Showing posts with label Delhi. Show all posts
Showing posts with label Delhi. Show all posts

Friday, May 13, 2011

కడపలో జగన్, పులివెందులలో విజయమ్మ భారీ మెజార్టీ



కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ప్రజలు
లాగి చెంపదె బ్బ కొట్టారన్న జగన్
జూలై 8న వై.ఎస్.ఆర్. పార్టీ ప్లీనరీ

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ప్రజలు లాగి చెంపదెబ్బ కొట్టారని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు నేటి కడప ఎన్నికల ఫలితాలు నాంది అని ఆయన అన్నారు.


కడప, పులివెందుల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వై.ఎస్.వంటి మహానేతపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బురద చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ప్రభుత్వం ఉంటుందా, పడిపోతుందా అనే అంశంపై మీ వ్యూహం ఏమిటన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రభుత్వం పోతే సంతోషించేది ప్రజలేనని ఆయన వ్యాఖ్యానించారు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది కాబట్టి ఈ ప్రభుత్వం పడిపోతుందని ఎవరూ అనుకోనక్కరలేదని ఆయన భరోసా ఇచ్చారు.

రైతులకు ఈ ప్రభుత్వం కనీస మద్దతు ధర అందించలేకపోతున్నదని ఆయన నిప్పులు చెరిగారు. మద్దతు ధర అంటే ఏమిటని ప్రశ్నిస్తూ రైతుకు కనీస మద్దతు ధర రూ 1030 ఉంటే కనీసం రూ 890 కూడా రైతుకు దక్కడంలేదని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడుకోని ఉన్నాయి, రెండు ప్రభత్వాలు ఇప్పటికైనా మేలుకోవాలి అని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను ఈ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని ఆయన అన్నారు.

జూలై 8న వై.ఎస్. పుట్టిన రోజు కాబట్టి ఆ రోజున ఇడుపులపాయలో వై.ఎస్.ఆర్. ప్లీనరీ జరుగుతుందని, అందుకు మంచి పేరు పెట్టి మీడియా ప్రతినిధులు అందరినీ పిలిచి చెబుతామని ఆయన నవ్వుతూ చెప్పారు. వై.ఎస్.ఆర్. పార్టీ జండా చూస్తే చాలు పార్టీ అజెండా తెలిసిపోతుందని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం భవితవ్యం ఏమిటని మీడియా ప్రతినిధి ఒకరు మరీ మరీ ప్రశ్నించగా నేనూ ఆ పని మీదే ఉన్నానని ఆయన అన్నారు. నన్ను ఏమి చేయమంటావో చెప్పు, నేను ప్రతిపక్ష హోదాలోనే ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినందువల్ల ఏమీ చేయలేకపోతున్నా, ఈ ప్రభుత్వం పడిపోతే ప్రతి పేదవాడికి సంతోషం క లుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా ఇంటికి పంపుదామా అని నేనూ చూస్తున్నా, కాని కుదరడంలేదని ఆయన నవ్వుతూ మీడియా సమావేశం నుంచి నిష్క్రమించారు.

తమ పార్టీ విజయానికి ముఖ్యంగా ఆ దేవునికి, ఆశీస్సులు ఇచ్చిన నాన్నకు, వై.ఎస్.ను హృదయంలో ఉంచుకున్న ప్రతి మనిషికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన ప్రకటించారు.

  కడప లోక్‌సభలో 5,45,672 ఓట్ల మెజార్టీతో జగన్ విజయభేరి
పులివెందుల అసెంబ్లీలో విజయమ్మకు 81,373 ఓట్ల భారీ మెజార్టీ
పార్లమెంట్ పరిధిలో డిపాజిట్లు కోల్పోయిన డీఎల్, మైసూరా
మంత్రి డీఎల్‌కు దక్కింది లక్షా 46 వేల ఓట్లు మాత్రమే
మూడోస్థానంలో మైసూరాకు దక్కింది లక్షా 29వేల ఓట్లే
{పతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ జగన్‌కు భారీ మెజార్టీ
పులివెందులలో డిపాజిట్‌తో బయటపడ్డ వైఎస్ వివేకా...
డిపాజిట్ పోగొట్టుకున్న టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి

ఆత్మగౌరవానికి అందలం. దేశ చరిత్రలోనే అద్భుతంగా అభివర్ణించదగ్గ విజయం. హస్తిన అహంకారాన్ని తెలుగు ఆత్మగౌరవం అణగదొక్కిన చరిత్రాత్మక సంఘటన!! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కడప ప్రజలు దేశంలోనే మూడో అతి పెద్ద మెజారిటీ కట్టబెట్టారు. 2004లో పశ్చిమబెంగాల్‌లో సీపీఎం నేత అనిల్ బసు సాధించిన 5.92 లక్షల మెజారిటీ ఇప్పటిదాకా దేశంలోకెల్లా అత్యధికం. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు 1991లో నంద్యాల లోక్‌సభ స్థానంలో లభించిన 5.8 లక్షల మెజారిటీ రెండో స్థానంలో ఉంది. కానీ ఇవి రెండూ నల్లేరుపై నడక మాదిరిగా వచ్చిన అనాయాస విజయాలే. 2004లో బెంగాల్‌లో సీపీఎం ఉచ్ఛ దశలో ఉండగా, కాంగ్రెస్ కనీసం సోదిలో కూడా లేదు. బసు ఏకైక ప్రత్యర్థల్లా బలహీన బీజేపీ మాత్రమే. పీవీ విషయమూ అంతే. పైగా, ప్రధాని అనే ఉద్దేశంతో ఆయనపై టీడీపీ పోటీ కూడా పెట్టలేదు. బీజేపీయే నామమాత్రంగా బరిలో దిగింది. అదీగాక అప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కానీ కడప ఉప ఎన్నిక మాత్రం అక్షరాలా కురుక్షేత్రాన్ని తలపించింది.
అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ యువనేతతో హోరాహోరీ తలపడ్డాయి. విజయమే లక్ష్యంగా వందలాది కోట్లను మంచినీళ్లప్రాయంగా గుమ్మరించాయి. ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, ఏకంగా 20 మంది మంత్రులు, 70కి పైగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను మోహరించింది. కనీవినీ ఎరుగని స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడింది. చివరికి టీడీపీతో కూడా అంటకాగింది! పసుపు పార్టీ తరఫున కూడా 50 మంది దాకా ఎమ్మెల్యేలు కడప ప్రచార బరిలో దిగారు. ఇక, నైచ్యానికే నయా అర్థం చెబుతూ, పాలక-విపక్ష కూటమికి దన్నుగా ఎల్లో మీడియా ఎగజిమ్మిన విషం అంతా ఇంతా కాదు! మరోవైపు సీఎం, మాజీ సీఎం, విపక్ష నేత, ‘మెగా’స్టార్ వంటి అతిరథులు ప్రచారం పేరుతో తొడగొట్టారు. మీసం మెలేశారు. ఏకంగా మంత్రివర్యులే ఓటర్లను బెదిరింపులకు, భయాందోళనలకు గురిచేశారు. వీటన్నింటినీ మించి... ఉద్యమ నెలబాలుని వంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేందుకు జరిగిన కుయత్నాలు అన్నీ ఇన్నీ కావు! పార్టీ నేతలపై కనీవినీ ఎరగనన్ని బైండోవర్ కేసులు మోపారు. ఇన్నింటిని ఒంటరిగానే ఎదుర్కొని... పార్టీ గుర్తును కేవలం 17 రోజుల వ్యవధిలో ప్రజల్లోకి తీసుకెళ్లి... అధికార, విపక్షాలను నేరుగా ఢీకొట్టి... మూకుమ్మడిగా మట్టి కరిపించి... మేరు పర్వతానికి సరితూగే స్థాయిలో జగన్‌మోహన్‌రెడ్డి సాధించిన మెజారిటీ... అద్భుతం, అనితరసాధ్యం!

ఢిల్లీ దిమ్మ తిరిగింది.. కడప గడప తన సత్తా చాటింది.. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు నాంది పలికింది.. అహంకారానికీ, ఆత్మగౌరవానికీ.. ఢిల్లీకి, కడపకు.. సోనియాకు, వైఎస్‌కు జరిగిన ఈ ‘ఉప’ సమరంలో.. 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ, 28 ఏళ్ల తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కోల్పోయాయి. నెలల వయసున్న ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’.. చరిత్రాత్మక మెజార్టీతో విజయ దుందుభీ మోగించింది. కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ స్థానాలకు ఈ నెల 8న జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మలకు కడప ప్రజలు ఘన విజయాన్ని చేకూర్చారు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కడపలో జగన్ 5,45,672 ఓట్ల భారీ మెజారిటీతో చరిత్ర సృష్టించారు. పులివెందుల చరిత్రలో ముందెన్నడూ లేని 81,373 ఓట్ల అఖండ మెజారిటీతో వైఎస్ విజయలక్ష్మి రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా.. వైఎస్ వివేకానందరెడ్డి పులివెందుల శాసనసభ బరిలో డిపాజిట్ దక్కించుకున్నారు. పార్లమెంటు స్థానానికి జగన్‌తో పోటీ పడిన కాంగ్రెస్ అభ్యర్థి, మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, తెలుగుదేశం అభ్యర్థి ఎం.వి. మైసూరారెడ్డి డిపాజిట్లు సైతం కోల్పోయారు.
ఎన్ని ఆటంకాలు సృష్టించినా బెదరని కడప ప్రజలు

ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైన నాటి నుంచీ అధికార కాంగ్రెస్ పార్టీ పాల్పడని అక్రమాలు లేవు. చేయని అధికార దుర్వినియోగం లేదు. వైఎస్ జగన్‌కు స్వాగతం పలికినా, జై కొట్టినా వారి అంతుచూశారు. పోలీసులను ఉసిగొల్పి వైఎస్ అభిమానులను స్టేషన్లకు ఈడ్చుకెళ్లి చావబాదారు. ఎన్నడూ పోలీస్‌స్టేషన్ మొహం చూడని వారిపై కూడా బైండోవర్ కేసులు నమోదు చేశారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేనంతగా 10 వేల పైచిలుకు బైండోవర్ కేసులు నమోదు చేసి.. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ ప్రజల్లో భయాందోళనలు కలుగజేశారు. పోలింగ్ రోజున మరింత బీభత్సం జరుగుతుందనే వాతావరణం సృష్టించారు. మంత్రులు యావత్తూ జిల్లాలో తిష్ట వేసి మంత్రాంగం నడిపారు. జగన్, విజయలక్ష్మి పేర్లున్న వ్యక్తులతో నామినేషన్‌వేయించారు. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు నుండే డబ్బులు మంచినీళ్లలా ప్రవహింపజేశారు. ఓటర్లను కొనే ప్రయత్నం చేశారు. అయినా కడప ప్రజలు దేనికీ బెదరలేదు. డబ్బుకు ప్రలోభపడలేదు. ఎవరెన్ని చేసినా, ఎవరేమి చెప్పినా వినలేదు. ఉప్పెనలా పొంగి జగన్‌ను తమ ‘అభిమాన ఓటు’తో ముంచెత్తారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను చావుదెబ్బ కొట్టారు.


వైఎస్‌ను అధిగమించిన జగన్, విజయమ్మ


42 మంది అభ్యర్థులు పోటీచేసిన కడపలో జగన్‌కు 5,45,672 ఓట్ల భారీ ఆధిక్యత లభించింది. 1991 ఎన్నికల్లో, ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి లభించిన 4,22,790 ఓట్ల ఆధిక్యతను జగన్ అధిగమించారు. పులివెందుల శాసనసభ బరిలోనూ వైఎస్ విజయమ్మ 81,373 ఓట్ల ఆధిక్యతతో, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మెజార్టీని అధిగమించారు. కాగా కాంగ్రెస్ రంగంలోకి దించిన నకిలీ జగన్‌మోహన్‌రెడ్డిలందరికీ కలిపి సుమారు 15 వేల ఓట్లు వచ్చాయి. జగన్‌కు పడాల్సిన ఓట్లు పొరపాటున వారికి పడి ఉంటాయని, లేదంటే అంత మొత్తంలో వారికి ఓట్లు రావని విశ్లేషకులు చెబుతున్నారు. కడప లోక్‌సభకు మొత్తం 10,30,973 ఓట్లు పోలవగా.. జగన్‌కు 6,92,251 ఓట్లు వచ్చాయి. డీఎల్‌కు 1,46,579 ఓట్లు దక్కాయి. మైసూరారెడ్డికి 1,29,565 ఓట్లు వచ్చాయి. డిపాజిట్ దక్కాలంటే.. పోలైన ఓట్లలో కనీసం ఆరోవంతు (1,71,829) ఓట్లు రావాలి.


ప్రతి నియోజకవర్గంలోనూ భారీ ఆధిక్యత

కడప పార్లమెంటు పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో జగన్‌కు రికార్డు స్థాయి భారీ ఆధిక్యత లభించింది. 82.64 శాతం పోలింగ్ జరిగిన పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఆయనకు రికార్డు స్థాయిలో 1,08,177 ఓట్ల మెజార్టీ వచ్చింది. 76.49 శాతం పోలైన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు 74,771 ఓట్ల ఆధిక్యతనిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి సొంత నియోజకవర్గం మైదుకూరులో సైతం జగన్‌కు 70,147 ఓట్ల మెజార్టీ లభించింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో 83.18 శాతం పోలింగ్ జరగగా, అక్కడ వైఎస్ జగన్‌కు తెలుగుదేశం పార్టీపై 67,483 ఓట్ల ఆధిక్యత లభించింది.
84.58 శాతం పోలింగ్ జరిగిన కమలాపురం నియోజకవర్గంలో 65,882 ఓట్ల ఆధిక్యత లభించింది. 75.25 శాతం పోలింగ్ జరిగిన బద్వేలు నియోజకవర్గంలో 61,463 ఓట్ల మెజార్టీ లభించింది. ముస్లిం మైనార్టీలు నిర్ణాయక శక్తిగా ఉన్న కడప అసెంబ్లీ సెగ్మెంట్‌లో అతి తక్కువగా 61.57 శాతం పోలింగ్ జరిగినప్పటికీ.. జగన్‌కు 67, 785 ఓట్ల ఆధిక్యత రావడం విశేషం. ఓటింగ్‌లో అధికంగా పాల్గొన్న ముస్లిం మైనార్టీలంతా వైఎస్‌ఆర్ తనయుడివైపే నిలిచారనేందుకు ఇదో నిదర్శనం.

విజయమ్మకు భారీ ఆధిక్యత
విజయమ్మకు పులివెందుల ప్రజలు అఖండ మెజార్టీని అందించారు. ఇక్కడ 25 మంది అభ్యర్థులు పోటీ చయగా.. ఆమెకు 81,373 ఓట్ల ఆధిక్యత లభించింది. ఇక్కడ పోలైన 1,57,092 ఓట్లలో విజయమ్మకు 1,10,098 ఓట్లు లభించగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డికి 28,725 ఓట్లు లభించాయి. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) 11,239 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయారు.

Tuesday, January 11, 2011

‘జల’దరించిన ఢిల్లీ * జగన్ జలదీక్ష. ... రాజధానిలో ప్రతిధ్వనించిన తెలుగు గళం

కృష్ణా జలాల పంపకంలో అన్యాయంపై నిరసన
అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్ని ఎడారిలా మార్చొద్దంటూ కేంద్రానికి వినతి
ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సాగిన దీక్ష
తరలివచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు
పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానిక సంస్థల ప్రతినిధులు, రైతు ప్రతినిధులు, రైతులు, మద్దతుదారులు
కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎంపీలు, 21 మంది ఎమ్మెల్యేల హాజరు
వీరితోపాటు ఇద్దరు పీఆర్పీ ఎమ్మెల్యేలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే
వివిధ కారణాలతో హాజరు కాలేకపోయిన పలువురు ఎమ్మెల్యేలు
దీక్షలో పాల్గొన్న 40 మంది మాజీ ఎమ్మెల్యేలు

ఉదయం నుంచి రాత్రిదాకా ప్రశాంతంగా సాగిన దీక్ష
జగన్ వినతితో రెండుసార్లు సమయాన్ని పొడిగించిన పోలీసులు
8.30 గంటల సమయంలో బలవంతంగా అరెస్టు చేస్తామని ప్రకటన
రైతన్నపై లాఠీ పడొద్దన్న కారణంతో అరెస్టుకు సహకరించిన యువనేత..
అరెస్టు; విడుదల... దీక్ష లక్ష్యం నెరవేరిందని ప్రకటన
నేటి మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రానికి బయల్దేరనున్న ప్రత్యేక రైలు

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: దేశ రాజధాని హస్తినలో.. పార్లమెంటుకు కూతవేటు దూరంలో.. తెలుగు రైతు గర్జించాడు! కృష్ణా జలాల్లో తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు!! అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్ని ఎడారి చేయొద్దని వినమ్రంగా వేడుకున్నాడు!! మంగళవారం యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద చే పట్టిన ‘జలదీక్ష’ వేదికగా తన గొంతుకను దేశానికి వినిపించాడు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రైతు ప్రతినిధులు, రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన స్థానిక సంస్థల ప్రతినిధులు, అన్నదాతలు, అభిమానులతో ఉదయం 11 గంటలకు మొదలైన దీక్ష.. రాత్రి తొమ్మిది గంటల దాకా సాగింది. దీక్ష జరిగినంత సేపూ పలువురు ప్రజా ప్రతినిధులు ప్రసంగించారు. సాయంత్రం 5 గంటల వరకే అనుమతి ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థలాన్ని ఖాళీ చేయాలని కోరారు. స్థానిక ఏసీపీ విజయ్ చందోల్ యువనేత జగన్‌తో చర్చలు జరిపారు. ప్రధాని అపాయింట్‌మెంట్ వచ్చే వరకు దీక్ష విరమించే ప్రశ్నే లేదని జగన్ తేల్చి చెప్పారు. దీక్ష 24 గంటలు జరుగుతుందని, అనుమతి పొడిగించాలని కోరారు.

