మహానేత మనసా వాచా ఆచరించి చూపించిన సంక్షేమ పథాన్నే జెండాగా మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Sunday, April 17, 2011
పోటెత్తిన పులివెందుల * జనం ఆశీస్సులతో... విజయమ్మ నామినేషన్
Friday, April 15, 2011
జగన్ నామినేషన్ సందర్భంగా ఉప్పొంగిన ఉత్సాహం
స్థానికులతోపాటు పలు జిల్లాల నుంచి తరలివచ్చిన అభిమానులు
నామినేషన్ వేయడానికి ముందు వైఎస్ సమాధిని సందర్శించిన జగన్
భావోద్వేగానికి గురైన జగన్ కుటుంబ సభ్యులు, చలించిపోయిన అభిమానులు
వైఎస్సార్ పార్టీ అధినేత, ఆ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్ర వారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. కడప కలెక్టర్‌రేట్ కార్యాలయానికి ఉదయం 10.30 గంటలకు చేరుకున్నారు. 11.04 గంటలకు ఒకసెట్ దాఖలు చేయగా, 11.22 గంట లకు మరో సెట్‌పై సంతకం చేసి రిటర్నింగ్ అధికారి శశిభూషణ్ కుమార్‌కు అందజేశారు. జగన్ వెంట ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, న్యాయవాది పుల్లారెడ్డి ఉన్నారు.
జనసంద్రంగా కలెక్టరేట్
యువనేత నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ కార్యాల యం చుట్టూ ఉన్న రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. పార్టీ కార్యకర్తలు అభిమానుల కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వెల్లువులా వచ్చిన అభిమానులను నిలువరించడానికి పోలీసులు పడరాని పాట్లుపడ్డారు.
నాన్నకు నివాళులు..అమ్మ దీవెనలు
ఉదయం 9.30గంటల ప్రాంతంలో మొదట విజయమ్మ, షర్మిళ, భారతిరెడ్డి వైఎస్‌ఆర్ సమాధివద్ద నివాళులర్పించారు. విజయమ్మ ప్రార్థన చేస్తుండగా సమాధి వద్దకు జగన్ రాగానే ఆమె ఉద్వేగానికి గురై కుమారుని పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఆమెను ఓదార్చుతూ మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడ ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. అనంతరం నామినేషన్‌కు సంబంధించిన ఫైలును సమాధిపై ఉంచి జగన్‌ను దగ్గరకు తీసుకుని విజయమ్మ ముద్దుపెట్టి ఫైలు అందించారు. కాగా, ఇడుపుల పాయకు బయలుదేరే ముందు పులివెందులలోని ఇంట్లో కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా అమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న అభిమానులు తిరుపతి ప్రసాదాలు, కుంకుమ జగన్‌కు ఇచ్చారు. వాహనం ఎక్కగానే గుమ్మడికాయ దిష్టి తీశారు.
తరలివచ్చిన నేతలు.. అభిమానులు
యువనేత నామినేషన్ కార్యక్రమానికి, అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్ సమాధివద్ద నివాళులర్పించేందుకు జగన్ మామ ఇ.సి.గంగిరెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, వై.ఎస్.సుశీలమ్మ, వై.ఎస్.ఆనంద్‌రెడ్డి, వై.ఎస్.రాజేష్‌రెడ్డి, జార్జిరెడ్డి సతీమణి వై.ఎస్.భారతమ్మ, జగన్‌మేనత్త విమలమ్మ, వై.ఎస్.భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి, కడప మాజీమేయర్ రవీంద్రనాథరెడ్డి, సజ్జల దివాకర్‌రెడ్డి, వై. ఈశ్వరప్రసాద్‌రెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మారెప్ప, పెనుమత్స సాంబశివరాజు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, బూచేపల్లె శివప్రసాద్‌రెడ్డి, ఆళ్ల నాని, శేషారెడ్డి, సత్యవతి, షాజహాన్, శోభానాగిరెడ్డి, బాబురావు, కాటసాని రామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథరెడ్డి, శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు తిప్పారెడ్డి, కొండా మురళి, పుల్లా పద్మావతి, మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, గండి బాబ్జి, విష్ణువర్దన్‌రెడ్డి, శివరామరాజు, బాజిరెడ్డి గోవర్దన్, డీసీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు రెహ్మాన్, కంచర్ల ప్రభాకర్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డీసీఎంఎస్ వైఎస్ చైర్మన్ శంకరరెడ్డి, సినీనటి రోజా, వాసిరెడ్డి పద్మ, శ్రీలక్ష్మీరెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, గోనె ప్రకాశరావు, నెల్లూరు డీసీసీ మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఇ.వి.సుధాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు.
వైఎస్ జగన్ చరాస్తి విలువ రూ. 365 కోట్లు
నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ చరాస్తి విలువ రూ. 365,68,55,224లుగా తెలిపారు. స్థిరాస్తులు, వాటిపై చేసిన అభివృద్ధి తదితరాలు రూ. 8,35,97,412 లుగా వివరించారు. ప్రస్తుతం ఈ స్థిరాస్తి మార్కెట్ విలువ రూ. 25,04,50,893 కాగా, జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతిరెడ్డి పేరున ఉన్న చరాస్తి విలువ రూ. 41,33,46,809లుగా ప్రకటించారు. భారతి పేరున ఉన్న స్థిరాస్తి విలువ రూ. 1,59,53,540లు కాగా, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థిరాస్తి విలువ రూ. 13,63,94,338లుగా తెలిపారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి జగన్ తీసుకున్న రుణాలు రూ. 2,40,73,390లుగా తెలిపారు. వైఎస్ భారతి తీసుకున్న రుణాల విలువ రూ. 7,71,39,995లుగా పేర్కొన్నారు.
Monday, March 14, 2011
జగన్ కంపెనీలపై ఐటీ, ఈడీలతో విచారణ * ‘సాక్షి’లో పెట్టుబడులపై విచారణ 25కి వాయిదా * పక్కా మ్యాచ్ ఫిక్సింగ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తమకు ముప్పు తప్పదని గుబులు
మంత్రి శంకర్రావు ఆరోపణలను తలకెత్తుకుని హైకోర్టులో పిల్
నాడు టీడీపీ ఆరోపణల ఆధారంగా కోర్టుకు మంత్రి లేఖ
ఇప్పుడు ఆయన బాటలోనే పయనిస్తున్న టీడీపీ నేతలు
సిద్ధాంతాలు, విభేదాలను మరచి ఒక్కటైన అధికార, విపక్షాలు
మ్యాచ్ ఫిక్సింగ్‌తో వైఎస్ కుటుంబ ప్రతిష్టను దిగజార్చే కుట్ర
యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ పేరు ప్రకటించగానే తెలుగుదేశం పార్టీలో వణుకు మొదలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తమకు ముప్పు తప్పదని భావించిన ఆ పార్టీ నేతలు జగన్‌పై బురద చల్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటివరకు జగన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించిన మంత్రి శంక ర్రావు దారిలోనే వీరూ నడుస్తున్నారు. ప్రజాభిమానంతో తిరుగులేని నేతగా ఎదుగుతున్నారనే అక్కసుతో జగన్‌పై ఇప్పటికే శంకర్రావు న్యాయస్థానానికి లేఖ రాయగా.. తాజాగా టీడీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ గతంలో చేసిన ఆరోపణలను మంత్రి తలకెత్తుకోవడం, ఇప్పుడు ఆయన బాటలోనే టీడీపీ నడవడం అధికార, ప్రతిపక్ష పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్‌కు నిదర్శనం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటనతో ఎల్లో సిండికేట్ వెన్నులో వణుకు మొదలైందని.. ఎలాగైనా యువనేతపై బురదచల్లాలన్న ఉద్దేశంతోనే టీడీపీ నేతలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారనేది బహిరంగ రహస్యమని సీనియర్ న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు.
‘సాక్షి’లో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు జగన్ స్పష్టమైన ప్రకటనలు చేసినప్పటికీ... అవే ఆరోపణలను మళ్లీ గుప్పిస్తూ టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు విలేకరుల సమావేశంలో... జగన్‌కు వచ్చిన ఐటీ నోటీసులపై విమర్శలు గుప్పించారు. వాటిని ఆధారం చేసుకుని టీడీపీ నేతలు ఓ అనామక ఈ-మెయిల్ ఐడీ సృష్టించి, జగన్‌పై దుష్ర్పచారానికి పూనుకున్నారు. దేశవ్యాప్తంగా మీడియా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు ఈ ఈ-మెయిల్ పంపారు. ఇప్పుడు జగన్ ఆస్తులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి వైఎస్‌జగన్ కోట్ల రూపాయలు ఆర్జించారని, ఆ మొత్తం వ్యవహారంపై విచారణ జరపడంతో పాటు.. జగన్‌పై అవినీతి నిరోధక , మనీ లాండరింగ్ చట్టాల కింద చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ టీడీపీ నేతలు కె.ఎరన్న్రాయుడు, పి.అశోక్‌గజపతి రాజు, బెరైడ్డి రాజశేఖరరెడ్డి సోమవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, సీబీఐ డెరైక్టర్, ఏసీబీ డెరైక్టర్, ఆదాయపు పన్ను అసిస్టెంట్ కమిషనర్, వైఎస్ జగన్, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, భారతి సిమెంట్స్, క్లాసిక్ రియాల్టీ, సండూర్ పవర్ లిమిటెడ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ సెలవులో ఉండటంతో, ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ వంగా ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఉదయం విచారించనున్నది.
సిద్ధాంతాలు, విభేదాలు మరచి..
దివంగత మహానేత వైఎస్ ఇప్పుడు లేరు. ఆయన వచ్చి సమాధానం చెప్పుకోలేరని తెలుసు. గడచిన ఎన్నికలకు ముందు ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం మంత్రివర్గ సమష్టి నిర్ణయం. అప్పటి మెజారిటీ మంత్రులే ఇప్పటి ప్రభుత్వంలో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి టీడీపీ చేసిన ఆరోపణల ఆధారంగా హైకోర్టుకు లేఖ రాయడం, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అవే ఆరోపణలతో మరో పిటిషన్ దాఖలు చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించడం, రాయితీలు ఇవ్వడమన్నది అభివృద్ధి ప్రక్రియలో భాగం. తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. వేలాది ఎకరాలు పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేశారు. పరిశ్రమలకు రాయితీలు ఇచ్చారు. వీటన్నింటినీ పక్కనబెట్టి అధికార, ప్రతిపక్షాలు రాజకీయ సిద్ధాంతాలను, విభేదాలను మరచిపోయి దివంగత మహానేత కుటుంబ ప్రతిష్టను మసకబార్చే కుట్రకు పాల్పడుతున్నాయి. ఆధారాలతో నిమిత్తం లేకుండా ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పూనుకుంటున్నాయి.
