Showing posts with label K.V.P.Ramchandra Rao. Show all posts
Showing posts with label K.V.P.Ramchandra Rao. Show all posts

Thursday, December 23, 2010

కింకర్తవ్యం ? * పగ్గాలివ్వండి.. జగన్‌ను అణిచేస్తా

fast-end
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ఎసరు తెచ్చేందుకు పరోక్ష ప్రయత్నాలకు తెరలేపిన జగన్‌ను అణచివేసేందుకు వ్యూహరచన చేస్తున్న సమయంలోనే.. తన పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు జగన్‌ విజయవాడలో నిర్వహించిన లక్ష్యదీక్షకు హాజర యిన వైనం అధిష్ఠానాన్ని ఆలోచనలో పడవేసింది.కేవలం ఏడుగురు ఎమ్మెల్యేల మెజారిటీ బలం ఉన్న కిరణ్‌కుమార్‌ ప్రభుత్వానికి ఈ 30 మంది ఎమ్మె ల్యేలు ఏ సందర్భంలోనయినా ఒకవేళ మద్దతు ఉపసంహరించుకున్నట్టయితే ప్రభుత్వం కుప్ప కూలిపోతుందన్న భయాందోళన కాంగ్రెస్‌ నాయక త్వాన్ని పట్టి పీడిస్తోంది. దీనితో జగన్‌కు మద్దతు నిస్తున్న ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసు కోవాలి? తీసుకుంటే తలెత్తనున్న పరిణామాలే మిటి? అన్న అంశాలపై అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.

ఈ నేపథ్యంలో మరికొద్దిరోజుల్లో ఢిల్లీ నుంచి పార్టీ ప్రతినిధులుగా ఆజాద్‌, మొయిలీ రాష్ట్రానికి రానున్నారు. వారు జగన్‌కు మద్దతు నిచ్చిన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. వారే కాకుండా, కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలను కూడా పిలిపించి మాట్లాడనున్నారు. రాష్ట్రంలో పార్టీని కాపాడేందుకు రానున్న వారిద్దరూ ఎమ్మెల్యేలను ఎంతవరకూ బుజ్జగిస్తారో చూడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ గందర గోళ పరిస్థి తుల నేపథ్యంలో 30 మంది ఎమ్మెల్యేలుపార్టీని ధిక్కరించడం సాధారణ విషయమేమీ కాదని కాంగ్రెస్‌ నాయకులు స్పష్టం చేస్తున్నారు.

మంది ఎమ్మెల్యేల సంఖ్య చాలా పెద్దదేనని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ సంఖ్య సరిపోయినా, సరిపోకపోయినా ప్రభుత్వం మాత్రం కచ్చితంగా సంక్షోభంలో పడేంత సంఖ్యేనని సీనియర్లు కూడా అంగీక రిస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్‌ సమావేశాల వరకూ కిరణ్‌ కుమార్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేక పోయినా, 30 మంది ఎమ్మెల్యేల సంఖ్య పెరిగి పెద్దదయితే సర్కారు కష్టాల్లో పడినట్టే నంటున్నారు. ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినట్టయితే ఇబ్బందేనని చెబుతున్నారు. కిరణ్‌కుమార్‌ సర్కారు కూలిపోవాలని కోరుకోవడమే కాకుండా, ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న జగన్‌ వర్గీయులు అవిశ్వాస తీర్మాన అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలోనూ చేజార్చుకోరని విశ్లేషిస్తున్నారు. తాను సర్కారును కూల్చబోనని, తనంతట తాను కూలిపోతే ఏం చేయలేనని మొదటి నుంచీ చెబుతూవస్తోన్న జగన్‌ వ్యూహం కూడా ఇదేనంటున్నారు.

మరోవైపు.. పార్లమెంటు సభ్యులయిన సబ్బం హరి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి తాము జగన్‌ వైపే ఉంటామని విస్పష్టంగా ప్రక టించడం కూడా అధిష్ఠానాన్ని కలవరపరు స్తోంది. ఇద్దరు ఎంపీలు బాహాటంగా బయటకు వస్తే ఆ ప్రభా వం మిగిలిన ఎంపీలపైనా పడుతుందన్న ఆందోళన వ్యక్తమవు తోంది. వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా తెలియక నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. కేంద్రంలోని యూపీఏ సర్కారు కూడా అంతం తమాత్రపు మెజారిటీతోనే కొనసాగుతున్నందున రాష్ట్రానికి చెందిన 33 మంది ఎంపీల్లో కనీసం పదిమంది వెళ్లినా ప్రమాదకరమే నన్నది నాయకత్వం అసలు ఆందోళన. జాతీయ స్థాయిలో కాంగ్రె స్‌ను దెబ్బకొట్టా లన్న లక్ష్యంతో పనిచేస్తున్న జగన్‌, రాష్ట్రానికి చెందిన ఎంపీల పైనా కన్నేసినట్లు తెలియడంతో నాయకత్వం కలవరపడుతోంది.

అందులో భాగంగానే ఆజాద్‌, మొయిలీని రాష్ట్రానికి పంపు తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెరుగుతున్న చిక్కుముళ్లను ఏవిధంగా విప్పాలన్న అంశంపై నాయకత్వం తలపట్టుకుంది. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితిలో మిగిలిన రాష్ట్రాల్లో మాదిరిగా బెదిరింపు మంత్రాలు ఇక్కడ పనిచేయవన్న వాస్తవం స్పష్టమయింది. అందువల్ల సాధ్యమయినంత వరకూ బుజ్జగింపులు, తాయిలాల ఎరలతోనే సమస్యను తీవ్రతరం కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.
జగన్‌ శిబిరంలోని ప్రజాప్రతినిధులు

1 రామచంద్రారెడ్డి (రాయదుర్గం)
2  శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)
3  మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి)
4 బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)
5 ఆళ్ల నాని (ఏలూరు)
6 అమర్‌నాధ్‌రెడ్డి (రాజం పేట)
7 శేషారెడ్డి (అనపర్తి)
8 కొండా సురేఖ (పరకాల)
9 జయసుధ (సికింద్రాబాద్‌)
10 బాబూరావు (పాయకరావు పేట)
11 గుర్నాధరెడ్డి(అనంతపురం అర్భన్‌)
12 కె.వెంకట్రామిరెడ్డి (ధర్మవరం)
13 ఆదినారాయణరెడ్డి (జమ్ములమడుగు)
14 రాజేష్‌ (చింతలపూడి)
15 బాలరాజు (పోలవరం)
16 ప్రసాదరాజు(నర్సాపురం)
17 అంజిబాబు (భీమవరం)
18 ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి(కాకినాడ)
19 రేగా కాంతారావు (పినపాక)
20 పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (రామచంద్రాపురం)
21 కుంజా సత్యవతి (భద్రాచలం)
22 లబ్బి వెంకటస్వామి (నందికొట్కూర్‌)
23 బి.శివప్రసాదరెడ్డి (దర్శి)
24 జోగి రమేష్‌ (పెడన)
25 పేర్ని నాని (బందరు)
26 రమణమూర్తి రాజు (యలమంచిలి)
27 కమలమ్మ (బద్వేల్‌)
28 సబ్బం హరి-( ఎంపీ అనకాపల్లి)
29 మేకపాటి రాజమోహన్‌రెడ్డి
  ( నెల్లూరు - ఎంపి)
30 కొండా మురళి ( ఎమ్మెల్సీ)
31 జూపూడి ప్రభాకర్‌రావు (ఎమ్మెల్సీ)
32 పుల్ల పద్మావతి (ఎమ్మెల్సీ)
33 కృష్ణారెడ్డి (ఎమ్మెల్సీ) 
34 కాటసాని రామిరెడ్డి (బనగానపల్లె, పీఆర్పీ)
35 శోభా నాగిరెడ్డి (ఆళ్లగడ్డ, పీఆర్పీ)
36 నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (టీడీపీ, కొవ్వూరు) 
పగ్గాలివ్వండి.. జగన్‌ను అణిచేస్తా
KVP
రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇటీవలి కాలంగా జరుగుతున్న పరిణామా లు, కడప మాజీ ఎంపి జగన్‌ వ్యవహారంతో తలపట్టుకున్న నాయకత్వం ముందు ఎంపి, వైఎస్‌ ఆత్మబంధువయిన డాక్టర్‌ కేవీపీ రామచంద్రరావు ఒక ప్రతిపాదన పెట్టారు. తనకు పగ్గాలు అప్పగిస్తే, రాష్ట్ర పార్టీని గాడిలో పెడతానని, జగన్‌ పీచమణిచేస్తానని భరోసా ఇచ్చారు. అయితే, తనకు సీఎం పదవి ఇవ్వాలనిగానీ, పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని గానీ ఆయన కోరకపోయినప్పటికీ మొత్తంగా రాష్ట్ర పార్టీ పగ్గాలు తనకు అప్పగించాలని మాత్రం కోరినట్లు తెలిసింది.

