Saturday, February 19, 2011

సంక్షేమం పట్టని సర్కార్‌కు పాలించే హక్కులేదు



వైఎస్ ఆశయాలను పట్టించుకోని ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత మాకు లేదు
పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడలేని ప్రభుత్వంలో సామాజిక న్యాయం
ఎలా ఉంటుంది...ఫీజుల పథకాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు...
సర్కారు ఫీజు చెల్లించనందువల్లేవరలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది
వైఎస్ ఉంటే తమ కూతురు బతికుండేదంటున్నారు వరలక్ష్మి తల్లిదండ్రులు
లక్షల మంది విద్యార్థులతో కలిసి చేస్తున్న డిమాండ్ ఒక్కటే... తక్షణం నిధులు
విడుదల చేయాలి... సమస్యకు బడ్జెట్‌లో శాశ్వత పరిష్కారం చూపాలి

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు, పథకాలకు తూట్లు పొడుస్తున్న ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత తమకు లేదని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడానికీ పనికిరాదని నిప్పులు చెరిగారు. ఒకవేళ కలిపితే ఆ బంగాళాఖాతమే కలుషితమవుతుందని దుయ్యబట్టారు. పేదల ముఖంలో చిరునవ్వును చూడలేని ఈ సర్కారుకు పాలించే అర్హత లేదన్నారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకం స్ఫూర్తిని ప్రభుత్వం దెబ్బతీస్తోందని దుయ్యబట్టారు. సర్కారు వైఖరికి నిరసనగా, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ‘ఫీజు పోరు’ పేరుతో వారం రోజుల నిరాహార దీక్షను జగన్ శుక్రవారం ప్రారంభించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి మొత్తం నిధులు రూ. 3,400 కోట్లు చెల్లించేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకైనా కొత్త బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ పథకానికి సరిపడినన్ని నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నా చౌక్‌లో మొదలుపెట్టిన ఈ దీక్షకు మద్దతు పలుకుతూ పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే...

ఏదీ సామాజిక న్యాయం?

సామాజిక న్యాయం అని ఒకరు మాట్లాడతారు. సామాజిక న్యాయం ఈ పార్టీలోనే ఉంది అని చెప్పి ఒకరు ఆ పార్టీలో చేరతారు. సామాజిక న్యాయం ఇక్కడే ఉంది అంటూ ఆ పార్టీ వారిని తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్క మాట చెప్పండి.. పేదవాడి మొహాన చిరునవ్వును చూడలేని ఈ సర్కారుకు సామాజిక న్యాయం ఉందా? రాష్ట్ర రాజధానిలో ఈ రోజు లక్షల గుండెలు ఒక్కటై.. ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని నినదిస్తున్నాయి.

‘పేదలకు పెద్ద చదువులు’ మహానేత ఆశయం

పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని నిత్యం తపించిన ఒక మహా నాయకుడి కథ చెబుతా... ప్రతి పేద విద్యార్థీ చదవాలని కాంక్షించిన జననేత గురించి చెబుతాను. పేదలు పెద్ద చదువులు చదవడానికి ఫీజు అడ్డంకి కాకూడదని వైఎస్ భావించారు. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి శ్రీకారం చుట్టారు. నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడని, నా కూతురు డాక్టర్ చదువుతోందంటూ పేదలు అనుకొంటున్నప్పుడు.. చదువుల కోసం ఉన్న ఆస్తిని తెగనమ్ముకోవాల్సిన అవసరం లేదని గర్వంగా చెబుతున్నప్పుడు.. ఫీజు కట్టడం సమస్య కాదని, పెద్ద చదువులు తమ హక్కని ప్రతి పేద విద్యార్థీ భావిస్తున్నప్పుడు... వారి మొహాల్లో కనిపించే చిరునవ్వుల మధ్య దివంగత నేత రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తూనే ఉంటారు. ఇవాళ ఆ మహానేతే బతికి ఉంటే తమ జీవితాలు ఇలా ఉండేవి కాదని ప్రతి పేదవాడు ఆకాశం వైపు చూస్తున్నాడు.

ఆ మాటలు విని చలించిపోయాను

కాలేజీలో ఫీజు కట్టలేక, చదివే దారిలేక ఆత్మహత్య చేసుకొన్న వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు.. ఆమె తల్లిదండ్రులు చెప్పిన విషయాలు విని చలించిపోయాను. వాచ్‌మన్ ఉద్యోగం చేసే తండ్రి, పంచాయతీ ఆఫీసులో స్వీపర్‌గా పనిచేస్తున్న తల్లి... నిరుపేద కుటుంబం.. ఇదీ వరలక్ష్మి నేపథ్యం. విద్యాసంత్సరం ముగుస్తున్నా ప్రభుత్వం ఒక్కపైసా కూడా చెల్లించకపోవడంతో కాలేజీలో విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నారని, కాలేజీ యాజమాన్యం అడిగిన రూ. 30,000 చెల్లించడానికి అప్పోసప్పో చేయాలని వరలక్ష్మి అడిగితే.. ఏం చేయాలో పాలుపోని నిస్సహాయ పరిస్థితి ఆ తల్లిదండ్రులది. ఇద్దరికీ కలిపి నెలకు రూ.2,800 సంపాదన మాత్రమే ఉన్న తమకు రూ. 30,000 అప్పు ఎవరిస్తారు? ఎలా తెచ్చివ్వగలం? అనుకొంటూ.. ఆ తల్లిదండ్రులు బాధపడుతుంటే ఆ కూతురు తట్టుకోలేకపోయింది. తమ బాధ చూడలేక కిరోసిన్ పోసుకొని ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని, వైఎస్ ఉంటే తమ కూతురు చనిపోయి ఉండేది కాదని తల్లిదండ్రులు చెబుతుంటే నా మనసు కకావికలమైంది. ముక్కుపచ్చలారని... 18 సంవత్సరాలైనా నిండని వరలక్ష్మి ఆత్మహత్య చేసుకొంటే.. సిగ్గు లేని ప్రభుత్వం ఆమె ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయిందంటూ తప్పించుకోవాలని చూసింది. వరలక్ష్మి తల్లిదండ్రుల ఆవేదన చూశాక నాకనిపించింది.. ఒక్కరోజులో ఈ ధర్నా ముగియకూడదని! ఒక్కరోజు ధర్నాతో ముగిస్తే ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా ఉండదనిపించింది. నిరాహార దీక్షలు కొనసాగితే.. ఆకలి కేకల్లో ప్రతిపేదవాడి ఘోష వినపడితేనైనా సర్కారులో మానవత్వం మేలుకుని బడ్జెట్‌లో పథకానికి పూర్తి కేటాయింపులు చేస్తుందేమోనన్న చిన్న ఆశతో వారం రోజులు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను.

పథకాన్ని నాశనం చేయాలని సర్కారు కుట్ర


25 లక్షల మంది పేద విద్యార్థుల చదువుకు రూ.3,400 కోట్లు అవసరముంటే.. ముష్టి వేసినట్లు రూ.1,000 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరో వారం పది రోజుల్లో బడ్టెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆ బకాయిలు రూ. 2,400 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారు? మళ్లీ బడ్జెట్‌లో కొత్త సంవత్సరానికి రూ. 3,400 కోట్లు కేటాయించాల్సి ఉంటే.. ఆ మొత్తం రూ. 5,800 కోట్లు ఎలా తెస్తారు? ప్రభుత్వ ధోరణి చూస్తుంటే.. ఫీజుల పథకాన్ని నాశనం చేయాలని కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రతి పేదవాడిని బతికితే బతకండి... లేదంటే చావండి అన్న తీరుగా వ్యవహరిస్తోంది. మనసు లేని ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా?

బంగాళాఖాతమూ కలుషితమవుతుంది

పేదవాడి గోడు పట్టని ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేసినా పాపం లేదు. పుణ్యనదులు కలిసే బంగాళాఖాతంలో ఈ ప్రభుత్వాన్ని వేస్తే.. అదీ కలుషితమైపోతుంది. సామాజిక న్యాయం మీద అబద్ధాలు చెబితే.. ఈ ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా దక్కవు. దివంగత నేత ఆశయాలను పట్టించుకోని ఈ సర్కారును కొనసాగించాల్సిన నైతిక బాధ్యత కూడా మాకు లేదు. ఇప్పటికైనా పేదవాడి ఆకలి కేకలు వినాలని ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాను. సర్కారుకు జ్ఞానోదయం చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ ఫీజు పోరు వేదిక మీద నుంచి లక్షల మంది విద్యార్థులతో కలిసి నేను చేస్తున్న డిమాండు ఒక్కటే.. బడ్జెట్‌కు ముందే ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు మొత్తం చెల్లించాలి. ఈ బడ్జెట్‌లో సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలి. బకాయిలన్నీ తీర్చి బడ్జెట్‌లో కొత్త సంవత్సరానికి అవసరమైన కేటాయింపులు చేయాలి.

గర్జించిన విద్యార్థి
జగన్ ‘ఫీజు పోరు’కు పోటెత్తిన విద్యార్థులు, తల్లిదండ్రులు
పేదోడి చదువు గోడు పట్టని ప్రభుత్వంపై పోరు మొదలుపెట్టిన యువనేత జగన్‌కు మద్దతుగా విద్యార్థిలోకం తరలివచ్చింది. వారితోపాటే తల్లిదండ్రులూ పోటెత్తారు. సర్కారు ఫీజు కట్టకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడిన వరలక్ష్మిలా మరో విద్యార్థి బతుకు బలికాకూడదంటూ నినదించిన జగన్‌కు జేజేలు పలికారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ జగన్ శుక్రవారం ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నా చౌక్‌లో ‘ఫీజు పోరు’ పేరిట ప్రారంభించిన వారం రోజుల నిరాహార దీక్షకు విద్యార్థిలోకం భారీగా తరలి వచ్చింది. వేలాది మంది విద్యార్థులు దీక్షా స్థలికి చేరుకొని.. యువనేత రాక కోసం ఎదురు చూశారు.

ఉదయం 11.45 ప్రాంతంలో జగన్ వేదిక వద్దకు వచ్చినప్పుడు.. ఆయన్ను చూడటానికి విద్యార్థులు పోటీ పడ్డారు. నియంత్రించడం భద్రతా సిబ్బంది, వాలంటీర్లకు సాధ్యం కాలేదు. సర్కారు ఫీజు చెల్లించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న వరలక్ష్మి తల్లిదండ్రులు, సోదరుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరో కుటుంబానికి తమ దుస్థితి రాకూడదంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఈ దీక్షను వరలక్ష్మికి అంకితమిస్తున్నట్లు ప్రకటించిన యువనేత దీక్షా స్థలికి ‘వరలక్ష్మి దీక్షా ప్రాంగణం’గా పేరు పెట్టారు.


మాతృమూర్తి ఆశీస్సులు తీసుకొని: యువనేత ఉదయం 10.45 గంటలకు తన నివాసంలో తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని ఫీజు పోరుకు బయలుదేరారు. ఆయన వెంట ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు తదితరులున్నారు. ఇంటి నుంచి పంజగుట్టకు చేరుకున్న యువనేతకు మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ ఆధ్వర్యంలో పలువురు ముస్లింలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ మహానేత వైఎస్ విగ్రహానికి జగన్ నిలువెత్తు పూలమాలవేసి నివాళులర్పించారు. అభిమానులు జి. రత్నమణి, తోట్ల సునీత, ప్రగతిరెడ్డి యువనేతకు హారతిపట్టి తిలకందిద్దారు. తర్వాత ఆయన ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇందిరాపార్క్‌కు వెళ్లారు.

విద్యార్థుల్లో సమరోత్సాహం

ఫీజులు చెల్లించలేక వరలక్ష్మి ఆత్మహత్య చేసుకొంటే.. ప్రమాదవశాత్తూ మరణించిందని ప్రభుత్వం చిత్రీకరించడానికి ప్రయత్నించిందని యువనేత చెప్పినప్పుడు ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పేదోడి ముఖంలో చిరునవ్వు చూడలేని ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా? అని జగన్ ప్రశ్నించినప్పుడు.. ‘లేదు.. లేదు’ అని తీవ్రస్థాయి స్పందన వచ్చింది.
సర్కారు కూలిపోతుంది: ఫీజులు చెల్లించకపోతే ప్రభుత్వం కుప్పకూలి పోతుందని ఓయూ విద్యార్థులు రమేష్ యాదవ్, రామకోటి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతశ్రీ కళాశాలకు చెందిన రాజేశ్వర్, వరంగల్ జిల్లా జనగామకు చెందిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కళాశాల విద్యార్థి రాకేష్ మాట్లాడుతూ.. ఫీజులు చెల్లించుకోలేని తమ దుస్థితిని వివరించారు.

వైఎస్ పేరును ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు పెట్టాలని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధి డాక్టర్ రాకేష్ డిమాండు చేశారు. తెలంగాణ యూత్ ఫోర్స్ తరఫున ఫీజు పోరుకు మద్దతు ప్రకటిస్తున్నట్లు అజయ్ తెలిపారు. ఎస్కే యూనివర్సిటీ నుంచి వచ్చిన రంగారెడ్డి, ట్రైబల్ డెవలెప్‌మెంట్ అసోసియేషన్ కార్యదర్శి పరశురాం నాయక్.. రీయింబర్స్‌మెంట్‌కు సకాలంలో నిధులు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు పడుతున్న పాట్లను వివరించారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన బీరవోలు సోమన్న కళాబృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఒంటెల ప్రదర్శన ప్రత్యేక ఆక ర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో యువనేత వెంట శాప్ మాజీ చైర్మన్ రాజ్‌సింగ్ ఠాకూర్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి గట్టు రామచంద్రరావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అమృతాసాగర్, గ్రేటర్ హైదరాబాద్ యువనాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే సోదరుడు గడికోట సుదీప్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులున్నారు.

