|
మహానేత మనసా వాచా ఆచరించి చూపించిన సంక్షేమ పథాన్నే జెండాగా మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Showing posts with label Jaganism. Show all posts
Showing posts with label Jaganism. Show all posts
Thursday, May 3, 2012
మహాసంగ్రామానికి నాంది
Wednesday, May 2, 2012
పేదవారి గురించి తపనే నా కులం : వైఎస్ జగన్
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఉద్ఘాటన
* ఒక నాయకుడి మతం, కులంపై మాట్లాడే స్థాయికి రాజకీయాలు దిగజారాయి
* పేదలు, రైతులకు అండగా ఉన్నందుకే 17 చోట్ల ఉప ఎన్నికలు
* తన స్వార్థం కోసం చిరంజీవి తిరుపతి ప్రజలను గాలికొదిలేశారు
* ప్రజారాజ్యం పార్టీని హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మేశారు
* నన్ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించానంటున్నారు
* సంతకాలు చేయించే ఉంటే.. ఆనాడే చంద్రబాబులా వారిని వైస్రాయ్ హోటల్‌కు తీసుకెళ్లేవాడిని.. సీఎంగా ప్రమాణం చేసేవాణ్ణి
* నేను సీఎం కావాలని ఎవరు సంతకాలు పెట్టించారో చెప్పండి
* నాడు రోశయ్యను సీఎంగా ప్రతిపాదించింది నేను కాదా?
తిరుపతికి గాలేరు-నగరి తెస్తా
‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలాగా.. చనిపోయాక కూడా పేదవాడి గుండెల్లో నిలిచేలా బతకాలన్న తపన, తాపత్రయం నాలో ఉన్నాయి. అందుకే చెబుతున్నా రాబోయే సువర్ణయుగంలో తిరుపతికి గాలేరు-నగరి తెస్తా.. తాగునీటి సమస్య తీరుస్తా’’ - జగన్‌మోహన్‌రెడ్డి
చిరంజీవి స్వార్థం వల్లే తిరుపతిలో ఉప ఎన్నికలు: రైతన్నకు, పేదోడికి అండగా నిలబడితే పదవులు పోతాయని తెలిసినా.. నీతి, నిజాయతీతో కూడిన రాజకీయాలు చేసినందుకు 17 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురయ్యారు. అందువల్లే ఆ 17 చోట్ల ఉప ఎన్నికలు వచ్చాయి. కానీ తిరుపతిలో చిరంజీవి స్వార్థం కోసం ఉప ఎన్నికలు వచ్చాయి. చిరంజీవే స్వయంగా చెప్పారు.. సోనియా గాంధీ ఆయనకు ప్రమోషన్ ఇచ్చారట.. అందుకని ఇక్కడి ప్రజల్ని గాలికొదిలేసి ఆయన రాజ్యసభకు వెళ్తున్నారట. తిరుపతిలో నాలుగురోజులకోసారి నీళ్లు ఇస్తున్నారని, ప్రభుత్వం నీటి ఎద్దడి పరిష్కరించలేదని చిరంజీవి రాజీనామా చేసుంటే సంతోషించేవాళ్లం. ఆయనకు నేను కూడా సెల్యూట్ చేసి ఉండేవాణ్ణి. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కుదించారని, 108కు ఫోన్ చేసినా వాహనం వచ్చే పరిస్థితి లేదని రాజీనామా చేసుంటే అభినందించేవాళ్లం. రంగారెడ్డి జిల్లాకు చెందిన వరలక్ష్మి లాంటి పేద అమ్మాయి చదువుకోలేక, ఫీజు కట్టలేక ఆత్మహత్యకు పాల్పడింది. అలాంటి వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని రాజీనామా చేసుంటే గర్వపడుండేవాళ్లం. పదవి కోసం, కావాల్సిన వారికి మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు చిరంజీవి హోల్‌సేల్‌గా తన పార్టీని కాంగ్రెస్‌కు అమ్ముకున్నారు. ఇప్పుడు చెప్పండి స్వార్థపరుడు చిరంజీవా, నేనా?
చిరంజీవి ఎప్పుడూ నాపై నింద వేస్తూనే ఉన్నారు: చిరంజీవి మాటిమాటికీ నా మీద ఏదో ఒక నింద వేస్తూనే ఉన్నారు. ఆ వేళ నాన్న చనిపోయినప్పుడు.. నన్ను సీఎంగా చెయ్యాలంటూ 150 మందికిపైగా ఎమ్మెల్యేలతో నేను సంతకాలు చేయించానని అంటున్నారాయన. ఆ 150 మందికిపైగా ఎమ్మెల్యేల్లో కొంతమంది చిరంజీవి వద్దకు బహిరంగంగా అందరికీ తెలిసేటట్లుగా వెళ్లి.. వాళ్లందరినీ(పీఆర్‌పీ ఎమ్మెల్యేలందరినీ) నాకు మద్దతు తెలపాలని అడిగినట్లు చిరంజీవి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దీనిపై చిరంజీవిని మా పార్టీ వాళ్లు చాలాసార్లు ఎదురు ప్రశ్నించారు. ఆయన వద్దకు వచ్చిన వారెవరో చెప్పాలని పదే పదే అడిగారు. ‘సాక్షి’లో కూడా చాలాసార్లు ఈ విషయాన్ని వేస్తూ వచ్చారు. అయితే ఆ ప్రశ్నలకు చిరంజీవి సమాధానం చెప్పలేదు. ఇప్పుడేమో బాబు కూడా చిరంజీవి మాటే మాట్లాడుతున్నారు.
కొంచెమైనా జ్ఞానముందా చిరంజీవీ?: నన్ను సీఎంగా చేయాలని 150 మందికిపైగా ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించే దుర్బుద్ధే నాకు ఉంటే.. చంద్రబాబు నాయుడిలా వాళ్లందరినీ ఆ నాడే వైస్రాయ్ హోటల్‌కు తీసుకెళ్లిపోయేవాణ్ణి.. ఆ వెంటనే నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేవాణ్ణి. అయ్యా చంద్రబాబూ.. ఆ రోజు ఎవరు సంతకాలు చేయించారో నాకు తెలీదు. మీకు తెలిస్తే మీరైనా చెబితే సంతోషిస్తాను. అయ్యా చిరంజీవిగారూ.. కొంతమంది ఎమ్మెల్యేలను మీ వద్దకు పంపించి మద్దతు కోరానని మీరు చాలాసార్లు అన్నారు. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నాకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలను మీ దగ్గరకు అలా బహిరంగంగా పంపించానని సోనియాకు తెలిస్తే.. నన్ను ఎలా సీఎం చేస్తారయ్యా? నీకు కొంచెమైనా జ్ఞానముండాలి కదయ్యా చిరంజీవి ఆ మాట మాట్లాడ్డానికి.
ప్రజల చేత ఎన్నుకోబడిన సీఎంనవుతా: చంద్రబాబుకు, చిరంజీవికి ఇద్దరికీ చెప్తున్నా.. మీ మాదిరిగా నేను అధికారం కోసం ఏ గడ్డయినా తినేవాణ్ణికాదు. అధికారం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచే చరిత్ర నాకు లేదు చంద్రబాబూ! ఓటేసిన 70 లక్షల మంది ప్రజల్నీ స్వార్థం కోసం నట్టేట ముంచిన చరిత్ర నాదికాదయ్యా చిరంజీవి.. అది నీదేనయ్యా. అధికారం అనేది దేవుడు నా నుదుట రాసిపెడితే.. అదెలా ఉంటుందీ అంటే.. పేదవాడి కొరకు, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన సీఎంగా నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. నా నైజం, నా గుణగణాలు ఇవే. ఈ మాదిరిగా నేను సీఎం అవుతానేకాని... మీలాగా దొడ్డిదారిన పదవి చేపట్టాలని తాపత్రయపడను. ఇవాళ చంద్రబాబును నేను ఒక్క మాట అడుగుతున్నా.. ఆ వేళ నేనే కదయ్యా రోశయ్యను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిందీ అని అడుగుతున్నా.
అందరూ ఒక్కటై దాడి చేస్తున్నారు: ఇవాళ అధికారం కోసం వెంపర్లాడుతూ నా మీద రోజుకో మాట మాట్లాడుతున్నారు. రోజుకో నింద వేస్తున్నారు. నన్ను ఒక్కడిని చేశారు. అటు సోనియా గాంధీ వైపు నుంచి కాంగ్రెస్‌వాళ్లు, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ కాంగ్రెస్ వాళ్లతో కలిసి దాడి చేస్తున్నారు. వాళ్ల దగ్గర అధికారం ఉంది. వాళ్ల దగ్గర ఉన్న వ్యవస్థలను అడ్డగోలుగా నా మీదకు ఉసిగొల్పుతున్నారు. మరోవైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 అంతా కలిసి దాడి చేస్తున్నారు.. నన్ను ఒక్కడిని చేసి వీరందరూ ఒక్కటై దాడి చేస్తున్నారు. రోజుకో కట్టు కథ.. రోజుకో అబద్ధం. రోజూ చెప్పిందే చెప్పి దుష్ర్పచారం చేసి ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తున్నారు. నన్ను ఒక్కడిని చేసి మీరంతా ఏకం కావచ్చు. నా దగ్గర రాజ్యాలు లేకపోవచ్చు.. మద్దతిచ్చే రాజులు లేకపోవచ్చు.. నా దగ్గర గుర్రాలు లేకపోవచ్చు. కానీ పై నుంచి ఆ దేవుని ఆశీస్సులు, నాన్నను ప్రేమించే ప్రతి గుండే నా వెంటే ఉందని చెప్తున్నా.
మీ ఓటు మార్పునకు నాంది: త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో పేదవాడు, రైతు ఓ వైపు.. కుళ్లు, కుతంత్రాలు మరోవైపు ఉండి పోటీ పడుతున్నాయి. మీరు వేసే ఓటుతో ఈ రాష్ట్రాన్ని రిమోట్‌తో పాలిస్తున్న ఢిల్లీ పాలకుల దిమ్మ తిరగాలి. మీరు వేసే ఓటు రాష్ట్రంలో మార్పు తేవాలి. ఆ మార్పుతో రాష్ట్రంలో త్వరలో మళ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు సువర్ణయుగం వస్తుంది. ప్రతి అక్క, అన్న.. తమ తమ్ముడు సీఎం అయ్యాడని, ప్రతి చెల్లెలు, ప్రతి తమ్ముడు తమ అన్న సీఎం అయ్యాడని.. ప్రతి అవ్వా, తాత తమ మనవడు సీఎం అయ్యాడని అనుకునే విధంగా, ప్రతి రైతు, పేదవాడు కాలర్ ఎగరేసేలా ఆ సువర్ణయుగం ఉంటుంది. ఏటా పేదలకు 10 లక్షల ఇళ్లు కట్టించే విధంగా పాలన ఉంటుంది.
Friday, January 27, 2012
సర్కారు కళ్లు తెరిపిద్దాం! * గుంటూరు ఓదార్పులో జగన్ పిలుపు
*వస్త్ర వ్యాపారులకు అండగా నిలుద్దాం
*వ్యాట్ విధింపుపై ఆరు నెలలుగా పోరాటం చేస్తున్నా చలనం లేదు
*ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి.. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా తయారైంది
‘‘వస్త్రాలపై వ్యాట్ తగ్గించాలని చిన్న చిన్న వ్యాపారులు కూడా దుకాణాలు మూసివేసి సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు.. ఈ పాలకుల కళ్లు తెరిపించేందుకు ప్రజలు సిద్ధం కావాలి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పేద వ్యాపారులకు తోడుగా నిలుద్దామని అన్నారు. గురువారం గుంటూరు జిల్లా గురజాల పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి జగన్... 58వ రోజు ఓదార్పు యాత్రను ప్రారంభించారు.
గురజాల నియోజకవర్గం దాచేపల్లి, గురజాల మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జగన్నాథపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాను బొడ్డపాటి అంజిరెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. మొత్తం ఏడు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్రసంగించారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...
చెవిటివాని ముందు శంఖం ఊదినట్టుగా..
పెంచిన వ్యాట్ తగ్గించాలని వస్త్ర వ్యాపారులు దుకాణాలు మూసేశారు. ఆరు నెలల నుంచి ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తూనే ఉన్నారు. చిన్నచిన్న దుకాణాల వాళ్లు కూడా షాపులు మూసి సమ్మె చేస్తున్న పరిస్థితులు ఉన్నా... వారిని పట్టించుకునే నాథుడే లేడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి... చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా తయారైంది. ఈ చిన్నచిన్న దుకాణాల వాళ్లకు మద్దతుగా నిలబడటం కోసం శుక్రవారం రోజున (నేడు) నరసరావుపేటలో ధర్నా చేయబోతున్నాం. దుకాణదారులకు మద్దతుగా ప్రజలంతా ఈ ధర్నాలో పాలుపంచుకోవాలని కోరుతున్నా. నేను కూడా మీతో పాటుగా అక్కడ ధర్నాలో పాలు పంచుకుంటాను.
మాట వదిలేస్తే బతకటమే అనవసరం..
మాటంటూ ఇస్తే ఎన్నికల వేళ ప్రజలను మోసం చేయడానికి కాదు.. కష్టమైనా.. నష్టమైనా ఇచ్చిన మాట తప్పకూడదని.. మడమ తిప్పకూడదని.. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం తెచ్చిన దివంగత వైఎస్సారే నాకు స్ఫూర్తి. ప్రజల గుండె చప్పుడు వినాలని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మండుటెండలో కాలినడకన 1500 కిలోమీటర్లు ప్రయాణించిన ఆ మహానేత అడుగుజాడల్లోనే నా పయనం. నాడు నల్లకాలువ సంతాప సభలో పాల్గొన్నప్పుడు నా మనసు నిండా బాధ ఉంది. తండ్రిని పోగొట్టుకున్న బాధ ఎలా ఉంటుందో తెలిసింది.
దివంగత నేత కోసం ఎవరెవరు చనిపోయారో ఆ ప్రతి కుటుంబాన్నీ కలిసి పరామర్శిస్తానని అప్పుడే మాట ఇచ్చాను. అది నువ్వు ఎందుకు చెప్పావని ఎవరైనా అడిగితే.. నేను సమాధానం చెప్పలేను. దేవుడు ఆ మాట నా చేత ఎందుకు చెప్పించాడో తెలియదు. ఎలాంటి రాజకీయాలు లేని ఆ వేళ నేను కల్మషం లేని మనస్సుతో ఆ మాట చెప్పాను. నేను ఇచ్చిన ఆ మాటను గాలికి వదిలేయమన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. అలా నేను చేయలేనని చెప్పాను. కారణం ఏమిటంటే.. ఇచ్చిన మాటను వదిలేస్తే నేను బతికి ఉండటం కూడా అనవసరం అనిపించే ఆ మాట చెప్పా.
మాట తప్పనందుకే సీబీఐ విచారణ..
ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నందుకు ఇవాళ నా మీద సీబీఐ విచారణ వేశారు. ఇన్‌కంటాక్స్ కేసులు పెట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంటు డెరైక్టరేట్‌తో నా మీద దాడులు చేయించారు. అన్నీ జరిగాయి. కానీ ఆ మాటపై నిలబడినందుకు నేను ఇవాళ కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాను. 600 గుడిసెల్లోకి వెళ్లాను.. ప్రతి పేదవాడు పడుతున్న కష్టాన్ని దగ్గర నుంచి చుశాను.. ఆ మాటను గాలికి వదిలేసి ఉంటే బహుశా ఎప్పటికి కూడా నేను ఇవ న్నీ చూసి ఉండక పోయేవాణ్నేమో.

Thursday, January 12, 2012
తరలివచ్చిన పల్లెలు * రెండో రోజూ ‘రైతు దీక్ష’కు అదే ఆదరణ
వైఎస్ జగన్‌ను చూడ్డానికి తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన కర్షకులు, వృద్ధులు, మహిళలు, కార్యకర్తలు
ఉదయం నుంచే పోటెత్తిన జనం.. రాత్రి దాకా బారులు
ఎండిన పంటలు తీసుకొచ్చి గోడు చెప్పుకొన్న రైతన్న
దీక్ష వద్ద న్యూడెమోక్రసీ కార్యకర్తల ఆందోళన
నేటితో ముగియనున్న మూడు రోజుల రైతు దీక్ష
సాయంత్రం నాలుగు గంటలకు ముగింపు సభ ప్రారంభం
అదే ఆదరణ.. అదే అభిమానం.. అపూర్వ నీరాజనం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని పెర్కిట్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రైతు దీక్ష’కు రెండో రోజూ పల్లె జన ప్రవాహం వెల్లువెత్తింది. దీక్ష జరుగుతున్న వైఎస్సార్ ప్రాంగణం జన జాతరను తలపించింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు జన ప్రవాహం పోటెత్తింది. ‘ఒక్కసారి జగనన్నను చూడాలి.. మా గోడు చెప్పుకోవాలి..’ అంటూ కర్షకులు, కార్మికులు, వృద్ధులు, విద్యార్థులు, పిల్లాపాపలతో మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తెలంగాణలోని అన్ని పల్లెల నుంచీ అత్యధిక సంఖ్యలో దీక్షా ప్రాంగణానికి చేరుకున్న రైతన్నలు ఉదయం నుంచి రాత్రి వరకు బారులు తీరి కనిపించారు. అన్నదాతలతో పాటు అన్ని వర్గాలూ మద్దతు పలకటంతో దీక్షకు అంచనాలకు మించిన స్పందన లభించింది.