పార్టీ అధి నేత్రి సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌తో కొద్దిరోజుల క్రితం జరిగిన భేటీలో కేవీపీ ఈ ప్రతిపాదన తెచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. గతంలో తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరిన కేవీపీ, ఆ విషయం బయటకు పొక్కడంతో తాను ఆ పదవిని కోరలేదంటూ ఖండించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తనకు పగ్గాలు ఇవ్వాలని అధిష్ఠానాన్ని అభ్యర్థించడం చర్చనీయాంశంగా మారింది.

పార్టీలో ఉన్నంత కాలం జగన్‌కు మద్దతుగా, పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తరువాత కూడా జగన్‌ నిర్వహించే కార్య్ర మాల్లో పాల్గొంటూ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నేతలే ఇష్టానుసారం మాట్లాడటం, విమర్శలు చేయడం, దాంతో పార్టీని కాపాడుకునేందుకు సొంత పార్టీ నేతలే వారిపై మాటల దాడులు కొనసాగించడం, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు వంటివి మితిమీరడంతో కాంగ్రెస్‌ ప్రతిష్ట మంటగలుస్తున్నదని పటేల్‌ ఎదుట కేవీపీతో పాటు మరో ఇద్దరు ఎంపీలు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతకుముందు.. కేవీపీతో పాటు మరి కొందరు ఎంపీలు, పార్టీ సీనియర్‌ నేతలు వేర్వే రుగా వివిధ సందర్భాల్లో పార్టీ అధినేత్రి సోనియాగాంధీని, ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌, కోర్‌ కమిటీ సభ్యులు కేంద్ర మంత్రులు ప్రణబ్‌ ముఖర్జీ, ఎ.కె.ఆంటోని, మరో సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌లను కలిసినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో పరిణామాలు, నేతల తీరుపై తమ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.

అదే సమయంలో వీరందరు పార్టీలో నేతల మధ్య జరుగుతున్న అంతర్గత ఘర్షణ, ప్రకటనలు, సొంత నిర్ణయా లను పార్టీ నాయకత్వం మౌనంగా చూస్తూ ఉంటే పార్టీ మరిం త నష్టపోతుందని స్పష్టం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఆ తరువాత నేతలు వారంతట వారే దారికి వస్తార ని, దీంతో పార్టీ నాయకులు క్రమశిక్షణ ఉల్లంఘించడానికి, జగన్‌ వైపు అడుగులు వేసేందుకు భయపడే పరిస్థితి వస్తుం దని వారు విజ్ఞప్తి చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

మీరు మౌనంగా వ్యవహరిస్తున్నందు వల్ల పార్టీ నేతలు ఎవరికి తోచి న విధంగా వారు మాట్లాడుతూ పార్టీ రోజుకో కొత్త సమ స్యలు తెచ్చిపెడతారని, వీరి చర్యల వల్ల పార్టీ బలహీన పడి వచ్చే ఎన్నికల నాటికి జనానికి దూరమయ్యే ప్రమాదం ఉందని వారు అధిష్టానం వద్ద పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్‌లో తొలుత అంతర్గత విమర్శలను ఆపండి, దాని కోసం కఠినంగా వ్యవ హరిస్తే నేతలు గీత దాటే పరిస్థితి ఉండదు, ఆ తరువాత వారంతట వారే మన దారికి వస్తారు అని కేవిపి, ఆయన సన్నిహిత నేతలు పటేల్‌కు విన్నవించినట్లు తెలిసింది.

మీరే ఆ బాధ్యతలు తీసుకోండి, లేదంటే మా పై నమ్మకం ఉంటే ఆ నాకు అప్పగించండి, పార్టీపై జగన్‌ ప్రభావం పడకుండా చూసుకుంటా, వైఎస్‌ తరహాలో పార్టీని పటిష్టం చేసి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలో వచ్చేలా అంతా సెట్‌రైట్‌ చేస్తానని కేవిపి ఆ సందర్భంగా పటేల్‌కు భరోసా ఇచ్చినట్లు సమాచారం.జగన్‌ ఆర్ధిక మూలాలన్నీ తనకు తెలుసునని, అతడిని ఏ విధంగా దారికి తీసుకురావాలో తనకు స్పష్టంగా తెలుసునన్న కేవీపీ ఆ వివరాలను పటేల్‌కు చెప్పిన ట్లు తెలిసింది. తనకు పూర్తి అధికారాలిచ్చి, పగ్గాలు ఇస్తే జగన్‌ను పూర్తి స్థాయిలో అణచివేస్తానని కూడా కేవీపీ భరోసా ఇచ్చారు. జగన్‌ వెంట ఉన్న ప్రధాన అనుచరులంతా ఇప్పటికీ తాను చెప్పినట్టు వింటారని, తనకు బాధ్యతలిస్తే వారందరినీ మళ్లీ పార్టీలోకి తెస్తానని హామీ కూడా ఇచ్చారు.

ఇప్పటికీ తన మనుషులు జగన్‌ వెంట ఉన్నారని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలుసనంటూ వారి పేర్లను కూడా పటేల్‌కు వివరించినట్లు సమాచారం. అదే సమయంలో కడపలో జగన్‌ ను జీరో చేస్తా నని, రానున్న ఉప ఎన్నికల్లో కడప ఎంపీ, పులి వెందుల అసెం బ్లీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తానని చెప్పారు. వైఎస్‌ ఉన్న ప్పుడు జరిగిన టికెట్ల పంపిణీలో తానే కీలకపాత్ర పోషించి నందున, రాష్ట్రంలో ఏ నాయకుడి బలమేమిటో తనకు అవగా హన ఉందని, అందువల్ల తనకు పగ్గాలు ఇస్తే పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తానని హామీ ఇచ్చారు.

సీఎం కిరణ్‌ కుమార్‌ వల్ల ఇవన్నీ సాధ్యం కాదని, ఆయనకు వాటిపై అంత అవగాహన లేనందున ఆ బాధ్యతలను తనకు అప్పగించాలని కేవీపీ కోరారు. అయితే, తనపై ఆరోపణలు చేసే వారికి ఢిల్లీలో ప్రాధాన్యం ఇవ్వకూడదని, గతంలో వైఎస్‌కు ఎలాంటి ప్రాధా న్యం ఇచ్చారో తనకూ అదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని కేవీపీ ఒక దశలో షరతు విధించినట్లు తెలిసింది.అందుకు స్పందించిన అహ్మద్‌పటేల్‌ తాను ఈ ప్రతిపా దనను సోనియాగాంధీ, ప్రణబ్‌, ఆజాద్‌లతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

అయితే, అప్పటివరకూ మీ స్థాయిలో మీరు పార్టీ పటిష్ఠపర్చా లని మీ సమర్ధతేమిటో తెలిసినందున మీ సే వలను సద్వినియోగం చేసుకుంటామని పటేల్‌ చెప్పా రు. కేవీపీ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తే.. ఆయన సీఎం పదవో, పీసీసీ అధ్యక్ష పదవినో ఆశిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కిరణ్‌కుమార్‌రెడ్డిని మార్చి నెల తర్వాత మారుస్తారని విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతున్న నేప థ్యంలో కేవీపీ ఇలాంటి ప్రతిపాదనలు చేయటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. కేవీపీ బహుశా తనకు సీఎం పదవి ఇస్తే రాష్ట్రంలో పార్టీని గాడిలోకి తెచ్చి, పూర్వవైభవం తెస్తానని అహ్మద్‌పటేల్‌ ముం దు ప్రతిపాదన పెట్టి ఉండవచ్చని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.
 

