్మకు వేశానని జగన్ ఆనందం వ్యక్తం చేశారు. యువజన, శ్రామిక, రైతులను ప్రతిబింబించేలా.. పార్టీ జెండాలో నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులుంటాయని, మధ్యలో వైఎస్ బొమ్మ ఉంటుందని జగన్ వర్గ నేతలు చెబుతున్నారు.

దగా చేసిన చిరు: నెహ్రూ

మార్పు కోసం అంటూ ఆర్భాటం చేసిన చిరంజీవి తమను దారుణంగా దగా చేశారని పీఆర్పీ జిల్లా అధ్యక్ష పదవి నిర్వహించిన జ్యోతుల నెహ్రూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో జ్యోతులతో పాటు వాసిరెడ్డి పద్మ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పీఆర్పీ నాయకులు రొంగల లక్ష్మి, శెట్టిబత్తుల రాజబాబు తదితరులు జగన్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. సభలో ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, గొల్ల బాబూరావు, పలువురు నేతలు పాల్గొన్నారు.

ఇన్నాళ్లూ గుట్టుగా ఉంచిన పార్టీ ఆవిర్భావ ముహూర్తాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నట్టుండి జగన్ ప్రకటించడంతో ఇడుపులపాయలో సంద డి నెలకొంది. శనివారం ఇడుపులపాయలో జరిగే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సుమారు 5 నుంచి 10 వేల మంది వరకు అభిమానులు, కార్యకర్తలు రావచ్చని జగన్ వర్గీయులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని ఆయన అనుచర ఎమ్మెల్యేలు ఐదుగురే కాకుండా ఇతర జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరవుతారని కూడా తెలుస్తోంది.

తొలుత పది లక్షల మందితో భారీగా పార్టీని ప్రకటించాలనుకున్నా, కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని సాదాసీదాగానే నిర్వహించాలని నిర్ణయించారు. చిరంజీవి తిరుపతిలో భారీ సభ నిర్వహించి పార్టీని ఏర్పాటు చేసినా రాణించలేదని, ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 2వేలమందితో పార్టీని ప్రకటిస్తే పార్టీ అధికారంలోకి వచ్చిందని జగన్ వర్గం చర్చించుకున్నట్లు తెలిసింది.

ప్రతి పేదోడి మొహాన చిరునవ్వు చూసే పార్టీ
దివంగత నేత పాదాల చెంత స్థాపించబోయే పార్టీ ఎలా ఉంటుందా అని మొత్తం ప్రజానీకం ఎదురు చూస్తోంది. ఒక్కమాట మట్టుకు నేను చెబుతున్నా. ప్రతి పేదవాడి మొఖానచిరునవ్వును చూసే పార్టీ అవుతుందని చెబుతున్నా. పార్టీకి సంబంధించిన విధివిధానాల రూపకల్పన కోసం కాసింత సమయం తీసుకొని ఎన్నికలయ్యాక ఇడుపులపాయలో ప్లీనరీ సమావేశాలు జరుపుతాం. ప్రతి పేదవాడి మొఖాన ఏవిధంగా చిరునవ్వు చూడాలని రెండు రోజుల పాటు మేధోమథనం చేశాక.. మూడో రోజున ప్రతిసోదరుడు, స్నేహితుడు, అక్కాచె ల్లెళ్ల మధ్య, అవ్వా తాతల మధ్యన విధివిధానాలను గొప్పగా ప్రకటించుకుందాం.
 
జగ్గంపేటలో చరిత్రాత్మక ప్రకటన
అనూహ్యంగా పార్టీ పేరు ప్రకటించిన జగన్
అభిమానుల హర్షం

  రాజకీయ అనిశ్చితితో అనాథగా మారిన రాష్ట్రానికి ఆశాకిరణంగా రాబోతున్న పార్టీ అది.. పార్టీ పేరేంటి? ఎప్పుడు? ఎక్కడ దాన్ని ప్రకటిస్తారు?.. అని జనమంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ చరిత్రాత్మక ప్రకటనకు వేదికగా మారే అవకాశం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట సభకు దక్కింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం నచ్చని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తదితరులు జగన్ పెట్టబోయే పార్టీలో చేరడానికి జగ్గంపేటలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలానికి ‘విజయ ప్రాంగణం’గా నామకరణం చేసి ‘ప్రజా పుష్కరం’ సభగా దానికి పేరు పెట్టారు. దీనికి జగన్ అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. వేదికపై జగన్ పెట్టబోయే పార్టీలో చేరుతున్నట్టు నెహ్రూ ప్రకటించారు. నెహ్రూతో పాటు పీఆర్పీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలో చేరారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. అనూహ్యంగా పార్టీ పేరును ‘వైఎస్సార్ కాంగ్రెస్’ అని ప్రకటించడంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు.