తెల్లవారుజాము నుంచే..
వైఎస్ మరణించాక..
నిజామాబాద్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి రైతులు దీక్షకు తరలివచ్చారు. తమ కన్నీటి కరువు గోడును జగన్‌తో చెప్పుకునేందుకు పోటీ పడ్డారు. గంటల తరబడి క్యూలో నిలబడి తమ కష్టనష్టాలను విన్నవించుకున్నారు. తమను పట్టించుకునేవారెవరూ లేరని, వైఎస్‌ఆర్ మరణం తర్వాత తమ బతుకు దుర్భరంగా మారిందని కొందరు పసుపు రైతులు జగన్ ఎదుట కంటతడి పెట్టారు. ఎండిన పంటలను వెంట తెచ్చి.. తమ కష్టాలను కళ్లకు కట్టారు. రైతులు చెప్పినదంతా సావధానంగా ఆలకించిన జననేత.. ఏం చేస్తే.. సమస్య పరిష్కారమవుతుందని వారినే అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కష్టాలు తీరే మంచి రోజులు వస్తాయని.. మనో నిబ్బరం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు.
ఇంటికి ఒకరు చొప్పున..
ఆర్మూరు మండలంలోని మంథని గ్రామం నుంచి ఇంటికి ఒకరు చొప్పున గ్రామస్థులంతా దీక్షా స్థలికి వచ్చారు. గ్రామాభివృద్ధి కమి టీ తీర్మానం మేరకు.. వారందరూ ఇలా సామూహికంగా దీక్షకు తరలివచ్చారు. ఆ గ్రామ ప్రజలను వైఎస్ జగన్ అప్యాయంగా పలకరించి తన ఆత్మీయతను పంచుకున్నారు. మరోవైపు అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన పార్టీ నేతలు, స్వచ్ఛందంగా వచ్చిన వలంటీర్లతో దీక్షా ప్రాంగణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయి. జగన్‌కు తమ సంఘీభావం తెలి పేందుకు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వందలాదిగా పార్టీ ముఖ్య నేతలు తరలి వచ్చారు. ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఎం.ప్రసాదరాజు, పి.రామకృష్ణారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జంగా కృష్ణమూర్తి, రఘురామిరెడ్డి, మర్రి రాజశేఖర్, బోడ జనార్ధన్, ఎడ్మ కృష్ణారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, వైఎస్‌ఆర్ మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మలాకుమారి, యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ వినయ్‌రెడ్డితో పాటు జిల్లాల పార్టీ కన్వీనర్లు దీక్షలో పాల్గొన్నారు.
చూస్తే చాలని వచ్చాం..
వేలాది మంది రైతులతో పాటు ఆర్మూరు, పెర్కిట్ పరిసర మండలాల నుంచి పిల్లా పాపలను వెంటేసుకొని మహిళలు, వృద్ధులు తరలిరావటం దీక్షలో ప్రత్యేకం. ‘జగన్‌ను చూస్తే చాలనుకుని వచ్చాం. ఆయన్ను కలిసే అవకాశం దక్కింది.. మా పిల్లలను ఆత్మీయంగా పలకరించాడు. ఎంతో ఆనందంగా ఉంది..’ అంటూ పెర్కిట్‌కు చెందిన లావణ్య ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈమె తన రెండేళ్ల చిన్నారి నందినిని ఎత్తుకొని, అయిదేళ్ల నవ్యశ్రీని చేత్తో పట్టుకొని దీక్షా స్థలికి వచ్చారు. ఈమెతోపాటు పొరుగున ఉన్న మరో మహిళ జ్యోతి కూడా తన చిన్నారిని దీక్షకు తీసుకొచ్చారు. ఆమె వెంట బుడిబుడి అడుగులేస్తూ ఆ చిన్నారి వర్షిణి అందరినీ ఆకర్షించింది.
వైఎస్‌ను కలవాలనుకున్నా..
న్యూడెమోక్రసీ ఆందోళన
గురువారం ముగింపు సభ
మంగళవారం ప్రారంభించిన మూడు రోజుల రైతు దీక్ష గురువారంతో ముగియనుంది. ‘రైతు దీక్ష’ ముగింపు సభ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు.
తమ కోసం దీక్ష చేపట్టిన జననేతను చూసేందుకు రైతులు బారులు దీరారు. తమ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చిన రాజన్న బిడ్డను కలుసుకునేందుకు ఊళ్లకు ఊళ్లు తరలి వచ్చాయి. సర్కారు వ్యవ‘సాయం’పై చిన్నచూపు చూస్తోందని, ఆరుగాలం కష్టపడ్డా ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయని అన్నదాతలు జగన్‌తో ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాక రైతులు, అభిమానులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలతో దీక్షా ప్రాంగణం జాతరను తలపించింది.
పల్లె పల్లెనా... జనం దండు కదిలింది. వైఎస్ జగన్ తలపెట్టిన రైతు దీక్షకు ఊరూవాడా తరలివచ్చింది. జై తెలంగాణ... జై జగన్ నినాదాలు వెల్లువెత్తాయి. ఆర్మూర్ మండలం మం థని గ్రామం నుంచి ఇంటింటికి ఒకరు చొప్పున ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావటం రెండో రోజు ‘రైతుదీక్ష’లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిం ది. మరోవైపు కరువుతో పంట నష్టపోయిన రైతులు ఎండిన పంటలను వెంట తెచ్చి... జగన్‌కు చూపించి గోడు వెళ్లబోసుకున్న తీరు సాగు సంక్షోభానికి అద్దం పట్టింది. ఈ ప్రాంతంలో ప్రధానంగా సాగు చేసే పసుపు రైతుల ఇక్కట్ల ను తెలుసుకునేందుకు జగన్ ఎక్కువ సమయం వెచ్చించటం గమనార్హం. కరువుతో నష్టపోయామని తన వద్దకు వచ్చిన రైతుల బాధను పంచుకున్నారు. తమకు అండగా నిలిచేందుకు జగన్ తలపెట్టిన రైతుదీక్షకు అన్నదాతలు సంపూర్ణ మ ద్దతు ప్రకటించారు. జిల్లాలోని వివిధ ప్రాంతా ల నుంచి రైతులతో పాటు పిల్లలు, వృద్ధులు, మహిళలు పోటెత్తారు. వైఎస్‌ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను తలుచుకుంటూ... ‘మీ మేలు మరిచిపోం రాజన్నా’ అంటూ విద్యార్థులు, మహిళలు జగన్‌ను కలుసుకునేందుకు ఎగబడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కారణంగానే తాము చదువుకుంటున్నామంటూ వందలాది మంది విద్యార్థులు ముక్తకంఠంతో తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌కు తామెంతో రుణపడి ఉన్నామని జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఆర్మూర్‌లోని వైఎస్‌ఆర్ ప్రాంగణంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు జన సందోహం వెల్లివిరిసింది. తమ అభిమాన నేతను కలిసి వెళ్లాలనే పట్టుదలతో రాత్రి వరకు జనం నిరీక్షించటంతో పాటు తమవంతు ఎప్పుడొస్తుందా... అని బారులు తీరటం విశేషం. ఉదయం 7గంటలకు దీక్షలో బైఠాయించిన జగన్ రాత్రి 9 గంటలకు వేదికపైనే నిద్రకు ఉపక్రమించారు. నిర్విరామంగా 14 గంటల పాటు దీక్ష చేపట్టడంతో పాటు తనను కలిసేందుకు వ చ్చిన ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించా రు. ఓపికగా వారి ఆవేదనను తెలుసుకునేందు కు ఆసక్తి ప్రదర్శించారు. కరువు కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని వెన్ను తట్టారు. మహానేత వైఎస్‌ఆర్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించేందుకు వచ్చిన జనం జా తరతో పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం పెల్లుబికింది. జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తరలిరావటం తో రాజకీయ సందడి అలుముకుంది. ఒక దశ లో వేదికపైకి వెళ్లి తమ నేతను కలుసుకునేం దుకు పార్టీ నేతలు సైతం పోటీ పడ్డారు.
జిల్లాలో పట్టున్న నేతలు బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు కొత్తగా చేరిన మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి, మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి, కెప్టెన్ కరుణాకర్‌రెడ్డిల ప్రభావంతో జిల్లా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉప్పొంగింది. దీక్షా ప్రాంగణంలో వంగపండు ఉష సారథ్యంలో వరంగల్ నుంచి వచ్చిన కళాబృందాల ఆటాపాటా అందరినీ ఆకట్టుకుంది. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు రైతు దీక్ష ముగింపు సభ జరుగనుంది. తెలంగాణపై జగన్ తన వైఖరి ప్రకటించాలని న్యూడెమోక్రసీ కార్యకర్తలు రెండుసార్లు ఆందోళనకు దిగటం కాసేపు అలజడి రేపింది.
పోలీసులు వారిని అదుపులోనికి తీసుకోవటంతో గొడవ సద్దుమణిగింది. రెండో రోజు దీక్షలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, అమరనాథ్ రెడ్డి, శ్రీనివాసులు, ప్రసాద్‌రాజు, రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు కొండ మురళి, మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కుంజ భిక్షం, చంద లింగయ్య, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, గట్టు రాంచందర్‌రావు, సినీ నటుడు విజయ్‌చందర్, పార్టీ జిల్లా కన్వీనర్ వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి బోడ జనార్ధన్, నాయకులు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, పెద్ద పట్లోల్ల సిద్దార్థరెడ్డి, కృష్ణారెడ్డి, మహిళావిభాగం అధ్యక్షురాలు నిర్మలకుమారి, మహిళా నాయకురాలు మమతారెడ్డి, సుజాత మంగిలాల్, సారథ్య కమిటీ సభ్యులు గాదె నిరంజన్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, రాముల రవీందర్‌రెడ్డి, మదన్‌లాల్ నాయక్, గుత్త ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ శ్రవణ్‌రెడ్డి, జనక్ ప్రసాద్, మునిపల్లి సాయిరెడ్డి, మార చంద్రమోహన్‌రెడ్డి, మానాల మోహన్‌రెడ్డి, పండిత్ ప్రేమ్, పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు.
Thursday, September 1, 2011
''మళ్లీ వస్తాను.. మీ అందరినీ కలుస్తాను.. జగన్ మీ వాడు.. మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు’'
కృష్ణా జిల్లా గ్రామాలకు జగన్ హామీ
తొలి విడత ఓదార్పు యాత్ర ముగించుకుని....
వెళుతుండగా అడ్డుపడిన అభిమానులు
తమ గ్రామాలకు రావాలంటూ పట్టు....
త్వరలోనే మలి విడత యాత్రకు వస్తానన్న జననేత
తొలి విడత 17 రోజుల్లో 809 కి.మీ. ప్రయాణం
‘త్వరలోనే మళ్లీ వస్తాను.. మీ అందరినీ కలుస్తాను.. జగన్ మీ వాడు.. మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు’ అని కృష్ణా జిల్లా వాసులను ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లాలో తొలి విడత ఓదార్పు యాత్రను బుధవారం ముగించుకొని గన్నవరం విమానాశ్రయానికి వెళుతుండగా మార్గం మధ్యలో పలు గ్రామాల ప్రజలు తమ ఊళ్లకు రావాలంటూ పట్టుబట్టడంతో ఆయన పై విధంగా నచ్చజెబుతూ ముందుకు కదిలారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లారు.
17 రోజులైనా షెడ్యూలు పూర్తికాలేదు..

తొలుత అనుకున్న షెడ్యూలు ప్రకారం జిల్లాలో యాత్ర 16 రోజుల్లో పూర్తవ్వాలి. అయితే వరుసగా 17 రోజులపాటు పర్యటించినా షెడ్యూలులో సగం కూడా పూర్తికాలేదు. అడుగడుగునా జన తాకిడి, షెడ్యూల్లో లేని గ్రామాలకూ రావాలంటూ ప్రజలు పట్టుబట్టడంతో రోజూ యాత్రలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. దీంతో ఎలాగైనా షెడ్యూలును సకాలంలో పూర్తిచేయడానికి జగన్ రోజూ అర్ధరాత్రి దాటాక 2 వరకు కూడా ప్రయాణించారు. వర్షాలు కురుస్తున్నా లెక్కచేయకుండా వాటిలో తుడుస్తూనే ఆత్మబంధువుల ఇళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయినప్పటికీ యాత్రను విరామం లేకుండా కొనసాగించారు. కాగా సెప్టెంబర్ 2న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నేపథ్యంలో ఆయన యాత్రకు విరామమిచ్చారు.
17వ రోజు యాత్ర సాగిందిలా..
ఓదార్పు యాత్ర 17వ రోజు బుధవారం ఆయన బోర్వంచ గ్రామంలోని మసీదులో ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. తర్వాత రావిచర్ల, కొత్త రావిచర్ల గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి గన్నవరం బయలుదేరారు. మార్గం మధ్యలో ఆగిరిపల్లి, తోటపల్లి, గొల్లనపల్లి, బీబీగూడెం, గన్నవరం తదితర గ్రామాల ప్రజలు తమ ఊళ్లకు రావాలని పట్టుబట్టారు. మలి విడత ఓదార్పు యాత్రకు త్వరలోనే వస్తానని, అప్పుడు తప్పకుండా వారి గ్రామాలకు వస్తానని నచ్చజెప్పి జగన్ ముందుకు సాగారు.
ఎదురు చూస్తుంటాం.. వెళ్లిరా నాయినా
మంగళవారం ఓదార్పు యాత్ర షెడ్యూల్‌లో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి ముసునూరు మండలంలోని బాసవరప్పాడు, అక్కిరెడ్డిగూడెం, చక్కపల్లి, వలసపల్లి మీదుగా ముసునూరు మండల కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. జన తాకిడితో యాత్ర దాదాపు ఎనిమిది గంటలు ఆలస్యమయింది. తుమ్మగూడెంలో విగ్రహావిష్కరణ చేసే సమయానికి అర్ధ రాత్రి దాటిపోయింది. అప్పటికే జగన్ బాగా అలసిపోవడంతో నిర్వాహకులు పై గ్రామాల్లో యాత్రను వాయిదా వేశారు.
కాగా జననేతకోసం రాత్రి ఒంటి గంట వరకు ఎదురు చూసిన మర్లపాడు గ్రామస్తులు బుధవారం జగన్ కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. తమ గ్రామాలకు రావాలంటూ పట్టుబట్టారు. ‘అమ్మా జ్వరంగా ఉంది... మళ్లీ వస్తాను. దారి ఇవ్వండి’ అని జగన్ వారిని కోరడంతో గ్రామస్తులు ఆయనకు దారిచ్చారు. ‘నీ కోసం ఎదురు చూస్తుంటాం.. తప్పకుండా రావాలి.. నాన్న విగ్రహాన్ని ఆవిష్కరించాలి’ అని ఆ గ్రామస్తులు కోరారు. జగన్‌మోహన్‌రెడ్డికి వీడ్కోలు పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.
809 కిలోమీటర్లు.. 22 కుటుంబాలు
కృష్ణా జిల్లా తొలి విడత ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, నూజివీడు, తిరువూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. 17 రోజుల్లో మొత్తం 809 కిలోమీటర్లు ప్రయాణించి 223 గ్రామాలను పలకరించారు. 237 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి 22 బాధిత కుటుంబాలను ఓదార్చారు. బుధవారం యాత్రలో జగన్ వెంట కృష్ణా జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, పూడూరు గౌతంరెడ్డి తదితరులున్నారు.

Thursday, July 21, 2011
ఇబ్బందులెదురైనా నాన్న బాటలోనే...........
నంద్యాల సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటన
కేబినెట్ సమష్టి నిర్ణయాలైనా.. వైఎస్ ఒక్కడిపై బురదజల్లేందుకే కేసులు
కాంగ్రెస్, టీడీపీ నన్ను రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నాయి
రెండెకరాలతో రాజకీయాల్లోకొచ్చిన బాబుకు
ఇప్పుడు వీధివీధినా హెరిటేజ్ షాపులెలా వచ్చాయి?

కర్నూలు జిల్లా ఓదార్పు యాత్ర : ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చూపిన బాటలోనే నడుస్తానని, ఆయన ఆశయాలను కొనసాగించి తీరతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ‘‘ఇవాళ నన్ను, నా తల్లిని నాశనం చేయాలన్న దురుద్దేశంతో చంద్రబాబు, కాంగ్రెస్, ఈనాడు, మరో తోకపత్రిక, టీవీ-9 చానెల్ అందరూ ఒక్క తాటిపైకి వచ్చారు. అయినా బెదిరేది లేదు. మాట తప్పేది లేదు.. వారందరికీ లేనివి.. నాకు, నా తల్లికి మాత్రమే అండగా ఉన్నవి.. ఆ దేవుడి దయ, వైఎస్‌ను అభిమానించే గుండె చప్పుడు’’ అని ఆయన ఉద్వేగంగా అన్నారు. కర్నూలు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా ఆయన బుధవారం రాత్రి 11:30కు నంద్యాల బహిరంగ సభలో ప్రసంగించారు. దాదాపు ఆరుగంటలు ఆలస్యంగా జగన్ ఇక్కడికి చేరుకున్నారు. అంత ఆలస్యమైనప్పటికీ వేలాది మంది ప్రజలు నిరీక్షించారు. స్థానిక శ్రీనివాస సెంటర్‌లో వైఎస్ విగ్రహావిష్కరణ అనంతరం ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్, టీడీపీలపై నిప్పులు చెరిగారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘మాట ఇస్తే కష్టమైనా నష్టమైనా తప్పకూడదని, ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం.. బతికనంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యమని నమ్మి.. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన వ్యక్తి రాజశేఖరరెడ్డి. ఆ మహానేతకు పుట్టిన కొడుకుగా ఆయన బాటలోనే నడుస్తూ నేను ఇచ్చిన మాట కోసం నిలబడ్డా. బాధెక్కడ అనిపిస్తోందీ అంటే.. ఆ మహానేత రెక్కల కష్టంమీద ఏర్పడిన రాష్ట్ర, దేశ ప్రభుత్వాలు ఈ రోజు ఆ కృతజ్ఞత కూడా లేకుండా.. ఆయన చనిపోయారన్న ఆలోచన కూడా లేకుండా, ఆయన తిరిగివచ్చి సమాధానం చెప్పుకోలేరన్న సంగతి తెలిసి.. రాజశేఖరరెడ్డిపై బురదజల్లుతున్నాయి. ఆయన చేసిన పాపమల్లా ఒకటే ఒకటి.. చనిపోయిన తర్వాత ప్రతి గుండెలో బతికి ఉండడమే. నేను చేసిన తప్పల్లా ఒకటే ఒకటి.. ఇచ్చిన మాట మీద నిలబడడం, దాని కోసం ఎంతవరకైనా పోరాడ్డానికి సిద్ధపడడమే.