‘సాక్షి’లో పెట్టుబడులపై విచారణ 25కి వాయిదా
యువనేత వైఎస్ జగన్ ఆస్తులకు సంబంధించి మంత్రి శంకర్రావు రాసిన లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించిన హైకోర్టు.. దానిపై తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యానికి సంబంధించి గతంలో జారీ చేసిన నోటీసులను అందుకోని ప్రతివాదులకు మళ్లీ నోటీసులు జారీ చేసింది. అంతేకాక ఈ లేఖ విచారణార్హతపై అభ్యంతరాలు ఉంటే, వాటితో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వంగా ఈశ్వరయ్య, జస్టిస్ వేగి సూరి అప్పారావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాము కేవలం లేఖ విచారణార్హతపైనే వాదనలను వినిపిస్తామని జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ తదితర కంపెనీల తరఫున హాజరవుతున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అల్తాఫ్ అహ్మద్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యాజ్యంలోని ప్రతివాదుల్లో ఒకరైన భగవత్ సన్నిధి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. శంకర్రావు లేఖ విచారణార్హతపై కౌంటర్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల్లో పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా శంకర్రావు లేఖ లేదని ఆ సంస్థ కోర్టుకు నివేదించింది. మంత్రి రాసిన లేఖ, తరువాత దాఖలు చేసిన అఫిడవిట్ ప్రమాణపూర్వకంగా దాఖలు చేయలేదని, అలాంటప్పుడు దానిని అఫిడవిట్‌గా పరిగణించడం సరికాదని వివరించింది. అంతేకాక అఫిడవిట్‌తో జత చేసినవివరాలను ఎక్కడ్నుంచి సంపాదించారన్న విషయాన్ని శంకర్రావు ఎక్కడా పేర్కొనలేదని, కాబట్టి ఆ అఫిడవిట్‌ను తోసిపుచ్చాలని కోర్టును కోరింది.
అఫిడవిట్ తప్పనిసరని కోర్టు భావిస్తే, ప్రమాణపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేయాలని శంకర్రావును ఆదేశించాలని, అప్పుడే ఆయన పేర్కొన్న అంశాలకు విలువ ఉంటుందని తెలిపింది. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ దాఖలయ్యే వ్యాజ్యాలకు విచారణార్హత లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. తాను చేసిన ఆరోపణలకు చట్టబద్ధమైన రుజువులు చూపేంత వరకు ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ చేపట్టరాదని విజ్ఞప్తి చేసింది. శంకరరావు రాసిన లేఖలో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవని, కేవలం రాజకీయ దురుద్దేశాలతో జగన్ ప్రతిష్టను దెబ్బ తీసే చర్యల్లో భాగంగానే ఈ లేఖ రాశారని కోర్టుకు నివేదించింది. భారీ జరిమానాతో ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరింది.
జగన్ కంపెనీలపై ఐటీ, ఈడీలతో విచారణ
టీడీపీ నేతలకు ప్రధాని హామీ..
అక్రమాల చిట్టా విప్పిన ఎంపీలు
ముకుతాడు !
అదే సమ యంలో.. రాష్ట్ర హైకోర్టులో సైతం జగన్ అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని కోరుతూ టీడీపీ సీనియర్లు యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతి రాజు, బైరెడ్డి రాజశేఖరరెడ్డి వేసిన పిల్‌ను హైకోర్టు స్వీకరించింది. దీనితో జగన్‌పై ఇక ముప్పేట దాడి మొదల యినట్లుగా భావించక తప్పదు.
ఇటీవలే జగన్ అక్రమ ఆస్తులపై న్యాయ విచారణ జరపాలంటూ మంత్రి శంకర్రావు రాసిన లేఖను విచారణకు స్వీకరించిన హైకోర్టు నిర్ణయంతో ఖంగుతిన్న జగన్‌కు ఒకేరోజు రెండు ప్రతికూల పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి.
రాజశేఖరరెడ్డి సీఎం కాకముందు జగన్ ఆదాయపన్ను శాఖకు సమర్పించిన డాక్యుమెంట్లు, సీఎం అయిన తర్వాత చెల్లిస్తున్న పన్నుల వివరా లను కూడా జతపరిచారు. జగన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించారు. వాటి ఆధారంగా జగన్ అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. దానికి స్పందించిన ప్రధాని మన్మోహన్‌సింగ్.. జగన్ అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణను తమంతట తాము జరిపించలేమని, రాష్ట్ర ప్రభుత్వం కోరితే విచా రణ చేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఇది ఇన్‌కంటాక్స్‌కు సంబంధిం చిన వ్యవహారమ యినందున ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో విచారణ జరిపిస్తా మని హామీ ఇచ్చారు.
దానికి ప్రధాని మౌనం వహించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. జగన్ అక్రమ ఆస్తులపై న్యాయ విచారణ జరిపించాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృ ష్ణుడు, ఎర్రన్నాయుడు, అళోక్‌గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాష్ట్ర హైకో ర్టులో వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సోమవారం హైకోర్టు స్వీకరించింది. అందులో.. జగన్, ఆయన కంపెనీలతో పాటు, సీబీఐ, ఏసీ బీలను ప్రతివాదులు గా చేర్చారు. మంగళవారం ఈ కేసు విచారణకు రానున్నట్లు సమాచారం. అందులో జగన్‌కు చెందిన సాక్షి మీడియా సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వారికి కేటాయించిన భూములు, సెజ్‌లు, కంపెనీల వివరాలు తమ ఆరోపణలకు సాక్ష్యాలుగా చూపారు.
తాజా పరిణామాలతో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ జగన్‌కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. శాసనమండలి ఎన్నికల్లో తన అనుచర వర్గంతో కాంగ్రెస్ సర్కారుకు షాక్ ఇద్దామని ప్రయత్నిస్తున్న జగన్‌కు ఇది ఎదురుదెబ్బగానే భావించక తప్పదు. కేంద్రం ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణను ప్రారంభిస్తే ఆర్ధిక మూలాలు, అవకతవకలన్నీ బయటపడక తప్పదు. ఫలితంగా.. జగన్ ప్రజల్లో అవినీతి పరుడిగా ముద్రవేయించుకునే ప్రమాదం లేకపో లేదు. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ అస్తశ్రస్త్రాలను ఇప్పటినుంచే సిద్ధం చేసుకుంటోంది. జగన్‌ను అవినీతిపుట్టగా ఇప్పటికే ఆరోపణాస్త్రాలు సంధి స్తున్న టీడీపీ.. ఇక ఆయన ఆస్తులపై ఎన్‌ఫోర్స్ మెంట్ విచారణ మొదలుపెడితే దానిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడం ఖాయం. జగన్‌ను ఓ అవినీతికేంద్రంగా చూపించడం ద్వారా ఆయనను నైతికంగా దెబ్బకొట్టి, ప్రజల్లో ఏహ్యభావం కలిగించాలన్న టీడీపీ వ్యూహానికి, ప్రధాని నిర్ణయం తోడయింది.
కాంగ్రెస్‌ను, ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని సవాలు చేసి బయటకు రావటంతో పాటు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను కుప్పకూల్చేందుకు పావులు కదుపుతున్న జగన్‌ను కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో దెబ్బకొట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు తన చేతికి మట్టి అట్టకుండా, తాను జగన్‌ను కావాలని వేధిస్తున్నానన్న భావన ప్రజల్లో కలిగించకుండా... టీడీపీ ఇచ్చిన ఫిర్యాదును అడ్డుపెట్టుకుని, తెలుగు దేశం పార్టీ భుజంపై తుపాకీ పెట్టి జగన్ వైపు గురి పెట్టినట్లు స్పష్టమవుతోంది.
వైఎస్ జగన్ కంపెనీల్లో అక్రమ నిధుల ప్రవాహం, వాటి మూలాలపై ఆదాయపు పన్ను విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లతో సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా ముందుకు వచ్చారు. ప్రజల ఆస్తులు, సహజ వనరులను లూటీ చేసిన కొద్దిమంది బడాబాబుల ద్వారా జగన్ కంపెనీల్లో అక్రమంగా ప్రవేశించిన పెట్టుబడులు, పలు చట్టాల ఉల్లంఘనపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా టీడీపీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యు డు మైసూరా రెడ్డి తదితరులు సోమవారం ప్రధానికి విన్నవించారు.
దీనిపై ఆయన అనూహ్యమైన రీతిలో స్పందించారు. "సీబీఐ విచారణ అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మొదలైన తతంగం ఉంటుంది. ఐటీ, ఈడీలతో విచారణ జరిపిస్తాను'' అని ప్రధాని చెప్పడంతో టీడీపీ ఎంపీలు ఆశ్చర్యచకితులయ్యా రు. 'రాజా ఆఫ్ కరప్షన్' పేరిట రాష్ట్రానికి చెందిన అన్ని ప్రతిపక్ష పార్టీలు 2009 ఫిబ్రవరిలోనే కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. "జగన్ కంపెనీల్లో అక్రమ పెట్టుబడులపై మరిన్ని సాక్ష్యాలతో ఈ ఏడాది జనవరిలో రాజ్యాంగ సంస్థలకు, నియంత్రణ ఏజెన్సీలకు మళ్లీ ఫిర్యాదు చేశాం.
జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లావాదేవీలపై ఐటీ అధికారులు చేసిన దర్యాప్తులో పలు కీలకాంశాలు బయటపడ్డాయని తెలిపారు. జగతిలో రూ. 15కోట్లు పెట్టుబడి పెట్టిన 8 కంపెనీలు బోగస్‌వని... ముంబై, రాజ్‌కోట్, బెంగళూరు, కోల్‌కతాలకు చెందిన ఆ కంపెనీల చిరునామాలు కూడా బోగస్‌వేనని తేలింది. జగతి పబ్లికేషన్స్‌లో రూ.743.57 కోట్ల పెట్టుబడికి 90 శాతం వాటా ఉంచుకోగా... మిగిలిన 10 శాతం వాటా కోసం వివిధ కంపెనీలు రూ.300.49 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి. సాక్షి పత్రికను ప్రారంభించకముం దే 35 రెట్లు అధిక ధరకు వాటా ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఐటీ కూడా ప్రశ్నించింది.
జగతి పబ్లికేషన్స్‌కు చెందిన భూమి, భవనాలు కూడా జగన్‌కు చెందిన మరో కంపెనీ జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు చెందినవని తెలిపింది. మాట్రిక్స్ లాబ్స్, పీవీ బిజినెస్ వెంచర్స్, హెటెరో గ్రూప్, అరబిందో ఫార్మా, రాంకీ గ్రూప్ మొదలైన కంపెనీలకు సెజ్‌లు, రేవులు, రియల్ ఎస్టేట్ నిబంధనల్లో సడలింపులు వంటి ప్రయోజనాలు సమకూర్చిన విషయం కూడా ఐటీ ఎత్తిచూపింది. వారు పెట్టిన 277.56 కోట్ల పెట్టుబడిని ఐటీ విభాగం అదనపు ఆదాయంగా భావించి రూ.122.78 కోట్ల పన్ను కట్టాలని ఆదేశించింది.
జగతి నష్టాలు రూ.349 కోట్లు దాటినప్పటికీ, గత రెండేళ్లలో ఇదే కంపెనీకి అంతే ప్రీమియంతో ఇవే కంపెనీల నుంచి రూ.1200 కోట్ల పెట్టుబడి రావడం, రూ.277.56 కోట్ల మేరకు అధికార దుర్వినియోగం జరగడాన్ని కూడా ఐటీ ఎత్తిచూపింది. జగన్‌కు చెందిన 35 కంపెనీల్లో ఆరేళ్లుగా ఇలా అక్రమ పెట్టుబడులు వచ్చాయి. లక్ష కోట్ల మేరకు మోసాలు జరిగాయి'' అని టీడీపీ ఎంపీలు ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
2003-04లో జగన్ ఆదాయం కేవలం రూ.9.19లక్షలుకాగా... 2010-11లో తన ఆదాయం రూ.500 కోట్లు ఉంటుందంటూ రూ.84 కోట్ల అడ్వాన్స్ పన్ను చెల్లించారని తెలిపారు. అంటే, జగన్ ఆదాయం ఏటా 5 వేల శాతం పెరిగిందని తెలిపారు. "ఇంత ప్రగతి భారత కార్పొరేట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగం. ఉదాహరణకు భారతీ సిమెంట్స్‌లో జగన్ తొలి పెట్టుబడి రూ.45.18 కోట్లు. అది కేవలం రెండేళ్లలోనే రూ.3,053 కోట్లకు పెరిగింది.
దాల్మియా సిమెంట్స్ వంటి బడా కంపెనీలు జగన్ కంపెనీలో రూ.10విలువైన వాటాను రూ.1450 ప్రీమియంతో కొనుగోలు చేశాయి. ఈ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం గనులు, ఇతర కేటాయింపులద్వారా ప్రయోజనం చేకూర్చింది'' అని తెలిపారు. జగన్ కు చెందిన సండూర్, కార్మెల్ ఆసియా, జనని, సరస్వతి, క్లాసిక్ రియాల్టీ ఇలా ఒక్కో కంపెనీ కథనాల్ని టీడీపీ నేతలు ప్రధానికి వివరంగా తెలిపారు. ప్రధానిని కలిసిన ఎంపీల్లో సుజనా చౌదరి, హరికృష్ణ, వేణుగోపాల్ రెడ్డి, కొనకళ్ల నారాయణ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వంపై అవినీతి మచ్చ
ధానిని కలిసిన తర్వాత నామా, మైసూరా విలేకరులతో మాట్లాడారు. 2జి స్పెక్ట్రమ్ నుంచి హసన్ అలీ వరకు జరిగిన కుంభకోణాలతో దేశ పరిపాలన వ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతిన్నదన్నారు. "వైఎస్ తన కుమారుడిని అత్యంత ధనికుడిగా చేసేందుకు పాల్పడిన అక్రమాలు అన్నీఇన్నీ కావు. మాకు వ్యక్తులు లక్ష్యం కాదు. అవినీతిపై పోరాటం ప్రతిపక్షాల విధి. జగన్ కొత్తగా పార్టీ పెట్టాడు కాబట్టి ఈ పోరాటం చేయడం లేదు. వైఎస్ ఉన్నప్పటి నుంచే చేస్తున్నాం'' అని మైసూరా తెలిపారు.
పదిహేను రోజుల కిందటే ప్రధాని అపాయింట్‌మెంట్ అడిగామన్నారు. కొందరు విలేకరులు నిష్పాక్షికంగా విధి నిర్వహణ చేయకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, పెట్టుబడిదారుల్లాగా ప్రశ్నలు అడుగుతున్నారని మైసూరా చురకలు అంటించారు.
దీనిపై ఆయన అనూహ్యమైన రీతిలో స్పందించారు. "సీబీఐ విచారణ అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మొదలైన తతంగం ఉంటుంది. ఐటీ, ఈడీలతో విచారణ జరిపిస్తాను'' అని ప్రధాని చెప్పడంతో టీడీపీ ఎంపీలు ఆశ్చర్యచకితులయ్యా రు. 'రాజా ఆఫ్ కరప్షన్' పేరిట రాష్ట్రానికి చెందిన అన్ని ప్రతిపక్ష పార్టీలు 2009 ఫిబ్రవరిలోనే కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. "జగన్ కంపెనీల్లో అక్రమ పెట్టుబడులపై మరిన్ని సాక్ష్యాలతో ఈ ఏడాది జనవరిలో రాజ్యాంగ సంస్థలకు, నియంత్రణ ఏజెన్సీలకు మళ్లీ ఫిర్యాదు చేశాం.
జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లావాదేవీలపై ఐటీ అధికారులు చేసిన దర్యాప్తులో పలు కీలకాంశాలు బయటపడ్డాయని తెలిపారు. జగతిలో రూ. 15కోట్లు పెట్టుబడి పెట్టిన 8 కంపెనీలు బోగస్‌వని... ముంబై, రాజ్‌కోట్, బెంగళూరు, కోల్‌కతాలకు చెందిన ఆ కంపెనీల చిరునామాలు కూడా బోగస్‌వేనని తేలింది. జగతి పబ్లికేషన్స్‌లో రూ.743.57 కోట్ల పెట్టుబడికి 90 శాతం వాటా ఉంచుకోగా... మిగిలిన 10 శాతం వాటా కోసం వివిధ కంపెనీలు రూ.300.49 కోట్లు పెట్టుబడిగా పెట్టాయి. సాక్షి పత్రికను ప్రారంభించకముం దే 35 రెట్లు అధిక ధరకు వాటా ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఐటీ కూడా ప్రశ్నించింది.
జగతి పబ్లికేషన్స్‌కు చెందిన భూమి, భవనాలు కూడా జగన్‌కు చెందిన మరో కంపెనీ జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు చెందినవని తెలిపింది. మాట్రిక్స్ లాబ్స్, పీవీ బిజినెస్ వెంచర్స్, హెటెరో గ్రూప్, అరబిందో ఫార్మా, రాంకీ గ్రూప్ మొదలైన కంపెనీలకు సెజ్‌లు, రేవులు, రియల్ ఎస్టేట్ నిబంధనల్లో సడలింపులు వంటి ప్రయోజనాలు సమకూర్చిన విషయం కూడా ఐటీ ఎత్తిచూపింది. వారు పెట్టిన 277.56 కోట్ల పెట్టుబడిని ఐటీ విభాగం అదనపు ఆదాయంగా భావించి రూ.122.78 కోట్ల పన్ను కట్టాలని ఆదేశించింది.
జగతి నష్టాలు రూ.349 కోట్లు దాటినప్పటికీ, గత రెండేళ్లలో ఇదే కంపెనీకి అంతే ప్రీమియంతో ఇవే కంపెనీల నుంచి రూ.1200 కోట్ల పెట్టుబడి రావడం, రూ.277.56 కోట్ల మేరకు అధికార దుర్వినియోగం జరగడాన్ని కూడా ఐటీ ఎత్తిచూపింది. జగన్‌కు చెందిన 35 కంపెనీల్లో ఆరేళ్లుగా ఇలా అక్రమ పెట్టుబడులు వచ్చాయి. లక్ష కోట్ల మేరకు మోసాలు జరిగాయి'' అని టీడీపీ ఎంపీలు ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
2003-04లో జగన్ ఆదాయం కేవలం రూ.9.19లక్షలుకాగా... 2010-11లో తన ఆదాయం రూ.500 కోట్లు ఉంటుందంటూ రూ.84 కోట్ల అడ్వాన్స్ పన్ను చెల్లించారని తెలిపారు. అంటే, జగన్ ఆదాయం ఏటా 5 వేల శాతం పెరిగిందని తెలిపారు. "ఇంత ప్రగతి భారత కార్పొరేట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగం. ఉదాహరణకు భారతీ సిమెంట్స్‌లో జగన్ తొలి పెట్టుబడి రూ.45.18 కోట్లు. అది కేవలం రెండేళ్లలోనే రూ.3,053 కోట్లకు పెరిగింది.
దాల్మియా సిమెంట్స్ వంటి బడా కంపెనీలు జగన్ కంపెనీలో రూ.10విలువైన వాటాను రూ.1450 ప్రీమియంతో కొనుగోలు చేశాయి. ఈ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం గనులు, ఇతర కేటాయింపులద్వారా ప్రయోజనం చేకూర్చింది'' అని తెలిపారు. జగన్ కు చెందిన సండూర్, కార్మెల్ ఆసియా, జనని, సరస్వతి, క్లాసిక్ రియాల్టీ ఇలా ఒక్కో కంపెనీ కథనాల్ని టీడీపీ నేతలు ప్రధానికి వివరంగా తెలిపారు. ప్రధానిని కలిసిన ఎంపీల్లో సుజనా చౌదరి, హరికృష్ణ, వేణుగోపాల్ రెడ్డి, కొనకళ్ల నారాయణ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వంపై అవినీతి మచ్చ
ధానిని కలిసిన తర్వాత నామా, మైసూరా విలేకరులతో మాట్లాడారు. 2జి స్పెక్ట్రమ్ నుంచి హసన్ అలీ వరకు జరిగిన కుంభకోణాలతో దేశ పరిపాలన వ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతిన్నదన్నారు. "వైఎస్ తన కుమారుడిని అత్యంత ధనికుడిగా చేసేందుకు పాల్పడిన అక్రమాలు అన్నీఇన్నీ కావు. మాకు వ్యక్తులు లక్ష్యం కాదు. అవినీతిపై పోరాటం ప్రతిపక్షాల విధి. జగన్ కొత్తగా పార్టీ పెట్టాడు కాబట్టి ఈ పోరాటం చేయడం లేదు. వైఎస్ ఉన్నప్పటి నుంచే చేస్తున్నాం'' అని మైసూరా తెలిపారు.
పదిహేను రోజుల కిందటే ప్రధాని అపాయింట్‌మెంట్ అడిగామన్నారు. కొందరు విలేకరులు నిష్పాక్షికంగా విధి నిర్వహణ చేయకుండా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, పెట్టుబడిదారుల్లాగా ప్రశ్నలు అడుగుతున్నారని మైసూరా చురకలు అంటించారు.
Sunday, March 13, 2011
జెండానే ఎజెండా * ఇడుపులపాయలో ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ పతాకావిష్కరణ
ప్రజా ఎజెండాను ప్రతిఫలించిన పార్టీ జెండా
రాజశేఖరుడి స్వర్ణయుగ పునరాగమన సూచికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతాకం
యువజన.. దళిత, శాంతి, రైతు రాజ్యానికి ప్రతీకగా 3 రంగులు
వైఎస్ ప్రవేశపెట్టిన 9 పథకాలను ప్రతిబింబించేలా చిహ్నాలు
జెండా మధ్యలో నవ్వుతూ కనిపించే రాజశేఖరుడి చిత్రం
పతాకావిష్కరణకు పోటెత్తిన అభిమానులు..
భారీగా తరలివచ్చిన నేతలు
అడుగుతీసి అడుగు వేయలేనంతలా అభిమాన తాకిడి
అభిమాన సునామీ..
జెండాలో యువజన, దళిత, శాంతి, రైతు రాజ్యానికి చిహ్నంగా నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉండగా.. ఆ మధ్యలో.. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదో ఒక లబ్ధి కలిగేలా వైఎస్సార్ ప్రవేశపెట్టిన తొమ్మిది పథకాలను (ఇందిరమ్మ ఇళ్లు, *2కే కిలో బియ్యం, జలయజ్ఞం, ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్స్‌మెంట్, భూ పంపిణీ, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, పింఛన్లు) తొమ్మిది గుర్తులతో ప్రతిబింబించారు. ఆ పథకాల మధ్యలో చిరునవ్వులు చిందిస్తోన్న మహానేత వైఎస్సార్ చిత్రాన్ని ఉంచారు. ఈ జెండా ఆవిష్కరణ విషయాన్ని, పార్టీ పేరును శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సభలో ప్రకటించడంతో రాష్టవ్య్రాప్తంగా అభిమానుల్లో వెల్లువెత్తిన భావోద్వేగం శనివారం ఇడుపులపాయలో ప్రతిబింబించింది. రాష్ట్రం నలుమూలల నుంచీ పోటెత్తిన అభిమానుల తాకిడి జన సునామీని తలపించింది. జెండాను ఆవిష్కరించిన యువనేత వైఎస్ జగన్, ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు, ఇతర నేతలు ఒక్కక్షణం కూడా స్థిమితంగా నిలబడలేనంతగా అభిమానుల తాకిడి వారిని కుదిపివేసింది.
అడుగు తీసి అడుగు వేయడమే అతికష్టం..
యువనేత జగన్ శనివారం ఉదయం తొలుత పులివెందులకు చేరుకున్నారు. అక్కడ ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం హెలికాప్టరులో ఇడుపులపాయ చేరుకున్నారు. యువనేత వెంట హెలికాప్టర్‌లో ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మమ్మ, సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్‌కుమార్ వచ్చారు. హెలికాప్టర్ దిగిన వెంటనే జగన్ ఇడుపులపాయలోని తమ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అప్పటికే వివిధ జిల్లాల నుంచిగెస్ట్‌హౌస్‌కు చేరుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులను యువనేత పలుకరించారు. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచివైఎస్ జగన్, వైఎస్ విజయలక్ష్మమ్మలతో పాటు నేతలంతా వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడికి వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలు, అభిమానులు యువనేతను దగ్గరి నుంచి చూసేందుకు, కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపడంతో ఆయన అడుగు ముందుకు వేయడం అతికష్టమైంది. వాహనం దిగిన యువనేత కొద్ది అడుగులు వేసి సమాధి వద్దకు చేరడానికి, అభిమానుల తాకిడి వల్ల విపరీతమైన ఆలస్యం జరిగింది. సమాధి వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించిన తరువాత, తోపులాట, హర్షధ్వానాల మధ్య ‘వైఎస్సార్ కాంగ్రెస్’ పార్టీ జెండాను యువనేత ఆవిష్కరించారు.
అభిమానుల తాకిడితో పతాకాన్ని కొద్దిసెకన్లు మాత్రమే ప్రదర్శించడంతో ఈ దృశ్యం మీడియా కెమెరాలకు దొరకడమే కష్టమైపోయింది.
అనుకున్న ముహూర్తానికే ఆవిష్కరణ
ముందుగా నిర్ణయించిన ముహూర్తం మధ్యాహ్నం 2.29గంటలకే పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన జన సందోహం తాకిడితో, ముహూర్త సమయానికి పతాకావిష్కరణ జరుగుతుందో, లేదోననే సంశయం పటాపంచలైంది. యువనేత వైఎస్ జగన్ తదితరులంతా ముహూర్త సమయానికి అరగంట ముందే వైఎస్సార్ సమాధి వద్దకు చేరుకోవడంతో, అభిమానుల తాకిడి, తోపులాటలు ఉన్నా, అనుకున్న సమయానికి పతాకాన్ని ఆవిష్కరించగలిగారు.
తరలివచ్చిన నేతలు
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల్లో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు కొండా సురేఖ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కాట సాని రామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, శోభానాగిరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, కె.శ్రీనివాసులు, కమలమ్మ, కాపు రామచంద్రారెడ్డి, గురునాథరెడ్డి, అనంతపురం జడ్పీ చైర్‌పర్సన్ తోపుదుర్తి కవిత, చిత్తూరు జడ్పీ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కొండా మురళి, పుల్లా పద్మావతి, మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, మారెప్ప, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, గడికోట మోహన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, భూమన కరుణాకర్‌రెడ్డి, గోనె ప్రకాశరావు, గట్టురామచంద్రరావు, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, నెల్లూరు మాజీ డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, కడప మాజీ డీసీసీ అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, పీసీసీ ఎస్టీ సెల్ మాజీ కన్వీనర్ రాజమల్ల సిద్ధేశ్వర్ తదితరులున్నారు.
స్వర్ణయుగ సంకేతం
పొడుస్తున్న పొద్దును, కొత్త నమ్మకాన్ని తలపించేలా వైఎస్‌ఆర్ చుట్టూ నారింజ రంగు వలయాకారంలో... దివంగత నేత ప్రవేశపెట్టిన 9 సంక్షేమ పథకాల అమలు బాధ్యతను గుర్తుచేసే చిహ్నాలు
నీలం..
మహానేతకు ఇష్టమైన నీటి రంగు
యువ చైతన్యం, దళితుల
ఆత్మగౌరవానికి చిహ్నం
తెలుపు
శాంతికి, స్వచ్ఛతకు చిహ్నం
ఆకుపచ్చ
వైఎస్ కలగన్న హరితాంధ్రప్రదేశ్
మైనార్టీ మహాశక్తి, మానవీయ స్ఫూర్తి
పేదవాడి సంక్షేమమే ఎజెండాగా, బాధ్యతకు ప్రతిరూపంగా కనిపించేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రూపుదిద్దుకుంది. శనివారం మధ్యాహ్నం 2.29 గంటలకు ఆవిష్కృతమైన ఈ జెండా స్వర్ణయుగానికి సంకేతమని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా జెండా విశిష్టతలను వివరించాయి. నీలం, ఆకుపచ్చ మధ్యలో తెలుపు రంగులతో జెండాను రూపొందించారు. మధ్యలో ఉన్న తెలుపు రంగులో కేంద్ర బిందువుగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కనిపిస్తారు. పొడుస్తున్న పొద్దును, ఒక కొత్త నమ్మకాన్ని, స్వర్ణయుగాన్ని తలపించేలా వైఎస్సార్ చుట్టూ నారింజ రంగు కనిపిస్తుంది. నారింజ రంగు చుట్టూ వలయాకారంలో దివంగత నేత ప్రవేశపెట్టిన తొమ్మిది సంక్షేమ పథకాలకు సంకేతంగా చిహ్నాలున్నాయి.
జెండాలో సంక్షేమ రూపాలివీ..
నిరుపేదలందరికీ నిలువ నీడ కోసం ఇళ్లు, రెండు రూపాయలకే కిలో బియ్యం, రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ప్రాజెక్టుల నిర్మాణం, రైతన్నకు వెన్నంటి ఉండాలన్న లక్ష్యంతో ఉచిత విద్యుత్తు, ప్రతి నిరుపేద విద్యార్థి ఉన్నతవిద్య కలను నిజం చేసే ఫీజు రీయింబర్స్‌మెంట్, భూమిలేని ప్రతిపేద రైతుకు భూపంపిణీ, ఆరోగ్యశ్రీ కింద మరింత మెరుగైన ఉచిత వైద్యం, మహిళలకు పావలా వడ్డీ, వృద్ధులకు పింఛన్లతో సహా అన్ని రకాల ఆసరా కల్పించడం... వంటి అత్యంత కీలకమైన సంక్షేమ పథకాలను అమలు చేయడానికి పార్టీ బాధ్యతను నిరంతరం గుర్తుచేసేలా జెండాలో వాటి చిహ్నాలను పొందుపరిచారు.
జెండా పొడవు-వెడల్పుల నిష్పత్తి-2:3
జెండాలో నీలం, ఆకుపచ్చలు ఇరువైపులా చెరొక భాగం ఉంటే.. మధ్యలో తెలుపురంగు రెండింతలు ఉంటుంది. ఈ తెలుపు రంగులోనే తొమ్మిది పథకాల చిహ్నాలు, వాటి మధ్య చిరునవ్వుతో నమ్మకానికి ప్రతిరూపంగా వైఎస్సార్ చిత్రం కనిపిస్తుంది.
అంబరాన్ని తాకిన సంబరం *
జన పార్టీకి ఘన స్వాగతం
రాష్టవ్య్రాప్తంగా వెల్లువెత్తిన హర్షాతిరేకాలు
ర్యాలీలు, సభలు, ప్రదర్శనలు
మహానేత విగ్రహాలకు క్షీరాభిషేకాలు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రాష్ట్ర ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపింది. రాష్టవ్య్రాప్తంగా బడుగు బలహీన వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నగరాలు, జిల్లా, మండల కేంద్రాల్లో కొత్త పార్టీకి స్వాగతం పలుకుతూ బాణసంచాలు కాల్చారు. ర్యాలీలు, సభలు నిర్వహించారు. కేకులు కట్ చేసి ఆనందం పంచుకున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధ న జగన్ వల్లే సాధ్యమని నినదించారు. పలుచోట్ల వైఎస్ అభిమానులు స్వచ్ఛందంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించుకున్నారు. విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఆదివారం పెద్దఎత్తున ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జిల్లాల్లో పండగ వాతావరణం..
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వైఎస్సార్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పతాకాన్ని ఆవిష్కరించారు. కాకినాడలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరులు నృత్యాలు చేస్తూ, డప్పులు వాయిస్తూ బాణసంచా కాల్చారు. పిఠాపురంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి సెంటర్‌లో వైఎస్‌ఆర్ విగ్రహం సాక్షిగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాలతో పాటు వివిధ ప్రాంతాల్లో యువకులు ర్యాలీ నిర్వహించారు. విశాఖలోని సంపత్ వినాయక దేవస్థానంలో జగన్ యువసేన, విద్యార్థి సేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరి కాయలు కొట్టారు. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల మండలం మొయిదలో మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లాలో గ్రామగ్రామాన వేడుకలు జరుపుకున్నారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్ సర్కిల్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించి బాణసంచా కాల్చారు.
ఇచ్చాపురం, సోంపేట, పలాసల్లో ప్రదర్శనలు చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో బైక్ ర్యాలీ, చిలకలూరిపేట, రావులపాలెం, పురుషోత్తమ పట్టణాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు చేశారు. రేపల్లెలో అంబటి రాంబాబు నివాసం వద్ద నాయకులు సంబరాలు జరిపారు. ప్రకాశం జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ అభిమానులు సందడి చేశారు. బాణాసంచా పేలుళ్లు, స్కూటర్ ర్యాలీలతో కృష్ణా జిల్లా మార్మోగింది. విజయవాడలో అభిమానులు బస్సులో ప్రయాణికులకు స్వీట్లు పంచారు. పాతబస్టాండ్ వద్ద పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జోగి సురేష్ తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.
అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున అభిమానులు సంబరాల్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో నేతలంతా ఇడుపులపాయలో పతాకావిష్కరణకు వెళ్లడంతో అభిమానులు, కార్యకర్తలే సొంతంగా సంబరాలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఇలాకా అయిన కల్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సందడి చేశారు. బాణసంచా పేల్చి.. పార్టీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో వికలాంగులు బాణసంచా కాల్చారు. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పీలేరు నియోజవర్గ కేంద్రం జగన్నినాదాలతో దద్దరిల్లింది. తిరుపతిలో అలిపిరి వద్ద మహిళలు టెంకాయలు కొట్టి పూజలు చేశారు. తిరుమలలో అఖిలాండం వద్ద అభిమానులు 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. కర్నూలు జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు చెందిన నేతలంతా స్మృతివనం వద్దకు చేరుకుని మహానేతకు నివాళులు అర్పించారు. కర్నూలు, నంద్యాల, మంత్రాలయం నియోజకవర్గాల్లో మహిళలు, ముస్లిం సోదరులు బాణసంచా కాల్చారు. మహబూబ్‌నగర్‌లో కార్యకర్తలు రోడ్లపైకి వ చ్చి సంబరాలు చేసుకున్నారు. వరంగల్‌లో కలెక్టరేట్ ఎదుట ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి జగన్ యువసేన ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. కురవిలో కార్యకర్తలు మోకాళ్లపై నడిచి వీరభద్రస్వామికి మొక్కులు సమర్పించుకున్నారు.
నల్లగొండ జిల్లా కోదాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పతాకాలు చేతపట్టి, డప్పు వాయిద్యాలతో ప్రదర్శన చేశారు. ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించిన అభిమానులు అనంతరం తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. హౌజింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర వృద్ధుల అనాథాశ్రమంలో అన్నదానం చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, నిర్మల్, లక్సెట్టిపేట్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాల్లో మేళాలతో ఊరేగింపు నిర్వహించారు. ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్’ పార్టీకి అంతా మంచే జరుగుతుందని చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు ఆశీర్వదించారు. శనివారం యువనేత జెండాను ఆవిష్కరించే సమయంలో అభిమానులు చిలుకూరు బాలాజీ దేవాలయంలో పూజలు నిర్వహించారు.
సాగర్ సొసైటీలో కోలాహలం..
హైదరాబాద్ సాగర్ సొసైటీలోని యువనేత క్యాంపు కార్యాలయం వద్ద అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఉదయం నుంచే అక్కడికి చేరిన వందలాది మంది పార్టీ పతాకం ఆవిష్కరణ సమయానికి కార్యాలయంలో కేక్ కోసి పంచారు. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద పోతుల ప్రసాద్ ఆధ్వర్యంలో అభిమానులు బాణసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్’ జెండా ఆవిష్కరణ
ర్యాలీలు, సభలు, ప్రదర్శనలు
మహానేత విగ్రహాలకు క్షీరాభిషేకాలు
జిల్లాల్లో పండగ వాతావరణం..
ఇచ్చాపురం, సోంపేట, పలాసల్లో ప్రదర్శనలు చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో బైక్ ర్యాలీ, చిలకలూరిపేట, రావులపాలెం, పురుషోత్తమ పట్టణాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు చేశారు. రేపల్లెలో అంబటి రాంబాబు నివాసం వద్ద నాయకులు సంబరాలు జరిపారు. ప్రకాశం జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ అభిమానులు సందడి చేశారు. బాణాసంచా పేలుళ్లు, స్కూటర్ ర్యాలీలతో కృష్ణా జిల్లా మార్మోగింది. విజయవాడలో అభిమానులు బస్సులో ప్రయాణికులకు స్వీట్లు పంచారు. పాతబస్టాండ్ వద్ద పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జోగి సురేష్ తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.
అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున అభిమానులు సంబరాల్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో నేతలంతా ఇడుపులపాయలో పతాకావిష్కరణకు వెళ్లడంతో అభిమానులు, కార్యకర్తలే సొంతంగా సంబరాలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఇలాకా అయిన కల్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సందడి చేశారు. బాణసంచా పేల్చి.. పార్టీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో వికలాంగులు బాణసంచా కాల్చారు. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పీలేరు నియోజవర్గ కేంద్రం జగన్నినాదాలతో దద్దరిల్లింది. తిరుపతిలో అలిపిరి వద్ద మహిళలు టెంకాయలు కొట్టి పూజలు చేశారు. తిరుమలలో అఖిలాండం వద్ద అభిమానులు 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. కర్నూలు జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు చెందిన నేతలంతా స్మృతివనం వద్దకు చేరుకుని మహానేతకు నివాళులు అర్పించారు. కర్నూలు, నంద్యాల, మంత్రాలయం నియోజకవర్గాల్లో మహిళలు, ముస్లిం సోదరులు బాణసంచా కాల్చారు. మహబూబ్‌నగర్‌లో కార్యకర్తలు రోడ్లపైకి వ చ్చి సంబరాలు చేసుకున్నారు. వరంగల్‌లో కలెక్టరేట్ ఎదుట ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి జగన్ యువసేన ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. కురవిలో కార్యకర్తలు మోకాళ్లపై నడిచి వీరభద్రస్వామికి మొక్కులు సమర్పించుకున్నారు.
నల్లగొండ జిల్లా కోదాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పతాకాలు చేతపట్టి, డప్పు వాయిద్యాలతో ప్రదర్శన చేశారు. ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించిన అభిమానులు అనంతరం తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. హౌజింగ్ బోర్డు కాలనీలోని వీరబ్రహ్మేంద్ర వృద్ధుల అనాథాశ్రమంలో అన్నదానం చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, నిర్మల్, లక్సెట్టిపేట్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాల్లో మేళాలతో ఊరేగింపు నిర్వహించారు. ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్’ పార్టీకి అంతా మంచే జరుగుతుందని చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు ఆశీర్వదించారు. శనివారం యువనేత జెండాను ఆవిష్కరించే సమయంలో అభిమానులు చిలుకూరు బాలాజీ దేవాలయంలో పూజలు నిర్వహించారు.
సాగర్ సొసైటీలో కోలాహలం..
హైదరాబాద్ సాగర్ సొసైటీలోని యువనేత క్యాంపు కార్యాలయం వద్ద అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఉదయం నుంచే అక్కడికి చేరిన వందలాది మంది పార్టీ పతాకం ఆవిష్కరణ సమయానికి కార్యాలయంలో కేక్ కోసి పంచారు. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద పోతుల ప్రసాద్ ఆధ్వర్యంలో అభిమానులు బాణసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్’ జెండా ఆవిష్కరణ
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||
Friday, March 11, 2011
‘ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ’ * జగ్గంపేట సభ వేదికగా పార్టీ పేరు ప్రకటించిన వైఎస్ జగన్
పార్టీకి మూడు రంగుల జెండా ఉంటుంది ఇడుపులపాయలో నాన్న పాదాల చెంత నేను, అమ్మ కలిసి ఆవిష్కరిస్తాం ఈ పార్టీ ఎలా ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు ప్రతి పేదోడి మొహాన చిరునవ్వు చూసే పార్టీ అవుతుంది పార్టీ ప్రకటన కార్యక్రమం ఘనంగా నిర్వహించాలనుకున్నాం జిల్లాలో ఎన్నికల కోడ్ వల్ల అది వీలుకాలేదు కడప ఉప ఎన్నికలయ్యాక ఘనంగా సభ పెట్టుకుందాం ఎన్నికలయ్యాక ఇడుపులపాయలో రెండు రోజుల ప్లీనరీ మేధో మథనం చేసి పార్టీ విధివిధానాల రూపకల్పన మూడో రోజు అందరి సమక్షంలో వాటిని ప్రకటిస్తాం కోట్లాది మందిలో ఎన్నాళ్ల నుంచో నెలకొన్న ఉత్కంఠకు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెరదించారు. పేదల మోముల్లో చిరునవ్వులు చిందించడమే లక్ష్యంగా తాను ఏర్పాటు చేయబోయే పార్టీ పేరును ప్రకటించారు. తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరిట ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని సాక్షిగా, అభిమానుల హర్షధ్వానాల మధ్య యువనేత పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్లూ ఇడుపులపాయలోనే పార్టీ పేరు ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్న తరుణంలో.. ఇలా అనూహ్యంగా జగ్గంపేటలో ప్రకటించే సరికి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. పార్టీకి మూడు రంగుల జెండా ఉంటుందని, దాన్ని శనివారం ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ పాదాల చెంత ఆవిష్కరిస్తామని జగన్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పీఆర్‌పీ అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, జిల్లా మహిళా రాజ్యం అధ్యక్షురాలు రొంగలి లక్ష్మి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితర ముఖ్యనాయకులు.. జగన్ పార్టీలో చేరుతున్నట్లు ఈ సభలో ప్రకటించారు. ప్రజా సంక్షేమ ప్రభుత్వ స్థాపన కోసం మరో సంవత్సరమో, రెండు సంవత్సరాలో జరుగబోయే పోరుబాటలో నాతోపాటు అడుగులో అడుగువేసి పోరాటం చేయడానికి ఇక్కడ ఒక్కటైన జ్యోతుల నెహ్రూ, దొరబాబు, పద్మమ్మలకు, ముఖ్యంగా జగ్గంటపే సోదరులందరికీ, అక్కా చెల్లెళ్లకు, అవ్వలకు, తాతలకు, మీ ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరునా కృతజ్ఞతలు చెప్తున్నాను. పార్టీ తొలి కండువా నెహ్రూకే.. నేడే జగన్ పార్టీ | ||||||||
|
Friday, February 25, 2011
మీ ఆత్మసాక్షిగా ఓటేయండి - ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిమానులకు జగన్ పిలుపు
ఈ ఎన్నికల్లో మా అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామనే ప్రచారం జోరుగా సాగుతోంది...
మేం ఎవరినీ ఈసారికి పోటీకి దింపడం లేదు
పార్టీని ఏర్పాటు చేయటం, సంస్థాగతంగా పటిష్టం చేయటం, స్థానికస్థాయిలో కార్యవర్గాలను
ఏర్పాటు చేసి బలోపేతం చేయడమే ప్రస్తుత మా లక్ష్యం
త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరినీ పోటీకి దింపడం లేదని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ వర్గం పోటీ చేయనుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. పార్టీ స్థాపన, కార్యవర్గాల ఏర్పాటు పూర్తయిన తర్వాత మాత్రమే ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేయాలన్నదే తమ అభిప్రాయంగా ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో దివంగత నేత ైవె ఎస్ అభిమానులందరూ ఆత్మసాక్షి ప్రకారం నడుచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటన పూర్తి పాఠం..
‘‘మహానేత వైఎస్ ఆశయాల్ని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని, ఆయన కుటుంబాన్ని అభిమానించే నేతలకు, అశేష జనావళికి నాదొక విన్నపం.’’
‘‘మిత్రులారా! త్వరలో రాష్ట్ర శాసనమండలికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, స్థానిక సంస్థల కోటా నుంచి జరగబోతున్న ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలూ తమ శక్తియుక్తుల్ని కేంద్రీకరిస్తున్నాయి. గెలవటానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌లో దివంగత నేత వైఎస్సార్‌కు జరుగుతున్న అవమానాలు, నన్ను పార్టీ నుంచి గెంటివేయడానికి చేసిన ప్రయత్నాలు భరించలేక ఆ పార్టీ అధిష్టానాన్ని ఎదిరించి నేను బయటకు వచ్చిన సంగతి మీకందరికీ తెలిసిందే. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకొచ్చిన నాకు... కాంగ్రెస్‌లోని వైఎస్సార్ అభిమానులు, జన సంక్షేమాన్ని కాంక్షించే నాయకులు బహిరంగంగానే మద్దతు పలుకుతున్న సంగతీ రోజూ మీరు చూస్తున్నదే.
జలయజ్ఞం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు.. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, అభయహస్తం పింఛన్లు, పావలా వడ్డీ రుణాలు ఇలా ఏవైనా కావచ్చు. పేదలకు లబ్ధి చేకూర్చే ప్రతి పథకానికీ ఈ ప్రభుత్వం ఎలా తూట్లు పొడుస్తున్నదో.. సర్కారు పడిపోతే తమ చిరునామాలెక్కడ గల్లంతవుతాయో అనే భయంతో.. దానికి ప్రతిపక్ష తెలుగుదేశం ఎలా కొమ్ము కాస్తున్నదో ఇదంతా మీరు ప్రత్యక్షంగా చూస్తున్నదే. దీన్నంతటినీ ఏవగించుకుంటూ జనహిత రాజకీయాల కోసం నాకు బాసటగా నిలిచినవారినిపుడు ‘జగన్ వర్గం’గా పిలుస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయంగా పోరాడాలన్నా, ఏదైనా సాధించాలన్నా రాజకీయ పార్టీ అవసరం కాబట్టి వైఎస్సార్ పేరిట పార్టీ స్థాపన, దానికి సంబంధించిన నిబంధనావళి, విధివిధానాల రూపకల్పన ప్రక్రియను ఆరంభించాం. అది పూర్తవటానికి ఇంకా కొంత సమయం పడుతుంది.’’
‘‘రాబోయే ఎన్నికల్లో మా వర్గం నుంచి అభ్యర్థుల్ని బరిలోకి దింపుతున్నామనే ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకులు కూడా దీనిపై చర్చించుకుంటున్నారు. దీనికి సమాధానంగా రాస్తున్న ఈ లేఖలో నేను చెప్పేదొక్కటే. రాష్ట్ర రాజకీయాల్ని సమూలంగా మార్చాలని, సామాన్య జన సంక్షేమానికి కట్టుబడిన దివంగత నేత వైఎస్సార్ ఆశయాల్ని నెరవేర్చాలనే దృఢ నిశ్చయంతో మేం ముందుకు కదులుతున్నాం. దీనికోసం పార్టీని ఏర్పాటు చేయటంతో పాటు సంస్థాగతంగా దాన్ని పటిష్టం చేయడం, స్థానిక స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కార్యవర్గాల్ని ఏర్పాటు చేసి బలోపేతం చేయటం వంటివన్నీ మొదట పూర్తి చెయ్యాలన్న ఆలోచనతో ఉన్నాం. అలా చేసిన తరువాతే ఏ ఎన్నికల్లోనైనా పోటీ పడాలన్నది మా మనోభిప్రాయం. కాబట్టే వచ్చే నెల్లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరినీ మేం పోటీకి దింపే యోచన చేయటం లేదు. అందుకని విజ్ఞులు, వైఎస్సార్ పట్ల అంతులేని అభిమానం కలిగి ఉన్న వారు ఈ ఎన్నికల్లో వారి ఆత్మసాక్షి ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’’
ఇట్లు
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
Thursday, February 24, 2011
ఈ సర్కారును కొనసాగిస్తే... దేవుడి దృష్టిలో తప్పే! * జనమే జగన్.. జగనే జనం
‘ఫీజు రీయింబర్స్‌మెంటు’కు బడ్జెట్‌లో అన్యాయం చేశారు
రూ. 6,800 కోట్లు అవసరమైతే 3 వేల కోట్లు కేటాయించారు
ఈ సిగ్గులేని సర్కారు పేద విద్యార్థుల కోపాగ్నిలో కొట్టుకుపోతుంది
బడ్జెట్‌ను సవరించి విద్యార్థులను ఆదుకోవాలి... లేదంటే ఉద్యమం ఉధృతం
నిమ్మరసమిచ్చి జగన్ దీక్ష విరమింపజేసిన వరలక్ష్మి తల్లిదండ్రులు
హోరెత్తిన దీక్షా ప్రాంగణం
ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని వరలక్ష్మి తల్లిదండ్రులు...జగన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వారం రోజులపాటు ప్రవాహంలా తరలివస్తున్న జనం గురువారం కూడా పెద్ద ఎత్తున పోటెత్తారు. ఉదయం నుంచీ ‘జై జగన్’ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగుతూనే ఉంది. ఏడు రోజులపాటు మెతుకు ముట్టకపోవడంతో నిస్సత్తువగా ఉన్న జగన్.. అంతమంది ప్రజల ఆదరాభిమానాలను చూశాక శక్తినంతా కూడదీసుకుని వారినుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడ్డానికి లేవగానే.. జనంలో భావోద్వేగం ఉప్పొంగింది. దీక్షా ప్రాంగణమంతా కేరింతలు, హర్షధ్వానాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
రాజశేఖరుడి సువర్ణ యుగం చూశాను
‘శ్రీరాముడి రాజ్యమైతే నేను చూడలేదు.. కానీ రాజశేఖరుడి సువర్ణయుగం చూశాను. ఆయన చనిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే.. గండె బరువెక్కుతోంది. పేదలంతా పెద్ద చదువులు చదవాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత నేత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదివి.. ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో అయితే... సంపాదించే డబ్బులో కొంత ముసలి తల్లిదండ్రులకు పంపిస్తే... పేదరికం నుంచి ఆ కుటుంబం బయటపడుతుందని, అందుకే ప్రతి పేదవాడు చదవాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పరితపించారు.’
‘సర్కారు ఫీజులు కట్టకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న వరలక్ష్మి ఇంటికి మొన్న నేను వెళ్లాను. ప్రభుత్వం ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో... తనను చదివించలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి వరలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ప్రమాదమంటూ కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది. వరలక్ష్మి ఇంటికి వెళ్లినప్పుడు నాకు అనిపించింది.. ఈ ప్రభుత్వానికి బుద్ధిరావాలంటే... గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలంటే.. ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తే సరిపోదని.. అందుకే ఏడు రోజులు దీక్ష చేయాలని నిర్ణయించుకున్నా.’
ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా..
‘ఈ సర్కారును మరోసారి హెచ్చరిస్తున్నా.. నెలరోజులు జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఫీజుల పథకం కేటాయింపుల్లో మార్పులు చేసి పేదవాడిని ఆదుకోండి. లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నా.’
బడ్జెట్‌లోనైనా నిధులిస్తారని ఆశించాను..
‘అసెంబ్లీలో బడ్జెట్ పెట్టబోతున్న సమయంలో నిరాహార దీక్ష చేసి ఒత్తిడి తెస్తే... ఫీజుల పథకానికి సరిపడా నిధులు కేటాయిస్తారని ఆశించాను. 25 లక్షల మంది పేద విద్యార్థులకు భవిష్యత్ ఉంటుందని ఏడు రోజుల పాటు దీక్ష చేశాను. కానీ బడ్జెట్ చూస్తే.. 1.28 లక్షల కోట్ల బడ్జెట్. గత ఏడాది కంటే 15 వేల కోట్లు ఎక్కువగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో.. 25 లక్షల పేద విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు.’
రూ. 3,000 కోట్లే కేటాయిస్తారా?
‘ఈ ఏడాదికి ఫీజుల పథకానికి రూ. 3,400 కోట్లు అవసరం ఉంటే.. ఇప్పటికీ పైసా కూడా చెల్లించిన పాపాన పోలేదీ ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం కూడా 25 లక్షల మంది పేద విద్యార్థులు చదువుకోవాలంటే.. మరో రూ. 3,400 కోట్లు అవసరం. మొ త్తం రూ. 6,800 కోట్లు అవసరముంటే.. కేవలం రూ. 3,000 కోట్లు కేటాయించి చేతులు దులుపేసుకుంది. మరి ఈ 25 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఏంటో ఈ సర్కారు ఏం సమాధానం చెబుతుంది?’
జనమే జగన్.. జగనే జనం
ప్రజల కోసం వారంపాటు కఠిన నిరాహార దీక్ష చేసిన జగన్
లక్షలాదిగా తరలివచ్చిన జనం
ఆయనిప్పుడు ఎంపీ కాదు.. ఎమ్మెల్యే కాదు.. అయినా ప్రజల ప్రతినిధిగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.. అందుకే ఆయన వెంటే జనం నడుస్తున్నారు.. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వేలాదిగా గుమికూడుతున్నారు. జనమే జగన్.. జగనే జనమని వారు గట్టిగా నమ్ముతున్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగిన ‘ఫీజు పోరు’కు వారం రోజులపాటు లక్షలాదిగా తరలివచ్చిన జనప్రవాహం.. ఆయనపై ప్రజల్లో ఉన్న ఆప్యాయతకు, ఆదరాభిమానాలకు నిదర్శనం. అయితే జగన్ ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా.. లక్షలాది మంది విద్యార్థులిలా దీక్షకు తరలివచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినా.. సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా.. సర్కారు మాత్రం స్పందించలేదు. బడ్జెట్‌లో అరకొర కేటాయింపులతో వచ్చే ఏడాది ఫీజుల పథకం కొనసాగింపును ప్రశ్నార్థకం చేసింది.
ఏడో రోజూ.. హోరెత్తిన ధర్నా చౌక్: 25 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ చార్జీలు చెల్లించాలని డిమాండుతో ‘ఫీజు పోరు’ పేరిట యువనేత జగన్ చేపట్టిన నిరాహార దీక్ష గురువారం సాయంత్రం ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుంచీ వేలాది మంది విద్యార్థులు దీక్షాస్థలికి వచ్చి యువనేతకు సంఘీభావం ప్రకటించారు. వారితోపాటు కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు, మహిళలు, పిల్లలు హాజరయ్యారు. దీక్ష కొనసాగిన ఏడు రోజుల్లో రెండు రోజులు తెలంగాణలో పూర్తి బంద్ జరిగినా.. దీక్షకు జన ప్రవాహం తగ్గలేదు. కాలి నడకన లక్షలాది మంది ఇందిరాపార్కుకు దండు కట్టారు.
ఆరోగ్యం క్షీణించినా..: నిరాహార దీక్ష ప్రారంభించిన తర్వాత తొలి రెండు రోజులు ఆరోగ్యంగా ఉన్న యువనేత ఆ తర్వాత రోజు రోజుకూ నీరసించి పోయారు.
తొలి నాలుగు రోజులు పగలంతా వేదిక మీద కూర్చునే ప్రజలను పలకరించిన జగన్.. చివరి మూడు రోజులు దాదాపు పడుకొనే ఉన్నారు. మధ్యలో అప్పుడప్పుడు లేచి ప్రజలకు అభివాదం చేశారు. ఆఖరు రెండు రోజులు ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణించింది. షుగర్ లెవల్స్ వేగంగా పడిపోతున్నాయని, సోడియం లెవల్స్ కూడా గణనీయంగా తగ్గాయని, మూత్రంలో కీటోన్ బాడీస్ భారీగా పోతున్నాయని వైద్యులు నిర్ధారించారు. తక్షణం వైద్య సహాయం అందించాలని వైద్యులు సూచించారు. వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే ఆరోగ్యం ప్రమాదకరస్థాయికి క్షీణించే అవకాశం ఉందని హెచ్చరించారు. అయినా జగన్ దీక్ష వీడలేదు.
పోలీసుల ప్రయత్నం: ఐదో రోజు, ఆరో రోజూ అర్ధరాత్రి వచ్చిన పోలీసులు యువనేతను ఆసుపత్రికి తరలించాలని ప్రయతం చేశారు. ఆరోగ్యం విషమిస్తోందని వైద్యులు హెచ్చరించారని, వైద్య చికిత్సకు అంగీకరించాలని వారు జగన్‌ను కోరారు. తన ఆరోగ్యం కంటే, 25 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్ తనకు ముఖ్యమని చెబుతూ పోలీసుల విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు.
ఏడో రోజూ.. హోరెత్తిన ధర్నా చౌక్: 25 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ చార్జీలు చెల్లించాలని డిమాండుతో ‘ఫీజు పోరు’ పేరిట యువనేత జగన్ చేపట్టిన నిరాహార దీక్ష గురువారం సాయంత్రం ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుంచీ వేలాది మంది విద్యార్థులు దీక్షాస్థలికి వచ్చి యువనేతకు సంఘీభావం ప్రకటించారు. వారితోపాటు కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు, మహిళలు, పిల్లలు హాజరయ్యారు. దీక్ష కొనసాగిన ఏడు రోజుల్లో రెండు రోజులు తెలంగాణలో పూర్తి బంద్ జరిగినా.. దీక్షకు జన ప్రవాహం తగ్గలేదు. కాలి నడకన లక్షలాది మంది ఇందిరాపార్కుకు దండు కట్టారు.
ఆరోగ్యం క్షీణించినా..: నిరాహార దీక్ష ప్రారంభించిన తర్వాత తొలి రెండు రోజులు ఆరోగ్యంగా ఉన్న యువనేత ఆ తర్వాత రోజు రోజుకూ నీరసించి పోయారు.
తొలి నాలుగు రోజులు పగలంతా వేదిక మీద కూర్చునే ప్రజలను పలకరించిన జగన్.. చివరి మూడు రోజులు దాదాపు పడుకొనే ఉన్నారు. మధ్యలో అప్పుడప్పుడు లేచి ప్రజలకు అభివాదం చేశారు. ఆఖరు రెండు రోజులు ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణించింది. షుగర్ లెవల్స్ వేగంగా పడిపోతున్నాయని, సోడియం లెవల్స్ కూడా గణనీయంగా తగ్గాయని, మూత్రంలో కీటోన్ బాడీస్ భారీగా పోతున్నాయని వైద్యులు నిర్ధారించారు. తక్షణం వైద్య సహాయం అందించాలని వైద్యులు సూచించారు. వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే ఆరోగ్యం ప్రమాదకరస్థాయికి క్షీణించే అవకాశం ఉందని హెచ్చరించారు. అయినా జగన్ దీక్ష వీడలేదు.
పోలీసుల ప్రయత్నం: ఐదో రోజు, ఆరో రోజూ అర్ధరాత్రి వచ్చిన పోలీసులు యువనేతను ఆసుపత్రికి తరలించాలని ప్రయతం చేశారు. ఆరోగ్యం విషమిస్తోందని వైద్యులు హెచ్చరించారని, వైద్య చికిత్సకు అంగీకరించాలని వారు జగన్‌ను కోరారు. తన ఆరోగ్యం కంటే, 25 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్ తనకు ముఖ్యమని చెబుతూ పోలీసుల విజ్ఞప్తిని ఆయన తిరస్కరించారు.
జగన్ దీక్షకు హాజరైన ప్రజాప్రతినిధులు: దీక్షలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, కొండా సురేఖ, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, కమలమ్మ, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, జయసుధ, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కుంజా సత్యవతి, గొల్ల బాబురావు, గుర్నాథరెడ్డి, పీఆర్పీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, పుల్లా పద్మావతి, కొండా మురళి, సినీనటి రోజా, మాజీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ఎడ్మ క్రిష్ణారెడ్డి, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, జగ్గారెడ్డి, వడ్డి వీరభద్రరావు, జి.సుబ్బారావు, ప్రతాప అప్పారావు, నారాయణస్వామి, మాజీ మంత్రి మారెప్ప, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, పీసీసీ కిసాన్ సెల్ మాజీ ప్రధాన కార్యదర్శి గట్టు రామచంద్రరావు, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ నాగార్జున, సినీనటులు విజయ్‌చందర్, పోసాని కృష్ణ మురళి, శాప్ మాజీ చైర్మన్ రాజ్‌సింగ్ ఠాకూర్, ముక్కా రూపానందరెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి, పీసీసీ ఎస్సీ సెల్ మాజీ కార్యదర్శి రాచమల్ల సిద్ధేశ్వర్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అమృతాసాగర్, పీసీసీ మాజీ కార్యదర్శి కోటింరెడ్డి వినయ్‌రెడ్డి హాజరయ్యారు.
అపోలోలో జగన్‌కు వైద్యపరీక్షలు
యువనేత వైఎస్ జగన్ గురువారం దీక్ష ముగించాక జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అరగంట పాటు ఆయనకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ తల్లి విజయమ్మ, భార్య భారతి తదితరులు జగన్‌కు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. అంతకుముందు వందలాదిమంది అభిమానులు ఇంటి వద్ద యువనేతకు ఘనంగా స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
3 - 5 రోజులు విశ్రాంతికావాలి: డా. రవీందర్ బాబు
‘‘వైఎస్ జగన్‌ను సాయంత్రం ఆరింటికి పరీక్షించాం. ఆయన బ్రీతింగ్, పల్స్, బీపీ వంటివన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. అయితే యూరిన్‌లో కీటోన్స్ మాత్రం ఐదుకు మించి ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. డీహైడ్రేషన్ కారణంగా ఆయన బాగా నీరసంగా ఉన్నారు. ఆయనకు మూడు నుంచి ఐదు రోజులు పూర్తిగా విశ్రాంతి అవసరం. శక్తినిచ్చే ద్రవాహారం తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు.’’
దీక్షా వేదికపై నేతల స్పందనలివి
ఎన్నికలెప్పుడొచ్చినా జగనే సీఎం
పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యా భద్రత కల్పిస్తేనే సమాజం అభివృద్ధి దిశగా పయనిస్తుందని భావించి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఫీజుల పథకాన్ని ప్రవేశపెడితే.. ఈ ప్రభుత్వం ఆయన ఆశయానికి తూట్లు పొడిచింది. మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, విప్రో ప్రేమ్‌జీ ... వీరంతా పేద కుటుంబాల నుంచే వచ్చారు. చదువుకోవడం వల్లే ఉన్నత స్థానాలకు చేరుకోగలిగారు. ముఖ్యమంత్రి, మంత్రులంతా.. వైఎస్ అందించిన అధికారాన్ని అనుభవిస్తున్నారు. అధికారాన్ని అనుభవిస్తే అనుభవించండి. కానీ దివంగత నేత ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. వైఎస్ మీద ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసంతోనే వరుసగా రెండుసార్లు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. విశ్వసనీయ నాయకుడు ఉంటేనే ప్రజాదరణ లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వ పటిమ, విశ్వసనీయత ఉన్న నాయకుడు జగన్ ఒక్కరే. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ సీఎం కావడం ఖాయం.
- ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
ఈ ప్రభుత్వం పోవాలి.. జగన్ రావాలి
ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. నా బిడ్డను పొట్టనబెట్టుకుంది. ఫీజు కట్టలేక నా బిడ్డ వరలక్ష్మి ప్రాణాలు తీసుకుంటే.. గ్యాస్ లీకై మరణించిందని ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. పాపిష్టి ప్రభుత్వం నా బిడ్డ మీద అభాండాలు వేసింది. ఇలాంటి ప్రభుత్వం పోవాలి.. జగన్ రావాలి. మాకొచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదు. ఎవరికీ ఈ కడుపు కోత వద్దు.
- వరలక్ష్మి తల్లిదండ్రులు లక్ష్మమ్మ, జంగయ్య
జగన్ కళ్లలోకి సూటిగా చూసే ధైర్యముందా?
కళ్లుండి చూడలేని ప్రభుత్వం ఇది. చెవులుండి వినలేని సర్కారు ఇది. ప్రజా నాయకుడు జగన్ దీక్ష చేస్తుంటే.. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి వస్తున్నారు. అయినా ప్రభుత్వానికి తెలియలేదట. ఇక సామాన్యుల సంగతి ప్రభుత్వానికి ఏం తెలుస్తుంది? జగన్ కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం మంత్రులకు లేకపోవడం వల్లే... ప్రభుత్వం మంత్రులను పంపించి ఉండదు. కనీసం అధికారులను పంపించి డిమాండ్లు తెలుసుకోలేక పోయింది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వం గద్దె దిగాల్సిందే. వైఎస్ హయాంలో లబ్ధి పొందని కుటుంబాలు రాష్ట్రంలో లేవు. చంద్రబాబు ఇంటికి కూడా రూ. 50 సబ్సిడీతో గ్యాస్
సిలిండర్లు వెళ్లాయి.
- మాజీ మంత్రి కొండా సురేఖ
అండగా ఉన్నానని చెప్పేందుకే దీక్ష..
ఏడు రోజులుగా ముద్ద ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తున్న యువనేత జగన్‌ను చూసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఎంతో మంది తల్లులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ దయతో అధికారంలో కూర్చున్న వాళ్లు తన దీక్షకు స్పందిస్తారని జగన్ అనుకోలేదు. వరలక్ష్మి లాంటి చెల్లెళ్లు, తమ్ముళ్లకు అండగా ఉన్నానని చెప్పడానికే జగన్ నిరాహార దీక్షకు దిగారు.
- ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి
| పాలకుల దుర్బుద్ధికి నిదర్శనం వారం రోజులుగా నిరాహారదీక్ష చేసిన జగన్‌తో ప్రభుత్వం చర్చలు జరపకపోవడం ఈ పాలకుల దుర్బుద్ధికి నిదర్శనం. మాట్లాడితే యువనేతకు ఎక్కడ క్రెడిట్ దక్కుతుందోనన్న భయమే వారిని వెంటాడింది. జగన్ ప్రభంజనంతో 125 ఏళ్ల కాంగ్రెస్ కోటకు బీటలు వారుతున్నాయి. చిరంజీవిని కలిపేసుకున్నారు.. చంద్రబాబును కౌగిలించుకున్నారు. వీరితో ప్రమాదంలేదు. కేవలం ఒక్కరితోనే వీరికి భయం. ఆ మొనగాడే జగన్. - అంబటి రాంబాబు ఫీజులకు తగిన నిధులు ఇవ్వండి ఫీజు రీయింబర్స్‌మెంట్ మీద ఆధారపడి చదువుకుంటున్న విద్యార్థులంతా వైఎస్‌కు రుణపడి ఉంటారు. బడ్జెట్ చూస్తే.. ఫీజుల పథకం వచ్చే ఏడాది ఉండదనే అనుమానం కలుగుతోంది. ఫీజుల కోసం వచ్చే ఏడాది కూడా విద్యార్థులు రోడ్డెక్కాల్సిందేనా..? బడ్జెట్‌ను సవరించి, ఈ పథకానికి తగు నిధులు ఇవ్వండి. - మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి పేద విద్యార్థుల కోసం ఏడు రోజులు దీక్ష చేయడం జగన్ ఆత్మస్థైర్యానికి నిదర్శనం. ఫీజుల నిధులివ్వకుండా మొండికేస్తున్న ఈ గుడ్డి సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి. జగన్ దీక్ష గురించి తమకు తెలియదని హేళన చేసిన కొందరు మంత్రులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. - కాటసాని రాంరెడ్డి, బనగానపల్లి ఎమ్మెల్యే ఇలాంటి దరిద్ర పాలన చేయొద్దు బడ్జెట్ కేటాయింపులను బట్టి చూస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ భవిష్యత్తులో ఉండకపోవచ్చు. దమ్ముంటే పాలన చేయాలి... కానీ ఇలాంటి దరిద్ర పాలన మాత్రం చేయొద్దు. పాలకులపై ఒత్తిడి పెంచేందుకే జగన్ దీక్ష చేపట్టారు. పరామర్శించే కనీస బాధ్యత ప్రభుత్వానికి లేదా? -గట్టు రామచంద్రరావు రీయింబర్స్‌మెంట్ ఎత్తేస్తారేమో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు పాత బకాయిలకూ సరిపోవు. వచ్చే ఏడాది ఈ పథకం ఎత్తివేస్తారనే అనుమానం కలుగుతోంది. జలయజ్ఞం, సంక్షేమ పథకాల కేటాయింపులను చూస్తే వైఎస్ పథకాలనూ ప్రభుత్వం శాశ్వతంగా ఆపేందుకు రంగం సిద్ధం చేసిందనిపిస్తోంది. - అమర్‌నాథ్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే జగన్‌పై అక్కసుతోనే పలకరింపునకూ రాలేదు వారంరోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న జగన్ పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. లక్షల మంది పేద విద్యార్థులకు ఆశాదీపంగా మారుతున్నాడనే అక్కసుతోనే కనీసం పలుకరించేందుకు కూడా ప్రభుత్వం రాలేదు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు బలవంతపు వసూళ్లకు దిగుతున్నాయి. - కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే అగ్నిజ్వాలల్లో మసికావడం ఖాయం నిమ్నజాతి పిల్లల అభ్యున్నతికి వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు తిలోదకాలిస్తోందీ ప్రభుత్వం. వారంరోజులుగా జగన్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేకుండా పోయింది. ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు. త్వరలోనే అగ్నిజ్వాలలు ప్రభుత్వాన్ని మసి చేయడం ఖాయం. - గొల్ల బాబూరావు, పాయకరావుపేట ఎమ్మెల్యే నమ్మకమైన నేత ప్రజాకర్షణే కాదు.. నమ్మకానికి పెట్టింది పేరు జగన్. ప్రజా సమస్యలే ఉద్యమంగా ముందుకు సాగుతున్నందునే జగన్ పట్ల ప్రజలకు నమ్మకం కలిగింది. ఏడురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఇది దున్నపోతు ప్రభుత్వం. -జూపూడి, ఎమ్మెల్సీ విద్యార్థులకు న్యాయం చేయాలి యువనేత జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నా.. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలి. -కొండా మురళి, ఎమ్మెల్సీ ఫీజులు చెల్లించడం సామాజిక బాధ్యత ఫీజులు చెల్లించడం సామాజిక బాధ్యతగా ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. పేదరికం చదువులకు అడ్డుకాకూడదని వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తిలోదకాలిచ్చేలా వ్యవహరించడం సిగ్గుచేటు. యువనేత జగన్ ప్రాణాలొడ్డి వారం రోజులు దీక్ష చేసినా చలించని సిగ్గుమాలిన ప్రభుత్వం ఇది. - పుల్లా పద్మావతి, ఎమ్మెల్సీ ప్రజలు స్పందించారు చాలు.. ప్రభుత్వం స్పందించక పోయినా పర్వాలేదు. విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. - ఎమ్మెల్యే జయసుధ కుర్చీలు పట్టుకుని వేలాడుతున్నారు దీక్షకు వచ్చిన నేతలు అధికార దాహంతో వచ్చిన వారు కాదు. రాని నాయకులే అధికార దాహంతో కుర్చీలు పట్టుకొని వేలాడుతున్నారు. - బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే పేదోళ్లకు చదువు వద్దనుకుంటున్నారా.. పేదవాడికి విద్య అవసరం అని దివంగత నేత వైఎస్ భావిస్తే... పేదవాడికి విద్య అవసరమా.. అన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. - నటి రోజా కనీస భద్రత కల్పించరా.. జెడ్ కేటగిరీ నుంచి వచ్చిన జగన్, దివంగత ముఖ్యమంత్రి తనయుడు నడిరోడ్డు మీద రేయింబవళ్లు దీక్ష చేస్తుంటే.. ప్రభుత్వం కనీస భద్రత కూడా కల్పించరా..? - ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి మంత్రులు పలుకరించక పోవడం శోచనీయం రెండుసార్లు కేంద్రంలో, రాష్ర్టంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన వైఎస్సాఆర్ తనయుడు నిరాహార దీక్ష చేస్తుంటే మంత్రులు పలుకరించక పోవడం శోచనీయం. - రెహమాన్, మాజీ ఎమ్మెల్సీ వైఎస్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి స్వర్ణయుగం. నేటి ప్రభుత్వం వైఎస్ పథకాలకు ఒక్కొక్కటిగా తూట్లు పొడుస్తోంది. -నెలవల సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే దీక్షకు సంఘీభావం తెలపకుండా గోడమీద పిల్లుల్లా ఉన్న మంత్రులకు త్వరలో కాలం చెల్లుతుంది. - ప్రతాప అప్పారావు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ భిక్షతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నేడు ప్రాణాలను లెక్కచేయకుండా దీక్ష చేస్తున్న జగన్‌ను పరామర్శించని ఈ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. - నారాయణస్వామి, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే రాష్ర్టంలో ఇక మిగిలేది రెండు పార్టీలే. ఒకటి వైఎస్ జగన్ పార్టీ.. మరొకటి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ తదితరాల పార్టీ ఈ రెండింటి మధ్య త్వరలో మహాసంగ్రామం జరగబోతుంది. - జి.సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే సర్కారుకు ‘జగన్ భయం’...! దీక్షపై స్పందించేందుకు కూడా సాహసించని వైనం |
| యువనేతకు మరింత పేరొస్తుందన్న భయమే కారణం ఇది బాధ్యతారాహిత్యానికి పరాకాష్టేనంటూ సర్వత్రా విమర్శలు చౌకబారు ప్రవర్తనతో సర్కారే అప్రతిష్టపాలైందంటున్న స్వపక్ష నేతలు ఎమ్మెల్యేలే స్పందిస్తుంటే ప్రభుత్వానికి ఏమైందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆవేదన ఫీజు రీయింబర్స్‌మెంట్. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు అద్దం పట్టడంతో పాటు సాక్షాత్తూ సుప్రీంకోర్టుతోనే పాలకులకు పదేపదే అక్షింతలు వేయించిన సమస్య. 25 లక్షల మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన అపరిష్కృత సమస్యపై యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏడు రోజుల పాటు కఠోర నిరాహార దీక్ష చేస్తే, దానిపై కనీసం స్పందించేందుకు కూడా కిరణ్ సర్కారు సాహసించలేకపోయింది! దీని వెనక మతలబేమిటన్నది ఇప్పుడు రాష్టవ్య్రాప్తంగా చర్చనీయంగా మారింది. కారణాలేమైనా, దీక్షపై కనీస స్థాయిలో కూడా స్పందించకపోవడం ద్వారా బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా వ్యవహరించడంలో ఘోరంగా విఫలమయ్యామన్న వ్యాఖ్యలు సాక్షాత్తూ అధికార పక్షం నుంచే విన్పిస్తున్నాయి! జగన్ తిరుగులేని జన నేతగా ఎదుగుతున్న వైనం చూసి కాంగ్రెస్ ఇప్పటికే కలవరపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీక్షపై ఎలా స్పందించినా ఆయన గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోతుందన్న జంకుతోనే సర్కారు మూగనోము పట్టిందని అన్ని వర్గాలూ దుమ్మెత్తిపోస్తున్నాయి. జగన్‌కు జనాదరణ పెరుగుతుండటాన్ని జీర్ణించుకోలేకపోవడమే ప్రభుత్వ అనైతిక ప్రవర్తనకు కారణమని కాంగ్రెస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. కానీ దీనిద్వారా తాము బావుకున్నదేమీ లేకపోగా... ప్రజా సమస్యలను, వాటిపై జరిగే ప్రజాస్వామిక ఆందోళనలను కూడా పట్టించుకోని పనికిమాలిన ప్రభుత్వమన్న అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. పైగా తమ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు యువనేత పోరాటానికి సంఘీభావం ప్రకటించడం, ఆ విషయమై అసెంబ్లీకి పాదయాత్ర చేయడం, ఏకంగా సభలోనే ప్లకార్డులు ప్రదర్శించడం తమను మరింతగా ఇబ్బంది పెట్టే పరిణామమేనని వారంటున్నారు. ఇంత ముఖ్యమైన ప్రజా సమస్యపై అధికార పక్ష ఎమ్మెల్యేలకున్న పాటి బాధ్యత గానీ, మానవత్వం గానీ ప్రభుత్వ పెద్దలకు లేకపోయాయా అంటూ నిలదీస్తున్న జనానికి బదులివ్వలేని దుస్థితిలో పడిపోయామంటున్నారు! ఇంతటి బాధ్యతారాహిత్యాన్ని మొదటిసారి చూస్తున్నామని కాంగ్రెస్ కురువృద్ధ నేతలు కూడా చెబుతున్నారు. జగన్‌ను జనంలో ఎదగనీయకుండా అణగదొక్కడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఆయన దీక్షపై స్పందించకపోవడం వెనుక ఏకైక మతలబు కూడా అదేనని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు సీఎల్పీ వద్ద బాహాటంగానే చెప్పారు. వారి విషయంలో అలా... ఫీజులు కట్టకుంటే హాల్‌టికెట్లు ఇవ్వబోమని, పరీక్షలకు కూర్చోనివ్వబోమని, అసలు కాలేజీలనే మూసేస్తామని యాజమాన్యాలు హెచ్చరించడం, మరో దారి లేక ఓ అభాగ్య దళిత విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడం చూసి జగన్ స్పందించారు. రాష్ట్రం అట్టుడుకుతున్నా సమస్య తీవ్రతను గుర్తించడంలో, స్పందించడంలో ప్రభుత్వం విఫలమవడంతో ఏడు రోజుల నిరంతర నిరాహార దీక్ష చేపట్టారు. అందుకు రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో స్పందించింది. దీక్ష కొనసాగిన ఏడు రోజులూ రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు తరలివచ్చి యువనేతను పరామర్శించారు. ఎంతోమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా శిబిరానికి వచ్చి, ఫోన్ల ద్వారా సంఘీభావం ప్రకటించారు. అసెంబ్లీకి పాదయాత్ర చేశారు. సభలో రెండ్రోజుల పాటు ప్లకార్డులు ప్రదర్శించారు. అయినా సీఎం గానీ, మంత్రులు గానీ మాటమాత్రంగా కూడా స్పందించలేదు. సుప్రీంకోర్టు తలంటిన నేపథ్యంలో, రీయింబర్స్‌మెంట్ నిధులు, బకాయిలను విడతల వారీగా విడుదల చేసేందుకు కట్టుబడ్డామంటూ వినీ విన్పించకుండా నసిగి అంతటితో సరిపెట్టారు. రాజకీయంగా జగన్ విషయంలో కాంగ్రెస్, ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నా ప్రజా సమస్య పరిష్కారానికి గళమెత్తినప్పుడు స్పందించడం పాలక పక్షం విధి. వారం రోజులు నిరాహార దీక్షకు దిగితే మానవీయతతో స్పందించడం కనీస బాధ్యత, మర్యాద. ఇదే సమస్యపై 2010 జూన్‌లో బీసీ నేత ఆర్.కృష్ణయ్య నిరాహార దీక్ష చేస్తే తొలి రోజు సాయంత్రమే ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. నాటి సీఎం రోశయ్య ఆదేశానుసారం మంత్రులు సుభాష్‌చంద్రబోస్, దానం తదితరులు వెళ్లి పరామర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చి మరీ దీక్ష విరమింపజేశారు. ఇదే సమస్యపై బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగినా ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లాలంటూ ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ గత డిసెంబర్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగితే సీఎం స్వయంగా స్పందించి హామీ ఇచ్చారు. మంత్రులను, ఎంపీలను పంపి మరీ మంద కృష్ణ దీక్షను విరమింపజేశారు. డిసెంబర్‌లోనే రైతు సమస్యపై చంద్రబాబు ఆమరణ దీక్షకు దిగితే మూడో రోజే ఆస్పత్రికి తరలించారు. మర్నాడే మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆయన్ను పరామర్శించారు. రైతు సమస్యలపై సీఎం అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. 2009 నవంబర్‌లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన్ను నిమ్స్‌కు తరలించే దాకా ప్రభుత్వం చేసిన హడావుడిని ఎవరూ మర్చిపోలేదు. కానీ కళ్లు మూసినా, తెరిచినా జగన్ జనాదరణనే తలచుకుని వణికిపోతున్న కిరణ్ సర్కారుకు మాత్రం ఆయన దీక్ష విషయంలో అలాంటి కనీస మర్యాదలేవీ అసలే పట్టలేదు. నిజానికి జగన్ ఫీజు పోరు దీక్షకు ఒక్కరోజు ముందు ఎన్టీవీ-నీల్సన్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్వాన్నంగా మారిందని, పీఆర్పీని విలీనం చేసుకున్నా ప్రజలు జగన్‌కే బ్రహ్మరథం పడుతున్నారని అందులో తేలింది. ఇది కాంగ్రెస్ నాయకత్వానికి సహజం గానే రుచించలేదు. దీక్ష విషయంలో వారి ప్రవర్తనలో కూడా ఆ వైఖరే ప్రతిఫలించింది. జగన్ దీక్ష విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా కాక ఇంకెలా వ్యవహరిస్తుందని అసెంబ్లీ లాబీ లోనే ఒక సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలే ఇందుకు రుజువు. ఒకవైపు జగన్ ఎదుగుదలను అడ్డుకునేందుకు, ఆయనను అప్రతిష్టపాలు చేసేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తుంటే, ప్రత్యేకంగా ఈ దీక్ష విషయంలో మానవీయ కోణం ఎందుకుంటుందంటూ ఆయన ఉన్నమాట బయట పెట్టడంతో నోరెళ్లబెట్టడం విలేకరుల వంతయింది! జగన్ విషయంలో పాలక పక్ష అనైతిక రాజకీయాలు గతంలోనూ తెరపైకి వచ్చాయని వైఎస్, జగన్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. |
Subscribe to:
Posts (Atom)