దీక్షలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

ఎంపీ: మేకపాటి రాజమోహన్‌రెడ్డి.
ఎమ్మెల్యేలు: బాలినేని శ్రీనివాస రెడ్డి, సుభాష్ చంద్రబోస్, ప్రసన్నకుమార్‌రెడ్డి, జయసుధ, కాటసాని రాంరెడ్డి, కమలమ్మ, అమరనాథ్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, శ్రీనివాసులు, బాబూరావు, రామకృష్ణారెడ్డి, కొండా సురేఖ, శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కొర్ల భారతి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, శోభానాగిరెడ్డి, గుర్నాథరెడ్డి.
ఎమ్మెల్సీలు: పుల్లా పద్మావతి, కొండా మురళి, జూపూడి ప్రభాకరరావు, టీజీవీ కృష్ణారెడ్డి.

ఈ దుస్థితి మరే కుటుంబానికీ వద్దు

‘ఫీజు పోరు’లో పాల్గొన్న వరలక్ష్మి సోదరుడు మహేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు చెల్లించలేకపోవడంతో తన చెల్లి మరణించిందని, మరే కుటుంబానికీ ఈ దుస్థితి రాకూడదని అన్నారు. ‘పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత వైఎస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం నీరుగారుస్తోంది. పేదవాళ్ల చదువుల కోసం ఆయన గొప్ప ఆశయంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే ఈ పాలకులు అన్యాయం చేస్తున్నారు. ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో నా చెల్లెలు వరలక్ష్మి తనువు చాలించింది. మరే కుటుంబానికి ఇలాంటి దుస్థితి రావొద్దు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
 
‘ఫీజు’లపై సర్కారు స్పందించాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుకాక రాష్ట్రంలోని 24 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్ రోడ్డున పడింది...
 కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ ఎమ్మెల్యేల డిమాండ్
 ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుకాక రాష్ట్రంలోని 24 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్ రోడ్డున పడింది... వారి బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీలకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, గురునాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి, బాబూరావు, శోభా నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. చాలామంది సామాన్య విద్యార్థులు డబ్బుల్లేక చదువులకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితుల్లో... దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని వారు చెప్పారు.

అయితే రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని గ్రామాలకు వెళ్లినప్పుడు ఎస్సీ, బీసీ విద్యార్థులు చాలామంది తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు కావడంలేదని తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో అందని కారణంగానే వరలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ, కోస్తా, రాయలసీమ మూడు ప్రాంతాల్లోనూ ఈసమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. అంతకుముందు వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు సభలో తమ సీట్ల వద్ద నిలబడి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం స్పందించాలన్న ప్లకార్డులు ప్రదర్శించారు.


ఎల్లో మీడియా అత్యుత్సాహం

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడడం మొదలుపెట్టిన ఒక్కటెండ్రు నిమిషాలకే ఎల్లోమీడియాకు చెందిన ముగ్గురు విలేకరులు ఆయన మాటలను అడ్డుకున్నారు. తాను మాట్లాడిన తర్వాత ప్రశ్నలకు జవాబు చెబుతానని చెప్పినప్పటికీ, ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.

దీంతో ఎమ్మెల్యేలు స్పందిస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగడం మీకు ఇష్టంలేదా? అని ప్రశ్నించారు. ఒక విలేకరి అత్యుత్సాహంగా స్పందించి... ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన సమస్య కదా.. ఆ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను ముఖ్యమంత్రిని చెయ్యండి’ అని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎమ్మెల్యేలు మాట్లాడకుండా అడ్డుకున్న ఆ ముగ్గురు విలేకరులు ఆ తర్వాత రెండు నిమిషాలకే నలుగురు మంత్రులు అదే అంశంపై మాట్లాడుతున్నప్పుడు దూరంగా వెళ్లిపోవడం కొసమెరుపు.
యువతతో పెట్టుకుంటే అంతే
కొండా సురేఖ ధ్వజం
 
  ‘‘మహానేత ప్రవేశపెట్టిన పథకాలన్నీ కాంగ్రెస్‌వేనని చెప్పుకుంటున్నారు. మరి మీ పథకాలే అయితే ఎందుకు అమలుచేయడం లేదు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని మాజీ మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా, రాజ్యమైనా కుప్పకూలిపోక తప్పదని హెచ్చరించారు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఫీజు పోరులో విజయం సాధించి, ఆ విజయాన్ని వరలక్ష్మికి అంకితమివ్వాలని కోరారు. శుక్రవారం ‘ఫీజు పోరు’ దీక్షలో పాల్గొన్న సురేఖ మాట్లాడుతూ.. వైఎస్ చనిపోయేంతవరకు రాష్ట్రంలోని ఏ ఒక్క విద్యార్థి, ఏ ఒక్క కుటుంబం కూడా ఫీజు రీయింబర్స్ గురించి ఆందోళన చెందలేదని చెప్పారు.

ఆయన మరణానంతరం ప్రభుత్వం చెల్లింపులు నిలిపివేయడంతో బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. వైఎస్ చనిపోయినతర్వాత ట్యూషన్ ఫీజులు, ఉపకారవేతనాల కోసం ఎన్ని అప్లికేషన్‌లు తీసుకున్నారో, ఎన్నింటిని తనిఖీ చే శారో, ఎన్ని ట్రెజరీలకు పంపారో, ఎన్ని పెండింగ్‌లో పెట్టారో జిల్లాల వారీగా ప్రజలకు తెలియజెప్పాలని సర్కారును డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యార్థులు నడిసంద్రంలో కొట్టుకుంటున్న సమయంలో తన చేయినందించేందుకే జగన్ ఈ దీక్షను చేపట్టారన్నారు. వైఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో అలాంటి పోరాటాలే జగన్ చేపడుతున్నారన్నారు.

వైఎస్ ఉంటే ఈ కష్టాలు వచ్చి ఉండేవా: రోజా
వైఎస్ అధికారంలో ఉండగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని ప్రయత్నిస్తే.. ఈ ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించేందుకు నానా తంటాలు పడుతోందని సినీనటి రోజా ఆరోపించారు. వైఎస్సార్ బతికుంటే విద్యార్థులకు ఈ కష్టాలు ఉండేవి కావని, తల తాకట్టు పెట్టయినా నిధులు తెచ్చేవారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కేవలం సంక్షేమ పథకంగా చూడవద్దని, విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి పథకంగా చూడాలన్నారు. విద్యార్థుల కన్నీటిని సహించలేక వైఎస్ తనయుడిగానే కాకుండా ప్రజానాయకుడిగా జగన్ ఆందోళన చేపట్టారని అన్నారు.
 

చేతకాకుంటే గద్దె దిగండి
  ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై పలువురు నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు. పథకాలను అమలుచేయడం చేతకాకపోతే గద్దె దిగాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు. ఫీజు పోరు వేదికపై ఎవరేమన్నారంటే...

రీయింబర్స్‌మెంట్.. వైఎస్ ఇచ్చిన వరం


పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని ప్రత్యేక కోణంలో చూడాలని, కేవలం సంక్షేమ పథకంగా చూడకూడదన్నది వైఎస్ ఉద్దేశం. ప్రభుత్వం తక్షణం రీయింబర్స్‌మెంటు నిధులు విడుదల చేయాలి. నేను చదువుకొనే రోజుల్లో వైఎస్ సీఎంగా ఉంటే.. మరింత ఉన్నత చదువులు చదవగలిగేవాడిని.

-పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రి

వైఎస్ వారసులమని ప్రగల్భాలు పలుకుతున్నారు


వైఎస్ వారసులమని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఆయన ఆశయాలను పూర్తిగా విస్మరించారు. ప్రస్తుతం ప్రభుత్వం దశా దిశ లేని స్థితిలో ఉంది. 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సర్కారు వ్యవహరించాలి. వైఎస్ పథకాల వల్లే ప్రభుత్వ ఆర్థిక పటిష్టత దెబ్బతిందంటూ మంత్రులు చేసిన విమర్శలు వారి దిగజారుడుతనానికి నిదర్శనం. 2010 డిసెంబరు నాటికి రూ. 7 వేల కోట్లు అదనంగా రాబడి వచ్చింది. అందులో రూ. 3,500 కోట్లు విద్యార్థులకు ఇవ్వలేకపోయారు.

-కొణతాల రామకృష్ణ, మాజీ మంత్రి

వైఎస్ ఆశయాలను మరుగున పడేశారు


వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామంటూ ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. వైఎస్ ఆశయాలను మరుగున పడేశారు. ఈ సర్కారు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తోంది. వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుంటే సాక్షాత్తు ఉపసంఘంలో ఉన్న మంత్రే అది ప్రమాదమంటూ బుకాయించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసమే జగన్ దీక్ష చేస్తున్నారు.

-బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే

విద్యార్థుల చదువుకు సర్కారు ప్రతిబంధకాలు


విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించకుండా ప్రభుత్వం వారి చదువుకు ప్రతిబంధకాలు సృష్టిస్తోంది. రీయింబర్స్‌మెంట్ కింద రూ. 3,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా... రూ. 600 కోట్లు, రూ. 800 కోట్లు, రూ. వెయ్యి కోట్లు ఇస్తామని నిమిషానికో మాట చెబుతూ ఏదో బిక్షం వేస్తున్నట్లుగా సర్కారు ప్రవర్తిస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి నడుంకట్టిన కార్మిక, కర్షక, విద్యార్థి పక్షపాతి అయిన జగన్‌కి అంతా మద్దతు తెలుపుదాం.

-జనక్ ప్రసాద్, సింగరేణి ట్రేడ్ యూనియన్ నేత

ఎందుకు అమలుచేయరు?


పావలా వడ్డీ, రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు నావే అంటున్న ప్రభుత్వ పెద్దలు వాటిని ఎందుకు అమలుచేయడంలేదు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జగన్ చేపట్టిన దీక్షకు మద్దతుగా జిల్లాల్లో దీక్షలు చేపట్టాలి.

-గోనె ప్రకాశరావు, ఆర్టీసీ మాజీ చైర్మన్

చేతగాకపోతే రాజీనామా చేయండి


రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేయడం చేతగాకపోతే కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ఆస్తులు తనఖా పెట్టడం కాదు.. మంత్రుల క్వార్టర్లు తనఖా పెట్టి ఫీజులు చెల్లించండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయం.

- గజ్జెల కాంతం, అంబేద్కర్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు

తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం


వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తున్న ప్రభుత్వానికి.. జగన్ దీక్ష వణుకు పుట్టించాలి. మనమంతా జగన్‌కు వెన్నంటి నిలవాలి.

- కేకే మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత

ప్రభుత్వం వల్ల అన్ని వర్గాల ప్రజలు పరేషాన్


విద్యార్థులు, రైతులు, కార్మికులు.. అన్ని వర్గాల ప్రజలు ప్రస్తుత ప్రభుత్వం వల్ల పరేషాన్ అవుతున్నారు. ప్రజల కోసం ముందుండి పోరాటం చేస్తున్న జగన్‌కు మద్దతుగా నిలుద్దాం.

- ఫర్జాన్ బేగం, కదిరి మున్సిపల్ ఛైర్మన్

నేటి దీక్షలో న్యాయవాదులు

జగన్ చేపట్టిన ఫీజుపోరు దీక్షలో రెండో రోజైన శనివారం హైదరాబాద్‌కు చెందిన న్యాయవాదులు పాల్గొంటారని అంబటి రాంబాబు చెప్పారు. నల్లగొండ జిల్లాకు చెందిన బీరవోలు సోమిరెడ్డి నేతృత్వంలో యువనేత జగన్‌పై రూపొందించిన పాటల సీడీని దీక్షల శిబిరంలో ఆవిష్కరించారు.

Thursday, February 17, 2011

జననేత జగనే!

*రాష్ట్రంలో ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు యువనేతకే
*ఎన్‌టీవీ-నీల్సన్, ఓఆర్‌జీ-మార్గ్ సర్వే
*ముఖ్యమంత్రిగా జగన్‌కు 35%, కేసీఆర్‌కు19%, చంద్రబాబుకు 19%, కిరణ్‌కు 15%, చిరంజీవికి 5% మంది ఓట్లు
*ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ పార్టీకి 35%, టీఆర్‌ఎస్‌కు 20%, టీడీపీకి 18%, కాంగ్రెస్‌కు 16%, పీఆర్పీకి 5% ఓట్లు
*కోస్తా, రాయలసీమల్లో జగన్‌కే జననీరాజనం
*తెలంగాణలో కేసీఆర్ ప్రభంజనం.. అక్కడా కాంగ్రెస్, టీడీపీలకు దీటుగా జగన్‌కు ఓట్లు

యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డే రాష్ట్రంలో జన హృదయ నేతని.. వచ్చే ఎన్నికల్లో ఆయనే ముఖ్యమంత్రి అని 35 శాతం మంది ప్రజలు చెప్తున్నారని ఎన్‌టీవీ-నీల్సన్ ఓఆర్‌జీ మార్గ్ సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుని ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని 19 శాతం మంది చెప్తే.. టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అవుతారని మరో 19 శాతం మంది.. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని భావించే వారు 15 శాతం మంది ఉన్నట్లు సర్వే పేర్కొంది. పీఆర్పీ అధినేత చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారన్న వారి సంఖ్య కేవలం ఐదు శాతమేనని చెప్పింది.


రాష్ట్రం మొత్తం ఓట్లర్లలో ప్రతి ముగ్గురులో ఒకరు తాము జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించబోయే పార్టీకి ఓటు వేస్తామని నిర్థారించారు. కోస్తా, రాయలసీమల్లో జగన్ పార్టీ ఎవరికీ అందనంత దూరంలో తిరుగులేని విజయం సాధిస్తుందని.. తెలంగాణ ప్రాంతంలో సైతం కాంగ్రెస్, టీడీపీలకు దాదాపు సమానంగా జగన్ పార్టీ ఓట్లు దక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. అయితే.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభంజనం ముందు మరే పార్టీ ప్రభావం పనిచేయదని సర్వే నిర్ధారించింది. జనవరి ఆరో తేదీ నుంచి 26వ తేదీ మధ్య కాలంలో.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ సర్వే నిర్వహించినట్లు నీల్సన్ వివరించింది. ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావాలన్న ప్రతిపాదనలు జరుగుతుండటంతో ఈ అంశాన్ని సర్వేలో పరగణనలోకి తీసుకున్నా.. పీఆర్పీ కూడా ఎన్నికల బరిలో ఉంటుందన్న కోణంలోనే సర్వే కొనసాగినట్లు సంస్థ పేర్కొంది.
ఇప్పుడు ఎన్నికలు జరిగితే...
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 35 శాతం ఓట్లతో జగన్ పార్టీ 139 నుంచి 153 వరకు సీట్లు గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది. జగన్ పార్టీకి కోస్తాలో 45 శాతం ఓట్లు, రాయలసీమలో 59 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. రాష్ట్రం మొత్తం ఓట్లలో 20 శాతం.. తెలంగాణ ప్రాంతంలో 50 శాతం ఓట్లు తెచ్చుకుని టీఆర్‌ఎస్ 70 నుంచి 74 స్థానాలు గెలిచి రెండోస్థానం దక్కించుకుంటుందని పేర్కొంది. అధికార కాంగ్రెస్ పార్టీకి 28 -33 సీట్లు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 32 -37 సీట్లు, పీఆర్పీకి 2-4 సీట్లు, వామపక్షాలకు ఒక సీటు, ఇతరులకు 10- 14 సీట్లు వస్తాయని సర్వే నిర్ధారించింది. ప్రాంతాల వారీగా చూసుకుంటే తెలంగాణలో.. కాంగ్రెస్, జగన్ పార్టీలు సమానంగా 12 -14 సీట్లు, టీడీపీ 15- 17 సీట్లు, వామపక్షాలు ఒక సీటు, ఇతరులు 8 నుంచి 10 సీట్లు గెలుచుకుంటారని సర్వే తేల్చింది. కోస్తా, రాయలసీమల్లో జగన్ పార్టీకి దగ్గరగా వచ్చే స్థాయిలో మరే పార్టీ లేదని సర్వేలో తేలింది.
ప్రభుత్వంపై నమ్మకం పోయింది...
గత ఏడాది నీల్సన్ నిర్వహించిన సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందని 71 శాతం నమ్మితే తాజా సర్వేలో ఆ సంఖ్య 30 శాతానికి పడిపోయింది. తాజా సర్వేలో రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తప్పవ ని 52 శాతం మంది నమ్ముతున్నారు. మూడు ప్రాంతాలకు చెందినవారు సగం మంది మధ్యంతరం ఉంటుందని అనుకుంటున్నారని సర్వేలో తేలింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, పీఆర్పీల పనితీరు ఆధ్వాన్నంగా ఉందన్నది జనాభిప్రాయం.
వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం తరువాత కాంగ్రెస్ బలహీనపడిందని 80 శాతం మంది ప్రజలు నమ్మితే.. యువనేత జగన్ పార్టీ వీడటం కారణంగా కాంగ్రెస్ బలహీన పడిందని 34 శాతం మంది చెప్పారు. సరైన నాయకత్వం లేకపోవటం, పార్టీలో కేంద్ర నాయకత్వం పెత్తనం వల్ల బలహీనపడిందని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగుందని కేవలం 11 శాతం మంది మాత్రమే సర్వేలో పేర్కొనగా.. 68 శాతం మంది బాగోలేదని తేల్చిచెప్పారు.
సర్వే జరిగిన తీరు.. ఖచ్చితత్వం..
ఐదేళ్ల పాటు సంయుక్తంగా సర్వేలు నిర్వహించాలన్న నీల్సన్ ఓఆర్జీ మార్గ్ - ఎన్‌టీవీ ఒప్పుందంలో భాగంగా ఏడో ధపా ఈ సర్వే నిర్వహించారు. గతంలో ఆరు సార్లు వీరు నిర్వహించిన సర్వేలు 97 శాతం వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని సర్వే నిర్వాహకులు పేర్కొన్నారు. 2009 ఎన్నికల సమయంలో వారి అంచనాలకు అతి దగ్గరగా ఫలితాలు ఉండటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూడు ప్రాంతాల్లో మొత్తం 75 అసెంబ్లీ నియోజకవర్గాలను శాంపిల్ తీసుకొని, నియోజవర్గానికి 16 పోలింగ్‌బూత్‌ల చొప్పున ఒక్కొక్క చోట పదేసి మంది అభిప్రాయాలను సేకరించారు. తెలంగాణలో 33, కోస్తాలో 30, రాయలసీమలో 12 నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 12,052 మంది అభిప్రాయాల ఆధారంగా సర్వే పూర్తి చేశారు.

కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనమవుతుందని ప్రకటించక ముందు జనవరి ఆరో తేదీ నుంచి 26వ తేదీ మధ్య నిర్వహించిన సర్వే ఇది. పీఆర్పీ విలీనం తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై శుక్రవారం ఎన్‌టీవీలో విశ్లేషణ ప్రసారం కానుంది.

Wednesday, February 16, 2011

వారంపాటు నిరశన * ఫీజులపై హైదరాబాద్‌లో 18 నుంచి నిరాహార దీక్ష : జగన్

* ఫీజులకు రూ. 3400 కోట్లు అవసరమంటే సర్కారు చేతకాదంటోంది...* దీనికి నిరసనగా మొన్న ఒక్క రోజు దీక్ష చేద్దామని అనుకున్నాను* కానీ ఒక్క రోజు దీక్షతో ఈ ప్రభుత్వం కళ్లు తెరిచేటట్లు లేదు* పేదరికం పోవాలంటే ప్రతి పేద విద్యార్థీ పెద్ద చదువులు చదవాలి* అందుకే మహానేత ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు* ఈ ప్రభుత్వం వైఎస్ కలలను నాశనం చేస్తోంది* సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా సర్కారుకు బుద్ధి రావడంలేదు* పెద్ద చదువులు చదివే ప్రతి పేద విద్యార్థీ హైదరాబాద్‌కు చలో అనండి* ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేలోపు రాష్ట్రంతోపాటు కేంద్రానికి కనువిప్పుకావాలి

  ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా సర్కారుకు సిగ్గు, బుద్ధి రావడం లేదని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. పేదవాడిని చదివించే స్థితిలో ప్రభుత్వం లేకపోతే, పేదరికం ఎప్పుడు పోతుందని నిలదీశారు. ఈ విషయంలో ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి తాను హైదరాబాద్‌లో ఈ నెల 18 నుంచి ఏడు రోజులపాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. పెద్ద చదువులు చదివే పేద విద్యార్థులందరూ ఈ సర్కారును నిలదీసేందుకు హైదరాబాద్‌కు చలో అంటూ తరలిరావాలని పిలుపునిచ్చారు.

బుధవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం నేత రాచమల్లు ప్రసాద్‌రెడ్డి యువనేతకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు దాదాపు 10 వేల మంది మహిళలు సహా జనం భారీగా తరలివచ్చారు. వారినుద్దేశించి జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. ‘రాచమల్లు ప్రసాద్‌రెడ్డి గుండెచప్పుడు వింటే లబ్‌డబ్.. లబ్‌డబ్.. లబ్‌డబ్ అని కాకుండా వైఎస్‌ఆర్.. వైఎస్‌ఆర్.. వైఎస్‌ఆర్ అని అంటోంది. ఇక్కడ ప్రసాద్ గుండె చప్పుడే కాకుండా ప్రతి అక్కా, ప్రతి చెల్లీ, ప్రతి అవ్వా, తాతా, ప్రతి స్నేహితుడి గుండె చప్పుడూ వైఎస్‌ఆర్ పేరునే వినిపిస్తోంది’ అని జగన్ అన్నారు.

వైఎస్ కలలను నాశనం చేస్తోందీ ప్రభుత్వం
‘పావలా వడ్డీ ఆలోచన వచ్చినప్పుడల్లా... ఇంత తక్కువ వడ్డీకి రుణం వస్తుందనిపించినప్పుడల్లా.. ప్రతి అక్కకు, చెల్లికి గుర్తుకొచ్చేది...’ అని యువనేత ప్రసంగం నిలపగానే సభికుల్లో నుంచి ‘వైఎస్‌ఆర్... వైఎస్‌ఆర్..’ అంటూ ప్రతిధ్వనులు వినిపించాయి. ‘ప్రతి పేదవాడి ఇంటిలో ఒక్కరన్నా చదువుకోవాలని, ఆ చదువుతో ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుందని వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్రవేశపెట్టారు. ఆ పథకం కింద ప్రతి పేద విద్యార్థీ పెద్ద చదువు చదువుకునేటప్పుడు... పేద తల్లితండ్రులు తమకున్న చిన్న ఇల్లో, పొలమో అమ్ముకోకుండా బిడ్డలను చదివించగలగుతున్నప్పుడు... వారికి దివంగత వైఎస్‌ఆర్ గుర్తుకొస్తూనే ఉంటారు’ అని జగన్ అన్నారు.

‘వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టం మీద ఏర్పాటైన ఈ ప్రభుత్వం, ఈ వేళ ఆయన కలలను నాశనం చేస్తోంది. ఫీజు చెల్లించడానికి సమయం కావాలని అడిగితే సుప్రీంకోర్టు మొన్న సమయం ఇచ్చింది. ఈరోజు మళ్లీ సిగ్గులేకుండా వెళ్లి మళ్లీ సమయం కావాలని అడుగుతోంది ప్రభుత్వం. అది చూసి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అయినాసరే సిగ్గులేకుండా.. ఫీజుల కోసం 3400 కోట్లు అవసరం అంటే.. 800కోట్లిస్తాం.. 1200 కోట్లిస్తాం సరిపెట్టుకోండీ అంటోంది’ అంటూ సర్కారు వైఖరిని దుయ్యబట్టారు.

ఆ చెల్లి తగులబెట్టుకుంది..
‘ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థికి సకాలంలో ఫీజు చెల్లించకపోవడంతో ఆ చెల్లి కిరోసిన్ పోసుకుని తనను తాను తగులబెట్టుకుంది. బీటెక్ చదువుతున్న వరలక్ష్మీ అనే చెల్లి ఆత్మహత్య చేసుకుంటే మొన్న హయత్‌నగర్‌కు వెళ్లి పరామర్శించాను. ఆ చెల్లి తండ్రి ఓ ప్రయివేటు స్కూల్‌లో వాచ్‌మెన్. ఆయనకు నెలకు వచ్చే జీతం 1800. తల్లి పంచాయతీలో స్వీపర్. నెలంతా కష్టపడితే ఆమెకొచ్చేది వెయ్యి రూపాయలు. ఈ పేద తల్లితండ్రుల బిడ్డ వరలక్ష్మి చదువులో ఫస్ట్. వారింటికి పరామర్శకు వెళ్లినప్పుడు ‘డ్రాయింగ్’ పేపరు చూపించారు. 20 మార్కులకు 19 మార్కులు వచ్చాయి. ఫిబ్రవరి దాటుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆమె ఫీజు కట్టలేదు. చదువు కోసం 30 వేలు కావాలి నాన్నా అని అడిగితే ఏం చేయాలో తెలియని పరిస్థితి తల్లిదండ్రులది.

ఒక పక్క చదువును మధ్యలో వదిలేయలేక, చదవలేకపోతే తన తల్లిదండ్రులకు తాను అన్నం పెట్టే పరిస్థితి ఉండదని, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో సైతం తన కుటుంబానికి ఏ మేలూ చేయలేనన్న ఆవేదనతో ఆ చెల్లి కిరోసిన్ పోసుకుని తనను తాను తగులబెట్టుకుంది’ అంటూ జగన్ గద్గద స్వరంతో వరలక్ష్మి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరించారు. ఆమెలాంటి ఎందరో చెల్లెళ్లు, తమ్ముళ్లు.. ఇంజనీర్లు, డాక్టర్లు కావాల్సిన వాళ్లు.. ఫీజు కట్టలేక చదువులు మానుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారని, పేద విద్యార్థులకు చదువు చెప్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉంటే పేదరికం ఎప్పుడు పోతుందని జగన్ నిలదీశారు. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి బుద్ధి వచ్చేట్లు చేద్దాం

‘సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా సరే ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. పేద విద్యార్థుల ఫీజులకు 3400 కోట్లు అవసరం అంటే.. 800 కోట్లిస్తాం.. 1200 కోట్లిస్తామంటోంది. ఇలాగైతే పేదోడు పేదరికం నుంచి బయటపడేదెప్పుడు? పేద విద్యార్థుల ఫీజుల కోసం నేను ఒక రోజు ధర్నా చేయాలని మొన్న అనుకున్నాను. కానీ ఈ రోజు అనిపిస్తోంది.. ఒక్క రోజుతో ఈ ప్రభుత్వం కళ్లు తెరవదూ అని! అందుకే ఇప్పుడు చెబుతున్నాను. ఈ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టేలోపు ఈ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా కనువిప్పు కావాలి. ప్రతి పేద విద్యార్థీ పెద్ద చదవులు చదివితేనే పేదరికం పోతుందని సర్కారుకు కనువిప్పు కలగజేయడానికి ఈ నెల 18 నుంచి 7 రోజులపాటు నేను హైదరాబాద్ నగరంలో నిరాహార దీక్ష చేస్తాను. ఇప్పటికైనా పేదోడి చదువుకు ముందుకొచ్చి సాయం చేసేలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుర్ర ఇవ్వాలని, బుద్ధి ఇవ్వాలని, జ్ఞానోదయం చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇంజనీరింగ్, డాక్టర్‌లాంటి పెద్ద చదవులు చదివే పేద విద్యార్థులందరూ ఈ సర్కారును నిలదీసేందుకు హైదరాబాద్‌కు చలో అంటూ తరలి రండి. వారం రోజులపాటు నిరసన తెలిపైనా సరే సర్కారుకు బుద్ధి వచ్చేటట్లు చేద్దాం.’

  
విద్యార్థుల కోసం జగన్ దీక్ష


* ఇందిరాపార్కు వద్ద వారం పాటు నిరశన
* జిల్లాల నుంచి పెద్దఎత్తున తరలివస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
* నేటి ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయల్దేరనున్న యువనేత
* మార్గమధ్యంలో పంజాగుట్ట సర్కిల్ వద్ద వైఎస్ విగ్రహానికి నివాళి
* అక్కడ్నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి అంజలి
* తర్వాత నేరుగా దీక్షా స్థలికి


ఫీజులకు ఉరేసి.. బడుగు విద్యార్థి చదువులను నట్టేట ముంచుతున్న రాష్ట్ర సర్కారు నిర్లక్ష్య వైఖరిపై యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సింహగర్జన చేయనున్నారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సక్రమంగా అమలుచేయాలని నినదిస్తూ ‘ఫీజు పోరు’కు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి ఏడురోజులపాటు యువనేత చేయనున్న ఈ నిరాహారదీక్షకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్దగల ధర్నాచౌక్ వేదిక కానుంది. ఉదయం 10 గంటలకు తన ఇంటి నుంచి బయలుదేరనున్న జగన్.. మార్గమధ్యంలో పంజాగుట్ట సర్కిల్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తారు.

అక్కడ్నుంచి నేరుగా ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాల వేసి అంజలి ఘటిస్తారు. తర్వాత ఇందిరాపార్కుకు వెళ్లి దీక్షలో కూర్చుంటారు. 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ దీక్షను కొనసాగిస్తారు. రోజూ విద్యార్థులు,అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తొలినుంచీ ఏడు రోజుల పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా విద్యార్థులు, అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున నిర్వాహకులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం యువనేత తొలుత విజయవాడలో ‘లక్ష్యదీక్ష’, ఆ తరువాత కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో ‘జలదీక్ష’, అనంతరం పెట్రో ధరల పెంపునకు నిరసనగా విశాఖలో ‘జనదీక్ష’ చేపట్టిన సంగతి తెలిసిందే.

ఏర్పాట్లను పర్యవేక్షించిన నేతలు
జగన్ దీక్ష కోసం ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం పలువురు నాయకులు పర్యవేక్షించారు. దీక్షలకు తరలివచ్చే విద్యార్థులు, అభిమానులు, సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఎమ్మెల్సీ రెహమాన్, శాప్ మాజీ ఛైర్మన్ రాజ్‌సింగ్ ఠాకూర్, గట్టు రాంచందర్‌రావు, పుత్తా ప్రతాప్‌రెడ్డి తదితరులు దీక్షా స్థలాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఎల్‌ఐసీకాలనీ దగ్గర భారీ వేదికను ఏర్పాటు చేసి ఇందిరా పార్కు చౌరస్తా వరకు కార్పెట్లను పరిచారు. ఎండకు తట్టుకునే విధంగా షామియానాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియం, ఏవీకాలేజ్‌లలో పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు జగన్‌వర్గం నేతలు తెలిపారు.

Monday, February 14, 2011

మార్చిలో మన పార్టీ * బద్వేలు బహిరంగ సభలో వైఎస్ జగన్ వెల్లడి

* ఈ ప్రభుత్వానికి బంగాళాఖాతంలో వేసినా సిగ్గు రాదు
* ఫీజులు కట్టలేక పేద విద్యార్థుల భవిష్యత్తు అయోమయం
* 2010-11 సంవత్సరానికి పావలా వడ్డీ బడ్జెట్ లేదు
* వైఎస్ పథకాలను సర్వనాశనం చేశారు


వచ్చేనెల మార్చిలో ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదాల చెంత తన కొత్త పార్టీ ఆవిష్కృతమవుతుందని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మన జెండా మనం మోసి, వైఎస్ కలలుగన్న సువర్ణ రాష్ట్రాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. మరో రెండు, మూడేళ్లలో వైఎస్ స్వర్ణపాలన వస్తుందని, ఆ పాలన ముప్పై ఏళ్లపాటు కొనసాగుతుందని ఉద్ఘాటించారు. సోమవారం కడప జిల్లా బద్వేలులో దివంగత మాజీమంత్రి బిజివేముల వీరారెడ్డి ముఖ్య అనుచరుడు లింగందిన్నె విజయభాస్కర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి జగన్ వర్గంలోకి చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో యువనేత ఉద్వేగంగా మాట్లాడారు. వైఎస్ పథకాలను నీరుగారుస్తున్న రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు.

బంగాళాఖాతంలో కలిపేసినా ఈ ప్రభుత్వానికి సిగ్గురాదని మండిపడ్డారు. ‘‘వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. పావలా వడ్డీకి ఒక్క రూపాయి లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక పేద విద్యార్థుల భవిష్యత్తు అయోమయంగా మారింది. ప్రతి విద్యార్థిని ఉచితంగా చదివించే ఈ పథకానికి డబ్బు ఇవ్వాలని అడుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. బంగాళాఖాతంలో వేసినా ఈ ప్రభుత్వానికి సిగ్గురాదు. మార్చిలో మన పార్టీ మనకొస్తుంది. ఇడుపులపాయలో వైఎస్ పాదాల చెంత పేదోడి పార్టీ పుడుతుంది. మన జెండా మనం మోస్తాం. రామరాజ్యం ఎలా ఉంటుందో చూడలేదు కానీ వైఎస్ స్వర్ణపాలన మరో రెండు, మూడేళ్లలో వస్తుంది. ఆ స్వర్ణపాలన 30 ఏళ్లు కొనసాగుతుంది. మరో నూరు సంవత్సరాలు ఆ పాలనను మరచిపోకుండా చేస్తాను’’ అని జగన్ చెప్పారు. ముందుగా అనుకున్న ప్రకారం సోమవారం బద్వేలు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో యువనేత 15 వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించాల్సి ఉన్నా.. ఎన్నికల కోడ్ దృష్ట్యా అధికారులు అభ్యంతరం చెప్పడంతో ఆవిష్కరణలను వాయిదా వేసుకున్నారు.


వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటారు...


బద్వేలులో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ.. వైఎస్ పథకాలను గుర్తుచేసినప్పుడల్లా జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమైంది. ‘ప్రతి మహిళా లక్షాధికారి కావాలని మహానేత కలలుకన్నారు. వారికోసం పావలా వడ్డితో రుణాలిచ్చే పథకం ప్రవేశపెట్టారు. పావలా వడ్డీతో రుణాలు తీసుకుని తమ జీవితాలను బాగు చేసుకున్న ప్రతి అక్క, ప్రతి చెల్లి చిరునవ్వులో వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తూనే ఉంటారు. అవ్వ, తాతలకు ప్రతి నెలా 1వతేదీ పింఛన్ తీసుకునేటప్పుడు వారి చిరునవ్వులో వైఎస్ ఉంటారు. వైఎస్ మా పెద్ద కొడుకని వారు గర్వంగా చెబుతారు’’ అని జగన్ పేర్కొన్నారు.


పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైత న్నలకు ఉచిత కరెంటు, బడుగు జీవులకు ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్.. ఇక రాడని అనుకున్నప్పుడల్లా చాలా బాధ అనిపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈరోజు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై వైఎస్‌పై బురదజల్లుతున్నాయన్నారు. ‘‘నాన్న ఒక మాట అంటుండే వారు. అది నేనెప్పటికీ మరిచిపోను.. బతికి ఉన్నప్పుడు జేజేలు కొట్టించుకోవడం గొప్పకాదు. చనిపోయిన తర్వాత ఎందరి గుండెల్లో బతికున్నామన్నదే గొప్ప అని అంటుండేవారు. అలా జనం గుండెల్లో నిలిచిపోయిన నాన్న.. నాకు ఇంత పెద్ద కుటుం బాన్ని ఇచ్చారు. మీ ప్రేమ, ఆప్యాయతలకు జన్మజన్మలకు రుణపడి ఉంటాను’’ అంటూ చేతులు జోడించారు.

విజయభాస్కర్‌రెడ్డి చేరిక సంతోషం


బద్వేలులో టీడీపీలో మంచి నాయకుడిగా ఎదిగిన లింగందిన్నె విజయభాస్కర్‌రెడ్డి తనకు తోడుగా రావడం సంతోషంగా ఉందని యువనేత హర్షం వ్యక్తం చేశారు. దాదాపు పదివేల మందితో ఏర్పాటు చేసిన బహిరంగసభలో భాస్కర్‌రెడ్డి తన బంధుమిత్రులతో జగన్‌కు మద్దతు పలికారు. ఈ సభలో విజయభాస్కర్‌రెడ్డి బాబాయ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బీరం మల్లారెడ్డి జగన్ స్థాపించబోయే పార్టీకి రూ. 2 లక్షల విరాళం ప్రకటించారు. అంతకు ముందు జగన్ కడప నుంచి బద్వేలుకు వచ్చే మార్గంలో, అట్లూరు క్రాస్ నుంచి విజయభాస్కర్‌రెడ్డి భారీ మోటారు సైకిల్ ర్యాలీతో స్వాగతం పలికారు. మోటారు సైకిళ్లు, వాహనాల ర్యాలీతో యువనేతను అనుసరించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు కె.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


వైఎస్ గుడిని సందర్శించిన జగన్


బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలోని చల్లగిరిగెల గ్రామంలో స్థానికులు నిర్మించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గుడిని యువనేత సందర్శించారు. చల్లగిరిగెల రామాలయం ఎదురుగా వైఎస్ గుడిని చుట్టుపక్కల గ్రామస్తులు విరాళాలతో నిర్మించారు. యువనేత గుడిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, టెంకాయ కొట్టి పూజలు చేశారు. ప్రతి గుండెలో దీపమైన వైఎస్‌ను శ్రీరాముని పాదాల చెంత ప్రతిష్టించినందుకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతున్నానని యువనేత అక్కడి ప్రజలనుద్దేశించి అన్నారు. బద్వేలు నుంచి చల్లగిరిగెలకు వెళ్లే దారిలో జగన్‌కు ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. అభిమానులకు అభివాదం చేస్తూ యువనేత ముందుకు సాగారు. బద్వేలు ఎన్‌జీవో కాలనీ నుంచి బయలుదేరిన జగన్... గానుగపెంట, ఎస్.వెంకట్రామాపురం, అగ్రహారంల మీదుగా చల్లగిరిగెల చేరుకున్నారు.

Friday, February 11, 2011

పోలవరం మీరు కట్టలేరా?

 
హరిత యాత్ర ముగింపు సభలో యువనేత జగన్ సూటి ప్రశ్న
పోలవరం కట్టకుండా సాకులెందుకు?
కేంద్రం దయపై బతుకుతున్నామా?
32 మంది ఎంపీలున్నా అడుక్కోవాలా?
పోలవరం నాలుగు జిల్లాలకేపరిమితమన్నవారు మూర్ఖులే
వెంటనే పోలవరం, ప్రాణహిత-చేవెళ్లకు టెండర్లు పిలవండి.. లేదంటే ఆందోళనే

దివంగత రాజశేఖరరెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయాక ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టువైపు కన్నెత్తి చూడలేదు. ఎంత సేపు కేంద్ర ప్రభుత్వం ఏదో చేయాలి.. కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తేనే మనం ఈప్రాజెక్టును చేయగలుగుతాం.. చేస్తామని చెప్పి సాకులు చూపిస్తున్నారు.. కేంద్రం దయాదాక్షిణ్యాల మీద మనం బతుకుతున్నట్టుగా.. వాళ్ల దగ్గరికి పోయి కాళ్లావేళ్లా పడే పరిస్థితిలో రాష్ట్రం ఉందన్నట్టుగా చెబుతున్నారు.

మనిషి అన్నాక.. పదవిలో ఉన్నప్పుడు ఒకతీరుగా.. పదవిలో లేనప్పుడు ఒకరకంగా ఉండడం సరైన పద్ధతి కాదు. మైకులు పట్టుకుని చంద్రబాబు గారు రైతుల గురించి ప్రేమ ఒలకబోస్తూ చెప్పే మాటలను చూసి ఈ మాటలంటున్నా. 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆరోజే పోలవరం కట్టి ఉంటే, కనీసం ఆలోచన చేసి ఉంటే.. ఈ సరికే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఉండేది.

- హరిత యాత్ర ముగింపు సభలో జగన్

కేంద్ర ప్రభుత్వం సాయం చేయకుంటే పోలవరం ప్రాజెక్టు మీరు కట్టలేరా అంటూ రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనంపై యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ చూపిన బాటలో ప్రాజెక్టు నిర్మించకుండా సాకులు చూపుతున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నట్టుగా, వారి కాళ్లా వేళ్లా పడే పరిస్థితుల్లో ఉన్నట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని, లేదంటే కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదం ఉందని జగన్ ఆందోళన వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉభయ గోదావరి జిల్లాల్లో ‘హరిత యాత్ర’ పేరుతో జగన్ చేపట్టిన పాదయాత్ర గురువారం ప్రాజెక్టు స్థలం వద్దకు చేరడంతో ముగిసింది. నాలుగురోజుల పాటు 88 కిలోమీటర్ల మేర నడిచిన యువనేత యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. జగన్ మాట్లాడ్డానికి నిలబడగానే సభా ప్రాంగణంలో కేరింతలు, చప్పట్లు హోరెత్తాయి. ఆ హర్షధ్వానాల మధ్య ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. మన రాష్ట్రం నుంచి అత్యధికమంది ఎంపీలను తీసుకుంటూ కూడా రాష్ట్రానికి ఎలాంటి లబ్ధీ చేకూర్చని కాంగ్రెస్ పార్టీ దగాకోరుతనాన్ని ఎండగట్టారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

లక్షల పాదాలు కదిలొచ్చాయి..

రామయ్యపేట.. ఈ పేరు చాలా తక్కువ మంది విని ఉంటారు. మారుమూలన ఒక చిన్నగ్రామం. అయినా ఈ చిన్న గ్రామానికి ఇన్ని లక్షల పాదాలు కదిలాయి.. ఇన్ని లక్షల గుండెల చప్పుడు ఇక్కడ వినబడుతోంది.. 88 కిలోమీటర్ల మేర ఈ నడక సాగించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ కేంద్ర ప్రభుత్వానికీ, రెండింటికీ ఈ ప్రాజెక్టు ఎక్కడ ఉందనేది చెప్పాం. ఈ ప్రాజెక్టు అవసరం ఎంత అనేది కూడా.. నడిరోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి చూపించాం. నాతో పాటు అడుగులో అడుగు వేసిన లక్షల పాదాలకు, లక్షల హృదయాలకు, ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.

కృష్ణాకు నీరు తరలించకుంటే రాష్ట్రం ఎడారే..


ఇవ్వాళ ఎవరైనా ఈ పోలవరం ప్రాజెక్టు కేవలం మూడు నాలుగు జిల్లాలకు చెందిన ప్రాజెక్టే అని అనుకుంటే.. అంతకంటే మూర్ఖులు ఎవరూ ఉండరని చెబుతున్నా.. ఎత్తు ఒకసారి కృష్ణా జలాలపై వచ్చిన ట్రిబ్యునల్ తీర్పును చూడండి. ఆ తీర్పు నేపథ్యంలో పోలవరమే మనకు శరణ్యం. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు రాకపోతే యావత్ రాష్ట్రం ఎడారవుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి కుడికాలువ ద్వారా కృష్ణా నదికి నీళ్లు అందకపోతే.. దుమ్ముగూడెం దగ్గరి నుంచి నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ దగ్గరికి తీసుకెళ్లకపోతే కృష్ణా నది మీద నిలబడి ఉన్న మొత్తం రాష్ట్రం కూడా.. అటు తెలంగాణ కానీ, ఇటు రాయలసీమ కానీ, గుంటూరు, విజయవాడ నగరాలు, పశ్చిమ గోదావరి కానీ పూర్తిగా ఎడారయ్యే పరిస్థితి వస్తుంది.

కేంద్రం చేయకపోతే.. మీరు ప్రాజెక్టు కట్టరా?


ఒక్కసారి ఆలోచన చేయండి. దివంగత నేత రాజశేఖరరెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయాక ప్రభుత్వం ఈ ప్రాజెక్టువైపు కన్నెత్తి చూడలేదు. ఎంతసేపు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదో చేయాలి.. కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తేనే మనం ఈప్రాజెక్టును చేయగలుగుతాం.. చేస్తామని చెప్పి సాకులు చూపిస్తున్నారు.. ఆ కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద మనం బతుకుతున్నట్టుగా.. వాళ్ల దగ్గరికి పోయి కాళ్లావేళ్లా పడే పరిస్థితిలో రాష్ట్రం ఉందన్నట్టుగా చెబుతున్నారు. నేనడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని.. ఏం? కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయకపోతే మీరు పోలవరం ప్రాజెక్టు కట్టరా? అని అడుగుతున్నా.


ఇంతమంది ఎంపీలను పంపినా అడుక్కోవాలా?


కేంద్రానికి 32 మంది ఎంపీలను పంపాం. ఇంతమంది ఎంపీలను పంపినందుకు ఇన్నిసార్లు అడుక్కునే పరిస్థితి మాకెందుకు? ఈ ప్రాజెక్టు కోసం దివంగత నేత వైఎస్సార్ చేసినట్టుగా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతోంది? ఎంపీలైతే 32 మంది మన దగ్గరి నుంచే కావాలట. పదవుల దగ్గరికి వచ్చేసరికి.. రైల్వే మంత్రి పదవి చూస్తే ఎవరో మమతాబెనర్జీ గారికో, లాలూ ప్రసాద్ యాదవ్‌గారికో మరొకరికో మరొకరికో ఇస్తారు. ఒకరేమో రైల్వేబడ్జెట్ అంతా పశ్చిమ బెంగాల్‌కు తీసుకెళతారు. ఒకరేమో బీహార్‌కు తీసుకెళతారు. ఆ రైల్వే మంత్రిత్వ శాఖ మనకే ఎందుకు దక్కకూడదూ అని అడుగుతున్నా!


గోడు చెప్పుకుందామంటే.. అపాయింట్‌మెంట్ ఇవ్వరా?


వరదలు వచ్చినప్పుడు రైతు సోదరులు వరుసగా మూడుసార్లు దెబ్బమీద దెబ్బ తగిలి దుర్భరమైన పరిస్థితుల్లో బతుకుతున్నారని ఢిల్లీ వరకు వెళితే.. ఢిల్లీలో ప్రధానితో మా గోడు చెప్పుకుందామని ప్రయత్నం చేస్తే, కనీసం ఐదు నిమిషాలపాటు అపాయింట్‌మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అలాంటప్పుడు ఎందుకివ్వాలి 32 మంది ఎంపీలను ఈ కాంగ్రెస్ పార్టీకి?


ఆ శాఖ మనమే ఎందుకు తీసుకోకూడదు?


ఆ వ్యవసాయ శాఖ ఎవరో మహారాష్టక్రు చెందిన శరద్‌పవార్‌కు ఇచ్చారట. ఆ వ్యవసాయ శాఖ మనమే ఎందుకు తీసుకోకూడదు? మనవాడే ఆ స్థానంలో ఉంటే ఎప్పుడు వరదలు వచ్చినా.. ఒక్కరోజులో అక్కడికి వచ్చి ప్రజల బాగోగులు కనుక్కొని వెంటనే రిపోర్టులు రాసి, ప్రధాని వద్ద ఒత్తిడి చేసుకునేవాళ్లం కాదా? ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపూ కూడా మనల్ని వాడుకునే కార్యక్రమం తప్ప.. మంచి చేసే కార్యక్రమం ఎప్పుడూ చేయదు. పోలవరం ప్రాజెక్టు కావాలని గత 70 ఏళ్లుగా అడుగుతుంటే.. కొందరు ఎంపీలతో పోలవరం కావాలి అని అనిపిస్తారు. అదేపార్టీకి చెందిన మరికొందరు ఎంపీలతో మట్టుకు పోలవరం వద్దే వద్దని చెప్పిస్తారు. అసలు వద్దని చెప్పడానికి కారణాలు ఏంటి?


మనిషన్నాక ఒకే తీరులో ఉండాలి..

మనిషి అన్నాక.. పదవిలో ఉన్నప్పుడు ఒకతీరుగా.. పదవిలో లేనప్పుడు ఒకరకంగా ఉండడం సరైన పద్ధతి కానేకాదు. మనిషన్నాక ఒకే తీరులోనే, ఒకే రీతిలోనే ఉండాలి. మైకులు పట్టుకుని చంద్రబాబు గారు రైతుల గురించి ప్రేమ ఒలకబోస్తూ చెప్పే మాటలను చూసి ఈ మాటలంటున్నా. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆరోజే పోలవరం కట్టి ఉంటే, కనీసం ఆలోచన చేసి ఉంటే.. ఈ సరికే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఉండేది. ప్రతి ఎకరాకూ సాగునీరు అందేది. ప్రతి రైతు సోదరుడి ముఖాన చిరునవ్వు కనిపిస్తూ ఉండేది. ఆ గొప్ప ఆలోచన ఆయనకు వచ్చి ఉంటే కనీసం అనుమతులైనా వచ్చేవి. కానీ ఆ సమయంలో కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు అనుమతులు కూడా తీసుకురాకుండా అక్కడే ప్రాజెక్టును తొక్కిపెట్టాడు అని అంటే ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు గారి నైజం గురించి!

వెంటనే మొదలుపెట్టాలి..


కేంద్ర ప్రభుత్వం సాయం చేసినా చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను మొదలుపెట్టాలి. వెంటనే టెండర్లు పిలవాలి. ఈ డిమాండ్ చేయడమే కాకుండా.. ప్రాజెక్టు కోసం రానున్న రోజుల్లో మరింత ఒత్తిడి తెచ్చేందుకు ముమ్మరంగా కార్యక్రమాలు చేపడతామని చెబుతున్నా. ఏ ఒక్కరికీ కూడా ఏ నష్టమూ జరగకూడదని చెప్పి భూమి పోయిన ప్రతి రైతుకూ వైఎస్ మళ్లీ భూమి ఇచ్చారు. పోడు భూముల రైతులకు కూడా నష్టం జరగకుండా చూశారు. ఇదే స్ఫూర్తితో ఈ పోలవరం ప్రాజెక్టువైపు అడుగులు వేయాలని చెప్పి.. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని చేతులు జోడించి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా.


వైఎస్సే దశా దిశా చూపించారు


ఈ పోలవరం ప్రాజెక్టు 1946లోనే కట్టి ఉంటే ఆవేళ 208 అడుగుల ఎత్తుతో కట్టి ఉండేవారు. సాక్షాత్తూ రాముని పాదాల దగ్గరికి నీళ్లు పోయేవి. రామపాదం అని ఆ ప్రాజెక్టును పిలిచేవాళ్లు. ఆ ప్రాజెక్టును ఆవేళ కట్టి ఉంటే భద్రాచలం స్వామి సాక్షిగా కేవలం రూ. 125 కోట్లతో ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. ఆ తరువాత అంజయ్యగారు 1982-83 సంవత్సరంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ వేళ కట్టి ఉంటే రూ. 750 కోట్లతో పూర్తయ్యేది. ఈ ప్రాజెక్టు కట్టకపోతే రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోతుందన్న ఆలోచన చేసిన దివంగత నేత వైఎస్సార్ రూ. 3200 కోట్లతో తన ఐదేళ్ల కాలంలో దీన్ని ముందుకు తీసుకుపోయి దశా దిశా చూపించారు.


ప్రాజెక్టులు కట్టకూడదని చట్టముందా?


కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. పోలవరం ప్రాజెక్టు రాకపోతే ఇక్కడి నుంచి నాగార్జునసాగర్ వరకు నీళ్లు పోకపోతే, ఆ సాగర్ మీద నీటి భారం తగ్గించకపోతే, మహబూబ్‌నగర్, నల్లగొండకే కాకుండా.. హైదరాబాద్‌కు తాగునీరు కూడా అందించలేని పరిస్థితి దాపురిస్తుంది. ఇలాంటి సమయంలో సైతం ఎందుకు మీరు తెలంగాణ ఎంపీలను సాకుగా చూపిస్తున్నారు? ఏదైనా చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి.. ధైర్యం ఉండాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మించి చూపాలి. మరోపక్క ప్రాణహిత-చేవెళ్లకు నాంది పలకాలి. రెండు ప్రాజెక్టులను కూడా చేయకూడదని ఏమైనా చట్టం ఉందా?

పోటెత్తిన జనసాగరం
నాలుగు రోజులపాటు అలుపెరగకుండా నడిచిన యువనేత
మొత్తం 88 కిలోమీటర్ల మేర పాదయాత్ర
హరిత యాత్ర ముగింపు సభలో జన జోరు
ఎటుచూసినా జనమే.. ఏ నోట విన్నా జగనే


పోలవరం(పశ్చిమగోదావరి జిల్లా)-  రామయ్యపేట.. ఓ మారుమూల గ్రామం.. గురువారం మాత్రం ఓ మహా నగరాన్ని తలపించింది.. పోలవరం ప్రాజెక్టు కట్టాలంటూ యువనేత వెంట పోటెత్తిన జన సాగరాన్ని చూసి.. ఇక్కడి గోదారమ్మ సైతం చిన్నబోయింది. ఎటుచూసినా జనమే.. జనం! ఎవరి నోట విన్నా జగనే జగన్! తమ కోసం, తమ భావితరాల కోసం పోలవరం అవసరమని గుర్తించిన రైతన్నలు యువనేత అడుగులో అడుగేస్తూ కదం తొక్కారు. రాష్ట్రం ఎడారి కాకుండా ఉండాలంటే ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాల్సిందేనని తెలుసుకున్న ప్రజలు ‘హరిత యాత్ర’కు మద్దతుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలివచ్చారు. దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతమైన రామయ్యపేట గ్రామం జన జోరుతో హోరెత్తిపోయింది.

ఆరు కిలోమీటర్లు.. ఐదు గంటలు


పోలవరం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువనేత వైఎస్ జగన్ చేపట్టిన హరితయాత్ర గురువారం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నిర్మాణ ప్రాంతానికి చేరడంతో ముగిసింది. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది వాహనాలతో లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలని రీతిలో రహదారులన్నీ జనమయమయ్యారు. ఉదయుం 11 గంటలకే జనం ఇక్కడికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంగణానికి చేరుకోవడానికి దాదాపు ఐదు గంటలు పట్టింది. ఒకేసారి వాహనాలు గ్రామంలో ప్రవేశించడంతో పాటు ప్రాంగణానికి ఒకే దారి ఉండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయుం ఏర్పడింది. వేలాది వాహనాలు ఒకే మార్గంలో వెళ్లి రావడంతో గంటలు తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ దిగ్బంధం నుంచి బయుటపడేసరికి చాలా సమయం పట్టింది. జగన్ ప్రసంగాన్ని వినేందుకు, ఆయన్ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తవు వాహనాలను సమీప ప్రాంతాల్లోని పొలాల్లోనే పార్కింగ్ చేసి పరుగులు పెట్టి ప్రాంగణానికి చేరుకున్నారు.

అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, సినీ నటి రోజా, లక్ష్మీ పార్వతి ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని పదునెక్కిన మాటలతో విమర్శించారు. లక్ష్మీపార్వతి, రోజాలు పిట్టకథలు, పురాణాలతో ప్రస్తుత పరిస్థితులను కాంగ్రెస్‌కు అన్వయించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఏడాది పాటు ఎవరెన్ని మాటలు అన్నా గొంతు నొక్కేసుకున్నామని, ఇక మాట్లాడతామని, మాట్లాడక పోతే జనం క్షమించరని ఎంపీ సబ్బంహరి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ జోలికి వస్తే 30 సంవత్సరాలపాటు కాంగ్రెస్‌ను ప్రజలు అధికారంలోకి రానీయకుండా చేస్తారని హెచ్చరించారు. మాజీ మంత్రి కొణతాల మాట్లాడుతూ ఆంధ్రుల దెబ్బకు ఢిల్లీ అబ్బా అనిపించేలా రానున్న కాలంలో దీటైన జవాబు చెప్పాలని పిలుపునిచ్చారు.


జనం ఏమంటున్నారంటే...

సభకు హాజరైన జనాన్ని ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించినప్పుడు.. వారిలో ఉద్వేగం బయటపడింది. వైఎస్‌కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో పాలకులే పోలవరాన్ని అడ్డుకుంటున్నారంటూ వారు మండిపడ్డారు. ‘రాజకీయు కారణాలతో ప్రాజెక్టును నిలిపివేశారు. పనులు వుళ్లీ ప్రారంభించాలి’ అని గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన రైతు కంఠవునేని ప్రసాద్ డిమాండ్ చేశారు. వయుసు సహకరించకపోరుునా తాడేపల్లిగూడెం వరకు రైలులో వచ్చి అక్కడ్నుంచి ఆర్టీసీ బస్సులో, ఆటోలో వచ్చానని ఆయన తెలిపారు. ‘బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో కృష్ణా డె ల్టా ఎడారి కానుంది. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టే మనకు దిక్కు. దీని సాధన కోసం జగన్ చేపట్టిన కార్యక్రమానికి కృష్ణా జిల్లా మైలవరం నుంచి వచ్చాం’ అని పలువురు యువకులు పేర్కొన్నారు.

విశాఖపట్నానికి పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు నన్నపనేని రాజేంద్ర, బిల్డర్ వివేక్ పేర్కొన్నారు. వైఎస్ ఆశయూలు అవులు కావాలంటే జగన్ సీఎం కావాలని, అందుకే ఆయున చేపట్టిన ప్రతి ప్రజాహిత కార్యక్రవూనికి తాను విధిగా హాజరవుతున్నానని పశ్చివుగోదావరి జిల్లా భీవువరానికి చెందిన డ్వాక్రా వుహిళ యడ్ల పుష్ప చెప్పారు. వైఎస్ నిర్వహించిన మహాప్రస్థానంలో విజయవాడ నుంచి రాజమండ్రి వరకు తాను పాల్గొన్నానన్నారు. ‘ఓదార్పు యాత్ర మొట్టమెుదటిసారిగా నిర్వహించినప్పుడు జగన్ అన్నకు బాసటగా నిలిచాను. మళ్లీ ఈ రోజు పోలవరంలో నిర్వహించిన హరితయూత్రకు హాజరై అన్నకు మద్దతు తెలుపుతున్నాను’ అని పశ్చిమగోదావరి జిల్లా నరసన్నపాలేనికి చెందిన వికలాంగురాలు కాకి దుర్గ పేర్కొన్నారు.


అలుపెరగని బాటసారి..


ఏడో తేదీన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ప్రారంభమైన హరితయాత్ర పదో తేదీ గురువారం పోలవరం ప్రాజెక్టు సమీపంలో రామయ్యపేట గ్రామ శివారులో ముగిసింది. ఈ పాదయాత్రలో యువనేత అడుగునే లక్షల కాళ్లు అనుసరించాయి. మిట్ట మధ్యాహ్నం మండే ఎండలోనూ, రాత్రి ఎముకలు కొరికే చలిలోనూ అలుపెరగని బాటసారిలా మహోన్నత లక్ష్యంవైపు జగన్ ముందుకుసాగారు. ఈ హరిత యూత్ర రాష్ట్రంలోనే చరిత్రాత్మకఘట్టంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. యాత్ర సాగిన ప్రాంతాల్లో రైతులు, పారిశ్రామిక వేత్తలు, మహిళలు, యువకులు ఆయన పాదయాత్రకు బాసటగా నిలిచారు.


నాలుగోరోజు గురువారం ఉదయాన 8 గంటలకే గూటాల నుంచి పాదయాత్రకు ఉపక్రమించిన జగన్‌కు కొత్త పట్టిసీమ, పాత పట్టిసీమ గ్రామాల ప్రజలు అపురూపంగా స్వాగతం పలికారు. కొత్త పట్టిసీమలో గులాబీ, చేమంతి, బంతిపూలనే తివాచీగా పరిచి జగన్‌కు స్వాగతం పలికారు. ఇక్కడ మహానేత వైఎస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఇక్కడి నుంచి పోలవరం మీదుగా ప్రాజెక్టు సమీపంలోకి మధ్యాహ్నం 2.20కి చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం చేశాక 4.15కుజగన్ సభావేదికపైకి చేరుకున్నారు. సాయంత్రం 5.50కి ప్రసంగించారు.


పోలవరంలో స్తంభించిన ట్రాఫిక్
వరుసకట్టిన వందలకొద్దీ వాహనాలు
ఒకటే మార్గం ఉండడంతో నిలిచిపోయిన ట్రాఫిక్
కాలినడకన చేరుకున్న భద్రాచలం ఎమ్మెల్యే, ఇతరులు
12 కి.మీపైగా నడుచుకుంటూ వచ్చిన అభిమానులు
 ట్రాఫిక్ లో చిక్కుకుని ఆగిపోయిన వేలాదిమంది

  హరిత యాత్ర సభకు తరలివచ్చిన రైతులు, జగన్ అభిమానుల వాహనాలతో పోలవరం మండలంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. రామయ్యపేట నుంచి తాడిపూడి వరకు వాహనాలు బారులు తీరడంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్రాఫిక్ నిలిచిపోయింది. రాత్రి 8.30 గంటల సమయంలో కూడా అది క్లియర్ కాలేదు. రాజకీయ నాయకులు సాధారణంగా సభలు, సమావేశాలను పట్టణాలు, నగరాల్లో నిర్వహిస్తారు. ప్రాజెక్టు ఎక్కడ ఉందో, దాని ఆవశ్యకత ఏంటో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తుచేసేందుకు వైఎస్ జగన్ ప్రాజెక్టు నిర్మించే రామయ్యపేటలోనే హరిత యాత్ర ముగింపు సభ పెట్టారు. అయితే ఇది మారుమూల గ్రామం కావడం, సభా ప్రాంగణానికి ఒకటే మార్గం ఉండడం, వందలకొద్దీ వాహనాలు ఒకేసారి రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. వేలాది మంది సభకు చేరుకోలేకపోయారు.

రాష్ట్రం నలుమూలల నుంచీ ఉదయుం 11 గంటలకే జనం ఇక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలోనే ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంగణానికి చేరుకోవడానికి దాదాపు ఐదు గంటలు పట్టింది. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు వాహనం తాడిపూడి సమీపంలో చిక్కుకుపోయింది. భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి వాహనం కృష్ణారావుపేట సమీపంలో ఆగిపోవడంతో ఆమె పోలవరానికి కాలినడకన చేరుకున్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఏటిగట్టు, పోలవరం-జంగారెడ్డిగూడెం రోడ్డులో వాహనాలు నిలిచిపోవడంతో దాదాపు 12 కిలోమీటర్లు కాలినడకన సభాప్రాంగణానికి అభిమానులు చేరుకున్నారు. సభా ప్రాంగాణానికి ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి. కొన్ని వాహనాలు శివారు ప్రాంతాల్లోనే ఆగిపోవడంతో అభిమానులు మొక్కజొన్న తోటల్లోంచి మూడు కిలోమీటర్ల మేర నడిచివచ్చారు. జగన్ ప్రసంగాన్ని వినేందుకు, ఆయున్ను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వాహనాలను సమీప ప్రాంతాల్లోని పొలాల్లోనే పార్కింగ్ చేసి పరుగులు పెట్టి ప్రాంగణానికి చేరుకున్నారు.

పాదయాత్ర ఇలా..
మొదటి రోజు 23 కిలోమీటర్లు
రెండో రోజు 28 కిలోమీటర్లు
మూడో రోజు 23 కిలోమీటర్లు
నాలుగో రోజు 14 కిలోమీటర్లు
మొత్తం 88 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది.

 
హరితయాత్ర సభలో ఎవరేమన్నారంటే..
జగన్‌కు హాని చేస్తే జనం కాంగ్రెస్‌ను క్షమించరు

ఏడాది పాటు మా నోరు మూసుకుని ఓపిగ్గా ఉన్నాం. ఇక నుంచి మాట్లాడతాం. రాష్ట్రానికే ప్రయోజనకరమైన పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం ఏర్పాటు చేసిన ఈ వేదికపైనుంచే మాట్లాడడం మెుదలు పెడుతున్నాం. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు. పోలవరం విషయంలో గత ఆరునెలల కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుంటి సాకులతో కాలయూపన చేస్తున్నాయి. ప్రధానిని రెండుసార్లు, సోనియాను రెండుసార్లు, బన్సాలీని మూడుసార్లు కలిశాం. దాటవేత ధోరణి తప్ప వారు స్పందించ లేదు. ప్రాజెక్టు కోసం కోసం రామయ్యపేటలోని చిన్న గ్రామంలో ఇంత భారీ స్థాయిలో బహిరంగ సభ ఏ రాజకీయు నాయకుడు ఇక మీదట కూడా నిర్వహించలేరు. ఒక్కడి కోసం, ఒక్కడితో నడవడానికి ఇన్ని లక్షల మంది తరలిరావడం మామూలు విషయుం కాదు. వైఎస్ చనిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పాలకులు అటకెక్కించే ప్రయత్నం చేశారు. జగన్‌ను టార్గెట్ చేశారు. జగన్ ఉంటేనే కాంగ్రెస్ అని లేకపోతే ఆ పార్టీ కుక్కలు చింపిన విస్తరేనని ఆనాడే చెప్పాను. ప్రస్తుతం జగన్ ధాటికి కేంద్ర ప్రభుత్వమే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆయనకు కీడు చేసే చర్యలకు దిగితే మరో 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ప్రజలే గుణపాఠం నేర్పుతారు. గతంలో ఓసారి ప్రధాని పీవీ నరసింహారావుతో ఐదు నిమిషాల పాటు ప్రయాణించే అవకాశం దక్కింది. అప్పుడు ఆయన కీలక విషయం చెప్పారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం అంత్యక్రియులు చేయకముందే రాజీవ్‌ను ప్రధానిని చేశార ని, ఇది ప్రజాస్వామ్యవ్యవస్థ అని పీవీ గర్వంగా చెప్పారు.

నేనిప్పుడు చెబుతున్నాను.. వైఎస్ చనిపోయిన సమయుంలో 155 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికిన జగన్‌ను సీఎం చేయుకుండా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పెద్దలు ఎందుకు టార్గెట్ చేశారు. బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వం తర్వాత అధికారం కోల్పోయింది. అయినా ఆయన్ను కేసు నుంచి తప్పించారు. వురి వైఎస్ చనిపోరుున సవుయుంలో మామూలు ఎంపీగా పారిశ్రామికవేత్తగా ఉన్న జగన్‌ను టార్గెట్ చేస్తూ పత్రికలు, ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే లేనిపోని వివుర్శలు చేయుడం తగదు.

- అనకాపల్లి ఎంపీ సబ్బం హరి

జగన్‌లో గొప్ప నాయుకత్వ లక్షణాలు


జగన్‌లో గొప్ప నాయకత్వ లక్షణాలు కనిపిస్తున్నారు. ఆయున ఏ కార్యక్రమం చేపట్టినా కార్యదీక్షతో విజయపథాన నడుస్తున్నారు. ఏ మాత్రం అనుమానం లేదు. ఆయన రానున్న కాలంలో వైఎస్ కంటే గొప్ప నాయకుడు అవుతాడు. రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేర్చే తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. రాజకీయపార్టీల మాచ్ ఫిక్సింగ్, కొన్ని పత్రికల రాతలు ప్రజాదరణ ఉన్న జగన్‌ను ఏ మాత్రం అడ్డుకోలేవు. రాష్ట్రంలో ఎన్నికలు మూడు నెలల్లో వచ్చినా, మూడేళ్లు పట్టినా రాబోయేది జగన్ పరిపాలనే. ఈ విషయూన్ని పాలకులు ముందుగా గుర్తిస్తే మంచిది. నాయుకుడికి కావాల్సింది ఓపిక, క్రవుశిక్షణ, ధైర్యం. అలాంటి లక్షణాలు జగన్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే జగన్‌ను జనం తమ నాయకుడిగా గుర్తించారు.

- నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

ప్రజలు తిరగబడతారు..

పోలవరం పూర్తి చేయకపోతే ప్రజలు తిరగబడతారు. మాట తప్పని, మడమా తిప్పని వైఎస్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. పోలవరం కల సాకారం చేసేందుకు జగన్ నడుంబిగించారు. జనపోటు ఢిల్లీకి తెలియూలి. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు విశ్రమించకుండా పోరాడాలి.

- తెల్లం బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే

నిర్లక్ష్యం చేస్తే రైతాంగం క్షమించదు


పోలవరాన్ని నిర్లక్ష్యం చేస్తే రైతాంగం క్షమించదు. గోదావరిలో వందల టీఎంసీల నీరు వృథాగా కడలిపాలవుతోంది. ఈ నదిపై చేపట్టిన అన్ని ఎత్తిపోతల పథకాలను చేపడితే రాష్ట్రం సస్యశ్యామలమతుంది. పోలవరానికి వెంటనే జాతీయు హోదా కల్పించాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు వైఎస్ దేశంలోనే అద్భుతమైన ఆర్‌ఎన్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చారు. పోలవరం ఎర్త్ ఫిల్ రాక్ డ్యామ్ నిర్మిస్తే డెల్టా ప్రాంతం కొట్టుకుపోతుందన్నది అవాస్తవం.

- మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్

ఆంధ్రుల దెబ్బకు ఢిల్లీ అబ్బా.. అనాలి


ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుకునే సవుయుం వచ్చింది. ఆంధ్రుల దెబ్బకు ఢిల్లీ పెద్దలు అబ్బా.. అనాలి. కాంగ్రెస్ అధిష్టానం కాళ్లు పట్టుకుంటే సీఎం పదవి వస్తుంది. అలాంటి పరిస్థితి జగన్‌కు అవసరం లేదు. ఇప్పుడు ప్రజాదరణ కల్గిన జగన్‌ను చూస్తే కాంగ్రెస్ పెద్దలు ఉలిక్కిపడుతున్నారు. అందుకే చిరంజీవి పార్టీని విలీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఆనాడు చంద్రగ్రహణం పడితే.. ఈనాడు నవగ్రహాలు, మరో శనిగ్రహం పట్టి పీడిస్తున్నాయి.

- మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ

జగన్‌కు అండగా ఉండాలి..


యువనేత జగన్ మనకోసం రేయీ పగలూ పాదయాత్రలు, నిరాహార దీక్షలు చేపడుతున్నారు. జగన్‌కు మీరంతా అండగా ఉండాలి. వైఎస్‌ను తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తున్నా. రైతులకు పెద్దపీట వేయాలని వారి కళ్లల్లో ఆనందం చూడాలన్నదే ఆయన సంకల్పం. ఎన్ని కోట్లైనా జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్నారు. ఎన్నో పథకాలు పెట్టారు. ఇప్పుడు వైఎస్‌ను విమర్శిస్తున్న వారందర్నీ వైఎస్ చంకనెత్తుకుని పదవులు ఇచ్చారు. ఇప్పుడు వారెవరికీ వైఎస్ పేరు తలిచే అర్హత లేదు.

- ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి

ఈ సభ పాలకులకు పిడుగుపాటు..


పోలవరంలాంటి మారుమూల ప్రాంతంలో కొండకోనల్లో జరిగే సమావేశాలు ఉద్యమాలకు, ప్రజా సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశమవుతాయి. గతంలో ఇక్కడ రహస్యంగా ప్లీనరీలు జరిగేవంట. అవే ఉద్యమాలకు దిశానిర్దేశంగా ఉండేవి. ఇక్కడ ఇంత భారీ బహిరంగ సభ నిర్వహించే ధైర్యం ఎవరూ చేయలేరు. గోదావరి నినదించేలా, కొండలు గర్జించేలా సాగిన ఈ సభ పాలకులకు పిడుగుపాటుగా ఉంటుంది. జగన్‌ను దెబ్బకొట్టేందుకు అపవిత్ర కలయికలు జరుగుతున్నాయి. ఒక్కడ్ని ఎదుర్కొనేందుకు తెరమీద ఒకడు, తెర వెనుక ఒకడు ఏకమవుతున్నారు. ప్రజాదరణ ఉన్న జగన్‌ను ఏ శక్తీ అడ్డుకోలేదు.

- ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు

జనం మద్దతు జగన్‌కే: మేకా శేషుబాబు


కాంగ్రెస్‌కు వైఎస్ చేసిన సేవలను అధిష్టానం విస్మరించి ఆయన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి యత్నిస్తోందని పశ్చిమగోదావరి జెడ్పీ చెర్మన్ మేకా శేషుబాబు విమర్శించారు. దీనిని గుర్తించిన ప్రజలు జగన్‌కు అండగా నిలుస్తున్నారని, అందువల్లే తాము కూడా జగన్ బాట పట్టామని గురువారం పాలకొల్లులో చెప్పారు.


ఈ ప్రభుత్వం పోయే వరకు నడుస్తా..
ప్రజా సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం కనుగొనే దిశగా మహానేత వైఎస్ చేపట్టిన మహా ప్రస్థానంలో పాలు పంచుకున్నాను. పోలవరానికి జాతీయు హోదా కోసం జగన్ హరిత యాత్రలో కూడా భాగస్వామిని కావడంతో గర్వపడుతున్నాను. ప్రజల అభీష్టాన్ని నిర్వహించేలా జగన్ తిరుగులేని నాయకుడుగా ముందుకు సాగుతున్నారు. పోలవరం కోసం నడుస్తాను... ఈ ప్రభుత్వం పోయే వరకు నడుస్తాను.
- అంబటి రాంబాబు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్

యువనేత జగన్ రియల్ హీరో


జగన్‌ను దెబ్బతీసేందుకు రాష్ట్రంలో రాజకీయు పార్టీలు ఏకమవుతున్న తీరును ప్రజలు చీదరించుకుంటున్నారు. పార్టీని అమ్ముకున్న రీల్ హీరో చిరంజీవి. పార్టీని వదిలి ప్రజల కోసం పనిచేస్తున్న రియల్ హీరో జగన్. కర్ణాటకలో ఆల్మట్టి, మహారాష్టల్రో బాబ్లీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నా ఆపలేని దద్దమ్మలు పోలవరం కోసం హరితయాత్ర చేస్తున్న జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. జగన్ నిర్వహిస్తున్న హరిత యాత్ర కాంగ్రెస్‌కు చలి జ్వరం రప్పిస్తుంది.
- సినీనటి రోజా

మూడేళ్ల శిశువుతో 125 ఏళ్ల వృద్ధుడి పెళ్లా..

మంచి నాయకుడి కొరత ఏర్పడినప్పుడు ప్రజలే వారికి అవసరమైన నాయకుడిని తయారు చేసుకుంటారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టే నిజమైన నాయకుడు జగన్. ఆయన జనం నుంచి పుట్టిన నాయుకుడు. నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకూ ఆయునకు అండదండగా ఉంటా. మూడేళ్ల శిశువుగా ఉన్న పీఆర్పీ 125 ఏళ్ల వృద్ధుడుగా ఉన్న కాంగ్రెస్‌తో విలీనం కావడాన్ని ప్రజలు క్షమించరు.
- నందమూరి లక్ష్మీపార్వతి

జగన్ సీఎం అయితేనే పోల‘వరం’
పోలవరాన్ని 2014 నాటికి పూర్తి చేయాలన్న వైఎస్ సంకల్పాన్ని కాంగ్రెస్ సర్కారు నీరుగారుస్తోంది. ఆయన మరణం తర్వాత రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. జగన్ సీఎం అయితేనే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. పోలవరం పనులను సత్వరం పూర్తి చేయకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవు.
- హరితయాత్రలో మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు
 
హరిత యాత్రలో ప్రముఖులు వీరే
 
 హరితయూత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారిలో అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ వుంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కొణతాల రామకృష్ణ, చేగొండి హరిరామజోగయ్యు, పెన్మెత్స సాంబశివరాజు, ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, కుంజా సత్యవతి, ఆళ్ల నాని, ముదునూరి ప్రసాదరాజు, ఎం.బాబూరావు, ఆదినారాయుణ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, పశ్చిమగోదావరి జెడ్పీ చైర్మన్ మేకా శేషుబాబు, నెల్లూరు జెడ్పీ చైర్మన్ కాకాణి గోవ ర్ధన రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాతపాటి సర్రాజు, చెరకువాడ శ్రీరంగనాధరాజు, బాజిరెడ్డి గోవర్ధన్, మేకా ప్రతాప్ అప్పారావు, జలీల్ ఖాన్, చల్లా వెంకట కృష్ణారెడ్డి, కట్టా సాంబయ్యు, ఎంవీ శివరావుకృష్ణారెడ్డి


ఎం.సుబ్రహ్మణ్యం, కె.నారాయణస్వామి, రవికుమార్, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, పుల్లా పద్మావతి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్, రోజా, లక్ష్మీపార్వతి, వైవీ సుబ్బారెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు వేగిరాజు రామకృష్ణంరాజు, కొయ్యే మోషేన్ రాజు, పీసీసీ మాజీ కార్యదర్శి కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అమృతా సాగర్, నేతలు బుంగా సారథి, ఇందుకూరి రావుకృష్ణరాజు, భూమాన కరుణాకరరెడ్డి, అంబటి రాంబాబు, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు, గుంటూరు జిల్లా గ్రంథాలయు సంస్థ చైర్మన్ చిట్టా విజయు భాస్కరరెడ్డి, రాష్ట్ర మాహిళా కాంగ్రెస్ వూజీ కార్యదర్శి బొవ్మూరెడ్డి సునీత, పశ్చిమగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు కొల్లి నిర్మల కువూరి, పశ్చిమగోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ వూజీ ఉపాధ్యక్షులు కారుమంచి రమేష్, రాష్ట్ర ఎల్‌ఐడీసీ డెరైక్టర్ తలారి వెంకట్రావు, విజయవాడ మాజీ మేయుర్ తాడి శకుంతల, మేడిది జాన్సన్ తదితరులు ఉన్నారు.

Thursday, February 3, 2011

చాలా బాధనిపిస్తోంది * మహానేత మీద ఆరోపణలపై యువనేత జగన్ ఆవేదన

వైఎస్ ఊపిరి పోసిన కాంగ్రెస్‌వారే బురదజల్లుతున్నారు
పేదల సంక్షేమ పథకాలతో జనం గుండెల్లో వైఎస్ బతికే ఉన్నారు
వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన జగన్
పలు గ్రామాల్లో 17 వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ
పల్లెపల్లెనా వెల్లువెత్తినఅభిమానం

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఊపిరి పోసి బతికించిన కాంగ్రెస్ పార్టీ వారే ఈ రోజు ఆయనపై బురదజల్లుతున్నారని, ఇది తనకు చాలా బాధగా ఉందని యువనేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘ప్రతి పేద కుటుంబానికీ ఏదో ఒక మేలు చేసి జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత ఇవాళ లేడంటే బాధనిపిస్తోంది. నాన్నా అని పిలిస్తే రాడనిపిస్తే బాధనిపిస్తోంది.. ఆయన ఊపిరి పోసి బతికించిన కాంగ్రెస్ పార్టీ వారే ఈరోజు ఆయనపై బురదజల్లుతుంటే చాలా బాధనిపిస్తోంది.. స్వపక్ష, విపక్ష పార్టీలు బురదజల్లుతుంటే చాలా చాలా బాధనిపిస్తోంది...’ అని ఆయన అన్నారు.

వైఎస్సార్ జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గం, గోపవరం మండలంలో బుధవారం వైఎస్ జగన్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో స్థానికులు ఏర్పాటుచేసిన 17 వైఎస్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అక్కడి వేదికలపై నుంచి ఆయన ప్రసంగిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి గుండెలోనూ బతికున్నారన్నారు. ‘పావలా వడ్డీతో రుణం తీసుకున్న ప్రతి అక్కకూ, ప్రతి చెల్లికీ.. ప్రతి నెలా ఒకటో తేదీ పెన్షన్ తీసుకునే అవ్వలకు, తాతలకు.. లక్షలు ఖర్చయ్యే వైద్యం చేయించుకుని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే ప్రతి పేద వారికీ.. చదువుకునే ప్రతి పేద విద్యార్థికీ, వారి తల్లిదండ్రులకూ వైఎస్ రాజశేఖరరెడ్డి నిత్యం గుర్తుకొస్తూనే ఉంటారు’ అంటూ వైఎస్ జ్ఞాపకాలను మరోసారి జనం గుండెల నుంచి తట్టి లేపారు.


కుయ్..కుయ్.. కుయ్ అంటూ..


108 గురించి మాట్లాడుతూ ‘ఏ ఆపదో వచ్చినప్పుడో లేక ఏ ప్రమాదమో జరిగినప్పుడో 108 కొట్టగానే కుయ్...కుయ్.. కుయ్.. అంటూ అంబులెన్స్ వచ్చినప్పుడు వైఎస్ గుర్తుకొస్తూనే ఉంటారు’ అని వైఎస్‌ను అనుకరిస్తూ జగన్ చేసిన ప్రసంగం జనానికి మహానేతను స్ఫురణకు తెచ్చింది. ముంపు గ్రామాలైన బ్రాహ్మణపల్లె, బుచ్చనపల్లె తదితర గ్రామాల్లో యువనేత మాట్లాడుతూ చంద్రబాబునాయుడు, అంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాలించినా.. సోమశిల ముంపు గ్రామ వాసుల గోడును ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. వారికి పరిహారం ఇవ్వక కష్టాలపాలు చేశారన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాగానే రూ.100 కోట్లు ముంపు పరిహారమిచ్చి, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని తెలియజెప్పారన్నారు.


పల్లెపల్లెనా ఉప్పొంగిన అభిమానం

జగన్ పర్యటన సాగిన గోపవరం మండలంలో దారి పొడవునా పల్లెపల్లెనా అభిమానం ఉప్పొంగింది. కాన్వాయ్ రోడ్డుపై అల్లంత దూరంలో వస్తుండగా, పొలాల్లోని రైతులు, కూలీలు ఆయన్ను చూసేందుకు పొలాల వెంట పరుగులు తీస్తూ వచ్చిన చోట యువనేత వాహనాన్ని నిలిపి వారితో మాట్లాడారు. బద్వేల్ పట్టణంలో ప్రవేశించగానే పట్టణ శివారులోనే ఆయనను ఆపి జనం జేజేలు పలికారు. బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో పెద్ద ఎత్తున జనం ఆయన్ను చుట్టుముట్టారు. అందరికీ అభివాదం చేస్తూ మధ్యాహ్నం 12.20 గంటలకు గోపవరం మండలంలోని పి.పి.కుంటకు జగన్ చేరుకున్నారు. అక్కడి నుండి ప్రారంభమైన యువనేత పర్యటన పలు గ్రామాల మీదుగా సాగింది.

ఆయా గ్రామాల్లో 17 వైఎస్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. ఆవిష్కరణలున్న ఈ గ్రామాల్లోనే కాకుండా మార్గ మధ్యం లోని అన్ని పల్లెల్లో జగన్‌ను చూసేందుకు జనం వేచి ఉన్నారు. కాన్వాయ్‌కు అడ్డుపడి మరీ యువనేతను చూడ్డానికి ఉత్సాహం చూపారు. దీంతో జగన్ కూడా బయటకు వచ్చి వారికి అభివాదం, కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. జగన్ పర్యటనలో ఎమ్మెల్యే జి.కమలమ్మ, మాజీ ఎమ్మెల్యే డి.సి.గోవిందరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సురేష్‌బాబు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, బద్వేల్ మునిసిపల్ చైర్మన్ డాక్టర్ పి.మునయ్య, జెడ్పీటీసీలు ఆర్.నాగభూషణం, డి.శశిధర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, భూపాల్‌రెడ్డి, గోపవరం, బద్వే ల్ మండలాల ఎంపీపీలు సరస్వతమ్మ, వెంకటేశ్వరరెడ్డి, మహిళా ఆర్థిక సంస్థ మాజీ చైర్మన్ పి.కృష్ణమ్మ, స్థానిక సర్పం చులు, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
 
ప్రజలను మభ్యపెట్టడానికే రచ్చబండ: జగన్ 
 
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని యువనేత, కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలవడ్డీ రుణాలు, రేషన్‌కార్డులు, ఇళ్ల మంజూరులో ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిందన్నారు. మైదుకూరు రోడ్డులోని అన్వల్‌హాల్ సర్కిల్‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.

ప్రజలను మభ్య పెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఎవరినీ మోసం చేయడానికి రచ్చబండ కార్యక్రమం పెట్టారని జగన్ సూటిగా ప్రశ్నించారు. పేదల అభ్యున్నతి కోసం తన తండ్రి కృషి చేశారన్నారు. వైఎస్సారే బతికుంటే పేదలకిచ్చే ఫించన్లు రూ. 200 నుంచి రూ. 600కు పెంచేవారని అన్నారు. అలాంటి మహానేతపై కొంతమంది బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సభకు జనం పోటెత్తారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో ప్రొద్దుటూరు పులకించింది.
 
వైఎస్‌ఆర్ పేరుతోనే పార్టీ: జగన్

వైఎస్‌ఆర్ పేరుతోనే పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం ప్రొద్దుటూరులో ముస్లిం మైనార్టీ సదస్సులో మాట్లాడుతూ ముస్లింలకు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదన్నారు. కమిటీలు మీద కమిటీలు వేసి కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయటం లేదని జగన్ ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతోనూ పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు.

రామరాజ్యం ఎలా ఉంటుందో తెలియదని, అయితే రాజన్న స్వర్ణయుగాన్ని చూశానని వైఎస్ జగన్ అన్నారు. మళ్లీ రెండేళ్ల తర్వాత స్వర్ణయుగమేనన్నారు. మహానేత వైఎస్‌పై బురద చల్లుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వారసులమని చెప్పుకుంటూనే సిగ్గులేకుండా టీడీపీతో కుమ్మక్కు అయ్యారని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వానికి పాలించే హక్కులేదని జగన్ అన్నారు. పావలా వడ్డీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను అమలు చేయటంలో సర్కార్ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినా తప్పేనన్నారు.
 

వైయస్ జగన్ పార్టీ స్థాపనలో మరింత జాప్యం....

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పార్టీ స్థాపనలో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నలబై ఐదు రోజుల్లో తమ పార్టీ వస్తుందని వైయస్ జగన్ అప్పట్లో చెప్పారు. కానీ ఆ గడువు ఎప్పుడో దాటి పోయింది. సంక్రాంతి తర్వాత అని, మార్చి రెండో వారంలో అని వైయస్ జగన్ వర్గం నాయకులు పార్టీ స్థాపనపై చెబుతూ వచ్చారు. కానీ మార్చిలో కూడా జగన్ పార్టీ వచ్చే అవకాశాలు లేవు. జగన్ వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పిన మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది.

మార్చి చివరి వారంలో గానీ ఏప్రిల్‌లో గానీ పార్టీ స్థాపన జరుగుతుందని ఆయన చెప్పారు. అయితే, పులివెందుల, కడప ఉప ఎన్నికల నాటికి పార్టీ స్థాపన జరుగుతుందని ఆయన అన్నారు. ఎన్నికల కమీషన్ నుంచి క్లియరెన్స్ రాకపోవడం వల్లనే పార్టీ స్థాపనలో జాప్యం జరుగుతోందని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు చెబుతున్నారు. అయితే, కారణం అది కాదని తెలుస్తోంది. తెలంగాణపై ఓ స్పష్టత వచ్చిన తర్వాతనే పార్టీని స్థాపించాలనేది జగన్ అభిమతమని చెబుతున్నారు. సీమాంధ్రలో తనకు తిరుగులేదని, తెలంగాణలో అడుగు పెట్టాలంటే కేంద్రం తెలంగాణపై తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తూ ముందుకు రావాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణపై స్పష్టత వస్తుందని భావించారు. కానీ అది జరగలేదు. యథాతథ స్థితి చోటు చేసుకుంది.

పార్లమెంటు సమావేశాల లోగా తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. కానీ, అది జరిగే అవకాశాలు లేవు. కాగా, రేపు శుక్రవారం జరిగే కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపైనా, ప్రజారాజ్యం పార్టీతో వ్యవహరించాల్సిన తీరుపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమవుతుందా, మంత్రివర్గంలో చేరుతుందా అనేది స్పష్టంగా తేలిన తర్వాత తెలంగాణ అంశంపై కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. అప్పుడే జగన్ తన పార్టీ స్థాపనకు తగిన రంగం సిద్ధం చేసుకుంటారని అంటున్నారు.
 

Tuesday, February 1, 2011

బంగాళాఖాతంలో కలిసే అర్హతా లేదు * సర్కారుపై యువనేత జగన్ ధ్వజం

పేదలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతగానో ఉపయోగపడింది
ఇల్లు, పొలం అమ్ముకునే దుస్థితి నుంచి ఆ కుటుంబాలనుకా పాడింది
కానీ ఈ ప్రభుత్వం ఆ పథకానికి నిధులే ఇవ్వట్లేదు
పేదలను పట్టించుకోని ప్రభుత్వాలు కూలిపోక తప్పదు
జగన్‌కు మద్దతు తెలిపేందుకు కదిరి నుంచి వచ్చిన ముస్లింలు


పేదల సంక్షేమాన్ని విస్మరించి ప్రభుత్వం పనిచేస్తోందని, ఇలాంటి సర్కారు బంగాళాఖాతంలో కలిసిపోవడం తథ్యమని.. కానీ ఆ సముద్రంలో కలవడానికి కూడా ఈ సర్కార్‌కు అర్హత లేదని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. యువనేతను కలవడం కోసం మంగళవారం అనంతపురం జిల్లా కదిరి నుంచి కాంగ్రెస్‌మాజీ నేత ఎస్.ఎండీ. ఇస్మాయిల్ నేతృత్వంలో సుమారు ఐదు వేల మంది ముస్లింలు పులివెందుల వచ్చారు. వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో జగన్ వారినుద్దేశించి ప్రసంగించారు. ఇంత పెద్దఎత్తున ముస్లిం సోదరులు, మహిళలు వేలాదిగా తరలి వచ్చారంటే ప్రియతమ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారో అర్థమవుతోందన్నారు.

ఆ సందర్భం.. నా కళ్లను చెమర్చింది

ముస్లింలు బాగుపడాలని, వారికి ప్రత్యేకంగా నాలుగుశాతం రిజర్వేషన్ తీసుకొచ్చి దేశంలోనే విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న ఏకైక నేత వైఎస్‌ఆర్ అని జగన్ అన్నారు. దీంతో ఆడిటోరియంలోని వారంతా హర్షధ్వానాలుచేశారు. ‘సరిగ్గా ఏడాది క్రితం నేను ఒక మైనార్టీ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లినప్పుడు, అక్కడ జరిగిన సభలో విద్యార్థులు వేదికపై మాట్లాడుతూ.. మా నాన్న సెక్యూరిటీ గార్డు అని.. మా నాన్న సైకిల్ షాపులో పనిచేస్తాడని.. చెప్పారు. అయినప్పటికీ తమను ఇంజనీరింగ్ చదివిస్తున్నారని చెబుతూ... దీనంతటికీ కారణం వైఎస్సేనంటూ గొప్పగా చెప్పిన సందర్భం నా కళ్లను చెమర్చింది’ అంటూ భావోద్వేగంతో ప్రసంగించారు. పిల్లల చదువు కోసం పేద కుటుంబాలవారు ఇళ్లు, పొలం అమ్ముకునే దుస్థితి లేకుండా వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ఎంతగానో ఉపయోగపడిందన్నారు.

కానీ.. ఈ ప్రభుత్వ హయాంలో

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క వైఎస్‌ఆర్ జిల్లాకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 2010-11 బడ్జెట్‌లో *114కోట్లు ప్రతిపాదించారని, అయితే 80వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరాల్సిన ఈ పథకంలో ఇంతవరకు నిధులు విడుదల చేయకపోవడంతో ఒక్క విద్యార్థికి కూడా న్యాయం జరగలేదని అన్నారు. 2011-12 సంవత్సరం దగ్గర పడుతున్నా ఇంతవరకు నిధులు విడుదల చేయలేదంటే రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు.

ఒక్క రూపాయీ ఇవ్వలేదు..

‘ఇప్పటికి కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు కింద ఎంతడబ్బులు ఇచ్చారని విద్యార్థులను అడిగితే ఒక్క రూపాయి కూడా రాలేదని చెప్పడం నన్ను బాధించింది’ అని జగన్ పేర్కొన్నారు. ఇలా పేద విద్యార్థులు, పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వానికి బంగాళాఖాతంలో కూడా కలిసే అర్హత లేదని విమర్శించారు. పేదలను పట్టించుకోని ప్రభుత్వానికి, పరిపాలించడానికి కూడా అర్హత లేదన్నారు. కమిషన్లు వేయడం తప్ప ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం చేసిందేమీ లేదని జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కదిరి నాయకులు ఎస్‌ఎండీ ఇస్మాయిల్, ఇమామ్ మౌలానా, ఇస్మాయిల్ సాహెబ్, ముఫ్తీ నిసార్ సాహెబ్ తదితరులతో పాటు కదిరి నియోజకవర్గంలోని సుమారు ఐదు వేల మంది ముస్లింలు వైఎస్ జగన్‌కు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ నేత విశ్వేశ్వరరెడ్డి, నంబులపూలకుంట జగదీశ్వరరెడ్డి, ముదిగుబ్బ చలమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం కూలిపోతుంది
Jagansరాష్ర్టంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బంగాళా ఖాతంలో కలిసే యోగ్యత కూడా లేదని కడప మాజీ ఎంపి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. పేద ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని ఈ ప్రభుత్వం వారి ఉసురు పోసుకొని కూలిపోక తప్పదని శాపం పెట్టారు. అనంతపురం జిల్లా కదిరి నుంచి వచ్చి తనకు మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన మంగళవారం పులివెందులలో మాట్లాడారు. ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి నిరంకుశంగా ప్రవర్తిస్తోందని ఆయన ఆరోపించారు. ఒక్క వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోనే 2010-11 ఆర్థికసంవత్సరానికి సంబంధించి 114 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ చెల్లించాల్సివుండగా ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా విడు దల చేయలేదని ఆరోపించారు.

సుమారు 80వేల మంది విద్యార్థులు దీని వల్ల లబ్ధి పొందుతారని, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుం టోందని ఆందోళన వ్యక్తంచేశారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ల విషయంలో గత ప్రభుత్వాలు కమిషన్లపై కమిషన్లు వేసి నాన్చుతుండే వన్నారు. అయితే ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని ఆయన చెప్పారు.

యువనేత వెంటే ఉంటా: ఇస్మాయిల్

జగన్ పార్టీ ప్రకటించగానే వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో ఆ పార్టీలో చేరుతామని కదిరి నాయకుడు ఎస్‌ఎండీ ఇస్మాయిల్ ప్రకటించారు. తెలుగుదేశం మైనార్టీ సెల్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ అకాల మరణంతో కాంగ్రెస్‌కు సైతం గుడ్‌బై చెప్పారు.