కొంతమేర సానుకూలంగా స్పందించిన పోలీసులు.. రాత్రి 7 గంటల వరకు ఒకసారి, 8.30 గంటల వరకు మరోసారి పొడిగించారు. అయితే రాత్రి 8.30 గంటల తర్వాత.. కఠిన వైఖరి ప్రదర్శించారు. ఢిల్లీ పోలీస్ చట్టంలోని సెక్షన్-65 ప్రకారం నిరసనకారులను అరెస్టు చేస్తామని ప్రకటించారు. సహకరించకుంటే బలవంతంగా అరెస్టులు చేస్తామన్నారు. చివరికి ఒక్క రైతన్నపై కూడా లాఠీదెబ్బ పడకూడదన్న ఉద్దేశంతో యువనేత తన అరెస్టుకు సహకరించారు. దీంతో ఆసాంతం గాంధేయ పద్ధతిలో సాగిన దీక్ష 9 గంటల సమయంలో ప్రశాంతంగా ముగిసింది.

దీక్షారథానికి ఘన స్వాగతం


రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన మొత్తం 2,500 మందితో ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరిన ప్రత్యేక రైలు సోమవారం రాత్రి 11 గంటలకే ఢిల్లీ చేరుకోవాల్సి ఉన్నా.. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో సఫ్దర్‌జంగ్ స్టేషన్‌కు వచ్చింది. అప్పటికే మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడ కొన్ని గంటలుగా రైలు కోసం ఎదురుచూస్తున్నారు. జగన్ రాకకు ముందే స్టేషన్‌కు వచ్చిన అభిమానులు బ్యానర్లు, ఫ్లెక్సీలతో రైలుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్, ఎమ్మెల్యేలు, ప్రముఖులు, స్థానిక సంస్థల ప్రతినిధులు తమ బసప్రదేశాలకు బస్సుల్లో వెళ్లి గంట తిరిగే సరికి మళ్లీ అవే బస్సుల్లో జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. ప్రత్యేక రైల్లో వచ్చినవారేగాకుండా వేరే రైళ్లలో, విమానాల్లో సొంత ఖర్చులతో వచ్చిన నాయకులు, అభిమానులు కూడా వీరికి తోడయ్యారు. వేదిక వద్ద యువనేతను కలిసేందుకు, పలకరించేందుకు మద్దతుదారులు ఎగబడ్డారు. ఈ అభిమాన ప్రవాహాన్ని ఆపడం నాయకులకు ఒకింత కష్టమైంది. పదేపదే సర్దిచెబుతూ ప్రసంగాలు కొనసాగించారు. వేదికపై స్థలం పరిమితంగా ఉండటంతో కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కొందరు ముఖ్యులకే చోటుదక్కింది.

అరెస్టుకు నేను సహకరిస్తున్నా..


రెండుసార్లు సమయాన్ని పొడిగించినా.. నేతలు దీక్ష విరమణకు ససేమిరా అనడంతో రాత్రి 8.30 గంటల సమయంలో వారందరినీ అరెస్టు చేసేందుకు పోలీసులు ఉద్యుక్తులయ్యారు. ఈ సందర్భంలో జగన్ జోక్యం చేసుకున్నారు. రైతులపై లాఠీదెబ్బలు పడకూడదని, దీక్ష ఉద్దేశం నెరవేరిందని చెప్పారు. అరెస్టుకు సహకరిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ఇప్పుడు మన ముందున్న మార్గాలు రెండు. మనం ఒకరోజు పాటు నిరాహార దీక్ష చేయాలనుకున్నాం. ఉదయం నుంచి రాత్రి వరకు చేశాం. సాయంత్ర 5 గంటల వరకే అనుమతి ఉన్నా... మరో నాలుగు గంటలు దీక్ష కొనసాగించడానికి అవకాశం కల్పించారు. అనుమతి పొడిగింపు సాధారణ అంశం కాదని, నిరసనకారుల క్రమశిక్షణ చూసి పొడిగిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల గొప్పల సంగతి పక్కనబెడితే.. మనం కాదూ.. కూడదూ అని నిలబడితే పోలీసు బలగాలు దిగుతాయి. గొడవ మొదలవుతుంది. గొడవలో కొందరికైనా గాయాలవడం తప్పదు. అది నాకు సరికాదనిపిస్తోంది. మనం చేయాలనుకొన్న దీక్ష చేశాం. మన దీక్ష ఫలించింది. దీక్ష ఎందుకు చేస్తున్నాం? మనకు జరిగిన అన్యాయం ఏమిటి? అని జాతీయ చానళ్లు ఉదయం నుంచి రాత్రి దాకా చూపించాయి. మనకు అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లగలిగాం. అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ప్రధానమంత్రి కూడా తప్పు చేశారని ప్రపంచానికి చూపించాం. ఈ దశలో మనం సఫలీకృతమయ్యాం. నన్ను అరెస్టు చేసి తీసుకెళ్లినా.. మీరు రియాక్ట్ కావద్దు. అరెస్ట్‌కు నేను సహకరిస్తున్నా. మీరూ సహకరించండి’ అని రైతులు, ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. దీంతో వారు కూడా శాంతించారు. తర్వాత జగన్‌ను అరెస్టు చేయడంతో దీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. అనంతరం జగన్‌ను పోలీసులు విడుదల చేశారు.

తెలు‘గోడు’ వినటానికి తీరిక లేదా? 
కష్టాలు చెప్పుకోవటానికి ప్రధాని మన్మోహన్‌సింగ్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు: జగన్
ఆంధ్రప్రదేశ్ రైతులంటే ఇదేనా మీ ప్రేమ?
కష్టాల్లో ఉన్న రైతుకు ‘కృష్ణా’ తీర్పుతో మరో విపత్తు
గోడు వినిపించటానికి ఢిల్లీ వచ్చి దీక్ష చేయాల్సి వచ్చింది
కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రం ఎడారిగా మారుతుంది
‘డిపెండబులిటీ’ని ఎందుకు తగ్గించారు?
మిగులు జలాలను ఎందుకు పంచారు?
కోయినా ప్రాజెక్టు సామర్థ్యం మేరకు విద్యుత్‌ను మేమే ఇస్తాం.. ఆ నీటిని రాష్ట్రానికే ఇవ్వాలి
100 టీఎంసీల సామర్థ్యానికి మించి ఉన్న ప్రాజెక్టులను ‘స్వతంత్ర నియంత్రణ’లో ఉంచాలి
ఎగువ రాష్ట్రాలకు వచ్చే ప్రతి చుక్క నీటిలోనూ ఆంధ్రప్రదేశ్‌కు వాటా ఇవ్వాల్సిందే
కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంతోనే సమస్యకు శాశ్వత పరిష్కారం
పోలవరం, ప్రాణహిత, దుమ్ముగూడెం,
సుజల స్రవంతిలను జాతీయ ప్రాజెక్టులుగా చేపట్టాలి
ఢిల్లీ ‘జలదీక్ష’లో యువనేత జగన్ డిమాండ్లు


న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, కడగండ్లను, కృష్ణా జలాల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు వివరించి, న్యాయం చేయాలని కోరటానికి రెండు సార్లు అపాయింట్‌మెంట్ అడిగినా స్పందన కరవయిందని యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగం పట్ల ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఎంతో, గౌరవం ఏపాటిదో.. అపాయింట్‌మెంట్ నిరాకరించటమే చెప్తోందని ఆయన పేర్కొన్నారు. తెలుగువారి గోడు వినటానికి ప్రధానికి, కేంద్రానికి తీరిక లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ‘జలదీక్ష’లో పాల్గొన్నవారిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు.

‘‘మా గోడు వినండని చెప్పటానికి ఢిల్లీకి రావాల్సి వచ్చింది. భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ 48 గంటలు లక్ష్య దీక్ష చేశాం. వరుసగా ముంచుకొచ్చిన వరదలు, లైలా, జల్ తుపాన్లు, తర్వాత కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు పంటలు కోల్పోయారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది. కష్టాలు, కడగండ్ల వల్ల 434 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. రైతులను ఆదుకుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిన తర్వాత 390 మంది రైతుల ఊపిరి ఆగిపోయింది. ఈ నేపథ్యంలో.. రైతుల గోడు వినిపించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేయటానికి ప్రధానమంత్రిని అపాయింట్‌మెంట్ అడిగితే.. ఆయన నిరాకరించారు. ప్రకృతి విపత్తుల కష్టాల నుంచి తేరుకోక ముందే.. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు రూపంలో రైతులకు మరో పెద్ద కష్టం వచ్చి పడింది. ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోందని చెప్పటానికి ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ అడిగాం. ఇప్పటి వరకూ ప్రధాని నుంచి స్పందన రాలేదు. రైతుల పట్ల కేంద్రానికి ఉన్న ప్రేమ ఇదేనా? మా గోడు వినిపించటానికి.. ఢిల్లీకి వచ్చి దీక్ష చేయాల్సి వచ్చింది. ఇప్పటికైనా ప్రధానమంత్రి స్పందిస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.


ట్రిబ్యునల్ తీర్పు వల్ల జరిగిన అన్యాయం, పరిష్కారాలు ఇవీ..


బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జగన్ సోదాహరణంగా వివరించారు. తాజా ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్యాయాన్ని సరిదిద్దటానికి అవకాశం ఉన్న మార్గాలనూ సూచించారు. ఆయన మాటల్లోనే...


కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యతను గణించటానికి బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం డిపెండబులిటీని ఆధారంగా తీసుకుని తీర్పునిస్తే.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అందుకు భిన్నంగా 65 శాతం డిపెండబులిటీని ఆధారంగా తీసుకుని నీటి లభ్యతను పెంచి చూపించటం ద్వారా ఎగువ రాష్ట్రాలకు నికర జలాల కేటాయింపు పెరిగింది. దీని వల్ల దిగువ రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. డిపెండబులిటీని ఎందుకు తగ్గించారనే అంశం మీద స్పందన లేదు.


కృష్ణా బేసిన్‌కు సంబంధించిన 112 సంవత్సరాల ప్రవాహాల వివరాలు అందుబాటులో ఉన్నా.. 47 సంవత్సరాల ప్రవాహాల వివరాలనే పరిగణనలోకి తీసుకున్నారు. బచావత్ ట్రిబ్యునల్ 78 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకుంది. తక్కువ సంవత్సరాల గణాంకాలనే తీసుకోవటం వల్ల కూడా నీటి లభ్యత పెరిగినట్లు కనిపించింది.


వరదలు, కరవు సమయాల్లో కింది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున.. మిగులు జలాల వినియోగం మీద పూర్తి స్వేచ్ఛ కింది రాష్ట్రానికే ఉండాలని బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో చెప్పింది. కానీ తాజా ట్రిబ్యునల్ తీర్పులో.. మిగులు జలాలను కూడా లెక్కకట్టి పంచేశారు. 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని లెక్క తేల్చి, అందులో సగమే మన రాష్ట్రానికి కేటాయించారు. మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలకు ఎందుకు పంచాల్సి వచ్చింది?

కోయినా విద్యుత్ ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటిని కేటాయించారు. కోయినా విద్యుత్ ప్రాజెక్టు ఉత్పత్తి సామర్థ్యం మేరకు.. కరెంట్ మేమే ఇస్తాం. 67 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌కే ఇవ్వాలి.


ఠ నాగార్జునసాగర్ కింద ఉన్న పాలేరు, మున్నేరుల్లో ప్రవహించే 47 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టటం తప్ప వినియోగించుకునే అవకాశం లేదు. ఆ నీటినీ ఆంధ్రప్రదేశ్ వాటాలో కలపటం ఏం న్యాయం? అంటే.. మన కేటాయింపుల్లో 47 టీఎంసీల నీరు వినియోగించుకోవటానికి వీలుకాదు.

బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పులో పేర్కొన్న బోర్డులో.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్టల్ర నుంచి ఒక్కొక్కరు, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇద్దరు ఉంటారు. ‘బోర్డు వేశాం. కొట్టుకు చావండి’ అనే తరహా ఆలోచనతోనే బోర్డు ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ సిఫారసు చేసింది. కావేరీ జలాల విషయంలో ఇదే జరుగుతోంది. అక్కడ బోర్డు ఉన్నా.. కర్ణాటక, తమిళనాడుల మధ్య జగడం నిరంతరాయంగా కొనసాగుతోంది. బోర్డు వల్ల న్యాయం జరగటం ఒట్టిమాటే. తుంగభద్ర బోర్డు వల్ల మనకు నష్టమే తప్ప న్యాయం జరిగిన సందర్భాల్లేవు.


ఎగువ రాష్ట్రాల్లో 100 టీఎంసీల సామర్థ్యానికి మించి ఉన్న ప్రాజెక్టులను స్వతంత్ర సాధికార సంస్థ నియంత్రణలో ఉంచాలి.


ఖరీఫ్ సమయంలో 8-10 టీఎంసీల నీటిని కర్ణాటక విడుదల చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. మా వాటా కోసం ఎవరినీ దేవురించాల్సిన అవసరం లేదు. ప్రతి చుక్కలోనూ రాష్ట్రానికి దక్కాల్సిన వాటాను పంచాల్సిందే. చుక్క నీరు ఎగువ రాష్ట్రాలకు వస్తే.. తక్షణమే అందులో రాష్ట్రానికి రావాల్సిన వాటాను విడుదల చేయాలి. ఇలా చేస్తే.. వరదల సమయాల్లో లక్షల క్యూసెక్కుల నీటిని వృధాగా విడుదల చేయాల్సిన అవసరం రాదు.


సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా-గోదావరి అనుసంధానమే సమస్యకు శాశ్వత పరిష్కారాన్నిస్తుంది.

పోలవరం కావాలని కాంగ్రెస్‌లోనే కొంత మంది ఎంపీలు అడుగుతున్నారు. వద్దంటున్న వాళ్లూ ఉన్నారు. పోలవరంతో పాటు ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా ఎందుకు చేపట్టరని ప్రశ్నిస్తున్నా. వీటితో పాటు దుమ్ముగూడెం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులను కూడా జాతీయ ప్రాజెక్టులుగా చేపట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నా.’’


రైతులకు న్యాయం చేయటానికి ప్రధానమంత్రి స్పందించి తమకు అపాయింట్‌మెంట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఆయన తన ప్రసంగంలో చేసిన డిమాండ్లు, పరిష్కార మార్గాలతో ప్రధానమంత్రికి రాసిన లేఖను ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు.


బాబూ.. విశ్వసనీయతకు అర్హుడివా?


రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే విధంగా ట్రిబ్యునల్ తీర్పు రావటానికి చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నపుడు వెలగబెట్టిన నిర్వాకమే కారణమని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో.. ఎన్.టి.రామారావు, చంద్రబాబు ప్రాజెక్టులకు శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేయటం మినహా.. ఒక్క ప్రాజెక్టునూ నిర్మించకపోవటం వల్లే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు 2000 సంవత్సరంలో ముగుస్తుందని, కొత్త ట్రిబ్యునల్ వచ్చే సమయానికే ప్రాజెక్టులు పూర్తి చేయటం ద్వారా కృష్ణా బేసిన్‌లోని నీటి మీద హక్కు మనకు దక్కుతుందని దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి శాసనసభలో సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వెలిగొండ, హంద్రీనీవా, పులిచింతల, నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులను పూర్తి చేయటానికి అవకాశం ఉన్నా.. టీడీపీ సర్కారు కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యిందని జగన్ తప్పుబట్టారు.


అధికారంలో ఉండగా వ్యవసాయం దండగ అని చెప్పిన ప్రబుద్ధుడు.. ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విశ్వసనీయతకు అర్హుడునని చెప్పుకుంటున్న చంద్రబాబు.. తన హయాంలో రైతులను తుపాకులతో కాల్పించటం తప్ప మరేం చేశారని జగన్ ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు అంటే.. వైఎస్ ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఉచిత కరెంటు ఫైలు మీదే పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతుల రుణాలు మాఫీ చేసిన ఘనత కూడా వైఎస్‌కే దక్కుతుందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులను చదివి వినిపించారు. 95-96లో రూ. 652 కోట్లతో మొదలు పెట్టి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసిన ఆఖరు సంవత్సరం (2002-03)లో గరిష్టంగా రూ.1,693 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 8 నెలల్లోనే రూ. 3,330 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించారని.. ఐదేళ్లలో రూ. 40 వేల కోట్లు వ్యవసాయ రంగం మీద ఖర్చు చేశారని వివరించారు.


దీక్షలో ఎవరెవరు పాల్గొన్నారంటే...
జలదీక్షలో పాల్గొన్నవారిలో కాంగ్రెస్ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి (నెల్లూరు), సబ్బం హరి (అనకాపల్లి)తోపాటు మొత్తం 24 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు ఉన్నారు. వీరితోపాటు దాదాపు 40 మంది మాజీ ఎమ్మెల్యేలు, 23 జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో.. పిల్లి సుభాష్‌చంద్రబోస్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, జి.శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, ఆదినారాయణరెడ్డి, కమలమ్మ, బి.గురునాథ్‌రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టి.బాలరాజు, జయసుధ, పాటిల్ నీరజారెడ్డి, కుంజా సత్యవతి, రేగ కాంతారావు, జి.బాబూరావు, ఆళ్ల నాని, ఎన్.శేషారెడ్డి, ఎం.సుచరిత ఉన్నారు. ఇద్దరు ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు- శోభా నాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి, ఒక టీడీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డితోపాటు ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, కొండా మురళి, పుల్లా పద్మావతి ఉన్నారు. చివరి నిమిషంలో ముఖ్యమంత్రి, పీసీసీ నాయకత్వం అడ్డుపడటంతో పలువురు ఎమ్మెల్యేలు రాలేకపోయారు. ఇక దీక్షకు రావడానికి ఏర్పాట్లు చేసుకుని చివరి నిమిషంలో రాలేని వారిలో ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కె.రాంచంద్రారెడ్డి, షాజహాన్, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఉన్నారు. ముఖ్యమైన సమావేశం ఉన్నందున ఢిల్లీ వెళ్లలేకపోతున్నానని, తాను ఎప్పటికీ జగన్ వెంటే ఉంటానని ద్వారంపూడి ప్రకటించగా, చలి జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున రాంచంద్రారెడ్డి, మామ చనిపోయిన కారణంగా నల్లపురెడ్డి దీక్షకు రాలేకపోయారు.

పెద్ద సంఖ్యలో ప్రముఖులు..

ఇక ప్రముఖుల విషయానికొస్తే.. మాకినేని పెద రత్తయ్య, బాజిరెడ్డి గోవర్ధన్, వై.వి.సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డి, కొణతాల రామకృష్ణ, లక్ష్మీపార్వతి, అంబటి రాంబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సినీనటి రోజా, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, భూమన కరుణాకర్‌రెడ్డి, సినీ నటుడు విజయ్ చందర్, మూలింటి మారెప్ప, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, ఎం.ఎ.రెహ్మాన్, మేకా ప్రతాప్ అప్పారావు, ఎడ్మ కిష్టారెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, సామినేని ఉదయభాను, జంగా కృష్ణమూర్తి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, పెనుమత్స సాంబశివరాజు, గండి బాబ్జీ, విష్ణువర్ధన్‌రెడ్డి, లోకనాథం రాయుడు, రాజ్‌సింగ్ ఠాకూర్, జొన్నా సూర్యనారాయణ, నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగు నాగార్జున, నిజామాబాద్ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, యువజన నాయకులు కోటింరెడ్డి వినయ్ రెడ్డి, రాచమల్ల సిద్ధేశ్వర్, చేవూరు శ్రీధర్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మహిళా నాయకులు కొల్లి నిర్మల, అమృతాసాగర్, రైతు ప్రతినిధులు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, చెంగల్‌రెడ్డి తదితరులున్నారు. రైల్లో వచ్చిన 2,500 మందితోపాటు ఢిల్లీలోని వివిధప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చిన దాదాపు వెయ్యిమంది, రాష్ట్రం నుంచి సొంతఖర్చులతో వచ్చిన 500మంది కలిపి మొత్తమ్మీద 4 వేల మందికిపైగా దీక్షలో పాల్గొన్నారు.

జాతీయ మీడియా ఆసక్తి

జగన్ నేతృత్వంలో జరిగిన జల దీక్ష పట్ల ప్రాంతీయ మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా అమిత ఆసక్తి కనపరిచింది. దీక్ష జరుగుతున్న పార్లమెంటు వీధిలో... తెలుగు చానళ్లే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రాంతీయ, జాతీయ మీడియాకు చెందిన 42 ఓబీ వ్యాన్లు కొలువు దీరాయి. పెద్ద సంఖ్యలో జాతీయ మీడియా ప్రతినిధులు దీక్షను కవర్ చే సేందుకు వచ్చారు. ఇంగ్లిష్‌లో మాట్లాడాలని జాతీయ మీడియా చేసిన విజ్ఞప్తికి జగన్ సానుకూలంగా స్పందించి, ప్రత్యేకంగా వారితో మాట్లాడారు.

పోలీసుల ప్రశంసలు

జల దీక్షను అత్యంత క్రమశిక్షణతో నిర్వహించారని పోలీసు అధికారులు సైతం ప్రశంసించారు. అందువల్లే రెండుసార్లు అనుమతి పొడిగించామని చెప్పారు. ఇంత క్రమశిక్షణతో జరిగిన కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో ఇక్కడ చూడలేదని స్థానిక ఏసీపీ విజయ్ చందోల్ విలేకరులతో అన్నారు.

కరుణించిన వాతావరణం
గతవారం రోజులుగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీక్షారైలు కూడా దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలి మధ్య సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌కు చేరింది. అయితే 10 గంటల సమయంలో క్రమంగా ఎండ రావడంతో.. చలి తీవ్రత తగ్గింది. దాదాపు వారం రోజుల తర్వాత.. మంగళవారమే చలి తీవ్రత తగ్గింది. దీంతో రైతులు, నేతలు పెద్దగా ఇబ్బంది పడకుండానే దీక్ష కొనసాగించగలిగారు.

నేటి మధ్యాహ్నం తిరుగు ప్రయాణం

బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సప్దర్‌గంజ్ రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక రైలు రాష్ట్రానికి బయల్దేరుతుందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు. జంతర్‌మంతర్ వద్ద దీక్షలో పాల్గొన్న వారంతా ఇదే రైలులో రాష్ట్రానికి వస్తారని తెలిపారు. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు.

నేను జెంటిల్మన్‌ని కాబట్టే సర్కారుకు మనుగడ: జగన్
ఎమ్మెల్యేలను రాజీనామా చేయొద్దని చెప్పి కాంగ్రెస్‌కి మేలు చేస్తున్నా
వారిపై చర్యలు తీసుకోవాలనుకుంటే కాంగ్రెస్ ఇష్టం
అలా చేస్తే రాష్ట్రంలో సర్కారు కూలుతుంది
ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటే ఏనాడో చేసేవాడిని
కడప లోక్‌సభ నుంచే ఉప ఎన్నికల్లో పోటీ
జాతీయ మీడియా ప్రశ్నలకు జగన్ జవాబులు


‘‘నేను జెంటిల్మన్‌ని. అందుకే నాకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలను రాజీనామా చేయవద్దని కోరుతున్నాను. వారినలా కోరటం ద్వారా నేను కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తున్నాను’’ అని యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తనను బలపరుస్తున్న ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ చర్యలకు దిగితే.. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం కుప్పకూలుతుందన్నారు. మంగళవారం ఢిల్లీలో జగన్ ‘జలదీక్ష’ సందర్భంగా.. తనను కలిసిన జాతీయ మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన పైవిధంగా సమాధానం చెప్పారు. ‘మీరు బలప్రదర్శన చేసి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారా?’ అని విలేకరులు అడిగినపుడు ఆయన స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం నేను కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తున్నాను. నా పక్షానున్న ఎమ్మెల్యేలు రాజీనామాలిస్తే అక్కడ ప్రభుత్వం పడిపోతుంది.

నిజానికి నేను జెంటిల్మన్‌ని కనుక నావాళ్లను రాజీనామా చేయొద్దని కోరటం ద్వారా కాంగ్రెస్‌కు మేలు చేస్తున్నాను. నేనిక్కడ ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పదల్చుకున్నాను.. ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటే అది ఏనాడో చేసి ఉండేవాడిని. కానీ నేను జెంటిల్మన్‌ని అయినందున.. అక్కడ ప్రభుత్వం మనుగడ సాగి స్తోంది’’ అని చెప్పారు. ‘‘వాస్తవానికి ఈ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోదలిస్తే అది వారిష్టం.. నేను చెప్తున్నందువల్లే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నామని మావాళ్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వచ్చే 2014 ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీ టికెట్లపై పోటీచేయబోమని, నా పార్టీ టిక్కెట్లపైనే పోటీచేస్తామని కూడా మావాళ్లు చెప్తున్నారు...’’ అని ఆయన వివరించారు. మరో ప్రశ్నకు బదులిస్తూ.. ఎన్‌డీఏతో కలిసే ప్రసక్తి లేదని చెప్పారు. ఉప ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీచేయనున్నారని అడగ్గా.. ‘‘కడప లోక్‌సభ స్థానం నుంచే మళ్లీ పోటీచేస్తాను’’ అని జగన్ పునరుద్ఘాటించారు. 

నే చిటికేస్తే...! సర్కార్‌ మటాష్‌...
jagan-5 
ఢిల్లీ జంతర్‌మంతర్‌ జలదీక్షతో జగన్‌ మరోసారి ఢిల్లీ నేతలకు ఇరకాటపు పరి స్థితి కల్పించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం నాకు లేదు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు నాకు ఒక్కరోజు చాలు... కాని నేను జంటిల్‌మెన్‌ని నేనాపని చేయలేను... నాకు మద్దతు ఇస్తున్న శాసన సభ్యులు రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం’’ అంటూ కడప మాజీ ఎంపీ జగన్‌ ఢిల్లీలో సంచలన ప్రకటన చేశారు. తనకు మద్దతుగా వున్న ఎమ్మెల్యేలంతా తాను ప్రారంభించబోయే రాజకీయ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రకటించారు.కృష్ణా ట్రిబ్యునల్‌ తీర్పుకు నిరసనగా తన మద్దతుదారులతో జగన్‌ ఒకరోజు దీక్ష చేశారు. ఈ దీక్షలో రాష్ట్రానికి చెందిన శాసన సభ్యులు, మండలి సభ్యులు, ఇద్దరు పార్లమెంటు సభ్యులుపాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగన్‌ ప్రసంగిస్తూ చంద్ర బాబు రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఆయన చేసిన నిర్వాకం కారణంగానే రాష్ట్రం అన్యాయానికి గురయిందని ధ్వజ మెత్తారు. రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తానంటే కరెంటు తీగల పై బట్టలు ఆరేసుకుంటారని ఆయన ఎద్దేవా చేశారని కాని ముఖ్య మంత్రిగా వైఎస్‌ఆర్‌ బాధ్యతలు చేపట్టి ఎన్నికలలో హామీ ఇచ్చిన ట్టుగా ఉచిత కరెంటు ఇచ్చారన్నారు. చంద్రబాబు ిసీయంగా ఉన్న సమయంలో కేవలం 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వైఎస్‌ఆర్‌ 40 వేల కోట్ల రూపాయలతో జలయజ్ఞం కార్యక్రమాన్ని చేపట్టారని వెల్లడించారు. సీయంగా బాధ్యతలు చేపట్టి 12 వం దల కోట్ల రూపాయల రైతురుణాలను మాఫీ చేశారన్నారు.

చంద్రబాబు హైటెక్‌ విధానాలకు ఊతమిచ్చి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారని తూర్పూరబోశారు. మా తండ్రిగారిని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు ఎక్కడుంది’’ అని ప్రశ్నించారు. మిగులు జలాలు మాకవసరం లేదని, మిగులుజలాలపై మేము ఆధారపడలేదని లేఖ రాశారని ఆరోపించారని, చంద్రబాబు ప్రాజెక్టులు నిర్మించి వుంటే ఈ లేఖ రాసే అగత్యం వుండేది కాదని స్పష్టం చేశారు. ఆ లేఖ ఇవ్వని పక్షంలో ప్రాజెక్టు నిర్మాణం జరిగేవి కావని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే మిగులు జలాలను మనం స్వేచ్చగా వాడుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే లేఖ రాశారన్నారు. ఏడాదిగా వర్షాల కారణంగా రైతు వెన్నెముక విరిగిందని, ఖరీఫ్‌లో వరదల కారణంగా పంటలు మునిగిపోయాయని, తమ రాష్ట్ర రైతులకు సహాయం చేయాలని ప్రధానిని కోరేందుకు ఎన్నిమార్లు ప్రయత్నించినా ఆయన సమయం కేటాయించలేదని నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలోని రైతుల విషయంలో కేంద్రం పక్షపాత ధోరణిని అవలంభించిందని ఆయన విమర్శించారు.బ్రిజేష్‌కుమార్‌ ఇచ్చిన తీర్పు కారణంగా రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, మా కష్టం గురించి నివేదించుకునేందుకే ఇక్కడకు వచ్చాం తప్ప, ఎవరినీ పేరుపెట్టి విమర్శించేందుకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. బచావత్‌ అవార్డు ప్రకారం 75 శాతం ఉన్న జలాల వాటాను 65కు బ్రిజేష్‌ ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. నికరజలాలు అధికంగా వున్నాయనే సాకుతో 118 టిఎంసి నీళ్లు కేటాయించడం అన్యాయమన్నారు. బచావత్‌ అవార్డు కు వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దిగువ రాష్ట్రం కనుక, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌ నష్టపోతోంద ని, మిగులు జలాల మీద రాష్ట్రానికి స్వేచ్ఛ, హక్కు వుందని బచావత్‌ ప్రకటించిందన్నారు.

నీళ్లులేక అలమటిస్తున్న రైతాంగాన్ని కాదని మహారాష్టల్రో విద్యుత్‌ ప్రాజెక్టు కు 90 టిఎంసీల నీళ్లు ఇచ్చారని ఆయన విమర్శించారు. అయితే మహారాష్టక్రు కావలసిన కరెంటును మా రాష్ట్రం ఇస్తుందని, మాకు ఇవ్వవలసిన 67 టిఎంసీల నీళ్లు ఇవ్వాలని ఆయన కోరారు. పాలారు, మున్నేరు నుంచి వచ్చే 47 టిఎంసీ నీళ్లు సముద్రంలోకి కలిసిపోతున్నాయని వాటిని కూడా మిగులుజలాలకింద లెక్క కడుతున్నారన్నారు. నీటి బోర్డులు కారణంగా రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని, ఆబోర్డులోని నిర్ణయాలపై మళ్లీ రాష్ట్రప్రభుత్వాలు న్యాయస్థానంలో సవాలు చేస్తున్నారన్నారు. ఈలోగా పుణ్యకాలం గడిచిపోతుందన్నారు. జగన్‌ దీక్షకోసం వేదికను రొటీన్‌కు భిన్నంగా ఏర్పాటు చేశారు. దీక్షలో కూర్చున్నవారందరూ బాగా కనపడే విధంగా డిజైన్‌ చేశారు.

ఢిల్లీలో గత పదిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదయినప్పటికీ మంగళవారం కొద్దిగా పెరిగి ఎండ వచ్చింది. దాంతో ఢిల్లీకి వచ్చిన కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకోవాల్సిన ప్రత్యేక రైలు మంగళవారం ఉదయం 9 గంటలకు చేరుకుంది. మాజీ ఎంఎంల్యేలు, ఎమ్మెల్యేలు, ఛోటా నాయకులు సైతం వేదిక మీదకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నిమార్లు వేదిక నుంచి దిగిపొమ్మని బ్రతిమాలినా నాయకులు వేదిక నుంచి వెళ్లకపోవడంతో ఎంపీ సబ్బం హరి కలగజేసుకుని కోపంగా ‘‘మీరు మారండి’’ అంటూ విసుక్కున్నారు.జగన్‌ అభిమానులు, కార్యకర్తలు జై జగన్‌ అని రాసిన తెల్ల జెండాలతో దర్శనమిచ్చారు.జంతర్‌మంతర్‌ వద్ద సుమారు కిలోమీటరు మేరకు వైఎస్‌ఆర్‌, జగన్‌ల భారీ ఫ్లెక్స్‌లు వెలిశాయి. హిందీ, ఆంగ్లం, తెలుగు భాషల్లో రైతు రక్ష, యువత దీక్ష అని రాశారు. సబ్దర్‌జంగ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కార్యకర్తలను తరలించేందుకు 55 బస్సులను ఏర్పాటు చేశారు. జగన్‌ తొలుత జాతీయ మీడియాను ఉద్దేశించి ఆంగ్లంలో ప్రసంగించారు.

మొత్తంమీద జగన్‌ ఢిల్లీ నేతలను కదిలించారు. 24 గంటల దీక్షకు ఆయన సమాయత్తమై ఆ దిశగా కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనం. సాయంత్రం అయిదింటి వరకే అనుమతిచ్చిన జంతర్‌మంతర్‌ పోలీసులు తొలి ప్రయత్నంగా అక్కడ బలగాలను మోహరించారు. జంతర్‌మంతర్‌ ఏసీపీ స్వయంగా దీక్షా స్థలికి చేరుకుని, దీక్షను విరమింపచేసేందుకు ప్రయత్నించారు. అది సఫలం కాకపోవడంతో దీక్షా సమయాన్ని వారు గంట పొడిగించారు. అలా రెండు సార్లు గడువు పొడిగిస్తూ, చివరకు సాయంత్రం ఎనిమిదింటికల్లా ఖాళీచేసి వెళ్లిపోవాలని హుకుం జారీచేశారు.

ఈలోగా పోలీసు ఉన్నతాధికారులు హోంమంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరిపారు. జగన్‌ దీక్షకు ఎలాంటి ఆటంకం కలిగించినా అది హింసకు దారితీయడం... దరిమిలా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత ప్రచారానిక కేంద్రస్థాయిలో నాయకులు సుముఖత వ్యక్తం చేసినట్లు లేదు. మొత్తంమీద పోలీసుల చర్చలతో, జగన్‌ బృందాన్ని ప్రశాంతంగా అరెస్టు చేసేందుకు మార్గం సుగమమైంది. జగన్‌ ముక్తాయింపు ప్రసంగంతో దీక్ష రాత్రి ఎనిమిది ముప్పావుకు ముగిసింది. ఢిల్లీ పోలీసు చట్టం సెక్షన్‌ 65 కింద జగన్‌ను అరెస్టు చేసి సొంత పూచి కత్తుపై ఆ తర్వాత విడుదల చేశారు.

జస్ట్‌.. జగన్‌ దయ!
jagan1 
కడప మాజీ ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ యాత్ర లక్ష్యం నెరవేరింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం, ముఖ్యమంత్రి కిరణ ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ ఎమ్మెల్యేలకు గీసిన లక్ష్మణరేఖను బలవంతంగా చెరిపేసి, తన వెంట 28 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలను ఢిల్లీకి తీసుకువెళ్లిన జగన్‌ కాంగ్రెస్‌పై మరోసారి నైతిక విజ యం సాధించారు. రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తన దయా దాక్షిణ్యాలతోనే బతుకుతోందని విస్పష్టం గా చెప్పడం ద్వారా, కాంగ్రెస్‌ నాయకత్వానికి తన ప్రాధాన్య మేమిటో చెప్పారు. ఆ వ్యాఖ్య ద్వారా కాంగ్రెస్‌ అధినేత్రి సోని యాగాంధీ అహం దెబ్బతీయగలిగారు.

తనను వేధించి పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేసినప్పటికీ.. కేవలం తన దయతోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు బతుకుతోందని చెప్పి పరోక్షంగా కాంగ్రెస్‌ను రెచ్చగొట్టే వ్యూహానికి తెరలేపారు. మంగళవారం 28 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలతో పాటు జడ్పీ ఛైర్మన్లు, జడ్పీటీసీల సహా కింది స్థాయి ప్రజాప్రతినిధులతో ఢిల్లీకి వెళ్లి జగన్‌ నిర్వహించిన దీక్షతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. ప్రధానం గా.. పార్టీ అధినేత్రి సలహాదారు అహ్మద్‌పటేల్‌, సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ తన మద్దతుదారులయి న ఎమ్మెల్యేలను ఢిల్లీకి వెళ్లకుండా చేసిన ప్రయత్నాలను విజ యవంతంగా అధిగమించి, వారిని తన వెంట తీసుకు వెళ్లడం ద్వారా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకత్వం గానీ, సీఎం గానీ తననేమీ చేయలేరన్న సంకేతాలు పంపించగలిగారు. అదే సమయంలో తాను కన్నెర్ర చేస్తే కిరణ్‌ సర్కారు కూలిపోతుం దన్న హెచ్చరికలను పంపించారు.

jagan 

ప్రధానంగా.. తన దయాదాక్షిణ్యాల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో కొనసాగుతోందన్న వ్యాఖ్యలు కచ్చితంగా సోనియాగాంధీ అహం దెబ్బతీసేందుకే జగన్‌ ఆ మేరకు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. తన వ్యాఖ్యలతో సోనియా గాంధీ అహం దెబ్బతిని, ఒక జూనియర్‌ ఎంపీ దయ వల్ల తన పార్టీ ప్రభుత్వం మనుగడ సాగుతోందని ప్రజలు భావించే కన్నా, రాష్ర్టపతి పాలన విధించడమే ఉత్తమ మన్న ఆలోచన కలిగించడం కూడా జగన్‌ వ్యాఖ్యల వెనుక అంతరార్థంగా స్పష్టమవుతోంది. రాష్టప్రతి పాలన విధించడం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మరింత అప్రతిష్ఠ పాలు చేయ డమే జగన్‌ అసలు లక్ష్యం. జగన్‌ దయ మీద కాంగ్రెస్‌ ప్రభు త్వం ఆధారపడి బతుకుతోందన్న భావన ప్రజల్లో విస్తృతం కావడాన్ని వ్యక్తిగతంగా సోనియా కూడా జీర్ణించుకోలేరని గ్రహించిన తర్వాతే జగన్‌ ఆ విధంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని అర్థమవుతూనే ఉంది.

అందలో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని రెచ్చ గొట్టేందుకే జగన్‌ 27 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతో ఢిల్లీకి వెళ్లినట్లు స్పష్టమవుతోంది. తన వెంట వచ్చిన ఎమ్మె ల్యేలు, ఎంపీలను దమ్ముంటే సస్పెండ్‌ చేయాలని జగన్‌ ప్రత్య క్షంగా నాయకత్వానికి సవాల్‌ విసిరారు. ప్రజాప్రతినిధులను ఢిల్లీకి తీసుకు వెళ్లి, ఢిల్లీ నాయకత్వానికే సవాల్‌ విసరడం ద్వారా రాష్ట్రంలోని యువత దృష్టిలో మరోసారి హీరోగా ము ద్ర వేసుకోవాలన్న జగన్‌ వ్యూహం ఫలించినట్లు మంగళ వా రం నాటి పరిణా మాలు స్పష్ట ం చేశాయి.మరోవైపు..

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ‘ఎమ్మెల్యే లపై పట్టులేని అసమర్థ సీఎంగా’ అధిష్ఠానం ముందు నిలప డంలో జగన్‌ విజయం సాధించారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తు న్నాయి. సీఎం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలను ఢిల్లీకి వెళ్లకుండా నివారించడంలో విఫలమయ్యారన్న సంకేతాలు పంపించడం ద్వారా..సీఎంకు పార్టీ ఎమ్మెల్యేల లోనే పలుకు బడి లేదని, ఆయన మాట వినేవారు లేరని, చెప్పినా మాట వినకుండా జగన్‌తో వెళ్లారని క్షేత్రస్థాయిలో చర్చలకు తెర లేపాలన్న లక్ష్యం కూడా తన ఢిల్లీ యాత్రతో నెరవేరింది.
జగన్‌ దీక్షకు హాజరైన వారు వీరే

1) జయసుధ (సికింద్రాబాద్‌)
2)  గుర్నాథరెడ్డి (అనంతపురం అర్బన్‌)
3)  కమలమ్మ ( బద్వేలు)
4)  కె.శ్రీనివాసులు  (రైల్వేకోడూరు)
5)  నీరజారెడ్డి (ఆలూరు)
6)  శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)
7)  రామచంద్రారెడ్డి (రాయదుర్గం)
8)  మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి)
9)  బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)
10) ఆళ్ల నాని (ఏలూరు)
11)  అమర్‌నాథ్‌రెడ్డి (రాజం పేట)
12) శేషారెడ్డి (అనపర్తి)
13)  కొండా సురేఖ (పరకాల)
14)  పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (రామచంద్రాపురం)
15)  రేగా కాంతారావు (పినపాక)
16) కుంజా సత్యవతి (భద్రాచలం)
17) ఆదినారాయణరెడ్డి(జమ్మలమడుగు)
18) బాబూరావు (పాయకరావు పేట)
19) రామకృష్ణారెడ్డి (మాచర్ల)
20) శివప్రసాదరెడ్డి (దర్శి)
21) ప్రసాదరాజు (నర్సపురం)
22) బాలరాజు (పోలవరం)
23) కాటసాని రామిరెడ్డి (బనగానపల్లి పీఆర్పీ)
24) శోభా నాగిరెడ్డి (ఆళ్లగడ్డ, పీఆర్పీ)
25) నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (టీడీపీ)-(కోవూరు)
26)  బాలనాగిరెడ్డి (మంత్రాలయం-టీడీపీ)
27)  లబ్బి వెంకటస్వామి (నందికొట్కూరు)
28)  సుచరిత (పత్తిపాడు)
ఎంపీలు
1) మేకపాటి రాజమోహన్‌రెడ్డి (నెల్లూరు)
2) సబ్బం హరి (అనకాపల్లి)
ఎమ్మెల్సీలు
1) జూపూడి ప్రభాకర్‌రావు
2) పుల్లా పద్మావతి
3) కొండా మురళి
4) కృష్ణారెడ్డి

జలం కోసం జగన దీక్ష



కృష్ణా జలాల్లో న్యాయం కోసం నేడు ఢిల్లీలో యువనేత నిరశన

డిమాండ్: కృష్ణా జలాల పంపకంలో న్యాయం జరగాలని...

వేదిక: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్దనున్న పార్లమెంటు వీధి

సమయం: నేటి ఉదయం 10గంటలకు ప్రారంభం


ఎవరెవరు: జగన్‌తోపాటు రైతులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

జలదీక్షలో జగన్ ప్రధాన డిమాండ్లివీ...

+ ఆలమట్టి ప్రాజెక్టును ప్రస్తుత ఎత్తుకే పరిమితం చేయాలి. పెంపునకు అనుమతించవద్దు.
+ కృష్ణా మిగులు జలాలు వాడుకునే పూర్తి స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు కల్పించాలి.
+ నదీ జలాలకు సంబంధించి డిపెండబులిటీ లెక్కలపై బచావత్ ట్రిబ్యునల్ తీసుకున్న 75 శాతాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలి.
+ మహారాష్టల్రోని కోయినా విద్యుత్ ప్లాంటు కోసం ఉపయోగించిన నీటిని అరేబియాలోకి వృథాగా పోనీకుండా, ఆ నీటిని దిగువ రాష్ట్రాల వైపు మళ్లించాలి.
+ ఎగువ రాష్ట్రాల్లోని 100 టీఎంసీల సామర్థ్యం దాటిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను క్వాసీ జుడీషియల్ అధికారాలున్న ప్రత్యేక రెగ్యులేటరీ అథారిటీలకు అప్పగించాలి.
+ ఈ అథారిటీ 15 రోజులకొకసారి రాష్ట్రాల కేటాయింపులకు అనుగుణంగా తగిన దామాషాలో నీటిని విడుదల చేయాలి.
+ కృష్ణా జలాల కేటాయింపుల్లో జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ట్రిబ్యునల్‌కు అప్పీల్‌కు వెళ్లాలి. విచారణల్లో కేంద్రమూ ఇంప్లీడ్ కావాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే కార్యాచరణ చేపట్టాలి.
+ పోలవరం, ప్రాణహిత- చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ప్రాజెక్టులకు వెంటనే జాతీయ హోదా కల్పించి, సరిపడా నిధులు కేటాయించి.. వాటి నిర్మాణాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి.


కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దటానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టనున్న 24 గంటల ‘జలదీక్ష’కు రంగం సిద్ధమైంది. దేశ రాజధానిలో ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా.. ‘జనం కోసం.. జలం కోసం..’ అని నినదిస్తూ జగన్ చేపట్టనున్న ఈ నిరశన దీక్షకు.. పార్లమెంటు సమీపంలోని జంతర్‌మంతర్ (పార్లమెంటు వీధి) వేదిక కానుంది. జగన్‌తో పాటు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, మద్దతుదారులు దాదాపు 2,000 మందితో ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు కొన్ని గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఈ రైలు మంగళవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు జంతర్‌మంతర్ సమీపంలో జగన్, రాష్ట్రం నుంచి వచ్చిన రైతులు దీక్ష ప్రారంభిస్తారు. మరోవైపు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో కాకుండా సొంతంగా బయలుదేరిన ప్రజా ప్రతినిధులు, రైతులు, జగన్ మద్దతుదారులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, రైతుల ఆందోళనను చాటిచెప్పటానికి జగన్‌కు మద్దతుగా దీక్షలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్‌పీ చైర్మన్లు, జడ్‌పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు ఢిల్లీకి తరలివచ్చారు.

నేరుగా కేంద్రానికి తెలియజేయటం కోసమే..

బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్‌కు, రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతున్నదనే భయాందోళనను, ఆవేదనను కేంద్రానికి తెలియచేయటానికి జగన్ ఈ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష ఏ రాష్ట్రానికో, ఏ ప్రాంత ప్రజలకో వ్యతిరేకం కాదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ చేపడుతున్న దీక్ష అని ఆయన మద్దతుదారులు స్పష్టంచేశారు. ఈ దీక్షను ఢిల్లీలో చేపట్టటానికి కారణం.. రాష్ట్ర ప్రజలు, రైతాంగం ఆందోళనను నేరుగా ఢిల్లీలోని కేంద్ర సర్కారుకు, దేశ ప్రజలందరికీ గట్టిగా తెలియజేయాలన్న ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలో ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలకు లక్షలాది మంది రైతాంగం తీవ్రంగా నష్టపోతే.. ఆదుకోవాలని కోరుతూ లక్షల మంది రైతాంగం కొద్ది రోజుల కిందట విజయవాడలో లక్ష్య దీక్ష పేరుతో రెండు రోజుల పాటు నిరాహారదీక్ష చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం స్పందించను కూడా లేదని గుర్తుచేశారు. ‘అందుకే ఈసారి ఏకంగా ఢిల్లీలోనే మా ఆందోళనను తెలియజేయాలని ఈ దీక్ష చేస్తున్నాం’ అని దీక్షలో పాల్గొంటున్న పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు.

తక్షణం అప్పీలుకు వెళ్లాలి...

జలదీక్ష డిమాండ్ల గురించి వివరిస్తూ.. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న అంశాలను వారు వివరించారు...

- కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్పీల్‌కు వెళ్లాలి. ఏయే అంశాల్లో మనకు నష్టం వాటిల్లుతుందో వాటిపై మన వాదనలు పక్కాగా ఉండేలా జాగ్రత్తపడాలి. మనకు జరగబోయే నష్టాన్ని స్పష్టంగా, సమర్థంగా వివరించాలి. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ వాదనల్లో ఇంప్లీడ్ కావాలి. అసలు నీటిలభ్యత లెక్కించటానికి ఎన్ని సంవత్సరాల రికార్డులు తీసుకోవాలి, ఎంత డిపెండబులిటీ శాతాన్ని లెక్కించాలి, మిగులు జలాల్ని ఏం చేయాలి.. వంటి విషయాల్లో ఇప్పటికే జాతీయ స్థాయిలో నిర్దుష్టంగా మార్గదర్శకాలు ఉన్నట్లయితే.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తనకు తోచిన ప్రాతిపదికలను తీసుకునేందుకు అవకాశం ఉండేది కాదు. తీర్పు రాష్ట్రానికి వ్యతిరేకంగా రావటానికి కేంద్ర ప్రభుత్వ విధానాలూ కారణమే. ఇకనైనా జాతీయ స్థాయిలో వీటికి ఒక నిర్దుష్ట విధానం రూపొందించి, వాటిని ట్రిబ్యునల్ ఎదుట జరిగే వాదనల్లో వినిపించాలి.
- కావేరీ ట్రిబ్యునల్ 50 శాతం డిపెండబులిటీ లెక్కలను, పాత కృష్ణా ట్రిబ్యునల్ 75 శాతం డిపెండబులిటీ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ కొత్త ట్రిబ్యునల్ ఎటూకాకుండా 65 శాతం డిపెండబులిటీ లెక్కలు తీసుకుంది. పాత ట్రిబ్యునల్ 78 సంవత్సరాల నీటి ప్రవాహ లెక్కలు తీసుకుంటే.. మనం 112 ఏళ్ల లెక్కలు కూడా ఇస్తామంటే... కొత్త ట్రిబ్యునల్ విచిత్రంగా 47 సంవత్సరాల లెక్కలు తీసుకుంది.

- కరువు, వరద సంవత్సరాల్లో అవస్థలు పడే దిగువ రాష్ట్రాలకే మిగులు జలాల వినియోగం స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉండగా.. బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వాటినీ ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేసింది. గతంలో మిగులు జలాలు పంపిణీ చేసిన కావేరీ వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్లటానికి దిగువ రాష్ట్రాల అభ్యంతరాలే కారణం. ఇప్పటికే తీవ్ర వివాదానికి దారితీసిన ఆ ప్రాతిపదికను.. ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకున్న తీరు విస్మయకరంగా ఉంది.

- మహారాష్ట్ర తమ కోయినా జలవిద్యుదుత్పత్తి ప్లాంటు నుంచి ఇప్పటికే 67 టీఎంసీల నీటిని వృథాగా అరేబియా సముద్రంలోకి వదిలేస్తోంది. కరెంటును ఉత్పత్తి చేయగలం కానీ నీటిని ఉత్పత్తి చేయలేం. అవసరమైతే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కలిసి కొంత కరెంటును ఇస్తాయనీ, ఆ నీటిని దిగువ రాష్ట్రాల వైపు మళ్లించాలని మనం వాదించినా వినకుండా.. ట్రిబ్యునల్ కోయినా ప్లాంటుకు మరో 25 టీఎంసీల నీరు అదనంగా కేటాయించటం చిత్రంగా ఉంది.

- దిగువ రాష్ట్రాలకు సక్రమంగా నీరు విడుదల చేసేలా సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండటానికి ఒక కొత్త పద్ధతిని అత్యవసరంగా ప్రవేశపెట్టాల్సి ఉంది. ఎగువ రాష్ట్రాల్లో 100 టీఎంసీల నిల్వ సామర్థ్యం దాటిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ‘రివర్ రెగ్యులేటరీ అథారిటీ’ లకు సుప్రీంకోర్టు, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులను అధ్యక్షులుగా నియమించాలి. వాటికి పాక్షిక న్యాయ (క్వాసీ-జుడీషియల్) అధికారాలను కల్పించాలి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తరహాలో వీటి పనితీరు, బాధ్యతలు, అధికారాలు ఉండాలి. ప్రతి 15 రోజులకొకసారి ఈ అథారిటీ సమావేశమై నీటికేటాయింపులను.. తగిన దామాషాలో విడుదల చేయాలి.

నాటి చంద్రబాబు పాపాలే మనకు శాపాలు...

నిజానికి చంద్రబాబు తన హయాంలో ప్రాజెక్టులను నిర్మించలేదు కాబట్టే మనకు ఈ తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. పాత ట్రిబ్యునల్ నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా, కేసీ కెనాల్‌లను దృష్టిలో పెట్టుకుని వాటికి నీటి రక్షణ కల్పిస్తూ 750 టీఎంసీలు కేటాయించింది. శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులకూ నీటినిచ్చింది. ప్రస్తుత ట్రిబ్యునల్ కూడా దాదాపు పూర్తికావచ్చిన తెలుగుగంగకు 25 టీఎంసీలు ఇచ్చింది. చంద్రబాబు గనుక మన పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టి ఉంటే, వాటన్నింటికీ ఈ ట్రిబ్యునల్ నీటిరక్షణ కల్పించేది. కర్ణాటక ఆలమట్టి ప్రాజెక్టును కట్టినప్పుడు కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు నిద్రపోయాడు కాబట్టే అప్పటి ప్రధాని దేవెగౌడ వేగంగా ఆలమట్టి నిర్మాణాన్ని పూర్తి చేయించాడు. తను ప్రాజెక్టులు కట్టలేని నిర్వాకం ఒక పాపం కాగా, కర్ణాటక కడుతుంటే అడ్డుకోలేకపోవటం మరో పాపం.. అలా చంద్రబాబు పాపాలు ఇప్పుడు రాష్ట్రానికి శాపాలుగా మారాయి.

మన రాష్ట్రంలోని హంద్రీనీవా, గాలేరు - నగరి, కల్వకుర్తి, తెలుగుగంగ, ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు, వెలిగొండ ప్రాజెక్టులపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులని ముద్ర వేసి వాటిని నిలిపివేయించే ప్రయత్నం చేసింది. దాన్ని నివారించి, ప్రాజెక్టులు వేగంగా నిర్మాణం కావటానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఈ ప్రాజెక్టులను రాష్ట్రం సొంత రిస్కుతో నిర్మిస్తోందనీ, వాటికి నీటి హక్కు డిమాండ్ చేయబోమనీ ట్రిబ్యునల్‌కు లేఖ ఇవ్వాల్సి వచ్చింది.


సాగునీటి కల్పనలో చంద్రబాబు హయాంలో జరిగిన తీవ్ర నష్టాన్ని పూడ్చేందుకు దివంగత నేత వైఎస్ ఏకంగా కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. కానీ ఆయన మరణానంతరం ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రాజెక్టుల విషయంలో నాటి చంద్రబాబు అడుగుజాడల్లోనే పయనిస్తోంది. ప్రత్యేకించి పోలవరం, ప్రాణహిత- చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. వీటన్నింటికీ వెంటనే జాతీయ హోదాలు ప్రకటించాలి. నిర్ణీత గడువులో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసేలా నిధులివ్వాలి. దీనికి ప్రధాని స్వయంగా జవాబు చెప్పాలి. 
 
లాభాలకు సై.. నష్టాలకు నై!
 కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుతో ఎగువ రాష్ట్రాలకే లాభం
నీరు వచ్చినప్పుడు వాటాలు తీసుకుని.. రానప్పుడు చేతులెత్తేస్తాయి
నదిలో ఎక్కువ నీరు ఉందంటూ పంపిణీ చేసిన ట్రిబ్యునల్

 లాభాల్లో పక్క రాష్ట్రాలకూ వాటా పంచిన కృష్ణా ట్రిబ్యునల్.. నష్టాలను మాత్రం మనపైనే నెట్టేసింది! నదిలో ఎక్కువ నీరు ఉందని ఎగువ రాష్ట్రాలకు కోటా పెంచిన ట్రిబ్యునల్.. కొరత సమయాల్లో నష్టం వాటిల్లితే దాన్ని భరించే విషయాన్ని మాత్రం గాలికొదిలేసింది! 3 రాష్ట్రాలకు సరిపోయేలా నీరు వస్తే మంచిదే . కానీ వర్షాభావంతో నదిలో నీటి లభ్యత తగ్గితే జరిగే నష్టాన్ని మాత్రం మన రాష్టమ్రే భరించాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు లేని సమయాల్లో నీటి కొరతలో కూడా ఎగువ రాష్ట్రాలను భాగస్వామ్యం చేయాలన్న మన అధికారుల వాదనను తోసిపుచ్చింది. దీంతో వర్షాలు రాక నీరు తగ్గితే రాష్ట్రం ఎడారి అయ్యే ప్రమాదం పొంచి ఉంది.

ఎగువ రాష్ట్రాలకు కళ్లెం ఎక్కడ?

బచావత్ అవార్డు (ట్రిబ్యునల్-1) ప్రకారం కృష్ణాలో నికర జలాలు 2,130 టీఎంసీలు మాత్రమే. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చేసుకుని ఈ నీటిని అంచనా వేశారు. అయితే... బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మాత్రం నీటి లభ్యతను 65 శాతానికి కుదించి 2,293 టీఎంసీల నికర జలాలు ఉన్నట్టు తేల్చింది. అలాగే మరో 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు అంచనాకు వచ్చింది. మొత్తం నికర, మిగులు జలాలు 2,578 టీఎంసీలను మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అంటే నదిలోకి వచ్చే నీటినంతటిని పంచేసినట్టే! ఈ నీటి విడుదలకు సంబంధించి ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ సూచించింది. ఈ బోర్డులో మూడు రాష్ట్రాలతో పాటు కేంద్ర స్థాయి అధికారులు కూడా సభ్యులుగా ఉండాలని తెలిపింది. పది రోజుల వర్కింగ్ షీట్స్‌ను రూపొందించి ఆ మేర నీటిని విడుదల చేయాలని సూచించారు. అయితే బోర్డు పనితీరులో కానీ, ఎగువ రాష్ట్రాలు పాటించాల్సిన సూచనల విషయంలోగానీ, నీటి కొరతను పంచుకునే అంశంలోకానీ ట్రిబ్యునల్ ఏలాంటి స్పష్టత ఇవ్వలేదు. నదిలోకి వచ్చే నీటిని ఎగువ రాష్ట్రాలు తమ నికర జలాలుగా అక్కడే నిల్వ చేసుకునే అవకాశం ఉంది. దాంతో దిగువ ప్రాంతమైన మన రాష్ట్రానికి నీటి రాక తగ్గిపోతుంది. దీనిపై తీవ్ర అభ్యంతరాన్ని నమోదు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

వారికైతే ప్రాజెక్టుల వారీగా కేటాయింపు..

నిర్మాణంలో ఉన్న మన ప్రాజెక్టులను పట్టించుకోని కృష్ణా ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు మాత్రం ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించింది. మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న ఎస్‌ఎల్‌బీసీ వంటి ఏ ప్రాజెక్టుకు నీటిని కేటాయించ లేదు. అదే కర్ణాటకకు మాత్రం అప్పర్ తుంగకు 12 టీఎంసీలు, అప్పర్ భద్రకు 10 టీఎంసీలు, సింగత్లూర్ లిప్టుకు 18 టీఎంసీల చొప్పున కేటాయించింది. అలాగే మహారాష్టక్రు చెందిన కొయినా జల విద్యుత్ ప్రాజెక్టుకు ఇప్పటికే ఉన్న 67 టీఎంసీలకు అదనంగా మరో 25 టీఎంసీల నీటిని కేటాయించింది. మన రాష్ర్టంలో కేవలం తెలుగుగంగ, జూరాలకు మాత్ర మే 25 టీఎంసీలు, 9 టీఎంసీల చొప్పున కేటాయింపులను చేశారు.

మొదటి తీర్పును మార్చొద్దని చట్టం చెబుతున్నా...

ఒక నదిపై ట్రిబ్యునల్ తీర్పు చెప్పిన తర్వాత, అదే నదిపై కొనసాగింపుగా రెండో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసినప్పుడు మొదటి తీర్పును మార్చడానికి వీలు లేదు. అంతర్రాష్ట్ర జలవివాద చట్టం-2002 ఇదే విషయాన్ని చెపుతోంది. అయితే... బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మాత్రం మొదటి ట్రిబ్యునల్‌లోని పలు అంశాలను సవరించింది. నదిలోని నీటిని అంచనా వేయడం కోసం మొదటి ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యతను ప్రమాణికంగా తీసుకుంటే.. ఇప్పటి ట్రిబ్యునల్ మాత్రం దాన్ని 65 శాతంగా పరిగణనలోకి తీసుకుంది. అలాగే మిగులు జలాలను పంచకూడదని మొదటి ట్రిబ్యునల్ తీర్పు. దీనిపై కూడా ప్రస్తుత ట్రిబ్యునల్ భిన్నమైన వైఖరి అవలంబించింది. మిగులు జలాలను గుర్తించడమే కాకుండా ఎగువ రాష్ట్రాలకు పంచేసింది.
 
అడుగడుగునా సైంధవులు!  అరచేతిని అడ్డుపెట్టి...
 
జగన్ జలదీక్షను నిలువరించేందుకు కాంగ్రెస్ పెద్దల విశ్వప్రయత్నం
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపకపోగా.. అడుగడుగునా అడ్డంకులు
దీక్షలో పాల్గొనవద్దంటూ ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు
కొద్దిరోజులుగా 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీలు
మీ నియోజకవర్గాల్లో పనులన్నీ చేసేస్తామంటూ బుజ్జగింపులు...
ఢిల్లీ వెళ్తే అధిష్టానం కఠినంగా వ్యవహరిస్తుందని బెదిరింపులు
స్వయంగా రంగంలోకి దిగిన సీఎం, పీసీసీ చీఫ్

 కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి జరిగే తీవ్ర అన్యాయంపై యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో తలపెట్టిన జలదీక్షలో ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎవరూ పాల్గొనకుండా కాంగ్రెస్ నాయకత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. జలదీక్షలో పాల్గొనడానికి సిద్ధమైన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులపై అనేక రకాలుగా ఒత్తిళ్లు తెస్తూ.. ఢిల్లీకి వెళ్లకుండా వారిని అడ్డుకుంటున్నారు. గత వారంరోజులుగా కాంగ్రెస్ ముఖ్యులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణలో ముఖ్యంగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు తీరని నష్టంతోపాటు డెల్టా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. దీనిపై రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రభుత్వం సమైక్యంగా పోరాటం చేయాల్సి ఉన్నా.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అసలు స్పందించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దీనిపై జగన్ చేపట్టిన దీక్షకు సంపూర్ణ సహకారం అందించి, ఆయన పోరాటంలో భాగస్వామ్యం కావాలని కొందరు ఎమ్మెల్యేలు సిద్ధపడగా గత కొద్దిరోజులుగా వారితో ప్రత్యేక భేటీలు జరుపుతూ ఢిల్లీ వెళ్లకుండా శతవిధాలా ఒత్తిడి తెస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మరోవైపు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లతో పాటు పలువురు మంత్రులు ఇదే పనిలోనే నిమగ్నమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీ ఆదేశాల మేరకే వీరు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచినట్లు చెబుతున్నారు.

కర్ణాటకకు చెందిన మొయిలీ ఇప్పటికే ట్రిబ్యునల్ తీర్పును ప్రభావితం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొయిలీ కర్ణాటక ప్రయోజనాల దృష్టితో వ్యవహరిస్తుంటే.. ఆయన ఆగ్రహానికి గురికావలసి వస్తుందేమోనన్న భయంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ట్రిబ్యునల్ అన్యాయంపై నోరు మెదపడం లేద న్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా మొయిలీ స్వయంగా చెప్పిన కారణంగానే ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. జగన్ తలపెట్టిన యాత్రలో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనకుండా, ఎలాగైనా కట్టడి చేయాలన్న ఆదేశాలు ఉండడంతో.. గత కొద్దిరోజులుగా 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్ర నాయకులు వేరువేరుగా పిలిపించి సమావేశాలు నిర్వహించారు.

గాంధీభవన్‌లో డీఎస్ ప్రత్యక్షం!

కేంద్ర మంత్రి చిదంబరం ఈ నెల 5న 8 రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి శ్రీకృష్ణ కమిటీ నివేదిక బహిర్గతం చేసిన రోజు నుంచి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గాంధీభవన్‌లో అడుగుపెట్టలేదు. మంగళవారం జగన్ దీక్ష ప్రారంభమవుతున్న నేపథ్యంలో సోమవారం గాంధీభవన్‌కు వచ్చారు. జగన్ వెంట వెళ్లే వారి పట్ల అధిష్టానం కఠినంగా వ్యవహరిస్తుందని, ఇది అధిష్టానం మాట అంటూ హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజులుగా కనిపించని డీఎస్ ఒక్కసారిగా సోమవారం రావడం, వచ్చీ రావడంతో జగన్ వెంట వెళ్లే ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల విషయంలో అధిష్టానం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటని కోస్తా నాయకుడొకరు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కూడా ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినప్పట్నుంచీ.. జగన్‌కు మద్దతుగా నిలుస్తారని అనుమానమున్న ఎమ్మెల్యేలందరినీ పిలిచి బుజ్జగిస్తున్నారు. మీ నియోజకవర్గంలో పనులేవైనా పెండింగ్‌లో ఉంటే వెంటనే చేస్తామని ఆశ చూపుతున్నారు.

మంత్రివర్గ సమావేశంలోనూ జగన్ యాత్రపై చర్చించడమే కాకుండా, యాత్రకు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎవరూ వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులను పురమాయించారు. దాంతో ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు అదే పనిగా ఎమ్మెల్యేలను పిలిపించుకుని ప్రత్యేకంగా ఒకటికి రెండుసార్లు మాట్లాడి, తర్వాత సీఎంతో భేటీ ఏర్పాట్లు కూడా చేయిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఉభయగోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను సీఎం వద్దకు తీసుకెళ్లారు. నిజానికి జగన్ చేపట్టిన దీక్షతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వస్తే కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న భావన జిల్లాల ప్రజాప్రతినిధుల్లో ఉంది. ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై ముఖ్యమంత్రికి కనీసం సమీక్షా సమావేశం నిర్వహించేంత సమయం కూడా లేదా అని విపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై ఎలాంటి చర్యలను తీసుకోవడం లేదన్న భావన ప్రజల్లో బలంగా ఉందని, అందుకే జగన్‌కు మద్దతు ఇవ్వాలని సంకల్పించానని కోస్తాకు చెందిన ఒక ఎమ్మెల్యే చెప్పారు. అయితే తనపై అనేక రకాల ఒత్తిళ్లు చేసి, ఢిల్లీ వెళ్లకుండా చేస్తున్నారని ఆయన వాపోయారు.

విశాఖలో ప్రకటన చేసినప్పట్నుంచీ..

జగన్ దీక్ష చేస్తానని విశాఖపట్నం జిల్లా ఓదార్పుయాత్రలో ప్రకటించిన రోజు నుంచి రాష్ట్ర పార్టీ నాయకులు కొందరు మిగతా సమస్యలన్నీ వదిలేసి ఈ అంశంపైనే దృష్టి సారించారు. కొందరు ఎమ్మెల్యేలకు మంత్రులు రోజుల తరబడి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరికొందరికైతే పదవుల ఆశ కూడా చూపించారని వినిపిస్తోంది. జగన్ జలదీక్ష ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష టీడీపీ నాయకుడు చంద్రబాబు కూడా ఇదే అంశాన్ని ఎత్తుకుని మూడు జిల్లాల్లో పర్యటనలు పెట్టుకున్నారని, అధికార కాంగ్రెస్‌లో ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కల్పించే విషయాన్ని పట్టించుకోకుండా ఉంటే భావి తరాలు క్షమించవని వారు అంటున్నారు. నయానో భయానో ఎమ్మెల్యేలను ఇప్పటికైతే ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకున్నప్పటికీ రానున్న రోజుల్లో తప్పకుండా తమ రాజకీయ భవితవ్యాన్ని అంచనా వేసుకోక తప్పదని మరో నాయకుడు చెప్పారు.
 
ఎక్కడి నుంచి వచ్చారు.. బాగున్నారా?

జలదీక్ష రైలులో రైతులకు యువనేత పలకరింత
 జలదీక్షలో పాల్గొనేందుకు ప్రత్యేక రైలులో బయలుదేరిన రైతులు, మద్దతుదారులను యువనేత జగన్‌మోహన్‌రెడ్డి పేరుపేరునా పలకరించారు. రైలు ఆసాంతం అన్ని బోగీలు తిరిగిన ఆయన అందరితో మమేకమయ్యారు. ముఖ్యంగా రైతుల వద్ద కూర్చుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా డెల్టా కింద ఉన్న రైతాంగానికి ఉన్న సమస్యలను ఆయన ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో సాగునీటి సమస్య, నల్లగొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్య గురించి ఆయా జిల్లాల ప్రతినిధుల వద్ద కూలంకషంగా చర్చించారు. తన బోగీలో ఉన్నప్పుడు కూడా ఆయన కృష్ణా నదీ జలాలకు సంబంధించిన మ్యాప్‌ను ఆధ్యయనం చేశారు.
మా సమస్యల పైనా ఎలుగెత్తండి

నాగ్‌పూర్‌లో జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన మహారాష్ట్ర రైతులు
 
దివంగత మహానేత వైఎస్సార్ తనయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగ సమస్యలపై ఆందోళన చేసేందుకు ఢిల్లీ వెళుతున్నారని తెలుసుకున్న మహారాష్ట్ర రైతులు దాదాపు 500 మంది ఆయనను నాగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో కలిసి సంఘీభావం తెలిపారు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు నాగ్‌పూర్ చేరాల్సిన రైలు సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు చేరుకున్నా.. అప్పటివరకూ ఓపికతో వేచివుండి ఆయనను కలిశారు. రైలు ఆగినపుడు యువనేత బోగీ తలుపు వద్దకు వచ్చి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. రైతులు, అభిమానులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి జై జగన్ అంటూ నినదించారు. తమ పంటలకు గిట్టుబాటు ధర రావటం లేదని చెప్తూ తమ సమస్యలను కూడా దీక్షలో ప్రస్తావించి కేంద్రానికి వినిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. 
 
ఢిల్లీ చేరుకున్న రైతులు
దేశరాజధానిలో గజగజ వణికిస్తున్న చలిని లెక్కపెట్టకుండా.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల రైతులు సోమవారం సాయంత్రానికే ఢిల్లీకి చేరుకొన్నారు. వారితో ఏపీ భవన్ కళకళలాడింది. జంతర్‌మంతర్‌కు సమీపంలోని వివిధ ప్రాంతాల్లో రైతులు బస చేశారు. ప్రత్యేక రైలులో జగన్‌తో కలిసి వస్తున్న దాదాపు 2,000 మంది ప్రతినిధులు కాకుండా.. మరో 1,000 మంది తమ సొంత ఏర్పాట్లతో ఢిల్లీ చేరుకుంటున్నట్లు గోనె ప్రకాశరావు తెలిపారు. తమిళనాడు, జీటీ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ఢిల్లీ రావాలని అనేకమంది ప్రయత్నించినా వాతావరణం అనుకూలించక రైళ్ల రాకపోకలకు ఇబ్బంది తలెత్తి వారు రాలేకపోతున్నారని చెప్పారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలైన గుర్గావ్, నోయిడా ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు జగన్‌కు సంఘీభావంగా దీక్షకు హాజరుకానున్నారు.

ఢిల్లీలో మెడిసిన్(పీజీ) చదువుతున్న వైద్యులు 30 మంది ‘వైఎస్‌ఆర్ డాక్టర్స్ సేన’ ఆధ్వర్యంలో దీక్షాస్థలి వద్ద స్వచ్ఛందంగా ప్రాథమిక వైద్య సేవలు అందించనున్నారు. ప్రముఖ సినీ నటుడు ధర్మవరపు సుబ్రమణ్యం తదితరులు ఏపీ భవన్‌లోని వెంకటేశ్వరస్వామి విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. రాష్ట్రానికి ట్రిబ్యునల్ తీర్పు వల్ల జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవటానికి ‘జలదీక్ష’ దారి చూపాలని ప్రార్థించారు. జలదీక్షతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక రావాలని, రాష్ట్రానికి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ దళిత్ క్రిస్టియన్ రైట్స్ ఆధ్వర్యంలో చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. 

Saturday, January 8, 2011

దీక్ష కోసం నేడు ఢిల్లీకి జగన్ * నేటి మధ్యాహ్నం 1.30కి సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు

రైలులో జగన్‌తో పాటు 1,500 మంది వెళ్లేందుకు అవకాశం
దీక్షకు వచ్చేవాళ్లు స్వెట్టర్లు,రగ్గులు తెచ్చుకోవాలి: అంబటి


కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ తీర్పు ఫలితంగా రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్న విషయాన్ని, ప్రజల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటానికి ఈ నెల 11వ తేదీన యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టనున్న నిరశన దీక్షకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. జగన్‌తో సహా ఆయన మద్దతుదారులు, అనుచరులు ఢిల్లీ వెళ్లటానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలు 9వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 1.30 గంటలకు సికిందరాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరుతుంది. దీక్షలో పాల్గొనటానికి వచ్చే వారు స్టేషన్‌కు 12.30 గంటలకే చేరుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక రైలులో 1,500 మంది ఢిల్లీ వెళ్లటానికి అవకాశం ఉంటుంది. ఆయా జిల్లాల వారీగా ఎంపిక చేసిన వారి జాబితాలను ఇప్పటికే బాధ్యులకు పంపినట్లు ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు తెలిపారు.

చాలా మంది ప్రత్యేక రైలుతో నిమిత్తం లేకుండా సొంతంగా 11వ తేదీ ఉదయానికి ఢిల్లీకి చేరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇంకా ఎక్కువ మంది రావాలని ఆసక్తి చూపుతున్నా అందరినీ తీసుకువెళ్లటం సాధ్యం కానందుకు అన్యధా భావించవద్దని, అపార్థం చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో చలిగాలులు తీవ్ర స్థాయిలో ఉన్నందున రైలులో వచ్చే వారు మంకీ క్యాప్‌లు, స్వెట్టర్లు, మఫ్లర్లు, రగ్గులు తప్పకుండా తమ వెంట తెచ్చుకోవాలని అంబటి విజ్ఞప్తి చేశారు. రైలులో జగన్ కూడా పయనిస్తారనీ ఆయన వెంట పలువురు ప్రజా ప్రతినిధులు కూడా ఉంటారని తెలిపారు. 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై అంబటి ధ్వజం
ఢిల్లీలో దీక్ష బలప్రదర్శన కాదు.. కృష్ణా డెల్టా రైతాంగం కోసం చేస్తున్న దీక్ష
పట్టు జారిపోతోందనే ఆందోళనతో డీఎల్ మానసిక స్థితి దెబ్బతిన్నట్లుంది
ఆయనే రాజీనామా చేసి.. వైఎస్ ఫొటో లేకుండా మళ్లీ గెలిచి చూపాలి


రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న జటిలమైన సమస్యలను పరిష్కరించకుండా.. యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు వెళ్లేవారిని నిరోధించటమే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు విమర్శించారు. ఎమ్మెల్యేలను, ప్రజా ప్రతినిధులనూ జగన్ వద్దకు పోకుండా నిరోధించటానికి ప్రయత్నించటం కాంగ్రెస్ అధిష్టానానికీ, ముఖ్యమంత్రికీ కొత్తేమీ కాదని పేర్కొన్నారు. ఆయన శనివారం సాయంత్రం సాగర్ సొసైటీలోని జగన్ క్యాంపు కార్యాలయంలో శాప్ మాజీ చైర్మన్ పి.ఎన్.వి.ప్రసాద్, కిసాన్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి గట్టు రామచంద్రరావులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లకుండా ఎమ్మెల్యేలను నిరోధించాలని చూశారు.

అధిష్టానం కూడా వారిని పిలిచి వెళ్లొద్దని చెప్పింది. ఇపుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అదే చేస్తున్నారు. ఎమ్మెల్యేలను జగన్ వద్దకు వెళ్లొద్దని ఒత్తిడి చేయటం, బ్లాక్‌మెయిల్ చేయటం, ప్రలోభ పెట్టటం వారికి మామూలే. వారెన్ని చేస్తున్నా జగన్ వద్దకు వచ్చే వాళ్లు వస్తూనే ఉంటారు’’ అని అంబటి స్పష్టంచేశారు. తాను చేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని జగనే ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తున్నారని వస్తున్న వ్యాఖ్యలను ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘‘అసలు జగన్ ఎందుకు ఒత్తిడి చేస్తారు? తన వద్ద ఏం అధికారం ఉందని వారిని ఒత్తిడి చేస్తారు? ఓ వైపు ముఖ్యమంత్రే ఒత్తిడి చేస్తున్నారని మీరే చెబుతూ మళ్లీ జగన్‌కు ఆపాదించటం ఏమిటి? అయినా ఎవరు ఒత్తిడి చేస్తున్నారనేది ప్రజలు కూడా చూస్తున్నారు.. వారికి బాగా తెలుసు’’ అని అంబటి సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో జగన్ చేయనున్న దీక్ష బలప్రదర్శన కానే కాదని, అది కృష్ణా డెల్టా రైతాంగం సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న దీక్ష అని రాంబాబు స్పష్టం చేశారు.

డీఎల్‌ను చూస్తే జాలేస్తోంది...

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి మాట్లాడుతున్న తీరు చూస్తే జాలేస్తుందని అంబటి ఎద్దేవా చేశారు. మొన్నటి ఎన్నికల్లో (2009) మైదుకూరు నియోజకవర్గంలో ఆయనతో పోటీపడి 4,360 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థి ఎస్.రఘురామిరెడ్డి ఇపుడు జగన్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారని, దీంతో తన పట్టు సడలి పోతోందే అన్న ఆందోళనతో డీఎల్ మానసిక పరిస్థితి దెబ్బతిన్నట్లుగా ఉందనీ అంబటి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో డీఎల్‌ను దగ్గరుండి గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ జగన్ వెంట వెళ్లిపోవటాన్ని ఆరోగ్య మంత్రి సహించలేక సంయమనం కోల్పోయి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ లోక్‌సభకు పోటీ చేసి, దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి గట్టిగా మద్దతు నిచ్చినపుడే డీఎల్ మైదుకూరు నియోజకవర్గంలో 4,360 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారని ఆయన గుర్తు చేశారు. రాజీనామాలు చేయాల్సిందిగా కడప ఎమ్మెల్యేలను సవాల్ చేసే బదులు.. డీఎల్ తానే పదవికి రాజీనామా చేసి మైదుకూరులో వైఎస్ బొమ్మ లేకుండా తనకు నచ్చిన బొమ్మ పెట్టుకుని గెలుపొందాలని అంబటి సవాల్ చేశారు. అయినా తాను డీఎల్‌ను రాజీనామా చేయాల్సిందిగా కోరననీ, కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో జగన్ విజయం తరువాత నైతిక బాధ్యత వహించి ఆయనే పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఆ పాపం మేం మూటగట్టుకోం...


రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము పడగొట్టే ప్రసక్తే లేదనీ, ఆ పాపం జగన్ ఎంత మాత్రం మూటగట్టుకోబోరని రాంబాబు తేల్చి చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను పక్కకు లాగి ప్రభుత్వాన్ని పడగొట్టటం అనైతికమైన చర్యగా భావిస్తున్నామని, సీఎం కావటం కోసం ప్రభుత్వం పడగొట్టారనే అపఖ్యాతి జగన్ తెచ్చుకోరని ఆయన స్పష్టంచేశారు. మూడేళ్ల తరువాత జరిగే ప్రజా పోరులోనే పోరాడి తేల్చుకోవటానికి తమ నాయకుడు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్‌సీ కమిషన్ మాజీ సభ్యుడు మేరుగ నాగార్జున, పీసీసీ ఎస్‌సీ సెల్ మాజీ కన్వీనర్ రాచమల్ల సిద్ధేశ్వర్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ డెరైక్టర్ ఎస్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. 


శక్తిమంతమైన నాయకుడు జగన్: జూపూడి
యువనేత వైఎస్ జగన్‌ను శక్తిమంతమైన నాయకుడిగా ప్రజలు విశ్వసిస్తున్నారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. శనివారం ఆయన జగన్ క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ యువనేత పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేకనే కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఎన్నో రకాలుగా విమర్శిస్తున్నారన్నారు. అయినప్పటికీ ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నాడన్నారు. ఇలా కామెంట్లు ఎక్కువైన కొద్దీ జగన్ పార్టీకి వలసలు పెరుగుతూనే ఉంటాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీయే జగన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో కొంత మంది కాంగ్రెస్ నేతలు జగన్‌పై వ్యాఖ్యలు చేయడం అర్థరహితమన్నారు. ఢిల్లీలో 11న తలపెట్టిన జల దీక్ష రైతు ప్రయోజనాల కోసమే అని స్పష్టం చేశారు.

ఢిల్లీ దీక్షకు హాజరవుతా: పీఆర్‌పీ ఎమ్మెల్యే శోభా
యువనేత జగన్ ఈ నెల 11న ఢిల్లీలో చేపడుతున్న దీక్షకు తాను కూడా హాజరవుతున్నట్లు పీఆర్‌పీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తెలిపారు. శనగ పంట నష్టంతో దెబ్బతిన్న రైతులకు శనివారం ఆమె ఆర్థిక సహాయం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా మిగులు జలాలు వాడుకునే హక్కు సీమకే ఉందన్నారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు వెడల్పు చేయడంతోనే ప్రస్తుతం పంట పొలాలు సస్యశ్యామలం అవుతున్నాయన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నారని, నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో చేయాలని భావించామన్నారు.

ఆయన మరణానంతరం ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకునే స్థితిలో లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ పీఆర్పీ నాయకులు రామిరెడ్డి, ఎంపీపీ నాగమ్మ, సర్పంచ్ అన్సర్‌బాషా, జెడ్పీటీసీ సభ్యుడు రామసుబ్బయ్య, మాజీ ఎంపీపీ రఘునాథరెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు నిజాముద్దీన్, పీఆర్పీ నాయకులు పుల్లయ్య, ఖాదర్‌బాషా, జమాల్ రెడ్డి, జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Thursday, January 6, 2011

జగన్ పార్టీ పేరు నమోదుకు దరఖాస్తు * ఈసీకి అందజేసిన వైవీ సుబ్బారెడ్డి

యువనేత, కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్ పెట్టబోయే కొత్త పార్టీ పేరు నమోదుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘంలో బుధవారం దరఖాస్తు దాఖలైంది. జగన్ తరఫున ఆయన ప్రతినిధి వై.వి.సుబ్బారెడ్డి ఈ దరఖాస్తును అం దజేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన టీవీ చానళ్ల ప్రతినిధులతో సుబ్బారెడ్డి క్లుప్తంగా మాట్లాడారు. మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును, స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా కొత్త పార్టీ పేరు ఉం టుందని ఆయన తెలిపారు. రెండు మూడు వారాల్లో ఈసీ నుంచి క్లియరెన్స్ వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. పార్టీ విధివిధానాలపై అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. పార్టీ పేరు ఈసీలో నమోదయ్యాక విధివిధానాలను వెల్లడిస్తామన్నారు. పేరు ఎలా ఉంటుందని అడిగిన ప్రశ్నలకు.. ఈసీ నుంచి క్లియరెన్స్ వచ్చినపుడు ఆ విషయం తెలుస్తుందని జవాబిచ్చారు.

జగన్ దీక్షకు మొదలైన ఏర్పాట్లు
కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు నే పథ్యంలో జగన్ 11న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన నిరాహార దీక్షకు ఏర్పాట్లు బుధవారం ఆరంభమయ్యాయి. ఏర్పాట్లకు సంబంధించిన పలు అంశాలపై సుబ్బారెడ్డి పలువురితో సమావేశమై చర్చలు జరిపారు.

రైతు కష్టాలు కేంద్రానికి తెలిపేందుకే..... జగన్ ఢిల్లీ దీక్ష

జగన్ ఢిల్లీ దీక్షపై అంబటి రాంబాబు స్పష్టీకరణ
కేంద్ర జలపంపిణీ విధానం ఉండాలన్నదే
జగన్ ప్రధాన డిమాండ్
వైఎస్‌పై చంద్రబాబు విమర్శలు సరికాదు
ఆయన హయాంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే
ఈ అనర్థం వచ్చేది కాదు
* ట్రిబ్యునల్ లో గట్టి వాదనలు వినిపించడంలో రాష్ట్రం విఫలమైందని జనం భావిస్తున్నారు

  కృష్ణానది ప్రాజెక్టుల పరిధిలోని రైతాంగం భయాందోళనలనూ, వారి కష్టాలనూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11న ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఒకరోజు దీక్షను చేపడుతున్నారని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు తెలిపారు. ఆయన బుధవారం సాగర్ సొసైటీలోని జగన్ క్యాంపు కార్యాలయంవద్ద ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు, శా్‌ప్ మాజీ చైర్మన్ పి.ఎన్.వి.ప్రసాద్, పీసీసీ కార్యదర్శి జనక్ ప్రసాద్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి గట్టు రామచంద్రరావుతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ జగన్ దీక్ష వివరాలను వెల్లడించారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందనే ఆందోళన రైతుల్లో నెలకొని ఉందని, దానిని దృష్టిలో ఉంచుకునే.. కేంద్రం ఒక జల పంపిణీ విధానాన్ని ఏర్పాటు చేయాలని జగన్ కోరుతున్నారని ఆయన తెలిపారు.

మిగులు జలాలు అక్కర లేదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాసిన లేఖ ఫలితంగానే కృష్ణా డెల్టా రైతులకు అన్యాయం జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ఆ వాదనను అంబటి ఖండించారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటై, విచారణ ప్రారంభించిన తరుణంలో కడుతున్న ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులుగా భావించరాదనే ఉద్దేశంతో వైఎస్ ఈ లేఖ రాశారేతప్ప మరో ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో కృష్ణానదిపై వైఎస్ ప్రతిపాదించిన ప్రాజెక్టులు కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటయ్యే నాటికే పూర్తి కావాల్సినవని, కానీ తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వాటి జోలికే పోనందువల్ల వచ్చిన అనర్థమిదని ఆయన వివరించారు. చంద్రబాబు ఇరిగేషన్ ఊసెత్తక పోవడంవల్ల రాష్ట్ర రైతులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. ట్రిబ్యునల్ ముందు మన న్యాయవాదులు సరిగ్గా వాదనలు వినిపించలేదని, ప్రభుత్వం వారికి కావాల్సిన సమాచారాన్ని అందించలేకపోయిందని వస్తున్న విమర్శలను ప్రస్తావించగా... ‘‘ఉండొచ్చు, ప్రభుత్వ లోపాలు కావచ్చు.. మరొకటి కావచ్చు, ఈ భావం ప్రజల్లో నెలకొని ఉంది’’ అని అంబటి బదులిచ్చారు. అయితే వైఎస్ ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్న అభిప్రాయమూ రైతుల్లో బలంగా నెలకొని ఉందన్నారు. జగన్ దీక్ష కూడా ట్రిబ్యునల్ తీర్పునకు నిరసనగా కాదని, కేంద్ర జల పంపిణీ విధానం ఉండాలన్నదే ప్రధాన డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇది బల ప్రదర్శన కూడా కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. జగన్ తన ఓదార్పు యాత్రకు మధ్యలో విరామం తీసుకుని ఢిల్లీ వెళుతున్నది రైతుల కష్టాలను ఎలుగెత్తి చాటడానికేనని, అపుడైనా కేంద్రం కళ్లు తెరుస్తుందని భావిస్తున్నామని రాంబాబు అన్నారు. జగన్ పార్టీ స్థాపించిన తరువాత రాష్ట్రంలోని అన్ని కీలకమైన సమస్యలపైనా స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తారని ఆయన చెప్పారు.

జగన్ జనం వెంట వస్తారు..

ఈ నెల 9వ తేదీ సాయంత్రం జగన్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి ఢిల్లీకి బయలుదేరతారని అంబటి తెలిపారు. జిల్లాల్లో తమకున్న యంత్రాంగం ద్వారా ఢిల్లీకి వెళ్లేవారిని ఎంపిక చేశామని వివరించారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ప్రత్యేక రైలులో బయలుదేరతారని చెప్పారు. రైలులో 1,400 నుంచి 1,800 మంది వరకు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. రాష్ట్రం నలుమూలలనుంచి వేలాదిమంది అభిమానులు ఢిల్లీకి జగన్ వెంట రావడానికి ఉబలాట పడుతున్నారని, అయితే అందరినీ తీసుకెళ్లడం సాధ్యం కాదనే విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ అపార్థం చేసుకోవద్దని కోరారు.

ఢిల్లీ దీక్షలో జగన్ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు పాల్గొంటారని ప్రశ్నించినపుడు.. ‘‘చూద్దాం, ఎంత మంది వస్తారో... మేమలాంటి అంచనాలేమీ వేయడం లేదు’’ అని ఆయన సమాధానమిచ్చారు. ఢిల్లీలో విపరీతమైన చలిగాలులున్నాయి కనుక దీక్షకు వచ్చేవారు తప్పనిసరిగా స్వెట్టర్లు, శాలువాలు, దుప్పట్లు, కాళ్లకు సాక్సులు, చేతులకు గ్లోవ్స్ వంటివి తెచ్చుకోవాలని అంబటి సూచించారు. విలేకరుల సమావేశంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వద్దిరెడ్డి చలమారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ బి.మోహన్‌కుమార్, నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.పుల్లయ్య కూడా పాల్గొన్నారు.

Tuesday, January 4, 2011

హామీల అమలెక్కడ? * విశాఖ ఓదార్పులో జగన్ ధ్వజం

* మహానేత మరణించగానే అన్నీ గాలికొదిలేశారు
* నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రభుత్వం
* 9 గంటల కరెంటు ఏమైంది?
* 30 కేజీల బియ్యం ఎటు పోయాయి?... ప్రజలను పట్టించుకునే నాథుడే లేడు
* రెండో రోజు యాత్రలో విగ్రహావిష్కరణల జోరు
* యువనేతపై ఉప్పొంగిన ప్రేమాభిమానాలు.. ఘనస్వాగతం
* 11న ఢిల్లీలో దీక్ష కారణంగా ‘ఓదార్పు’ షెడ్యూలులో మార్పు
* 8 వరకు యాత్ర... సంక్రాంతి తర్వాత మిగతా కుటుంబాల పరామర్శ


  దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రస్తుత పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. మంగళవారం రెండోరోజు ఓదార్పుయాత్ర సందర్భంగా రాత్రి 10 గంటల సమయంలో బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేటలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓ రైతు తన సమస్యను చెప్పుకొంటూ కేకలు వేశాడు. దీనికి స్పందించిన జగన్ ‘ఏం చేద్దాం మరి? ధర్నా చేద్దామా? రండి మరి.. చలో ఢిల్లీ..’ అంటుండగా ఆ రైతు తన సమస్యను వివరించే ప్రయత్నం చేశాడు. దీంతో జగన్ ‘రా.. ఇక్కడికి వచ్చి మైకులో చెప్పు’ అని ఆ రైతు పెంటకోట శ్రీనివాస్‌రావును కోరారు. దీంతో ఆ రైతు మైక్ తీసుకొని ‘తొమ్మిది గంటల కరెంటు ఏమైంది? కరెంటు సరిగ్గా ఇవ్వడం లేదు. చెరకు క్రషర్‌కు 10 రోజుల అనుమతి కోసం అడిగితే 3 నెలల కోసం డీడీ తీయాలని చెబుతున్నారు..’ అని బదులిచ్చాడు.
దీనికి జగన్ ప్రతిస్పందిస్తూ ‘ఆ వేళ నాకు బాగా గుర్తు. రైతులంతా ఆత్మహత్యలకు పాల్పడుతున్న రోజుల్లో.. వారిని బతికించాలంటే ఉచిత విద్యుత్తు ఇవ్వాలని, దాని వల్ల కొంతైనా మేలు జరుగుతుందని, రైతులు బతుకుతారని వైఎస్ భావించారు. అప్పట్లో విద్యుత్తు ఉద్యమం కూడా జరిగింది. అప్పటి ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయిన సంగతీ నాకు గుర్తుంది. అయితే ఉచిత విద్యుత్తు ఇస్తే ఈ తీగలు బట్టలు ఆరేసుకోవడానికే పనికొస్తాయని అప్పటి పాలకులు హేళన చేశారు. దాన్ని పక్కనబెట్టారు. కాదూ కుదరదన్నారు. కానీ దివంగత నేత వైఎస్ ఇచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకమే ఉచిత విద్యుత్తు ఫైలుపై చేశారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని దివంగత నేత రాష్ట్రానికే కాదు.. దేశానికీ చూపించారు’ అని అన్నారు.
ప్రజలను పట్టించుకునే నాథుడే లేడు..
‘దివంగత నేత రేషన్ బియ్యాన్ని 20 కిలోల నుంచి 30 కిలోలకు పెంచుతామని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి విద్యుత్తును ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచుతామని చెప్పారు. అయితే రెండోసారి ప్రభుత్వాన్ని తె చ్చాక వందరోజుల్లోనే ఆయన చనిపోయారు. ఒక నాయకుడు చనిపోయాక వెంటనే ఈ పాలకులు ఆ హామీలు గాలికొదిలేశారు. నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. దగ్గర దగ్గర ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కాబోతోంది.. ఆ హామీల గురించి పట్టించుకోవడం లేదు. ప్రజలను పట్టించుకునే నాథుడే లేడు..’ అని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘మనిషంటే వైఎస్‌లా ఉండాలని చెప్పేందుకు వేరే నిదర్శనం అవసరం లేదు. మీరు చూపిస్తున్న ఆప్యాయతలే చాలు’ అని ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు.


పల్లెపల్లెనా పెద్దాయనే..
ఊరూరా విగ్రహం.. రాజన్నే మా దైవం
* మహానేత కుమారుడికి హారతి పట్టిన పల్లెలు

‘నాకు నాలుగు మెతుకులు నోట్లోకి పోతున్నాయంటే దానికి కారణం పెద్దాయనే. రెండ్రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాడు. మా ఊళ్లో ఆరుగురికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు చేయించాడు. ముగ్గురికి గుండె ఆపరేషన్లు. ఇద్దరు పిల్లలకు చెవి ఆపరేషన్లు. పెద్దాయన లేకున్నా ఆయనను మరచిపోలేం. అందుకే ఊరంతా కలిసి విగ్రహం పెట్టుకున్నాం. ఆయనే మాకు దేవుడు. జగనే ఇప్పుడు మా నాయకుడు. పార్టీ పెడితే తిరిగి చూడక్కర్లేదు..’ ఇదీ విశాఖ జిల్లా లక్ష్మీపురంలో మజ్జి జగ్గారావు అనే వ్యవసాయ కూలీ హృదయ స్పందన. ‘ఏం పెద్దాయన.. విగ్రహం ఎవరు పెట్టారు’ అని ‘న్యూస్‌లైన్’ పలుకరిస్తే ఆయనిలా స్పందించారు.

పేదోళ్లందరికీ మంచి చేసినందుకేప్రతి ఊరికీ వైఎస్ దేవుడయ్యాడని చెప్పుకొచ్చాడు. మంగళవారం యువనేత ఓదార్పు యాత్రలో భాగంగా ముందుకు సాగుతున్నప్పుడు నాలుగైదు వందల జనాభా లేని చిన్న పల్లెల్లో సైతం మహానేత విగ్రహాన్ని ఏర్పాటుచేయడం కనిపించింది. చిన్నచిన్న పల్లెలకు ప్రభుత్వం నుంచి సాయం అందడం చాలా కష్టం. అయినా ఇలాంటి పల్లెల్లోనూ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వం నుంచి సాయం లభించిందనడానికి ఊరూరా నెలకొల్పిన వైఎస్ విగ్రహాలే నిదర్శనం. కాగా యువనేత కోసం వేచి చూసిన జనంతో మంగళవారం యాత్ర సాగిన రోడ్లన్నీ కళకళలాడాయి. ‘జై జగన్’ నినాదాలు మిన్నంటాయి.

తొలిరోజు తెల్లవారుజాము వరకు యాత్ర
తొలిరోజు సోమవారం యాత్రకు జనం భారీగా పోటెత్తడంతో జగన్ కాన్వాయ్ ముందుకు కదలడం కష్టమైంది. దీంతో షెడ్యూల్ పూర్తి చేయడం కోసం యువనేత మంగళవారం తెల్లవారుజామువరకు పర్యటించారు. సోమవారం అర్ధరాత్రి దాటాక అడ్డూరు, నర్సాపురం, రాయువురాజుపేట, చౌడువాడ, గుల్లేపల్లి, గొండుపాలెం, కె.కోటపాడుల్లో విగ్రహావిష్కరణలు చేసిన జగన్ 3 గంటల వేళ కోటపాడులో పట్టాభిరామయ్య అనే రిటైర్డ్ ఉపాధ్యాయుని ఇంట్లో బస చేశారు. మంగళవారం ఉదయం 9.30కే రెండోరోజు యాత్రకు బయలుదేరారు. 10 గంటలకు కోడూరు, 10.40కి కొత్తపెంట, 11.15కు వేచలం, 12.10కి లక్కవరం గ్రామాల్లో విగ్రహాలు ఆవిష్కరించారు. ఇవన్నీ చిన్న గ్రామాలే. అయినా అన్ని గ్రామాల్లో జనం విగ్రహాలు ఏర్పాటుచేశారు. జగన్ వచ్చేదాక వేచి ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినప్పుడు తమ ఊళ్లో ఒకరాత్రి బస చేశారని.. దానికి గుర్తుగా ఇప్పుడు విగ్రహాన్ని పెట్టుకున్నామని లక్కవరం ప్రజలు చెప్పారు. వైఎస్‌ను జీవితాంతం మరిచిపోలేమని, వైఎస్ ఆనాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని వెళ్లారని, మీరూ దర్శించుకోవాలని పట్టుబట్టారు. ఇక్కడే చోడవరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సన్యాసిరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ వద్దూ.. పదవీ వద్దూ అంటూ రాజీనామా చేసేశానని, జగన్ వెంటే వస్తానని ప్రకటించారు.

వైఎస్ ఉంటే పింఛను రూ.600 అయ్యేదేమో..
లక్కవరంలో వైఎస్ విగ్రహావిష్కరణ అనంతరం ముందుకు సాగుతుండగా తూర్పుగోదావరి జిల్లా నుంచి మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ నేతృత్వంలో పలువురు నేతలు పెద్ద సంఖ్యలో వచ్చి జగన్‌ను కలిశారు. అక్కడి నుంచి జుత్తాడ వెళ్లేసరికి 2 అయ్యింది. జుత్తాడలో విగ్రహావిష్కరణ చేశారు. 2.45కు గజపతినగరంలో, 3.10కి గోవాడ(అంబేరుపురం)లో విగ్రహావిష్కరణ చేశారు. అంబేరిపురంలో జగన్ మాట్లాడుతూ వైఎస్ బతికే ఉంటే తమ పింఛన్ రూ.200 నుంచి రూ.600 చేసేవారేమోనని అవ్వలూ తాతలూ అనుకుంటున్నారని చెప్పారు. 3.35కు వెంకన్నపాలెంలో వైఎస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అక్కడి నుంచి 4.20కి చోడవరం చేరుకున్నారు.

వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటారు..
చోడవరంలో విగ్రహావిష్కరణ అనంతరం జగన్ మాట్లాడుతూ అక్కాచెల్లెళ్లు పావలా వడ్డీకే రుణాలు అందుకున్నప్పుడు వారి చిరునవ్వులో, పేద పిల్లలు ఇంజనీరింగ్ వంటి చదువులు చదువుతున్నప్పుడు వారి తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించే ఆనందంలో వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడని అన్నారు. ‘అవ్వాతాతలు నడవలేని స్థితిలోనూ ఇక్కడికి వచ్చారు.. నెల ఒకటో తేదీన వచ్చిన పింఛన్ చూసుకొని కన్నకొడుకులా మా బాగోగులు చూసుకున్నాడని ఆలోచించినప్పుడు వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడని వారు చెబుతున్నారు. పేదవాడు అనారోగ్యానికి గురైనప్పుడు.. పెద్దాసుపత్రికి వెళ్లి అప్పుల పాలు కాకుండానే గుండెకు ఆపరేషన్ చేయించుకుని ఇంటికివచ్చి భార్యాపిల్లలతో తన సంతోషాన్ని పంచుకున్నప్పుడు వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు. బిల్లులు కట్టే బాధలేకుండా రైతూ తన మోటారు ఆన్ చేసుకున్నప్పుడు వైఎస్ గుర్తుకొస్తాడు..’ అని చెప్పారు.

బతికి ఉన్నప్పుడు జేజేలు కొట్టించుకోవడం కాదు..
చోడవరం నుంచి 5.20కి దామునాపురం చేరుకున్న యువనేత అక్కడ విగ్రహావిష్కరణ చేశాక ప్రసంగించారు. ‘నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు.. బతికి ఉన్నప్పుడు జేజేలు కొట్టించుకోవడం కాదు.. చనిపోయాక ఎందరి గుండెల్లో ఉన్నామన్నదే గొప్ప సంగతీ అని చెప్పేవారు. ఎక్కడున్నావ్ నాన్నా.. అని నేను పిలిచినా పలికే పరిస్థితిలో లేడు ఆ మహానేత. ఇంత బాధలో ఉన్నా నన్ను ఒంటరిని చేశారు. ఒంటరినై మీ ముందుకు వచ్చినా.. మేమున్నామంటూ ఆప్యాయత చూపిన మీకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను’ అని అన్నారు.

5.40కి లక్ష్మీపురంలో రాజమహేంద్రవరపు సన్యాసి కుటుంబాన్ని ఓదార్చారు. వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి తిరిగి చోడవరం మీదుగా గాంధీగ్రామ్ చేరుతుండగా మహిళలు పెద్దసంఖ్యలో హారతులు పట్టారు. రోడ్లకు ఇరువైపులా యువత ర్యాలీలుగా తరలివచ్చారు. 7.00 గంటలకు గాంధీగ్రామ్‌లో, 7.35కు చౌడుపల్లిలో విగ్రహాలు ఆవిష్కరించారు. అక్కడి నుంచి 7.50కి గౌరిపట్నం చేరుకున్నారు. ఇక్కడ కలవలపల్లి వెంకునాయుడు కుటుంబాన్ని ఓదార్చారు. 9.40కు విజయరామరాజుపేటలో రెండు విగ్రహాలను ఆవిష్కరించారు. తర్వాత మంగళపాలెం, కె.జగన్నాథపురం, అప్పల్రాజుపురం, ఎల్‌బీపట్నం, ఖండీవరంలలో విగ్రహావిష్కరణలు చేసి ప్రసంగించారు. ప్రజలు భారీగా రావడంతో ఆ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. 12.20కు మాడుగులలో రెండు విగ్రహాల ఆవిష్కరణతో యువనేత యాత్ర పూర్తి చేసి అక్కడే బసచేశారు.

పోలవరం ఏమైంది?
‘రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని వైఎస్ చెప్పేవారు. ఇవాళ వైఎస్ బతికి ఉండి ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉండేదని రైతు అనుకుంటున్నాడు. సగానికి సగం పూర్తయ్యేదని అనుకుంటూ ప్రాజెక్టు వైపు చూస్తున్నాడు. వైఎస్ బతికి ఉంటే సాగునీరు వచ్చేదని, విశాఖకు తాగునీరు వచ్చేదని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి ఏమైంది పోలవరం ప్రాజెక్టు అని నేను అడుగుతున్నా.. ఎందుకు మొదలవ్వలేదని నేను అడుగుతున్నా.. పోలవరం ఏమైందని రైతు ఆకాశం వైపు చూస్తున్నాడు.. వైఎస్ బతికి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని అంటున్నాడు..’ అని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.

Monday, January 3, 2011

11న హస్తినలో నిరశన * కృష్ణా పంపకంలో అన్యాయంపై 11న జగన్ నిరాహారదీక్ష

*రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దీక్షతో కేంద్రానికి, యావత్ దేశానికి తెలియజేస్తాం : ఓదార్పు యాత్రలో యువనేత*దీక్షలో పాల్గొననున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల  ప్రతినిధులు, రైతు, కార్మిక సంఘాల నేతలు...
దీక్ష అనంతరం ప్రధానికి వినతిపత్రం* నాడు 75 శాతం నీటి లభ్యత ఆధారంగా జలాలు పంచారు* ఇప్పుడు 65 శాతాన్నే లెక్కించి ఇష్టమొచ్చినట్లు కేటాయింపులు చేశారు* వరద వస్తే మునిగిపోయే మనకు మిగులు జలాలపై పూర్తి హక్కు ఇవ్వరా?*వైఎస్ ఉంటే ఇలా జరిగేదా అని జనం అడుగుతున్నారు

కృష్ణా జలాల పంపకంలో రాష్ట్రానికి జరిగిన ఘోర అన్యాయానికి నిరసనగా ఈ నెల 11న ఢిల్లీలో నిరాహార దీక్ష చేయనున్నట్లు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యతను ఆధారంగా తీసుకుంటే.. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ 65 శాతమే ఆధారంగా తీసుకుని జలాల కేటాయింపులు జరిపి అన్నదాతల బతుకు భరోసాపై నీళ్లుజల్లిందని దుయ్యబట్టారు. వరదలొస్తే మునిగిపోయే మనకు మిగులు జలాలపై పూర్తి హక్కు ఇవ్వకపోవడాన్ని జగన్ తూర్పారబట్టారు. వైఎస్ బతికే ఉంటే ఈ రకంగా జరిగి ఉండేది కాదని ప్రతి రైతు ఆకాశం వైపు చూస్తున్నాడన్నారు. సోమవారం విశాఖ జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా విశాఖనగర పరిధిలో పలుచోట్ల దివంగత నేత వైఎస్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. ట్రిబ్యునల్ తీర్పులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, పలుప్రాజెక్టుల విషయంలో రాష్ట్రం మీద కేంద్రం చిన్నచూపుపై ఉద్వేగంగా ప్రసంగించారు. 11న దీక్ష ద్వారా ప్రజల గోడును కేంద్రానికి, యావత్ దేశానికి తెలిసేలా చేస్తానని ఆయన అన్నారు. అప్పుడైనా రాష్ట్ర సమస్యలపై ప్రధానమంత్రి స్పందిస్తారేమోనని ఆశాభావం వ్యక్తంచేశారు. దీక్ష సందర్భంగా ప్రధానికి వినతిపత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

వైఎస్ ఉంటే ఇలా జరిగేదా?
‘ఇవాళ నీటి పారుదల పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే ఇలా జరిగేదా? కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల ఇంత అన్యాయం జరిగేదా? ఈ తీర్పు చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. 1976లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పుడు 75 శాతం నీటి లభ్యతను ఆధారంగా తీసుకుంటే.. ఈరోజు 65 శాతం మాత్రమే తీసుకొని నీళ్ల కేటాయింపులు జరిపారు. వరదల వల్ల నష్టపోయేది మనకు మిగులు జలాలపై పూర్తి హక్కు ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్టు కేటాయింపులు జరుపుతారా? మిగతా రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టుకుంటే నీళ్ల కేటాయింపులు చేస్తున్నారు. మరి మన పరిస్థితేంటి? వరదలు వస్తే మనం మునగాలి.. కరువొస్తే మాత్రం ఉన్న నీళ్లు పైన ఉన్నవాళ్లు వాడేసుకుంటారు. ఇదేనా న్యాయం? ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో ఉంటే కేంద్ర ప్రభుత్వం ఉందా? లేదా? అని రైతు ఆవేదనగా చూస్తున్నాడు.’
వారు మొర ఆలకించాలని దేవుడిని కోరుకుందాం
‘పోలవరం కట్టాలని కొందరు ఎంపీలు పోయి అడిగితే.. మరికొందరేమో వద్దని ఆపుతారు.. కృష్ణా గోదావరి నదుల జలాలను అనుసంధానించాలని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని, ప్రతి నీటిచుక్కనూ వాడుకోవాలన్న ఆలోచనను కేంద్రం చేయట్లేదు. ఈ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గులేదూ అని చెప్పడానికి బాధగా ఉంది. నేను చెబుతున్నా.. ఈ నెల 11న ఢిల్లీలో ఒక రోజుపాటు నిరాహార దీక్షకు దిగుదాం. నాకు మద్దతుగా ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఈ దీక్షలో పాల్గొంటారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్న సంగతిని కేంద్రానికే కాదు.. యావత్ దేశానికీ చూపుదాం.. అప్పుడన్నా ప్రధాని స్పందిస్తారేమో చూద్దాం.. అప్పుడన్నా రాష్ట్రం సమస్యలు వినడానికి ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తారేమో చూద్దాం.. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు రైతుసంఘాల నేతలు, కార్మిక సంఘాల నాయకులూ, స్థానిక సంస్థల ప్రతినిధులూ మాతో కలిసివస్తారు. అప్పుడైనా రాష్ట్రాన్ని బతికించేందుకు స్పందిస్తారో లేదో చూద్దాం.. మన మొర ఆలకించేలా చూడమని దేవుడిని కూడా కోరుకుందాం.’

నాన్నా.. ఎక్కడున్నావ్..

‘రైతులు, చేనేత కార్మికులు, మైనారిటీ సోదరులు.. ఇలా ప్రతి ఒక్కరి క్షేమం కోరుతూ.. ప్రతి పేద సోదరుడినీ పేదరికం నుంచి బయటకు తేవాలని ఆలోచన చేసింది వైఎస్సార్.. నాన్న తిరిగి రాడంటే చాలా బాధగా ఉంది.. నాన్నా.. ఎక్కడున్నావ్ అని అంటే పలికే పరిస్థితిలో లేడంటే చాలా బాధగా ఉంది.. నావెంట ఎవరూ లేరని విపక్షాలు గొంతెత్తినప్పుడు.. స్వపక్షాలు కూడా నావెంట రానప్పుడు.. మేమున్నామంటూ నాపై ఆప్యాయతలు చూపిన మీకు ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను..’ అంటూ పెందుర్తిలో జగన్ గద్గద స్వరంతో మాట్లాడారు.

వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు..

విశాఖలో పలుచోట్ల వైఎస్ విగ్రహావిష్కరణల అనంతరం మాట్లాడుతూ.. దివంగత నేత ప్రజల గుండెల్లో ఎంతగా నాటుకుపోయారో జగన్ గుర్తుచేసుకున్నారు. ‘ఈ జంక్షన్‌కు వచ్చి వైఎస్ ఎక్కడా అని ఎవరైనా అడిగితే.. పసిపిల్లలను చంకన వేసుకుని.. ఆలస్యమైనా అలసట, అసంతృప్తి లేకుండా వేచి ఉన్న ప్రతి అక్కాచెల్లెళ్ల గుండెల్లో వైఎస్ కనిపిస్తాడు. ప్రతి అక్కాచెల్లీ పావలా వడ్డీ గురించి ఆలోచించినప్పుడు.. వారి ముఖంపై చిరునవ్వు కనిపించినప్పుడు.. దివంగత నేత గుర్తుకొస్తూనే ఉంటాడు. అవ్వాతాతలు కరస్రాయం లేకుండా అడుగు ముందుకు పడని స్థితిలో వచ్చారు.. వారు ప్రతి నెల ఒకటో తేదీన వచ్చిన పింఛన్ చూసుకొని కన్నకొడుకులా మా బాగోగులు చూసుకున్నాడని ఆలోచించినప్పుడు వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు. ప్రతి పేద తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు.. ఇంకో నాలుగేళ్లలో ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని.. ఓ ఉద్యోగం చూసుకొని మా బాగోగులు చూసుకుంటారన్న ధీమాకు వచ్చినప్పుడు.. వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు.

నా కూతురు డాక్టర్ చదువులు చదువుతోంది.. ఇంకో నాలుగేళ్ల తరువాత సూది మందు వేసైనా తను సంపాదించుకుంటూ మమ్మల్ని పోషిస్తుందన్న ఆలోచన పేదవాడికి వచ్చినప్పుడల్లా వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు. అనారోగ్యానికి గురైనప్పుడు.. పెద్దాసుపత్రికి వెళ్లి అప్పుల పాలు కాకుండానే గుండెకు ఆపరేషన్ చేయించుకుని ఇంటికివచ్చి భార్యాపిల్లలతో తన సంతోషాన్ని పంచుకున్నప్పుల్లా వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు. బిల్లులు కట్టే బాధలేకుండా ప్రతి రైతు తన మోటారు ఆన్ చేసుకున్నప్పుడు వైఎస్ గుర్తుకొస్తాడు. పోలవరం పూర్తయినప్పుడు, ఆ నీళ్లు విశాఖకు తాగునీళ్లు అందించినప్పుడు, ఉత్తరాంధ్రకు సుజల స్రవంతి పూర్తయినప్పుడు వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటాడు. వైఎస్ ఉంటే పోలవరం పనులు ఎంత వేగంగా జరిగేవో అని రైతు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు’ అని అన్నారు.

ఒంటరిగా వచ్చినా..: ‘ఇవాళ నేను కాంగ్రెస్ నుంచి ఒంటరిగా బయటికి వచ్చినా.. చిరునవ్వుతో నిలబడ్డానంటే అది మీ ప్రేమ, ఆప్యాయతలే వల్లే అని గర్వంగా చెబుతున్నా.. ఆలస్యమైనా నాకోసం వేచి ఉన్నందుకు మీకు మరోసారి చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నా’ అని పలుచోట్ల జగన్ పేర్కొన్నారు.