ఆ ఇంట భోంచేస్తే..
ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉదయం 11.45 గంట లకు మధురపూడి విమానాశ్రయం చేరుకున్న జగన్ అక్కడి నుంచి జగ్గంపేట మండలం మల్లిసాల చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మె ల్యే నల్లమిల్లి శేషారెడ్డి పాల్గొన్నారు. ఆ గ్రామంలో అత్తులూరి నాగబాబు ఇంట జగన్ మధ్యాహ్నం భోజనం చేశారు. ఆ ఇంట భోజనం చేసిన వారు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అవుతారన్నది గ్రామస్తుల నమ్మకం. వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్యలు ఇక్కడ భోజనం చేసిన తరువాత ముఖ్యమంత్రులు అయ్యారని, ఆ సెంటిమెంట్ కొనసాగుతుందని వారంటున్నారు.

తొలి కండువా..: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు ప్రకటించాక తొలి కండువాను నెహ్రూకు, తర్వాత వాసిరెడ్డి పద్మకు కప్పడం ఈ రోజు ప్రత్యేకతని జగన్ చెప్పారు. ఆ మాట వినగానే జనం ఎగిరి గంతేశారు. సభ అనంతరం జగన్ ఇర్రిపాకలోని జ్యోతుల నెహ్రూ ఇంటికి వెళ్లి భోజనం చేశారు. అక్కడి నుంచి రాజమండ్రి చేరుకుని స్నేహితుడు అడపా వేణు చిన్నాన్న రాజేంద్ర కుమార్తె వివాహానికి హాజరయ్యారు. వధూవరులు శ్రీయ, శరత్‌లను ఆశీర్వదించారు.

నిరంతరం జగన్ వెంటే...
జ్యోతుల నెహ్రూ, వాసిరెడ్డి పద్మ తీసుకున్న నిర్ణయం శాస్ర్తీయమైనది. ప్రజల్లో నిరంతరం ఉండే జగన్ వెంట ఉంటామని వారు ప్రకటించారు. జగన్ పేరు చెబితేనే కొంత మంది ప్యాంట్‌లు తడిసిపోతున్నాయి. ఎవరొచ్చినా రాకపోయినా వైఎస్ సంక్షేమ పథకాలు అనుభవించిన వారి అండ జగన్‌కు ఉంటుంది.
- ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్

అందుకే వైఎస్ అంటే అభిమానం
ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినందుకే జనం వైఎస్‌ను అంతగా అభిమానిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం దేశంలో మరెక్కడా లేని విధంగా ఆయన అమలు చేశారు. ఆ పథకాలు కొనసాగాలంటే ఆయన తనయుడే చేయగలడనే నమ్మకంతోనే ప్రజలు జగన్ వెంట నడుస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రిగా ఆయనను దీవిస్తున్నారు.
- మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్
ముహూర్త బలం కోసమే... 
అకస్మాత్తుగా పార్టీ పేరు ప్రకటించిన జగన్
నియమావళి నేపథ్యంలో నేడు జెండా ఆవిష్కరణ