Saturday, December 18, 2010

తండ్రి 'ఆత్మ'పై తనయుడి పోరు! * మొదటి నుంచీ ఉప్పూ నిప్పు * కేవీపీకి ప్రాధాన్యంపై జగన్ గుర్రు


కేవీపీకి ప్రాధాన్యంపై జగన్ గుర్రు
కీలక సమయంలో 'చెయ్యి' ఇచ్చారని ఆగ్రహం
అధిష్ఠానం పక్షాన నిలవడంపై అసహనం
సురేఖ లేఖాస్త్రానికి ఇదే కారణం?
గుల్బర్గా వైద్య కళాశాలలో జరిగిన పరిచయం తర్వాత... 1978లో వైఎస్ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 2009 సెప్టెంబర్ 2వ తేదీన మృతి చెందేదాకా... కేవీపీ ఆయనతోనే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించినా, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నా ప్రతి దశలో వైఎస్‌తోనే కేవీపీ ఉన్నారు.

అప్పుడెప్పుడూ కేవీపీ, వైఎస్‌ల మధ్య అనుబంధం విషయంలో ఎలాంటి పొరపొచ్ఛాలూ లేవు. కానీ.. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే వివాదం మొదలైంది. అది వారిద్దరి మధ్య కాదు! పాలనలో కేవీపీ జోక్యం, ఆయనకు దక్కుతున్న ప్రాధాన్యాన్ని వైఎస్ కుటుంబ సభ్యులు... ప్రధానంగా జగన్ వ్యతిరేకించే వారని పార్టీ నేతల్లో ప్రచారం జోరుగా ఉంది.

కాంట్రాక్టుల కేటాయింపులు, కీలక పోస్టుల్లో నియామకాల విషయంలో కేవీపీతోపాటు జగన్ కూడా జోక్యం చేసుకునే వారని.. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని చెబుతున్నారు. వైఎస్ ఉన్నప్పుడే ఆర్థికపరమైన పలు లావాదేవీలకు సంబంధించి కేవీపీతో జగన్ వ్యతిరేకించేవారనే ప్రచారం సాగింది.

వైఎస్ మరణంతో...

వైఎస్ దుర్మరణం తర్వాత జరిగిన పరిణామాలు కేవీపీకీ, జగన్‌కూ మధ్య దూరాన్ని మరింత పెంచాయి. వైఎస్ వారసునిగా జగన్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్, వైఎస్ భౌతిక కాయం ఉండగానే, దానికి సమీపంలోనే ఎమ్మెల్యేల సంతకాల సేకరణ జరిగింది. అత్యంత విషాదకర సమయంలో అధికారం కోసం సంతకాల సేకరణ ఏమిటంటూ అధిష్ఠానం మండిపడింది. పార్టీలో తన రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం అయ్యేందుకు సంతకాల సేకరణే ప్రధాన కారణమని జగన్ భావిస్తున్నారు.

కొండా సురేఖ కూడా ఇటీవల తన లేఖలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. 'నేను, వైఎస్ ఒకే మనసు, ఒకే ఆత్మ' అని చెప్పుకున్నప్పటికీ... వైఎస్ మరణం తర్వాత కేవీపీలో ఈ వైఖరి కనిపించలేదని జగన్ వర్గం ఆక్షేపిస్తోంది. ప్రజా భద్రతా సలహా కమిటీ చైర్మన్‌గా ఉన్న కేవీపీ... వైఎస్ మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయకపోవడం జగన్‌ను, ఆయన వర్గాన్ని విస్మయానికి గురి చేసిందని చెబుతారు.

జగన్ ఇప్పటికీ తన తండ్రి మరణంపై తాను సందేహాలు వ్యక్తం చేస్తూ, ప్రజల్లోనే అవే సందేహాలు కలిగేలా ప్రచారం చేస్తున్నారు. 'రాష్ట్రంలో ఏ కార్యకర్త కూడా వైఎస్ ప్రమాదవశాత్తు మృతి చెందారని భావించడంలేదు. ఆయన మరణంపై సందేహాలున్నాయి' అని ఇటీవల పులివెందులలో జరిగిన సభలో పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వపరంగా దర్యాప్తు జరిపేందుకు కేవీపీ ఎందుకు సిద్ధపడలేదని జగన్ వర్గం ప్రశ్నిస్తోంది.

పీఠం... ముడి!

వైఎస్ మృతి అనంతరం మెజారిటీ శాసనసభ్యుల మద్దతున్న తననే సీఎం కుర్చీలో కూర్చోబెడతారని జగన్ భావించారు. రఘువీరారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా జగన్‌ను సీఎం చేయకుంటే మంత్రులుగా ప్రమాణం చేయబోమని అప్పట్లో ప్రకటించారు. 'మనం కలిసి పరిపాలన చేద్దాం' అంటూ తనను కలిసి సానుభూతి ప్రకటించడానికి వచ్చిన నేతలతో జగన్ చెప్పారని, ఇదీ ఆయనలోని నమ్మకానికి నిదర్శనమని చెబుతారు. సీఎంగా తనపేరు ప్రకటించడం లాంఛనమే అని జగన్ భావించారు.

ఆ సమయంలో కేవీపీ గొంతెత్తి, జగన్ పక్షాన నిలుస్తారని పలువురు భావించారు. కానీ.. పరిస్థితి తారుమారైంది. కీలకమైన క్షణంలో కేవీపీ మౌనం జగన్‌కు ఆగ్రహం తెప్పించింది. వైఎస్ కుటుంబ సభ్యులు కూడా దీనిని జీర్ణించుకోలేకపోయారని జగన్ సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తనవెంటే ఉన్న ఆ సమయంలో కేవీపీ ఒక్క మాట అని ఉంటే నేడు పరిస్థితి ఇలా ఉండేది కాదన్నది జగన్ అభిప్రాయం.

పుండుమీద కారం చల్లినట్లుగా... సీఎల్పీ నేతను ఎన్నుకునే అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కట్టబెడుతూ తీర్మానాన్ని పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ జగన్ చేతే ప్రవేశపెట్టించారు. ఈ వ్యవహారాలన్నింటికీ కేవీపీ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. ఏ దశలోనూ కేవీపీ దీనిని వ్యతిరేకించకపోవడం, అధిష్ఠానాన్ని తప్పుపట్టకపోవడం జగన్‌కూ, ఆయన కుటుంబానికీ, అనుచరులకు ఆగ్రహం తెప్పించింది.

అన్నింటికంటే ముఖ్యంగా... అప్పుడు సీఎంగా ఉన్న రోశయ్యతో కేవీపీ బంధాన్ని కొనసాగించడం .. గతంలో వైఎస్ ఉన్నప్పటి లాగానే శాసనసభ సమావేశాల సమయంలో అసెంబ్లీకి రావడం, సలహాదారుగా కొనసాగడం ఆ ఆగ్రహాన్ని మరింత పెంచింది. కేవీపీ అటు అధిష్ఠానంతో, ఇటు నాటి సీఎం రోశయ్యతో సఖ్యతగా మెలగడం కూడా జగన్‌కు మింగుడు పడలేదు.

పైగా... ఎమ్మెల్యేలు తనవైపు మొగ్గు చూపకుండా కేవీపీ వారిని కట్టడి చేస్తున్నారనే అనుమానం కూడా కలిగింది. సీఎంగా రోశయ్య బాధ్యతలు నిర్వహించినంత కాలం... ఎప్పటికైనా అధిష్ఠానం దిగివచ్చి తనకు సీఎం పదవి అప్పగిస్తుందని జగన్ భావిస్తూ వచ్చారు. కానీ, అనూహ్యంగా రోశయ్యను మార్చేసి, ఆయన స్థానంలో తన సామాజిక వర్గానికే చెందిన కిరణ్‌కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడంతో... ఇక తాను కాంగ్రెస్‌లో సీఎం కావడం అసంభవమని జగన్ ఓ నిర్ణయానికి వచ్చేశారు.

ఇదే సమయంలో తన కుటుంబంలోనే చిచ్చు పెట్టేందుకు అధిష్ఠానం యత్నిస్తున్నా.. కేవీపీ నోరు విప్పకపోవడంపై జగన్‌తో పాటు ఆయన వర్గం ఆగ్రహించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొండా సురేఖ ద్వారా కేవీపీపై లేఖాస్త్రం సంధించినట్లు ప్రచారం జరుగుతోంది.

వేస్తారా సంకెళ్లు?

ఒకటి రెండూ కాదు... వేల కోట్ల అవినీతి! సర్వ వ్యవస్థల నాశనం! ఇన్నేళ్లుగా జరిగిందిదే! 'ఆంధ్రజ్యోతి' ఎప్పటికప్పుడు ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. చట్టాన్ని చుట్టంగా మార్చుకున్నన్ని రోజులు... వారూ వారూ కలిసి ఊళ్లు పంచుకున్నన్ని రోజులు దీనిపై ప్రభుత్వాలు స్పందించలేదు. రాజకీయ సమీకరణాలు మారిపోగానే కొరడా ఝళిపించడం మొదలుపెట్టారు. అప్పుడు 'ఆంధ్రజ్యోతి' రాసిన కథనాలు అక్షరసత్యాలని ఇప్పుడు ప్రభుత్వమే తన చర్యల ద్వారా అంగీకరించినట్లయింది.

ఎమ్మార్ కుంభకోణంపై సీబీఐ విచారణకు కూడా సిద్ధపడుతోంది. రహేజాదీ ఇదే పరిస్థితి. బయ్యారంలో ఇనుప నిక్షేపాల కేటాయింపును రద్దు చేసింది. వైఎస్ పుత్రుడి కంపెనీలపై ఐటీ దాడులు జరిపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగినట్లు హైకోర్టు తీర్పుతో స్పష్టమైంది. సెజ్‌ల పేరిట జరిగింది భూ పందేరమేనని తేలిపోయింది. ఈ కుంభకోణాల్లో కోట్లకొద్దీ ప్రజాధనం కొందరు పెద్దల ఖాతాల్లోకి చేరుకుంది.

ఇప్పుడు... ప్రభుత్వం ఏం చేస్తుంది? మెక్కిన సొమ్మును కక్కిస్తుందా? అవినీతి పరులకు సంకెళ్లు వేస్తుందా?... వారి మధ్య మళ్లీ సఖ్యత కుదిరితే, వాళ్లు లోపాయికారీ ఒప్పందానికి వస్తే మొత్తం అవినీతిని కప్పేస్తారు! ఇప్పుడే సర్కారును పౌర సమాజం ప్రశ్నించాలి. 'మేమున్నాం... నిలదీస్తాం' అని అనుక్షణం గుర్తు చేయాలి.
click here

Friday, December 10, 2010

ఇక యుద్ధమే ! కేవీపీ ఓ బ్రోకర్, అవినీతి పరుడు.... పాపాల భైరవుడు కేవీపీనే - కొండా సురేఖ లేఖాస్త్రం

Archary-target
వైఎస్‌ ఆత్మబంధువు, రాజ్య సభ సభ్యుడయిన డాక్టర్‌ కేవీపీ రామచంద్రరావు - వైఎస్‌ తన యుడు జగన్‌ మధ్య ఇక యుద్ధం జరగనుందా? తాజాగా జగన్‌ వీర విధేయురాలయిన ఎమ్మెల్యే కొండా సురేఖ ఎంపీ కేవీపీ అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయటం పరిశీలిస్తే ఈ అనుమానం నిజమనిపించక మానదు. మొన్నటి వరకూ కేవీపీ మార్గదర్శకత్వం లోనే నడిచిన కొండా.. హటాత్తుగా ఆయనపైనే పేల్చిన ఈ ‘అవినీతి బాంబు’ కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తోంది. కేవీపీ తనకు నష్టం జరిగే పరిస్థితి వస్తే చివరకు అటు అధిష్ఠానాన్ని, ఇటు జగన్‌నూ ఇరికిస్తారన్న ప్రచారం మొదలయింది. ఒకవేళ నిజంగానే సీబీఐ కేవీపీ ఆస్తులపై విచారణ జరిపిస్తే ఆయన పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఇప్పటివరకూ కేవీపీ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఒక్క టీడీపీ మాత్రమే డిమాండ్‌ చేయగా, ఇప్పుడు కొండా సురేఖ కూడా అదే దారి పట్టడం చూస్తే, కేవీపీ క్రమంగా కష్టాల్లో పడుతున్నారన్న వాదనకు బలం చేకూరుతోంది. రాష్ట్రంలో వైఎస్‌ హయాంలో జరిగిన ఎమ్మార్‌, రహేజా వంటి భారీ అక్రమాలతో పాటు, అస్మదీయులకు ఇరిగేషన్‌, విద్యుత్‌ ప్రాజెక్టులు, భారీ రోడ్డు కాంట్రాక్టులు, సెజ్‌ల కేటాయింపు వ్యవహారాల్లో కేవీపీ మూలవిరాట్టన్న చర్చలు రాజకీయ పార్టీల నుంచి- సామాన్య జనంలోనూ చాలాకాలం నుంచి చర్చనీయాం శంగా మారిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ వర్గమే కేవీపీ ఆస్తులన్నీ అక్రమంగా సంపాదించినవేనని, వాటిపై స్వయంగా కేవీపీయే సీబీఐ విచారణ కోరాలంటూ డిమాండ్‌ చేయడం బట్టి ఇక జగన్‌ - కేవీపీ మధ్య యుద్ధానికి తెరలేచినట్టేనన్నది తేలిపోయింది. ఇద్దరి అక్రమ సంపా దన, ఆర్ధిక మూలాల వివరాలు ఒకరికొకరికి తెలియ డంతో ఇక వారిద్దరి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. దీనితో ఇప్పటివరకూ వారిద్దరి మధ్య జరుగుతున్న ముసుగులో గుద్దులాటకు శాశ్వతంగా తెరపడి నట్టయింది. కేవీపీపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఆయన దాదాపు ఒంటరి అవుతారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా తాను చెబితే వినే ఆప్త మిత్రుడు లేకపోవడం, మిగిలిన ఎంపీల మాదిరిగా జనంలో బలం లేని ఎంపీ కావడం, ఇప్పటి వరకూ తెరవెనుక చక్రం తిప్పి, మంత్రాంగం నడపడమే తప్ప, నేరుగా సమస్యను ఎదుర్కొనే ధైర్యం ప్రదర్శించక పోవడం వంటి సమస్యలు ఆయనకు ప్రతిబంధకంగా పరిణమించాయి. పైగా.. వైఎస్‌ అధికారంలో ఉండగా, వైఎస్‌ ప్రత్యర్థులను ఆర్థికంగా, రాజకీయంగాఅణచివేయడంలో కేవీపీ చూపిన అత్యుత్సాహమే ఇప్పుడు ఆయన్ని ఒంటరిని చేసింది.

అధికారాన్ని వినియోగించుకుని ప్రత్యర్థులను, చివరకు మీడియాను కూడా భయపెట్టి, సమాచారశాఖ ద్వారా వారందరినీ తన చుట్టూ తిప్పుకుని, విభజన తెచ్చి పెత్తనం చెలాయించిన కేవీపీ ఇప్పుడు ‘ఎవరూ రక్షించలేనంత’ సమస్యలో కూరుకుపోయారు. కేవీపీ అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణ జరిగితే ఆయన వ్యవహారశైలి, స్పందన ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోన్న అభిప్రాయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అక్రమ సంపాదన రుజవయి, తాను పీకల్లోతు కష్టాల్లో ఉంటే అప్పుడు ఆయన ఈ వ్యవహారంలో అధిష్ఠానాన్ని కూడా ఇరికించడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.

వైఎస్‌ జీవించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలలో ఢిల్లీ నాయకత్వానికీ వాటాలున్నాయని, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఇక్కడ నుంచే నిధులు వెళ్లాయని పెదవి విప్పితే పార్టీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంలో ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పేరు చెబుతారా? ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ పేరు చెబుతారా? లేక కోశాధికారి మోతీలాల్‌ వోరా పేరు తెరపైకి తెస్తారా? అన్న ప్రశ్నలు సొంత పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్‌కు సంబంధించిన అక్రమ ఆస్తుల చిట్టాను కూడా విప్పడానికి కేవీపీ జంకరని చెబుతున్నారు. జగన్‌కు చెందిన మీడియా సంస్థల్లో వచ్చిన పెట్టుబడులు, వారికి ఏవిధంగా లబ్ధి జరిగింది? మారిషస్‌, దుబాయ్‌ నుంచి వచ్చిన పెట్టుబడులెంత? ఇరిగేషన్‌ కంపెనీల్లో జగన్‌ వాటాలెంత? ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ, బ్రహ్మణీ స్టీల్స్‌లో జగన్‌ బినామీ వాటాలెంత వంటి లెక్కలను కేవీపీ వెలుగులోకి తీసుకురావడం ఖాయమంటున్నారు.

నిజానికి, జగన్‌ వద్ద కూడా కేవీపీ అక్రమ ఆస్తుల చిట్టా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే కాకుండా దుబాయ్‌తో పాటు.. వివిధ రాష్ట్రాల్లో బినామీ పేర్లు, ఆయన కొడుకు, వియ్యంకుడు, మిత్రుల పేర్లతో ఉన్న వ్యాపారాలు, ఇక్కడ బినామీ పేర్లతో ఉన్న ఇరిగేషన్‌-పవర్‌ ప్రాజెక్టుల వివరాలన్నీ జగన్‌ వద్ద ఉన్నాయని ఆయన సన్నిహితులు బాహాటంగానే చెబుతున్నారు. అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా జరిగే వ్యాపారాల వివరాలు కూడా జగన్‌ వద్ద ఉన్నాయంటున్నారు. వాటిని సీబీఐ విచారణ సమయంలో అందచేస్తారని, అదీ సాధ్యం కాకపోతే ప్రతిపక్షాలకు లీక్‌ చేస్తారంటున్నారు.

కేవీపీ ఓ బ్రోకర్ - కొండా సురేఖ లేఖాస్త్రం
జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారు
పొన్నాలతో కలిసి కోట్లు దండుకున్నారు
ఆయన సలహాలన్నీ దోపిడీకే
పనికిరాని వాడిని వైయస్ పైకి తెచ్చారు
ఆయన నిర్లక్ష్యం వల్లే వైయస్‌మరణం
సంతకాలు సేకరించింది ఆయనే
ఆస్తులపై సీబిఐ విచారణకు సిద్ధం కావాలి

 వైఎస్ ఆత్మ బంధువు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై జగన్ వర్గం నాయకురాలు కొండా సురేఖ మండిపడ్డారు. ఆయనను ఒక బ్రోకర్‌గా అభివర్ణించారు. 'జలయజ్ఞంలో దోపిడీ నుంచి వైఎస్ మరణం దాకా..' అన్ని పాపాలకూ ఆయనే బాధ్యుడని నిందించారు. వైఎస్ అవినీతిపరుడంటూ నిందలు వేస్తున్నా కేవీపీ మౌనం వహించడానికి అసలు కారణం... పదవీ కాంక్షేనని తేల్చి చెప్పారు. "వైఎస్ మరణించాక జగనే సంతకాలు సేకరించారని దుష్ప్రచారం జరుగుతోంటే ఎందుకు ఖండించడంలేదు? జగన్‌ను సీఎం చేయాలని సంతకాల సేకరణ చేపట్టి, తద్వారా జగన్‌ను అప్రతిష్ఠ పాలు చేశారు. ఆ విషయాన్ని ఎందుకు ధైర్యంగాఒప్పుకోలేదు?'' అని కేవీపీని ప్రశ్నించారు. "శ్రీ కేవీపీ రామచంద్ర రావు గారికి...' అని సంభోదిస్తూ ఆయనకు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాశారు. అందులో... అనేక సూటి ప్రశ్నలు సంధించారు. సురేఖ లేఖ సారాంశమిది...

"వైఎస్ మరణానంతరం మీ ప్రవర్తనను చూసి వైఎస్ ఆత్మ 'ఇలాంటి బ్రోకర్ నా స్నేహితుడా?' అని క్షోభిస్తుంది. ఎందుకూ పనికి రాని వాడివైన మీ చదువుకు ఆర్థిక సహాయం చేసి అందలం ఎక్కిస్తే, కనీస నైతిక విలువలు లేకుండా ప్రవర్తించడం ఏ విధంగా సబబు? కనీసం చదివిన డాక్టర్ వృత్తికి పనికిరాని మీకు, ఏనాడైనా వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని మీకు కేబినెట్ స్థాయి ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడం వైఎస్ చేసిన ఏకైక పొరపాటు. వైఎస్ మృతి అనంతరం ఈ 15 నెలల కాలంలో వారి కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలకు ఒక్క దానికైనా ఎందుకు స్పందించడం లేదు. ఈ మౌనం అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికేనా?

వైఎస్ చేపట్టిన జలయజ్ఞాన్ని మీరు ధనయజ్ఞంగా మార్చారు. పొన్నాల లక్ష్మయ్యతో కుమ్మక్కై ఎన్నో కంపెనీలకు ఎక్సెస్ టెండర్లు ఇప్పించి ప్రజల సొమ్మును దోచుకున్నారు. అసలు ప్రభుత్వ సలహాదారుడిగా మీ నిర్వాకం ఏమిటో అందరికీ తెలిసిందే! మీ సలహాలతో కాంట్రాక్టులు ఇప్పించి, తద్వారా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారో ప్రజలు అర్థం చేసుకున్నారు. మీ సలహాలన్నీ ప్రజాధనాన్ని దోచుకునేందుకు ఉపయోగపడ్డాయి. నమ్మిన వారికి ప్రాణాన్ని సైతం ఇచ్చేసే వైఎస్ బలహీనతను సొమ్ము చేసుకొని జలయజ్ఞానికి తూట్లు పొడిచారు.

దివంగత నేత కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలవాల్సిన మీరు పదవులను కాపాడుకునేందుకే కక్కుర్తి పడ్డారు. అధిష్ఠానానికి దగ్గర కావాలని కుటిల నీతితో ప్రాణస్నేహితుని కుటుంబాన్ని చీల్చడానికి ఎత్తువేసింది నిజం కాదా? వైఎస్ వివేకానంద రెడ్డి ఢిల్లీకి వెళ్లేముందు మీ ఇంట్లో చర్చలు జరపడం వాస్తవం కాదా? వైఎస్ సతీమణి విజయలక్ష్మి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఇంటికి వెళ్లి పరామర్శించాల్సింది పోయి, ఢిల్లీలో ఉండి మీ పదవి కాపాడుకునే ప్రయత్నం చేసుకున్నారు. అధిష్ఠానం వద్ద వైఎస్ కుటుంబాన్ని బూచిగా చూపించి పదవులు, డబ్బు సంపాదించేందుకు కొత్త ముఖ్యమంత్రి దగ్గర సైతం గిరికీలు కొడుతున్నారు. ముఖ్యమంత్రులు మారినా, మీ పదవులకు ఢోకా లేకపోవడం చూస్తేనే మీ వ్యక్తిత్వం ఏమిటో తేలిపోతోంది. ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్న కాలంలోనూ తప్పుడు సలహాలు ఇస్తూ మరోసారి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.

మీ స్వార్థం కోసం తప్ప కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏమాత్రం లేదు. కనీసం వార్డు మెంబర్‌గానైనా గెలిచారా? ప్రజలతో కనీస సంబంధాలు ఉన్నాయా? బడా కాంట్రాక్టర్లు, రాజకీయ దళారులు, పైరవీకారులు తప్ప సామాన్య ప్రజలు, కార్యకర్తలు మీ దగ్గరకు రాగలరా? వైఎస్ కోసం ప్రాణమిచ్చే కార్యకర్తలను, నాయకులను ఏనాడైనా రక్షించే ప్రయత్నం చేశారా? కొండా మురళీధర్‌రావు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలాంటి వారికి గన్‌మెన్లను తగ్గించడమే భద్రతా సలహాదారునిగా మీరు చేసే పనా? అసలు ప్రజా భద్రతా కమిటీ అధ్యక్షుడిగా భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం చేయడం వల్లనే వైఎస్ మృతి చెందారన్నది నిజం కాదా? వైఎస్‌ది ప్రమాదం కాదు, హత్య అని తెలుస్తోంది. ఈ విషయంలో ప్రజలకు స్పష్టమైన వివరణ అవసరం మీకు లేదా?

మీకు నిజాయితీ ఉంటే నైతిక విలువలకు కట్టుబడి ఉంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు మీ ఆస్తి ఎంత? ప్రస్తుతం ఆస్తి ఎంత? జలయజ్ఞంలో నువ్వు దోచుకున్నదెంత? మంత్రి పొన్నాల వాటా ఎంత? ఈ వివరాలు అన్నీ తెలియాలంటే మీరే స్వయంగా సీబీఐ విచారణను కోరుకోవాలి.'' కేవీపీ పనులు వైఎస్‌కు తెలియదు

"వైఎస్ చేసే పనులు కేవీపీకి తెలుసు. కానీ, కేవీపీ చేసే పనులు వైఎస్‌కు తెలియదు'' అని కొండా సురేఖ పేర్కొన్నారు. తన లేఖపై 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' చానల్ నిర్వహించిన చర్చలో ఆమె పాల్గొన్నారు. "వైఎస్ అవినీతిపరుడుకారని, వాటికి కేవీపీయే బాధ్యత వహించి ఆయనే సమాధానం చెప్పాలనే ఈ లేఖ రాశాను'' అని కొండా సురేఖ పేర్కొన్నారు. వైఎస్ ఉన్నప్పటికీ, ఇప్పటికీ కేవీపీ ప్రవర్తనలో చాలా తేడా ఉందన్నారు. ఆయన నిజ స్వరూపాన్ని బయటపెట్టడానికే లేఖ రాశాని తెలిపారు. "30 ఏళ్ల రాజకీయ జీవితంలో వైఎస్‌కు అండదండగా ఉన్న కేవీపీ.. ఈ 15 నెలల్లో ఆయన కుటుంబానికి చేసిందేమిటో ఆత్మ విమర్శ చేసుకోవాలి'' అని సూచించారు. "సలహదారులందరి రాజీనామాలను ఆమోదించి కేవీపీ రాజీనామా మాత్రం పెండింగ్‌లో పెట్టారు. అప్పటి నుంచి కేవీపీ ఢిల్లీలోనే మకాం వేసి పనులు చక్కబెడుతున్నారు. కిరణ్ హయాంలోనూ ఆయన హవా నడుస్తోంది'' అని సురేఖ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. వైఎస్ వివేకానంద రెడ్డికి పదవి ఇవ్వడం వెనుక కేవీపీ హస్తం ఉందని నూటికి నూరుపాళ్లు నమ్ముతున్నామన్నారు.

కేవీపీని ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖలోని అభిప్రాయాలన్నీ తన వ్యక్తిగతమేనని కొండా సురేఖ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. "ఈ లేఖతో వైఎస్ జగన్‌కు సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని ఖండిస్తున్నాను'' అని తెలిపారు.

పాపాల భైరవుడు కేవీపీనే
బ్రోకర్, అవినీతి పరుడు..
కొండా సురేఖ లేఖాస్త్రం
తీవ్ర విమర్శలు గుప్పించిన యువనేత వర్గం
విపక్షాల చేతికి అస్త్రాలు
ఇన్నాళ్ల ఆరోపణలకు బలం
వైయస్‌కు తెలియకుండా కేవీపీ అవినీతి సాధ్యమా?

ఆత్మకు తెలియకుండా శరీరం ఏ పనైనా చేయగలదా?
అంతరాత్మ కళ్లకు గంతలు కట్టడం ఆత్మకు సాధ్యమవుతుందా?
'శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే' అయినప్పుడు... ఒకే ఆత్మలోని సగ భాగం మరో సగాన్ని మోసం చేయగలదా? ఒక సగానికి సోకిన అవినీతి మరో సగానికి తాకకుండా ఉంటుందా?


కేవీపీ రామచంద్రరావుపై మాజీ ఎంపీ జగన్ వర్గంలోని ముఖ్య నాయకురాలు కొండా సురేఖ సంధించిన లేఖాస్త్రాన్ని చూస్తే ఈ ప్రశ్నలు తలెత్తక మానవు! అటు విపక్షాలు, ఇటు కాంగ్రెస్‌లోని వైఎస్ వ్యతిరేకులు ఇప్పటికే ఈ ప్రశ్నలను సంధిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే... వీరికి జగన్ వర్గమే 'కొండా సురేఖ లేఖ' రూపంలో కొత్త అస్త్రాలను అందించింది. అటు కాంగ్రెస్, ఇటు జగన్ వర్గం దీంతో ఒకరి గోత్రాలను ఒకరు బయటపెట్టుకునే ప్రక్రియ మొదలైంది. వైఎస్ అవినీతిపైనా, కేవీపీ పాత్రపైనా విపక్షాలు ఇన్నాళ్లుగా అనేక ఆరోపణలు చేశాయి.

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లోని సీనియర్లు సైతం వైఎస్ అవినీతిపై విమర్శలు గుప్పించసాగారు. ఈ విమర్శలపై కేవీపీ స్పందించడం లేదంటూ కొండా సురేఖ ఆక్రోశం వ్యక్తం చేస్తూ... ఆయనపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 'కేవీపీ ఒక బ్రోకర్. ప్రాజెక్టుల అంచనాలు పెంచాడు. జలయజ్ఞంలో కోట్లు దోచుకున్నాడు' అంటూ పాపాలన్నీ కేవీపీవే అని పేర్కొన్నారు. ఇవే ఆరోపణలను గతంలో విపక్షాలు చేశాయి. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలే చేశారు. ఇప్పుడు జగన్ వర్గీయులూ చేస్తున్నారు. అంటే.... ఆ ఆరోపణలన్నీ అక్షర సత్యాలే అని అంగీకరించినట్లేనా?

వైఎస్, కేవీపీలది అవినాభావ సంబంధం. గుల్బర్గాలో మెడిసిన్ చదువుకున్న రోజుల్లో ఏర్పడిన బంధం వైఎస్ మరణించేదాకా కొనసాగింది! వైఎస్ తెల్లవారగానే చేసే మొదటి ఫోన్ కాల్ కేవీపీకే! ప్రతి రోజూ మధ్యాహ్నం కలిసి భోజనం చేసేది కేవీపీతోనే! ఇలా కొన్ని దశాబ్దాలపాటు జరిగినట్లు చెబుతారు. 'మా శరీరాలు వేరైనా, ఆత్మ ఒక్కటే' అని వైఎస్ స్వయంగా పేర్కొనే వారు. ఎవరైనా, ఏదైనా పనిమీద వచ్చినప్పుడు, వారు చెప్పిందంతా విన్న తర్వాత 'కేవీపీని కలవండి!' అని వైఎస్ చెప్పేవారని అందరికీ తెలుసు. వైఎస్ తెర ముందు కనిపిస్తే... తెర వెనుక చక్రం తిప్పింది కేవీపీ అని చాలామంది చెబుతారు. ఇప్పుడు... అదే కేవీపీని అని కొండా సురేఖ బ్రోకర్ అని తిట్టిపోశారు. అదే నిజమైతే... కేవీపీ ఎవరి తరఫున బ్రోకర్‌గిరీ చేశారు? అని ప్రశ్నించేందుకు అటు కాంగ్రెస్, ఇటు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. అందలం ఎక్కించిందెవరు?:

ఎమ్మార్ కుంభకోణం, రహేజా గోల్‌మాల్, జలయజ్ఞం, భూ కేటాయింపులు, ఔటర్ రింగ్ రోడ్డు, సెజ్‌లు... ఇలా వైఎస్ హయాంలో వచ్చిన అవినీతి ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి వ్యవహారంలో వైఎస్‌తోపాటు కేవీపీపైనా విపక్షాలు వేలెత్తి చూపాయి. ఇప్పుడు జగన్ వర్గం కేవీపీని మాత్రమే వేలెత్తి చూపిస్తోంది. వెరసి... విపక్షాల ఆరోపణల్లో సగభాగాన్ని జగన్ వర్గమే బలపరిచినట్లయింది. కేవీపీ, వైఎస్‌ల మధ్య సాన్నిహిత్యాన్ని బట్టి చూస్తే... మిగిలిన సగం ఆరోపణలూ నిజమని అంగీకరించినట్లే! హైదరాబాద్‌కు మకాం మార్చిన తొలినాళ్లలో... వైఎస్, కేవీపీ కుటుంబాలు ఒకే ఇంట్లో ఉండేవి. వైఎస్ పీసీసీ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వహించినప్పుడు కేవీపీ అంతా తానై నడిపించారు.

పాదయాత్ర సమయంలో నడిచింది వైఎస్ అయినా, ఇది విజయవంతం కావడానికి పక్కా వ్యూహం రచించి నడిపించింది మాత్రం కేవీపీ అని చెబుతారు. వ్యక్తిగత మిత్రడైన కేవీపీని అధికారిక కార్యకలాపాల్లో భాగస్వామిని చేసింది వైఎస్సే. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా, ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. రాజ్యసభ సభ్యత్వం ఇప్పించారు. ఆ తర్వాత 'ప్రజా భద్రతా కమిటీ' చైర్మన్‌గా క్యాబినెట్ హోదా కల్పించారు. వ్యక్తిగతంగా, అధికారికంగా వైఎస్, కేవీపీలు అంతగా కలిసిపోయారు. అలాంటిది... వైఎస్‌కు తెలియకుండా, కేవీపీ మాత్రమే అవినీతికి పాల్పడ్డారని సురేఖ ఆరోపించడం హాస్యాస్పదమవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, నమ్మితే ప్రాణాలిచ్చే వైఎస్ బలహీనతనే కేవీపీ సొమ్ము చేసుకున్నారన్నది జగన్ వర్గం వాదన!

సురేఖ లేవనెత్తిన ప్రశ్నలెన్నో: 'బడా కాంట్రాక్టర్లు, రాజకీయ దళారీలు, పైరవీకారులు తప్ప సామాన్య ప్రజలు మీ దగ్గరకు రాగలరా?' అని కొండా సురేఖ ప్రశ్నించారు. అదే నిజమైతే... కేవీపీకి అంత చనువు ఇచ్చి, ఆయన మాట చెల్లుబాటయ్యేలా చేసింది వైఎస్సే కదా అనే ప్రశ్న తలెత్తుతుంది. 'వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు కేవీపీకి ఉన్న ఆస్తి ఎంత? ప్రస్తుతం ఆయనకున్న ఆస్తులు ఎన్ని?' అని కూడా సురేఖ తన లేఖలో ప్రశ్నించారు. దాదాపు ఇదే ప్రశ్నను విపక్షాలు, కాంగ్రెస్ నేతలు కూడా జగన్‌ను చాలాకాలంగా అడుగుతున్నాయి. 'వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు జగన్ ఆస్తులెన్ని? ఇప్పుడు ఎన్ని?' అని నిలదీస్తున్నాయి. ఇక... జలయజ్ఞంలో కేవీపీ దోచుకున్నదెంత? మంత్రి పొన్నాల వాటా ఎంత? అని కొండా సురేఖ నిలదీశారు.

ఈపీసీలో అక్రమాలు జరిగాయని, అంచనాలు అడ్డగోలుగా పెంచారని, జలయజ్ఞంలో దోపిడీ జరుగుతోందని విపక్షాలు ఏళ్ల తరబడి నెత్తీ నోరు బాదుకున్నాయి. ఈ ఆరోణలను వైఎస్ పూచిక పుల్లతో సమానంగా తీసేస్తూ వచ్చారు. చివరగా... ఈ వివరాలన్నీ బయటపడాలంటే కేవీపీ స్వయంగా సీబీఐ విచారణను కోరుకోవాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు. ఆయన నిజంగానే సీబీఐ విచారణ కోరితే, ప్రభుత్వం అందుకు సరేనంటే... 'వైఎస్ పాత్రను మాత్రం విస్మరించి, కేవలం కేవీపీ అవినీతిపై విచారణ జరపడం సాధ్యమేనా?

ఎందుకింత ఆక్రోశం: వైఎస్ మరణం తర్వాత కేవీపీ వ్యవహార శైలిపై జగన్ వర్గం నేతలు ఏమాత్రం సంతృప్తిగా లేరు. అధిష్ఠానానికీ, జగన్‌కూ మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించాల్సింది పోయి... కేవీపీ అప్పటి సీఎం రోశయ్యకు సన్నిహితంగా మెలిగారన్నది వీరి ఆక్షేపణ. ఇప్పుడు కొత్త సీఎం కిరణ్ కుమార్ రెడ్డితోనూ కేవీసీ సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారని భావిస్తున్నారు. జగన్ వైపు మొగ్గు చూపుతున్న ఎమ్మెల్యేలను కేవీపీ కట్టడి చేస్తున్నారని, మంత్రివర్గ కూర్పులోనూ కీలక పాత్ర పోషించారని పేర్కొంటున్నారు.

జగన్‌కు కేవీపీ పూర్తి మద్దతు ప్రకటించినట్లయితే... ఎమ్మెల్యేలు కిరణ్ నియామకాన్ని వ్యతిరేకించేవారని, ప్రభుత్వం కూలిపోయేదని వాదిస్తున్నారు. "వైఎస్ వల్ల ఇంత పైకి వచ్చిన కేవీపీ... వైఎస్ మరణానంతరం కష్టమైనా, నష్టమైనా జగన్‌తోనే ఉండాలి. ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు'' అని జగన్ వర్గం ఆగ్రహిస్తోంది. ఈ ఆగ్రహమే సురేఖ లేఖ రూపంలో బయటపడినట్లు తెలుస్తోంది.

click here
జగన్‌కు క్లీన్‌చిట్‌ ఇమేజ్‌ కోసమే
YS-Jagan-sir
రాష్ట్రంలో ఆరేళ్లపాటు తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి కుడిభజంగా, ఆత్మబంధువుగా వ్యవహరించి, తీరా తాను కష్టాల్లో చిక్కుకుంటే పట్టించుకోకుండా సొంత రాజకీయ భవితవ్యం కోసం కాంగ్రెస్‌ చూరు పట్టుకుని వేళ్లాడుతున్న కేవీపీ రామచంద్రరావుపై జగన్‌ శిబిరం ఊహించని విధంగా దాడి ప్రారంభించింది. జగన్‌కు వీర విధేయు రాలయిన ఎమ్మెల్యే కొండా సురేఖ తాజాగా కేవీపీపై సం ధించిన లేఖాస్త్రంలోని ఆరోపణలు, విమర్శలు, దూషణలు పరిశీలిస్తే.. కేవీపీ భుజంపై తుపాకీ పెట్టి, కాంగ్రెస్‌ను పేల్చే ఎత్తుగడ స్పష్టమవుతోంది. వైఎస్‌ హయాంలో జరిగిన అవినీతి మొత్తానికి కేవీపీనే బాధ్యుడు కాబట్టి, దానికి వైఎస్‌ వారసుడయిన జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పి, ‘జగన్‌ పరిశుద్ధుడ’న్న ఇమేజ్‌ ఇచ్చే బ్రహ్మాండమైన వ్యూహానికి జగన్‌ వర్గం తెరలేపినట్లు కనిపిస్తోంది.

వరంగల్‌ జిల్లా పరకాల ఎమ్మెల్యే, జగన్‌ విధేయురాల యిన కొండా సురేఖ తాజాగా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై సంధించిన ఆరోపణాస్త్రాలు జగన్‌పై భవిష్యత్తులో ఎదురయ్యే అవినీతి ఆరోపణల నుంచి రక్షిం చి, ఆయనపై ఇప్పటికే ఉన్న ‘అవినీతి సంపాదన’ మకిలిని తొలగించేందుకు వేసిన ఎత్తుగడగా స్పష్టమవుతోంది. వైఎస్‌ సీఎం కాకముందు పెద్దగా ఆస్తులు లేని జగన్‌.. తండ్రి సీఎం అయిన తర్వాత లక్షకోట్లకు పడగలెత్తి, మీడి యా, పరిశ్రమలు స్థాపించారంటూ టీడీపీ ఇప్పటివరకూ ఆరోపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.

జగన్‌ పార్టీ స్థాపనకు సిద్ధమవుతున్నందున, భవిష్యత్తులో టీడీపీ ఇదే అవినీతి సంపాదనను మరింత విస్తృతంగా ప్రచారం చేస్తే జగన్‌ ప్రతిష్ఠ దెబ్బతిని ప్రజల్లో దోషిగా నిలబడవలసి వ స్తుందన్న ముందు చూపుతోనే జగన్‌ వర్గం కేవీపీని తెరపైకి తెచ్చింది. ఆయనపై అవినీతి ఆరోపణాస్త్రాలు చేయడం ద్వారా, నాటి మకిలిని ఆయనకే అంటించి, తాను మాత్రం పునీతుడిగా బయటకురావాలన్న వ్యూహం స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి... జగన్‌-కేవీపీ మధ్య చాలాకా లం నుంచి మనస్పర్థలు ఉన్నాయి. పార్టీకి విధేయుడిగా ఉండి లక్ష్యాన్ని సాధించుకోవాలన్నది కేవీపీ సలహా.

తనను అణచివేస్తున్న పార్టీలో కొనసాగడం అవివేకమన్నది జగన్‌ వాదన. ఇలా వారిద్దరూ చాలాకాలం నుంచీ విబేధాలతోనే గడిపారు. ఇటీవల కేవీపీ బెంగుళూరుకు వెళ్లి జగన్‌తో భేటీ అయిన సందర్భంగా.. కేవీపీని తన పార్టీలోకి రావ లసిందిగా అభ్యర్థించారు. దానిని కేవీపీ తిరస్కరించి, నీవే పద్ధతి మార్చుకుని పార్టీలో కొనసాగాలని కేవీపీ సూచిం చగా, జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసి నీ ఇష్టం వచ్చినట్లు చేసు కోమంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. అదీకాకుండా.. వారిద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు కూడా వివాదానికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

వైఎస్‌ మృతి చెందిన తర్వాత.. అంతకుముందు వరకూ వివిధ కాంట్రాక్టులు, కేటాయింపులు, ఒప్పందాలకు సంబంధించిన పంపకాల ‘లెక్కల్లో’ తేడా రావడం కూడా వారిద్దరి మధ్య గొడవలకు ప్రధాన కారణమన్న ప్రచారం జరుగుతోంది. తన తండ్రి వల్ల వచ్చిన వాటిని కొడుకునైన తనకు ఇవ్వాలని జగన్‌ పట్టుపడుతుండటం, ఆ లెక్కలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, వాటిని ఎప్పుడో క్లియర్‌ చేశానని కేవీపీ జవాబు ఇచ్చిన క్రమంలో వారిద్దరి మధ్య దూరం పెరిగినట్లు పార్టీ వర్గాల్లో బాహాటంగానే ప్రచారం జరుగుతోంది.

ఇక ఎట్టి పరిస్థితిలో కేవీపీ తన పార్టీలోకి రారని నిర్ధా రించుకున్న జగన్‌ వర్గం ఆయన భుజంపై తుపాకి పెట్టి కాంగ్రెస్‌ పార్టీని పేల్చడంద్వారా జగన్‌ను సచ్ఛీలుడిని చేసేం దుకే జగన్‌ సురేఖ ద్వారా లేఖ రాయించినట్లు కనిపిస్తోంది. జగన్‌ అనుమతి లేకుండా సురేఖ ఇంత సాహసం చేస్తా రనుకోవడం అవివేకమవుతుంది. కేవీపీ ఒకవేళ జగన్‌కు దన్నుగా నిలిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలేదని, అలా కాకుండా ఆయన అక్కడే ఉండటంతో పాటు.. జగన్‌ వైపు వచ్చే ఎమ్మెల్యేలను అధిష్ఠానం ఆదేశాలతో కట్టడి చేసి, సోనియాకు విధేయత చాటుకోవడం జగన్‌ శిబిరాన్ని ఆగ్రహానికి గురిచేసింది.

వైఎస్‌ సోదరుడు వివేకానంద రెడ్డిని అధిష్ఠానం వద్దకు తీసుకువెళ్లి, ఆయనను ప్రోత్సహించడం ద్వారా కుటుం బాన్ని చీల్చి, కుటుంబ ప్రతిష్ఠను మంటగలిపి, జగన్‌ బలాన్ని మానసికంగా దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిన కేవీపీపై అవినీతి ఆరోపణాస్త్రాలు సంధించడం ద్వారా.. ఆయనను అటు పార్టీకి ఇటు తనను నమ్ముకున్న వారికి కాకుండా చేయాలన్న వ్యూహం కూడా సురేఖ లేఖలో స్పష్టమవుతోంది. ఇదే అంశంపై వివేకా ఢిల్లీకి వెళ్లిన రోజే ‘చక్రం తిప్పిన కేవీపీ’ అన్న శీర్షికతో సూర్యలో వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే.

కేవీపీపై ఇప్పటికే వేల కోట్ల రూపాయల అవినీతి ఆరో పణలు ఉన్నందున, అవన్నీ వైఎస్‌తో కలిసే సంపాదిం చారని, అందులో ఇద్దరికీ వాటాలున్నయని పార్టీలు, ప్రజలు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఆ మరక జగన్‌కు అంటకుండా ముందుగానే దానిని చెరిపేసి, వాటితో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని, కేవీపీనే వైఎస్‌ను మాయచేసి డబ్బు సంపాదించారంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చేందుకు జగన్‌ వర్గం ప్రయత్నాలు ప్రారంభిం చినట్లు ఆ లేఖ చెప్పకనే చెబుతోంది.

ఆ అవినీతి సంపాద నంతా ఒక్క కేవీపీకే అంటగట్టడం ద్వారా, అలాంటి అవినీతి-అక్రమ సంపాదనకు వైఎస్‌ గానీ, ఆయన వారసుడయిన జగన్‌కు గానీ ఎలాంటి సంబంధం లేదంటూ కేవీపీని దోషిగా నిలబెట్టడమే జగన్‌ వర్గం అసలు లక్ష్యంగా స్పష్టమవుతోంది. దానితోపాటు, జిల్లాలో తన ప్రత్యర్థి అయిన టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వెలమ అయినందున, అదే కులానికి చెందిన కేవీపీ ఆయనను రక్షించి, ఎర్రబెల్లి ఆర్థిక-రాజకీయ ప్రయోజనాలను కాపాడటంలో కేవీపీ సహకరించారని, రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి హవా సాగడానికి కారణం కేవీపీయే కారణమన్న ఆగ్రహంతో ఉను సురేఖ ఆ కోపాన్ని ఈవిధంగా ప్రదర్శించారంటున్నారు.