మీరంతా కలిసి తీసుకున్న నిర్ణయాలే కదా..: ఆ మహానేత మీద బురదజల్లడానికి కాంగ్రెస్ పెద్దలు ఎన్ని కుట్రలు పన్నుతున్నారంటే... అదే పార్టీకి చెందిన మంత్రితో కోర్టులో కేసు వేయిస్తారు. వైఎస్ చనిపోయి రెండేళ్లయిపోయాక ఇప్పుడు కేసు వేశారేంటయ్యా అని అడిగితే..సోనియా వెయ్యమంటేనే వేశాను అంటారా మంత్రి. ఆ రోజు కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు.. మంత్రివర్గ సభ్యులంతా కలిసి తీసుకున్నవి కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈ కాంగ్రెస్‌కు టీడీపీ కూడా తోడై.. రెండూ కలిసి నన్ను రాజకీయంగా అణగదొక్కడం కోసం చనిపోయిన నాన్నపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి.
బాబు రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చారు..: ఇదే చంద్రబాబు నాయుడుగారు.. తనపై అవినీతి ఆరోపణలు వస్తే.. వాటిపై స్టే తెచ్చుకుని ఆరేళ్లుగా కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈయన రెండెకరాలతో రాజకీయ జీవితం మొదలుపెట్టారు. ఈ రోజు ఆయనకు వీధి వీధినా హెరిటేజ్ ఫ్రెష్ షాపులు ఎలా వచ్చాయి? ఆ వేళ బాబు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలీ అంటే.. సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారాయన. ఈరోజు అదే కాంగ్రెస్‌తో కుమ్మక్కై.. జగన్‌ను రాజకీయంగా నాశనం చేయాలి అని, వైఎస్‌ను భ్రష్టుపట్టించాలన్న దురుద్దేశాలతో సీబీఐ విచారణ వేయించాలని సిగ్గులేకుండా అడుగుతున్నారు.
ప్రభుత్వంలో ఉంటూ కోర్టుకెందుకు వెళ్లారు?
*మంత్రి శంకర్రావుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత గట్టు ధ్వజం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని మంత్రి శంకర్రావు ప్రశ్నించడాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తప్పుబట్టారు. కోర్టులు ఏమైనా ఆయన జాగీరా అంటూ మండిపడ్డారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని శంకర్రావు అడగటానికి.. న్యాయస్థానాలేమైనా ఆయన జాగీరా? లేదా ఆయన జేబు సొత్తా?’’ అని ప్రశ్నించారు. రాజకీయ ప్రేరేపితమైన కేసులను స్వీకరించవద్దని గతంలో సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. ‘‘రాజకీయ కుట్రలో భాగంగా తన ఆస్తులపై సీబీఐ విచారణ చేపట్టడం సరికాదంటూ జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దాన్ని మంత్రి శంకర్రావు ప్రశ్నించడం ఆశ్చర్యకరంగా ఉంది. ప్రభుత్వంలో భాగస్వామి అయిన మీరు ముందు కోర్టును ఎందుకు ఆశ్రయించారో బదులివ్వాలి. నేరుగా విచారించే అర్హత పెట్టుకొని, కోర్టుకు ఎందుకు లేఖ రాశారు? మీ ప్రభుత్వంపై మీకే నమ్మకం లేదా? సీఎంపై నమ్మకం లేదా?’’ అని నిలదీశారు. భారతదేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పుకున్న రాహుల్‌కు ప్రధాని అయ్యే అర్హత ఉన్నప్పుడు... దేశ పౌరుడైన జగన్ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడంలో తప్పేముందన్నారు. సోనియా ఆదేశాల మేరకే లేఖ రాశానని శంకర్రావే స్వయంగా ఒప్పుకున్నారని, ఆ తర్వాతే ఆయనకు మంత్రి పదవి వచ్చిందన్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కై జగన్‌ను టార్గెట్ చేశాయనడానికి శంకర్రావు రాసిన లేఖేఆధారమన్నారు. రెండు పార్టీలకు అవగాహన ఒప్పందం కుదర్చడంలో ‘ఈనాడు’ అధినేత రామోజీ మధ్యవర్తిత్వం నడిపారని ఆరోపించారు.

Wednesday, July 20, 2011
ప్రజల తోడుంటే ఎవరితోనైనా కొట్లాడతా!మాట తప్పనందుకే ఈ చిత్రహింసలు.....
ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్ ఉద్వేగభరిత ప్రసంగం
ప్రజల ప్రేమాభిమానాలు నాకు తోడుగా ఉన్నంతకాలం
సోనియా, సీఎం, చంద్రబాబు.. ఎవ్వరితోనైనా కొట్లాడతా
ప్రజల గుండెల్లో ఇంకా బతికున్నారన్న కక్షతో వైఎస్‌పై
బురదజల్లేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నాయి
మాట తప్పనందుకే ఈ రోజు నాపై సీబీఐ విచారణలు, ఐటీ నోటీసులు, చిత్రహింసలు...
అయినా ఇచ్చిన మాట కోసం ప్రాణాలు ఇవ్వడానికి
సైతం వెనుకాడను... నా కాళ్లు, వెన్నెముక విరగ్గొట్టినా కూడా.. మళ్లీ కెరటంలా పైకిలేస్తాను
ఎందుకంటే నాకు దేవుడి దయ, వైఎస్‌ను అభిమానించే గుండె చప్పుళ్లు అండగా ఉన్నాయి
నాన్న వైఎస్ సాక్షిగా చెప్తున్నా నాపై ప్రజలనమ్మకాన్ని వమ్ముకానీయను
కర్నూలు జిల్లా ఓదార్పు యాత్ర నుంచి-
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సైతం వెనుకాడనని, ప్రజల ప్రేమాభిమానాలు తనకు అండగా ఉన్నంతకాలం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతోసైతం కొట్లాడతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై బురదజల్లడానికి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు పన్నుతున్నాయని, ఆ కుట్రలో భాగంగానే తనకు కేసుల వేధింపులని దుయ్యబట్టారు.
‘నాపై సీబీఐ విచారణలు జరిపించవచ్చు.. ఇన్‌కంటాక్స్ నోటీసులు ఇప్పించవచ్చు.. తప్పుడు కేసులు బనాయించవచ్చు.. నా కాళ్లు, వెన్నెముకను కూడా విరగ్గొట్టవచ్చు.. ఎన్ని చేసినా మళ్లీ కెరటంలా పైకిలేస్తాను. ఎందుకంటే నాకు, అమ్మకు ఆ దేవుడి దయ, వైఎస్‌ను ప్రేమించే గుండె చప్పుళ్లు అండగా ఉన్నాయి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడను. చనిపోయిన నాన్న సాక్షిగా చెపుతున్నా.. నాపై ప్రజలు పెట్టుకున్న అచంచల విశ్వాసాన్నీ, నమ్మకాన్ని ఏ ఒక్కరోజు.. ఏ ఒక్క సందర్భంలోనూ వమ్ముచేయను.
వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రజల ప్రేమాభిమానాలు నాకు అండగా ఉన్నంతకాలం సోనియా గాంధీతోనైనా కొట్లాడతా.. ముఖ్యమంత్రితోనైనా కొట్లాడతా.. చంద్రబాబు, ఈనాడు, తోక పత్రిక, ఈ మధ్యే ఆ గ్రూపులో చేరిన టీవీ-9...తోనైనా కొట్లాడతా. ప్రజల ఆప్యాయత, అనురాగాలు నాకు తోడుగా ఉన్నంతకాలం దేశంలో ఎవ్వరితోనైనా కొట్లాడతా’ అని జగన్‌ఉద్వేగంగా మాట్లాడారు. కర్నూలు జిల్లాలో రెండోరోజు మంగళవారం ఓదార్పు యాత్రలో ఆయన కోయిలకుంట్లలో వైఎస్ విగ్రహావిష్కరణ అనంతరం అశేష జనవాహినిని ఉద్దేశించి ఉద్విగ్నంగా ప్రసంగించారు. దీనికి ముందు హరివరం, ఉయ్యాలవాడ, పూపనగుడి, మాయలూరు, అల్లూరు, గుళ్లదుర్తిలలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఆ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
నేను చేసిన తప్పల్లా మాట మీద నిలబడడమే
దివంగత మహానేత వైఎస్ చూపిన బాటలో.. ఇచ్చిన మాట తప్పకపోవడమే నేను చేసిన తప్పు.. అలా మాట తప్పనందుకే ఈ రోజు నాపై సీబీఐ ఎంక్వైరీలు, ఇన్‌కంటాక్స్ నోటీసు లు, చిత్రహింసలు.. కేవలం మాటే కదా అని అందరు రాజ కీయ నాయకుల్లాగా నేనూ గాలికి వదిలేసి ఉంటే.. సోనియా నా భుజం తట్టి వెరీగుడ్ అనేవారు.. కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇచ్చేవారు.. కానీ నేను అలా చేయలేదు.. నాన్న చెప్పినట్లు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాటపై నిలబడాలని నిర్ణయించుకున్నా.. అందుకే ఈ రోజు నాపై పాలక, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కైమరీ కుట్రలు చేస్తున్నాయి.
ఆ దేవుడే చేయిస్తున్నాడు: నేను ఆ మహానేత బాటలో నడుస్తున్నప్పుడు.. అది పూలబాట కాదు.. కష్టాల బాట అని ఆ దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. ఆ దేవుడే ఆ రోజు ఎందుకు చేశాడోగానీ.. నల్లకాలువలో నాతో మాట ఇప్పించాడు.. ఆ దేవుడే ప్రతి గుడిసెలోకీ వెళ్లేలా చేశాడు.. పేదవాడి కష్టాలు నాకు చూపించాడు.. ఆ పేదరికం పోవాలంటే ఏం చేయాలో నాకు తెలిసేలా చేశాడు.. ఒక్క మాటైతే చెప్పగలుగుతున్నా.. నేను తిరిగినన్ని కిలోమీటర్లు ఏ నాయకుడూ తిరగలేదు.. నేను చూసినంత పేదరికం ఏ నాయకుడూ చూడలేదు. దాదాపు 300-350 కుటుంబాలను వారి గుడిసెల్లోకి వెళ్లి చూశాను.. వారి పేదరికం పోవాలంటే ఏం చేయాలో నాకు తప్ప ఏ ఒక్క నాయకుడికీ తెలియదని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. దేవుడు ఎందుకు చేయించాడో తెలియదుగాని.. ఇన్ని కష్టాలు వచ్చినా... ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా మనసుకు మాత్రం సంతోషంగా ఉంది. సీఎం స్థానంలో కూర్చుని ఉన్నప్పుడు వైఎస్‌ను మరో వందేళ్లు మర్చిపోని విధంగా ఆ సువర్ణయుగాన్ని ముప్పై ఏళ్లపాటు నేను అందివ్వగలనన్న నమ్మకం నాలో వెయ్యిరెట్లు పెరిగింది.
ప్రజల గుండెల్లో ఉన్నందుకే వైఎస్‌పై బురద
మహానేత మరణించాక కూడా ప్రజల మనసు లోతుల్లో పదిలంగా ఉన్నారు. అందుకే ఆయనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన తిరిగి రాలేడని తెలిసీ.. చనిపోయారన్న కనీస విచక్షణ కూడా పక్కనబెట్టి పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ రెండూ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘కాంగ్రెస్ హౌస్ కమిటీ వేస్తానంటేనే నేను అసెంబ్లీకి వచ్చాను’ అని చంద్రబాబు అంటారు.. ఆయన కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారనడానికి ఇంతకంటే ఏం చెప్పాలి? దివంగత నేత చనిపోయి రెండేళ్లయ్యాక ఇప్పుడెందుకు కేసు వేశారని అంటే.. సోనియా కేసు వేయమన్నారు కాబట్టే వేశానని మంత్రి శంకర్రావు నిస్సిగ్గుగా చెపుతుంటే.. ఇంతటి దిగజారుడుతనాన్ని చూస్తుంటే బాధేస్తోంది. మరణించిన మహానేతపై బురద చల్లేందుకు ఎంతకైనా దిగజారే ఈ వైఖరి చూస్తోంటే బాధనిపిస్తోంది. చంద్రబాబు తనపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణపై స్టే తెచ్చుకుని ఆరేళ్లుగా కాలం వెళ్లబుచ్చుతున్నారు. నిన్న మొన్నటి దాకా సీబీఐని ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అన్న చంద్రబాబు ఈ రోజు అదే కాంగ్రెస్‌తో కుమ్మక్కయి, సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
కొత్తగా ఒక్క ఇల్లు లేదు, కార్డు లేదు..

మహానేత మరణించిన ఈ రెండేళ్ల కాలంలో ఒక కొత్త రేషన్ కార్డులేదు.. ఒక్క కొత్త ఇల్లు లేదు.. 108 కుయ్ కుయ్ చప్పుళ్లూ లేవు.. పెద్ద ఆపరేషన్ చేయించాల్సి వస్తే ఆ దేవుడే దిక్కు... 85వేల ఎకరాలకు సాగు నీరందించే హంద్రీ-నీవా పథకం ఎక్కడ వేసిన గొంగళి లాగే ఉంది...రెండేళ్ల క్రింత పేద వాడి ముఖంపై వెలిగిన చిరునవ్వు ఇప్పుడు కానరాదు.. మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే ఒక్క నేతా కనుచూపు మేరలో లేడు.. ఈ దయనీయ పరిస్థితి చూస్తే.. మహానేత రెక్కల కష్టంతో ఏర్పడ్డ ప్రభుత్వమేనా ఇది? అని అనిపిస్తుంది.
త్వరలో మళ్లీ సువర్ణయుగం..
మహానేత సువర్ణ యుగం మళ్లీ కచ్చితంగా వస్తుంది. ఈ రెండేళ్లుగా పేదల ముఖాలపై మాయమైన చిరునవ్వును త్వరలోనే మళ్లీ తెప్పిస్తాను. గతంలో కన్నా మరింత చిక్కటి చిరునవ్వును సుసాధ్యం చేస్తాను. రూ.200 నుంచి రూ.700 పింఛన్‌తో అవ్వలూ, తాతల ముఖాల్లో మరింత చిక్కటి చిరునవ్వు ప్రత్యక్షమవుతుంది. పిల్లలను స్కూలుకు పంపినందుకు తల్లిదండ్రులకు రూ.1,000 చెల్లించే సువర్ణ యుగం త్వరలోనే వస్తుంది. వడ్డీలేని రుణాలతో రైతును ఆదుకునే ప్రభుత్వం వస్తుంది.
రెండో రోజూ అదే ఆప్యాయత.. 5 గంటల ఆలస్యం
కర్నూలు జిల్లాలో రెండోరోజు మంగళవారం ఓదార్పు యాత్రకూ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇచ్చిన మాట కోసం ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ తమ ముందుకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూడ్డానికి ఊళ్లు ఊళ్లన్లీ రోడ్లపైకి వచ్చాయి. ఆయనతో కరచాలనానికి పిల్లా పెద్దా.. అందరూ ఉత్సాహం చూపించారు. అభిమాన సంద్రం వెల్లువెత్తడంతో యాత్ర షెడ్యూల్ కంటే సుమారు ఐదు గంటల ఆలస్యంగా ముందుకు సాగింది.
ఉదయం 9.30 ప్రాంతంలో ఆళ్లగడ్డలోని భూమా దంపతుల ఇంటి నుంచి జగన్ బయలు దేరారు. రాత్రి 11:50కు బనగానపల్లెలో బహిరంగ సభలో మాట్లాడారు. సుమారు ఐదు గంటల ఆలస్యంగా జగన్ ఇక్కడకు వచ్చినప్పటికీ ప్రజలు భారీగాహాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాత్రి 12.30 దాటాక కూడా యాత్ర సాగింది.

ఓదార్చిన కుటుంబాలు: హరివరంలో దళిత మస్తాన్, ఉయ్యాలవాడలో దళిత ఈశ్వరయ్య, బనగానపల్లెలో జడ్డువారి మాధవరెడ్డి కుటుంబాలు.
వైఎస్ విగ్రహావిష్కరణలు: 14; కోయిలకుంట్లలో మాజీ ఎమ్మెల్యే కర్రా సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ
యాత్ర సాగిన గ్రామాలు: కొండాపురం, దొర్నిపాడు, కంపమల్ల, క్రిష్టిపాడు, హరివరం, ఉయ్యాలవాడ, రూపనగుడి, మాయలూరు, అల్లూరు, గుళ్లదుర్తి, కోయిలకుంట్ల, ముదివేడు, ముక్కమల్ల, ఆకుమల్ల, అవుకు, గుండ్లశింగవరం, రాళ్లకొత్తూరు, బనగానపల్లె.
జగన్‌ను పంచెకట్టులో చూడాలనుంది: శోభా నాగిరెడ్డి
దివంగత నేత వైఎస్‌లాగా పంచెకట్టులో జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చూడాలని ఉందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. కోయిలకుంట్ల బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. దివంగత నేత అందించిన స్వర్ణ యుగం త్వరలోనే మళ్లీ వస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.
ప్రజల ప్రేమాభిమానాలు నాకు తోడుగా ఉన్నంతకాలం
సోనియా, సీఎం, చంద్రబాబు.. ఎవ్వరితోనైనా కొట్లాడతా
ప్రజల గుండెల్లో ఇంకా బతికున్నారన్న కక్షతో వైఎస్‌పై
బురదజల్లేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నాయి
మాట తప్పనందుకే ఈ రోజు నాపై సీబీఐ విచారణలు, ఐటీ నోటీసులు, చిత్రహింసలు...
అయినా ఇచ్చిన మాట కోసం ప్రాణాలు ఇవ్వడానికి
సైతం వెనుకాడను... నా కాళ్లు, వెన్నెముక విరగ్గొట్టినా కూడా.. మళ్లీ కెరటంలా పైకిలేస్తాను
ఎందుకంటే నాకు దేవుడి దయ, వైఎస్‌ను అభిమానించే గుండె చప్పుళ్లు అండగా ఉన్నాయి
నాన్న వైఎస్ సాక్షిగా చెప్తున్నా నాపై ప్రజలనమ్మకాన్ని వమ్ముకానీయను
కర్నూలు జిల్లా ఓదార్పు యాత్ర నుంచి-
‘నాపై సీబీఐ విచారణలు జరిపించవచ్చు.. ఇన్‌కంటాక్స్ నోటీసులు ఇప్పించవచ్చు.. తప్పుడు కేసులు బనాయించవచ్చు.. నా కాళ్లు, వెన్నెముకను కూడా విరగ్గొట్టవచ్చు.. ఎన్ని చేసినా మళ్లీ కెరటంలా పైకిలేస్తాను. ఎందుకంటే నాకు, అమ్మకు ఆ దేవుడి దయ, వైఎస్‌ను ప్రేమించే గుండె చప్పుళ్లు అండగా ఉన్నాయి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడను. చనిపోయిన నాన్న సాక్షిగా చెపుతున్నా.. నాపై ప్రజలు పెట్టుకున్న అచంచల విశ్వాసాన్నీ, నమ్మకాన్ని ఏ ఒక్కరోజు.. ఏ ఒక్క సందర్భంలోనూ వమ్ముచేయను.
నేను చేసిన తప్పల్లా మాట మీద నిలబడడమే
దివంగత మహానేత వైఎస్ చూపిన బాటలో.. ఇచ్చిన మాట తప్పకపోవడమే నేను చేసిన తప్పు.. అలా మాట తప్పనందుకే ఈ రోజు నాపై సీబీఐ ఎంక్వైరీలు, ఇన్‌కంటాక్స్ నోటీసు లు, చిత్రహింసలు.. కేవలం మాటే కదా అని అందరు రాజ కీయ నాయకుల్లాగా నేనూ గాలికి వదిలేసి ఉంటే.. సోనియా నా భుజం తట్టి వెరీగుడ్ అనేవారు.. కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇచ్చేవారు.. కానీ నేను అలా చేయలేదు.. నాన్న చెప్పినట్లు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాటపై నిలబడాలని నిర్ణయించుకున్నా.. అందుకే ఈ రోజు నాపై పాలక, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కైమరీ కుట్రలు చేస్తున్నాయి.
ఆ దేవుడే చేయిస్తున్నాడు: నేను ఆ మహానేత బాటలో నడుస్తున్నప్పుడు.. అది పూలబాట కాదు.. కష్టాల బాట అని ఆ దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. ఆ దేవుడే ఆ రోజు ఎందుకు చేశాడోగానీ.. నల్లకాలువలో నాతో మాట ఇప్పించాడు.. ఆ దేవుడే ప్రతి గుడిసెలోకీ వెళ్లేలా చేశాడు.. పేదవాడి కష్టాలు నాకు చూపించాడు.. ఆ పేదరికం పోవాలంటే ఏం చేయాలో నాకు తెలిసేలా చేశాడు.. ఒక్క మాటైతే చెప్పగలుగుతున్నా.. నేను తిరిగినన్ని కిలోమీటర్లు ఏ నాయకుడూ తిరగలేదు.. నేను చూసినంత పేదరికం ఏ నాయకుడూ చూడలేదు. దాదాపు 300-350 కుటుంబాలను వారి గుడిసెల్లోకి వెళ్లి చూశాను.. వారి పేదరికం పోవాలంటే ఏం చేయాలో నాకు తప్ప ఏ ఒక్క నాయకుడికీ తెలియదని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. దేవుడు ఎందుకు చేయించాడో తెలియదుగాని.. ఇన్ని కష్టాలు వచ్చినా... ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా మనసుకు మాత్రం సంతోషంగా ఉంది. సీఎం స్థానంలో కూర్చుని ఉన్నప్పుడు వైఎస్‌ను మరో వందేళ్లు మర్చిపోని విధంగా ఆ సువర్ణయుగాన్ని ముప్పై ఏళ్లపాటు నేను అందివ్వగలనన్న నమ్మకం నాలో వెయ్యిరెట్లు పెరిగింది.
ప్రజల గుండెల్లో ఉన్నందుకే వైఎస్‌పై బురద
మహానేత మరణించాక కూడా ప్రజల మనసు లోతుల్లో పదిలంగా ఉన్నారు. అందుకే ఆయనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన తిరిగి రాలేడని తెలిసీ.. చనిపోయారన్న కనీస విచక్షణ కూడా పక్కనబెట్టి పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ రెండూ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘కాంగ్రెస్ హౌస్ కమిటీ వేస్తానంటేనే నేను అసెంబ్లీకి వచ్చాను’ అని చంద్రబాబు అంటారు.. ఆయన కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారనడానికి ఇంతకంటే ఏం చెప్పాలి? దివంగత నేత చనిపోయి రెండేళ్లయ్యాక ఇప్పుడెందుకు కేసు వేశారని అంటే.. సోనియా కేసు వేయమన్నారు కాబట్టే వేశానని మంత్రి శంకర్రావు నిస్సిగ్గుగా చెపుతుంటే.. ఇంతటి దిగజారుడుతనాన్ని చూస్తుంటే బాధేస్తోంది. మరణించిన మహానేతపై బురద చల్లేందుకు ఎంతకైనా దిగజారే ఈ వైఖరి చూస్తోంటే బాధనిపిస్తోంది. చంద్రబాబు తనపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణపై స్టే తెచ్చుకుని ఆరేళ్లుగా కాలం వెళ్లబుచ్చుతున్నారు. నిన్న మొన్నటి దాకా సీబీఐని ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అన్న చంద్రబాబు ఈ రోజు అదే కాంగ్రెస్‌తో కుమ్మక్కయి, సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
కొత్తగా ఒక్క ఇల్లు లేదు, కార్డు లేదు..
మహానేత మరణించిన ఈ రెండేళ్ల కాలంలో ఒక కొత్త రేషన్ కార్డులేదు.. ఒక్క కొత్త ఇల్లు లేదు.. 108 కుయ్ కుయ్ చప్పుళ్లూ లేవు.. పెద్ద ఆపరేషన్ చేయించాల్సి వస్తే ఆ దేవుడే దిక్కు... 85వేల ఎకరాలకు సాగు నీరందించే హంద్రీ-నీవా పథకం ఎక్కడ వేసిన గొంగళి లాగే ఉంది...రెండేళ్ల క్రింత పేద వాడి ముఖంపై వెలిగిన చిరునవ్వు ఇప్పుడు కానరాదు.. మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే ఒక్క నేతా కనుచూపు మేరలో లేడు.. ఈ దయనీయ పరిస్థితి చూస్తే.. మహానేత రెక్కల కష్టంతో ఏర్పడ్డ ప్రభుత్వమేనా ఇది? అని అనిపిస్తుంది.
త్వరలో మళ్లీ సువర్ణయుగం..
మహానేత సువర్ణ యుగం మళ్లీ కచ్చితంగా వస్తుంది. ఈ రెండేళ్లుగా పేదల ముఖాలపై మాయమైన చిరునవ్వును త్వరలోనే మళ్లీ తెప్పిస్తాను. గతంలో కన్నా మరింత చిక్కటి చిరునవ్వును సుసాధ్యం చేస్తాను. రూ.200 నుంచి రూ.700 పింఛన్‌తో అవ్వలూ, తాతల ముఖాల్లో మరింత చిక్కటి చిరునవ్వు ప్రత్యక్షమవుతుంది. పిల్లలను స్కూలుకు పంపినందుకు తల్లిదండ్రులకు రూ.1,000 చెల్లించే సువర్ణ యుగం త్వరలోనే వస్తుంది. వడ్డీలేని రుణాలతో రైతును ఆదుకునే ప్రభుత్వం వస్తుంది.
రెండో రోజూ అదే ఆప్యాయత.. 5 గంటల ఆలస్యం
కర్నూలు జిల్లాలో రెండోరోజు మంగళవారం ఓదార్పు యాత్రకూ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇచ్చిన మాట కోసం ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ తమ ముందుకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూడ్డానికి ఊళ్లు ఊళ్లన్లీ రోడ్లపైకి వచ్చాయి. ఆయనతో కరచాలనానికి పిల్లా పెద్దా.. అందరూ ఉత్సాహం చూపించారు. అభిమాన సంద్రం వెల్లువెత్తడంతో యాత్ర షెడ్యూల్ కంటే సుమారు ఐదు గంటల ఆలస్యంగా ముందుకు సాగింది.
ఉదయం 9.30 ప్రాంతంలో ఆళ్లగడ్డలోని భూమా దంపతుల ఇంటి నుంచి జగన్ బయలు దేరారు. రాత్రి 11:50కు బనగానపల్లెలో బహిరంగ సభలో మాట్లాడారు. సుమారు ఐదు గంటల ఆలస్యంగా జగన్ ఇక్కడకు వచ్చినప్పటికీ ప్రజలు భారీగాహాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాత్రి 12.30 దాటాక కూడా యాత్ర సాగింది.
ఓదార్చిన కుటుంబాలు: హరివరంలో దళిత మస్తాన్, ఉయ్యాలవాడలో దళిత ఈశ్వరయ్య, బనగానపల్లెలో జడ్డువారి మాధవరెడ్డి కుటుంబాలు.
వైఎస్ విగ్రహావిష్కరణలు: 14; కోయిలకుంట్లలో మాజీ ఎమ్మెల్యే కర్రా సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ
యాత్ర సాగిన గ్రామాలు: కొండాపురం, దొర్నిపాడు, కంపమల్ల, క్రిష్టిపాడు, హరివరం, ఉయ్యాలవాడ, రూపనగుడి, మాయలూరు, అల్లూరు, గుళ్లదుర్తి, కోయిలకుంట్ల, ముదివేడు, ముక్కమల్ల, ఆకుమల్ల, అవుకు, గుండ్లశింగవరం, రాళ్లకొత్తూరు, బనగానపల్లె.
జగన్‌ను పంచెకట్టులో చూడాలనుంది: శోభా నాగిరెడ్డి
దివంగత నేత వైఎస్‌లాగా పంచెకట్టులో జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చూడాలని ఉందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. కోయిలకుంట్ల బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. దివంగత నేత అందించిన స్వర్ణ యుగం త్వరలోనే మళ్లీ వస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.
Monday, July 18, 2011
మాటకు కట్టుబడి ఉన్నా.. అందుకే వేధిస్తున్నారు * కర్నూలు జిల్లా ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఇచ్చిన మాటను గాలికి వదిలేసి ఉంటే సోనియా వెరీగుడ్ అనేవారు
కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇచ్చేవారు, అయినా మడమ తిప్పలేదు..
మహానేతపై బురద చల్లేందుకే కాంగ్రెస్ తప్పుడు కేసులు పెట్టిస్తోంది
మంత్రివర్గ నిర్ణయాలకు వైఎస్ ఒక్కడినే బాధ్యుడిని చేయాలని చూస్తోంది
నా కాళ్లు, వెన్నుపూస విరగ్గొట్టినా కెరటంలా పైకి లేస్తా...
యాత్రలో పాల్గొన్న చెన్నకేశవరెడ్డి, కాటసాని, బాలనాగిరెడ్డి, మోహన్‌రెడ్డి
‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కుటుంబాలను పరామర్శిస్తానని నల్లకాలువ సభలో మాటిచ్చాను. ఏ దేవుడు ఆ రోజు నానోట ఆ మాట పలికించాడోగానీ.. ఆ ఒక్క మాటకే కట్టుబడి ఉన్నాను. ఆ ఒక్క మాటకు కట్టుబడి ఉన్నందుకే కాంగ్రెస్ నుంచి నన్ను బయటకు పంపించారు. వెంటనే ఐటీ నోటీసులు ఇప్పించారు.. ఇప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ పెద్దలు కుమ్మక్కై వారి వయసులో సగం కూడా లేని నన్ను వేధిస్తున్నారు’’
ఆళ్లగడ్డ ఓదార్పు యాత్ర*
‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కుటుంబాలను పరామర్శిస్తానని నల్లకాలువ సభలో మాటిచ్చాను. ఏదేవుడు ఆ రోజు నానోట ఆ మాట పలికించాడోగానీ.. ఆ ఒక్క మాటకే కట్టుబడి ఉన్నాను. ఆ ఒక్క మాటకు కట్టుబడి ఉన్నందుకే కాంగ్రెస్ నుంచి నన్ను బయటకు పంపించారు. వెంటనే ఐటీ నోటీసులు ఇప్పించారు.. ఇప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ పెద్దలు కుమ్మక్కై వారి వయసులో సగం కూడా లేని నన్ను వేధిస్తున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఓదార్పు యాత్ర ప్రారంభమైన కర్నూలు జిల్లాలోని చాగలమర్రి, ఆళ్లగడ్డ సభలకు భారీగా హాజరైన జనప్రవాహాన్ని ఉద్దేశించి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..
ప్రజల గుండెల్లో ఉండడమే పాపమా?
ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని రాష్ట్రానికే కాదు దేశానికి సైతం చాటిచెప్పిన మహానేత వైఎస్. ఆయన మరణించి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ జనం గుండెలోతుల్లో పదిలంగా గూడుకట్టుకున్నారు. అదే పాపమన్నట్లు ఆయన్ను ప్రజల మనసుల్లో నుంచి చెరిపేయడానికి ఆయనపై బురదజల్లుతున్నారు. ఆయన రెక్కల కష్టం వల్లే 2004, 2009లలో అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో సోనియా ఈ రోజు అధికారం చలాయిస్తోందంటే అందుకు కారణం వైఎస్ కాదా?
వైఎస్ ఒక్కడినే బాధ్యుడిని చేయడానికి కుట్ర
వైఎస్ మంత్రివర్గంలో సమష్టిగా తీసుకున్న నిర్ణయాలన్నింటికీ మహానేత ఒక్కడినే బాధ్యుడిని చేయాలని కాంగ్రెస్ పెద్దలు కుట్ర పన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సొంత నిర్ణయాలపై సొంత మంత్రి శంకర్రావుతో కేసు వేయించారు. వైఎస్ ఎలాగూ తిరిగిరారు.. సమాధానం చెప్పుకోలేరు అన్న ఆలోచనతో ఆయనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు నేనేం తక్కువ తినలేదంటూ అధికారపార్టీతో కుమ్మక్కై మహానేతపై మరిన్ని నిందలు వేస్తున్నారు.
బాబు స్టే తెచ్చుకున్నారు
నిన్న మొన్నటి దాకా సీబీఐని ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’అన్న చంద్రబాబు.. ఇప్పుడు నాపై అదే సీబీఐ విచారణకోసం డిమాండు చేస్తున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణ కేసులో స్టే తెచ్చుకుని ఆరేళ్లుగా కాలంగడుపుతున్న చంద్రబాబు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. వైఎస్‌పై బురదజల్లేందుకు, జగన్‌ను అణగదొక్కేందుకు కోర్టుకెళ్లి మరీ సీబీఐ విచారణ కోరుతున్నారు.
ఒక్కడిపై ఇంత మంది కుట్ర చేస్తున్నారు..
ఒకే ఒక్కడిని భూస్థాపితం చేసేందుకు.. దేశంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, ఈనాడు పత్రిక, ఓ తోకపత్రిక, ఈ మధ్యే ఈ గ్రూపులో చేరిన టీవీ-9.. అందరూ కలిసి కుట్రలు పన్నుతున్నారు. ఇచ్చిన మాటకోసం నిలబడటమే నేను చేసిన నేరం. ఓదార్పు మానుకుని ఉంటే, సోనియావెరీగుడ్ అనేవారు. కేంద్రంలో నాకూ ఓ మంత్రిపదవి ఇచ్చి ఉండేవారు. కానీ మంత్రి పదవి వద్దనుకున్నాను.. మాట తప్పకపోవడం.. మడమ తిప్పకపోవడం.. విశ్వసనీయత అన్న నా తండ్రి బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నాను. అందుకే వేధిస్తున్నారు. ఇచ్చిన మాటకోసం, మహానేత ఆశయాలను కొనసాగించే దిశగా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు ఎదురైనా వెరవను.
నా కాళ్లు, వెన్ను విరగ్గొట్టినా.. కెరటంలా పైకిలేస్తా
బహుశా నా కాళ్లు, వెన్ను పూస కూడా విరగ్గొడతారేమో. అయినా సరే.. ఎవరేం చేసినా సరే కెరటంలా పైకిలేస్తా. కాంగ్రెస్, టీడీపీ పెద్దలకు లేనిది.. నాకు, నా తల్లికి మాత్రమే ఉన్నది ఆ దేవుడి దయ, నాన్నను ప్రేమించే ప్రతి గుండె చప్పుడు.. మమ్మల్ని కాపాడుతూనే ఉంటాయి. దివంగత మహానేత వైఎస్ చూపిన బాటలో నడవడం చేతకాని ఈ ప్రభుత్వం, చనిపోయాక కూడా జనం గుండెల్లో సజీవంగా ఉండటం ఎలాగో నేర్వలేని వారు, దివంగత నేత ఆశయాలను కొనసాగించలేని వారు ఈ రోజు ఆయనపై బురదజల్లుతున్నారు.
అడుగడుగునా జన జాతరే...!
అడుగడుగునా జన నీరాజనం. అడుగు కూడా ముందుకు వేయనీయని అభిమాన సందోహం. ఫలితంగా సోమవారం ఆళ్లగడ్డలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభ ఏకంగా 5 గంటలు ఆలస్యమైంది! సాయంత్రం 4.00కు జరగాల్సిన సభ రాత్రి 9.00కు ప్రారంభమైంది! అయినా ప్రజల్లో ఉత్సాహం అణు మాత్రమైనా తగ్గలేదు. తమ అభిమాన నాయకుని కోసం అంతసేపూ వారు భారీ సంఖ్యలో వేచి చూశారు. యాత్ర తొలిరోజు సోమవారం ఉదయం 10కి మొదలైంది. ఆళ్లగడ్డలో భూమా దంపతుల ఇంటి నుంచి బయల్దేరిన ఆయన, తొలుత చాగలమర్రిలో మహబూబ్ బాషా కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మసీదులో ప్రార్థనలు చేసి, సమీపంలోని దివంగత నేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. బాషా ఇంటి నుంచి వేదికను చేరేందుకే అరగంట పట్టింది! జగన్‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటెత్తిన జనంతో గ్రామ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. నమాజుకు వేళవడంతో జగన్ ప్రసంగాన్ని కాసేపు ఆపారు. శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రసంగించారు.
నాలుగు కుటుంబాలకు ఓదార్పు...: తొలి రోజు చాగలమర్రి, శెట్టివీడు, ముత్యాలపాడు, చక్రవర్తులపల్లె, కృష్ణాపురం, ఆలమూరు, నరసాపురం, ముత్తలూరు గ్రామాల్లో 8 విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. చాగలమర్రిలో మహబూబ్ బాషా, గొడిగనూరులో ఇండ్ల ఇసాక్, ఆళ్లగడ్డలో వన్నూరు బాషా కుటుంబాలను పరామర్శించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో చాకరాజువేముల చేరుకుని తోట బాలరాజు కుటుంబాన్ని ఓదార్చారు. షెడ్యూల్ మేరకు సోమవారం హరివరంలో దళిత మస్తాన్, ఉయ్యాలవాడలో దళిత ఈశ్వరమ్మ కుటుంబాలను కూడా ఓదార్చాల్సి ఉన్నా అర్దరాత్రి కావడంతో తొలి రోజును ముగించి రాత్రి బసకు ఆళ్లగడ్డ చేరుకున్నారు. మంగళవారం ఉదయం పదింటికి ఆ రెండు కుటుంబాల ఓదార్పుతో రెండో రోజు యాత్ర మొదలవుతుంది.
వైఎస్ పథకాల అమలు జగన్‌తోనే సాధ్యం
- కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగాలంటే అది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు ఉద్ఘాటించారు. అందుకే తాము జగన్‌కు పూర్తి మద్దతునిస్తున్నామని తేల్చి చెప్పారు. కర్నూలు జిల్లా ఓదార్పు యాత్ర సోమవారం చాగలమర్రిలో ప్రారంభమైన సందర్భంగా వారు సభా వేదికపై ప్రసంగించారు.
ఎవరేమన్నారో.. వారి మాటల్లోనే..
వైఎస్ అండతోనే గెలిచా
- కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే
జగన్ నాయకత్వంలోనే పథకాలన్నీ కొనసాగుతాయి
రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు జగన్ నాయకత్వంలోనే కొనసాగుతాయి. మహానేత మృతిని తట్టుకోలేక ప్రాణాలొదిలిన కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన ఆయన వెంట ఓదార్పు యాత్రలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం.
- చెన్నకేశవరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే
జగన్‌కు అంతా సహకారం అందించాలి
రాష్ట్రం అభివృద్ధి చెందడం వైఎస్సార్‌తోనే ప్రారంభమైంది. వైఎస్సార్ మరణంతో పథకాలన్నీ నిలిచిపోయాయి. వాటన్నింటినీ అమలు చేయగల నాయకుడు జగనే. ఆయనకు అంతా సహకారం అందించాలి.
- బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే
జగన్ కోసం ప్రాణాలనూ లెక్కచేయం
సోనియా, కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ ఏకమై వైఎస్ జగన్‌ను అణచాలని చూస్తున్నారు. సూర్యుణ్ణి అరచేత్తో ఆపాలనుకుంటున్నారు. ప్రజలు వైఎస్సార్‌ను జగన్‌మోహన్‌రెడ్డిలో చూసుకుంటున్నారు. ఆయన లేని లోటును తీర్చటానికి నేనున్నానంటూ జగన్ ముందుకొచ్చారు. వైఎస్సార్ మరణించాక రెండేళ్లలో పేదవాణ్ణి పలుకరించే వారే కరువయ్యారు. ఒక్క రేషన్‌కార్డు, పక్కాగృహం ఇవ్వలేదు. రైతులను పట్టిం చుకోవటం లేదు. 128 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక్క కార్యకర్తను కూడా నిలబెట్టుకోలేకపోయింది. జగన్‌మోహన్‌రెడ్డిని ఆపడం ఆ పార్టీకి సాధ్యం కాదు. పదువులు లెక్క చేయక ప్రజల కోసం పోరాడిన జగన్ స్ఫూర్తితో మేం ముందుకు సాగుతాం. ఆయన కోసం ప్రాణాలను కూడా లెక్కచేయం.
- శోభానాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
వైఎస్‌తో రాష్ట్రం అభివృద్ధి చెందింది
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రం అభివృద్ధి చెందింది. రైతులు పచ్చగా ఉండటానికి కారణం వైఎస్సారే. భవిష్యత్‌లో జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నాం.
- ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ
అణచేకొద్దీ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది
జగన్‌ను అణచివేయాలని చూస్తున్నారు. అలా చేసేకొద్దీ ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. కాంగ్రెస్, టీడీపీ నాయకులు జగన్‌ను అణచేసేందుకే సమయాన్ని కేటాయిస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఎవరికైనా చిన్న పదవి ఇవ్వాలన్నా, ఏపనైనా చేయాలన్నా సోనియాగాంధీ వద్ద అనుమతి తీసుకోవాలి. కాంగ్రెస్‌కు పరిపాలించే నైతిక హక్కు లేదు. రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉంది. ఆయన ఓ వ్యక్తి కాదు శక్తి. జగన్ కోసం సైనికుల్లా ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమే.
- భూమా నాగిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత
Saturday, July 9, 2011
‘' అమ్మ ఒడి '’లా పాలన
ప్లీనరీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆత్మను ఆవిష్కరించిన జగన్
ఓదార్పు యాత్రలో పేదల బాధలు చూశాను..
అప్పుడే నా మనసులో పేదరిక నిర్మూలనకుజవాబు మెదిలింది
ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం..
‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకం కింద పిల్లలను బడికి పంపినందుకు తల్లికి డబ్బులిస్తాం
ఎల్‌కేజీ నుంచి 10 వరకు రూ.500, ఇంటర్‌లో రూ.700, డిగ్రీలో రూ.1000 ఆమె ఖాతాలో వేస్తాం
108 తరహాలో పశు వైద్యానికి 102..
రైతులకు వ్యవసాయ సూచనల కోసం 103..
భూమి లేని కూలీలకు ఎకరా భూమి సాగుయోగ్యంగా మలిచి ఇస్తాం..
అక్కా చెల్లెళ్లకు, రైతన్నలకు వడ్డీ లేని రుణాలు..
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్..
వ్యవసాయ పరికరాల కొనుగోలుకు పావలా వడ్డీకే రూ.3 లక్షల వరకు రుణం
అవ్వా తాతలు, వితంతువుల పింఛను రూ.700కు పెంచుతాం
వికలాంగులకు రూ.1000 పెన్షన్..
మద్యపాన నియంత్రణకు కొత్త విధానం..
ఊళ్లలో బెల్టు షాపులనేవే లేకుండా చేస్తాం..
ప్రాజెక్టులను ప్రాధాన్యంగా తీసుకుని పూర్తిచేస్తాం
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెరతీశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగిన మహానేత వైఎస్ సువర్ణ యుగాన్ని మళ్లీ తెచ్చే దిశగా పలు చరిత్రాత్మక, సంక్షేమ పథకాలు చేపడతామంటూ బడుగు బతుక్కి భరోసా ప్రకటించారు. పిల్లలను బడికి పంపే తల్లికి డబ్బులు, వృద్ధులు, వితంతువుల పింఛను రూ.700కు పెంపు, వికలాంగులకు రూ.1000 పెన్షన్, మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు, కొత్తగా 102, 103 సేవలు.. ఇలా పలు సంచలనాత్మక పథకాల అమలే తమ పార్టీ ఎజెండా అంటూ వేలాది కరతాళ ధ్వనుల మధ్య సగర్వంగా వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలకు కొత్త అర్థం చెబుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలకు ఇలా మరింత పరిపూర్ణత చేకూర్చేందుకు ఆయన సంకల్పించారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో శుక్రవారం ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘ప్రజా ప్రస్థానం’(తొలి ప్లీనరీ) సమావేశాల్లో ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. వాటిని రూపొందించడానికి దారితీసిన పరిస్థితులను విస్పష్టంగా వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..
నాన్నే నాకు స్ఫూర్తి..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక మొట్టమొదటి ప్లీనరీ ఇది. వైఎస్సార్ పాదాల చెంతన, ఆయన ఆశయాల సాధన కోసం నిలబడి ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నా. నా కంటే ముందు చాలా మంది మాట్లాడారు. చాలా చాలా చేయాలని తమ తమ వ్యూహాలు చెప్పారు. చెప్పిన ప్రతి అంశాన్నీ జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుంటాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫలానా పార్టీ అని సగర్వంగా చెప్పుకొనే రీతిలో, ఫలానా నాయకుడు అని గొప్పగా చెప్పుకొనే రీతిలో వైఎస్సార్ ఆశయాల సాధనకు, వైఎస్సార్ కడుపున పుట్టిన ఆణిముత్యం అని చెప్పుకొనే రీతిలో మన విధానాలు ఉంటాయి. మరో వందేళ్ల వరకు ఏ ఒక్కరూ వైఎస్సార్‌ను మరిచిపోలేని రీతిలో, 30 ఏళ్ల పాటు వైఎస్సార్ సువర్ణయుగ పాలన మళ్లీ ఉండేలా పార్టీ ఉంటుందని సగర్వంగా చెబుతున్నా. దివంగత నేత వైఎస్సారే నాకు స్ఫూర్తి. ఆయన కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు పాలించారు. కేంద్రంలో సోనియాగాంధీ కూడా ఉన్నారు. ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వు చూడాలని ఏ ఒక్కరికీ తట్టలేదు. ఒక్క వైఎస్‌కు తప్ప. దాదాపు 1500 కిలోమీటర్లకు పైగా కాలినడకన పాదయాత్ర చే స్తూ ప్రతి పేదవాడిని కలుస్తూ వాళ్ల బాధలు చూశారు. వారి బతుకులను అర్థం చేసుకోగలిగారు. ఏం చేస్తే వారి ముఖాన చిరునవ్వు కనిపిస్తుందో అధ్యయనం చేశారు.
ఆ మాటే వేల కిలోమీటర్లు ప్రయాణం చేయించింది..
కాలమో, మరి దేవుడే అలా చేశాడో తెలియదు గానీ నాతో ఒక మాట అనేలా చేశాడు. నాన్న చనిపోయాక 20 రోజులు కూడా గడవకముందే దేవుడు నా నోటి నుంచి ఎందుకు అనిపించాడో తెలియదు గానీ.. వైఎస్ మరణ వార్తను దిగమింగుకోలేక చనిపోయిన వారందరి కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పాను. ఆ మాటే నన్ను కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయించింది. పేదరికాన్ని చాలా దగ్గరగా చూశా. నేను చూసినంత దగ్గరగా ఏ నాయకుడూ చూడలేదు. కులాలు, మతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబాన్నీ చూశా. ప్రతి కుటుంబంతో 20 నిముషాల పాటు మాట్లాడాను. ఒక్కో కుటుంబానిది ఒక్కో కథ. పేదరికంలో ఒక్కో కోణం. ఈ పేదరికాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలన్న ఆలోచనను ప్రేరేపించిన సమయమది. పేదరిక నిర్మూలనకు ఒక జవాబు నా మనసులో మెదిలింది. ఆ జవాబు నా దగ్గర ఉందని నేను గర్వపడుతున్నా.
పేదరిక నిర్మూలనకు రెండే మార్గాలు..
వైఎస్సార్ పాదయాత్రలో ప్రతి అంశాన్నీ తట్టారు. పేదవాడు ఎందుకు పేదవాడిగా మిగిలిపోతున్నాడో అర్థం చేసుకున్నారు. పేదరిక నిర్మూలనకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి. దానికి కులం లేదు. మతం లేదు. ఆకలి, మమకారం మాత్రమే ఉన్నాయి. ఆ రెండు మార్గాల్లో ఒకటేంటంటే.. ప్రతి పేద కుటుంబంలో ఒక్కరన్నా పెద్ద చదువులు చదవాలి. డాక్టరో, ఇంజినీరో, కలెక్టరో కావాలి. పెద్ద చదువు చదివిన వాడు ఉద్యోగం చేస్తూ ముసలి వయసులో ఉన్న తల్లిదండ్రులకు తోడుగా నిలబడితే ఆ కుటుంబ పేదరికం పోతుంది. ఇక రెండో మార్గం. నేను పేద కుటుంబాల వద్దకు వెళ్లినప్పుడు ఏం చేస్తున్నావమ్మా అని అడిగితే కూలికి వెళుతున్నాం బాబూ అని సమాధానం ఎదురైంది. ఎలా బతుకుతున్నావమ్మా అని అడిగితే కూలి దొరక్కపోతే బతకలేమన్నదే వారి జవాబు. కనీసం ఒక ఎకరా అయినా భూమి ఇస్తే వారి పేదరికం పోతుంది. కేవలం భూమి ఇస్తే సరిపోదు. దాన్ని సాగుకు యోగ్యంగా చేయాలి. అప్పుడే పేదరికాన్ని పోగొట్టగలుగుతాం. వైఎస్సార్ కలలుగన్న ఈ స్వప్నాలే మా పార్టీ జెండా.. అదే మా ఎజెండా.
వైఎస్ హామీలు నెరవేరుస్తాం: 2009లో ఎన్నికలకు ముందు వైఎస్సార్ రెండే రెండు కొత్త హామీలిచ్చారు. రూ.2కి 20 కిలోల బియ్యాన్ని 30 కిలోలకు పెంచుతామని మాట ఇచ్చారు. ఆయన పోయి రెండేళ్లవుతోంది. ఆయన్ను మర్చిపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఎన్నికలేమీ లేవు కదా అని ప్రజలను కూడా పూర్తిగా మరిచిపోయింది. మేనిఫెస్టో అనే దానికి విలువ లేకుండా పోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దివంగత నేత ఇచ్చిన హామీలను అమలుచేసి చూపిస్తుంది. ఏడు గంటల విద్యుత్తును తొమ్మిది గంటలకు పెంచే హామీని మేం అమలు చేస్తాం. అధికారంలోకి వచ్చాక సాధ్యమైనంత త్వరలో అమలుచేస్తాం.
ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు చదివిస్తాం
ప్రతి కుటుంబంలో ఒక్కరన్నా పెద్ద చదువులు చదువుకోగలిగితే పేదరికం పోతుందని తెలిసినా ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇప్పటికే 3400 కోట్లు బకాయిలు ఉంటే, పథకాన్ని కొనసాగించడానికి మరో 3400 కోట్లు కావాల్సి ఉంటే మూడు వేల కోట్లే ఇచ్చి చేతులు దులుపుకొంది. పేద కుటుంబాలను కలిసినప్పుడు వారు చదువుకోవాలంటే ఈ 3400 కోట్లు కూడా సరిపోవని నాకు తెలిసింది. వారి పేదరికం పోవాలంటే ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు చదివించాలి. ఆ బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తుంది.
‘వైఎస్సార్ అమ్మ ఒడి’
ఆ పేద ఇళ్లకు వెళ్లినప్పుడు అమ్మలతో అక్కలతో మాట్లాడినప్పుడు, చిన్నచిన్న పిల్లలతో మాట్లాడినప్పుడు ఏడో తరగతి కూడా పూర్తికాకుండానే చదువు మానేశానని చెబుతున్నప్పుడు చాలా బాధనిపించేది. కాస్తోకూస్తో పనిచేస్తే తప్ప బతకలేని పరిస్థితి అని చెబితే బాధేసింది. వీరంతా గొప్ప చదువులు ఎప్పుడు చదువుతారన్న ఆలోచన నాలో రేగింది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ‘వైఎస్సార్ అమ్మ ఒడి’. తమ బిడ్డలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలోకి ప్రోత్సాహకంగా డబ్బులు జమ చేస్తాం. ఇద్దరు పిల్లలను చదివించేందుకు వీలుగా జమ చేస్తాం. ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు రూ.500 చొప్పున, ఇంటర్‌లో అయితే రూ.700 చొప్పున, డిగ్రీ అయితే వెయ్యి రూపాయల చొప్పున జమ చేస్తాం. ఏ తల్లీ తమ బిడ్డలను చదువుకు పంపకుండా కూలికి పంపే పరిస్థితి రాకుండా ఉండేందుకే ఈ ప్రయత్నం. బడికి పంపించినందుకే ఈ ప్రోత్సాహకం. చదువులు మేమే ఉచితంగా చదివిస్తాం. రూ. 3,400 కోట్లయితే ఇప్పటివరకు ఉన్న పథకానికి సరిపోతుంది. ఇప్పటికంటే నాలుగైదింతల బడ్జెట్ పెరిగినా పరవాలేదు. ఇది మా కనీస బాధ్యత. దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటాం.
ప్రతి స్కూలునూ ఇంగ్లిష్ మీడియం చేస్తాం
అలాగే ఊళ్లకు పోయినప్పుడు అక్కడ స్కూళ్లను చూశాను. అక్కడ ప్రైమరీ స్కూళ్ల దాకానే ఉన్నాయి. ఆ ప్రైమరీ స్కూళ్లను అప్పర్ ప్రైమరీ దాకా ప్రతి ఊళ్లోనూ అప్ గ్రేడ్ చేయాలి. ఆ ప్రతి స్కూలులో మౌలిక వసతులు కల్పించాలి. ఆ ప్రతి స్కూలును ఇంగ్లీష్ మీడియం చేయాల్సిన అవసరం చాలా ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మా భుజస్కంధాలపై వేసుకొని అది చేపడుతుంది.
అక్కాచెల్లెళ్లకు వడ్డీలేని రుణాలు..
పేదరికంలో మగ్గుతున్న అక్కాచెల్లెళ్లతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధనిపించింది. వారికోసం అమలుచేస్తున్న పావలా వడ్డీ పథకానికి వెయ్యి కోట్ల బకాయిలు చెల్లించాలి. దాన్ని నడిపించాలంటే మరో వెయ్యి కోట్లు కావాలి. కానీ ఈ ప్రభుత్వం రూ. 400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడంతో అక్కాచెల్లెళ్ల ముఖాల్లో తేడా కనిపిస్తోంది. ప్రభుత్వం వడ్డీ సొమ్ము ఇచ్చేవరకు బ్యాంకులు ఆ మహిళల వద్ద రూపాయి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఒక గ్రూపులో ఒక సభ్యురాలు మూడేళ్లలో చెల్లించేందుకు రూ. 30 వేలు తీసుకుంటే.. రూపాయి వడ్డీతో కలిపి ఏటా 45 శాతం సొమ్ము తిరిగి చెల్లించాల్సివస్తోంది. కానీ ఆ 45 శాతం వాళ్లు ఎలా కట్టగలుగుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి అక్కాచెల్లెళ్లకు వడ్డీ లేని రుణం ఇస్తాం. ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడే బ్యాంకులు వడ్డీ రాయితీ ఇస్తాయని ఎదురుచూడాల్సిన పనిలేదు. ప్రభుత్వమే ఆ సొమ్మును ముందే కట్టేస్తుంది.
మూడు పూటలా భోజనం ఉండాలి..
నేను ఊళ్లకు వెళ్లినప్పుడు ప్రతి అవ్వా, తాతా పనులు విడిచిపెట్టుకుని నా దగ్గరికి పరుగెట్టుకుంటూ వచ్చారు. ఏమ్మా ఈ వయసులో కూడా పనిచేస్తున్నావా? అని అడిగితే.. బతకాలి కదా బిడ్డా.. మీ నాన్న రూ. 200 ఇస్తున్నాడు.. అయితే బతకడానికి ఆ డబ్బులు సరిపోవు కదా నాయనా అని బదులిస్తే బాధనిపించింది. అవ్వలూ, తాతలు, వితంతువులకు ఇప్పుడిస్తున్న పింఛను సరిపోదు. వారికి మూడు పూటలా భోజనం దొరికేలా కనీసం రూ. 700కు తక్కువ కాకుండా ఉండాలి. మూడు పూటలా భోజనం పెట్టే పరిస్థితి లేనప్పుడు ఈ ప్రభుత్వం ఉంటేనేం.. పోతేనేం? మా పార్టీ అధికారంలోకి వస్తే వీరందరికీ రూ.700తో పాటు, వికలాంగులకు ఇస్తున్న పింఛనును రూ.500 నుంచి రూ. 1000కి పెంచుతాం.
ప్రాధాన్య పరంగా జలయజ్ఞం ప్రాజెక్టులు
దివంగత నేత, ప్రియతమ రాజశేఖరరెడ్డి గారు జలయజ్ఞం పేరిట కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలని కలలు గన్నారు. ఈ వేళ రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వంశధార స్టేజీ-1 ఫేజ్-1 ప్రాజెక్టు పూర్తవుతుంది. ఐదు కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులున్నాయి. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 13 ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి. ఇటువంటి చిన్నచిన్న మొత్తాలు ఖర్చు పెట్టినా చాలా ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నా.. పూర్తిగా జలయజ్ఞాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రతి రైతు సోదరుడి ముఖాన శాశ్వతమైన చిరునవ్వు చూడాలి అంటే.. ఒక ప్రాతిపదికన, ఏ ప్రాజెక్టు చేస్తే వెంటనే రైతు సోదరుడికి ఉపయోగపడుతుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ.. ప్రాధాన్యత అంశాల పరంగా ప్రతి ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం కూడా పూర్తిగా ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నీళ్లు వచ్చేస్థాయికి ఏఏ ప్రాజెక్టులు వచ్చాయన్న అంశాన్ని మనస్సులో పెట్టుకొని, ఆ మేరకు డబ్బులు కేటాయింపు చేస్తూ.. ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఇది కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా చేపడుతుంది.
మద్యపాన నియంత్రణ..
మద్యపానాన్ని నియంత్రిస్తాం. ప్రతి గ్రామంలో మద్యపానం వల్ల చదువుకోలేని పరిస్థితి. చదువుకోలేని పరిస్థితి వల్ల మద్యపానం. ఈ పరిస్థితి చూస్తే బాధనిపిస్తోంది. గ్రామాల్లో తాగుడు లేకుండా బెల్టు షాపులు మూసేయిస్తాం. మద్యం షాపులు తగ్గిస్తాం. తాగాలంటే నిరుత్సాహపరిచేలా మద్యపాన విధానం రూపొందిస్తాం.
ఆరోగ్యం మా అభయం..
పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి తెచ్చేది అనారోగ్యం. ఏ గుండె పోటో వస్తే భార్యాపిల్లలు ఐదు రూపాయల వడ్డీకో, పది రూపాయల వడ్డీకో అప్పు తెచ్చి బతికించుకున్నా.. తరువాత దాన్ని తీర్చేందుకు జీవితాంతం ఊడిగం చేయాల్సివచ్చే దుస్థితి. ఇది ఏ పేదవాడికీ రాకూడదు. మా సీఎం ఉన్నాడన్న భరోసా ఉండాలి. నేను ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానో, ఏ పడక మీద చికిత్స పొందుతున్నానో, అదే ఆస్పత్రిలో, అదే పడకపైన పేదోడు కూడా చికిత్స పొందాలి. వైఎస్సార్‌లాంటివాడే మా సీఎం అని చెప్పుకొనేలా ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం కనీసం 108 వాహనానికి డీజిల్ పోసే పరిస్థితి లేదు. రిపేరు చేయించే స్థితిలో లేదు. ఆస్పత్రికి వెళితే మందులు కూడా దొరకని దుస్థితి. మా ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న 800 ఆంబులెన్సులను 1,500కు పెంచుతాం. 104లో పనిచేసే వాళ్లకు నాలుగైదు నెలలుగా జీతాలు దొరకని పరిస్థితి. ప్రతి మండలానికి ఒక 104 వాహనం ఉండేలా 1,100 వాహనాలు ఏర్పాటు చేస్తాం. ఒక్కో దాంట్లో ఇద్దరు వైద్యులు ఉండేలా చూస్తాం. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు ఆపరేషన్లన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేయించాలన్న ఆలోచన చేస్తోంది. అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలున్నాయా అన్న ఆలోచన చేయట్లేదు. మేం ప్రతి జబ్బుకూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందిస్తూనే, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తాం.
ఏటా పది లక్షల ఇళ్లు..
1947 నుంచి 2004 వరకు రాష్ట్రంలో 47 లక్షల ఇళ్లు కట్టిస్తే.. వైఎస్సార్ ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు కట్టించారని గర్వంగా చెబుతున్నా. అంతేకాదు. ఆ ఐదేళ్లలో ఆయన ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు. దేశం మొత్మమ్మీద మిగతా రాష్ట్రాల్లో కట్టిన ఇళ్లు 48 లక్షలే. అంటే దేశమంతా ఒకెత్తు. వైఎస్సార్ కట్టించిన ఇళ్లు ఒకెత్తు. మేం ప్రతి ఏటా కనీసం 10 లక్షల ఇళ్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. ఏ గ్రామానికి వెళ్లి అడిగినా.. ఇల్లు లేదని ఎవరూ చేతులెత్తే పరిస్థితి ఉండకూడదు.
ఇంకా ఆలోచనల్లో చాలా పథకాలు
ఇంకా ప్రతి దళిత సోదరుడి నుంచి బీసీ, మైనారిటీ సోదరుడి వరకు మేలు చేసేందుకు నా ఆలోచనల్లో చాలా పథకాలు ఉన్నాయి. ఇంకా అధ్యయనం చేస్తాం. ప్రతి ఒక్కరి ముఖంలో ఎలా చిరునవ్వు చూడగలమో అధ్యయనం చేస్తాం. ఇదీ మా బడ్జెట్, ఇదీ మా పార్టీ, ఇతనే మా నాయకుడు అంటూ మా మేనిఫెస్టోతో ఎన్నికల్లో సగర్వంగా చెప్పుకొనేలా చేస్తాం.
‘మద్దతు’కు 3 వేల కోట్లు
కార్మికులు రోడ్డెక్కే పరిస్థితి చూశాం. కానీ ఎన్నడూ లేనివిధంగా రైతులు సమ్మెకు దిగారు. వరి పండించలేని పరిస్థితిని సిగ్గులేని ప్రభుత్వం తెలుసుకోవాలని సమ్మె చేస్తున్నామని వారంటున్నారు. మద్దతు ధర దక్కని పరిస్థితి ఇక ఉండదు. మద్దతు ధర కోసం రూ.3 వేల కోట్లు పక్కనపెడతాం. మద్దతు ధర దొరకనప్పుడు ఆ సొమ్ముతో ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రాష్ట్రంలో 40 లక్షల చదరపు అడుగుల గిడ్డంగులు ఉంటే.. సగం మాత్రమే మన నిల్వలు వాడుకునేందుకు వినియోగిస్తున్నాం. మిగతా సగం ఇతర రాష్ట్రాల కోసం వినియోగిస్తున్నాం. గిడ్డంగులు ఇవ్వరు. మద్దతు ధర ఇవ్వరు. ఎగుమతి చేసుకోనివ్వరు. ప్రాథమిక పాఠశాలను గిడ్డంగులుగా వాడుకునే దుస్థితి చూసి బాధనిపిస్తోంది. మా హయాంలో మరో 40 లక్షల చదరపు అడుగుల గిడ్డంగులు ప్రభుత్వమే కడుతుంది. రైతులు మోటార్లు కొనుగోలు చేసుకునేందుకు, చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు 14 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నారు. వీటి కోసం 3 లక్షల వరకు పావలా వడ్డీకే రుణం ఇస్తాం.
వడ్డీలేని పంట రుణాలు..
నేను వెళ్లినప్పుడు ప్రతి రైతు ముఖాన కన్నీరు కనిపించింది. కనీస మద్దతు ధరకు అమ్ముకోలేని దుస్థితి. మొన్న అనంతపురం వెళ్లాను. కరువొచ్చి పంట బీమాకోసం ఎదురుచూస్తున్న రైతుకు ఏడాది గడిచినా బీమా డబ్బు రాలేదు. వరదలు వచ్చి పంట నష్టపోయినప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లాలకు వెళ్లి పరిస్థితి చూసి లక్షలాది మందితో విజయవాడలో దీక్ష చేస్తే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం గాలి మాటలు చెప్పింది. ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని ఉత్తమాటలు చెప్పింది. వైఎస్సార్ ఉన్నప్పుడు పసుపు రైతు 15 వేలకు అమ్ముకుంటే ఇప్పుడు 4 వేలు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. వరి వేసుకునే బదులు ఉరేసుకుంటే మేలని రైతు సోదరులు అన్న మాట విన్నా. ఆ రైతు ముఖాన చిరునవ్వు ఉండాలంటే రైతు పక్షపాతి సీఎంగా ఉండాలి. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ రైతు బడ్జెట్ ప్రవేశపెడుతుందని చెబుతున్నా. రైతన్నకు వడ్డీ లేని రుణాలు అందిస్తుందని చెబుతున్నా.
ఆ శాఖ మనకే తెస్తా..
ఉపాధి హామీ పథకాన్ని రైతులకు, చేనేత కార్మికులకు అనుసంధానం చేయాలి. ఇది ప్రధానమంత్రి చేతుల్లో ఉన్న అంశం. కనీసం 35 ఎంపీ స్థానాలు నాకివ్వండి. అప్పుడు కేంద్రం మన మాట ఎందుకు కాదంటుందో చూద్దాం. ఎవరో వ్యవసాయ మంత్రి కావాల్సిన దుస్థితి మనకేంటి. వాళ్ల దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి మనకెందుకు? 35 స్థానాలు ఇస్తే ఆ శాఖ మనకే తెస్తా. ఈరోజు రైతులు తాము అధికోత్పత్తి సాధించడానికి ఎంత మోతాదులో ఎరువులు వాడాలో తెలియని పరిస్థితి. వారి భూముల్లో సారమెంత? ఉత్పత్తి ఎలా పెంచాలని ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు? మేం ఆలోచించాం. 104, 108 మాదిరిగా రైతులకు మొబైల్ అగ్రిక్లినిక్‌లు అందుబాటులో ఉండేలా 103ని తెస్తాం. వాటిలో ఉండే డాక్టర్లు రైతులకు సలహాలిస్తారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే అనుబంధ వ్యవసాయం కూడా ఉండాలి. పాడిపశువులు పెంచుకోవాలి. వాటి సంరక్షణకు 102ని తీసుకొస్తాం. దాంట్లో వెటర్నరీ వైద్యులు ఉంటారు. ఇంటికొచ్చి మీ పశువులకు వైద్యం చేస్తారు.
అందరికీ లబ్ధి - ప్రజా ప్రస్థానం సంక్షేమ సూత్రం
తొలి ప్లీనరీలో భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తొలి ప్లీనరీలో ప్రకటించిన సంక్షేమ లక్ష్యాల విసృ్తతి ఒకసారి పరిశీలిస్తే... వీటి ద్వారా రాష్ట్రంలోని ప్రతి వర్గమూ, ప్రతి ప్రాంతమూ, ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో లబ్ధిపొందుతారని స్పష్టమవుతోంది. పార్టీ ప్లీనరీ నిర్దేశించుకున్న ఈ లక్ష్యాల అమలుతో రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ ప్రభుత్వం, పాలన పట్ల విశ్వాసం, కనీసావసరాల లభ్యతపై భరోసా కలుగుతుంది. ఒక సగటు కుటుంబానికి ఆ ధీమాను కల్గించాలనే సంక్షేమసూత్రం ఆధారంగానే పార్టీ ఈ కొత్త భారీ లక్ష్యాలను నిర్దేశించుకుందని ఆ పార్టీ ముఖ్యనేతలూ వివరిస్తున్నారు. విభిన్న ఆర్థికస్థాయిల్లోని ప్రజలపై ఈ కార్యక్రమాల ప్రభావం ఎలా ఉంటుంది, స్థూలంగా సమాజంలో ఎందరికి లబ్ధి చేకూరుతుందో ఒకసారి విశ్లేషిస్తే...
‘అమ్మ ఒడి’లో 2 కోట్ల మంది: ఎల్‌కేజీ నుంచి డిగ్రీ, వృత్తి విద్య, పీజీ వరకు ప్రస్తుతం ఒకటిన్నర కోట్ల మంది విద్యార్థులున్నారు. ఈ సంఖ్యను బట్టి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రకటించిన అమ్మ ఒడి పథకానికి ఏటా రూ.9 వేల కోట్లు అవసరమవుతాయి. డ్రాపవుట్లు తగ్గి, స్కూళ్లలో నమోదు శాతం పెరిగి వచ్చే రెండేళ్లలో విద్యార్థుల సంఖ్య 2 కోట్లకు పెరగవచ్చు. ఈ పథకం కోసం రాష్ట్ర ఖజానా నుంచి వెచ్చించాల్సిన సొమ్ము రూ.12 వేల కోట్లు దాటుతుందని అంచనా. కాగా 2 కోట్ల మంది విద్యార్థులకు, వారి కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది.
కోటి మందికి సామాజిక పింఛన్లు: సామాజిక పింఛన్ల పథకం కింద ప్రస్తుతం 70 లక్షల మంది లబ్ధిదారులున్నారు. ప్రభుత్వం వద్ద రకరకాల పింఛన్ల దరఖాస్తులు ఇంకా లక్షల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని మంజూరు చేయకుండా సర్కారు మొరాయిస్తోంది. కాగా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పింఛన్లు ఇస్తే లబ్ధిదారుల సంఖ్య కోటికి చేరుకోగలదని ఒక అంచనా. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల మొత్తాన్ని గణనీయంగా పెంచితే దీనికి ప్రభుత్వ ఖజానా నుంచి ఏటా దాదాపు రూ.9 వేల కోట్ల మేరకు అవసరం.
ఏటా 40 లక్షల మందికి గూడు: ఏటా కనీసం 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న నేపథ్యంలో... బడ్జెట్‌లో సుమారు రూ.5,500 కోట్లు కేటాయించాలి. 10 లక్షల కుటుంబాలంటే.. కుటుంబానికి నలుగురు లెక్కన చూసినా ఏటా 40 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. పక్కా గూడు సమకూరుతుంది. గుడిసె లేని ఆంధ్రప్రదేశ్ దిశలో ప్రభుత్వం అడుగులు వేసినట్లవుతుంది.
మహిళలకు మరింత బలం: డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. వడ్డీ రాయితీలను ప్రభుత్వం బ్యాంకులకు సకాలంలో చెల్లిస్తే, రుణాల పరిమాణాన్ని మరింత పెంచితే... వారి ఆర్థిక వ్యవహారాలు మరింత పెరగడమే గాక కొన్నేళ్లలో వీరి సంఖ్య కోటిన్నరకు చేరుకోవచ్చు.
ప్రతి రైతూ లబ్ధిదారుడే: రైతులు ఏటా రూ.40 వేల కోట్లు పంట రుణాలుగా తీసుకుంటున్నారు. వారి నుంచి ఏటా బ్యాంకులు 6- 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రకటించినట్లుగా వీరికి వడ్డీ లేకుండా రుణాలివ్వాలంటే ఏటా రూ.2,400 నుంచి రూ.2,800 కోట్లు కావాలి. ఐతే దీనిద్వారా సుమారు 70 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతారు. ఇక మద్దతు ధర కల్పనకు కచ్చితమైన హామీకి వీలుగా రూ.3,000 కోట్లతో ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేస్తే.. ప్రతి రైతూ లబ్ధిదారుడే. 1.2 కోట్ల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరినట్లే.
భుక్తికి భరోసా పెంపు: రాష్ట్రంలో ప్రస్తుతం 2 కోట్ల తెల్లకార్డులున్నాయి. ఒక్కో కార్డుకు ప్రస్తుతం కిలో రూ.2 చొప్పున 20 కిలోల బియ్యం ఇస్తున్నారు. దీన్ని 30 కిలోలకు పెంచుతామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. ఫలితంగా 2 కోట్ల కుటుంబాలు ఈ మేరకు లబ్ధిపొందుతాయి.
104, 108 ... 102, 103: కుయ్... కుయ్... శబ్దాలు ప్రజలందరికీ తరచూ వినిపిస్తాయి. 104, 108 సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి నిధులు సమకూర్చడం ద్వారా అంబులెన్స్‌ల సంఖ్య పెంచితే.. కాల్ చేసినప్పుడు అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరడానికి పట్టే గరిష్ట వ్యవధి 20 నిమిషాల నుంచి ఇంకొంచెం తగ్గుతుంది. వ్యవసాయ సేవలకు, పశువైద్య సేవలకూ 103, 102 సేవలు ప్రారంభిస్తే... సమాజంలోని ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరినట్లే.
నా బిడ్డను ఆశీర్వదించండి ... మీకు అప్పగిస్తున్నా...
ప్రజాప్రస్థానంలో విజయమ్మ ప్రారంభోపన్యాసం ‘దేవుడి ఆశీస్సులు, మీ ప్రేమ, ఆదరణ ఉంటాయని నమ్ముతూ.. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా.. ఆశీర్వదించండి..’ అని మహానేత వైఎస్ సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పార్టీ శ్రేణులను కోరారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి ఆశయాలకు ప్రతిరూపమని.. వైఎస్‌లో ఉన్న చిత్తశుద్ధి, ధైర్యం, దృఢ విశ్వాసం ఆయనలో ఉన్నాయని.. దివంగత నేత ఆశయసాధనలో జగన్‌ను ఆశీర్వదించాలని అన్నారు. ైవె .ఎస్.రాజశేఖరరెడ్డి సమాధి చెంతన శుక్రవారం ఇడుపులపాయలో ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రస్థానం(ప్లీనరీ) సదస్సులో తొలిరోజు ఆమె ప్రారంభోపన్యాసం చేశారు.
19 నిమిషాల పాటు ఉద్వేగభరితంగా సాగిన ఈ ప్రసంగంలో నాటి సంఘటనలు గుర్తు చేసుకుంటూ.. ఆమె పలుమార్లు కంటతడిపెట్టుకున్నారు. విజయమ్మ మాట్లాడుతున్నప్పుడు పలువురు ప్రతినిధులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె ప్రసంగం ప్రతినిధులను కదిలించివేసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో ఉదాహరణలతో తెలియజేస్తూ.. గత రెండేళ్ల ప్రస్థానాన్ని కళ్లకు కట్టినట్టు విజయమ్మ వివరించారు. వైఎస్సార్ స్వర్ణయుగాన్ని మళ్లీ తేవాలని ఆకాంక్షించారు.
ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈ పార్టీ ఎందుకు ఆవిర్భవించాల్సి వచ్చిందో ప్రజలకు మీరు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నా. ఈ పార్టీ అన్నింటికన్నా భిన్నమైన పార్టీ. మాటలు కాదు చేతలు ముఖ్యమని చూపిన మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపిన బాటలో.. ఆయన ఆశయాలకు వారసత్వంగా పుట్టిన పార్టీ. ఆయనకు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ అంటే చాలా అభిమానం. అందుకే తన పథకాలన్నింటికీ ఇందిర, రాజీవ్ పేర్లు పెట్టి.. వాళ్ల పేర్లు జనంలో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేశారు. 1978 నుంచి 2004 వరకు 25 ఏళ్ల పాటు ప్రజల పక్షాన ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఇంట్లో వాళ్లతో మాట్లాడుతున్నప్పుడూ అనేక సందర్భాల్లో ఆయన తల చూపించి తనకు ఎన్ని దెబ్బలు తగిలాయో చూడమని చెప్పేవారు. రెండ్రోజులు హైదరాబాద్‌లో ఉంటే మిగిలిన ఐదు రోజులు ప్రజల మధ్య ఉండేవారు.
మంచి సీఎం ఎలా ఉండాలో చూపించారు..
2003లో 68 రోజుల పాటు పాదయాత్ర చేశారు. రాజమండ్రిలో 51 డిగ్రీల ఎండలు ఉన్నప్పుడూ పాదయాత్ర చేశారు. వారం రోజులపాటు అస్వస్థతకు గురయ్యారు. అయినా తిరిగి పాదయాత్ర కొనసాగించారు. ప్రజలకు ఎక్కడ ఏం కావాలి? ఎక్కడ పరిశ్రమ రావాలి? ఎక్కడ ప్రాజెక్టులు కావాలి? ఎవరికి ఏ అవసరం ఉంది? ఇలా అన్నీ తెలుసుకున్నారు. ప్రజలందరికీ ఏం చేయాలన్నదానిపై బ్లూప్రింట్ ఆయన మైండ్‌లో ఉండేది. తాను అధికారంలోకి రాగానే విద్యుత్తు బకాయిలు మాఫీ చేశారు. రైతులకు ఉచితంగా విద్యుత్తు అందించారు. రైతుల పక్షపాతిగా జలయజ్ఞం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ, 108, పావలావడ్డీ, ఇందిరమ్మ ఇళ్లు, నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఒక మంచి ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చేసి చూపించారు.
2009 ఎన్నికల్లో అన్ని పార్టీలు జట్టు కట్టి పోటీచేస్తే.. ఒక్కడే మళ్లీ అధికారంలోకి తేగలిగాడు. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, 33 నుంచి 36 ఎంపీ సీట్లు వస్తాయని.. 180 నుంచి 200 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని సోనియాగాంధీకి చెబితే ఆమె నమ్మలేదు. అనుకున్నట్టుగానే ఎంపీ సీట్లు వచ్చినా అసెంబ్లీ సీట్లు తగ్గాయి. ప్రజలు మనకు పాస్ మార్కులే ఇచ్చారని, ఇంకా కష్టపడి పనిచేయాల్సి ఉందని అప్పుడే ఆయన కొన్ని కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులకు, ప్రభుత్వంలోని సహచరులకు చెప్పారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని ఉద్బోధించారు.
మధ్యాహ్నానికి వస్తానని చెప్పారు..
2009లో అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో ఒక్క రోజు కూడా వృథా కానివ్వలేదు. కార్యక్రమాల సక్రమ అమలుకు రచ్చబండ నిర్వహించాలని తలంచారు. సత్వరం జలయజ్ఞం పూర్తిచేయాలని భావించారు. ప్రాణ హిత-చేవెళ్ల మినహా మిగిలిన అన్ని ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తిచేస్తామని విశ్వాసం వ్యక్తం చేసేవారు. ధైర్యంగా ఉండేవారు. కానీ దేవుడి ప్రణాళిక ఏమిటో తెలియదు. సెప్టెంబరు 2న కూడా జగన్ ఏదో ప్రాజెక్టుల పూర్తి గురించి మాట్లాడుతుండగా.. ఆయన పూర్తిగా వివరించి చెప్పారు. నిన్నటి వరకు అసెంబ్లీ నడిచింది కదా.. వర్షం కూడా పడుతోంది.. మళ్లీ అప్పుడే వెళ్లడం దేనికంటే.. రచ్చబండకు వెళ్లాల్సిందే అన్నారు. పైలట్ తీసుకుని వెళ్తేనే వెళ్తాను... లేదంటే.. మధ్యాహ్నానికి ఇంటికి వస్తానని చెప్పారు. ఏమైందో ఏమో.. తిరిగి రాలేదు. ఆయనతో కలిసి జీవించే అదృష్టం నాకు లేకపోయింది. ఆయన కోసం 700 మంది ప్రాణాలిచ్చారు. అంతమంది హృదయాల్లో ముద్ర వేసుకున్నారు.
వైఎస్‌పై సోనియా మాటలు బాధ కలిగించాయి..
ఇంటి పెద్దను కోల్పోయిన బాధను అనుభవించిన వాళ్లం. అందుకే జగన్ నల్లమలకు వెళ్లినప్పుడు అక్కడ సభలో వాగ్దానం చేశాడు. చనిపోయిన కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పాడు. అప్పటికి ఏ రాజకీయాలు లేవు. అన్నమాట ప్రకారం రెండు జిల్లాల్లో అభిమానుల కుటుంబాలను ఓదార్చాడు. తండ్రిలాగే కొడుకునూ ఆదరించారు. అర్ధరాత్రులు, తెల్లవార్లూ అక్కున చేర్చుకున్నారు. రెండు జిల్లాలు అయ్యాక ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పుడే నేను సోనియాగాంధీకి లేఖ రాశాను. ఓదార్పు పూర్తిచేయాలని ఉందని, మీరు అనుమతి ఇస్తే అన్ని విషయాలు మీ దగ్గరికి వచ్చి వివరిస్తామని కోరాను. నెల రోజుల తర్వాత ఆమె అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
నేను, జగన్, షర్మిల కలిసి వెళ్లి ఆమెకు వివరించాం. దానికి బదులుగా ఆమె ఇంతలా ఎందుకు? జిల్లాలో ఒక చోటికి పిలిచి సహాయం చేస్తే సరిపోతుందని, జిల్లాకు ఒక్క విగ్రహం సరిపోతుందని చెప్పారు. ఇంకోమాట కూడా అన్నారు. మేం ముఖ్యమంత్రిని చేయడం వల్లే ఆయన ఈ కార్యక్రమాలు చేయగలిగారని చెప్పారు. మా మనసుకు చాలా బాధ కలిగింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఎందరో సీఎంలు వచ్చారు. కానీ ఆయనలా ప్రజల కోసం ప్రణాళికలు ఎవరూ చేయలేదు. వైఎస్ చనిపోయాక మీరే వచ్చి పరామర్శించారు గానీ మమ్మల్ని పిలిపించుకోలేదు కదా.. అలాగే జగన్ కూడా వారి వద్దకే వెళ్లి పరామర్శిస్తేనే బాగుంటుంది అని కూడా చెప్పాం. కానీ ఆమె వినిపించుకోలేదు. చేసేది లేక కన్నీటితో తిరిగొచ్చాం.
ఇచ్చిన మాట తప్పలేదు...
ఢిల్లీ నుంచి వచ్చాక.. ఏం చేద్దామనుకుంటున్నావని జగన్‌ను అడిగాను. అమ్మా.. నేనైతే మాట ఇచ్చాను. ఏడు వందల కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పాను. వైఎస్సార్ కొడుకుగా, నేను మాట నిలబెట్టుకోలేదన్న మాట అనిపించుకోవడానికి సిద్ధంగా లేను. నాయన పేరు నిలబెట్టడానికే నేను నిర్ణయించుకున్నా అని చెప్పాడు. ఆ నిర్ణయం మంచిదే అని పించింది. రెండోసారి యాత్రకు బయలుదేరాలనుకున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను కట్టడి చేశారు. ‘సాక్షి’ పైన దాడులు జరిపించారు. మంత్రులతో లేఖలు రాయించి కోర్టుల్లో కేసులు నడిపిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పార్టీలోనే కొనసాగాలనుకున్నాం. కానీ మా మరిదిని పిలిపించి మంత్రి పదవి ఇస్తామని ఆశపెట్టారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే బాధలేదు. కానీ జగన్‌ను బలహీనుడిగా చేయాలని తలచారు.
ఇది మాకు బాధ కలిగించింది. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చాం. ఆ రకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టాల్సి వచ్చింది. పార్టీ పెట్టి మళ్లీ పోటీ చేయాల్సి వచ్చింది. వైఎస్‌కు 4.20 లక్షల మెజారిటీని కట్టబెడితే.. జగన్‌కు 5.40 లక్షల మెజారిటీ కట్టబెట్టి ఆదరణ చూపారు. వైఎస్ ఎమ్మెల్యేగా సాధించిన మెజారిటీ కంటే అధికంగా నాకు మెజారిటీ కట్టబెట్టి మీ ప్రేమ చూపారు. ఎప్పటికీ రుణపడి ఉంటాం.
తండ్రి ఆశయాలకు ప్రతిరూపం జగన్..
ఈ రోజు ఆయన జయంతి. జగన్ మీ ముందున్నాడు. తండ్రి ఆశయాలకు ప్రతిరూపం. తండ్రిలో ఉన్న కమిట్‌మెంట్, విల్‌పవర్, ధైర్యం.. ప్రతీది జగన్‌లో ఉన్నాయి. రాజకీయంలో ఉండాలంటే నిబ్బరం, ధైర్యం ఉండాలని వైఎస్ చెప్పేవారు. ఆ ధైర్యం జగన్‌లో ఉంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం స్పందించే గుణం, పోరాడే తత్వం జగన్‌లో ఉంది. నా బిడ్డను మీరు ఆశీర్వదించండని కోరుతున్నా. దేవుడి దయ, ఆశీస్సులు.. వైఎస్ ఆశీస్సులు, మీ అందరి ప్రేమ, ఆదరణ ఉన్నాయని నమ్ముతున్నా. నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు జగన్ పూర్తిచేస్తాడని నమ్ముతున్నా. జగన్, వాళ్ల నాన్న స్నేహితుల్లా మాట్లాడుకునేవారు.
ప్రాణహిత, పోలవరం వంటి ప్రాజెక్టుల గురించి విశ్లేషించుకునేవారు. ప్రతిదాంట్లో కొడుకును అలా తీర్చిదిద్దాడు. ఓదార్పు యాత్రలో, ఇప్పటి వరకు చేసిన దీక్షల్లో నా కొడుకు కష్టపడుతున్నప్పుడు.. దేవా.. నా కొడుకును ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని బాధపడేదాన్ని. కానీ నాయకుడిగా తీర్చిదిద్దేందుకే ఇలా కష్టపెడుతున్నాడేమోనని నాకు నేను సమర్థించుకునేదాన్ని. నా బిడ్డను మీరంతా ఆశీర్వదించాలి. ఇక్కడికి వచ్చిన వారంతా వైఎస్‌లా స్పందించాలి. వైఎస్‌లా పోరాడాలి. ప్రజల వెంట నడవాలి. పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. వైఎస్ సువర్ణయుగం మళ్లీ తెచ్చేందుకు మనమంతా కృషిచేద్దామని కోరుతున్నా.
అక్షరాలా ‘ ప్రజా ప్రస్థానమే’! |
| |
| ప్రజాకాంక్షలకు అద్దం పట్టిన ప్లీనరీ * అన్ని వర్గాలకూ భరోసా ఇచ్చేలా జగన్ ప్రసంగం వైఎస్ రాజశేఖరుని ‘ప్రజాప్రస్థానం’... ఓ సువర్ణ యుగానికి నాందీ ప్రస్తావన చేసిన చరిత్రాత్మక ఘట్టం. ఆ బంగరు పాలనను తిరిగి తెచ్చే లక్ష్యంతో ఆవిర్భవించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రారంభించిన ‘ప్రజాప్రస్థానం’... ‘వైఎస్ యుగ’ స్థాపనకు విస్పష్ట ప్రణాళికను ప్రకటించిన ఓ చారిత్రక అవసరం! వైఎస్ మనసా వాచా నమ్మిన ప్రజా సంక్షేమమే తమ ఎజెండా అని, ఆ పాలనను కచ్చితంగా తిరిగి తెస్తామని పార్టీ తొలి ప్లీనరీ ఉద్ఘాటించింది. పురుడు పోసుకుంటూనే కనీవినీ ఎరగని రీతిలో చరిత్రాత్మక విజయాలతో రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... మహా నేత జయంతి అయిన శుక్రవారం నాడు కోలాహలంగా ‘ప్రజాప్రస్థానాన్ని’ ప్రారంభించింది. ప్రజా సంక్షేమ పథకాల చరిత్రలో మేలిమలుపుగా నిలవగల చరిత్రాత్మక పరిణామాలకు ప్లీనరీ బీజం వేసింది! కార్యక్రమ వేదికైన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి పరిసరాల్లో ఈ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ఉద్వేగపూరితం.. విజయమ్మ ప్రసంగం: పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయలక్ష్మి ప్రసంగం రాష్ట్ర నలుమూలల నుంచీ భారీ సంఖ్యలో తరలి వ చ్చిన ప్రతినిధులను విశేషంగా ఆకర్షించింది. పార్టీ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను వివరిస్తూనే, భావి కర్తవ్యాన్ని నిర్దేశించారామె. వైఎస్ మృతి నుంచి చోటు చేసుకున్న పరిణామాలను వివరించిన తీరుఅందరి హృదయాలనూ కదిలించింది. ‘నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా...ఆదరించండి...’ అంటూ చేసిన విజ్ఞప్తి కంటతడి పెట్టించింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఉదయాన్నే కుటుంబసమేతంగా వైఎస్ సమాధిని దర్శిం చి నివాళులర్పించారు. తర్వాత ఆయన రాజకీయ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఉదయం 10.40కి ప్రజాప్రస్థానం ప్రారంభమైంది. మహానేతను స్మరిస్తూ, ముందుగా ఆయనకు ప్రజాప్రస్థానం వేదిక నివాళులర్పించింది. ఆయన మృతిని తట్టుకోలేక మరణించిన అభిమానులందరి కుటుంబాలకూ ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతూ మరో తీర్మానం చేశారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో మృతి చెందిన, బలిదానం చేసిన వందలాది మందికి కూడా సంతాపాన్ని ప్రకటిస్తూ తీర్మానం చేశారు. విజయమ్మ ప్రసంగం తర్వాత ఆర్థిక, వ్యవసాయ, సాగునీటి రంగాలు, పారిశ్రామిక విధానం, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ చేతివృత్తులు తదితర తీర్మానాలను విసృ్తతంగా చర్చించి ఆమోదించారు. తొలిరోజు సమావేశం ముగింపు సందర్భంగా మాట్లాడిన జగన్... ప్రజల కోసం తానేం చేయదలచిందీ, సమాజం పట్ల తన వైఖరినీ విస్పష్టంగా ఆవిష్కరించారు. ఆయన ప్రసంగం ప్రతినిధులను ఉత్తేజితుల్ని చేసింది. వైఎస్సార్ అమర్ హై, జై జగన్ నినాదాలతో ప్లీనరీ ప్రాంగణం మారుమోగింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఇతర పార్టీలకు వెరుపు, విస్మయం, ఆర్థికవేత్తలకు ఆశ్చర్యం కలిగిస్తే... ప్రతినిధులను మాత్రం ఉర్రూతలూగించింది. ఏ పార్టీ కూడా దరిదాపులకు రాలేని స్థాయి వాగ్దానాలతో సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్తను తలపించారు. రాజకీయవాదుల ఊహలకు కూడా అందని మానవతావాదిగా, రైతుల, పేదల పక్షపాతిగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. తన ప్రసంగంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకే గాక పార్టీ అధిష్టానానికి కూడా ముచ్చెమటలు పోయించారు. ఏ ఎన్నికలూ లేని సమయంలో చేసిన నికార్సయిన వాగ్దానాలతో సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. తన తండ్రి ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తుతించిన జగన్, వాటినే సానబట్టి సామాన్యులకు మరింత చేరువ చేశారు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానానికీ సభ హర్షధ్వానాలతో ఆమోదం తెలిపింది. రోజు పొడవునా ‘సీఎం జగన్’ అంటూ నినాదాలు వినిపిస్తూనే వచ్చాయి. ప్రజాప్రస్థానం * ప్లీనరీ హైలైట్స్ |
నూరు అడుగుల వైఎస్సార్ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కొండా సురేఖ వెంట వచ్చిన పసుపులేటి వెంకన్న కళాబృందం నృత్యాలు అందరినీ అలరించాయి.
పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం 10.30కు వేదిక పైకి జగన్, విజయమ్మలు వచ్చారు.
10.55కు దివంగత సీఎం వైఎస్‌కు సభా సభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు.
11 గంటలకు వైఎస్సార్ మరణం అనంతరం ఆత్మహత్యలు చేసుకున్న వారికి నివాళులు అర్పించారు.
11.05కు తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆత్మహత్యలు చేసుకున్న వారికి శ్రద్ధాంజలి ఘటించారు.
11.07కు ప్లీనరీలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్యే విజయమ్మ తొలి ప్రసంగాన్ని ప్రారంభించారు.
11.30కు జగన్ పార్టీ నాయకులతో ప్రమాణం చేయించారు.
విరామం తర్వాత 3.20 గంటలకు జగన్ సభా ప్రాంగణానికి వచ్చారు.
{పాంగణంలో వైఎస్సార్ ఫోటో ప్రదర్శనను చూసేందుకు కార్యకర్తలు బారులుతీరారు.
వైఎస్సార్ సాక్షి సేవా సమితి సంపత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చే శారు.
వైఎస్సార్ 62వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
వైఎస్సార్ సమాధి వద్ద ప్రార్థన సమయంలో విజయమ్మ బాధతో కన్నీరు కారుస్తూ మౌనంగా ఉండిపోయారు.
జగన్ సోదరి షర్మిలమ్మ ప్రార్థనలు చేసే వరకూ కళ్లు చెమరుస్తూనే ఉన్నారు.
ప్రార్థనల్లో వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ భారతి, బ్రదర్ అనిల్‌కుమార్, ఈసీ గంగిరెడ్డి, అవినాష్, భారతమ్మ పాల్గొన్నారు.
వైఎస్సార్ జయంతి రోజునే ప్లీనరీ ప్రారంభం కావడంతో ప్రతినిధులే కాకుండా వైఎస్ అభిమానులు తండోప తండాలుగా ఇడుపులపాయకు తరలివచ్చారు. మహానేత సమాధిని సందర్శించు కున్నారు. దాదాపు లక్ష మంది వచ్చి ఉంటారని అంచనా.
జనం ఇడుపులపాయకు పోటెత్తడంతో పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది.
వైఎస్ జయంతి సందర్భంగా శుక్రవారం సమాధి వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ప్లీనరీకి 14 వేల మంది ప్రతినిధులు వస్తారని అంచనా వేయగా.. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో ఆ సంఖ్య 30 వేలకు చేరుకుంది. ముందుగా 14 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఎక్కువ మంది రావడంతో అప్పటికప్పుడు 30 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ సందర్భంగా ప్రతినిధులు, అభిమానులు ఏ సమయంలోనూ అసహనం ప్రదర్శించకుండా ఓపికతో సహకరించడం విశేషం.
Thursday, July 7, 2011
ఎజెండా.. సంక్షేమమే * నేటి నుంచి రెండు రోజులపాటు వైఎస్సార్ కాంగ్రెస్ తొలి ప్లీనరీ
* నాటి వైఎస్ పాదయాత్ర ‘ప్రజా ప్రస్థానం’ పేరే ప్లీనరీకి కూడా..
* వైఎస్ ఆచరించిన ‘సంక్షేమం’ పై చర్చ.. దానికోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కసరత్తు
* ప్రారంభోపన్యాసం చేయనున్న పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ
* తొలిరోజు తొమ్మిది అంశాలపై ప్రసంగించనున్న నాయకులు, నిపుణులు
* రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై లోతైన సమీక్ష
* తెలంగాణ అంశం కూడా ప్రస్తావనకు..
మహానేత మనసా వాచా ఆచరించి చూపించిన సంక్షేమ పథాన్నే జెండాగా మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... అదే ఎజెండాతో తొలి ప్లీనరీ సమావేశాలకు సిద్ధమయింది. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు ఇక్కడి ఇడుపులపాయలో జరిగే ఈ సమావేశాలు... పార్టీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్సార్ సతీమణి విజయమ్మ ప్రారంభోపన్యాసంతో మొదలుకానున్నాయి. మహానేత మరణానంతరం సామాన్యుడికి ఒక్కొక్కటిగా దూరమయిపోతున్న సంక్షేమ పథకాల కోసం ఏ వ్యూహం అనుసరించాలి? వైఎస్సార్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండటంతో పాటు... వాటిని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ పరంగా ఏం చేయాలి? అనే అంశాలు తొలిరోజైన శుక్రవారం ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాలపై తొలిరోజు జరిగే చర్చలో... భూమిని నమ్ముకున్న రైతుకు వ్యవసాయాన్ని లాభసాటి చేయటంతో పాటు రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికీ వైద్యం, విద్య అందించేందుకు పార్టీ ఎలాంటి డిమాండ్లు చేయాలి? వాటి సాధనకు ఎలా ఉద్యమించాలనే అంశాలపై చర్చ సాగుతుందని పార్టీ వర్గాలు తెలియజేశాయి.
సంక్షేమం విషయంలో దివంగత నేత వైఎస్సార్ మార్గమే అనుసరణీయమని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ఆయన తన పాదయాత్రకు పెట్టిన ‘ప్రజాప్రస్థానం’ పేరునే ఈ సమావేశాలకూ ఖరారు చేసింది. అంతేకాదు. ఆయన పుట్టిన రోజైన జూలై 8నే... అది కూడా ఆయన సమాధి చెంతనే ఈ సమావేశాలనూ ఆరంభిస్తోంది. ఇటీవలి ‘కడప’ ఉప ఎన్నికల్లో ప్రత్యర్థుల ఊహలక్కూడా అందని చరిత్రాత్మక విజయంతో రాష్ట్ర రాజకీయాలపై నిర్ణయాత్మక ముద్ర వేసిన యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి భవిష్యత్ రాజకీయాలపై స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. దీంతో తొలి ప్లీనరీపై జాతీయ స్థాయి పార్టీలూ నిశితంగానే దృష్టి పెట్టాయి. అందుకనే రాజకీయ ప్లీనరీల్లో ఆనవాయితీగా వినిపించే రాజకీయ ప్రసంగాలు కాకుండా, రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసే సమీక్షలతో ఈ ప్లీనరీ సాగనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
‘‘ఇదో సువర్ణాధ్యాయం. రాష్ట్రం నలుమూలల నుంచి కొత్త ఆశలతో వచ్చే వేల మంది ప్రతినిధులు... రాష్ట్ర ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై సీరియస్‌గా దృష్టి పెట్టబోతున్నారు. సమాజం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల పార్టీ వైఖరిని ఆవిష్కరించడానికి ఇదో వేదిక కాబోతోంది’’ అని పార్టీలోని సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. తొలిరోజు తొమ్మిది అంశాలపై నేతలు, నిపుణులు ప్రసంగిస్తారని, రెండవరోజు మరో ఐదు అంశాలపై ప్రసంగాలు ఉంటాయని కూడా ఆయన తెలియజేశారు.
వెనుకబడిన ప్రాంతాలపై చర్చ...
వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన మరణించాక ఒక్కొక్కటిగా రాలిపోతుండటంపై జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు పోరాటాలు చేసింది. ఇలాంటి వైఖరిని సహించేది లేదంటూ ధర్నాలు, నిరాహార దీక్షలతో ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు పంపించింది. ఈ నేపథ్యంలో ప్లీనరీలో సమగ్రమైన చర్చకు సిద్ధమైన వైఎస్సార్ తనయుడు... రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ చెందిన పలువురు మేధావులు, సీనియర్ రాజకీయ నాయకులతో సమాలోచనలు జరిపాకే ‘ప్రజాప్రస్థానం’ పేరు ఖరారు చేశారు.
అంతేకాదు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రాంతీయ వాదంపైనా ఈ ప్లీనరీలో లోతుగానే చర్చించనున్నట్లు సమాచారం. ‘‘తెలంగాణ అంశంతోపాటు ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలను కూడా చర్చించే అవకాశముంది. తెలంగాణ అంశంపై ఆ ప్రాంతానికి చెందిన నిపుణులే మాట్లాడతారు’’ అని తెలంగాణకు చెందిన నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఇప్పటికే తెలంగాణ అంశంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంత నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలియవచ్చింది.
ఇడుపులపాయలో వైఎస్ జగన్ సమాలోచనలు
ఇడుపులపాయలోని తన స్వగృహంలో గురువారం సాయంత్రం పార్టీకి చెందిన నేతలు, మేధావులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమాలోచనలు జరిపారు. శుక్రవారం ప్రారంభమయ్యే ప్లీనరీలో చర్చించనున్న అంశాలు, ప్రవేశపెట్టనున్న తీర్మానాలపై మరోసారి లోతుగా చర్చించారు. ఈ సమావేశాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, వైవీ సుబ్బారెడ్డి, సోమయాజులు, ఎస్.రఘురామిరెడ్డిలతోపాటు మేధావులు పాల్గొన్నారు.
* వైఎస్ ఆచరించిన ‘సంక్షేమం’ పై చర్చ.. దానికోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కసరత్తు
* ప్రారంభోపన్యాసం చేయనున్న పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ
* తొలిరోజు తొమ్మిది అంశాలపై ప్రసంగించనున్న నాయకులు, నిపుణులు
* రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై లోతైన సమీక్ష
* తెలంగాణ అంశం కూడా ప్రస్తావనకు..
‘‘ఇదో సువర్ణాధ్యాయం. రాష్ట్రం నలుమూలల నుంచి కొత్త ఆశలతో వచ్చే వేల మంది ప్రతినిధులు... రాష్ట్ర ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై సీరియస్‌గా దృష్టి పెట్టబోతున్నారు. సమాజం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల పార్టీ వైఖరిని ఆవిష్కరించడానికి ఇదో వేదిక కాబోతోంది’’ అని పార్టీలోని సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. తొలిరోజు తొమ్మిది అంశాలపై నేతలు, నిపుణులు ప్రసంగిస్తారని, రెండవరోజు మరో ఐదు అంశాలపై ప్రసంగాలు ఉంటాయని కూడా ఆయన తెలియజేశారు.
వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన మరణించాక ఒక్కొక్కటిగా రాలిపోతుండటంపై జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు పోరాటాలు చేసింది. ఇలాంటి వైఖరిని సహించేది లేదంటూ ధర్నాలు, నిరాహార దీక్షలతో ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు పంపించింది. ఈ నేపథ్యంలో ప్లీనరీలో సమగ్రమైన చర్చకు సిద్ధమైన వైఎస్సార్ తనయుడు... రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ చెందిన పలువురు మేధావులు, సీనియర్ రాజకీయ నాయకులతో సమాలోచనలు జరిపాకే ‘ప్రజాప్రస్థానం’ పేరు ఖరారు చేశారు.
అంతేకాదు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రాంతీయ వాదంపైనా ఈ ప్లీనరీలో లోతుగానే చర్చించనున్నట్లు సమాచారం. ‘‘తెలంగాణ అంశంతోపాటు ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలను కూడా చర్చించే అవకాశముంది. తెలంగాణ అంశంపై ఆ ప్రాంతానికి చెందిన నిపుణులే మాట్లాడతారు’’ అని తెలంగాణకు చెందిన నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఇప్పటికే తెలంగాణ అంశంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంత నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలియవచ్చింది.
ఇడుపులపాయలో వైఎస్ జగన్ సమాలోచనలు
ఇడుపులపాయలోని తన స్వగృహంలో గురువారం సాయంత్రం పార్టీకి చెందిన నేతలు, మేధావులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమాలోచనలు జరిపారు. శుక్రవారం ప్రారంభమయ్యే ప్లీనరీలో చర్చించనున్న అంశాలు, ప్రవేశపెట్టనున్న తీర్మానాలపై మరోసారి లోతుగా చర్చించారు. ఈ సమావేశాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, వైవీ సుబ్బారెడ్డి, సోమయాజులు, ఎస్.రఘురామిరెడ్డిలతోపాటు మేధావులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)