ఒకవైపు ఎన్నికల నియమావళి అమలులో ఉండటం, మరోవైపు ముహూర్తబలం బాగుం డటం వంటి కారణాలతో యువనేత జగన్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ పేరును ప్రకటించారు. పార్టీ, జెండా ఆవిష్కరణ వంటి అత్యంత కీలకమైన కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టాలని జగన్ అభిమానులు, మద్దతుదారులు, రాష్టవ్య్రాప్తంగా అనేక మంది నాయకులు ఎప్పటినుంచో కోరుతున్నారు. దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా పెద్దఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. దీనికోసం కొందరు అనువైన తేదీలు, ప్రాంతాన్ని కూడా సూచిస్తూ పలు నివేదికలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కోడ్ (ఎన్నికల నియమావళి) అమలులో ఉన్న కారణంగానే జగన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఆకస్మాత్తుగా పార్టీ పేరును ప్రకటించారని ఆయన సన్నిహితులు చెప్పారు. ముహూర్తబలం బాగుందన్న ఉద్దేశంతోనే శనివారం మధ్యాహ్నం 2.29 గంటలకు ఇడుపులపాయలో దివంగత నేత పాదాలచెంత జెండాను ఆవిష్కరిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వైఎస్‌ఆర్ జిల్లాలో స్థానిక సంస్థల నుంచి ఎన్నుకోవాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది.

జెండా ఆవిష్కరణ ముహూర్తం గురించి ముందే ప్రకటన చేస్తే ఇడుపులపాయకు లక్షలాదిగా జనం, అభిమానులు, నేతలు తరలివచ్చే అవకాశం ఉంది. అయితే కోడ్‌ను విధిగా పాటించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే అతి తక్కువ సమయంలో పార్టీ పేరును, జెండా ఆవిష్కరణ ముహూర్తాన్ని జగన్ ప్రకటించారని ఆయన సన్నిహితులు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ ఉపఎన్నికల షెడ్యూలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మళ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఆ ఉపఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయిన తర్వాత ఇడుపులపాయలో భారీస్థాయిలో పార్టీ ప్లీనరీని ఏర్పాటు చేసుకోవాలన్నది జగన్ అభిమతమని ఆయన సన్నిహితులు చెప్పారు. ‘‘మూడు రంగుల జెండాను నేను, నా తల్లి విజయలక్ష్మి గారు.. ఇద్దరం రేపు (శనివారం) ఆవిష్కరిస్తాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనుకున్నా జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉంది.. ఎన్నికల నియమావళిని గౌరవించాలి... కడప పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గొప్పగా వైఎస్సార్ పాదాల చెంతన పార్టీ కార్యక్రమం జరుపుకొందాం’’ అని జగ్గంపేట సభలో జగన్ తెలిపారు.
ఆశల రూపం... ఆవిష్కరణ సంబరం
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో శుక్రవారం జరిగిన ప్రజాపుష్కరం సభలో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను స్థాపించబోయే ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ పేరును ప్రకటించి, శనివారంనాడు కొత్త పార్టీ పతాకాన్ని ఇడుపులపాయలో ఆవిష్కరిస్తానని వెల్లడించడం ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.టీవీల ద్వారా ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్, జగన్ అభిమానులు పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు. గుంటూరు జిల్లా కేంద్రంతో పాటు తెనాలి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, సత్తెనపల్లిల్లో జగన్ కటౌట్‌లను ఊరేగించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బాణసంచా కాల్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నేత గౌతంరెడ్డి ఇంటి వద్ద అభిమానులు స్వీట్లు పంచారు. గన్నవరం మండలంలో బాణసంచా కాల్చారు.

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో పీసీసీ మాజీ కార్యదర్శి వజ్జ బాబూరావు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సందడి చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో పండుగ వాతావరణం కనిపించింది. కొన్నిచోట్ల యువకులు రోడ్లపైకి వచ్చి నృత్యం చేశారు. అనంతపురం జిల్లావ్యాప్తంగా బాణసంచా కాల్చి నూతన పార్టీకి స్వాగతం పలికారు. తిరుపతిలో చెవిరెడ్డి భాస్కరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కర్నూలు జిల్లాలోని ప్రధాన పట్టణాల తో పాటు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఇంటి వద్ద వైఎస్ అభిమానులు మిఠాయిలు పంచుకున్నారు.

ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అనుచరులు బాణసంచా కాల్చారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో అభిమానులు బాణసంచా కాల్చారు. నల్లగొండ జిల్లాలో ర్యాలీలు నిర్వహించి స్వీట్లు పంచారు. హుజూర్‌నగర్‌లో బాణసంచా కాల్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జగన్ అభిమానులు బాణాసంచా కాల్చారు. పాలమూరులో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అభిమానులకు స్వీట్లు పంచారు. ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు.