Wednesday, February 23, 2011

జగన్‌ను ఆస్పత్రికితరలించే యత్నం * యువనేత ససేమిరా.. దీక్ష కొనసాగుతుందని స్పష్టీకరణ

మూత్రంలో కీటోన్స్, తగ్గిన షుగర్ లెవల్స్
నిర్ధారించిన వైద్యులు

--------------------------------
జగన్ ఆరోగ్య పరిస్థితి
బీపీ: 100/70
రక్తంలో చక్కెర స్థాయి: 66 ఎంజీ
నాడీ స్పందన: నిమిషానికి 60 సార్లు
మూత్రంలో కీటోన్స్ ఎక్కువగా పోతున్నాయి

---------------------------------------------


యువనేత ససేమిరా.. దీక్ష కొనసాగుతుందని స్పష్టీకరణ
అర్ధరాత్రి దాటాక దీక్షా శిబిరానికి పోలీసులు.. ఆస్పత్రికి తరలిస్తామని వినతి
తన ఆరోగ్యం కంటే పేద విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమన్న యువనేత
సర్కార్ ఫీజుల సమస్య పరిష్కరిస్తేనే దీక్ష విరమిస్తానని వెల్లడి
క్షీణిస్తున్న ఆరోగ్యం.. మూత్రంలో కీటోన్ బాడీస్ 4% దాటాయి..
వెంటనే ఆహారం తీసుకోవాలి.. లేదంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి
తీసుకోకుంటే మొదట కిడ్నీలకు, తర్వాత గుండెకు ప్రమాదమన్న డాక్టర్లు
అయినా వైద్య చికిత్సలను తిరస్కరించిన జగన్.. కొనసాగుతున్న నిరాహార దీక్ష
ఐదో రోజూ పోటెత్తిన జనం.. బంద్ ఉన్నా ఆగని అభిమానులు



ఐదు రోజులుగా కఠిన నిరాహార దీక్ష చేస్తున్న యువనేత జగన్ ఆరోగ్య పరిస్థితి మంగళవారం క్షీణించింది. దీంతో అర్ధరాత్రి 12 గంటలు దాటాక యువనేతను ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు యత్నించారు. భారీ పోలీసు బలగాలతో దీక్షా శిబిరానికి వచ్చిన ఏసీపీ చక్రపాణి జగన్‌తో మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చేందుకు అంగీకరిస్తే గాంధీ హాస్పిటల్‌కు తరలిస్తామని కోరారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు రోజుల దీక్ష కొనసాగిస్తానని జగన్ స్పష్టంచేశారు. దీక్ష వల్ల తన ఆరోగ్యం క్షీణించవచ్చుగాని, యువకుడినైనందువల్ల ప్రమాదమేమీ జరగదని అన్నారు. తన ఆరోగ్యానికంటే 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తే తనకు ముఖ్యమని స్పష్టంచేశారు. ‘నాకోసం నేను దీక్ష చేయడంలేదు. 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్నాను. నేను 37 సంవత్సరాల యువకుడిని. ఏడు రోజులపాటు దీక్ష చేస్తానని ముందే చెప్పాను.

ఆ క్రమంలో ఆరోగ్యం దెబ్బతింటుందని నాకు తెలుసు. అయితే లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ముందు నా ఆరోగ్యాన్ని లెక్క చేయను. ఇప్పటికి ఐదు రోజులు దీక్ష చేశాను. మరో రెండు రోజులు చేయడం నాకేం కష్టంకాదు. నా ఆరోగ్యం దెబ్బ తింటుందని మీకు ఆందోళన ఉంటే ఆ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పండి. ప్రభుత్వం స్పందించి పేద విద్యార్థుల కోసం ఏమైనా చేస్తే దీక్ష విరమించడంపై నిర్ణయం తీసుకుంటాను’ అని ఏసీపీ చక్రపాణికి జగన్ స్పష్టంచేశారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు.


కీటోన్ బాడీస్‌పై వైద్యుల ఆందోళన

అంతకుముందు రాత్రి 8 గంటలకు జగన్‌ను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని చెప్పారు. ఆయన షుగర్ స్థాయి తగ్గిందని, కీటోన్ బాడీస్ నాలుగు శాతం దాటాయని పేర్కొన్నారు. అసలు మూత్రంలో కీటోన్ బాడీస్ ఉండడమే ఆరోగ్యం క్షీణిస్తోందనడానికి సూచికని, అలాంటిది నాలుగు శాతం దాటడమంటే పరిస్థితి విషమిస్తున్నట్లేనని యువనేతకు వైద్య పరీక్షలు చేసిన గాంధీ ఆస్పత్రి వర్గాలు స్పష్టంచేశాయి. అత్యవసరంగా ఆయన ఆహారం తీసుకోవాలని, లేదంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలని పేర్కొన్నాయి. అలా చేయలేదంటే ఆరోగ్యం మరింత వేగంగా క్షీణించే ప్రమాదముందని తెలిపాయి. దీక్ష ఇలాగే కొనసాగితే మొదట కిడ్నీకి, తర్వాత గుండెకు ప్రమాదమని వైద్యులు చెప్పారు. అయినప్పటికీ జగన్ పట్టువీడట్లేదు. పేద విద్యార్థులకు పెద్ద చదువులు అందించాలన్న బలమైన సంకల్పంతో నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. జగన్‌ను చూడ్డానికి తండోపతండాలుగా జనం వస్తూనే ఉన్నారు.
 
కాసేపే కూర్చోగలిగిన యువనేత

విద్యార్థులకు ఫీజులు, మెస్ చార్జీలు తక్షణం చెల్లించాలని డిమాండు చేస్తూ జగన్ చేపట్టిన ఏడు రోజుల నిరాహార దీక్ష మంగళవారం ఐదో రోజుకు చేరింది. యథావిధిగా ఉదయం నుంచే దీక్షా స్థలికి చేరుకున్న ప్రజలను కలవడానికి ఉదయం 7 గంటలకే ఆయన వేదిక మీదకు వచ్చారు. అప్పటికే ఆయన నీరసంగా కనిపించారు. ప్రజలను పలకరించడానికి, కరచాలనం చేయడానికి వీలుగా నాలుగు రోజులుగా పగలంతా కూ ర్చొనే ఉన్న జగన్... మంగళవారం కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. సర్వ శక్తులు కూడగట్టుకొని అభిమానులు, విద్యార్థులను పలకరించడం కోసం అప్పుడప్పుడూ కూర్చున్నారు. షుగర్ లెవల్ బాగా పడిపోవడంతో.. ఆయన ఎక్కువ సమయం వేదిక మీద పడుకొనే ఉన్నారు. యువనేత మాట్లాడాలని విద్యార్థులు సాయంత్రం గట్టిగా డిమాండు చేశారు. జగనన్న మాట్లాడాలి.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాట్లాడడానికి జగన్‌కు ఆరోగ్యం సహకరించడం లేదని, అర్థం చేసుకోవాలని నాయకులు సర్దిచెప్పడంతో విద్యార్థులు సరేనన్నారు.



చికిత్స అందించకుంటే ప్రమాదమే

ఐదు రోజులుగా కఠిన నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆరోగ్యం క్షీణించిందని జగన్‌ను పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య చికిత్స అత్యవసరమని డాక్టర్లు సూచించారు. ఆయనకు పరీక్షలు చేసిన అపోలో ఆసుపత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితుల్లో చికిత్స అత్యవసరం.. కానీ ఆయన దీక్ష కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నారు’ అని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రి(గాంధీ) వైద్యుడు దీపక్ మాట్లాడుతూ ఆయన శరీరంలో షుగర్‌లెవల్స్ తగ్గాయని చెప్పారు. మిగిలిన వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

దీక్ష పూర్తి చేయాలంటున్నారు: భూమన

ఇలాగే దీక్ష కొనసాగితే మరింత ప్రమాదముందని వైద్యులు చెప్పారని జగన్ వర్గం నేత భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ‘వెద్యులు చికిత్స అత్యవసరమంటున్నారు. కానీ జగన్ మాత్రం ఏడు రోజుల దీక్ష పూర్తయ్యేంతవరకు డాక్టర్ల నుంచి ఎలాంటి సహాయం తీసుకోనని చెపుతున్నారు. మానసికంగా ధృఢంగా ఉన్నారు. నిరాహార దీక్షను పూర్తి చేస్తానంటున్నారు’ అని చెప్పారు.


జగన్ దీక్షలో జన దండు  *   బంద్‌తో తెలంగాణ స్తంభించినా వెల్లువలా వచ్చిన ప్రజలు


 బంద్ పిలుపుతో మంగళవారం తెలంగాణ మొత్తం స్తంభించింది.. కిక్కిరిసి ఉండే హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి.. కానీ ఇందిరాపార్క్ వద్ద యువనేత జగన్ నిరాహార దీక్ష చేస్తున్న ‘వరలక్ష్మి దీక్షా ప్రాంగణం’ మాత్రం జన జోరుతో హోరెత్తింది. తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరుగుతుండగా.. ఇక్కడకు వచ్చిన వారిలో తెలంగాణ జిల్లాల ప్రజలే అధికంగా ఉండడం గమనార్హం. విద్యార్థులకు ఫీజులు, మెస్ చార్జీలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జగన్ చేపట్టిన ఏడు రోజుల కఠిన నిరాహార దీక్ష మంగళవారం ఐదో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యార్థులు, తల్లిదండ్రులు, యువకులు, మహిళలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు, కళాకారులు.. ఇలా విభిన్న వర్గాల ప్రజలు వచ్చి జగన్‌కు మద్దతు ప్రకటించారు.

కిలోమీటర్ల మేర కాలి నడకన..:
మంగళవారం తెలంగాణ బంద్ నేపథ్యంలో నగరంలో సిటీబస్సులు నిలిచిపోయాయి. వివిధ జిల్లాల నుంచి రైళ్లల్లో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్‌లకు చేరకున్న జనం పాదయాత్ర చేపట్టారు. కోస్తా జిల్లాల నుంచి వచ్చిన జనం సికింద్రాబాద్ నుంచి, రాయలసీమ జిల్లా నుంచి వచ్చిన జనం కాచిగూడ స్టేషన్ నుంచి, తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన జనం నాంపల్లి నుంచి ఇందిరా పార్కు బాట పట్టారు. బంద్‌రోజు ప్రశాంతంగా ఉండాల్సిన ఆర్టీసీ క్రాస్‌రోడ్-ఇందిరాపార్కు రహదారి జై జగన్..జైజై జగన్..అంటూ నినాదాలతో హోరెత్తింది. గుంటూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్థుల పాదయాత్రలో మాజీ మంత్రి మాకినేని పెద రత్తయ్య కూడా పాల్గొనడం విశేషం. ఇక దీక్షా ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో మహిళలు.. ప్రత్యేకించి మైనార్టీ వర్గానికి చెందిన మహిళలు ఎక్కువగా కనిపించారు.

కన్నీరు మున్నీరైన అభిమానులు:
వివిధ జిల్లాల నుంచి పలువురు జానపద కళాకారులు దీక్ష స్థలికి వచ్చి జగన్‌కు మద్దతు ప్రకటించారు. మనగానం కళాబృందం సభ్యులు జగన్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. 50 మంది సీనీ జూనియర్ మహిళా ఆర్టిస్టులు దీక్షలో పాల్గొన్నారు. విద్యార్థులు, యువకులు, మహిళలు... జగన్‌ను దగ్గర నుంచి చూడాలని పరితపించారు. ఆయన్ను పలకరించాలని, చేయి కలపాలని ఆరాటపడ్డారు. అభిమానులను పలకరించడానికి యువనేత సర్వశక్తులు కూడగట్టుకొని కాసేపు కూర్చుని అభివాదం చేశారు. కొంత మందితో కరచాలనం చేశారం. బాగా నీరసించి ఉన్న ఆయన ఎక్కువ సమయం కూర్చోలేక.. ఎక్కువసేపు పడుకొనే ఉన్నారు. నీరసించి పడుకొని ఉన్న జగన్‌ను చూసి.. పలువురు మహిళలు కంటతడి పెట్టారు. ఫీజు పోరుకు మద్దతుగా జూనియర్ డాక్టర్లు, విద్యార్థినిలు సోమవారం నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు వారు దీక్ష చేశారు.

ఎంఐఎం మద్దతు:
దీక్షకు ఎంఐఎం మద్దతు ప్రకటించిందని మైనార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ వెల్లడించారు. ఎంఐఎం నేత ఒవైసీ తనకు ఫోన్ చేసి జగన్ ఆరోగ్యం గురించి వాకబు చేశారని తెలిపారు. ముస్లింల అభ్యున్నతికి కృషి చేసిన వైఎస్ కుమారుడైన జగన్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, త్వరలో వచ్చి కలుస్తానని చెప్పమన్నారని వెల్లడించారు.

దీక్షలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు:
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుభాష్ చంద్రబోస్, ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రసాదరాజు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలరాజు, కమలమ్మ, ఆళ్ల నాని, ద్వారంపూడి, గొల్ల బాబూరావు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కొండా సురేఖ, శ్రీకాంత్‌రెడ్డి, గుర్నాథ రెడ్డి, శోభానాగిరెడ్డి, జయసుధ, శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు జూపూడి, కొండా మురళి, పుల్లా పద్మావతి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ కె.వెంకటరమణారెడ్డి, సినీ నటులు రోజా, రాజా, జగన్ వర్గ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, బాజిరెడ్డి, రెహ్మాన్, బీరవోలు సోమిరెడ్డి, సిరాజుద్దీన్ దీక్షలో పాల్గొన్నారు.
 
లేదు.. దీక్ష కొనసాగిస్తారు
 స్పష్టం చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు
పథకం అమలులో ప్రభుత్వ వైఖరి తేల్చేందుకే దీక్ష
ప్రభుత్వంపై ఎంత నమ్మకముందో సుప్రీం వ్యాఖ్యలే చెబుతున్నాయి
దీక్షపై టీడీపీ రాజకీయాలు సిగ్గుచేటు


భవిష్యత్‌లోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి బయటపెట్టేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను ముందే చెప్పినట్టు ఏడు రోజులు పూర్తిగా నిరాహార దీక్ష కొనసాగిస్తారని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టంచేశారు. దివంగత నేత వైఎస్ కలలుకన్న విధంగా నిరుపేద పిల్లలకూ పెద్ద చదువులు అందించాలన్న లక్ష్యంతోనే జగన్ దీక్ష చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె. శ్రీనివాసులు, పి.రామకృష్ణారెడ్డి, బాబూరావు, రామ చంద్రారెడ్డి, గురునాథ్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు చెప్పింది.. ప్రభుత్వం ఇస్తామంటుంది.. జగన్ దీక్ష విరమించవచ్చు కదా అని అందరూ అంటున్నారు. కానీ జగన్ దీక్ష చేస్తోంది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరం ఇబ్బందుల గురించి కాదు. రాబోయే ఆర్థిక సంవత్సరాల గురించి ప్రభుత్వం ఎలాంటి కమిట్‌మెంట్ ఇవ్వలేదు. దీనిపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని ఆయన దీక్ష చేస్తున్నారు. చిన్న వయస్సులో నిరాహార దీక్షలు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఎంతోమంది చెబుతున్నా ఏడు రోజులు దీక్ష కొనసాగించాలని నిర్ణయించుకున్నారు’’ అని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. తాము కాంగ్రెస్‌లోనే ఉన్నామని, పార్టీ ఎమ్మెల్యేలుగానే మాట్లాడుతున్నామని చెప్పారు. ైవె ఎస్ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఒక్కొక్కటిగా పథకాలను సరిగా అమలు చేయకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేస్తుందా.. లేదా అన్న అనుమానంతో జూలై కల్లా బకాయిలు చెల్లించి తమకు రశీదులు చూపమని సుప్రీంకోర్టు కోరిందని గుర్తుచేశారు. దీన్నిబట్టి రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టుకు ఏమేరకు నమ్మకముందో అర్థమవుతోందన్నారు. నిరుపేద విద్యార్థులకుపయోగపడే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌తో జగన్ దీక్ష చేస్తుంటే... టీఆర్‌ఎస్ సపోర్ట్ చేస్తుందంటూ చంద్రబాబు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించడం సిగ్గుచేటని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, జగన్ దీక్షపై రాజకీయం చేయడం ఎంతవరకు సమంజస మో బాబు ఆలోచించుకోవాలన్నారు. తొమ్మిదేళ్ల సీఎంగా, ఆరున్నర ఏళ్లగా ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉండాలో తెలియకుండా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఈ సర్కారు శవంతో సమానం
జగన్ దీక్షను పట్టించుకోకపోవడంపై అంబటి రాంబాబు ధ్వజం
హైదరాబాద్, న్యూస్‌లైన్: లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై యువనేత జగన్ ఐదు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఒక మృత కళేబరంతో సమానమని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. మంగళవారమిక్కడ ఆయన పీసీసీ కిసాన్ సెల్ మాజీ కార్యదర్శి గట్టు రామచంద్రరావు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జునతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

‘సమస్యలు పాలకుల దృష్టికి తీసుకురావడానికి నిరాహారదీక్ష అనేది ఒక మార్గం, గాంధీ మహాత్ముడు మనకు నే ర్పించింది ఇదే. అలాంటి మార్గాన్ని ఎంచుకుని ఐదు రోజులుగా కడుపు మాడ్చుకుని నడిరోడ్డుపై జగన్ దీక్ష చేస్తూ ఉంటే ప్రభుత్వం తరపున కనీసం ఎవరూ పలకరించడానికి రాకపోవడం శోచనీయం. ఆర్.కృష్ణయ్య, జి.కిషన్‌రెడ్డి, మందకృష్ణ మాదిగలు వివిధ సమస్యలపై నిరాహారదీక్ష చేసినపుడు మంత్రులను పంపి సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం జగన్ దీక్ష విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది’ అని నిలదీశారు. చంద్రబాబు దీక్షకు కూర్చున్న మరుసటి రోజే ముఖ్యమంత్రి టీడీపీ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడారని అంబటి గుర్తు చేశారు. బాబును ఆసుపత్రికి తరలించిన తరువాత కూడా వైద్యశాఖ మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి ఆరోగ్యం జాగ్రత్తగా చూడాల్సిందిగా వైద్యులకు ఆదేశాలు ఇచ్చి వచ్చారని తెలిపారు.


జగన్ అంటే ఎందుకంత కోపం?


‘జగన్ అంటే ప్రభుత్వానికి ఎందుకంత కోపం? మహానేత వైఎస్సార్ తనయుడనేనా? ఆయన కాంగ్రెస్‌ను వీడి వె ళ్లాడనా? లక్షలాది మంది విద్యార్థుల అభ్యున్నతి కోసం తన తండ్రి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తూ ఉంటే చూడలేక దీక్షకు పూనుకున్నారనా’ అని అంబటి ప్రశ్నించారు. ప్రభుత్వానికి మానవతా విలువలు కూడా లేవా అని అన్నారు. ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారని, అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. ‘ప్రతి విషయంపైనా ఎక్కువగా మాట్లాడే ఓ మంత్రి జగన్ దీక్ష చేస్తున్న విషయమే తెలియదంటారు, డీఎల్ వంటి మంత్రి వైఎస్ పథకాలు గుదిబండలయ్యాయని, వాటి వల్ల నరకయాతన పడుతున్నామని అంటారు. అసలు ఈ ప్రభుత్వమే ప్రజలకు పెద్ద గుదిబండ’ అని దుయ్యబట్టారు. జగన్ దీక్షను ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నా.. మరో విధంగా అనుకున్నా.. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మాత్రం ఆగదు.. అంతం కాదిది ఆరంభం మాత్రమే అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం చెప్పే మాటలు విశ్వసించలేమంటూ సుప్రీంకోర్టు చెప్పిన తరువాత కూడా సిగ్గు రాలేదన్నారు. ప్రభుత్వం ఉందా, చచ్చిపోయిందా? అనేది అనుమానంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


బాబుకు కడుపు మంట


విద్యార్థుల కోసం దీక్ష చేస్తున్న జగన్‌ను అడ్డుకోలేదేమని చంద్రబాబు మాట్లాడటం దిగజారుడుతనానికి పరాకాష్ట అని రాంబాబు వ్యాఖ్యానించారు. ‘ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నపుడు వారి తరఫున పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతపై ఉంది. అలాంటిది ఆయన తన బాధ్యతను మర్చిపోయి.. జగన్ ఆ ఉద్యమాన్ని చేస్తుంటే అడ్డుకోలేదేమని తెలంగాణవాదులను ఉసిగొల్పాలని చూస్తారా? ఇంతకంటే దిగజారుడుత నం ఏమైనా ఉంటుందా’ అని ప్రశ్నించారు. కాగా, మంత్రి శంకరరావుకు ఇంగిత జ్ఞానం ఉంటే.. సీఎం కిరణ్ రూ. 30 కోట్ల విలువైన అసైన్డ్ భూములను ఆక్రమించారనే ఆరోపణల మీద హైకోర్టుకు లేఖ రాయాలని గట్టు రామచంద్రరావు ఫీజు పోరు వేదిక వద్ద మీడియాతో మాట్లాడుతూ సవాలు విసిరారు.


ఆ పత్రికలు, మీడియాది దుష్ర్పచారం
జగన్‌కు 4.5 లక్షల మంది పరామర్శ


కొన్ని పత్రికలు, ఓ వర్గం మీడియా కావాలనే జగన్ దీక్షపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అంబటి విమర్శించారు. ఈ విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘జగన్ దీక్షకు స్పందన లేదని, నీరుగారిపోయిందని కొన్ని పత్రికలు రాశాయి. మీడియాలో వచ్చిందంతా.. పత్రికల్లో రాసిందంతా రాష్ట్ర ప్రజలు నమ్మి ఉంటే 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదే కాదు. పత్రికల్లో వచ్చిందంతా నమ్మొద్దని వైఎస్ చెప్పేవారు. ఇతర మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని కూడా తెలుసుకోమని చెప్పేవారు. ఎవరేమి రాసినా.. ఏం చూపించినా జగన్‌కు ఉన్న ప్రజాదరణ తగ్గదు. దీక్ష ప్రారంభించిన నాటి నుంచి మంగళవారం ఉదయం వరకూ 4.5 లక్షల మంది వచ్చి జగన్‌ను పరామర్శించారు.


పరామర్శకు వచ్చిన వారంతా దీక్షా శిబిరం వద్దనే కూర్చుండిపోరు కదా? బిడ్డ కడుపు మాడ్చుకుంటున్నాడని దగ్గరికి వచ్చి ఏడ్చినవారున్నారు.. అయ్యో అని ఆవేదన వ్యక్తం చేసేవారున్నారు. ఇవన్నీ మీడియాకు కనపడవు. వాళ్లకు కనిపించినా కనిపించకపోయినా జగన్ ప్రజల హృదయాల్లో ఉన్నారు. తెలుగు రాష్ర్టంలో ఆయనే అత్యంత ప్రజాదరణగల నేత’ అని చెప్పారు. ప్రాణం పోయినా సరే మాట తప్పని వంశం నుంచి వచ్చిన వాడు.. ఆరోగ్యం క్షీణిస్తున్నా నీరసంగా కనిపిస్తున్నా దీక్ష మాత్రం ఏడు రోజుల పాటు కొనసాగించి తీరుతారు అని తెలిపారు. జగన్ వెంట వెళ్లే ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతోందన్న వార్తలను ప్రస్తావిస్తూ.. ‘దీక్ష చేస్తున్నది ఏమైనా అసెం బ్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికా? ఎమ్మెల్యేలు వచ్చేటపుడు వస్తారు. కొంతమంది వస్తారు. మరికొందరు ఇబ్బంది కలుగుతుందని రాకపోవచ్చు, అంత మాత్రాన జగన్ బలం తగ్గిపోయినట్లేనా’ అని అన్నారు.


‘ఫీజు పోరు’లో ఎవరేమన్నారంటే...

చీమ కుట్టినట్లు కూడా లేదు

జగన్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఫీజులిచ్చినా విద్యార్థులు పరీక్షలు రాసే మానసిక స్థితిలో లేరు. విద్యా వ్యవస్థలో దారుణమైన పరిస్థితులు నెలకొనడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రీయింబర్స్‌మెంట్‌కు నిధులు ఇవ్వకపోవడం వల్ల... ఫీజులు కట్టి చదువుతున్న 40 శాతం మంది విద్యార్థులకూ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు కలిగించింది. -కొండా సురేఖ, మాజీ మంత్రి

దీక్ష ప్రకటించాకే విద్యార్థులు గుర్తొచ్చారు

జగన్ ఫీజు పోరు ప్రకటించిన తర్వాతే చంద్రబాబుకు, ప్రభుత్వానికి విద్యార్థులు గుర్తొచ్చారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ప్రతిపక్షనేత ఓర్వలేకపోతున్నారు. కాంగ్రెస్‌కు రెండు సార్లు ఘన విజయాలను అందించిన మహానేత కుమారుడు దీక్ష చేస్తుంటే.. వైఎస్ వల్ల అధికారం వెలగబెడుతున్న సీఎం, మంత్రులకు చీమకుట్టినట్లుగా కూడా లేదు. తాము పలకరిస్తే జగన్ నాయకుడు అవుతారని సీఎం, మంత్రులు భయపడుతున్నారు.
- శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే

సర్కారుది అహంకార పూరిత వైఖరి

జగన్ దీక్ష చేస్తున్నా.. దున్నపోతు మీద వాన పడినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వైఎస్‌ను నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే... ఆయన లేకపోయేసరికి ఈ ప్రభుత్వం ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా జగన్ దీక్ష చేపడితే... ఆయన డిమాండ్లు తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయని ప్రభుత్వానికి ఎంత అహంకారం ఉందనే విషయం తెలుస్తూనే ఉంది.
- రోజా, నటి

జగన్ దీక్షతో విద్యార్థుల్లో ఆశలు

రీయింబర్స్‌మెంట్ బకాయిలను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తే.. వచ్చే సంవత్సరం విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఈ పథకాన్ని నాశనం చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకొంది. జగన్ దీక్ష విద్యార్థుల్లో ఆశలు రేకెత్తించింది.
- మాకినేని పెద రత్తయ్య, మాజీ మంత్రి

వీళ్లకు సిగ్గూశరం లేదు

ఈ ప్రభుత్వాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాదు.. కోర్టులు కూడా నమ్మడం లేదు. సిగ్గూశరం విడిచిపెట్టి.. సీఎం, మంత్రులు కుర్చీల్లో కూర్చున్నారు. వైఎస్‌ఆర్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చి మంత్రులయిన వారి ప్రవర్తన చూస్తుంటే అసహ్యం వేస్తోంది. జగన్ దీక్ష చేస్తున్నారా? అంటూ ఒక మంత్రి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. జగన్ దీక్ష చేస్తున్న విషయం, ఎందుకు చేస్తున్నారనే విషయం విద్యార్థిలోకానికే కాకుండా ప్రపంచానికి మొత్తం తెలుసు.
- పుల్లా పద్మావతి, ఎమ్మెల్సీ

నువ్వే వైఎస్‌కు సలహా ఇస్తే ఇప్పుడేం చేస్తున్నావ్?

డీఎస్.. ఫీజు రీయింబర్స్ గురించి నేనే వైఎస్‌కు చెప్పానని చెప్పుకున్నావ్. సిగ్గులేదా? ఇప్పుడేం చేస్తున్నావ్? బలహీన వర్గాలకు చెందినవాడిగా విద్యార్థుల ఫీజులు చెల్లించమని సీఎంకు చెప్పొచ్చుకదా? రెండుసార్లు ఓడిపోయిన తర్వాత కూడా మూడోసారి పీసీసీ అధ్యక్ష పదవి వస్తే దానిని చంకలో పెట్టుకుని తిరుగుతున్నావ్. ప్రభుత్వం మూడేళ్లు ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మూడేళ్లు కాదు మూడు నెలలు కూడా ఈ ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదు. నాగం జనార్దనరెడ్డి ఓయూకి వెళ్లి విద్యార్థులతో మాలిష్ చేయించుకున్న తర్వాతే తెలంగాణవాదిగా మారారు.
- బాజిరెడ్డి గోవర్థన్, మాజీ ఎమ్మెల్యే

దీక్ష అంటే ఇది...

ఒక పెద్ద మనిషి ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి.. ఒక్కరోజులోనే పారిపోయి వచ్చారు. మరో నాయకుడు గన్‌పార్కు వద్ద నిరాహార దీక్ష చేస్తే తొలి రోజే షుగర్ లెవల్ 80 శాతం పడిపోయింది. ఆసుపత్రిలో చేరంగానే 90 శాతం పెరిగింది. నేతల నిరాహార దీక్షలంటేనే అసహ్యం కలుగుతున్న నేపథ్యంలో... జగన్ దీక్ష స్వాతంత్ర సమరయోధుల చిత్తశుద్ధిని జ్ఞప్తికి తెస్తోంది.
- లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు

వైఎస్‌ను ప్రజల గుండెల నుంచి తొలగించే కుట్ర

మహానేత ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేయడం ద్వారా వైఎస్‌ను ప్రజల హృదయాల నుంచి తొలగించాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ ముద్రను ప్రజల గుండెల నుంచి తొలగించడం ఎవరి తరం కాదు. వైఎస్ కలలు కన్న సంక్షేమరాజ్య స్థాపన ఒక్క జగన్‌తోనే సాధ్యం.
- చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్

భవిష్యత్ పరిణామాలకు జగన్ బాధ్యులు కారు

ఈ ఏడాది ఫీజురీయింబర్స్‌తోపాటు వచ్చే ఏడాదికి అవసరమైన రూ. 3,500 కోట్లు బడ్జెట్‌లో పెట్టాలని జగన్ కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనందున దీక్ష విరమించాలన్న విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. జగన్ ఆరోగ్యం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై యువనేత అభిమానులు క్రోధంతో ఉన్నారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు జగన్ బాధ్యులు కారు.
- భూమన కరుణాకరరెడ్డి

జనమే కుర్చీలు లాగేస్తారు...

వైఎస్ లేకుంటే కాంగ్రెస్‌కు దిక్కే లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న నాయకులు అధికారమే పరమావధిగా ప్రవర్తిస్తున్నారు. జనాల సమస్యలు పట్టించుకోకపోతే.. జనమే కుర్చీలు లాగేస్తారు. విద్యార్థుల భవిష్యత్ కోసం జగన్ ప్రాణత్యాగానికీ సిద్ధపడ్డారు.
- రాజా, ప్రముఖ సినీ నటుడు


‘నాగం.. ఒళ్లు దగ్గరపెట్టుకో’
 ‘తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసిన నాగం జనార్దనరెడ్డి లాంటి నేతలకు జగన్ దీక్షను అడ్డుకోమ్మని చెప్పడానికి సిగ్గూ, లజ్జా ఉండాలి. అలాంటి ప్రకటనలు చేసేముందు నాగంలాంటి నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు నాగం ఒక్కసారైనా తెలంగాణ గురించి మాట్లాడారా? కాంగ్రెస్ నేతలు మంత్రివర్గంపై, సీఎంపై ఒత్తిడి తెచ్చి.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఒక స్పష్టమైన ప్రకటన చేయించాలి. దానిని ప్రజలకు చెప్పి జగన్‌తో ఒప్పించి దీక్ష విరమింపజేయాలి’.
- గోనె ప్రకాశరావు, ఆర్టీసీ మాజీ చైర్మన్

జగన్‌తో సర్కారు చర్చించాలి


వైఎస్ ఉన్నంతకాలం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వైపు వేలు కూడా చూపలేకపోయారు. ఆయన చనిపోయాక పథకానికి తూట్లు పొడుస్తున్నా రు. పట్టువిడుపులకు పోకుండా జగన్‌తో ప్రభుత్వం చర్చించాలి. ఇప్పుడు జగన్ ఒక్కడే దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే 26 లక్షల మంది జగన్‌లా మారుతారు. అప్పుడు ప్రభుత్వానికి మరింత ప్రమాదం ఏర్పడుతుంది.
- పోసాని




ఊరంతా నిరాహార దీక్ష
యువనేత వైఎస్ జగన్ ఫీజు పోరుకు ఏలూరు రూరల్ మండలం '' మానూరు '' గ్రామమంతా ఒక్కమాటగా నిలిచి మద్దతు పలికింది.


 యువనేత వైఎస్ జగన్ ఫీజు పోరుకు ఏలూరు రూరల్ మండలం మానూరు గ్రామమంతా ఒక్కమాటగా నిలిచి మద్దతు పలికింది. వంటా వార్పు మానేసింది.. ఇళ్లకు తాళాలు వేసింది.. ఊరంతా గ్రామం నడిబొడ్డులోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు తరలి వచ్చింది. పిల్లాపాప, పెద్ద చిన్న భేదం లేకుండా రోజంతా నిరాహార దీక్షను చేపట్టి మద్దతు పలికారు. 800 మంది జనాభా కలిగిన మానురులో 50 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కూడా కూలిపనులు మానుకుని దీక్షలో పాల్గొని ఫీజు పోరుకు సంఘీభావం తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని దీక్ష శిబిరంలో పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమానికి పీవీ రావు నాయకత్వం వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు దీక్షను కొనసాగించారు. 
 
                                                 జగన్‌తో ప్రభుత్వం చర్చలు జరపాలి
 
   ‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న యువనేత వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తోంటే ముప్పూటలా తింటున్న మంత్రుల్లో ఏ ఒకరూ చర్చలకు వెళ్లకపోవడం దారుణం. ఈ ప్రభుత్వానికి సిగ్గు, శరం లేదు’’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సదుద్దేశంతో ఫీజు పోరు దీక్ష చేస్తున్న జగన్‌తో మంత్రులు చర్చలు జరిపేలా సీఎం చొరవ తీసుకోవాలని కోరారు. సీఎం, 9మంది మంత్రులు ఫీజు నిధులకు సంబంధించి కాకిలెక్కలు చెబుతూ.. ఈ పథకాన్ని నీరుగార్చేందుకు దొంగనాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సాగునీటి కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు నిధులు విడుదల చేసేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలకు మాత్రం నానా ఇబ్బందులు సృష్టిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులననుసరించి దశలవారీగా నిధులు విడుదల చేసేందుకూ ముందుకు రాకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. పైగా రూ.150 కోట్ల నిధులే విడుదల చేసిన ప్రభుత్వం రూ. వెయ్యికోట్లు విడుదల చేశామని సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారమందిస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
జగన్ దీక్ష విరమించాలి - మంత్రులు పితాని, బాలరాజు, అహ్మదుల్లా
దీక్ష వద్దకు ప్రతినిధిని పంపుతారా? అన్న ప్రశ్నకు జవాబు దాటవేత
  ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో యువనేత వై.ఎస్.జగన్ ఐదు రోజులుగా ‘ఫీజు పోరు’ పేరిట చేస్తున్న దీక్షపై స్పందించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రభుత్వం నామమాత్రంగా స్పందించింది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, బాలరాజు, అహ్మదుల్లాలు దీక్షకు సంబంధించి ఒక మాట మాట్లాడి వెళ్లిపోయారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు మేర కు చెల్లింపులు జరపటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘‘ట్యూషన్ ఫీజుల విషయంలో జగన్ దీక్ష ప్రారంభించి నాలుగు రోజులవుతోంది. వారిని కోరేదొక్కటే. దీక్ష విరమించుకోండి. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కళాశాల యాజ మాన్యాలతో మాట్లాడి ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు విడుదల చేశాం. సుప్రీం తీర్పుకు లోబడి జూలై 15 లోపు మొత్తం చెల్లింపు జరపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని పితాని చెప్పారు. కళాశాల యాజమాన్యాలు 24 నుంచి తలపెట్టిన కళాశాలల మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. జగన్ దీక్ష శిబిరం వద్దకు ప్రభుత్వ ప్రతినిధి ఎవరైనా వెళ్లి విరమించమని కోరతారా అన్న విలేకరుల ప్రశ్నకు నేరుగా జవాబు చెప్పలేదు. ‘‘నేను దీక్ష విరమించుకోమని చెప్పా ను. వారి ఉద్దేశం వేరే ఉండవచ్చు. ప్రభుత్వం మాత్రం పేద విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడానికి కట్టుబడి ఉంది’’ అని జవాబిస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Tuesday, February 22, 2011

జగన్ దీక్షకు మద్దతుగా ఉవ్వెత్తున.. ఉద్యమంలా ... రాజధాని బాట పట్టిన విద్యార్థి లోకం

నాలుగోరోజు వేలాదిగా వచ్చిన స్టూడెంట్లు
నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువ మంది
ఓయూ ఉద్రిక్తత, ట్రాఫిక్ ఇబ్బందులున్నా దీక్షా ప్రాంగణానికి పోటెత్తిన విద్యార్థి
జగనే కాబోయే సీఎం అంటూ నినాదాలు

ప్రభుత్వంపై విద్యార్థుల సమరభేరి..
ఓవైపు ఉస్మానియా వర్సిటీలో ఉద్రిక్తత.. మరోవైపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన నగరం.. పరిస్థితి తెలిసి జనం బయటకు రాలేదు.. అప్పటికే రోడ్డుపైకి వచ్చిన వాహనం ముందుకు కదల్లేదు.. అయినా విద్యార్థులు ఆగలేదు.. తమ కోసం నాలుగు రోజులుగా తిండి తినకుండా పోరాడుతున్న యువనేత జగన్ కోసం ఉవ్వెత్తున తరలివచ్చారు. సోమవారం కాలేజీలకు సెలవు లేదు.. అలా అని బంద్ కూడా కాదు.. అయినా చదువులను పక్కన పెట్టి మరీ వారు వేలాదిగా జగన్ బాట పట్టారు. యువనేతకు బ్రహ్మరథం పట్టారు. జగనన్నకు బాసటగా మేమున్నామంటూ సంఘీభావం తెలిపారు. ఫలితం సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ‘వరలక్ష్మి దీక్షా ప్రాంగణం’ మరోసారి జనసంద్రాన్ని తలపించింది.

హోరుమంటూ వర్షం..


ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యువనేత వైఎస్ జగన్ చేపట్టిన ‘ఫీజు పోరు’ సోమవారం నాలుగో రోజు కూడా భారీ జన హోరుతో సాగింది. విద్యార్థులు, జగన్ అభిమానులు వివిధ జిల్లాల నుంచి ఉత్సాహంతో వచ్చి దీక్షకు సంపూర్ణమద్దతు పలికారు. యువనేత సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్రలేచి అప్పటికే అక్కడికి చేరుకున్న విద్యార్థులు, అభిమాన నాయకులకు చిరునవ్వుతో అభివాదం చేశారు. ఆ తరువాత దినపత్రికలు చదివి వేదిక మీదకు వచ్చారు. ఆ సమయంలో జగన్ తల్లి విజయమ్మ, సతీమణి భారతి ఆయన్ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు తెల్లవారుజామున ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో వేదికతో పాటు దీక్షా శిబిరం తడిసి ముద్దయింది. ఆదివారం రాత్రి వివిధ జిల్లాల నుంచి వచ్చిన వందలాది మంది మహిళలు, అభిమానులు, నేతలు, విద్యార్థులు దీక్షా శిబిరంలోనే యువనేతతోపాటే నిద్రించారు. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వారు తడిచినా శిబిరాన్ని మాత్రం వదిలివెళ్లలేదు.

నలుమూలల నుంచీ..


ఉదయాన్నే నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున శిబిరానికి తరలివచ్చారు. జేఎన్టీయూ, ఆంధ్ర, నాగార్జున, ఉస్మానియా, కాకతీయ వర్సిటీల పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు కెరటాల్లా కదలివచ్చారు. నాలుగోరోజు దీక్షలో మేము సైతం అంటూ జగన్‌తో కలిసి పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నేతలు, పలువురు విద్యార్థులు ప్రసంగిస్తూ భావోద్వేగాలకు లోనయ్యారు. కూటికి లే ని పేద కుటుంబాల్లో పుట్టి ఇంజనీరింగ్ చదువుతున్నామంటే వైఎస్సార్ పెట్టిన భిక్షేనని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం వెంట నే స్పందించకపోతే కూల్చేస్తామంటూ హెచ్చరించారు. 24నుంచి కళాశాలలు మూసివేస్తామని యాజ మాన్యాలు ప్రకటించిన నేపథ్యంలో.. విద్యార్థులంతా ఏకమై అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు.

 

జగన్ కు తగ్గిన షుగర్ లెవల్
 
యువనేత వైఎస్ జగన్మోహన రెడ్డికి సోమవారం సాయంత్రం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తు న్న నేపథ్యంలో ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పారు. షుగర్ లెవల్ తగ్గిపోతోంద న్నారు. బీపీ 120/70, పల్స్‌రేటు 64, బ్లడ్ షుగర్ 72 ఎంజీ ఉందని, మూత్రం లో కీటోన్స్ ఉన్నాయని నిర్ధారించారు.

 
ఉదయం నుంచే.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థి సంఘాలు చలో అసెంబ్లీ చేపట్టిన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలున్నా విద్యార్థులు ఆగలేదు. ఉదయం పదిగంటలనుంచి రాత్రి వరకు నగరంతో పాటు శివార్లలోని కళాశాలలు, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు జగన్‌కు మద్దతు తెలిపేందుకు భారీగా వచ్చారు. పెద్ద ఎత్తున ర్యాలీగా బాజా భజంత్రీలతో టపాసులు పేల్చుకుంటూ వచ్చి తమ పక్షాన పోరాడుతున్న యువనేతకు తామున్నామని భరోసా ఇచ్చారు. జగన్ కాబోయే సీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. విద్యార్థులతో సమానంగా విద్యార్థినులు రావడం గమనార్హం. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, మెదక్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి యువనేతకు సంఘీభావం తెలిపారు.

మేమంతా నీతోనే..


సోమవారం కూడా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్షా శిబిరానికి తరలివచ్చారు. వరంగల్ జిల్లాకు చెందిన కొండా మురళి, పుల్లా భాస్కర్ దంపతులతో పాటు ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, గుర్నాథ రెడ్డి, శోభానాగిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జయసుధ, శ్రీనివాసులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, సత్యవతి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, కమలమ్మ, కె.భారతి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌లతోపాటు భూమన కరుణాకర్‌రెడ్డి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, సినీనటి రోజా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ సుబ్రహ్మణ్యంరెడ్డి, నెల్లూరు డీసీసీ మాజీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, అంబటి రాంబాబు, బాజిరెడ్డి గోవర్ధన్, రెహ్మాన్, రాచమల్ల సిద్దేశ్వర్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

కన్నీరుమున్నీరై..


నాలుగు రోజులుగా తిండి తినకున్నా.. వేదికపై కూర్చునే ఉంటూ.. తనను కలవడానికి వచ్చిన వారితో కరచాలనం చేస్తూ ఉన్న జగన్.. ఆదివారం మధ్యాహ్నం శ్రేయోభిలాషుల ఒత్తిడితో నడుం వాల్చారు. తనకు వీలున్నంత వరకు వచ్చిన ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడుతూ కరచాలనం చేశారు. ఆయన ఓపికను, పట్టుదలను హర్షిస్తూనే.. తిండి తినకుండా దీక్ష చేస్తున్న జగన్‌ను చూసి పలువురు మహిళా నాయకురాళ్లు, విద్యార్థినీ విద్యార్థులు కంటతడి పెట్టారు. నా కొడుకు ఒక్కరోజు తినకుంటేనే నేను ఎంతో బాధకు లోనవుతాను..అటువంటిది నాలుగురోజులు మెతుకు ముట్టకుండా మొక్కవోని దీక్ష చేపట్టిన యువనేత గురించి ఆ తల్లి గుండె ఎంత క్షోభిస్తుందో అని ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి కన్నీళ్ల పర్యంత మయ్యారు. సిద్దిపేట నుంచి వచ్చిన ఓ వృద్ధురాలు మాట్లాడుతూ ‘నాల్రోజుల నుంచి కూడు లేకపాయె. అయినా మంచిగ పల్కరిస్తున్నడు. నన్ను దగ్గరకు తీసుకుండు. పిల్లల ఇస్కూల్ ఫీజుల కోసం ఆయన పోరాటం చేస్తుండు. అందుకే వచ్చినం’ అని చెప్పింది.


ప్రభుత్వం దిగిరాక తప్పదు..


తనకు అన్ని సౌఖ్యాలు ఉన్నా.. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చే యించడం కోసం.. బడుగుల సంక్షేమం కోసం జగన్ కఠినమైన నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన చిత్తశుద్ధి ముందు సర్కారు దిగిరాకతప్పదు. విద్యార్థుల కష్టాలను అర్థం చేసుకుని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలి. వైఎస్సార్ ఆశయాలను పట్టించుకోని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.

- తోపుదుర్తి కవిత, అనంతపురం జెడ్పీ చైర్ పర్సన్ 


జగన్ వెంటనే దీక్ష విరమించాలి: పితాని
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే దీక్షను విరమించాలని ఆయన కోరారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఫీజులు చెల్లిస్తామని పితాని తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాలలు మూసివేయడానికి యాజమాన్యానికి అధికారం లేదని ఆయన అన్నారు. 
24లోగా స్పందించకుంటే.. అసెంబ్లీ ముట్టడి
వివిధ వర్సిటీల విద్యార్థుల నిర్ణయం
కొండా సురేఖ ప్రకటన
ముట్టడికి తెలంగాణ యూత్ ఫోర్స్ మద్దతు


హైదరాబాద్, న్యూస్‌లైన్: ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండు చేస్తూ యువనేత జగన్ చేస్తున్న నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరినా... వీటి చెల్లింపుపై ప్రభుత్వం ప్రకటన చేయనందుకు నిరసనగా అసెంబ్లీని ముట్టడించాలని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు నిర్ణయించారు. జగన్‌తోపాటు సోమవారం నిరాహార దీక్ష చేసిన జేఎన్‌టీయూ, కృష్ణదేవరాయ, ఉస్మానియా, కాకతీయ, వెంకటేశ్వర వర్సిటీల విద్యార్థులు ఈమేరకు నిర్ణయించినట్లు మాజీ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ‘ఫీజులు, ఉపకారవేతనాలు చెల్లిస్తామని ఈనెల 24లోగా ప్రభుత్వం ప్రకటించకపోతే... అసెంబ్లీని ముట్టడించాలని విద్యార్థులు నిర్ణయించారు. జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదు. విద్యార్థులు తలుచుకుంటే.. ప్రభుత్వాలు దిగిరాక తప్పదు. సర్కారు వెంటనే స్పందించి విద్యార్థులకు ఫీజులు, ఉపకారవేతనాలు చెల్లించాలి’ అని ఆమె డిమాండు చేశారు. అసెంబ్లీ ముట్టడికి తెలంగాణ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు అజయ్ మద్దతు ప్రకటించారు. విద్యార్థులతో పాటు ఆయన కూడా సోమవారం నిరాహార దీక్ష చేశారు. ఫీజుల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కాలేజీ యాజమాన్యాలు కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పోరాటానికి సహకరించకపోతే.. 24 నుంచి కాలేజీలను తామే మూసేస్తామని హెచ్చరించారు. జగన్‌కు ఉన్న సహనం విద్యార్థులుగా తమకు లేదని, జగన్‌కు ఏదైనా జరిగితే విద్యార్థిలోకం భగ్గుమంటుందన్నారు. 


దీక్షలో నేతల ప్రసంగాలివీ...
అనుమాన ముంటే నిఘా పెట్టుకోండి..
నాలుగురోజులుగా జగన్ నిరాహారదీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. జగన్‌కు ఏది జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ఆయన దీక్ష బూటకమని కొందరు ప్రేలాపనలు చేస్తున్నారు. వారికి ఎలాంటి అనుమానాలున్నా నిఘా ఏర్పాటుచేసుకోవచ్చు. రహస్య కెమెరాలు ఏర్పాటు చేసుకోవచ్చు. జగన్ దీక్షా శిబిరానికి జనం రావడం లేదని చెప్పేవారికి ధైర్యముంటే రోజుకు ఇక్కడకు ఎన్నివేల మంది వస్తున్నారో లెక్కలేసుకోవాలి.
- కొండాసురేఖ, మాజీమంత్రి

నిధులు మంజూరు చేయాలి..

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ఫీజులు చెల్లించడానికి వెంటనే నిధులు మంజూరు చేయాలి. కఠిన నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ను చూస్తుంటే.. దుఃఖం ఆగడం లేదు.
-కమలమ్మ, బద్వేల్ ఎమ్మెల్యే

ఈ దీక్ష యువతకు ఆదర్శం..

జగన్ దీక్ష యువతకు ఆదర్శం. ఉడుకు రక్తం కాగుతున్నా.. జగన్ గాంధేయమార్గం ఎంచుకున్నారు. మద్యం విక్రయంతో 13 వేల కోట్ల రాబడి వస్తోంది. విద్యార్థుల కోసం 3 వేల కోట్లు ఖర్చు చేయలేరా? 

- బాజిరెడ్డి గోవర్థన్, మాజీ ఎమ్మెల్యే

విద్యార్థి శక్తి కత్తి కంటే పదునైనది..


విద్యార్థి శక్తి కత్తి కంటే పదునైనది. ప్రభుత్వం స్పందించకుంటే... అది కిరణ్ సర్కారు గుండెల్లో దిగడం ఖాయం. ఫీజుల రీయింబర్స్‌మెంట్ భారమని ప్రభుత్వం అంటోంది. ప్రజలపై పన్నులు వేస్తున్నారు. అది చెల్లించడం వారికి భారం కాదా?   - రోజా, సినీ నటి


సీఎం జీతాలు తీసుకోవడం లేదా?


సుప్రీంకోర్టు ఆదేశాలనూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫీజులు చెల్లించకుండా కాలేజీల యాజమాన్యాల మీద ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తప్పించుకోవాలని చూస్తోంది. సీఎం, మంత్రులు జీతాలు తీసుకోవడం లేదా? మరి విద్యార్థులకు మెస్ ఛార్జీలు, ఫీజులు ఎందుకు చెల్లించరు?

- ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా

సింహం నిరాహార దీక్షలో ఉంది..


ప్రజల కోసం తన జీవితాన్నే త్యాగం చేసుకునేందుకు సిద్ధమయిన జగన్‌ను చూస్తుంటే గుండెతరుక్కుపోతోంది. సింహం నిరాహారదీక్షలో ఉంది. దీక్ష తర్వాత జూలు విదిల్చిందంటే ఢిల్లీ ప్రభుత్వం కూడా మిగలదు.

-లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు

జగన్ కోసం సంఘటితంగా పనిచేయండి..


ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న యువనేత జగన్ కోసం ప్రజలందరూ సంఘటితంగా పనిచేయాలి. వైఎస్ ఆశయాలను పూర్తిగా నెరవేరిస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. అందుకు ప్రజలంతా ఆయనకు అండగా ఉండాలి. -సుబ్రహ్మణ్యం రెడ్డి, చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్


కొండ నాలుకకు మందేస్తే..


ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన అత్యుత్తమ భారతీయుల సర్వేలో జగన్‌కు 20వ స్థానం లభించింది. రాజకీయాల్లో అట్టర్‌ప్లాప్ అయిన చిరంజీవిని కాంగ్రెస్‌లో చేర్చుకొన్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని.. చిరంజీవిని చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్‌కు ఉన్న కొద్దిపాటి బలం కూడా పోగొట్టుకుంది. - ఎల్లసిరి గోపాలరెడ్డి, నెల్లూరు డీసీసీ మాజీ అధ్యక్షుడు


ప్రభుత్వ ప్రతిష్ట దిగజారింది..


జగన్ చేస్తున్న నిరాహారదీక్ష పట్ల వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారిపోతోంది. పట్టుదలకు పోవద్దు. కాలక్షేపం చేయవద్దు. జగన్‌తో చర్చలు జరపాలి. విద్యార్థుల ఆందోళన గురించి వ్యంగ్యంగా మాట్లాడడం గొప్ప కాదు. వారి జీవితాలతో ఆటలాడుకోవద్దు.

-ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రాష్ట్ర సాంస్కృతిక మండలి మాజీ చైర్మన్

జగన్‌కు ఎవరూ సాటిరారు


కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో కుమ్మక్కయింది. వెయ్యి మంది చంద్రబాబులు కూడా జగన్‌కు సాటిరారు.

- మాజీ ఎమ్మెల్సీ రెహమాన్

తల్లికి ఉండాల్సిన లక్షణాల్లో ఒక్కటి కూడా సోనియాగాంధీకి లేవు. జగన్‌ను చూస్తుంటే... కడుపు తరుక్కుపోతోంది. జగన్‌కు ఆపద వస్తే రాష్ట్రం తగలబడుతుంది. 

- సోమిరెడ్డి, నల్గొండ జిల్లా టీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు 

జగన్... ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మీ కఠోర దీక్షకు సర్కారు దిగిరాక తప్పదు. ప్రభుత్వం దిగొచ్చి విద్యార్థులను ఆదుకోవాలి.
- వైఎస్సార్ క్లాస్‌మేట్ మోహన్‌రెడ్డి
 

జగన్‌తో సీఎం చర్చలు జరపాలి
 
ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్ నిధుల కోసం దీక్ష చేస్తున్న యువనేత జగన్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, కొండా మురళి, పుల్లా పద్మావతి డిమాండ్ చేశారు. మండలి మీడియాపాయింట్ వద్ద సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. రీయింబర్స్‌మెంటు అమలులో ప్రభుత్వం విఫలమైం దని, అస్పష్ట విధానాలతో 25ల క్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. వారికి న్యాయం చేయాలని జగన్ దీక్ష చేపట్టి నాలుగు రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆయన వద్దకు సీఎం వెంటనే వెళ్లి చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆ సమస్యలపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు కాలయాపనకే తప్ప సమస్య పరిష్కారానికి కాదని విమర్శించారు. ఆ సబ్‌కమిటీ చర్చలకు వెళితే లాభమేమీ ఉండదని వ్యాఖ్యానించారు.

వైఎస్ ఆశయాలకు సర్కారు తూట్లు: జూపూడి


రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి సమావేశం ప్రారంభమవగానే రీయింబర్స్‌మెంట్‌పై వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలనే ఉద్దేశంతో వైఎస్ ప్రవేశపెట్టిన ఈ పథకానికి ప్రభుత్వం నిధులివ్వకుండా నీరుగారుస్తోందని దుయ్యబట్టారు. నిజంగా వైఎస్ వారసులమని మీరనుకుంటే.. జగన్‌తో చర్చించాలని, ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని జూపూడి డిమాండ్ చేశారు. అయితే రీయింబర్స్‌మెంట్‌పై మధ్యాహ్నం లఘు చర్చలో చర్చిద్దామని చైర్మన్ చక్రపాణి పేర్కొంటూ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.

దీక్ష ముగిసేలోగా బకాయిలు చెల్లించండి

ప్రభుత్వానికి వైఎస్సార్ లీగల్ సెల్ డిమాండ్
ఈతరం నేత జగన్: అంబటి
చాణక్యుడు, చంద్రగుప్తుడితో జగన్ సమానం: గట్టు
నవసమాజం జగన్‌తోనే సాధ్యం: కేకే మహేందర్‌రెడ్డి

  యువనేత జగన్ చేపట్టిన ‘ఫీజు పోరు’ దీక్ష ముగిసేలోగా ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని వైఎస్సార్ లీగల్‌సెల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారమిక్కడ హైకోర్టు న్యాయవాది ఎస్.రాజేశ్వరరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జగన్ వర్గం నేతలు అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, కేకే.మహేందర్ రెడ్డి, వద్దిరెడ్డి చలమారెడ్డి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. యువనేత పార్టీ రాక ముందే న్యాయవాదులు భారీస్థాయిలో మద్దతు తెలపడం శుభపరిణామమన్నారు. న్యాయవాదులందరూ ఒక సంఘటిత శక్తిగా ఏర్పడి యువనేతకు మద్దతుగా నిలవాలని కోరారు. వైఎస్సార్ ఆ తరం నాయకుడయితే, జగన్ ఈతరం నాయకుడన్నారు. ‘జగన్‌కు పదవీకాంక్ష ఉందని చంద్రబాబు విమర్శించడం విడ్డూరంగా ఉంది.

పదవి రాకపోవడం వల్లే జగన్ అధిష్టానంతో ఢీకొడుతున్నారని పేర్కొనడం పూర్తి అవాస్తవం. అదే గనక నిజమైతే 150కి పైగా ఎమ్మెల్యేలు మద్దతు తెలిపిన ప్పుడే వైశ్రాయ్ సంఘటన పునరావృతమయ్యేది. సీఎంగా జగన్ ఏడాదికాలం పూర్తిచేసేవారు. రాష్ట్రంలో మోసపూరిత దొంగ దీక్షలు చేసిన చంద్రబాబు ఒక వైపు.. నీతి నిజాయితీకి మారుపేరుగా ఇచ్చిన మాటకు కట్టుబడే నేత వైఎస్ జగన్ మరో వైపు ఉన్నారు’ అని అంబటి తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా ఒంటిచేతితో 150కి పైగా సీట్లు సాధించగలరని, ఏడాది తర్వాత అయితే 170, రెండేళ్లు ఆగితే 200 సీట్లు గెలవగలరని ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రస్తుత ప్రభుత్వంలోని కొందరు మంత్రులు వైఎస్ పథకాలు గుదిబండలా మారాయంటున్నారు. సీఎం కిరణ్, మంత్రి బొత్స మాత్రం వైఎస్ పథకాలను కొనసాగిస్తామంటూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు’ అని విమర్శిం చారు. జగన్ చాణిక్యుడు, చంద్రగుప్తుడితో సమాన మని గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. సమసమాజం, నవసమాజం కోసం వైఎస్ కలలు కనేవారని.. ప్రస్తుతం వాటిని నెరవేర్చడం ఒక్క జగన్ వల్లే సాధ్యమవుతుందని కేకే.మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని రకాల సెల్స్ ఏకమై వైఎస్సార్ అనే కులంగా ఏర్పడాలని మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ పిలుపునిచ్చారు.


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం

YSR-SMILEదివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశే ఖరరెడ్డి తనయుడు, కడప మాజీ ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సొంత పార్టీ స్థాపన ప్రక్రియ ఊపందుకుంది. ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీ పేరు నమోదు వ్యవ హారాన్ని జగన్‌ వర్గీయులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. సోమవారం డిల్లీకి వెళ్లిన వైఎస్‌ బంధువు వైవి సుబ్బారెడ్డి, తొలుత వైఎస్‌ఆర్‌ పార్టీని నమోదు చేసిన కొలిశెట్టి శివకుమార్‌ ఎన్నికల సంఘాన్ని కలిశారు. గత వారమే దరఖాస్తు సమర్పిం చిన వీరు, సోమవారం తమ పార్టీ కమిటీ జాబితాను కూడా సమర్పించారు.

వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జాతీయ అధ్యక్షు డిగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ (వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌) ఏర్పాటయింది. మొత్తం ఏడుగురు కమిటీ సభ్యులుగా ఈ పార్టీని ఏర్పాటుచేశారు. ఉపాధ్యక్షుడిగా కొలిశెట్టి శివకుమార్‌ ఎన్నికయ్యారు. ఈ పార్టీని తొలుత ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసింది శివకుమారే కావడం గమనా ర్హం. ప్రధాన కార్యదర్శిగా బాజిరెడ్డి గోవర్దన్‌, కోశాధికారిగా ఆర్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి, సహా య కార్యదర్శిగా రహ్మాన్‌, కార్యనిర్వ హక కార్యదర్శిగా పుల్లా భాస్కర్‌, ప్రచార కార్యదర్శిగా జంగా కృష్ణమూర్తి, మహిళా విభాగం కార్యదర్శిగా కొల్లి నిర్మలాకుమారి ఎంపి కయ్యారు.

వీరిలో కిరణ్‌కుమార్‌రెడ్డి గతం లోవైఎస్‌ ఉండగా పీఎస్‌ హోదాలో ఆరోగ్య శ్రీ విభాగాన్ని పర్యవేక్షించేవారు. ఈ జాబితా ను ఎన్నికల సంఘానికి సమర్పించిన నేప థ్యంలో దానికి సంబంధించిన అనుమతి వ్యవహారాలు రెండువారాల్లో వస్తాయని ఆశిస్తున్నారు. ఇదిలాఉండగా.. ఉగాది రోజున వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఇడుపుల పాయలో ప్రకటించనున్నట్లు సమాచారం. నిజానికి మూడు, నాలుగు తేదీలు అనుకు న్నప్పటికీ ఏప్రిల్‌ 4న ఉగాది పర్వదినం ఉన్నందున అదేరోజు పార్టీ ప్రకటన అధికా రికంగా చేయవచ్చంటున్నారు.ఈలోగా.. జిల్లా పర్యటనలు నిర్వహించి, జిల్లా కమి టీలు ఎంపిక చేసుకునే పనిలో జగన్‌ వర్గీ యులు బిజీగా ఉన్నారు. జగన్‌ పార్టీకి చెం దిన సీనియర్‌ నేత గట్టు రామచంద్రరావు ఇప్పటికే జిల్లా పర్యటనలు చేస్తూ ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీలోకి తీసుకువచ్చే పనిలో ఉన్నారు. జిల్లా కమిటీ నాయకుల పేర్లను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. పార్టీ ప్రకటించిన తర్వాత ఆ జాబితాను విడుదల చేయనున్నట్లు సమా చారం.

కాబోయే సీఎం జగన్‌
KOLISETTరాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాబోయే ముఖ్యమంత్రి జగ న్‌ అని వైస్సార్‌ కాంగ్రెస్‌ను నమోదు చేసి, ఇప్పుడు అదే పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్న కొలిశెట్టి శివకుమార్‌ స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి రావటం ఖాయమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సత్తా చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు అంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను అధికారికంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి తమిళనాడు, బీహార్‌కంటే అధ్వానంగా మారబోతోందని జోస్యం చెప్పారు. తమ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, అందుకు తాము ఎన్నికల సంఘానికి ఇచ్చిన కమిటీనే నిదర్శనమని శివకుమార్‌ వ్యాఖ్యానించారు.

Monday, February 21, 2011

విద్యార్థులతో పోటెత్తిన వరలక్ష్మి దీక్షా ప్రాంగణం ... బడుగుల కోసం... * మూడో రోజూ అదే జోరు .... ముమ్మరమైన ‘ఫీజు పోరు’

సంఘీభావంగా ఓయూ, నాగార్జున, ఆంధ్రా, కాకతీయ, జేఎన్‌టీయూ విద్యార్థుల నిరాహార దీక్ష
విద్యార్థులతో పాటే కదిలివచ్చిన తల్లిదండ్రులు.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్
నీరసించినా వేదికపై కూర్చునే దీక్ష..అభిమానులను నిరుత్సాహపరచకుండా కరచాలనం...
మూడో రోజు విద్యార్థులతో పోటెత్తిన వరలక్ష్మి దీక్షా ప్రాంగణం


‘తినడానికి తిండిలేక.. నకనకలాడే కడుపులో కాసిన్ని నీళ్లు పోసి రోజు గడిపేసేవాళ్లున్నారు.. తినడానికి అన్నీ ఉండి కూడా జబ్బులతో తినలేనివాళ్లున్నారు.. దేవుడి కోసం రోజంతా ఉపవాసంచేసే వాళ్లూ ఉన్నారు. కానీ జగన్ పేదోడి చదువు కోసం కడుపు కాల్చుకుంటున్నాడు.. ఫీజుల పథకానికి చిల్లులెడుతున్న సర్కారు మాత్రం కడుపులో చల్ల కదలకుండా కూచుంది’.. ఇదీ ఆదివారం ‘ఫీజు పోరు’కొచ్చిన ఓ విద్యార్థి గుండె ఘోష. ఇతడిలాగే.. తమ కోసం నిరాహార దీక్ష చేస్తున్న యువనేతను చూడ్డానికి వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వేల మంది విద్యార్థులతో ఆదివారం ‘వరలక్ష్మి దీక్షా ప్రాంగణం’ కిక్కిరిసిపోయింది.

చీమలదండులా


మూడో రోజులో అడుగుపెట్టిన ఫీజు పోరుకు ఆదివారం జనం పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులతో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ ఓ మహా సంద్రాన్ని తలపించింది. ప్రత్యేకించి హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు చీమల దండులా కదలి వచ్చారు. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రభంజనంలా తరలివచ్చారు. యువనేతను చూసేందుకు భారీగా వచ్చిన రైతన్నల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నల్గొండ, మెదక్, ఖమ్మం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు చెందినవారు ఎక్కువ మంది ఉన్నారు. వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షా శిబిరంలో కూర్చొన్నారు. పేదల సంక్షేమానికై జగన్ చేస్తోన్న దీక్షలు విజయవంతం కావాలని, సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడు కలుగజేయాలని ఆశీర్వదించారు. వీరితోపాటు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు దీక్షా ప్రాంగణానికి వచ్చి యువనేతకు మద్దతు ప్రకటించారు.
మూడో రోజూ అదే జోరు .... ముమ్మరమైన ‘ఫీజు పోరు’
 
వెల్లువలా తరలివచ్చిన విద్యార్థులు
దీక్షా శిబిరానికి మహిళల నీరాజనం
యువనేత ఆరోగ్యంపై అంతటా ఆందోళన


అన్ని మార్గాలూ అక్కడికే ‘దారి’తీస్తున్నాయి. ఆదివారమూ ఆటవిడుపు లేదు. అందరిలోనూ యువనేతను సందర్శించాలన్న ఆరాటం. విద్యార్థి లోకానికి బాసటగా నిలిచిన దీక్షాదక్షునికి అండగా నిలవాలనే ఆశయం.. మూడోరోజున ధర్నా చౌక్‌లోని ‘వరలక్ష్మి ప్రాంగణం’ జనసంద్రమైంది. అందరిదీ ఒకటే లక్ష్యం. యువనేత జగనన్నను కలిసి మద్దతు ప్రకటించడమే ధ్యేయం.

ఫీజు పోరులో మూడోరోజూ అదే జోరు. ఆదివారం ఆంధ్రా, నాగార్జున, వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల నుంచి వందలాది విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారిలో కొందరు జగన్‌కు సంఘీభావం ప్రకటించి దీక్షలో కూర్చున్నారు. చంకన చంటిపిల్లాడిని వేసుకొని వచ్చిన మహిళలు, ఊతకర్ర సాయంతో ఉత్సాహంగా వచ్చిన వృద్ధులు... దీక్షార్ధి అయిన యువనేతలో తమ తమ్ముడిని, అన్నను, తనయుడిని చూసుకొని కంటతడి పెట్టారు. మూడు రోజులుగా ఆహార పానీయాల్లేక శుష్కించిన యువకిశోరంపై వాత్సల్యాన్ని కురిపించారు. మొండివైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం వెంటనే దిగిరావాలంటూ పెద్దపెట్టున నినదించారు.

దీక్షలో పాల్గొన్న లక్ష్మీపార్వతి, జూపూడి ప్రభాకర్, నల్గొండకు చెందిన సిరాజుద్దీన్ చేసిన ప్రసంగాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ దమననీతిని ఎండగట్టినప్పుడల్లా వారు కరతాళధ్వనులతో తమ మద్దతు ప్రకటించారు. ఇదీ దీక్షా శిబిరం వద్ద ఆదివారం ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు కన్పించిన తిరునాళ్ల వాతావరణం. ప్లకార్డులు పట్టుకొని, డప్పు నృత్యాలతో బృందాలు బృందాలుగా ప్రజా శ్రేణులు తరలివచ్చి యువనేతకు సంఘీభావం తెలిపారు.

నీరసం కమ్ముకొస్తున్నా....
ఏకబిగిన 72 గంటలుగా దీక్షలో ఉన్న జగన్ ఆదివారం కాసింత నీరసంగా కన్పించడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఓ వైపు నీరసం కమ్ముకొస్తున్నా.... నిజమైన నాయకుడిగా తనను చూసేందుకు వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించేందుకు జగన్ ప్రయత్నించారు. క్యూలైన్‌లో పరామర్శించే వీలులేనంత సంఖ్యలో ప్రజలు రావడంతో జగన్ తానే లేచి నిలబడి పలుసార్లు ప్రజలందరికీ అభివాదం చేశారు. ఈ సమయంలో ప్రజల నుంచి జయ జయ ధ్వానాలు మిన్నుముట్టాయి. సుదూరం నుంచి వచ్చిన మహిళా అభిమానులకు మాత్రం ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దీక్షా శిబిరం వేదిక వద్దకు వెళ్లేందుకు అవకాశం క ల్పించారు. అయితే... యువనేత ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ఎటువంటి వాకబు చేయకపోవడంపై మహిళలు, విద్యార్థుల నుంచి తీవ్ర ఆగ్ర హం వ్యక్తమైంది.

నీరసించినా.. వేదికపై కూర్చునే..

శుక్రవారం ప్రారంభించిన నిరాహార దీక్ష ఆదివారం మూడో రోజుకు చేరింది. ఆదివారం జగన్ కాస్తంత నీరసంగా కనిపించారు. అయినా రోజంతా ఆయన దీక్షా వేదిక మీద కూర్చునే ఉన్నారు. అప్పుడప్పుడు లేచి నిలబడి విద్యార్థులకు అభివాదం చేశారు. సాయంత్రానికి లేచి నిలబడటానికి కాస్తంత ఇబ్బంది పడ్డారు.

చేయి కలపాలని...


యువనేత జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో దీక్షా స్థలికి వచ్చారు. యువనేతను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అప్పటికే.. జగన్‌ను చూడటానికి జనం బారులు తీరారు. ఉదయం 6 గంటలు మొదలు.. అర్ధరాత్రి వరకు జన ప్రవాహం సాగుతూనే ఉంది. విద్యార్థులు, యువకులు జగన్‌తో చేయి కలపాలని పరితపించారు. కొందరితో కరచాలనం చేయగలిగిన యువనేత.. మిగతా వారికి అభివాదం చేశారు.


వైఎస్ వస్తాడని..


‘మా ఊరి రచ్చబండ చూస్తోంది.. వైఎస్ వస్తాడని, ఓసారి రారాదయ్యో.. ఓ సారూ మము చూసి పోరాదయ్యో..’ అంటూ కొండా మురళి ఆధ్వర్యంలోని కొండా దళం(కళాకారుల బృందం) పాడిన పాట ఆదివారం హైలైట్‌గా నిలిచింది. కళాకారుల ఆలాపనతో దీక్షాశిబిరంలో కూర్చొన్న వారికి దివంగత వైఎస్సార్ తమ కళ్లముందు సాక్షాత్కారమైనట్లైంది. బిక్కవోలు సోమిరెడ్డి కళాబృందం, నల్లగొండ కళాబృందాల ప్రదర్శనలు విద్యార్థులు అవస్థలను ఎలుగెత్తి చూపాయి.


యువనేతకు తోడుగా విద్యార్థుల దీక్ష


జగన్ దీక్షకు సంఘీభావంగా ఉస్మానియా, ఆంధ్ర, నాగార్జున, కాకతీయ, జేఎన్‌టీయూ వర్సిటీలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థులు ఆదివారం అదే వేదికపై నిరాహార దీక్ష చేశారు. ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభించిన విద్యార్థులు.. సాయంత్రం 6 గంటలకు ముగించారు. ఈ దీక్షలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన శ్యాం సుందర్, రాజేశ్, అంజిరెడ్డి, నరేంద్రాచారి, సయ్యద్ ఆలీ, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన స్వర్ణకుమార్, సీవీ రత్నం, ఆంజనేయరెడ్డి, నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన నాగిరెడ్డి, రమేష్, సీహెచ్ మురళీకృష్ణ, రఫి, జేఎన్‌టీయూకి చెందిన తోట వేణు, ఎస్వీ యూనివర్సిటీకి చెందిన మహేశ్, ఎస్కే విశ్వవిద్యాలయానికి చెందిన జే లింగారెడ్డి, ఇమాం, కాకతీయ వర్సిటీకి చెందిన రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ప్రజాప్రతినిధుల మద్దతు


ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, బాలరాజు, ప్రసాదరాజు, మేకతోటి సుచరిత, శ్రీనివాసులు, శోభానాగిరెడ్డి, గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు జూపూడి, కొండా మురళి, పుల్లా పద్మావతితోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ యూత్ ఫోర్స్, మైనార్టీ యువజన, విద్యార్థి సంఘం, ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్, లంబాడా హక్కుల పోరాట సమితి, తెలంగాణ రాష్ట్ర రజక సంఘం, తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు దీక్షా ప్రాంగణానికి వచ్చి యువనేతకు మద్దతు ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సోదరుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి కుటుంబ సమేతంగా వచ్చారు. నాగర్ కర్నూలు నుంచి వల ్లపల్లి శ్రీనివాసులు, శేరిలింగంపల్లి నుంచి ముక్కా రూపానందరెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి వర్లపు రాము, ఎల్బీనగర్ నుంచి పుత్తా ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా యువకులు, విద్యార్థులు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు.
ప్రజా సమస్యలే జగన్ జీవితం
ఉద్వేగంగా ప్రసంగించిన లక్ష్మీపార్వతి
‘ప్రజా సమస్యలపై ఉద్యమించడానికి మహాతల్లి విజయలక్ష్మమ్మ అద్భుతమైన బిడ్డను సమాజం కోసం బయటకు పంపింది. ఎన్నో సుఖాలు అనుభవించే అవకాశమున్నా ప్రజల సమస్యలనే జగన్ జీవితంగా మార్చుకున్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరచి పేదల పిల్లలు కూడా ఉన్నతచదువులు పొందే అవకాశం కలిగించిన వైఎస్సార్ కుటుంబానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి’ అని ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ నిధుల కోసం యువనేత వైఎస్ జగన్ చేపట్టిన ‘ఫీజు పోరు’ దీక్షలో మూడోరోజైన ఆదివారం ఆమె పాల్గొని ప్రసంగించారు. సమాజం తయారు చేసుకుంటున్న ఏకైక నాయకుడు జగన్ అని, ఇలాంటి నాయకుడిని గతంలో ఎప్పుడైనా చూశామా అని అన్నారు. ప్రస్తుతం రాష్ర్ట ప్రజలకు కావాల్సింది అవినీతికి అంకితమైన నేతలు కాదని, నెత్తురు మండే శక్తితో ఉన్న అగ్నిపర్వతం లాంటి నాయకులని వ్యాఖ్యానించారు. 
ఆత్మవిమర్శ చేసుకోవాలి
జగన్ దీక్షను విమర్శించేవారిపై కొండాసురేఖ ధ్వజం

‘‘వైఎస్ చనిపోయిన ఏడాదిన్నర తర్వాత కూడా రాష్ట్రంలో ఆయనలేని లోటు స్పష్టంగా కనపడుతోంది. పేద విద్యార్థుల ఫీజు కోసం నడిరోడ్డు మీద ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఫీజులు కడతామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేని వారు... జగన్ దీక్షను విమర్శించే ముందు గుండెలపై చేయి వేసుకుని ఆత్మ విమర్శ చేసుకోవాలి’’ అని మాజీ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ‘ఫీజుపోరు’ దీక్షాస్థలి వద్ద ఆదివారం విద్యార్థులు సురేఖ మాట్లాడాలని గొడవ చేయడంతో వారినుద్దేశించి ఆమె ప్రసంగించారు. సంక్షేమపథకాలను అమలుచేసే సత్తా లేకపోతే తప్పయిందని ఒప్పుకోవాలే కానీ వైఎస్‌ను అభాసుపాలు చేయాలని ప్రయత్నిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. జగన్ మాత్రమే వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలరని చెప్పారు. భూమి, ఆకాశం ఉన్నంతకాలం వైఎస్ రాష్ట్ర ప్రజల హృదయాల్లోనే ఉంటారన్నారు. ఈజిప్టు తరహాల్లో ప్రభుత్వాన్ని పడవేసే అవకాశం ప్రజలు తీసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు.

ఒక ప్రాంతీయ పార్టీకి మోకరిల్లారు

జగన్ ఓదార్పుయాత్రకు అనుమతి ఇవ్వకుండా కాంగ్రెస్ హైకమాండ్ ఒక తప్పు చేసిందని, దానిని కప్పిపుచ్చుకునేందుకు తప్పుమీద తప్పులు చేసి చివరకు ఒక ప్రాంతీయ పార్టీ ముందు మోకరిల్లాల్సిన దుస్థితి తెచ్చుకుందని సురేఖ ఎద్దేవా చేశారు. విలీనం వార్తల తర్వా త అసెంబ్లీలో చిరంజీవికి షేక్‌హ్యాండ్ ఇచ్చేవారు కూడా కరువయ్యారని చెప్పారు. జగన్ దీక్షకు జనం రావడంలేదని వార్తలు ప్రసారం చేస్తున్న కొన్ని చానళ్లపై సురేఖ మండిపడ్డారు. గుంటనక్కల్లా చాటుమాటుగా తిరుగుతూ రికార్డు చేసుకుంటారని విమర్శించారు. అయినా వారు చూపించింది నమ్మడానికి ప్రజలు అంత అమాయకులు కాదని ఆమె చెప్పారు.  
జగన్‌కు అండగా నిలవాలి.... బీసీలకు నారగోని పిలుపు
 
 బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం బలమైన ఆశయంతో దీక్ష చేపట్టిన జగన్‌కు భవిష్యత్తులో వెనుకబడిన వర్గాలు అండగా నిలవాలని బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వి.జి.ఆర్ నారగోని పిలుపునిచ్చారు. ఆయన శనివారం ‘ఫీజు పోరు’ దీక్షాస్థలికి విచ్చేసి యువనేత జగన్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగబోతోంది. కాంగ్రెస్‌ను గద్దె దించాలని, టీడీపీని ఓడించాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. మాట మీద నిలబడే వ్యక్తి కోసం రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తోంది. జగన్ పెట్టబోయే రాజకీయ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి వాగ్దానాలను నిలబెట్టుకోలేని పార్టీలకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు బుద్ధి చెప్పాలి’’ అని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్నారు. 
మీరు చేతులెత్తేస్తే.. మేం చూసుకుంటాం ...  ఫీజులపై సర్కారుకు జూపూడి ప్రభాకర్ సవాల్
 
అధికారం కోసం అర్రులు చాచిన ప్రభుత్వ పెద్దలు, వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలను కాదని కాడి పడేసిన నాయకులు ఆ మహానేతకు నిజమైన వారసులెలా అవుతారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ప్రశ్నించారు. విద్యార్థులను ఉద్దేశించి ఫీజు పోరు వేదిక నుంచి ఆదివారం ఆయన మాట్లాడారు. వారసుడిగా రక్తమాంసాలే కాదు... ఆయన ఆశయాలనూ భుజానికెత్తుకున్న నిజమైన వారసుడు జగనేనని, కళ్లుంటే చూడాలని అన్నారు. హాస్టళ్లు, కార్పొరేషన్లు ఆస్తులను తాకట్టు పెట్టడానికి ఎవరబ్బ సొమ్మని నిలదీశారు. ఫీజులు చెల్లించలేమని చేతులెత్తేస్తే చెప్పాలని, తాము చూసుకుంటామని ప్రకటించారు. జగన్ దీక్ష చేయడానికి ఒక్క రోజే అనుమతి ఇచ్చామని ప్రభుత్వం చెబుతోందని, ప్రభుత్వానికి ధైర్యం ఉంటే జగన్‌ను ఢీకొని చూడాలని సవాలు విసిరారు. ప్రజల కోసం పోరుబాట పట్టిన జగన్‌ను ఒక్క గంట అరెస్ట్ చేస్తే... రాష్ట్రం అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు.  
 
మేమంతా నీవెంటే జగనన్న..
బీకాం విద్యార్థిని ప్రశాంతి వ్యాఖ్య
విద్యార్థి లోకం యువనేతకు అండగా ఉండాలని వినతి


 తమ సమస్యల కోసం ఆందోళన చేస్తున్న యువనేత జగన్‌కు విద్యార్థి లోకం అండగా నిలవాలని బీకాం విద్యార్థిని ప్రశాంతి కోరింది. ఆదివారం ఫీజుపోరు దీక్షాశిబిరానికి తన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఆమె జగన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ‘వైఎస్సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలాంటి పేద విద్యార్థులు ఎంతో లబ్ధి పొందారు. ఆయన చనిపోయిన తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో నేనేమి పొందానంటే.. ఏమీ లేదు. అసలు ఈ ప్రభుత్వం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ ప్రభుత్వమే బాగుంటే ఫీజుపోరుకు నేను వచ్చే అవకాశమే ఉండేది కాదు. అందుకే మన సమస్యల పరిష్కారానికి విద్యార్థులంతా జగన్‌కు అండగా నిలవాలి’ అంటూ ఉద్వేగంగా మాట్లాడింది. జగన్‌కు అండగా నిలబడతామని ఇక్కడే మాట ఇవ్వాలని అంటూ.. ‘జగన్‌కు అండగా ఉంటారా లేదా’ అని ప్రశాంతి ప్రశ్నించడంతో అక్కడ ఉన్న విద్యార్థులంతా ‘జై జగన్’ అని నినదించారు. జగనన్న ఒంటరికాదని, తామంతా ఆయనకు అండగా ఉన్నామని ప్రశాంతి చెప్పింది.

తాను ఇళ్లల్లో పనిచేసుకుని స్కూలు చదువుల వరకు చదువుకున్నానని, తర్వాత వైఎస్ దయ వల్ల ఇంటర్ పూర్తి చేసుకుని.. ఇప్పుడు డిగ్రీ చ దువుకుంటున్నానని ఆమె చెప్పింది. అయితే, జగన్‌ను కలవాలన్న ఆశతో ఎంతోమంది తనలాంటి విద్యార్థులు ఇక్కడకొస్తున్నారని, ఆయనను కలిసే క్రమంలో విద్యార్థులను పోలీసులు ఇబ్బందులు పెట్టవద్దని కోరింది. ‘నేను ఈ వేదిక మీదకు వచ్చేందుకు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. పోలీసులను నేను విమర్శించడం లేదు. కానీ మా జగనన్నను కలిసేందుకు విద్యార్థులకు సహకరించండి’ అని ఆమె చెప్పడంతో ధర్నాచౌక్ కరతాళ ధ్వనులతో మార్మోగింది. ఎస్‌కేయూ విద్యార్థి ఇమాం, అనంతపురం జిల్లా విద్యార్థి నేత సోమశేఖరరెడ్డి, ఓయూ విద్యార్థులు అంజిరెడ్డి, నరేంద్రాచారి, శ్యాంసుందర్‌లు మాట్లాడారు.

బీహార్ విద్యార్థుల మద్దతు

యువనేత జగన్ ఫీజు పోరుకు బీహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు మద్దతు ప్రకటించారు. ఆదివారం కొందరు విద్యార్థులు దీక్షా శిబిరానికి వచ్చి జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బీహార్ విద్యార్థి ఇర్షాద్ మాట్లాడుతూ జగన్ లాంటి నాయకుడిని తాను ఇప్పటివరకు చూడలేదన్నారు.
జగన్‌కు వైద్య పరీక్షలు

మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న యువనేత జగన్‌కు ఆదివారం సాయంత్రం వైద్యపరీక్షలు నిర్వహించారు. శనివారం వైద్య పరీక్షలు చేసేందుకు డాక్టర్లు రాగా జగన్ తిరస్కరించారు. ఆదివారం గాంధీనగర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ వేదిక మీదకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని యువనేతను కోరారు. ఆయన సమ్మతించడంతో గాంధీ ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించింది. బీపీ, షుగర్ స్థాయి సాధారణంగానే ఉందని వైద్యులు నిర్ధారించారు.

Sunday, February 20, 2011

రెండోరోజూ హోరెత్తిన ఫీజు పోరు * '' జై జగన్ '' నినాదాలతో మార్మోగిన ధర్నాచౌక్


రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన నేతలు
జగన్ దీక్షకు అందరూ మద్దతివ్వాలి: ఎమ్మెల్యే సీకే బాబు
ఫీజులివ్వకపోతే మట్టిగొట్టుకుపోతారు: ఆర్.కృష్ణయ్య



యువనేతకు మద్దతుగా వెల్లువలా తరలి వచ్చిన విద్యార్థిలోకంజైజగన్ నినాదాలతో హోరెత్తిన ధర్నాచౌక్
ఫీజు పోరుకు మరో ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు
సంఘీభావంగా రోజంతా న్యాయవాదుల నిరాహార దీక్ష
రాష్ట్రం నలుమూలల నుంచీ తరలివచ్చిన నేతలు, ప్రజలు
వైద్య పరీక్షలను సున్నితంగా తిరస్కరించిన జగన్



బాధ పెరిగితే ఆవేదనవుతుంది.. అది పెరిగి ఆగ్రహమై.. ఉద్యమమై.. ఉప్పెనై పోటెత్తుతుంది. రాష్ట్రంలో ఇప్పుడదే జరుగుతోంది.. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు చెల్లించని సర్కారుపై విద్యార్థి లోకం కన్నెర్ర చేస్తోంది. తమ తరఫున పోరాడుతూ ‘ఫీజు పోరు’ పేరుతో నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ జగన్‌కు సంఘీభావంగా ఉవ్వెత్తున తరలివస్తోంది. శనివారం యువనేత నిరాహారదీక్ష రెండో రోజుకు చేరగా.. ఆయనకు మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చిన విద్యార్థులు, డాక్టర్లు, లాయర్లు, యువ నాయకులు, పారిశ్రామికవేత్తలతో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ దద్దరిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన 50 మంది న్యాయవాదులు జగన్‌కు మద్దతుగా శనివారమంతా దీక్షలో పాల్గొన్నారు.


ఐదు గంటలకే మొదలు
సంఘీభావంగా రోజంతా న్యాయవాదుల నిరాహార దీక్ష




మొదటి రోజు శుక్రవారం ఫీజు పోరుకు నిరంతరాయంగా తరలివచ్చిన విద్యార్థులు, అభిమానులను కలిసిన జగన్ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు నిద్రకు ఉపక్రమించి శనివారం ఉదయం ఐదు గంటలకే మేల్కొన్నారు. దినపత్రికలను చదివిన తర్వాత ఏడు గంటల సమయంలో దీక్షావేదికపైకి చేరుకున్నారు. పదిగంటల వరకు నిరాటంకంగా తనను కలిసేందుకు వచ్చిన వారిని పలుకరించారు. ఇం దిరాపార్క్‌కు వచ్చే వాకర్స్ జగన్‌తో చేయి కలపాలని ఆత్రుత కనబరిచారు. అంతకుముందు జగన్ మాతృమూర్తి వైఎస్ విజయలక్ష్మమ్మ, సతీమణి వైఎస్ భారతి యువనేతను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా విజయమ్మ ప్రజలకు అభివాదం చేయడంతో వైఎస్సార్ అమర్హ్రే, జగన్ జిందాబాద్ అన్న నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది.
సర్కారుపై బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ధ్వజం
రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించం
పద్ధతి మార్చుకోకుంటే... రోశయ్యకు పట్టిన గతే కిరణ్‌కూ..
ఇప్పుడు ఫీజులు లేవంటారు... తర్వాత రేషన్‌బియ్యం, పింఛన్లకూ మొండిచేయి
                                                మట్టిగొట్టుకుపోతారు...




  ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిన ముఖ్యమంత్రులు మట్టిగొట్టుకుపోతారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ‘ఫీజు పోరు’ దీక్షా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి యువనేత జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కృష్ణయ్య మాట్లాడారు. రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ముట్టుకొన్న రోశయ్యకు పట్టిన గతే.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికీ పడుతుందని జోస్యం చెప్పారు. గుడిసెలో పుట్టిన వారు కూడా ఇంజనీరింగ్, డాక్టర్ కోర్సులు చదవాలనే లక్ష్యంతో వైఎస్ రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారని, ఆయన ఉన్నంతకాలం నిధులకు ఎలాంటి కొరత రాలేదని అన్నారు. ధైర్య సాహసాలతో ముందుకొచ్చి విద్యార్థుల కోసం జగన్ చేస్తున్న పోరాటానికి విద్యార్థిలోకం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో ఆయన చేసే పోరాటాలకు వెన్నంటి ఉంటామని ప్రకటించారు.
సీఎం పదవి జాక్‌పాట్..: కాంగ్రెస్‌లో సీఎం పదవి జాక్‌పాట్‌గా మారిందని కృష్ణయ్య వ్యాఖ్యానించారు. కష్టపడినవారు, ప్రజల కష్టాలు తెలిసిన వారు ముఖ్యమంత్రిగా రావాలని ఆకాంక్షించారు. వైఎస్‌కు ప్రజల కష్టాలు తెలుసని, అందుకే పావలావడ్డీ, రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ.. ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు 100 మంది ఎమ్మెల్యేలే మిగిలారని, వారంతా సీఎం పదవి కోసమే ఎదురుచూస్తున్నారన్నారు. మంత్రులు, సీఎం.. ఢిల్లీకి తిరి గి తిరిగి విమానయాన సంస్థల ఆదాయం పెంచడం మినహా సాధించింది ఏమీలేదని ఎద్దేవా చేశారు.


రచ్చబండకు నిధులెక్కడివి?: ముఖ్యమంత్రి ముఖం, పేరు ప్రజలకు తెలియదని.. అందుకే పోస్టర్లు, ఫ్లెక్సీల కోసం రచ్చబండలో రూ. 2,800 కోట్లు ఖర్చు చేశారని కృష్ణయ్య ఆరోపించారు. బడ్జెట్‌లో లేని రచ్చబండకు నిధులు ఇచ్చిన ప్రభుత్వం.. పేద, బడుగు విద్యార్థుల ఫీజులకు నిధులు లేవని చెప్పడానికి సిగ్గుండాలని నిలదీశారు. ఫీజులివ్వడం చేతగాని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత ఏమాత్రం లేదన్నారు. ఇప్పుడు ఫీజులకు నిధుల్లేవంటారని, తర్వాత రేషన్ బియ్యం, పింఛన్లు కూడా లేవంటారని, ఉచిత విద్యుత్ ఇవ్వడం చేతకాదంటారని అనుమానం వ్యక్తంచేశారు. ప్రజల పన్నులు దోచుకొని తినడం తప్ప ఇప్పటి మంత్రులకు మరే మీ తెలియదని ఎద్దేవా చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను కాపాడుకోవడానికి ప్రజలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బడ్జెట్ లేదంటూ కాక మ్మ కథలు చెప్పకుండా.. తక్షణం నిధులు విడుదల చేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వ రాబడి 30-35% పెరిగిందని, అయినా నిధులు లేవని చెప్పడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పేరు కు రూ. 1000 కోట్లు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోం దని, నిజానికి ఇచ్చింది రూ. 150 కోట్లేనని చెప్పారు.


మెస్‌చార్జీల పెంపు ఎప్పుడు: మెస్ ఛార్జీలు పెంచడానికి వీలుగా ఫైల్ సర్క్యులేట్ చేయమని వైఎస్ ఆదేశాలు జారీ చేసిన.. కొద్ది రోజుల్లోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మెస్ చార్జీల పెంపు ఆలోచనే సర్కారు చేయలేకపోతోందన్నారు. డిగ్రీ చదివే విద్యార్థికి నెలకు రూ.520 ఇస్తున్నారని, పూటకు రూ. 5.77తో భోజనం పెట్టడం ఎలా సాధ్యమని ప్రశ్నిం చారు. ఖైదీలు, రోగులకు ఇస్తున్న స్థాయిలో కూడా విద్యార్థులకు మెస్ చార్జీలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్ ఉన్నప్పుడు రోజుకొక ఉద్యోగ నియామక ప్రకటన వెలువడేదని, ఇప్పుడు వివిధ శాఖల్లో 4 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అంటే రాజశేఖరరెడ్డి మాదిరి ఆదర్శంగా ఉండాలన్నారు. రోజుకు కనీసం వెయ్యి మందితో ప్రజా దర్బారు నిర్వహించేవారని, ప్రతి వినతిపత్రం చదివేవారని గుర్తు చేశారు. వైఎస్‌ను చూసే కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారని, కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలను తుంగలో తొక్కిన ప్రస్తుత సర్కారు కు ప్రజామోదం లేదన్నారు. ప్రజల ఇళ్లలోనే కాదు ప్రజలందరి గుండెల్లో వైఎస్ ఉన్నారని చెప్పారు.


యువనేతతోపాటే నేతలు, అభిమానులు


శుక్రవారం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది అభిమానులు, నేతలు జగన్‌తో పాటు వేదిక వద్దనే నేలపై పడుకున్నారు. జగన్‌తోపాటు నెల్లూరు డీసీసీ మాజీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా జగన్ వర్గం నేతలు కొండా రాఘవరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ వేదికపైనే పడుకున్నారు. శనివారం వేదికపై వైఎస్ చిత్రపటానికి బదులుగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
దీక్షకు అందరూ మద్దతు తెలపాల్సిందే: సీకే బాబు
యువనేతను కలిసి మద్దతు ప్రకటించిన చిత్తూరు ఎమ్మెల్యే
పేద విద్యార్థులకు న్యాయం జరిగేలా వారిలో మానసిక స్థైర్యాన్ని కలిగించేందుకు యువనేత జగన్ చేపట్టిన పోరాటానికి అందరూ మద్దతు తెలపాల్సిందేనని చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు అన్నారు. జగన్ చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపేందుకు ఆయన శనివారం దీక్షా శిబిరానికి వచ్చారు. వేదికపై చాలాసేపు కూర్చున్న ఆయన జగన్‌తో మంతనాలు జరిపారు. అనంతరం దీక్షాస్థలి నుంచి వెళ్లిపోయే సమయంలో మీడియాతో మాట్లాడుతూ విద్యా ర్థి సమస్యలను పరిష్కరించాలనే జగన్ ఈ దీక్ష చేపట్టారని, దీనికి రాజకీయాలకతీతంగా అందరూ మద్దతు పలకాలని అన్నారు. ఈ బాధ్యత నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపైనే కాకుండా అందరిపై ఉందని వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని అన్నారు.


ఏదైనా ఉంటే నేనే చెపుతా: కాంగ్రెస్ నుంచి జగన్ దూరమైన తర్వాత చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు తొలిసారి ఆయనకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. జగన్‌వైపు వెళ్లకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సీఎం కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారట కదా అని సీకే బాబును ప్రశ్నించగా ‘నన్ను నియంత్రించే స్థాయిలో ఎవ రూ లేరు. అయినా ఒకరు నియంత్రిస్తే వినేవాడిని నేను కాదు’ అని వ్యాఖ్యానిం చారు. జగన్ వర్గంలో చేరిపోయారా అని ప్రశ్నించగా తానిప్పుడేమీ మాట్లాడనని, కొంత సమయం ఉందని, ఏదైనా ఉంటే మీడియాను పిలిచి తానే మాట్లాడతానని చెప్పారు. జగన్ గతంలో కూడా అనేక దీక్షలు చేశారు.. ఎప్పుడూ రానిది ఇప్పుడు మద్దతు ఎందుకు తెలపాల్సి వచ్చిందన్న ప్రశ్నకు తాను బయటకు వచ్చే దే తక్కువని, హైదరాబాద్‌కు చాలా తక్కువగా వస్తానని, మీడియాతో ఇంతసేపు మాట్లాడడం తన 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇదే ప్రథమమని సమాధానమిచ్చారు. వైఎస్ చేపట్టిన పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మొదటిరోజే తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేయదల్చుకోలేదన్నారు.
తరలివచ్చిన ప్రజాప్రతినిధులు


జగన్ చేపట్టిన దీక్షకు రెండోరోజు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. కుంజా సత్యవతి(భద్రాచలం), మేకతోటి సుచరిత(పత్తిపాడు), సి.కె.బాబు(చిత్తూరు) దీక్షాస్థలికి వచ్చి యువనేతకు మద్దతు ప్రకటించారు. తొలిరోజే మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, జయసుధ, శోభా నాగిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గుర్నాథరెడ్డి, గొల్ల బాబూరావు, శ్రీనివాసులుతో పాటు ఎమ్మెల్సీలు కొండా మురళి, జూపూడి ప్రభాకర్‌రావు రెండోరోజు కూడా హాజరయ్యారు. ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు జంగా కృష్ణమూర్తి, గోనె ప్రకాశరావు, బాజిరెడ్డి గోవర్దన్, రఘురామిరెడ్డి, రమేష్‌బాబు, మాజీ మంత్రి మారెప్పలతో పాటు నాయకులు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, రెహమాన్, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, సినీ నటి రోజా, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం ఉపాధ్యక్షుడు పిల్లి వెంకటసత్తిరాజు, హైదరాబాద్ నగర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి జయస్వామి, విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల, ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, ఈబీసీ సంఘం అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీంద్రరెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి పి.ప్రభాకర్, మహబూబ్‌నగర్ గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు ఆర్.రవీందర్ రెడ్డి, పీసీసీ ఎస్సీ సెల్ మాజీ కార్యదర్శి రాచమల్ల సిద్ధేశ్వర్, పీసీసీ మాజీ కార్యదర్శి కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, వైఎస్‌ఆర్ జిల్లా బద్వేల్ మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి, కలసపాడు జెడ్పీటీసీ సభ్యుడు దాదన భూపాల్ రెడ్డి, బద్వేల్ యువ నాయకులు లెక్కల విజయ భాస్కర్ రెడ్డి తది తరులు దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు ప్రకటించారు. బీసీ సం క్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వెంట పలువురు బీసీ నేతలు తరలివచ్చారు. కరీంనగర్ జిల్లా నుంచి జగన్ వర్గం నాయకుడు అన్నం శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానులు వచ్చి జగన్‌ను కలిశారు.


జగన్‌తో కలిసి న్యాయవాదుల దీక్ష


శనివారం పలువురు న్యాయవాదులు యువనేతతో పాటు నిరాహార దీక్ష చేశారు. అయితే సాయంత్రం వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు గాయత్రి, లింగయ్య యాదవ్, నాగిరెడ్డి, అనిత, బుచ్చిబాబు, కోటిరెడ్డి, ఆజాద్, సి.నాగేశ్వరరావు, జయరాం నాయక్ తదితరులు మాట్లాడారు. ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం దిగిపోవాల్సిందేనని ముక్తకంఠంతో డిమాండు చేశారు.


పర్యాటకశాఖ ఉద్యోగుల సంఘీభావం


జగన్ దీక్షకు పర్యాటక శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. శనివారం వరలక్ష్మి దీక్షా ప్రాంగణానికి వచ్చిన ఉద్యోగులు జగన్‌ను కలసి సంఘీభావం తెలిపారు. యువనేతను కలిసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి రాజమౌళి, ఉపాధ్యక్షులు శ్రీను, ప్రకాశ్, కోశాధికారి వీరారెడ్డి తదితరులున్నారు.


ఉద్వేగంగా సాగిన వంగపండు ఉష పాటలు


‘‘చీమలన్నీ ఏకమైతే.. పాము ఒకటి ఎంతైతే, సింహాలై గర్జిద్దాం.. ప్రభుత్వాన్ని కూల్చేద్దాం, జమకు జమ.. జనదండు’’ అంటూ ప్రజా గాయకురాలు వంగపండు ఉష ప్రభుత్వ విధానాలపై గర్జించారు. ఫీజుపోరుకు మద్దతునిస్తూ ఉష తన సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రభుత్వం అవలంబిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై పాటల రూపంలో అస్ర్తాలను సంధించారు.


నేను ఆరోగ్యంగానే ఉన్నాను: జగన్


పోలీసుల సూచన మేరకు జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డాక్టర్ రవి నేతృత్వంలో గాంధీ ఆస్పత్రి వైద్య బృందం శనివారం రాత్రి 9.15 గంటలకు దీక్షా శిబిరానికి వచ్చింది. అయితే తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పి జగన్ వైద్య పరీక్షలను సున్నితంగా తిరస్కరించారు. దీంతో రేపు వస్తామంటూ వైద్య బృందం తిరిగి వెళ్లింది.
ఎప్పుడు ఎన్నికలొచ్చినా జగన్ పార్టీకి 222 సీట్లు  ఈ క్షణం ఎన్నికలు వచ్చినా జగన్ పార్టీ 222 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీలకు గుణపాఠం చెప్పి జగన్‌ను సీఎం చేసేందుకు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజానీకం ఎదురుచూస్తోందన్నారు. ఫీజు పోరు దీక్షాశిబిరం వద్ద ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఇటీవలి సర్వేల్లో జగన్ పార్టీకి 154 స్థానాలు వస్తాయని వెల్లడైందని, అయితే 154 కాకుండా 222 సీట్లు రావ డం, జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. వైఎస్ వారసులం తామేనని కాంగ్రెస్ నేత లు చెప్పుకుంటున్నా వైఎస్‌కు అసలైన వారసుడు, కోహినూర్ వజ్రం జగనేనని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. తామే అధికారంలోకి వస్తామని టీడీపీ నేతలు అంటున్నారు కదా అని ప్రశ్నించగా చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తే లేదని నల్లపురెడ్డి కొట్టిపారేశారు. 2004, 09ల్లో ప్రజలు ఆయన్ను నమ్మలేదని, బాబు ఇక ఇంట్లో కూర్చోవాల్సిందే తప్ప సీఎం అయ్యే అవకాశమే లేదన్నారు. ఎవరు ఎన్ని డ్రామాలు వేసినా కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో జగన్, విజయమ్మ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ జగన్ పార్టీకి పోటీయే కాదని, ఆయన దరిదాపుల్లోకి కూడా ఎవరూ రానివిధంగా జయకేతనం ఎగురవేస్తామని చెప్పారు.


దేనికైనా మేం సిద్ధం:  వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదప్రజలకు సంజీవనిలా ఉపయోగపడ్డాయని, అలాంటి పథకాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కాలని ప్రయత్నిస్తోందని నల్లపరెడ్డి ఆరోపించారు. వైఎస్ మానసపుత్రిక అయిన రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలుచేయకుండా విద్యార్థులతో పెట్టుకుంటోందని, విద్యార్థులతో చెలగాటమాడితే ఏ ప్రభుత్వమైనా కూలిపోక తప్పదని వ్యాఖ్యానించారు. రైతులు, విద్యార్థులను పట్టించుకోలేని ఈ ప్రభుత్వ మనుగడ అసాధ్యమన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తారా అని ప్రశ్నించగా ‘సంక్షేమ పథకాలను అమలు చేయకపోతే ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చు. రాష్టప్రతి పాలన కూడా వచ్చే అవకాశముంది. దేనినైనా ఎదుర్కొని ప్రజల్లోకి వెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన అన్నారు.


జగన్ దీక్ష గర్వకారణం:అంబటి రాంబాబు
 
లక్షలాది విద్యార్థుల సమస్య పరిష్కారానికి యువనేత జగన్ అకుంఠిత దీక్షతో ఏడు రోజుల పాటు నిరాహార దీక్షకు పూనుకోవడంపట్ల తమకెంతో గర్వంగా ఉందని పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. యువ నేత దీక్షా శిబిరం వద్ద శనివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం దీక్ష ప్రారంభించిన జగన్ మంచి నీళ్లు మాత్రమే తీసుకుంటున్నారని చెప్పారు. 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ జగన్ ఇదే విధంగా నిరశనను కొనసాగిస్తారని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర ప్రకటించినప్పుడు కూడా దారి పొడవునా వైఎస్ నడిచే వెళతారా, లేక మధ్యలో అక్కడక్కడా వాహనంపై వెళతారా అని సామాన్య ప్రజలు ప్రశ్నించారని, ఆయన ఐదారు రోజులపాటు ఏకబిగిన నడిచినప్పుడు వైఎస్‌ది పూర్తిగా పాదయాత్రేనని వారికి అర్థమయిందని తెలిపారు.


ఇప్పుడు కూడా జగన్ ప్రతి రోజూ సాయంత్రం దీక్షను విరమించి మళ్లీ ఉదయాన్నే ప్రారంభిస్తున్నారనే అపోహలు ఉన్నాయని, అయితే ముందు ప్రకటించిన విధంగా విద్యార్థుల కోసం యువ నేత పట్టుదలతో వారం రోజులూ నిరాహార దీక్ష చేస్తారని చెప్పారు. రెండు రోజుల నిరాహార దీక్ష ఫలితంగా శనివారానికి జగన్ బరువు కొంత తగ్గారని తెలిపారు. జగన్‌కు మద్దతుగా రోజుకొక వర్గం ప్రతినిధులు దీక్షలో కూర్చుంటారని వివరించారు. శనివారం న్యాయవాదులు దీక్షలో పాల్గొన్నారని, ఆదివారం ఉస్మానియా, నాగార్జున, ఆంధ్రా విశ్వవిద్యాలయాల విద్యార్థులు కూర్చోబోతున్నారని ప్రకటించారు.


వైఎస్ పేరెత్తే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదు


మహానేత చేపట్టిన పథకాలను అమలుపర్చలేని కాంగ్రెస్ నేతలకు ఆయన పేరెత్తే హక్కు లేదు. కాంగ్రెస్ నేత లు చేసిన తప్పులకు శిక్ష అనుభవించే రోజు దగ్గర్లోనే ఉంది. వైఎస్ తమ దేవుడని చెప్పుకుంటున్న ఆ నేతలు ఆయన ద్వారా సంక్రమించిన అధికారాన్ని అనుభవిస్తున్నా రు కానీ ఆయన పథకాల అమలు బాధ్యత వారికి లేదా?- రోజా, సినీ నటి


జగన్ పోరాటంతో బడుగులకు న్యాయం


జగన్ సాహసోపేత నాయకుడు. ఆయన చేస్తున్న పోరాటం బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తుంది. ప్రభుత్వంలో అధికారం వెలగబెడుతున్న బీసీ నేతలు.. బీసీ సంక్షేమాన్ని పట్టించుకోకుండా పదవులు పట్టుకొని వేలాడుతున్నారు. కావూరి, పురందేశ్వరి లాంటి నాయకులు.. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఎందుకు మాట్లాడరు? విద్యార్థులు, పేదలు, బడుగుల కంటే.. వారికి పదవులే ముఖ్యం.
- తాడి శకుంతల, విజయవాడ మాజీ మేయర్